kalahasti
-
అంతరిక్ష పర్యాటకం సాధ్యమే!
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకం సాధ్యమేనని.. మన దేశం పూర్తిస్థాయి దేశీయ పరిశోధనలతో ముందుకు వెళ్తోందని ఇస్రో శాస్త్రవేత్త కల్పన కాళహస్తి, మిస్సైల్ విమెన్ ఆఫ్ ఇండియాగా పేరుపొందిన డీఆర్డీవో శాస్త్రవేత్త టెస్సీ థామస్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ది పార్క్ హోటల్లో ఫిక్కీ ఫ్లో ఆధ్వర్యంలో శుక్రవారం ‘స్టెల్లార్ జరీ్నస్’కార్యక్రమం నిర్వహించారు. ఫిక్కీ చైర్పర్సన్ ప్రియా గజ్దర్.. పలువురు శాస్త్రవేత్తలు, ఫిక్కీ ఆధ్వర్యంలోని 200 మంది మహిళలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెస్సీ థామస్, కల్పన కాళహస్తి తమ అనుభవాలను పంచుకున్నారు. మార్స్‌పైకి మనిషి వెళ్లడం చూడాలి.. సైన్స్‌కు లింగ భేదం లేదని.. డీఆర్డీఓ, ఇస్రో వంటి వేదికల్లో పురుషులు, మహిళలు ఉమ్మడి లక్ష్యం కోసం కలసి పనిచేస్తున్నారని టెస్సీ థామస్ పేర్కొన్నారు. తాను డీఆర్డీఓ వేదికగా పరిశోధన రంగంలోకి అడుగుపెట్టినప్పుడు మహిళలు ఒకట్రెండు శాతమే ఉండేవారని.. ఇప్పుడు 15 శాతం ఉన్నారని తెలిపారు. వినయం, నిబద్ధతను తన గురువు అబ్దుల్ కలాం వద్ద నేర్చుకున్నానని చెప్పారు. దేశ రక్షణ వ్యవస్థ కోసం అగ్ని క్షిపణులను రూపొందించడంలో కృషి తనకు జీవితకాల సంతృప్తిని ఇచి్చందన్నారు. అగి్న–4, అగ్ని–5 క్షిపణుల రూపకల్పనలో దేశీయ సాంకేతికత వాడుతున్నామని వివరించారు.మార్స్‌పైకి మనిíÙని పంపడాన్ని చూడాలనేది తన కోరిక అని చెప్పారు. ఏలియన్స్ లేవని చెప్పలేం..: సాధారణ హాలీవుడ్ సినిమా బడ్జెట్ కన్నా తక్కువ ఖర్చుతో భారత్ మూన్ ల్యాండర్‌ను ప్రయోగించడం దేశ ఆర్థిక క్రమశిక్షణకు అద్దం పడుతుందని ఇస్రో శాస్త్రవేత్త కల్పన కాళహస్తి తెలిపారు. ‘‘మూన్ ల్యాండర్ 4 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి, అధిక వేగంతో చంద్రుడి సమీపానికి చేరుకుంది. ఆ వేగాన్ని సమర్థవంతంగా నియంత్రించి.. చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ చేయగలిగాం. శక్తివంతమైన భారత పరిశోధనలకు ఇది మంచి ఉదాహరణ. భవిష్యత్‌లో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తాం. ప్రయోగాల్లో పూర్తిస్థాయిలో దేశీయ సాంకేతికతను ఉపయోగించనుండటం గర్వకారణం..’’అని చెప్పారు. అంతరిక్ష పర్యాటకం దిశగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయన్నారు. అంగారకుడిపై పరిశోధన కూడా తన కలల ప్రాజెక్టు అని చెప్పారు. ఏలియన్ల గురించి ప్రస్తావిస్తూ.. విశ్వంలో మనకు తెలియని అద్భుతాలెన్నో ఉన్నాయని, అందులో ఏలియన్స్ కూడా భాగం కావొచ్చని పేర్కొన్నారు. -
కుప్పంలో కాళహస్తి తమ్ముళ్ల పంచాయితీ.. బాబు సమక్షంలో తగాదా..
తిరుపతి:ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది కాళహస్తి నాయుడు స్థితి. ఉన్నచోట ఉండకుండా అటు ఇటు వెళ్లి..ఇప్పడు ఎటూ కాకుండా పోయారు పాపం. టీడీపీలో ఉంటూ వైఎస్సార్సీపీలోకి వచ్చిన నాయుడు ఇప్పుడు అక్కడ ఇమడలేక టీడీపీలోకి మళ్లీ వద్దాం అని చూస్తున్నారు. అంతా అనుకున్నట్లు సాగితే ఈరోజే అయన టీడీపీలోకి మళ్లీ వచ్చి చేరేవారు కానీ అక్కడి టీడీపీ ఇంఛార్జ్ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి మోకాలు అడ్డం వేయడంతో పాపం నాయుడు గారు టీడీపీలోకి రాలేక, వైసీపీలో ఇమడలేక చాలా అవస్థలు పడుతున్నారు. గుర్తింపు రాకపోయేసరికి.. వాస్తవానికి ఎస్సీవీ నాయుడు 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో టీడీపీ అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో ఆయన టీడీపీలోకి చేరారు. అయినా సీటు ఇవ్వకపోవడంతో ఊరుకుని, 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. కానీ ఇన్నాళ్లున్నా ఆయనకు పార్టీలో ఎలాంటి గుర్తింపు రాకపోయేసరికి మళ్లీ టీడీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇష్టపడని సుధీర్ రెడ్డి.. ఈమేరకు గురువారమే టీడీపీలో చేరేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారు. చంద్రబాబు అనుమతులు, ఎపాయింట్మెంట్ సైతం ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పటికే తన క్యాడర్ కు సైతం సమాచారం అందించి మళ్లీ తాను టీడీపీలోకి వెళ్తున్నట్లు చెప్పేసారు. అయితే ఇంఛార్జీని తానూ ఉండగా తనకు కనీసం చెప్పకుండా, తన అంగీకారం లేకుండా నాయుడు మళ్లీ టీడీపీలో చేరడాన్ని ఇష్టపడని సుధీర్ రెడ్డి తన పవర్ చూపించారు. నియోజకవర్గ ఇంఛార్జీని అయిన తనకు చెప్పకుండా ఎస్సీవీ నాయుడును పార్టీలో ఎలా చేర్చుకుంటారని సుధీర్ రెడ్డి నేరుగా అధిష్ఠానాన్ని ప్రశ్నించడమే కాకుండా ఒక వాయిస్ మెసేజ్ కూడా విడుదల చేసారు. కార్యకర్తలు ఎవరూ పోవద్దని సుధీర్ రెడ్డి వాయిస్ మెసేజ్ కార్యకర్తలతోబాటు అధిష్టానానికి చేరింది. ఈతకాయ తెచ్చుకుని తాటికాయ వదిలేసుకోవడం ఎందుకని భయపడిన చంద్రబాబు, అధిష్ఠానం ఎన్సీవీ నాయుడు చేరికను తాత్కాలిక వాయిదా వేసింది. కుప్పంలో తేల్చుకుందాం రమ్మని చంద్రబాబు కబురంపడంతో ఇరువర్గాలు తమ బలాబలాలు తేల్చడానికి సిద్ధమయ్యాయి. రెండువర్గాల నేతలు..కార్యకర్తలు బరిలోకి దూకడానికి రెడీగా ఉన్నారు.దీంతో బొజ్జల సుధీర్ రెడ్డితోపాటు ఎన్సీవీ నాయుడు గ్రూపు తమ బలాబలాలు అక్కడ తెల్చుకోనున్నాయి. ఇదీ చదవండి:బాబు.. దేవుడితో పరాచకాడితే ఇంకా పాతాళానికి పోతావ్: కొట్టు సత్యనారాయణ -
కాళహస్తిలో గోపీచంద్ దంపతులు పూజలు
శ్రీకాళహస్తి: హీరో గోపీచంద్ దంపతులు గురువారం కాళహస్తిలో రాహుకేతు పూజలు నిర్వహించారు. భార్య రేష్మి, కుమారుడితో కలిసి ఆయన పూజలు చేశారు. కాగా ఈ రోజు ఉదయం గోపీచంద్ దంపతులు వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ తన కుమారుడి పుట్టువెంట్రుకలు స్వామివారికి సమర్పించి మొక్కు చెల్లించుకున్నట్టు తెలిపారు. స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. -
అమ్మవారి ఊరేగింపులో చెలరేగిన మంటలు
-
కాళహస్తిలో లోక్‌సభ స్పీకర్ రాహుకేతు పూజలు
తిరుపతి : లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ శుక్రవారం శ్రీకాళహస్తి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి రాహుకేతు పూజలు నిర్వహించారు. అంతకు ముందు సుమిత్రా మహాజన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గత రాత్రే ఆమె తన కుటుంబంతో కలిసి తిరుమల విచ్చేశారు. ఈ రోజు తెల్లవారుజామున సుమిత్రా మహాజన్ స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆమె ఆలయ సమీపంలోని అఖిలాండం వద్ద దీపాలు వెలిగించారు. ఆలయ అధికారులు ఈ సందర్భంగా సుమిత్రా మహాజన్‌కు స్వామివారి శేషవస్త్రంతో పాటు లడ్డూ ప్రసాదం అందచేశారు.