kabela
-
ఇళ్ల మధ్యే కుళ్లిన మాంసం నిల్వలు
నెల్లూరు సిటీ: వందలాది ఇళ్లు.. అందరూ పేదలే.. నిత్యం వ్యాధులతో హాస్పిటల్ పాలవుతుంటారు.. ఏళ్ల తరబడి కొందరు వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా ఆవు మాంసం వ్యాపారం చేస్తున్నారు. ఇళ్ల మధ్య ఆవులను వధించి, వాటి మాంసాన్ని ఇతర ప్రాంతాలకు, హోటల్స్, రెస్టారెంట్లకు తరలిస్తుంటారు. ఆదివారం ఎంహెచ్ఓ వెంకటరమణ తన బృందంతో ఆకస్మిక దాడులు చేశారు. నిల్వ మాంసాన్ని గుర్తించారు. కుళ్లిపోయిన మాంసం, ఎముకలను గోదాముల్లో నిల్వ చేసి ఉంచిన వైనాన్ని చూసి అధికారులు అవాక్కయ్యారు. సుమారు 400 కేజీ ల మేర నిల్వ ఆవు మాంసాన్ని నిర్వీర్యం చేయగా, ఫ్రీజర్లను స్వాధీనం చేసుకున్నారు. అధికారుల వివరాల మేరకు.. పలుమార్లు చెప్పినా.. నగరంలోని బోడిగోడతోట ప్రధాన రహదారిలో కొందరు వ్యక్తులు స్కిన్ మర్చంట్స్ కింద అనుమతుల్లేకుండా వ్యాపారం చేస్తున్నారు. గోదాములో వధించిన ఆవుల చర్మాన్ని తొలగించి, మాంసాన్ని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇంకా కుళ్లిపోయిన మాంసం, ఆవుల ఎముకులు, వాటి కళేబరాలను నిల్వ చేశారు. ఏళ్ల తరబడి ఇళ్ల మధ్యే కళేబరాలను ఉంచడంతో స్థానికులకు దుర్వాసన వచ్చేది. ఎన్నిసార్లు నిర్వాహకులకు చెప్పినా వారు పట్టించుకోలేదు. ఈక్రమంలో స్థానికులు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కొన్నినెలలుగా దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. దీంతో హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ తన బృందంతో ఆదివారం ఉదయం ఆకస్మిక దాడులు చేశారు. కెమికల్ ఫ్యాక్టరీలకు నోటీసులు బోడిగోడతోట ప్రాంతంలో మూడు కెమికల్ ఫ్యాక్టరీలు నిర్వహిస్తున్నారు. వాటిని ఎంహెచ్ఓ వెంకటరమణ తనిఖీ చేశారు. ఫ్యాక్టరీకి సంబంధించిన పత్రాలను నిర్వాహకులు చూపలేదు. దీంతో ప్రజలు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో కెమికల్ ఫ్యాక్టరీలను నిర్వహించకూడదని వెంకటరమణ చెప్పారు. వాటికి నోటీసులు జారీ చేయాలని శానిటరీ ఇన్స్పెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల్లో ఫ్యాక్టరీలను వేరే ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీ ఇళ్లలో ఇలా ఉంచుకుంటారా? నిబంధనల ప్రకారం ఇళ్ల మధ్య తోళ్ల వ్యాపారం చేయకూడదు. అయితే కొందరు వ్యక్తులు స్కిన్ మర్చంట్స్ పేరుతో ఆవులు, మేకలు, పొట్టేళ్ల తోళ్లను తొలగించి వాటిని ఎగుమతి చేస్తున్నారు. గోదాముల్లో కుళ్లిన మాంసాన్ని, ఎముకులను, కళేబరాలను నిల్వ చేశారు. వాటిని గుర్తించిన ఎంహెచ్ఓ వెంకటరమణ నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇళ్లలో ఈవి«ధంగా ఉంచుకుంటారా అని ప్రశ్నించారు. ప్రజల జీవితాలతో ఆడుకుంటారా? అంటూ మండిపడ్డారు. నిర్వాహకులు అధికారులతో వాగ్వాదం దిగడంతో స్థానికులు అధికారులకు అండగా నిలిచారు. నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనుదిరిగారు. ఇళ్లలో మాంసం నిల్వలు బోడిగోడతోటలో కొందరు ఇళ్లలో ఆవు మాంసాన్ని ఫ్రీజర్లలో నిల్వ చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. అధికారులు దాడులు చేసి ఫ్రీజర్లలో భారీగా నిల్వ మాంసాన్ని గుర్తించారు. మాంసాన్ని హోటల్స్, రెస్టారెంట్లు, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. మాంసాన్ని స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. ఫ్రీజర్లు, ఇతర వస్తువులను సీజ్ చేశారు. ఈక్రమంలో కొందరు అధికారుల కళ్లుగప్పి ఇళ్లలోని నిల్వ మాంసాన్ని గుట్టుచప్పుడు కాకుండా తరలించారు. పలువురు ఆవు మంసాన్ని కొన్ని హోటళ్లకు తరలిస్తున్నారని, దానిని మటన్‌లో కలిపి విక్రయిస్తున్నారని అధికారుల విచారణలో వెల్లడైంది. కఠిన చర్యలు తీసుకుంటాం ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తీసుకుంటాం. కుళ్లిన మాంసాన్ని ఫ్రీజర్లలో నిల్వ చేసి ఉండడాన్ని గుర్తించాం. అదేవిధంగా గోదాముల్లో ఎముకులు, కుళ్లిన మాంసాన్ని నిల్వ చేశారు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నిర్వాహకులపై చర్యలు తీసుకున్నాం.– పిడుగు వెంకటరమణ, ఎంహెచ్ఓ -
పశు..రోదన
విజయనగరం, పార్వతీపురం: మూగజీవాల పరిరక్షణ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. పశువులు కొనాలన్నా.. అమ్మాలన్నా... వాటిని ఎందుకోసం కొనుగోలు చేస్తున్నామో.. ఎక్కడకు తరలిస్తున్నామో.. ఏవిధంగా తరలిస్తున్నామో స్పష్టంగా తెలియజేయాలి. అందుకోసం వైద్యులు, వ్యవసాయాధికారులు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, మార్కెట్ కమిటీ సెక్రటరీ నుంచి ధ్రువపత్రాలు కూడా పొందాలి. వీరంతా నిర్ధారించిన తర్వాత కొనుగోలు చేసిన పశువులను మూగాజీవాల పరిరక్షణ చట్టానికి లోబడి రవాణా చట్టం నిబంధనలు అనుసరించి ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి తరలించాలి. కాని వ్యాపారులు, రైతులు ఈ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ఇవేమీ తమకు పట్టవన్నట్టు వ్యవహరిస్తూ చట్టాన్ని అవహేళన చేస్తున్నారు. జోరుగా పశువుల వ్యాపారం.. పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో పశువుల క్రయ,విక్రయాల వ్యాపారం జోరుగా సాగుతోంది. గతంలో పార్వతీపురం ఏఎంసీ మార్కెట్ నుంచి రోజుకు పది నుంచి పన్నెండు టారాస్ లారీల్లో పశువుల రవాణా జరిగేది. అయితే పశువులను తరలించవద్దంటూ న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో కలెక్టర్, ఎస్పీలు పార్వతీపురం మార్కెట్ నుంచి పశువుల రవాణా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పార్వతీపురం మార్కెట్ నుంచి పశువుల రవాణా నిలిచిపోయింది. అయితే లారీల ద్వారా పశువుల రవాణాను నిలిపివేసి వేరే మార్గాన్ని ఎన్నుకున్నారు. అప్పుడు లారీల్లో తరలిస్తే ఇప్పుడు బొలేరో వాహనాల్లో.. కాలినడకన పశువుల మందలను జిల్లాను దాటించి అక్కడ లారీల్లో ఎక్కించి అక్రమమార్గంలో తరలిస్తున్నారు. ఇలా పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో సాగుతున్న వ్యాపారం రూ. లక్షల్లో జరగుతోంది. ప్రతి వారం దాదాపు రూ.20 లక్షల వరకు వ్యాపారం జరుగుతోంది. ఒడిశా నుంచి వచ్చిన మందలను పార్వతీపురం నుంచి బొబ్బిలి అక్కడ నుంచి మానాపురం..అలమండ మీదుగా జిల్లాను దాటించేస్తున్నారు. పశువుల వ్యాపారానికి అడ్డాలు.. పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో పశువుల క్రయ,విక్రయాలు బుధ, గురువారాల్లో జోరుగా సాగుతోంది. కొమరాడ మండలం పరశురాంపురం ప్రాంతానికి ఒడిశా నుంచి పశువులను ప్రతి బుధవారం తీసుకువస్తుంటారు. ఇక్కడ వ్యాపారులు పశువులను కొనుగోలు చేసి గురువారానికి పార్వతీపురం మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. అక్కడ నుంచి బోలేరో వాహనాల్లో లేదంటే కాలినడకన జిల్లా బోర్డర్ దాటించి అక్కడ నుంచి లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే పార్వతీపురం మండలం అడ్డాపుశిల గ్రామ పరిసర ప్రాంతాల్లో కూడా పశువుల క్రయ,విక్రయాలు అధికంగా జరుగుతున్నాయి. జత పశువులను కాలి నడకన తరలించడానికి ఒక్కో కూలికి రోజుకు రూ. 250 నుంచి 300 రూపాయల చొప్పున కూలి ఇస్తున్నారు. పట్టించుకోని యంత్రాంగం.. పశువులను లారీల్లో తరలిస్తేనే పట్టుకుంటున్న అధికారులు కాలినడకన తరలిపోతున్న మందల వైపు దృష్టి సారించడం లేదు. అసలు ఈ మందలు ఎవరు కొంటున్నారు.. ఎవరి దగ్గర కొంటున్నారు.. ఎందుకోసం కొన్నారు.. ఎక్కడికి తరలిస్తున్నారు.. క్రయ, విక్రయాలకు సంబంధించి ఏమైనా ధ్రువపత్రాలు ఉన్నాయా.. లేదా.. అన్న కోణంలో తనిఖీలు చేస్తున్న దాఖలాలు లేవు. ఈ అలసత్వమే పశువులు వ్యాపారులకు కలిసి వస్తోంది. దీంతో వారి వ్యాపారం మూడు దూడలు ఆరు పశువులుగా వర్థిల్లుతోంది. భారీగా వసూళ్లు .. ప్రతి గురువారం జరిగే పార్వతీపురం వారపు సంతకు విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి వ్యాపారులు తరలివస్తుంటారు. అయితే ఇక్కడకు వచ్చే పశువుల వ్యాపారుల నుంచి ఓ వ్యక్తి భారీగా డబ్బులు వసూలు చేసి పోలీసులకు ముట్టజెబుతున్నట్లు సమాచారం. అందుకే పశువుల రవాణాను ఎవ్వరూ అడ్డుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి గురువారం రెండు లక్షల రూపాయలు వివిధ రూపాల్లో అధికారులకు ముడుతున్నట్లు సమాచారం. పశువులను ఎక్కడ ఉంచాలి... గతంలో వాహనాల్లో పశువులను తరలిస్తు పట్టుకుని కేసులు నమోదు చేసి జరిమాన విధించేవాళ్లం. ఇప్పుడు కాలినడకన తీసుకెళ్తుంటే పశువులను పట్టుకుని ఎక్కడ ఉంచాలో తెలియడం లేదు. సంరక్షణ కేంద్రాలు లేవు. ఏదిఏమైనా పశు రవాణాపై దృష్టి సారించాం. పశువులను తరలిస్తున్న వాహనాలను సీజ్ చేస్తున్నాం. – జి.రాంబాబు, సర్కిల్ ఇన్స్పెక్టర్, పార్వతీపురం -
విజయవాడలో మరో భూకబ్జా
సాక్షి, విజయవాడ: నగరంలో మరో భూబాగోతం వెలుగులోకి వచ్చింది. కబేళా సమీపంలోని కొండ ప్రాంతంలో 500 గజాల స్థలాన్ని కబ్జా చేశారంటూ దళితులు విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు. తమ స్థలల్లోకి రానీయకుండా దౌర్జన్యం చేస్తున్నారంటూ సీపీ దగ్గర వాపోయారు. అనంతరం బాధితులు మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ నేతల సహకారంతో తమ భూమిని కాజేయాడానికి కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన భూములను లాక్కొని తమ స్థలం వద్దకు రానీయకుండా కొంత మంది దౌర్జన్యానికి పాల్పడుతున్నారని పేర్కొనారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రభుత్వం స్పందించకుంటే తమ స్థలాల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. -
‘దందా’నా.. పీఏ ‘దందా’నా..
పశువుల అక్రమరవాణా జోరుగా సాగుతోంది. తెరవెనుక కొందరు బడాబాబులు గో సంరక్షణ పేరుతో పశు మాఫియాను ముప్ఫై గేదెలు, అరవై గోవులుగా యథేచ్ఛగా నడుపుతున్నారు. రూ.కోట్లలో అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. అనుమతి లేకుండా మూగజీవాలను కబేళాలకు తరలిస్తున్నా పోలీసులు వీరిని ఏం చేయలేకపోతున్నారు. దీనికి కారణం జిల్లాకు చెందిన ఓ మంత్రి పీఏ హస్తం ఉండడమే. పశువుల రవాణా వాహనాలను పోలీసులు పట్టుకుంటే చాలు వెంటనే ఆ పీఏ నుంచి ఫోన్ వెళుతుంది. దీంతో వారు ఏం చేయలేకపోతున్నారు. ఒక వేళ వాహనాలపై కేసులు నమోదు చేసి, సీజ్ చేసినా.. వాటిలో పశువులు మాత్రం యథావిధిగా గోశాల ద్వారా మాఫియా చెరలోకి వెళుతున్నాయి. రవాణా ఇలా.. ఒడిశా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి తదితర జిల్లాల్లో జరిగే పశువుల సంతలో కేరళ, తమిళనాడు, తెలంగాణా, కర్నాటకకు చెందిన బడా వ్యాపారులు పశువులను దళారీలతో కొనుగోలు చేయిస్తారు. వీటిని వివిధ రకాల వాహనాల్లో జాతీయ రహదారి మీదుగా గమ్యస్థానాలకు చేరుస్తారు. ఇది రూ.కోట్లలో జరిగే వ్యాపారం కావడంతో జిల్లాకు చెందిన ఓ వ్యక్తి చూపు దీనిపై పడింది. తనకు ఉన్న అధికార దండాన్ని ప్రయోగించి బడా వ్యాపారులను లోంగదీసుకున్నాడు. విశాఖ జిల్లా వరకు రవాణా సజావుగా సాగినా, తూర్పు గోదావరిలోకి వచ్చే సరికి అజ్ఞాత వ్యక్తి చెప్పినట్టు వినాల్సి వస్తోందని వ్యాపారులే చెబుతున్నారు. ఎవరైనా మాటవినక పోతే గోసంరక్షణ సమితి పేరిట పోలీసులకు ముందుగానే వాహనం నంబర్‌తో సహా సమాచారం ఇవ్వడంతో పోలీసులు వాటిని పట్టుకుని గోశాలకు అప్పగిస్తున్నారు. ఆ తర్వాత అదే వ్యాపారులకు వీటని దర్జాగా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరికి ఎంతెంత.. తుని నుంచి రాజమహేంద్రవరం, రావులపాలెం వరకు ఉన్న పోలీస్స్టేషన్లను దాటించి వానాలను పంపడానికి బడా వ్యాపారుల నుంచి భారీ మొత్తంలో సొమ్ములు వసూళ్లు చేస్తున్నారు. కంటైనర్‌కు రూ.17,000 వసూలు చేస్తే ఇందులో పోలీసుల కోసం రూ. 15,000 గోశాలకు రూ.రెండు వేలు తీసుకుంటున్నారు. తుని నుంచి రోజుకు 15 నుంచి 20 లారీల్లో పశువులను రవాణా చేస్తున్నారు. సుమారు రోజుకు రూ.3.60 లక్షలు అనధికారికంగా వసూలు చేస్తున్నారు. ఇందులో పాయకరావుపేట నుంచి రాజమహేంద్రవరం వరకు ఉన్న పోలీస్స్టేషన్లు, తేటగుంట ఆర్టీఏ చెక్ పోస్టుకు ముడుపులు చెల్లిస్తున్నారు. ఒక్కొక్క లారీకి రూ.పది వేల వరకు ముడుపులు ఇవ్వగా సదరు మాఫియాకు. రూ.ఏడు వేలు మిగులుతోంది. అంటే రోజుకు రూ.లక్షకుపైగా ఆదాయం పొందుతున్నారు. నెలకు రూ.30 లక్షలు, ఏడాదికి రూ.3.60 కోట్లు ఇలా దందా కొనసాగుతోంది. తుని కేంద్రంగా దందా ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన పశువులను తాండవ సుగర్ ఫ్యాక్టరీ సమీపంలోని ప్రవేటు స్థలంలో దించి, అక్కడి నుంచి లారీల్లోకి ఎక్కించి పంపిస్తున్నారు. నిబంధనల ప్రకారం పెద్ద లారీలో 12 పశువులను ఎక్కించాలి. వీళ్లు మాత్రం 30 నుంచి 40 వరకు కుక్కుతున్నారు. అవరమైతే పశువుల కాళ్లు విరిచేస్తున్నారు. ఇదంతా రాత్రి 12 గంటల తర్వాత జరుగుతోంది. ఎవరైనా ప్రశ్నించినా మీకు సంబంధం ఏమిటని గర్జిస్తున్నారు. ఇంత జరుగతున్నా పోలీసులు అడపాదడపా కేసులు నమోదు చేసి మమ అనిపిస్తున్నారు. అక్రమంగా గోమాంసం తరలింపు.. వాహనం సీజ్, ఇద్దరిపై కేసు నమోదు కొత్తపల్లి (పిఠాపురం): అక్రమంగా బీచ్ రోడ్డులో గోమాంసాన్ని తరలిస్తున్న ఐషర్ వ్యాన్‌ను పోలీసులు పట్టుకున్నారు. ముం దస్తు సమాచారం మేరకు హెడ్‌కానిస్టేబుల్ సత్యనారాయణ సిబ్బందితో బీచ్ రోడ్డులో వెళుతున్న వాహనాన్ని గుర్తించి పట్టుకున్నా రు. ఆయన కథనం ప్రకారం.. విజయనగరం జిల్లా నుంచి టాటా ఐషర్ ఏపీ31టీహెచ్4971 గల వ్యాన్‌లో పశు మాంసాన్ని ఉప్పాడ మీదుగా సామర్లకోటకు కాకినాడ బీచ్ రోడ్డులో తరలిస్తున్నారు. సుమారు మూడున్నర టన్నులు ఉన్న ఈ మాంసం విలువ సుమారు రూ.3.50 లక్షలు ఉం టుంది. మాంసాన్ని తరలిస్తున్న వ్యాన్‌ను సీజ్ చేసి మాంసాన్ని కొనుగోలు చేసిన అల్తాప్, డ్రైవర్ టి.జగ్గారావులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మాంసాన్ని ఉప్పాడ గ్రామ రెవె న్యూ అధికారి పర్యవేక్షణలో ఉప్పాడ బీచ్ రోడ్డులో పూడ్చివేసి ఎస్సై కేవీఎస్ సత్యనా రాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మాంసాన్ని కొత్తపల్లి పశువైద్యాధికారి రవిబాబు పరిశీలించారు. సుమారుగా 15 గేదెల వరకు ఉంటుందని ఆయన తెలిపారు. ఉదయం 6.30 నుంచి 8.30 లోపు తరలింపు ప్రతిరోజూ విజయనగరం, విశాఖపట్నం నుంచి ఉదయం 6.30 నుంచి 8.30 మధ్య అనేక వాహనాల్లో అక్రమంగా పశుమాంసాన్ని బీచ్ రోడ్డులో తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. కొంత మంది పోలీసు సిబ్బంది మామూళ్లు పుచ్చుకుని వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
సగం తెగిన గంగడోలుతో రోడ్డుపై పరుగు..
'అంబా..' అని ఆర్తనాదం కూడా చేయలేని స్థితితో.. సగం తెగిపోయిన గంగడోలు(మెడ కింది భాగం)తో రోడ్డుపై నిల్చున్న మూగజీవిని ఆదరించి అక్కున చేర్చుకున్నాడో మానవతావాది. సోమవారం అర్ధరాత్రి నగరంలోని నాచారం పారిశ్రామిక ప్రాంతం పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ అనుమతితో నడుస్తోన్న కబేళాల్లో అర్ధరాత్రి ఎద్దులు, బర్రెలను కోసి ఉదయానికల్లా దుకాణాలకు మాసం సరఫరా చేస్తుంటారు నిర్వాహకులు. అలా సోమవారం రాత్రి నాచారంలోని కబేళాలో ఎద్దును కోసేందుకు ప్రయత్నించగా, అది తప్పించుకుని రోడ్డుపైకి వచ్చేసింది. రక్తం ధారలా కారిపోతూ తెగిన మెడతో దీనంగా నిల్చున్న ఎద్దును శివప్రకాశ్ అనే వ్యక్తి గుర్తించాడు. వెంటనే ఆ ఎద్దును తన ఇంటికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేశాడు. మంగళవారం పొద్దున్నే ఎద్దును పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. మూగజీవి పూర్తిగా కోలుకున్న తర్వాత మేడ్చల్‌లోని గోశాలకు దానిని అప్పగిస్తానని ప్రకాశ్ తెలిపారు. ఆపదలో ఉన్న మనుషులను సాటి మనుషులే ఆదుకోలేకపోతోన్న నేటికాలంలో మూగజీవాన్ని ఆదరించిన ప్రకాశ్ ను పలువురు అభినందించారు. -
కబేళాకు తరలిస్తున్న పశువుల పట్టివేత
ఘట్కేసర్: ఇతర జిల్లాల నుంచి అక్రమంగా హైదరాబాద్‌లోని కబేళాలకు తరలిస్తున్న 40 పశువులను స్థానికులు అడ్డుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద శుక్రవారం సాయత్రం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు పశువుల వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేసిన 40 లేగ దూడలను ఓ లారీలో అక్రమంగా తరలిస్తుండగా.. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
‘కబేళా’ కుక్కల స్వైరవిహారం
కబేళా నుంచి ఇళ్ల మధ్యకు రోజుకు 20 మందైనా కుక్క కాటు బాధితులు చోద్యం చూస్తున్న అధికారులు భవానీపురం : కుక్కా కుక్కా.. కబేళాకెందుకు వెళ్లావంటే.. ‘ఇళ్ల మధ్య అయితే నాలుగు మెతుకులు విదిలిస్తారు. అదే కబేళాకు వెళితే రకరకాల మాంసాహారం దొరుకుతోంది. ఆ తరువాత ఎటు తిరిగీ ఇళ్ల మధ్యకు వెళ్లి దొరికినవాళ్లను కరవచ్చు’. కుక్కల తీరు ఇలా ఉంటే.. ‘కుక్కల గురించి ఎక్కడ పట్టించుకోం. ఏం చేయాలన్నా నిధుల కొరత. పోనీ వాటికి మందుపెట్టి చంపుదామన్నా, జీవకారుణ్య సంస్థ నిర్వాహకులు మా మీద కేసులు పెడుతున్నారు’. నగరపాలక సంస్థలోని సంబంధిత విభాగం అధికారులు, సిబ్బంది తీరు ఇలా ఉంది. సుమారు ఏడాది కిందట భవానీపురం బ్యాంక్ సెంట ర్లో కుక్కలు చేసిన దాడిలో ఒక బాలుడు చనిపోయాడు. తాజాగా రోటరీనగర్‌లో ఐదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. నగరంలో రోజుకు కనీసం 20 మంది కుక్క కాటుకు గురవుతున్నారు. అయినా పాలకుల్లో కదలిక లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కబేళాలో స్వైరవిహారం కబేళాలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. జంతువథ అయిన తరువాత సిబ్బంది వాటి వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. వాటి రుచిమరిగిన కుక్కలు పదుల సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నాయి. సిబ్బంది ఎడాపెడా పడేసిన వ్యర్థాలు చాలక ఏకంగా లోపలికి వెళ్లి నోటకరిచి తెచ్చుకుంటున్నా పట్టించుకునేవాళ్లు లేరు. ఆ తరువాత నుంచి పక్కనే ఉన్న రోటరీనగర్, బ్రహ్మయ్యకాలనీ, ఊర్మిళానగర్ తదితర ప్రాంతాలకు వెళిపోతున్నాయి. అసలు సమస్య ఇక్కడే ప్రారంభం అవుతోంది. ఉదయాన్నే పాఠశాలకు వెళ్లే పిల్లలు, ఉద్యోగుల వెంటపడి కరుస్తున్నాయి. ఒకప్పుడు నగర శివారే.. ఒకప్పుడు నగర శివారుగా ఉండే కబేళా ప్రాంతం ఇప్పుడు జనావాసాలతో నిండిపోయింది. అక్కడి అపరిశుభ్ర వాతావరణం, దుర్వాసనతో చుట్టుపక్కల నివాసితులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో కబేళా ప్రాంగణంలో ఆరు బయటే గేదెలను కోయటం, వాటి వ్యర్థాలు, మలమూత్రాలను రోజుల తరబడి అలానే ఉంచేస్తుండటంతో వాంతులు, విరేచనాలతో హాస్పిటల్ పాలవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కబేళాను ఇక్కడినుంచి వెంటనే తరలించాలని వారు కోరుతున్నారు. నియంత్రణ ఏది? నగరంలో సుమారు 15 వేల కుక్కల నియంత్రణలో సంబంధిత అధికారులు పూర్తిగా విఫల మయ్యారు. ఇటీవల వరుస కుక్క కాటు సంఘటనలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గతంలో ఊరికి దూరంగా తీసుకువెళ్లి కాల్చేసేవారు. దీనిపై జీవకారుణ్య సంస్థ నిర్వాహకులు నగరపాలక సంస్థ అధికారులపై న్యాయస్థానంలో కేసు వేసినప్పటి నుంచి బెంబేలెత్తిపోయారు. మూడేళ్ల కిందట వరకు కుక్కలకు కుటుంబనియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఈ ప్రక్రియకూడా అంతగా విజయవంతం కాకపోవడంతో రేబిస్ వ్యాధి సోకకుండా వ్యాక్సిన్లు వేశారు. అది కూడా ఏడాదికొకసారి ఏదైనా గట్టి సంఘటనలు జరిగినప్పుడు హడావుడి చేస్తున్నారు తప్ప నిరంతర ప్రక్రియగా చేపట్టడం లేదు. కు.ని ఆపరేషన్లు మానేసిన తరువాత కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కార్పొరేషన్ ద్వారా ఏ పనయినా చేయమని ఎవరైనా అడిగితే..‘డబ్బెక్కడిదీ.. నువ్విస్తావా’ అంటూ మేయర్ కోనేరు శ్రీధర్ చేసు ్తన్న వ్యాఖ్యానాల నేపథ్యంలో కుక్కల నియంత్రణ విషయంలో కూడా వర్తిస్తాయేమో మరి.