kodanda ram JAC chairman
-
కేసీఆర్ సర్కారు కంపుని ఎలా భరిస్తున్నారు?: రేవంత్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: కోదండరాంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బీఆర్ఎస్ నేతలను చెప్పుతో కొడతారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కోదండరాం కాంగ్రెస్ కోసం పోటీ చేయకపోతే కేఏ పాల్ బీఆర్ఎస్ కోసమే పోటీ చేయడం లేదా చెప్పాలని ఫైర్ అయ్యారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంపై మండిపడ్డారు. కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్టు బలయిందని రేవంత్ విమర్శించారు. కేసీఆర్ కుటుంబం ఆర్థిక ఉగ్రవాద కుటుంబం అని ఆరోపించారు. ఈ కుటుంబాన్ని శిక్షించడానికి కేంద్రం ముందుకు రావాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కాపడడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోందన్నారు. కాళేశ్వరంపై జాతీయ స్థాయిలో ఒక కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులో అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరగాలన్నారు. ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలని కోరారు. మేడిగడ్డ బ్యారేజ్‌కు జరిగిన డ్యామేజ్ పై చర్యలు తీసుకోవాలన్నారు. అవినీతి వాసననే పడని మోదీ కేసీఆర్ సర్కారు కంపుని ఎలా భరిస్తున్నారని రేవంత్ ప్రశ్నించారు. మోదీకి కంపు కొట్టకుండా కేసీఆర్ ఏదైనా సెంటు కొట్టి వశీకరణ చేస్తున్నారా? చెప్పాలన్నారు.ఇద్దరం ఒకటే అని కేసీఆర్,మోదీ చెప్పదలచుకున్నారా? అని నిలదీశారు. కాంగ్రెస్ మొదలు పెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారన్నారు.కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆలోచనలు మారి ఆశలు పెరిగాయన్నారు. ‘మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజుల ప్లానింగ్ వేరు,నిర్మాణం వేరుకావడం వల్లే మునిగిపోతున్నాయి.కేసీఆర్ ధనదాహానికి మేడిగడ్డ కుంగింది. కాళేశ్వరం కోసం తన మెదడును ఖర్చు చేశానని చెప్పిన కేసీఆర్ లోపాలు బయట పడగానే తప్పించుకుంటున్నారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అడిగే ప్రశ్నలకు కేసీఆర్ ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు. ఎల్ అండ్ టీ కంపెనీపై చర్యలు తీసుకోవడానికి కేసీఆర్ ఎందుకు వెనకాడుతున్నారు. కమిషన్లు నొక్కేయడానికే కేసీఆర్ ప్రణాళిక బద్దంగా ప్లాన్ వేశారు’అని రేవంత్ విమర్శించారు. -
‘చంద్రబాబు ట్రాప్‌లో కోదండరాం ఎలా పడ్డారో, అర్థం కావడం లేదు’
సాక్షి, అమరావతి: చంద్రబాబు చేసిన అక్రమాలను కోదండరాం ఎందుకు ప్రశ్నించరని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో 30 లక్షల మంది పేదలకు ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇస్తోందని, అమరావతిలో భూములిచ్చిన రైతులకు ప్యాకేజ్‌లను కూడా పెంచామన్నారు. లబ్దిదారులకు నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ పాలనను సీఎం జగన్ ప్రజలకు చేరువ చేస్తున్నారని , రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై కోదండరాం ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. దళితుల కోసం చంద్రబాబు ఏనాడైనా పనిచేశాడా అంటూ ప్రశ్నించారు. దళిత రాజధాని అనేది పచ్చి అబద్ధమని, దాని కోసం ఖరీదైన లాయర్లను టీడీపీ పెట్టిందంటే ఎలా నమ్మారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ట్రాప్‌లో కోదండరాం, హరగోపాల్ ఎలా పడ్డారో అర్ధం కావడం లేదని తెలిపారు. చంద్రబాబు తనకి అనుకూలమైన వారి భూములు గ్రీన్ జోన్ వెలుపల, అనుకూలం కాని వారి భూములు గ్రీన్ జోన్ పరిధిలో పెట్టినపుడు వాళ్లేందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు. అంబేద్కర్ పేరిట జిల్లా ఉండాల్సిందేనని మహానాడులో చంద్రబాబు తీర్మానం ఎందుకు చేయలేదని, కోనసీమలో జరిగిన విధ్వంసాన్ని చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ఎందుకు వ్యతిరేకించలేదడం లేదని ధ్వజమెత్తారు. -
తెలంగాణాలో చేనేత కార్మికులకు న్యాయం జరగలేదు : కోదండరాం
-
రైతు చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకట్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా మంగళవారం వారు చేపట్టిన ర్యాలీ సందర్భంగా మాట్లాడుతూ.. రైతు నిరసనలు కేవలం పంజాబ్ పరిసర ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాలేదని, దేశవ్యాప్తంగా రైతు సంఘాలకు మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. ఆహార భద్రతకు చిల్లు పెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలను తీసుకొచ్చిందని వారు ఆరోపించారు. నూతన వ్యవసాయ చట్టాలను రాజ్యాంగ వ్యతిరేక చట్టాలుగా అభివర్ణించారు. దేశంలో ప్రశ్నించే గొంతుకలను మోదీ సర్కారు జైల్లో పెడుతుందని, అలా చేసిన వరవరరావు సహా పదహారు మందిని జైల్లో పెట్టడం దుర్మార్గ చర్య వారు విమర్శించారు. రైతులకు మద్దతుగా నిలవకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సైతం నిరసన సెగలు తప్పవని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. తొలుత వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన కేసీఆర్.. మూడు రోజుల్లోనే మాట మార్చారని, రైతుల పట్ల ముఖ్యమంత్రికి చిత్తశుద్ధే లేదని వారు ఆరోపించారు. ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ కేంద్ర పెద్దలకు వంగివంగి దండాలు పెట్టి వచ్చారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అప్రజాస్వామికంగా కుటుంబ పాలన సాగిస్తున్న కేసీఆర్.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విపలమయ్యారని ఆరోపించారు. దేశప్రజలంతా ఏకమై తగిన శాస్తి చెబుతారు: ప్రొ. కోదండరామ్ వ్యవసాయం అంటే కంపెనీలు కాదు, వ్యవసాయం అంటే రైతులు మాత్రమే.. అలాంటిది రైతు ప్రయోజనాలు పక్కన పెట్టి, కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చాలని మోదీ సర్కారు భావిస్తే, దేశప్రజలంతా ఏకమై తగిన శాస్తి చెబుతారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ హెచ్చరించారు. చట్టాలను సామాన్య ప్రజల లబ్ధి కోసం రూపొందించాలి కానీ, కార్పొరేట్ శక్తుల కడుపు నింపడం కోసం కాదని ఆయన విమర్శించారు. సమాజంలో ఆత్మగౌరవంతో బతికేలా చూడాలని మాత్రమే రైతులు కోరుతున్నారని, అంతకు మించి వారు ఏదీ ఆశించడం లేదన్నారు. రైతు పోరాటం ఢిల్లీలోనే కాదు గల్లీలోనూ కొనసాగుతుందని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించాడు. -
మోకాళ్లపై నిరసన చేపట్టిన మహిళా కార్మికులు
సాక్షి, కరీంనగర్/మహబూబ్‌నగర్/నిజామాబాద్/ఖమ్మం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో ఆర్టీసీ జేఏసీ నేతలు, తెలంగాణ జనసమితి నేత కోదండరాం భేటీ అయ్యారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె శుక్రవారంతో ఏడో రోజుకు చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు కార్మికులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా తమ సమ్మెకు మద్దతివ్వాలని.. వివిధ రాజకీయ పార్టీల నేతలను ఆర్టీసీ జేఏసీ నాయకులు కోరారు. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్‌లో కార్మికులంతా భారీ ర్యాలీని నిర్వహించి ప్రభుత్వాసుపత్రి ఎదుట మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాన్వాయ్కి అడ్డుగా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇక జగిత్యాల జిల్లా భారతీయ మజ్ధూర్ సంఘ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ జేఏసీ, జగిత్యాల డిపో కార్మికులతో పాటు పలు విద్యార్థి సంఘాలు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగి, కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఖమ్మంలోని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యకర్తలు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా తమ పార్టీ కార్యాలయం నుంచి బస్ డిపో వరకు నిరసన తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిపో ముందు ధర్నాకు దిగారు. కాగా కరీంనగర్ జిల్లా సమ్మెలో భాగంగా డిపో 1 ముందు మహిళా ఉద్యోగులు మోకాళ్లపై నిలుచుని నిరసన చేపట్టారు. ఆర్టీసీ జేఏసీ కార్మికులంతా కలిసి కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు. రాజకీయ నాయకుల సంఘీభావం ఆర్టీసీ కార్మికుల సమ్మెకు వైఎస్సార్సీపీ నాయకులు డాక్టర్ నగేష్, అక్కెనపల్లి కుమార్‌లు సంఘీభావం తెలిపారు. నిజామాబాద్ జిల్లా అర్మూర్లో ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మైలారం బాలు డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. దీంతో పోలీసులు ఆయనను అడ్డుకుని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఇక నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తిలో అమరవీరుల స్థూపం వద్ద దీక్ష చేపట్టిన కార్మికులకు వివిధ రాజకీయ నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ర్యాలీగా వచ్చి మద్దతు తెలిపారు. అలాగే మధిర డిపో ఎదుట నిరసన చేపట్టిన ఆర్టీసీ కార్మికులకు యుటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు ర్యాలీగా వచ్చి సంఘీభావం తెలిపారు. -
నారాయణపేట – కొడంగల్‌కు నీళ్లు వచ్చేనా?
సాక్షి, కొడంగల్: పక్కనే కృష్ణమ్మ ప్రవహిస్తున్నా.. నారాయణపేట – కొడంగల్ ప్రాంతానికి మాత్రం సాగునీరు అందే పరిస్థితులు కనిపించడం లేదు. తెలంగాణ వస్తే చాలునని ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నా.. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా ఈ ఉద్యమంలో పాల్గొన్నా. కృష్ణా జలాలు పొలాలను తడుపుతాయని పూణె, బొంబాయి పోయే బాధ తప్పదని ఆశపడ్డా. నిజానికి కృష్ణానది కొడంగల్ ప్రాంతానికి పెద్ద దూరమేమీ లేదు. ఇక్కడ పడే ప్రతీ బొట్టు అక్కడే కలుస్తది. అదే కృష్ణమ్మ కర్ణాటక నుంచి నీళ్లు మోసుకొస్తది. కింద పడ్డ నీళ్లూ తక్కువే. ఆ వచ్చేటటువంటి వరదను జూరాల వద్ద నుంచే మళ్లించి కింద నారాయణపేట నుంచి ఒక్కో చెరువును నింపుకుంటూ వచ్చి మన దగ్గర ఉన్న చెరువులను నింపుకుంటే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటది. కొడంగల్ ప్రాంతమంతా దారి పొడవునా అన్ని పొలాలు బీడువారి పోయి కనిపించాయి. అందుకే ప్రజలు వలసపోయి బతుకుతున్నరు. కొడంగల్‌లో ఇళ్లన్నీ తాళాలే పడి ఉంటాయి. కొడంగల్ – నారాయణపేటలో ఏ ఊరికి వెళ్లినా అదే పరిస్థితి. కానీ ఈ నాలుగేళ్లలో నీళ్లు మాత్రం రాలేదు. వస్తయనుకున్న నీళ్లు ఆశ చూపుతున్నాయే కానీ వచ్చే అవకాశం లేదు. కేసీఆర్ మాత్రం నీళ్లు కింద జారిపోయిన తర్వాత అక్కడ కింద శ్రీశైలం నుంచి చుట్టూ తిప్పి, తిప్పి అప్పుడు కొడంగల్ ప్రాంతానికి నీళ్లు తెస్తనంటడు. సక్కగ వచ్చే వరదను వదిలిపెట్టి చుట్టూ తిప్పి తీసుకొస్తడంటే మనమేమైన నమ్ముతమా? చెవుల్లో పూలు పెట్టుకున్నమా? కింద నీళ్లు ఎక్కువ ఉంటయంట కదా అని స్థానికులను అడిగితే వరద ఎక్కడి నుంచి పోతుందో తెలియనంత అమాయకులము కాదు కదా అని అంటున్నరు. పక్కనున్న నీళ్లు రావు కానీ.. ఎక్కడెక్కడి నుంచో తిప్పి తీసుకొచ్చే నీళ్లు వస్తయా? అని అడుగుతున్నరు. చైతన్యం కలిగిన కొడంగల్ ప్రజలకు అన్యాయం జరగకూడదనే ఆలోచనతో మేము కూడా ఎన్నో ఉద్యమాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. పాలమూరు – రంగారెడ్డిని యథాతధంగా అమలు చేయాలని ఎన్నో ఆందోళనలు చేశాం. ఏ ఒక్క ఆందోళనకు ప్రభుత్వం స్పందించలేదు. దీనికంతటికీ కారణమేమిటంటే కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి ప్రాజెక్టుల డిజైన్లు మార్చిండ్రు కానీ మన బతుకులు మార్చడానికి ప్రాజెక్టులు కడతలేరని అర్థమైంది. ఇలాంటి ప్రభుత్వం ఉండడానికి వీలులేదని ఒక నిర్ణయానికి వచ్చాం. పరిపాలన చేసే నైతిక అధికారం లేనే లేదు. ఆయన ఎలాగూ నడమంత్రానే దిగిపోయిండు. మళ్లీ పిలిచి పట్టం కట్టాల్సిన అవసరం లేనే లేదు. – ప్రోఫెసర్ కోదండరాం, టీజేఎస్ అధ్యక్షుడు -
డల్లాస్‌లో 'తెలంగాణలో మారుతున్న సందర్బాలు'
డల్లాస్ : 'తెలంగాణలో మారుతున్న సందర్బాలు' అనే అంశంపై తెలంగాణ విద్యావంతుల వేదిక అమెరికాలోని డల్లాస్‌లో సమావేశాన్ని నిర్వహించనుంది. ఫిబ్రవరి 25న సాయంత్రం 4 గంటలకు మినర్వ హాలులో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం,అర్విని రాజేంద్రబాబులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో అన్ని సామాజికవర్గాలకు రాజ్యాధికారంలో సమన్యాయం ఎందుకు దక్కటం లేదనే అంశంపైన చర్చ ఉంటుందని తెలంగాణ విద్యావంతుల వేదిక సభ్యులు డా. కిరణ్ దాసరి, డా. మహ్మద్ జమీల్, రాయదాస్, సాజీ గోపాల్ తెలిపారు. ప్రజాస్వామిక హక్కులతో రాజ్యాంగపాలన సాగుతున్నదా? తెరాస పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో చేసిన వాగ్దానాలను ఎంతవరకు నెరవేర్చింది అనే కోణంలో చర్చ కొనసాగనుందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సంవత్సరాలు గడిచినా రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదన్నారు. దళిత, ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వం రక్షణ కలిగిస్తున్నదా? తెలంగాణ యువతకు కొలువులు, పరిశ్రమలు ఏర్పాటు చేయటంలో సర్కారు ఎంత వరకు సఫలమైంది అనే విషయాలపై తెలంగాణ విద్యావంతుల వేదిక చర్చించనుందని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ప్రజా సమస్యలు పరిష్కారం కాని నేపథ్యంలో, ప్రజల ఆకాంక్షలు సాకారం కాని సందర్భంలో, ప్రజల ముందు ఉన్న ప్రత్యామ్నాయాలు ఏమిటి, ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసి ప్రశ్నించవలసిన బలమైన ప్రతిపక్షం లేని తెలంగాణలో ప్రజలు ఏం చేయాలో చర్చించాల్సిన అవసరం ఉందని తెలంగాణ విద్యావంతుల వేదిక తెలిపింది. తెలంగాణ బాపు జయశంకర్, కాళోజి నారాయణరావు, బియ్యాల జనార్ధనరావు కలలుగన్న ప్రజాతెలంగాణ, పౌరహక్కులు, ప్రజాస్వామిక అభివృద్ది, రాజ్యాధికారంలో దళిత, బహుజన, ముస్లింలకు సమభాగంతో దక్కే ప్రజాతెలంగాణ, రైతు, రైతులకూలీలు, విద్యార్ధుల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రజాతెలంగాణకు భవిష్యత్తు కార్యాచరణపై చర్చిద్దామంది. తెలంగాణ విద్యావంతుల వేదిక ఉత్తర అమెరికా సభకు డల్లాస్‌లోని తెలంగాణ ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక కోరింది. -
చంచల్‌గూడ జైలుకు కోదండరామ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరామ్ గురువారం చంచల్‌గూడ జైలుకు వెళ్ళారు. జైలులో ఉన్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను కోదండరామ్ కలిశారు. ట్యాంకుబండ్ వద్ద ధర్నాకు ఉపక్రమించారన్న కారణంతో మంద కృష్ణమాదిగను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను కోదండరామ్ పరామర్శించారు. -
టీఆర్ఎస్పై కోదండరాం ఫైర్
-
టీఆర్ఎస్పై కోదండరాం ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం క్రమంగా బలహీనపడుతోందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటంతో ప్రజలకు ఆ పార్టీపై నమ్మకం పోతోందని చెప్పారు. అమరుల స్పూర్తి యాత్ర కోసం పదిరోజుల క్రితమే అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేసినప్పటికీ పోలీసులు ఆఖరి నిమిషంలో జేఏసీ నేతల అరెస్టులకు పాల్పడ్డారన్నారు. అనుమతి కోసం వెళితే అరెస్టులు చేస్తారా అని మండిపడ్డారు. ప్రభుత్వం చేతగానితనం వల్లే శనివారం నాలుగు వందల మంది జేఏసీ నేతలు, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేసిందన్నారు. ఆరో విడత అమరుల స్పూర్తి యాత్ర సందర్భంగా జేఏసీ నేతలను పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఆదివారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. పోలీసుల అక్రమ అరెస్టుల నేపథ్యంలో జేఏసీ సంకల్పం మరింత బలపడిందని కోదండరామ్ స్పష్టం చేశారు. జేఏసీ నేతల అరెస్టులో ప్రభుత్వ తీరును ప్రతిపక్ష పార్టీలన్నిటికీ వివరిస్తామన్నారు. అదేవిధంగా గవర్నర్, రాష్ట్రపతికి సైతంఇక్కడి పరిస్థితిపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అంతేకాకుండా న్యాయపోరాటానికి సిద్దంగా ఉన్నామన్నారు. లైంగికదాడులు, దొమ్మీలవంటి నేరాలకు వర్తింపజేసే సెక్షన్ 151 కింద జేఏసీ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వీటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తనను కలవడానికి వచ్చిన కాంగ్రెస్ నేత వీహెచ్‌ను సైతం అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. -
తెలంగాణ ద్రోహి తుమ్మల
♦ మేం తెలంగాణ రాష్ట్రమిచ్చాం.. ♦ పాలేరులో మాకు మద్దతివ్వండి ♦ జేఏసీ చైర్మన్ కోదండరాంకు ♦ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ లేఖ సాక్షి, హైదరాబాద్: తెలంగాణకోసం ప్రజల్లోనూ, పార్లమెంటులోనూ పోరాడిన కాంగ్రెస్ పార్టీకి పాలేరు ఉప ఎన్నికలో మద్దతివ్వాల్సిందిగా జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాంను పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం ఆయనకు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటులో బిల్లును ఆమోదింపజేసిన కాంగ్రెస్‌కు అండగాఉండాలని విజ్ఞప్తి చేశారు. ‘‘ఉద్యమ సమయంలోనూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా టీడీపీలోనే ఉన్న తెలంగాణ ఉద్యమ ద్రోహి తుమ్మల నాగేశ్వరరావు. అన్ని ఉద్యమ సందర్భాల్లోనూ కరుడుగట్టిన తెలంగాణవ్యతిరేకిగా ఉన్న తుమ్మలకు మద్దతిస్తే తెలంగాణ కోసం బలిదానాలు చేసినవారి ఆత్మలు ఘోషిస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్... తుమ్మలను మంత్రివర్గంలో చేర్చుకోవడం ద్వారా ఉద్యమకారుల మనోభావాలను గాయపరిచింది’’ అంటూ లేఖలో ఉత్తమ్ మండిపడ్డారు. కాంగ్రెస్ మాత్రం తెలంగాణ కోసం జరిగిన అన్ని ఉద్యమ సందర్భాల్లోనూ భాగస్వామిగా ఉందన్నారు. తెలంగాణ కోసం పోరాడటమే గాక జీవితాంతం అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పని చేసిన దివంగత రాంరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబసభ్యులను పోటీలోకి దించుతున్న కాంగ్రెస్‌కే మద్దతివ్వాలని కోరారు.