Khalid Latif
-
ఆ క్రికెటర్‌పై ఐదేళ్ల నిషేధం!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ ఖలీద్ లతీఫ్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఐదేళ్లపాటు నిషేధం విధించింది. 2017లో జరిగిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)ను కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఖలీద్ పాత్ర ఉండటంతో ఐదేళ్లపాటు అతను అన్ని ఫార్మెట్లలోనూ క్రికెట్ ఆడకుండా నిషేధించింది. పీఎస్ఎల్లో ఇస్లామాబాద్ యునైటెడ్ తరఫున ఆడిన ఖలీద్ పీసీబీ అవినీతి వ్యతిరేక నియమావళిని తీవ్రంగా ఉల్లంఘించినట్టు ఆరు అభియోగాలు ఎదుర్కొన్నాడు. ఈ ఆరు అభియోగాల్లోనూ అతను దోషిగా తేలడంతో పీసీబీ ఈమేరకు చర్య తీసుకుంది. అంతేకాకుండా అతనిపై రూ. 10లక్షలు (పాక్ కరెన్సీ) జరిమానా విధించింది. ఈ వ్యవహారంపై సమగ్ర తీర్పు వెలువడిన అనంతరం ఖలీద్ లతీఫ్ 14 రోజుల్లో అప్పీల్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. లతీఫ్ అప్పీల్ చేస్తాడా లేదా? అన్నది వేచిచూస్తామని పీసీబీ తరఫు న్యాయవాది తెలుపగా.. అప్పీల్ చేసే అవకాశం ఉందని లతీఫ్ తరఫు న్యాయవాది బాదర్ ఆలం తెలిపారు. -
ట్వంటీ20 స్పాట్ ఫిక్సింగ్: మరొకరి అరెస్ట్
లండన్: పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ (పీఎస్ఎల్) లీగ్ లో స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలతో గత వారం ఇద్దరు పాకిస్తాన్ క్రికెటర్లను అదుపులోకి తీసుకున్న బ్రిటన్ పోలీసులు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. అంతర్జాతీయ క్రికెట్ స్పాట్ ఫిక్సింగ్ పై దృష్టిపెట్టిన బ్రిటన్ జాతీయ నేర విభాగం షెఫీల్డ్ లో స్థానిక పౌరుడిని అదుపులోకి తీసుకున్నట్లు గురువారం వెల్లడించింది. అయితే ఆ వ్యక్తి బెయిల్ పై విడుదలనట్లు తెలిపింది. ఫిబ్రవరి 13న పాక్ క్రికెటర్లు నాసిర్ జంషెడ్, యూసఫ్ లను అదుపులోకి తీసుకోగా రెండు రోజుల అనంతరం ఏప్రిల్ వరకు బెయిల్ మంజూరు కావడంతో బయటకొచ్చారు. పీఎస్ఎల్ కు సంబంధించి స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డార్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు పాక్ క్రికెటర్లు షార్జిల్ ఖాన్, ఖాలిద్ లతీఫ్ లకు రెండు వారాల గడువిస్తూ వివరణ ఇవ్వాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆదేశించింది. గత శనివారం పీసీబీ ఈ ఇద్దరు క్రికెటర్ల విషయాన్ని మీడియాకు వెల్లడించింది. మరోవైపు ఫిక్సింగ్ ఆరోపణలతో పీసీబీ ఇదివరకే.. ఇస్లామాబాద్ యూనైటెడ్ ప్లేయర్ షార్జిల్ ఖాన్, ఖాలిద్ లతీఫ్ ను సస్పెండ్ చేసింది. పీఎస్ఎల్ లో పాక్ క్రికెటర్లు స్పాట్ ఫిక్సింగ్ పాల్పడ్డారన్న ఆరోపణలపై బ్రిటన్ ఎన్సీఏ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఫిక్సింగ్ కు సంబంధం ఉందన్న ఆరోపణలతో మరికొందరిపై నిఘా పెట్టింది. షార్జిల్, లతీఫ్ మాత్రం తమకు ఫిక్సింగ్ తో ఎలాంటి సంబంధాలు లేవని, తమపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆటగాళ్ల ఫిక్సింగ్ వివరాలపై మాట్లాడేందుకు పీసీబీ నిరాకరిస్తోంది. -
సస్పెండైన ఇద్దరు క్రికెటర్లు!
కరాచీ:పాకిస్తాన్ కు చెందిన క్రికెటర్లు షర్జిల్ ఖాన్, ఖలిద్ లతిఫ్ లపై సస్పెన్షన్ వేటు పడింది. ఆ ఇద్దరిపై ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో వారిని సస్పెండ్ చేస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) లో వారిద్దరూ స్పాట్ ఫిక్సింగ్ పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఐసీసీ సహకారంతో విచారణ చేపట్టిన పీసీబీ..వారిద్దరికీ ఫిక్సింగ్ తో సంబంధాలున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తూ సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఫిక్సింగ్ కు పాల్పడిన ఎటువంటి ఆధారాలను పీసీబీ వెల్లడించలేదు. తాజాగా సస్పెన్షన్ వేటు పడిన వీరిద్దరూ జాతీయ స్థాయి క్రికెటర్లే. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాక్ జట్టులో షర్జిల్ సభ్యుడు. అతను పాకిస్తాన్ తరపున ఇప్పటివరకూ 25 వన్డేలు, 15 ట్వంటీ 20లు ఆడాడు. మరొకవైపు గతేడాది వరల్డ్ ట్వంటీ 20 పాల్గొన్న పాక్ జట్టులో లతిఫ్ సభ్యుడు. కేవలం ఐదు వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడిన లతిఫ్..13 ట్వంటీ 20 మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు.