Kothi
-
కదం తొక్కిన ఆశవర్కర్లు
సుల్తాన్‌బజార్(హైదరాబాద్): వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు సోమవారం ఇక్కడి కోఠి ఉమెన్స్ కళాశాల చౌరస్తాలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఒక్కసారిగా వేలసంఖ్యలో ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు తరలిరావడంతో ఉమెన్స్ కళాశాల చౌరస్తా జనసంద్రాన్ని తలపించింది. ఎక్కడికక్కడే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో చాదర్‌ఘాట్ నుంచి కోఠి బ్యాంక్‌స్ట్రీట్ వరకు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒక్కసారిగా వేలాదిమంది చౌరస్తాలో బైఠాయించడంతో పోలీసులు సైతం చేతులెత్తేశారు. ఆశాలు, ఏఎన్‌ఎంలతోపాటు వైద్యశాఖలో పనిచేస్తున్న వివి ధ కేడర్ల కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఆందోళన కొనసాగించారు. దీంతో ఈ ప్రాంతంలో పోలీసులు భారీ బలగాలను మోహరించారు. -
లక్కీ బస్తీలు..
స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా... ‘అల్లాఉద్దీన్ కోఠి’ బాధ్యతలు సీఎంకు... ‘మక్తా’లకు ఇన్చార్జిగా గవర్నర్? అధ్వాన బస్తీలపై అధికారుల దృష్టి సిటీబ్యూరో: అల్లాఉద్దీన్ కోఠికి.. అద్భుత ఠీవి రానుందా..? ఇప్పుడీ ప్రశ్నకు కారణముంది. అల్లాఉద్దీన్ కోఠి అధ్వాన్నపు ప్రాంతంగా ప్రసిద్ధి. పేరుకుపోయిన చెత్తకుప్పలు.. కలుషిత జలాలు నిత్య సమస్యలు. వీటికి తోడు చీకటి పడితే గాఢాంధకారం. నగరంలోని అధ్వాన్నపు బస్తీల్లో ముందు వరుసలో ఉండే దీనికి ఇన్చార్జిగా సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వ్యవహరించనున్నారా.. ? అంటే అనధికార సమాచారం మేరకు అవుననే వినిపిస్తోంది. ఈనెల 16 నుంచి స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా గ్రేటర్‌ను 400 యూనిట్లుగా విభజిస్తామని, వాటిల్లో ఒక యూనిట్‌కు తాను కూడా ఇన్చార్జిగా వ్యవహరిస్తానని స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం తెలిసిందే. అందుకనుగుణంగా ఆయన సనత్‌నగర్ సమీపంలోని ఈ ప్రాంతాన్ని స్వీకరించవచ్చుననే అంచనాలున్నాయి. అధికారులు ఈ బస్తీ గురించి ఆయన దృష్టికి తేనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎంఎస్ మక్తా, బీఎస్ మక్తా వంటి అధ్వాన్నపు ప్రాంతాలకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ వంటివారు ఇన్చార్జిలుగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి. ఈ బస్తీలకు ఇన్ఛార్జిలుగా వీరి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. వారి అనుమతితో వారికి ఆ యూనిట్ల ఇన్చార్జిలుగా ప్రకటించనున్నారు.