KE Krishnamurthy
-
కేఈ శ్యాంబాబుకు సొంతిల్లు లేదట!
కర్నూలు(సెంట్రల్): పత్తికొండ టీడీపీ అభ్యర్థి కేఈ కుటుంబానికి అమరావతిలో రూ.5.54 కోట్ల విలువ చేసే 38,002 చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉన్నప్పటికీ సొంత ఇల్లు లేదని అఫిడవిట్లో చూపారు. తండ్రి డిప్యూటీ సీఎంగా పనిచేసినా కుమారుడికి మాత్రం సొంతిల్లు లేకపోవడం గమనార్హం. ఇటీవల ఆయన పత్తికొండ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయగా..తాను ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన పేరిట కృష్ణగిరి, కంబాలపాడులలో రూ.19.40 లక్షల విలువ చేసే 12.33 ఎకరాల పొలం, రూ.31.79 లక్షల విలువ చేసే ఫార్చునర్ కారు ఉన్నట్లు చూపారు. భార్యకు రూ.32 లక్షల విలువ చేసే 46.58 తులాల బంగారు, రూ.15 లక్షల విలువ చేసే 16.50 కేజీల వెండి ఆభరణాలు ఉన్నాయని పేర్కొన్నారు. తన పేరిట రూ. 3,23,18,090 చరాస్తులు, భార్యకు రూ..1,32,14,007 చరాస్తులు ఉన్నట్లు చూపారు. ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల దగ్గర రూ.1,19,76,800 అప్పు తీసుకున్నట్లు, తన భార్యకు రూ.19.50 లక్షల అప్పు ఇచ్చినట్లు చెప్పారు. తనపై ఒక్క కేసు కూడా లేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. రాఘవేంద్రారెడ్డికి రెండు కార్లు మంత్రాలయం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎన్.రాఘవేంద్రారెడ్డికి రెండు కార్లు ఉన్నాయి. అంతేగాక అతను, అతని భార్య ఎన్.యశోదమ్మకు దాదాపు 31 ఎకరాల పొలాలు ఉన్నాయి. మాధవరంలో ముగ్గురి భాగస్తుల్లో కమర్షియల్ కాంప్లెక్స్ అతనిపేరిట ఉంది. అతని ఎలాంటి కేసులు లేవని ఎన్నికల ఆఫిడవిట్లో పొందుపరచారు. ఆయనకు రూ.3.92 లక్షల విలువ చేసే 5.6 తులాల బంగారు అభరణాలు, భార్య ఎన్. యశోదమ్మకు రూ.9.10 లక్షల విలువ చేసే 13 తులాల బంగారం అభరణాలు ఉన్నట్లు తెలిపారు. అంతేకాక ఆయన పేరిట రూ.40.70 లక్షల చరాస్తి, భార్యకు రూ.26.26 లక్షల చరాస్తితోపాటు రూ.33 లక్షల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయి. ఆయన పేరిట స్థిరాస్తులు మాత్రం రూ.2.94 కోట్లుగా ఉన్నట్లు చెప్పారు. కుమారుడు రాకే‹Ùరెడ్డి పేరిట 35 లక్షల స్థిరాస్తి, రూ.20 లక్షల చరాస్తి ఉన్నట్లు చూపారు. రాఘవేంద్రారెడ్డికి రూ.1.68 కోట్ల అప్పులు, భార్యకు రూ.21 లక్షల అప్పు ఉన్నట్లు ప్రకటించారు. వై.బాలనాగిరెడ్డికి వ్యవసాయ భూములే ఆస్తులు మంత్రాలయం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వై.బాలనాగిరెడ్డి, ఆయన భార్య జయమ్మకు కలిపి 44.06 ఎకరాల వ్యవసాయ పొలాలు ఉన్నాయి. ఇందులో బాలనాగిరెడ్డి పేరిట 37.45 ఎకరాలు, భార్య పేరిట 6.61 ఎకరాల పొలం ఉంది. ఆయనకు పేరిట ఒకకారు, భార్య పేరిట మరొక కారు ఉంది. ఆయన రూ.12 లక్షల విలువ చేసే 400 గ్రాములు బంగారు ఆభరణాలు, రూ.4 లక్షల విలువ చేసే 10 కేజీల వెండి ఆభరణాలు ఉన్నాయి. అలాగే ఆయన భార్య పేరిట రూ.4.85 లక్షల విలువ చేసే 15 తులాల బంగారు ఆభరణాలు, రూ.2.5 లక్షల విలువ చేసే 5 కేజీల వెండి ఉంది. కాగా, బాలనాగిరెడ్డిపై 2012లో కోసిగి పోలీసు స్టేషన్లో నమోదైన కేసు విచారణలో ఉంది. ఇంతియాజ్‌కు సొంత వాహనం లేదు సెర్ప్ సీఈఓ, సీసీఎల్ఏ అదనపు కార్యదర్శిగా పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చిన ఏఎండీ ఇంతియాజ్‌కు సొంత వాహనం లేదు. బుధవారం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునన కర్నూలు అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా సమర్పించిన ఆవిడవిట్‌లో తనకున్న ఆస్తి వివరాలను ప్రకటించారు. తన చరాస్తిగా రూ.41.36 లక్షలు, భార్య సమీనకు చరాస్తిగా రూ.18.42 లక్షలు మాత్రమే ఉన్నట్లు ప్రకటించారు. ఇందులో వారికి విలువైన వాహనాలుగాని, ఖరీదైనా వజ్రాలు, బంగారు, వెండి, అభరణాలేవి లేవు. స్థిరాస్తుల్లో ఆయన భార్య సమీనకు కర్నూలులోని ఎన్ఆర్ పేటలో 378 చదరపు అడుగుల్లో నిర్మించిన ఇల్లు ఉంది. అలాగే ఆయనకు రాజధాని క్యాపిటల్ సిటీలోని ఐనవోలులో 4500 చదరపు అడుగుల కాళీ స్థలం, ఆయన భార్య సమీనకు కల్లూరులో 2800 చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉంది. స్థిరాస్తి విలువలో ఇంతియాజ్‌కు రూ.30 లక్షలు, ఆయన భార్యకు రూ.30 లక్షలు ఉన్నాయి. మొత్తంగా ఆయనకు చరాస్థిరాస్తులు కలిపి రూ. 71,36,560, ఆయన భార్య సమీనకు 68, 42,603 లక్షల రూపాయలు ఉన్నాయి. ఆయనపై ఎలాంటి కేసులు లేవు. -
మార్పు తథ్యం!
సాక్షి, పత్తికొండ: పత్తికొండ నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే..రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన సంఘటనలు కూడా ఇక్కడే జరిగాయి. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 6 సార్లు కాంగ్రెస్, 7 సార్లు టీడీపీ, ఒక సారి సీపీఎం, ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. రెండు సార్లు ఉప ఎన్నికలు జరిగాయి. కేఈ సోదరులకు రెండు పర్యాయాలు మద్దతు పలికినా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోవడంతో ప్రజలు వారిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోసారి జనం ముందుకు ఓట్లడగటానికి వస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన సమస్యలను విస్మరించడంతో రైతులు, ప్రయాణికులు, విద్యార్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రకాశం పంతులు ప్రభుత్వాన్ని కూల్చిన పత్తికొండ ఎమ్మెల్యే 1952లో ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టగా అప్పటి పత్తికొండ ఎమ్మెల్యే ముడుమాల శంకరరెడ్డి వ్యతిరేకంగా ఓటు వేయడంతో ప్రభుత్వం పడిపోయింది. అంతకుముందు రెండుసార్లు నియోజకవర్గాన్ని పునర్విభజించగా 2007లో మూడోసారి విభజించారు. పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, కృష్ణగిరి, వెల్దుర్తి మండలాలతో నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గం నుంచి ఎస్వీ సుబ్బారెడ్డి మూడుసార్లు హ్యాట్రిక్ విజయం సాధించారు. అమలు కాని హామీలు పందికోన, కొత్తపల్లి, రిజర్వాయరు నుంచి 32,200 ఎకరాలకు, కృష్ణగిరిలో రిజర్వాయరు నుంచి 5,100 ఎకరాలకు సాగునీరందించి 68 చెరువులకు జలకళ తెస్తామని టీడీపీ నాయకులు హామీ ఇచ్చారు.అంతేకాక ఆర్టీసీ మినీ డిపో నుంచి పూర్తిగా స్థాయిలో ఏర్పాటు, పాలిటెక్నిక్ కళాశాల, బీసీ బాలికలకు వసతి గృహం ఏర్పాటు, 80 గ్రామాలకు తాగు నీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చి గెలిచిన తరువాత పట్టించుకోలేదు. కేఈ కుటుంబంపై ఆగ్రహం రెండుసార్లు కేఈ కుటుంబానికి మద్దతు పలికినా హామీల గురించి మాటెత్తకుండా మూడోసారి కేఈ శ్యాం కుమార్ (కేఈ కృష్ణమూర్తి కుమారుడు) బాబుకు ఓట్లు వేయాలని అడుగుతుంటే ఓటర్లు జీర్ణించు కోలేకపోతున్నారు. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డిని పట్టపగలే దారుణంగా హత్య చేయించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఏడాది పాటు శ్యామ్‌బాబు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇక ఆర్అండ్బీ రోడ్లు, నీరుచెట్టు ,చెక్‌డ్యాంలు, సీసీ రోడ్లు నిర్మాణాల్లో టీడీపీ నేతలు జేబులు నింపుకున్నారు. పక్కాగృహం మంజూరు కావాలంటే రూ.50వేలు ఇవ్వాల్సిందే. ఇలా లక్షల రూపాయలు వసూలు చేశారని లబ్ధిదారులు వాపోతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పట్టించుకోకపోవడంతో కేఈ సోదరులపై ప్రజా వ్యతిరేకత, చంద్రబాబు ప్రకటించిన 650 çహామీల్లో ఒక్కటీ అమలు చేయకపోవడం వైఎస్సార్సీపీకి కలిసొచ్చే అంశం. జోరుగా ఫ్యాను గాలి.. నియోజకవర్గంలో టీడీపీ నాయకుల అవినీతి, ఆక్రమాలు, ప్రత్యర్థుల చేతిలో భర్తను కోల్పోయిన శ్రీదేవికి నియోజకవర్గ ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ఓటమి ఖాయమని గ్రహించిన కేఈ సోదరులు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ఈ ఎన్నికల్లో కంగాటి శ్రీదేవికి పట్టం కట్టడానికి ఓటర్లు సిద్ధమయ్యారు. ఈఎన్నికల్లో ఫ్యాన్ గాలికి సైకిళ్లు లేచిపోవడం ఖాయమని భావిస్తున్నారు. – పూజారి గోపాల్, పత్తికొండ ఓటర్ల వివరాలు మొత్తం 1,89,409 పురుషులు 95,751 మహిళలు 93,640 ఇతరులు 18 -
కేఈ ఇలాకాలో టీడీపీకి షాక్!
సాక్షి, కర్నూలు : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఇలాకాలో టీడీపీకి షాక్ తగిలింది. కేఈ కృష్ణమూర్తి బంధువు కేఈ సుభాషిణి టీడీపీకి గుడ్‌బై చెప్పారు. కృష్ణగిరి మండలం వైస్ ఎంపీపీగా ఉన్న కేఈ సుభాషిణి తన పదవికి సైతం రాజీనామా చేశారు. నాలుగున్నరేళ్లుగా అణిచివేత ధోరణి అవలంభిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
‘ఆయన అనుభవం చంద్రబాబు భజన చేయటానికే!’
సాక్షి, కర్నూలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అనుభవం చంద్రబాబు భజన చేయటానికి, జగన్మోహన్ రెడ్డిని విమర్శించటానికే పరిమితం కావటం శోచనీయమని వైఎస్సార్ సీపీ నేత బీవై రామయ్య వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేఈ తన స్థాయి మరిచి వైసీపీ నాయకులపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో జరిగిన అక్రమాలపై వాస్తవాలు చెప్పే ధైర్యం కేఈకి లేదని మండిపడ్డారు. ఉపముఖ్యమంత్రిగా ఉంటూ నాలుగున్నరేళ్లలో జిల్లా ప్రజలకు చేసిన మేలు ఏమిటో చెప్పగలరా అని ప్రశ్నించారు. వైసీపీ నవరత్నాలను విమర్శిస్తున్న కేఈ! ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి పాచిపోయిన లడ్డూలు రుచి చూడలేదా అంటూ ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గంలోని చెరువులను నింపుకోలేని అసమర్థ ఉపముఖ్యమంత్రి అని విమర్శించారు. కుటుంబసభ్యుల రాజకీయ పదవుల కోసం ఆత్మవంచన చేసుకుంటున్నారని అన్నారు. ప్రతిపక్ష నాయకునిపై అనవసర విమర్శలు చేయటం మానుకోవాలని హితవుపలికారు. -
రైతులపై సోమిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
కర్నూలు : కర్నూలులో మంత్రి సోమిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జెడ్పి మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ గ్రీవెన్స్ సెల్లో సోమిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను పారిశ్రామికవేత్తలతో పోల్చారు. కేవలం లక్ష రూపాయలు అప్పు ఉన్న రైతులు ఆత్మహత్యలు ఎందు చేసుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన పారిశ్రామిక వేత్తలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవడం లేదు అంటూ, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను చులకనగా చేసి మాట్లాడారు. రైతులకు ఆదర్శవంతంగా రుణమాఫీ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు. రూ. 680 కోట్లతో రైతులకు కొంత రుణమాఫీ చేశామన్నారు. రుణమాఫీలో 9లక్షల ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. వాటిని పరిష్కరించి, అర్హులైన అందరు రైతులకు రుణమాఫీ అందజేస్తామని తెలిపారు. కాగా, సోమిరెడ్డికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి షాకిచ్చారు. జిల్లాలోని రైతాంగ సమస్యలను మంత్రి వద్ద ఎకరువు పెట్టారు. జిల్లాలో కరువు మండలాల గుర్తింపుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో 53 మండలాలకు గాను కేవలం 37 మండలాలను కరువు మండలాలుగా ఎంపిక చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. వర్షపాతం లేని కారణంగా కర్నూలు జిల్లాను కరువు పీడిత జిల్లాగా ఎంపిక చేయాలన్నారు. తమ ప్రాంతంలో వర్ష పాతం తక్కువగా ఉన్నా తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నకిలీ విత్తనాల బెడద అధికంగా ఉందని కేఈ పేర్కొన్నారు. -
ఆమెకు అవమానం
కూరగాయలు విక్రయిస్తున్న ఈమె పేరు కూరపాటి సుంకులమ్మ. కృష్ణగిరి మండల పరిషత్ అధ్యక్షురాలు. వాస్తవానికి మండల పాలనా వ్యవహారాల్లో కీలకంగా ఉండాలి. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పాటుపడాలి. తనను ఎన్నుకున్న ప్రజల బాగోగులు చూడాలని ఈమెకూ ఉంది. కానీ అక్కడి అధికార పార్టీ నాయకుడు అవకాశం ఇవ్వడం లేదు. సోదరుడు డిప్యూటీ సీఎం కావడంతో అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. సొంత పార్టీకే చెందిన దళిత మహిళా ఎంపీపీని అడుగడుగునా అవమానాలకు గురిచేస్తున్నాడు. కర్నూలు టాస్క్‌ఫోర్స్ : డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఇలాకాలో దళిత మహిళా ప్రజాప్రతినిధి ఆత్మగౌరవాన్ని అధికార పార్టీ నాయకులు మంటగలిపారు. పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి ఎంపీపీ కూరపాటి సుంకులమ్మను సొంత పార్టీ వారే తీవ్ర అవమానాలకు గురిచేస్తున్నారు. కనీసం మండల పరిషత్ సమావేశాలకు కూడా ఆహ్వానించడం లేదు. మహిళా ప్రజాప్రతినిధి అనే మర్యాద కూడా ఇవ్వకుండా డిప్యూటీ సీఎం సోదరుడు కేఈ జయన్న రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నట్లు బాధితురాలు ఆరోపిస్తున్నారు. కృష్ణగిరి మండలం ఆలంకొండ ఎంపీటీసీ సభ్యురాలిగా ఎన్నికైన సుంకులమ్మను ఎంపీపీగానూ ఎన్నుకున్నారు. ఎన్నికైన నాటి నుంచి నేటి వరకు ఏ ఒక్క సమావేశానికీ అధికారులు ఆహ్వానించడంలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు చేసిన అప్పులు తీర్చేందుకు స్వగ్రామం ఆలంకొండలోనిఇల్లు, పొలం సైతం విక్రయించామని, ఇప్పుడు తనతో పాటు కుటుంబ సభ్యులు కూడా కూలి పనులకు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. సుంకులమ్మకు భర్త రంగస్వామితో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు దివ్యాంగుడు. అప్పులు కట్టేందుకు సొంతూరిలోని ఇంటిని సైతం అమ్మేయడంతో ప్రస్తుతం వీరు డోన్ పట్టణంలోని కొత్త బస్టాండు వెనుక చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. రూ.700లకు అద్దెకు తీసుకున్న ఆ ఇంట్లో దుర్భర జీవితం గడుపుతున్నారు. రంగస్వామి డోన్ పాతబస్టాండ్‌లో హమాలీగా పనిచేస్తున్నాడు. ఎంపీపీ సుంకులమ్మ పట్టణంలో కూరగాయలు విక్రయిస్తున్నారు. ఈ నాలుగేళ్లలో ఎంపీపీగా కార్యాలయం ముఖం రెండుసార్లు మాత్రమే చూశానని, మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఏమిటనే విషయం కూడా తనకు తెలపడం లేదని ఆమె వాపోతున్నారు. ‘కేఈ జయన్న కనుసన్నల్లోనే అధికార యంత్రాంగమంతా నడుస్తోంది. నా సంతకాలు కూడా వారే ఫోర్జరీ చేస్తున్నారు. దళిత తేజం లాంటి కార్యక్రమాల్లో దళితుల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆయన ఇలాకాలో దళితులకు తన కుటుంబ సభ్యులు ఏ మాత్రం గౌరవం ఇస్తున్నారనే దానిపై ప్రజలకు స్పష్టం చేయాల’ని అన్నారు. హక్కులనుకాలరాసే కుట్ర... కృష్ణగిరి మండలంలో ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులను దళితులకు కేటాయించినా.. వారు మాత్రం ఉత్సవ విగ్రహాలే. దళితులను అడ్డం పెట్టుకొని మండలంలో ప్రజాధనాన్ని కేఈ సోదరులు లూటీ చేస్తున్నారు. ఈ దుర్భర పరిస్థితి నుంచి వారిని గట్టెక్కించేందుకే నోరు తెరవాల్సి వస్తోంది.– తొర్రి రంగన్న, కృష్ణగిరి మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు పురుగుల కంటే హీనంగా చూస్తున్నారు... ‘ఎంపీపీగా ఎన్నికై నాలుగేళ్లు గడిచినా ఒక్క పేపర్ మీద కూడా నా సంతకాలు తీసుకోలేదు. మండల పరిషత్ సమావేశాలకు కూడా ఆహ్వానించడం లేదు. అధికార పార్టీ నాయకుల మాటలు నమ్మి ఉన్న ఆస్తిని ఎన్నికల్లో హారతి కర్పూరంలా ఖర్చుచేయాల్సి వచ్చింది. ఆత్మ గౌరవం కాపాడుకునేందుకే నేడు గళం విప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. మమ్మల్ని పురుగుల కంటే హీనంగా చూస్తున్నార’ని ఎంపీపీ సుంకులమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆ ఎమ్మెల్సీ పదవి వైఎస్సార్సీపీ భిక్ష: బీవై రామయ్య
కర్నూలు : వైఎస్సార్సీపీ వదిలేసిన భిక్ష ఎమ్మెల్సీ పదవి అని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. కర్నూలులో పార్టీకార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..వైఎస్సార్సీపీ విసిరేసిన ఎమ్మెల్సీ కోసం కేఈ కుటుంభం దిగజారి వ్యవహరిస్తోందని విమర్శించారు. బీసీలంటే కేఈ కుటుంబం మాత్రమే అన్నట్టు ఇతర బీసీలకు అన్యాయం చేస్తోన్నారని ఆరోపించారు. రాష్ట్ర స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు ఏ పదవి అయినా ఆ కుటుంభం తర్వాతే అన్నట్టు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం ప్రాణాలను, ఆస్తులను ఫణంగా పెట్టిన బీసీలకు కేఈ కృష్ణమూర్తి చేసింది ఏమిటని ప్రశ్నించారు. కర్నూల్ జిల్లాలో బీసీలంటే కేఈ సోదరులేనా...? ఏ అర్హతతో కేఈ ప్రభాకర్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారని ప్రశ్నించారు. జిల్లాలోని టీడీపీకి చెందిన బీసీలు అందరూ అసంతృప్తితో ఉన్నారని, టీడీపీ వెంట ఉన్న నాగేశ్వర యాదవ్, బట్టిన వెంకటరాముడు, బొజ్జమ్మ, గుడిసె కృష్ణమ్మ, తుగ్గలి నాగేంద్ర, బీటీ నాయుడు అర్హులు కారా? నాయి బ్రాహ్మణ, రజక ఇతర కులాల్లో అర్హులైన బీసీలే లేరా..? అని సూటిగా అడిగారు. పదవుల పందేరంలో ముందు వరుసలో ఎప్పుడూ కేఈ కుటుంబం ఉండటం సిగ్గు చేటన్నారు. పదవుల కోసం పార్టీని నమ్ముకున్న వారిపై బెదిరింపులకు దిగడం కేఈ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య అని, ఇప్పటికైనా జిల్లాలోని బీసీ నాయకులందరూ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కళ్ల ముందే ప్రజా స్వామ్యాన్ని చంద్రబాబు అపహాస్యం చేస్తున్నా డెప్యూటీ సీఎం ధృతరాష్ట్రుడిలా మారాడని విమర్శించారు. సుదీర్ఘ అనుభవం ఉన్న కేఈ కృష్ణమూర్తి లాంటి వారు కూడా అహంకార పూరిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. తన తమ్ముడు నామినేషన్ వేసి గంటలు గడవకముందే ఎన్నిక ఏకపక్షమే, స్వతంత్ర అభ్యర్ధులు పోటీ నుంచి తప్పుకుంటారు.. అంటూ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో బెదిరింపు ధోరణి లో మాట్లాడం పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. వైఎస్సార్సీపీ పోటీలో ఉన్నా అత్యధిక మెజార్టీతో గెలిచేవాళ్లం అంటున్నారు..అది ఎలాగో ఆయనే చెప్పాలని అన్నారు. ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన వారిని బెదిరించే ధోరణిలో ఉపముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉండటం దురదృష్టకరమన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు అమాయకులు అనడం చూస్తుంటే.. తన తమ్ముడికి వ్యతిరేకంగా నామినేషన్ వేయకూడదు అన్న ధోరణి కనబడుతోందన్నారు. తప్పుడు సంతకాలతో అభ్యర్థులు నామినేషన్ వేశారని డెప్యూటీ సీఎం అనటం చూస్తుంటే.. అధికారుల పనితీరు పై అనుమానాలు వ్యక్తం చేసినట్టు కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లాలో వెనుకబడిన బీసీలు ఉన్నారని కేఈ కుటుంబం గుర్తించాలన్నారు. -
ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా ?
సాక్షి, కోడుమూరు: తనకు రుణ మాఫీ కాలేదని అడిగిన రైతుపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. అసహనంతో ‘షటప్.. డోంటాక్.. (నోర్ముయ్.. మాట్లాడొద్దు) నాన్సెన్స్.. వింటే విను లేకుంటే వెళ్లిపో. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా! నేను డిప్యూటీ సీఎం. ముఖ్యమంత్రి తర్వాత అంతటి స్థాయి ఉన్న వ్యక్తిని. సారా తాగిన నాయాళ్లతో ఇక్కడికొచ్చి అల్లరి చేస్తారు. ఫ్యాక్షన్ గ్రామాల్లో తిరిగినట్లు మాట్లాడితే కుదరదు. మీ కోసం పనులు చేయడానికి వచ్చా. చేతులు చూపించి మాట్లాడతావా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ మౌనంగా, సున్నితంగా ఉండే ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మంగళవారం కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పులకుర్తిలో జరిగిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో రైతుపై కేకలు వేయడం చూసి కార్యకర్తలు సైతం విస్తుపోయారు. అంతకు ముందు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వారేనని వ్యాఖ్యానించారు. ‘1978లో నేను డోన్ నుంచి ఇందిరా కాంగ్రెస్ తరఫున పోటీ చేశా. చంద్రబాబు కూడా అదే సంవత్సరం అదే పార్టీ నుంచే పోటీ చేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరాం’ అని అన్నారు. -
ఆ పెద్దమనిషి సంగతేమిటి..?
కేఈ కుమారుడు శ్యాంబాబు గురించి ఆరా తీసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: హంద్రీ నదిలో అక్రమ ఇసుక తవ్వకాల వ్యవహారంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబుపై వచ్చిన ఆరోపణలపై ఉమ్మడి హైకోర్టు మంగళవారం మరోసారి ఆరా తీసింది. ఆ పెద్దమనిషి సంగతేమిటంటూ శ్యాంబాబు పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా అతని గురించి ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఆయన సమాధానాన్ని దాట వేయడంతో హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘ఎవరు ఏం చేసినా ప్రశ్నించకూడదా? చట్టా నికన్నా అధికులమని వీరంతా భావిస్తున్నారు. వాళ్లు చేస్తున్నదాన్ని మీరు (ప్రభుత్వం) సమర్థించుకోవచ్చు. అంతమాత్రాన వాస్తవం మరుగునపడిపోదు. ఇసుక తవ్వకాల కోసం నిబంధనలకు విరుద్ధంగా నదిలోనే కిలో మీటర్ల మేర బాట వేస్తుంటే మీరేం (అధికారులు) చేస్తున్నారు?’ అంటూ నిలదీసింది. చట్ట విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరిపి, రవాణా చేసిన వారిపై ఎంతమందికి రూ.లక్ష జరిమానా విధించారు? ఎన్ని ట్రాక్ట్టర్లు సీజ్ చేశారు? ఎంతమంది హైకోర్టుకొచ్చి స్టేలు తెచ్చుకున్నారు? తదితర వివరాలను తమ ముందుంచాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశిం చింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హంద్రీ నదిలో చట్ట విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించు కోవడంలేదని, ఫలితంగా సమీప గ్రామాలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నా యంటూ కృష్ణగిరి, కోడుమూరు మండలా ల పరిధిలోని ఎస్‌హెచ్ ఎర్రగుడి, మన్నేకుం ట గ్రామస్తులు ఎ.బజారీ మరో 11 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.