kotha gudem
-
తుమ్మ ముండ్ల తుమ్మల కావాల్నా..పువ్వాడ కావాల్నా: ఖమ్మంలో కేసీఆర్
సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో తుమ్మముండ్ల తుమ్మల కావాల్నా.. పువ్వుల్లో పెట్టి చూసుకునే పువ్వాడ కావాల్నా తేల్చుకోవాలని అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘తుమ్మలకు నేను మంత్రి పదవి ఇస్తే నాకే ఆయన మంత్రి పదవి ఇచ్చానని చెప్పుకుంటున్నాడు. ఇంత అరాచకంగా మాట్లాడతారా.. ఎవరు ఎవరికి మంత్రి పదవి ఇచ్చారో మీరే చూశారు. ఇక ఇంకొక అర్బకుడైతే ఖమ్మం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనివ్వనంటున్నాడు. అయనేమైనా ఖమ్మం ప్రజలను కొనేశాడా..ఖమ్మాన్ని గుత్తా పట్టాడా. ఖమ్మానికి పట్టిన ఆ ఇద్దరి పీడను వదిలించాం’ అని కేసీఆర్ అన్నారు. ‘ఖమ్మం చాలా చైతన్యవంతమైన ప్రాంతం. ఒకప్పుడు ఖమ్మం అంటే ఇరుకు సందులు, మురికి కాలువలు, ఇరుకు రోడ్లు, ట్రాఫిక్ కష్టాలు, యాక్సిడెంట్లు. ఇప్పుడు మంచి రోడ్లు, దగ దగలాడే సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీలు వచ్చాయి. ఒకనాటి లకారం చెరువు అంటే వికారం, ఇప్పుడు లకారం అంటే సుందరమైన చెరువు’అని కేసీఆర్ వివరించారు. కాంగ్రెస్ వల్లే సింగరేణిలో వాటా కేంద్రానికి పోయింది.. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దని, ప్రతిపక్షాల మోసపూరిత మాటలు నమ్మొద్దని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం కొత్తగూడెంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ వల్లే సింగరేణిలో 49 శాతం వాటా కేంద్రానికి వెళ్లిందని విమర్శించారు. ప్రజల చేతిలో ఓటు వజ్రాయుధం అని చెప్పారు. ఎన్నికల్లో అభ్యర్థి వెనుక ఏ పార్టీ ఉన్నదో ఆ పార్టీ వైఖరి, చరిత్ర, నడవడిక చూసి ఓటు వేయాలని ప్రజలను కేసీఆర్ కోరారు. కాంగ్రెస్ పాలనలో సింగరేణి నష్టాల్లో ఉండేదన్నారు. తెలంగాణ వచ్చాక సింగరేణి లాభాల బాట పట్టిందన్నారు. సింగరేణి తెలంగాణ ఆస్తి అని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే కొత్తగూడెం జిల్లాకు కరువనేదే రాదన్నారు. వనమా వెంకటేశ్వర్రావు ఎప్పుడు తన దగ్గరకు వచ్చినా వ్యక్తిగత పనులు అడగలేదని కేసీఆర్ చెప్పారు. కొత్తగూడెం అభివృద్ధి గురించి మాత్రమే అడిగారని తెలిపారు. వనమాను చూసి కాకుండా కేసీఆర్‌ను చూసి వనమాకు ఓటు వేయండని కోరారు. -
రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ కేసులో వనమా రాఘవేంద్ర అరెస్ట్..
-
సింగరేణికి సోలార్ సొబగులు
సాక్షి, హైదరాబాద్: ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉన్న సింగరేణికి చెందిన భూములిప్పుడు సౌరకాంతులు విరజిమ్మనున్నాయి. సింగరేణి వ్యాప్తంగా మూసేసిన భూగర్భ గనులు, ఓపెన్ కాస్టులు, నిరుపయోగంగా ఉన్న భూముల్లో ఆ సంస్థ సోలార్ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. దీంతో 1,500 ఎకరాల భూమి వినియోగంలోకి రానుంది. విద్యుత్ అవసరాల కోసం సంస్థ ఏటా రూ.486 కోట్లు ఖర్చు చేస్తోంది. 300 మెగావాట్ల సౌర విద్యుత్ వినియోగంలోకి వస్తే ఏటా రూ.300 కోట్ల భారం తగ్గనుంది. 25 ఏళ్ల జీవిత కాలంతో నిర్మిస్తున్న ఈ ప్లాంట్లకు మొత్తం రూ.1,399 కోట్ల పెట్టుబడి అవుతోంది. అయితే.. ఏటా రూ.300 కోట్ల ఆర్జనతో మొదటి ఐదేళ్లలోనే ఈ పెట్టుబడి తిరిగి రానుంది. మొదటి దశ బీహెచ్ఈఎల్ నిర్మాణ పనులు చేస్తుండగా.. మిగతా రెండు దశల ప్లాంట్ల నిర్మాణం అదాని సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంది. వచ్చే 25 ఏళ్లు ఈ సంస్థలే ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలు చూడనున్నాయి. సింగరేణి సౌర్యం సౌర విద్యుత్ ఉత్పాదనలో కొత్తపుంతలు తొక్కుతున్న ‘సింగరేణి’.. వచ్చే రెండేళ్లలో మూడు దశల్లో 300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా పనులు ముమ్మరం చేసింది. రెండేళ్ల క్రితం మొదలైన ఈ పనుల్లో ఈ ఏడాది కరోనాతో జాప్యం జరగగా.. మళ్లీ పనులు పుంజుకున్నాయి. మొదటి దశలో మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ)లోని 50 ఎకరాల్లో 10 మెగావాట్లు, మణుగూరులో 150 ఎకరాల్లో 30 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. మొదటి దశలో చాలాచోట్ల పనులు పూర్తయి ఉత్పత్తికి సిద్ధంగా ఉండగా.. రెండు, మూడో దశ పనులు కొనసాగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పరిధిలో జేకే–5 ఓపెన్ కాస్ట్ పరిసరాల్లో 230 ఎకరాల్లో 39 మెగావాట్లకు గాను 15 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. మరో 24 మెగావాట్లు ఈ నెలాఖరులో పూర్తి కానుంది. ప్రాజెక్టులపై 500 మెగావాట్లు ఈ మూడు దశలు విజయవంతమైతే సాగునీటి ప్రాజెక్టుల్లో నీటిపై తేలియాడే (ఫ్లోటింగ్ సోలార్) ఫలకాలతో 500 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలని సింగరేణి సంస్థ ప్రణాళిక రూపొందించింది. గోదావరి, అనుబంధ నదులపై భారీ ప్రాజెక్టులు, రిజర్వాయర్లపై సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే ఆలోచనలున్నాయి. ప్రయోగాత్మకంగా మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని థర్మల్ పవర్ ప్లాంట్‌లో మూడు టీఎంసీల సామర్థ్యం ఉన్న రెండు రిజర్వాయర్లపై 10 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి పనులు మొదలయ్యాయి. వీటితో పాటు ఓసీపీల్లో నీటి ఉపరితలాల పైనా తేలియాడే సౌర ఫలకాలు బిగించి సౌర విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. -
‘ఆమె’ స్థానం అంతంతే !
సాక్షి, కొత్తగూడెం: ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మహిళా శాసనసభ్యుల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. గతంలో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటివరకు ముగ్గురు మహిళలకు మాత్రమే అసెంబ్లీలో తమ వాణి వినిపించే అవకాశం దక్కింది. తాజాగా నాలుగో మహిళగా ఇల్లెందు నుంచి ఎన్నికైన బాణోత్ హరిప్రియ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ప్రస్తుత శాసనసభలో ఉమ్మడి జిల్లా నుంచి ఆమె ఒక్కరే మహిళా ఎమ్మెల్యే కావడం గమనార్హం. 1972లో మధిర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున దుగ్గినేని వెంకట్రావమ్మ ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. అనంతరం కాలంలో వివిధ పార్టీల నుంచి చాలా స్వల్ప సంఖ్యలో మహిళా అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ ఎన్నిక కాలేదు. సుదీర్ఘ కాలం తర్వాత 2009లో ఒకేసారి ఇద్దరు మహిళలు శాసనసభకు ఎన్నికయ్యారు. వైరా నియోజకవర్గంగా ఆవిర్భవించిన తొలిసారే సీపీఐ తరఫున బాణోత్ చంద్రావతి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే ఎన్నికల్లో భద్రాచలం నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన సత్యవతి గెలుపొందారు. సీపీఎంకు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చరిష్మాతో కుంజా సత్యవతి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మహిళలెవరూ ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాలేదు. ఇక ప్రస్తుత ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి బరిలో నిలిచిన మహిళా అభ్యర్థుల సంఖ్య కొంత పెరిగినప్పటికీ.. ఇల్లెందు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున బాణోత్ హరిప్రియ ఒక్కరే విజయం సాధించారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు నలుగురు మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగా, అందులో ముగ్గురు గిరిజనులే కావడం విశేషం. వీరిలో సత్యవతి ఆదివాసీ వర్గానికి చెందిన మహిళ కాగా, చంద్రావతి, హరిప్రియ బంజారా తెగకు చెందిన వారు. ఎనిమిది మందిలో ఒకరికే చాన్స్.. ప్రస్తుత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా నుంచి ప్రధాన పార్టీల తరఫున ఎనిమిదిమంది మహిళలు బరి లో నిలిచారు. వీరిలో ఇల్లెందు నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన ఒక్క హరి ప్రియ మాత్రమే గెలుపొందారు. పాలేరు నియోజకవర్గంలో సీపీఎం నుంచి బత్తుల హైమావతి, వైరా నియోజకవర్గం నుంచి ప్రజాకూటమి(సీపీఐ) అభ్యర్థిగా బాణోత్ విజయాబాయి, బీజేపీ అభ్యర్థిగా రేష్మారాథోడ్, ఇల్లెందు నుంచి బీజేపీ అభ్యర్థిగా మోకాళ్ల నాగస్రవంతి, భద్రాచలం బీజేపీ అభ్యర్థిగా కుంజా సత్యవతి, ఖమ్మం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఉప్పల శారద, సత్తుపల్లి నుంచి బీఎల్ఎఫ్ అభ్యర్థిగా మాచర్ల భారతి పోటీ పడినప్పటికీ.. వారు విజయం సాధించలేకపోయారు. ఈ ఎనిమిది మందిలో నలుగురు బీజేపీకి చెందిన వారే కావడం గమనార్హం. టీఆర్ఎస్ నుంచి మహిళలే లేరు.. అధికార టీఆర్ఎస్ నాలుగు నియోజకవర్గాల నుంచి సిట్టింగ్‌లకు టికెట్లు కేటాయించడంతో పాటు భద్రాచలం స్థానాన్ని సైతం తెల్లం వెంకట్రావుకు కేటాయించింది. దీంతో ఆ పార్టీ నుంచి మహిళా అభ్యర్థులకు పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. పినపాక నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పాయం వెంకటేశ్వర్లు సతీమణి పాయం ప్రమీల పేరు వినిపించినప్పటికీ, చివరకు వెంకటేశ్వర్లునే టికెట్ వరించింది. గతంలో ఇలా.. గతంలో జరిగిన వివిధ ఎన్నికల్లో పాలేరు నుంచి మద్దినేని బేబీ స్వర్ణకుమారి, కొత్తగూడెం నుంచి అయాచితం నాగవాణి, భద్రాచలం నుంచి కొమురం ఫణీశ్వరమ్మ టీడీపీ తరఫున పోటీచేసినప్పటికీ ఓటమి చెందారు. అలాగే ఇల్లెందు నుంచి టీడీపీ తరఫున కల్పనాబాయి ఓటమి పాలయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన బాణోత్ హరిప్రియ సైతం గెలుపు ముంగిట వరకు వచ్చి ఓటమి చెందారు. ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె విజయం సాధించారు. భద్రాచలం నుంచి 2009లో సత్యవతి గెలుపొందగా, ఆ ఎన్నికల్లో ఇల్లెందు, కొత్తగూడెం, భద్రాచలం నుంచి పోటీ చేసిన మరో నలుగురు మహిళా అభ్యర్థులు ఓటమి చెందారు. -
ఇక మిగిలింది 8 రోజులే..
సాక్షి, కొత్తగూడెం: డిసెంబర్ 7న జరుగనున్న శాసనసభ ఎన్నికల ప్రచారానికి ఇక ఎనిమిది రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. దీంతో అభ్యర్థులు తమ ప్రచార వేగాన్ని మరింతగా పెంచారు. ప్రతి నిమిషాన్ని పక్కాగా ఉపయోగించుకునేందుకు బూత్‌ల వారీగా ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు వెళుతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పటికే గత 80 రోజులుగా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆయా నియోజకవర్గాల్లో దాదాపు మూడు విడతలుగా ప్రచారం చేశారు. ప్రజా కూటమి అభ్యర్థుల జాబితా నామినేషన్ల దాఖలుకు చివరి రోజయిన ఈనెల 19 వరకు కూడా పూర్తిస్థాయిలో విడుదల కాలేదు. దీంతో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ తర్వాత ఆయా అభ్యర్థుల ప్రచారానికి 13 రోజుల సమయం మాత్రమే ఉండడంతో వారు ప్రతి నిమిషం పకడ్బందీగా ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉన్న సమయంలోనే వారు మిగిలిన మూడు పార్టీలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతూ, స్టార్ క్యాంపెయినర్లతో సభలు ఏర్పాటుచేస్తున్నారు. భద్రాచలం నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు ప్రచారం తుదిదశకు చేరుకోగా, కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్యకు మాత్రం ఉరుకులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ములుగు మాజీ ఎమ్మెల్యే అయిన వీరయ్య.. మళ్లీ ఆ టికెట్ కోసమే ప్రయత్నించగా చివరి నిముషంలో పార్టీ అధిష్టానం భద్రాచలం స్థానాన్ని కేటాయించింది. అయితే ఆయనకు ఈ నియోజకవర్గం పూర్తిగా కొత్త కావడంతో ప్రచారం కత్తిమీద సాములా మారింది. ప్రతిరోజూ 20కి పైగా బూత్‌లు తిరగాల్సి వస్తోంది. కాంగ్రెస్ నుంచి ఒక పినపాక అభ్యర్థి రేగా కాంతారావు మాత్రమే తనకు టికెట్ ఖాయమనే నమ్మకంతో మొదటి నుంచి ప్రచారం చేసుకున్నారు. ఇల్లెందులో హరిప్రియ, కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు తుదివరకు గట్టి పోటీని ఎదుర్కొని అనేక ప్రయత్నాలు చేసి టికెట్ సాధించారు. దీంతో వారిద్దరు కూడా ప్రచారంలో ఉరుకులు పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. అశ్వారావుపేట సీటు కోసం కాంగ్రెస్ నాయకులు గట్టి ప్రయత్నాలు చేయగా ఆ స్థానాన్ని చివరికి టీడీపీ దక్కించుకుంది. దీంతో ఇక్కడి టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించిన వారిని ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం.. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయా అభ్యర్థులు స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం చేయించుకునేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. జిల్లాలో బీజేపీ అభ్యర్థుల తరఫున ఇప్పటికే స్వామి పరిపూర్ణానంద భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరులో ప్రచారం చేశారు. భద్రాచలంలో సీపీఎం అభ్యర్థి మిడియం బూబురావును గెలిపించాలంటూ ఆ పార్టీ జాతీయ నాయకురాలు బృందాకారత్ ప్రచారం చేశారు. ఇక ఈనెల 30న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరులో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏర్పాటు చేసిన సభలకు హాజరు కానున్నారు. కేసీఆర్ పర్యటన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. అశ్వారావుపేటలో ఇంతకుముందే కేటీఆర్ ప్రచార సభ నిర్వహించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థులు తమ స్టార్ క్యాంపెయినర్ రేవంత్‌రెడ్డిని జిల్లాకు రప్పిస్తున్నారు. వచ్చేనెల 1న రేవంత్‌రెడ్డి ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం సభల్లో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఈ నెల 30న సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాయల, చంద్రన్న వర్గాలు ఇల్లెందులో సభలు నిర్వహించనున్నాయి. ఆ రెండు పార్టీలకు సంబంధించి కేంద్ర కమిటీ నేతలు సభల్లో పాల్గొననున్నారు. ఇక కాంగ్రెస్ కూటమికి సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీజేఎస్ అధినేత కోదండరాం, టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, గద్దర్, మందకృష్ణ మాదిగ ప్రచారం కోసం జిల్లాకు రానున్నట్లు కూటమి నాయకులు చెబుతున్నారు. దీంతో అన్ని పార్టీల అభ్యర్థుల ప్రచారం హోరెత్తనుంది. -
భద్రాద్రి,కొత్తగూడెంలలో స్వల్ప భూకంపం
-
అగ్నిప్రమాదం..8 బైక్‌లు దగ్ధం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : రామవరంలోని ఓ బైక్ మెకానిక్ దుకాణంలో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 బైక్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మున్సిపల్ సిబ్బంది చెత్తను తగలపెట్టడంతో, ఆ అగ్గి రవ్వలు వచ్చి దుకాణంలో ఉన్న బైకులకు తగులుకోవడంతో ఈ అగ్ని ప్రమాదం జరిగిందంటూ దుకాణం యజమాని, మెకానిక్ సాయి రామవరం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తొలి రోజు 6
మునిసిపల్ ఎన్నికల నామినేషన్లు షురూ ఇల్లెందులో మూడు, సత్తుపల్లిలో రెండు, కొత్తగూడెంలో ఒకటి దాఖలు మధిర నగర పంచాయతీలో బోణీ లేదు 12న ముహూర్తం పెట్టుకున్న అభ్యర్థులు! పబ్లిక్ నోటీస్ విడుదల సాక్షి, ఖమ్మం: మునిసిపల్ నామినేన్లకు తొలిరోజు స్పందన కరువైంది. పొత్తులు ఖరారుకాకపోవడం, పన్ను బకాయిల చెల్లింపు పూర్తికాకపోవడం తదితర కారణాలతో పలువురు అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేసేందుకు వెనుకాడారు. సోమవారం నుంచి మొదలైన నామినేషన్ల ఘట్టం 14వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే యోచనలో ఉన్నారు. ఈలోగా పన్నుల చెల్లింపు, పొత్తులు ఖరారవుతాయనే ఆశాభావంతో వారు ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగుచోట్ల ఆరు దాఖలు.. జిల్లాలో ఎన్నికలు జరిగే నాలుగు మునిసిపాలిటీల్లో కలిపి తొలిరోజు ఆరు నామినేషన్లు దాఖలు అయ్యాయి. అత్యధికంగా ఇల్లెందులో మూడు నామినేషన్లు వేశారు. ఈ మూడు కూడా సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గం నుంచే దాఖలయ్యాయి. సత్తుపల్లిలో రెండు, కొత్తగూడెంలో ఒక నామినేషన్ దాఖలు అయింది. మధిరలో ఒక నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఇల్లెందులో 1, 7, 11 వార్డుకు అభ్యర్థులు నామినేషన్ వేశారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో 1వ వార్డుకు టీడీపీ అభ్యర్థి కొదురుపాక రాజేంద్రప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. సత్తుపల్లి నగరపంచాయతీలో 20 వార్డులకు గాను 9, 10 వార్డులకు టీడీపీ అభ్యర్థులు కందిమళ్ల నాగేశ్వరమ్మ, షేక్ అబ్దుల్ఫ్రీ నామినేషన్ వేశారు. మధిర నగరపంచాయతీలో 20 వార్డులుండగా ఒక వార్డుకు కూడా నామినేషన్ దాఖలు కాలేదు. పొత్తులు తేలక హైరానా.. ప్రధాన ఎన్నికలన్నీ ఒకేసారి రావడంతో పార్టీల నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈనేపథ్యంలో తొలి విడతగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలపై స్థానికంగా ఇంకా పొత్తులు కొలిక్కిరాలేదు. పార్టీల తరఫున బరిలో నిలవాలనుకుంటున్న అభ్యర్థులు పొత్తులతో తమకు అవకాశం వస్తుందో లేదోనని హైరానా పడుతున్నారు. నాలుగు మున్సిపాలిటీల్లో పొత్తుల విషయమై అధికారికంగా ఏపార్టీ ప్రకటన చేయలేదు. అన్ని పార్టీల నేతలు చర్చలతోనే సరిపెడుతుండటం, ఏపార్టీ తమ అభ్యర్థులు వీరే అని ప్రకటించని పరిస్థితి నెలకొంది. నామినేషన్లకు ఇంకా నాలుగు రోజులే ఉండటం..బుధవారం మంచి ముహూర్తం ఉండటంతో ఈలోగా పొత్తులు ఖరారు కావాలని అభ్యర్థులు ఆశిస్తున్నారు. అవసరమైతే కొందరు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి ఉపసంహరణ నాటికి పార్టీ అభ్యర్థిగా ముద్రవేయించుకోవాలని కూడా భావిస్తున్నారు. మరికొందరు పార్టీ అభ్యర్థిగా నిర్ధారణ అయ్యాకే మందీమార్బలంతో వచ్చి నామినేషన్ దాఖలు చేయాలని అనుకుంటున్నారు. బరికి బకాయిల గోల.. మునిసిపల్ బరిలో నిలవాలనుకునే అభ్యర్థులకు బకాయిల గోల పట్టుకుంది. అభ్యర్థిగా పోటీ చేయాలంటే తప్పని సరిగా ఇంటి, నీటి పన్ను బకాయిలు చెల్లించాల్సిందే. గతంలో బరిలో నిలిచిన అభ్యర్థులు రూ.వేలల్లో పన్నులు చెల్లించి తమ అదృష్టాన్ని పరీక్షించుకుటున్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. పార్టీల తరఫున పోటీలో ఉండాలనుకుంటున్న అభ్యర్థులు రూ.వేలల్లో మున్సిపాలిటీలు, నగరక పంచాయతీలుకు బకాయిలు ఉన్నారు. తమకున్న పలుకుబడితో పన్నులు చెల్లించకుండా నెట్టుకొచ్చారు. ప్రస్తుతం ఎన్నికల నిబంధన వారికి కొరకరాని కొయ్యగా మారింది. బకాయిలు చెల్లించిన వారే బరిలో నిలవాలని ఎన్నికల నిబంధనల్లో స్పష్టంగా ఉంది. సందుట్లో సడేమియా లాగా సంబంధిత అధికారులు పన్నుల వసూళ్లకే ప్రత్యేకంగా నామినేషన్ కేంద్రాల్లో కౌంటర్లు తెరిచారు. ఇల్లెందు, కొత్తగూడెం మునిసిపాలిటీలు, సత్తుపల్లి, మధిర నగర పంచాయతీల్లో ఈవిధంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. బకాయిల గోలతో కొంత మంది పోటీకి వెనక్కు తగ్గుతుంటే మరికొంత మంది గెలవడమే ధ్యేయంగా పన్ను చెల్లించడానికి ముందుకొస్తున్నారు. -
బొగ్గు దొంగతనంపై విచారణ పూర్తి
కొత్తగూడెం(ఖమ్మం), న్యూస్‌లైన్ : సింగరేణి బెల్లంపల్లి ఏరియాలో ఇటీవల చోటుచేసుకున్న బొగ్గు దొంగతనం కేసును విజిలెన్స్ విభాగం పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిందని ఆ సంస్థ డెరైక్టర్ ‘పా’ టి.విజయ్‌కుమార్ తెలిపారు. స్థానిక సింగరేణి ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియా నుంచి 18 ట్రక్కుల ద్వారా బొగ్గు అక్రమంగా రవాణా జరిగిందని చెప్పారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి వాయునందన్ సిమెంట్ ఫ్యాక్టరీ, కరీంనగర్ జిల్లాలోని మహదేవ్‌పూర్‌లోని ఓరియంట్ సిమెంట్ కంపెనీకి బొగ్గు సరఫరా చేసే లారీలను అక్రమరవాణకు ఉపయోగించారని తెలిపారు. సాధారణంగా సీహెచ్పీలోకి బొగ్గు లారీలు వచ్చేటప్పు డు లారీ నంబర్‌ను మూవ్మెంట్ కార్డులో నమోదు చేసుకోవాలని, అనంతరం ఖాళీ లారీ వేబ్రిడ్జికి వెళ్లిన తర్వాత లోడింగ్ జరుగుతుందన్నారు. లోడింగ్ తర్వాత వే బ్రిడ్జి మీదకు లారీ వస్తేనే ఆయా కంపెనీలకు సరఫరా అయినట్లు నమోదవుతుందని వివరించారు. అయితే రోజులో నాలుగు ట్రిప్పులు సక్రమంగా వేసే డ్రైవర్లు ఐదో ట్రి ప్పులో లోడింగ్ అనంతరం వే బ్రిడ్జిపైకి రాకుండా బొగ్గు అక్రమ రవాణకు పాల్పడ్డారని తెలిపారు. సీఐఎస్ఎఫ్కు చెందిన చెక్‌పోస్టు సిబ్బంది ఔట్ పోస్టు దగ్గర బొగ్గు లారీలను క్షుణ్ణంగా తనిఖీ చేయకపోవడంతోనే అక్రమ రవాణా జరిగిందన్నారు. బెల్లంపల్లి ఏరియాలో మొత్తం 18 లారీల ద్వారా 19,900 టన్నుల బొగ్గు అక్రమ రవాణా జరిగినట్లు విజిలెన్స్ విచారణలో వెల్లడైందన్నారు. బొగ్గు రవాణాకు సహకరించిన సిమెంట్ కంపెనీలకు ప్రస్తుతం బొగ్గు సరఫరా నిలిపివేశామన్నారు. అక్రమాలకు పాల్పడినందుకు ఓరియెంటల్ సిమెంట్ కంపెనీ నుంచి రూ.4.36 కోట్లు, వాయునందన్ సిమెంట్ కంపెనీ నుంచి రూ.90 లక్షలు రికవరీ చేసినట్లు ఆయన వివరించారు. అలాగే విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎనిమిది మంది సెక్యూరిటీ సిబ్బందికి చార్జ్షీట్లు జారీ చేసిన ట్లు చెప్పారు. సింగరేణిలో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ఉండేందుకు మూవ్మెంట్ కార్డు నమోదులో కొన్ని మార్పులు చేసినట్లు తెలిపారు. కోల్ ట్రాన్స్పోర్టర్లు జీపీఎస్ ఉండే వాహనాలనే అనుమతించడం వల్ల డ్రైవర్లు చేసే ఇలాంటి పనులకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. విలేకరుల సమావేశంలో సెక్యూరిటీ జీఎం శివరామిరెడ్డి, డీజీఎం నాగేశ్వర్రావు, జీఎం (పర్సనల్) కేబీఎస్.సాగర్ పాల్గొన్నారు. -
లక్ష్యం కోసం...
సాక్షి, కొత్తగూడెం: దేశ రక్షణకు మేము సైతం అంటూ... సుదూర ప్రాంతాల నుంచి ఆర్మీర్యాలీకి తరలి వచ్చిన యువకులు తొలిరోజు ఎంపికలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కొత్తగూడెంలో జరుగుతున్న తెలంగాణ జిల్లాల స్థాయి ఆర్మీరిక్రూట్మెంట్ ర్యాలీలో ఎంపికల పర్వం శనివారం ప్రారంభం కాగా, తెల్లవారుజామున 2 గంటల నుంచే ప్రకాశం స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ యువసంద్రంగా మారాయి. టోకెన్లు తీసుకునేందుకు అభ్యర్థులు చలిలో బారులుతీరి నిల్చున్నారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా తొలిరోజు సోల్జర్ టెక్నికల్ పోస్టులకు సంబంధించి అంతా ప్రశాంతంగా జరుగగా మెడికల్ టెస్ట్‌కు 561 మంది అర్హత సాధించారు. సోల్జర్ టెక్నికల్ పోస్టులకు పదిజిల్లాల నుంచి యువత వెల్లువలా తరలివచ్చారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా ముందుగా నిర్వహించిన ఎత్తు కొలతకు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఆర్టీఏ కార్యాలయం వరకు భారీగా క్యూ కట్టారు. 2 గంటలకు క్యూలో నిల్చుంటే అభ్యర్థులకు తెల్లవారుజామున 3 గంటలకు టోకెన్లు ఇవ్వడం ప్రారంభించారు. ఎత్తు కొలతలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 4.30 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. ఇందులో అర్హత సాధించి న వారిని పరుగుపందెం కోసం ప్రకాశం స్టేడియానికి తరలించారు. ఇలా తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు ప్రకాశం స్టేడియంలో బరువు, ఛాతి, పరుగుపందెం, పుల్ అప్స్, లాంగ్‌జంప్, బ్యాలెన్సింగ్ బీమ్ పరీక్షలు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిపి అభ్యర్థుల వివరాలను ఆన్లైన్లో పొందుపరిచారు. పరుగుపందెంలో అర్హత సాధించిన వారికి స్టేడియంలోనే అల్పాహారం అందచేశారు. అయితే 17నుంచి ఎంపిక లు ప్రారంభమవుతాయని తొలుత ప్రచారం చేయడంతో వేలాదిమంది గురువారం రాత్రే తరలివచ్చారు. షెడ్యూల్లో భాగంగా సోల్జర్ టెక్నికల్ పోస్టులకు శనివారం ఎంపిక ప్రక్రియ కొనసాగడంతో అభ్యర్థులు వసతులు లేక ఇబ్బంది పడ్డారు. 8.30గంటలకే మూతపడిన టోకెన్ కౌంటర్.. చాలామంది అభ్యర్థులు తెల్లవారుజాము నుంచే టోకెన్ల కోసం క్యూలో నిల్చున్నా... చివరకు టోకెన్లు అందలేదు. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 8.30 గంటల వరకు టోకెన్లు ఇచ్చి ఆ తరువాత కౌంటర్లు మూసివేశారు. దీంతో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థులకు టోకెన్లు అందక నిరాశతో వెనుతిరిగారు. సుదూర ప్రాంతం నుంచి వచ్చామని, టోకెన్లు ఇవ్వాలని అభ్యర్థులు ప్రాధేయపడినా ఆర్మీ అధికారులు మాత్రం కనికరించలేదు. మిగిలిన పోస్టులకోసం ఎక్కువ మంది వస్తే టోకెన్లు ఇచ్చే సమయం పెంచాలని ఆర్మీ, పోలీస్ అధికారులు చర్చించుకున్నారు. టోకెన్లు ఇచ్చిన తరువాత కూడా ఎత్తు కొలతలకు గంటన్నరపాటు విరామం ఇవ్వడంతో అభ్యర్థులు క్యూలైన్లలోనే కునికిపాట్లు పడ్డారు. టోకెన్లు ఇచ్చిన వెంటనే అన్ని అంశాలు నిర్వహిస్తే నెగ్గుకొచ్చేవారమని, ఆలస్యం వల్ల నీరసించి అర్హత సాధించలేకపోయామని కొంతమంది అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం మైదానానికి యువకళ.. పరుగుపందేనికి వచ్చినవారు, పరుగుపందెంలో వివిధ గడువుల్లో వచ్చిన అభ్యర్థులు, పుల్ అప్స్, లాంగ్‌జంప్, బరువు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్స్తో ప్రకాశం మైదానం అంతా ఆర్మీ ఎంపికలకు వచ్చిన యువకులతో కళకళలాడింది. ఆర్మీ అధికారులు, సిబ్బంది ఈ ఎంపికలను దగ్గరుండి పర్యవేక్షించారు. అలాగే సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ పోస్టులకు కూడా అప్పుడే వేలాది మంది యువత శనివారం రాత్రి ప్రకాశం మైదానం పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. దేశరక్షణలో భాగస్వాములు కావాలి: ఐటీడీఏ పీవో వీరపాండియన్ దేశ రక్షణలో యువత భాగస్వాములు కావాలని భద్రాచలం ఐటీడీఏ పీవో వీరపాండియన్ పిలుపునిచ్చారు. సోల్జర్ టెక్నికల్ పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల పరుగు పందెంను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు ఆయన అభ్యర్థులనుద్దేశించి మాట్లాడారు. ఊరిని, తల్లిదండ్రులను వదిలి ఎక్కడికో వెళ్తున్నాం అనుకోకుండా దేశ రక్షణ కోసం సేవ చేయడం అభినందనీయమన్నారు. గతంలో భద్రాచలం, ఖమ్మంలలో సీఆర్పీఎఫ్, పారా మిలటరీ రిక్రూట్మెంట్ జరిగిందని, ఇందులో 238 పోస్టులు భర్తీ చేయగా వీరిలో 115 మంది గిరిజనులు ఉన్నారన్నారు. అలాగే ఎస్పీ ఎ.వి.రంగనాధ్ ఎంపికల తీరు, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమం పర్యవేక్షణలో ఆర్మీ రిక్రూట్మెంట్ సెల్ డెరైక్టర్ కల్నల్ యోగేష్ ముదిలియార్, ఆర్డీవో డి.అమయ్ కుమార్, తహశీల్దార్ కె.పి.నర్సింహులు, కొత్తగూడెం డీఎస్పీ రంగరాజు భాస్కర్, సింగరేణి జీఎం (పర్సనల్) కె.బాబు సత్యసాగర్ పాల్గొన్నారు. సోల్జర్ టెక్నిక్ పోస్టులకు ఇలా అర్హత సాధించారు... టోకెన్లు తీసుకున్నది - 3,461 మంది ఎత్తులో తిరస్కారం - 1,176 పరుగుపందేనికి ఎంపిక - 2,285 మెడికల్ టెస్ట్‌కు ఎంపిక - 561 నేటి ఎంపికలకు అర్హతలు సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ - ఇంటర్ బైపీసీ (మొత్తం 50శాతం, ప్రతి సబ్జెక్టులో 40 శాతం మార్కులు), ఎత్తు 165 సెం.మీ., చెస్ట్ 77 సెం.మీ (ఊపిరి పీల్చినప్పుడు 5 సెం.మీలు పెరగాలి), వయసు 17.1/2 నుంచి 23 సం.లు. సోల్జర్ క్లర్క్- ఇంటర్ అన్ని గ్రూపులు (ఒకేషనల్ మినహా), మొత్తం మార్కులు 50 శాతం, ప్రతి సబ్జెక్టులో 40 శాతం మార్కులు, ఎత్తు 162 సెం.మీ., చెస్ట్ 77 సెం.మీ (ఊపిరి పీల్చినప్పుడు 5 సెం.మీలు పెరగాలి), వయసు 17.1/2 నుంచి 23 సం.లు. -
పత్తి రైతు చిత్తు
సాక్షి, కొత్తగూడెం ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పత్తిరైతు చిత్తయ్యాడు. జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష ఎకరాలకు పైగా పత్తి పంటపై తుపాను ప్రభావం చూపింది. దాదాపు అన్ని మండలాల్లో ఈపంటకు నష్టం కలగగా అశ్వారావుపేట, మధిర నియోజకవర్గాల్లో తీవ్రంగా ఉంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఈ మూడు నాలుగు రోజుల్లో ప్రతిరోజు 3 నుంచి 4 సెంటీమీటర్ల వరకు వర్షం పడుతుండటమే ఈ పరిస్థితికి కారణం. ప్రస్తుత వర్షాలకు తొలివిడత తీస్తున్న పత్తి ముద్దవుతుండగా, మలివిడతపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. రోజూ వర్షం పడుతుండటంతో రైతులు కూలీలతో పత్తి తీయించడానికి ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది కూడా పత్తి చేతికందే సమయంలో నీలం తుపాను సృష్టించిన బీభత్సాన్ని ప్రస్తుతం రైతులు గుర్తుచేసుకుంటున్నారు. నీలం తుపాను దెబ్బకు అప్పట్లో సాగుచేసిన పత్తి పూర్తిగా చేతికందకుండా పోయింది. అంత నష్టం జరిగినా... ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి పరిశీలించినా ఇప్పటికీ బాధిత రైతులకు నష్టపరిహారం అందలేదు. మళ్లీ ఈ ఏడాది ప్రకృతి పగపట్టిందని రైతులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా వ్యవసాయ శాఖాధికారులు మాత్రం ఈ వర్షం వల్ల పంటలకు ఎలాంటి నష్టం లేదని, లాభమేనని పేర్కొనడం గమనార్హం. తొలిదశ పత్తి ముద్దయి కారుతున్నా వ్యవసాయ శాఖ అధికారులకు నష్టం కన్పించకపోవడం విచిత్రం. గురువారం జిల్లా మొత్తం 44.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా అన్ని మండలాల్లో సగటున 9.8 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. ప్రధానంగా వెంకటాపురం, పినపాక మండలాల్లో 3సెంటీ మీటర్లకు పైగా, ఎర్రుపాలెం, బోనకల్లు, ముదిగొండ, చర్ల మండలాల్లో 2సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. కొత్తగూడెం, పాల్వంచ, బూర్గంపాడు, వేలేరుపాడుల్లో అత్యల్పంగా వర్షం కురిసింది. జిల్లాలో వర్షం కారణంగా నష్టాన్ని పరిశీలిస్తే... గత మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షంతో పాలేరు నియోజకవర్గంలో ప్రధానంగా పత్తి, మిర్చి పంటలకు అపార నష్టం కలిగింది. నియోజకవర్గంలోని కూసుమంచి మండలంలో 37,500 ఎకరాలు, ఖమ్మం రూరల్ మండలంలో 25 వేల ఎకరాలలో, తిరుమలాయపాలెం మండలంలో 50 వేల ఎకరాలలో, నేలకొండపల్లి మండలంలో 12,500 ఎకరాలలో వేసిన పత్తి పంట దాదా పు ఈ వర్షానికి 80 శాతం పైగా దెబ్బతింది. ప్రస్తుతం మొదటి దశ పత్తి తీసే సమయం లో వచ్చిన వర్షం రైతులను నట్టేట ముంచిం ది. వరుస వానలతో పత్తి చేలల్లో నీరు చేరడంతో చేలన్నీ ఎర్రగా మారాయి. ఒక్కసారి కూడా పత్తి తీయకపోవడంతో ఈ వర్షానికి చేలల్లోనే పత్తి మొలకెత్తే పరిస్థితి నెలకొంది. అశ్వారావుపేట మండలంలో 5 వేల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. వర్షాల కారణంగా పూత రాలిపోయి, కాయలు నల్లబడిన కారణంగా రెండు తీతలు (కోతలు) పూర్తిగా రైతులు నష్టపోయారు. చంద్రుగొండ మండలంలో పత్తి 13 వేల ఎకరాల్లో సాగవుతుండగా మొత్తం తొలిదశ పత్తి తీస్తుండగా వర్షంతో నష్టం వాటిల్లింది. ములకలపల్లి మండలంలో 2500 ఎకరాల్లో పత్తి సాగవుతుండగా అధిక శాతం పత్తిపంట నష్టం వాటిల్లే అవకాశముంది. ఖమ్మం అర్బన్ మండలంలోని పంగిడి, ఈర్లపూడి, రాంక్యాతండా, మల్లేపల్లి, చింతగుర్తి, గణేశ్వరం, వేపకుంట్ల, చాపరాలపల్లి, శివాయిగూడెంలలో సుమారు 20 వేల ఎకరాల్లో పత్తిసాగు చేస్తున్నారు. తొలిదశ పత్తి తీసే సమ యంలో వర్షం రావడంతో పత్తి తడిసిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.