ఆసీస్‌పై ఇంగ్లండ్ గెలుపు
అహ్మదాబాద్: ప్రపంచ కప్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో ఇంగ్లండ్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియాతో సోమవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 69-25తో విజయం సాధించింది. గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్ 65-25తో పోలాండ్‌ను ఓడించింది.
మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో ఇరాన్‌తో కెన్యా; బంగ్లాదేశ్‌తో భారత్ తలపడతాయి.