Kimi Raikkonen
-
ఫార్ములా వన్‌కు రైకొనెన్ గుడ్‌బై ..
హెల్సింకీ: 2007 ప్రపంచ డ్రైవర్ చాంపియన్, ఆల్ఫా రొమెయో డ్రైవర్ కిమీ రైకొనెన్ (ఫిన్లాండ్) తన 19 ఏళ్ల ఫార్ములా వన్ (ఎఫ్1) రేసింగ్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతోన్న ఎఫ్1 సీజనే తనకు చివరిదని అతడు గురువారం ప్రకటించాడు. ఎఫ్1 చరిత్రలో అత్యధిక గ్రాండ్‌ప్రిల్లో (344) పాల్గొన్న రేసర్‌గా ఉన్నాడు. 21 గ్రాండ్‌ప్రిల్లో కిమీ రైకొనెన్ విజేతగా నిలిచాడు. చదవండి: Tokyo Paralympics 2021: ప్రవీణ్ కూమార్‌కు రజతం.. భారత్ ఖాతాలో 11 పతకాలు -
రైకోనెన్ రికార్డు
మోంజా (ఇటలీ): ఫెరారీ డ్రైవర్ కిమీ రైకోనెన్ ఫార్ములావన్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాడు. అత్యంత వేగంగా ల్యాప్‌ను పూర్తి చేసిన డ్రైవర్‌గా గుర్తింపు పొందాడు. ఇటలీ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో రైకోనెన్ ఒక నిమిషం 19.119 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. ఈ క్రమంలో 2004లో విలియమ్స్ జట్టు డ్రైవర్ మోంటాయా (1ని:19.525 సెకన్లు) నెలకొల్పిన రికార్డును రైకోనెన్ బద్దలు కొట్టాడు. ఫెరారీకే చెందిన వెటెల్ రెండో స్థానంలో నిలువగా... మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు హామిల్టన్, బొటాస్ మూడు, నాలుగు స్థానాలతో రేసును ఆరంభిస్తారు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ 8వ, 16వ స్థానాల నుంచి రేసు మొదలెడతారు. -
తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ‘పోల్’
రైకోనెన్ సంచలనం ∙నేడు మొనాకో గ్రాండ్‌ప్రి మోంటెకార్లో: ఒకటా... రెండా... ఏకంగా తొమ్మిదేళ్ల తర్వాత ఫెరారీ డ్రైవర్ కిమీ రైకోనెన్ ఫార్ములావన్‌లో ‘పోల్ పొజిషన్’ ఘనత సాధించాడు. శనివారం జరిగిన మొనాకో గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో రైకోనెన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 12.178 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. చివరిసారి రైకోనెన్ 2008లో ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రిలో పోల్ పొజిషన్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత అతను 128 రేసుల్లో పాల్గొన్నా ఏ రేసులోనూ పోల్ పొజిషన్ ఘనత సాధించలేకపోయాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు పెరెజ్ ఎనిమిదో స్థానం నుంచి, ఒకాన్ 16వ స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. -
విజేత రోస్‌బర్గ్
సాఖిర్: బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో మెర్సిడెస్ జట్టుకు చెందిన నికో రోస్‌బర్గ్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన రేసులో రోస్‌బర్గ్ 57 ల్యాప్‌లను గంటా 33 నిమిషాల 34.696 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలోనూ రోస్బర్గ్కు టైటిల్ లభించింది. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ (మెర్సిడెస్) తొలి ల్యాప్‌లోనే వెనుకబడిపోయాడు. చివరికి మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. కిమీ రైకోనెన్ (ఫెరారీ)కు రెండో స్థానం లభించింది. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు టాప్-10లో నిలువలేకపోయారు. హుల్కెన్‌బర్గ్ 15వ, పెరెజ్ 16వ స్థానాలతో సరిపెట్టుకున్నారు. సీజన్‌లోని తదుపరి రేసు చైనా గ్రాండ్‌ప్రి ఈనెల 17న జరుగుతుంది.