హోటల్ ‘కామసూత్ర’
టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల తారలు నటనతో పాటు వ్యాపారాల మీద కూడా దృష్టి పెడుతున్నారు. ఎక్కువగా ఫ్యాషన్, హోటల్ రంగాల వైపు మొగ్గు చూపుతున్నారు మన తారలు. అదే బాటలో బాలీవుడ్ అందాల భామ జాక్వలిన్ ఫెర్నాండేజ్ కూడా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. శ్రీలంకలో చైన్ హోటల్ బిజినెస్ ను మొదలు పెట్టింది ఈ భామ. అయితే హోటల్స్ కు జాక్వలిన్ ఎంచుకున్న పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ భామ తన హోటల్స్ ను కామసూత్ర పేరుతో ప్రారంభించనుందట. జాక్వలిన్ ఈ పేరు ప్రకటించిన వెంటనే ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయింది. త్వరగా భోజన ప్రియుల దృష్టిలో పడేందుకు అలాంటి పేరు పెట్టిందట. జుడ్వా 2 సక్సెస్ తో ఫుల్ హ్యాపీగా ఉన్న జాక్వలిన్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన రేస్ 3, సుశాంత్ తో డ్రైవ్ సినిమాల్లో నటిస్తోంది.