krishna water
-
నిలకడగా గోదావరి
పోలవరం రూరల్/ధవళేశ్వరం/విజయపురిసౌత్: గోదావరి నది ప్రవాహం శనివారం నిలకడగా సాగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం 31.790 మీటర్లకు చేరుకుంది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి 8.15 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాటన్ బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. బ్యారేజ్ నుంచి డెల్టా కాలువలకు 12,700 క్యూసెక్కులు విడుదల చేస్తూ, మిగిలిన 7,81,839 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్ నుంచి కృష్ణాజలాల విడుదలశ్రీశైలం నుంచి వచ్చే కృష్ణాజలాలు పెరగటంతో శనివారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి కృష్ణానదిలోకి 32,400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి 77,496 క్యూసెక్కుల నీరు వస్తోంది. సాగర్ కుడికాలువ ద్వారా 10 వేల క్యూసెక్కులు, ఎడమకాలువ ద్వారా 3,667, ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా 29,029, ఎస్ఎల్బీసీకి 1,800 క్యూసెక్కులు, వరదకాల్వకు 600 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. -
1989 టీఎంసీలు కడలిపాలు
సాక్షి, హైదరాబాద్: గలగలా గోదారి.. బిరబిరా కృష్ణమ్మ కడలి వైపు కదిలిపోతున్నాయి. ఇప్పటికే 1,903 టీఎంసీల గోదావరి, 86 టీఎంసీల కృష్ణా జలాలు కలిపి మొత్తం 1989 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తెరిపి ఇవ్వడంతో గోదావరి, కృష్ణాలో వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టింది.ఎగువ గోదావరి పరీవాహకంలో ఇప్పటికీ చెప్పుకోదగ్గ వరద రాకపోవడంతో నిజాంసాగర్, శ్రీరాంసాగర్, సింగూరు ప్రాజెక్టులు సగం కూడా నిండలేదు. కృష్ణాలో ఆల్మట్టి నుంచి ప్రకాశం బరాజ్ వరకు అన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండడంతో 10 రోజులుగా వచ్చిన వరదను వచ్చినట్టు సముద్రంలోకి వదిలివేస్తున్నారు. గోదావరిలో ప్రాణహిత కలిసే కాళేశ్వరం(తెలంగాణ) నుంచి అంతర్వేది(ఏపీ) వరకూ పరీవాహకంలోని ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండడంతో వస్తున్న వరదను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వర్షాల్లేక వరద తగ్గుముఖం..గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, శబరి వంటి ఉప నదులు, వాగులు, వంకల్లో ప్రవాహం తగ్గింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 47.25 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 3,583 క్యూసెక్కుల వరద వచ్చింది వచ్చినట్టు కాల్వలకు విడుదల చేస్తున్నారు. గోదావరికి ప్రాణహిత వరద తోడుకావడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బరాజ్‌కు 2,89,710 క్యూసెక్కులు, తుపాకులగూడెం(సమ్మక్క) బరాజ్ నుంచి 4,48,810 క్యూసెక్కులు, దుమ్ముగూడెం(సీతమ్మసాగర్) బరాజ్ నుంచి 4,61,484 క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చింది వచ్చినట్టు దిగువన వదులుతున్నారు. ⇒ పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటినిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. కాళేశ్వరం లింక్–2లో భాగంగా నీటిని ఎత్తిపోయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.82 టీఎంసీలు ఉంది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 5,676 క్యూసె క్కులు ఉండగా, 3,602 క్యూసెక్కులు ఔట్‌ఫ్లో ఉంది. ఎగువ కృష్ణాలో తగ్గిన వరదకృష్ణా పరీవాహకంలో ఎగువన వరద ప్రవాహం తగ్గింది. దీంతో ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి 15,000, నారాయణపూర్ నుంచి 6,000, జూరాల ప్రాజెక్టు నుంచి 82,339 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా, తుంగభద్రల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 2,84,791 క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఆ నీటిని దిగువన ఉన్న సాగర్‌కు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ నుంచి దిగువకు 1,04,424 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.సాగర్ ఎనిమిది గేట్ల ద్వారా నీటి విడుదలనాగార్జునసాగర్/దోమలపెంట : శ్రీశైలం నుంచి వచ్చే వరద తగ్గడంతో నాగార్జునసాగర్ వద్ద కొన్ని గేట్లు మూసివేశారు. శనివారం సాయంత్రం 26 గేట్ల ద్వారా నీటిని విడుదల చేయగా.. ఆదివారం ఉదయానికి 16 గేట్లకు తగ్గించారు. మధ్యాహ్నానికి 14, 10 గేట్లకు తగ్గిస్తూ సాయంత్రానికి ఎనిమిది గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు. పర్యాటకులతో ఆదివారం నాగార్జునసాగర్ జనసంద్రంగా మారింది. సెలవు దినం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు.సొంతవాహనాల్లో తరలిరావడంతో డ్యాం దిగువన కృష్ణాతీరం వెంట గల రోడ్లన్నీ కిటకిటలాడాయి. శ్రీశైలం నుంచి వరద వస్తుందనే సాకుతో ఆదివారం కూడా తెలంగాణ వైపు లాంచీలను నిలిపివేశారు. దీంతో పర్యాటకులు చాలామంది నిరాశతో వెళ్లారు. కొంతమంది మాత్రం రైట్ బ్యాంకు వెళ్లి అక్కడి నుంచి లాంచీల్లో నాగార్జునకొండకు వెళ్లారు. ఎగువ ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుంచి వస్తున్న వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ఆదివారం శ్రీశైలం ఆనకట్ట వద్ద ఆరు గేట్లు పైకెత్తి నీటిని దిగువన నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. -
ఇక గడువు పొడిగించం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు, తమకు మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి కేంద్రం జారీ చేసిన అదనపు విధివిధానాల (టీఓఆర్)పై స్టేట్మెంట్ ఆఫ్ కేస్ (ఎస్ఓసీ) దాఖలు చేసేందుకు జూన్ చివరి దాకా గడువు పొడిగించాలన్న ఏపీ విజ్ఞప్తిని జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 తిరస్కరించింది. ఈ నెల 29లోగా ఎస్ఓసీని దాఖలు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాతి నుంచి రెండు వారాల్లోగా ఎదుటిపక్షం దాఖలు చేసే ఎస్ఓసీపై కౌంటర్ దాఖలు చేయాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించింది. ట్రిబ్యునల్ విధించిన మార్చి 20 గడువు నాటికి తెలంగాణ ఎస్ఓసీ దాఖలు చేయగా ఏపీ ఇంకా దాఖలు చేయలేదు. మే 15 నుంచి 17 వరకు తదుపరి విచారణ నిర్వహిస్తామని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ (కృష్ణా ట్రిబ్యునల్–1) గంపగుత్తగా కేటాయించిన 811 టీఎంసీలతోపాటు ఇతర కేటాయింపులను.. ఏపీ, తెలంగాణ మధ్య పునఃపంపిణీ కోసం కృష్ణా ట్రిబ్యునల్–2కు అదనపు విధివిధానాలను (టీఓఆర్) జారీ చేస్తూ కేంద్రం 2023 అక్టోబర్ 10న గజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సోమవారం ఢిల్లీలో సమావేశమై అదనపు టీఓఆర్‌పై విచారణ చేపట్టింది. దీనిపై ఇరు రాష్ట్రాల అధికారులు వాదనలు వినిపించారు. ఏపీ గడువు పొడిగింపు అభ్యర్థనను తెలంగాణ వ్యతిరేకించింది. ఏపీలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి ఉన్నందున స్టేట్మేంట్ ఆఫ్ కేసును దాఖలు చేయలేమన్న ఏపీ వాదనను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. తమ రాష్ట్రంలోనూ లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కోడ్ అమల్లో ఉన్నా ఎస్ఓసీ దాఖలు చేశామని పేర్కొంది. కేసుల విచారణపై ఎన్నికల కోడ్ ప్రభావం ఉండదని, కాలయాపన కోసమే ఏపీ గడువు పొడిగింపు కోరుతోందని ఆరోపించింది. వాదనలు అనంతరం ఏపీ వాదనలను ట్రిబ్యునల్ తిరస్కరించింది. 1,050లో 789 టీఎంసీలు మావే: తెలంగాణ ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో ఉన్న 1,050 టీఎంసీల వాటాలో 798 టీఎంసీలను తమకు కేటాయించాలని ట్రిబ్యునల్‌కు సమర్పించిన ఎస్ఓసీలో తెలంగాణ కోరింది. నిర్మాణం పూర్తై వినియోగంలో ఉన్న ప్రాజెక్టులకు 299 టీఎంసీలు, నిర్మాణంలోని ప్రాజెక్టులకు 238 టీఎంసీలు, భవిష్యత్‌లో కట్టనున్న ప్రాజెక్టులకు 216 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు 36 టీఎంసీలు కలిపి మొత్తం 789 టీఎంసీలు కేటాయించాలని నివేదించింది. కనీస మొత్తంగా 75 శాతం లభ్యత (డిపెండబిలిటీ) ఆధారంగా 555 టీఎంసీలు, 65 శాతం లభ్యత ఆధారంగా 575 టీఎంసీలు కేటాయించాలని నివేదించింది. -
789 టీఎంసీలు మాకే కావాలి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాల్లో ఉన్న 1,050 టీఎంసీల్లో 798 టీఎంసీలను తమకు కేటాయించాలని జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2కి తెలంగాణ విజ్ఞప్తి చేసింది. వినియోగంలో ఉన్న ప్రాజెక్టులకు 299 టీఎంసీలు, నిర్మాణంలోని ప్రాజెక్టులకు 238 టీఎంసీలు, భవిష్యత్‌లో కట్టబోయే ప్రాజెక్టులకు 216 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు 36 టీఎంసీలు కలిపి మొత్తం 789 టీఎంసీలు కేటాయించాలని నివేదించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్(కృష్ణా ట్రిబ్యునల్–1) గంపగుత్తగా కేటాయించిన 811 టీఎంసీలతో పాటు ఇతర కేటాయింపులను.. ఏపీ, తెలంగాణల మధ్య పునః పంపిణీకి కృష్ణా ట్రిబ్యునల్–2కు అదనపు విధివిధానాలు (టీఓఆర్) జారీ చేస్తూ 2023 అక్టోబర్ 10న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా జలాల పంపిణీపై తమ వాదనలతో స్టేట్ ఆఫ్ కేసు (ఎస్ఓసీ) దాఖలు చేయాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నెల 20తో గడువు ముగియగా, అదేరోజు తమకు 798 టీఎంసీలను కేటాయించాలని కోరుతూ తెలంగాణ ఎస్ఓసీ దాఖలు చేసింది. నది పరీవాహక ప్రాంతం(బేసిన్)ను ప్రామాణికంగా తీసుకుంటే 68 శాతం క్యాచ్మెంట్ ఏరియా తమ రాష్ట్రం పరిధిలో ఉందని తెలంగాణ స్పష్టం చేసింది. బేసిన్ పరిధిలో 2 కోట్ల జనాభాతో పాటు అత్యధిక శాతం కరువు పీడిత ప్రాంతాలున్న అంశాన్ని పరిగణనలోకి తీసుకొని న్యాయమైన వాటాగా 789 టీఎంసీలు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. కనీస మొత్తంగా 75 శాతం లభ్యత(డిపెండబిలిటీ) ఆధారంగా 555 టీఎంసీలు, 65 శాతం లభ్యత ఆధారంగా 575 టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలని నివేదించింది. భవిష్యత్‌లో కట్టే ప్రాజెక్టులకు 216 టీఎంసీలు భవిష్యత్‌లో కోయిల్‌కొండ, గండీడ్, జూరాల ఫ్లడ్ ఫ్లో కెనాల్ వంటి ప్రాజెక్టుల నిర్మాణం జరగాల్సి ఉందని, వీటికి 216 టీఎంసీల నీటిని కేటాయించాలని ట్రిబ్యునల్‌ను తెలంగాణ కోరింది. 1050 టీఎంసీల్లో సగానికి పైగా... ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ గంపగుత్తగా 811 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అదనంగా 194 టీఎంసీలు కేటాయించడంతో ఉమ్మడి ఏపీకి 1005 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఇవికాక పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టా సిస్టమ్ (కేడీఎస్)కు తరలించే 80 టీఎంసీల గోదావరి జలాలకు బదులుగా, నాగార్జునసాగర్ ఎగువన ఉండే రాష్ట్రాలకు 80 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకునే వెసులుబాటు గతంలోనే బచావత్ ట్రిబ్యునల్ కల్పించింది. అందులో ఉమ్మడి ఏపీకి దక్కిన 45 టీఎంసీలు కలుపుకొని మొత్తం 1050 టీఎంసీలను తెలుగు రాష్ట్రాలకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉంది. ట్రిబ్యునల్ నివేదికకు 15 నెలల గడువు అంతరాష్ట్ర నదీ జలాల వివాద చట్టం–1956లోని సెక్షన్–3 కింద విచారణ జరిపి, నివేదిక ఇచ్చేందుకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ గడువును ఇటీవల కేంద్రం మరో 15 నెలలు పొడిగించింది. 2025 జూలై 31లోపు ట్రిబ్యునల్ నివేదిక అందించాలి. ఏపీ సైతం తమ స్టేట్ ఆఫ్ కేస్‌ను దాఖలు చేస్తే ట్రిబ్యునల్ విచారణ ముందుకు సాగనుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్–89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులపై ట్రిబ్యునల్ విచారణ చేసినందున, తీర్పు కూడా 15 నెలల్లోపే వస్తుందనే ఆశతో తెలంగాణ ఉంది. -
కుప్పం నియోజకవర్గంలో కృష్ణమ్మ పరవళ్లు
-
ఏపీ ప్రాజెక్టులు కడుతుంటే.. బీఆర్ఎస్ చేసిందేమిటి?
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను ఏపీ తరలించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే సహకరించిందని, కేంద్రం వద్ద ఈ దిశగా సానుకూలంగా సంతకాలు చేసింది కేసీఆర్ సర్కారే అని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఏపీ 12.5 టీఎంసీల నీళ్ళు వాడుకునేందుకు వీలుగా ప్రాజెక్టులు కడితే, తెలంగాణలో కనీసం రెండు టీఎంసీలు వాడుకునే ప్రాజెక్టులు కూడా లేవని విమర్శించారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం జరిగిన చర్చకు రేవంత్ బదులిచ్చారు. కాళేశ్వరంపై నివేదికలు సభలో పెడతాం ‘కాళేశ్వరం అవినీతిపై మాట్లాడితే, కృష్ణా ప్రాజెక్టులు అప్పగించారంటున్నారు. రూ.80 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. కానీ లక్షా 47 వేల కోట్ల మేరకు అంచనాలు వచ్చాయని, రూ.97,500 కోట్లు ఇప్పటికే కాంట్రాక్టర్లకు ఇచ్చారని, ఇంకో రూ.10 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంతాచేసి కాళేశ్వరం కింద 90 వేల ఎకరాలకు కూడా నీళ్ళు అందలేదన్నది వాస్తవం కాదా? దీనిపై విజిలెన్స్ నివేదికలు సభలో ఉంచేందుకు సిద్ధంగా ఉన్నాం..’అని రేవంత్‌రెడ్డి అన్నారు. మరణ శాసనం రాసింది బీఆర్ఎస్ సర్కారే ‘కృష్ణా ప్రాజెక్టులను కాంగ్రెస్ కేంద్రానికి అప్పగించిందనే వాదనలో అర్థం లేదు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును 2014 పునరి్వభజన చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు. 2014 నుంచి 2023 వరకు బోర్డు సమావేశాలకు వెళ్ళింది వాళ్ళే. ఒక పక్క ఎన్నికలు జరుగుతుంటే ఏపీ పోలీసు లు ఏకే 47 తుపాకులతో నాగార్జున సాగర్ డ్యాంపైకి ఎలా వచ్చారు? వాళ్ళ పులుసు తిని అలుసు ఇచ్చింది బీఆర్ఎస్. రాయలసీమకు వెళ్ళి మంత్రి రోజా పెట్టిన రాగి సంగటి, రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తా అన్నది మీరు కాదా? మీ కళ్ళ ముందే కదా ముచ్చుమర్రి కట్టింది. మీ కళ్ళ ముందే కదా వైఎస్ రాజశేఖరరెడ్డి పోతిరెడ్డి పాడును 44 వేల క్యూసెక్కులకు పెంచింది. జీవో నంబర్ 203కు నీ ఇంట్లోనే కదా పునాది వేసింది. 8 టీఎంసీలు తరలించేందుకు అనుమతించింది బీఆర్ఎస్సే. ఇప్పుడు 12 టీఎంసీలు వెళ్తున్నాయి. రాయలసీమ లిఫ్ట్ 796 ఎఫ్ఆర్ఎల్ వద్ద కట్టారు. ఏపీ ఒక పక్క ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటుంటే, వీళ్ళు చేసిందేమిటి? రాజీవ్ గాంధీ టన్నెల్ ప్రాజెక్టులో ఒక్క కిలోమీటర్ కూడా పూర్తి చేయలేదు. కల్వక్తురి లిఫ్ట్ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎస్ఎల్బీసీ పరిస్థితీ ఇదే. కృష్ణా జలాలపై మరణ శాసనం రాసింది బీఆర్ఎస్ సర్కారే. కృష్ణా జలాలు 2015లో కేంద్రానికి అప్పగించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. 811 టీఎంసీల నికర జలాలు ఉమ్మడి ఏపీకి కేటాయిస్తే, 512 టీఎంసీలు ఏపీకి ఇవ్వడానికి అధికారికంగా సంతకం పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. తెలంగాణ రైతుల హక్కులను ఏపీకి ధారాదత్తం చేశారు..’అని సీఎం ఆరోపించారు. -
కుప్పం నేలపై కృష్ణమ్మ పరవళ్లు
బి.కొత్తకోట (అన్నమయ్య జిల్లా): ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. కొండలు, గుట్టలు దాటుకుని ప్రవహిస్తూ.. 672 కిలోమీటర్ల దూరంలోని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గలగలమని పరవళ్లు తొక్కుతూ కృష్ణమ్మ బుధవారం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రవేశించింది. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు ప్రజలు కాలువ వద్దకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. 35 ఏళ్లు ఎమ్మెల్యేగా.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కుప్పానికి కృష్ణా జలాలు తరలించడంలో విఫలమయ్యారు. 2022 సెప్టెంబర్ 23న కుప్పంలో జరిగిన సభకు హాజరైన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. చంద్రబాబు హయాంలో ఆగిపోయిన కుప్పం కాలువ పనులను పూర్తి చేస్తామని, కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు ఇస్తే సస్యశ్యామలం అవుతుందని ప్రకటించారు. అన్నట్టుగానే మాట నిలుపుకున్నారు. కృష్ణా జలాలు కుప్పం ఉపకాలువలో ప్రవహిస్తూ బుధవారం ఉదయం 11 గంటలకు రామకుప్పం మండలం వర్దికుప్పం వద్ద (కుప్పం ఉపకాలువ కిలోమీటర్ 64.278 వద్ద) కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించాయి. జనం తండోపతండాలుగా తరలివచ్చి ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించారు. కృష్ణమ్మకు హారతులు పట్టి ఆహా్వనించారు. శ్రీశైలం నుంచి 27 ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని ఎత్తిపోస్తూ కుప్పానికి తరలిస్తున్నారు. బుధవారానికి శ్రీశైలం నుంచి కుప్పం సరిహద్దు వరకు 672 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తూ కృష్ణమ్మ కుప్పం నేలను తడిపింది. సముద్ర మట్టానికి 758 మీటర్ల ఎత్తున నీటిని తరలిస్తూ కాలువలోకి ప్రవహింపజేస్తున్నారు. ప్రస్తుతం చెర్లోపల్లె రిజర్వాయర్ నుంచి 275 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అసంపూర్తి పనులను పూర్తి చేసి.. టీడీపీ హయాంలో 2015లో జరిగిన టెండర్లలో కుప్పం కాలువ పనులను మూడు కాంట్రాక్టు సంస్థల జాయింట్ వెంచర్ 4 శాతం ఎక్సెస్‌తో రూ.430.26 కోట్లకు దక్కించుకుంది. ఒప్పందం మేరకు 123.641 కిలోమీటర్ల కాలువ తవ్వకం, 324 స్ట్రక్చర్స్, 5చోట్ల ఎన్‌హెచ్ క్రాసింగ్ పనులు, మూడుచోట్ల ఎత్తిపోతల పథకాల నిర్మాణం, 110 చెరువులకు నీరందించే పనులు పూర్తి చేయాలి. ఈ పనులను ఇష్టారీతిన నిర్వహించి 2018 నుంచి అసంపూర్తిగా వదిలేశారు. 2019 నుంచి పనులు పూర్తి చేయించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టి కాంట్రాక్టర్లకు నోటీసులిచ్చినా పట్టించుకోలేదు. సీఎం చొరవతో భూ సేకరణకు రూ.40 కోట్లు మంజూరు చేశారు. 4.80 కిలోమీటర్ల పెండింగ్ కాలువ, 103 స్ట్రక్చర్స్, 1,43,130 క్యూబిక్ మీటర్ల మట్టిపని, 22,933 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు, గుడిపల్లె మండలంలో రైల్వే క్రాసింగ్ టన్నెల్ పనులు 45 మీటర్లు జరగాల్సి ఉండేది. వీటి పనులు పూర్తి చేయించడమేకాక గత కాంట్రాక్టర్ల పనుల్లో లోపాలను సరిచేయించి కాలువలో నీటి తరలింపునకు ఇబ్బందులు తొలగించడంతో ప్రస్తుతం కృష్ణా జలాలు ప్రవహిస్తున్నాయి. ఎందుకు నీళ్లివ్వలేదు బాబూ! కుప్పానికి ఏడుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన చంద్రబాబు తన హయాంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు తరలించానని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. 2019 జనవరి 21న ప్రారంభమై ఏప్రిల్ 11 వరకు పుంగనూరు ఉపకాలువలో కృష్ణా జలాలు పారించారు. 82 రోజులు పారించినా పనులు పూర్తి చేయించకపోవడంతో కుప్పం కాలువలోకి నీళ్లు పారలేదు. బాబు పాలనలో వచి్చన కృష్ణా జలాలు 775 ఎంసీఎఫ్‌టీలు (మిలియన్ క్యూబిక్ ఫీట్స్) మాత్రమే. ఈ నీటిలో 207 కిలోమీటర్ల పుంగనూరు ఉపకాలువ (గడ్డంవారిపల్లె నుంచి బొమ్మరాజుపల్లె వరకు) లో 742.19 ఎంసీఎఫ్‌టీలు, 43 కిలోమీటర్ల కుప్పం కాలువలో 32.81 ఎంసీఎఫ్‌టీల నీరు పారింది. 123 కిలోమీటర్లు మేర ఉండే కుప్పం కాలువలో పలమనేరు నియోజకవర్గంలోని అప్పినపల్లె నుంచి 43వ కిలోమీటర్‌లోని వి.కోట మండలం నారి్నపల్లె వరకు జలాలు సాగి ఆగిపోయాయి. తన పాలనలో కుప్పం కాలువ పనులు పూర్తి చేయించలేకపోయిన చంద్రబాబు.. వైఎస్ జగన్ పనులు చేయించలేదని గగ్గోలు పెట్టారు. అయితే.. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పనులు పూర్తి చేయించి కుప్పానికి కృష్ణా జలాలు పారిస్తున్నారు. -
సాగర్‌లోని నిల్వలు మావే!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత నీటి సంవత్సరంలో ఇప్పటి వరకు నాగార్జునసాగర్ జలాశయానికి ఎలాంటి ప్రవాహం రాలేదని, గతేడాది తాము వా డుకోకుండా పొదుపు చేసిన 18 టీఎంసీల నీళ్లే ప్రస్తుతం జలాశయంలో మిగిలి ఉన్నాయని తెలంగాణ రాష్ట్రం స్పష్టం చేసింది. ఈ నీళ్లను వినియోగంపై తమకే హక్కు ఉందని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి. మురళీ ధర్ గురువారం కృష్ణా బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. పొదుపు చేసిన జలాలు మావే.. కొత్త నీటి సంవత్సరం ప్రారంభమైన తర్వాత జలాశయంలో అప్పటికే మిగిలి ఉండే నిల్వల్లో కొత్త ప్రవాహం వచ్చి కలిసిపోతుందని, ఈ నేపథ్యంలో గతేడాది పొదుపు చేసిన జలాలను మరుసటి ఏడాది సంబంధిత రాష్ట్రానికి కేటాయించాలంటే(క్యారీ ఓవర్).. రెండు రాష్ట్రాల సమ్మతి అవసరమని గత కృష్ణా బోర్డు సమావేశంలో చైర్మన్ పేర్కొన్న విషయాన్ని తెలంగాణ గుర్తు చేసింది. వాస్తవానికి ప్రస్తుత ఏడాది జలాశయం పూర్తిగా నిండి గేట్లను ఎత్తే నాటి వరకు గతేడాది తాము పొదుపు చేసిన 18 టీఎంసీలను వాడుకోవచ్చని, దీని ద్వారా పొరుగు రాష్ట్ర హక్కులకు ఎలాంటి భంగం కలగదని తెలియజేసింది. కృష్ణా జలాలను నిల్వ చేసుకోవడానికి తమకు ప్రత్యేకంగా ఆఫ్‌లైన్ జలాశయాలు లేకపోవడంతో 2023–24కి సంబంధించిన తాగు, సాగునీటి అవసరాల కోసం ఉమ్మడి జలాశయం సాగర్‌లోనే నిల్వ చేసుకోవాల్సి వచ్చిందని తెలియజేసింది. గతేడాది ఏపీ తమ వాటాకు మించి 51.745 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించిందని ఆరోపించింది. సాగర్ కుడి కాల్వ తాగునీటి అవసరాలు 2.84 టీఎంసీలే కృష్ణా ట్రిబ్యునల్–2కు గతంలో సమర్పించిన వివిధ ప్రాజెక్టు నివేదికల ప్రకారం సాగర్ కుడి కాల్వ కింద వార్షిక తాగునీటి అవసరాలు 2.84 టీఎంసీలు మాత్రమేనని కాగా, గత జూలై నెల తాగునీటి అవసరాల కోసం నుంచి 5 టీఎంసీల నీళ్లను కేటాయించాలని ఏపీ కోరడం పట్ల లేఖలో తెలంగాణ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణా బోర్డు 17వ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖకు రెఫర్ చేయాలని తెలంగాణ రాష్ట్రం మరోసారి కోరింది. -
కడలి ఒడిలోకి
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: విస్తారంగా కురుస్తున్న వర్షాలు.. పోటెత్తుతున్న ప్రవాహాలతో ప్రాజెక్టులన్నీ నిండిపోయి గేట్లు ఎత్తి వేయడంతో కడలి వైపు నదులు పరుగులు పెడుతున్నాయి. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజ్ నుంచి 4,28,120 (36.99 టీఎంసీలు) క్యూసెక్కుల కృష్ణా జలాలు, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 14,76,919 (127.62 టీఎంసీలు) క్యూసెక్కుల గోదావరి జలాలు, గొట్టా బ్యారేజ్ నుంచి 14 వేల క్యూసెక్కుల (1.20 టీఎంసీలు) వంశధార జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. నాగార్జునసాగర్, భద్రాచలం దిగువన కృష్ణమ్మ, గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రవాహాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద శుక్రవారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణాలో స్థిరంగా వరద.. ► జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం జలాశయంలోకి 4,55,614 క్యూసెక్కులు చేరుతున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 14 వేలు, హంద్రీ–నీవా ద్వారా 1,688 క్యూసెక్కులను తరలిస్తున్నారు. కల్వకుర్తి ద్వారా 400 క్యూసెక్కులను తెలంగాణ తరలిస్తోంది. శ్రీశైలంలో పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,77,650 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. విద్యుదుత్పత్తి చేస్తూ కుడి గట్టు కేంద్రం ద్వారా 26,825, ఎడమ గట్టు కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.6 అడుగుల్లో 213.40 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ► శ్రీశైలం నుంచి వదులుతున్న జలాల్లో నాగార్జునసాగర్‌లోకి 4,11,932 క్యూసెక్కులు చేరుతుండగా కుడి కాలువకు 6,766, ఎడమ కాలువకు 7,937, ఏఎమ్మార్పీకి 2,400, వరద కాలువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్‌లో 24 గేట్లను పది అడుగులు, రెండు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 3,61,602 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రధాన కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 32,927 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 587 అడుగుల్లో 305.56 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. భారీ వరద నేపథ్యంలో సాగర్ టెయిల్‌పాండ్‌లో రెండు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి నిలిపి వేసినట్లు అధికారులు తెలిపారు. ► నాగార్జునసాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి 3,93,029 క్యూసెక్కులు చేరుతున్నాయి. 14 గేట్లను 3.5 అడుగుల మేర ఎత్తి 3,52,352 క్యూసెక్కులను, విద్యుదుత్పత్తి చేస్తూ 6 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. పులిచింతలలో 165.94 అడుగుల్లో 32.83 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ► పులిచింతల నుంచి దిగువకు వస్తున్న నీటికి పాలేరు, మున్నేరు వరద తోడవుతుండటంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 4,42,083 క్యూసెక్కులు చేరుతున్నాయి. కృష్ణా డెల్టా కాలువలకు 13,963 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 4,28,120 క్యూసెక్కులను బ్యారేజీ 70 గేట్లను పూర్తిగా ఎత్తివేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు. బ్యారేజీకి వరద నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వరద సమయంలో గతంలో దాదాపు 20 వేల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించాల్సి వచ్చేదని, కనకదుర్గ వారధి నుంచి దిగువకు కాంపౌండ్ వాల్ నిర్మాణం వల్ల ముంపు నుంచి రక్షణ కలిగిందని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ► ఎగువన కృష్ణా, తుంగభద్రలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఆల్మట్టి నుంచి 2.25 లక్షలు, నారాయణపూర్ నుంచి 2.33 లక్షలు, తుంగభద్ర డ్యామ్ నుంచి 88,896 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. శనివారమూ శ్రీశైలంలోకి వరద ఇదే రీతిలో కొనసాగనుంది. వంశధార, నాగావళి పరవళ్లు.. ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళిలో వరద కొనసాగుతోంది. గొట్టా బ్యారేజ్‌లోకి 16,814 క్యూసెక్కుల వంశధార జలాలు చేరుతుండగా 2,814 క్యూసెక్కులను ఆయకట్టుకు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 14 వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. తోటపల్లి ప్రాజెక్టు నుంచి నారాయణపురం ఆనకట్టలోకి 3,600 క్యూసెక్కుల నాగావళి జలాలు చేరుతుండగా ఆయకట్టుకు 600 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 3 వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. వరద గోదారి.. కాళేశ్వరంలో అంతర్భాగమైన పార్వతి, సరస్వతి, లక్ష్మీ బ్యారేజ్‌లు, తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజ్, దుమ్ముగూడెం వద్ద ఉన్న సీతమ్మసాగర్‌లోకి వచ్చిన వరద వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తుండటంతో భద్రాచలం వద్ద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నీటి మట్టం 52.1 అడుగుల్లో ఉండగా రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులోకి 12,17,365 క్యూసెక్కులు చేరుతుండటంతో స్పిల్ వేకు ఎగువన 34.13 మీటర్లు, దిగువన 25.72 మీటర్ల మేర వరద మట్టం నమోదైంది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 14,85,919 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 15 అడుగులకు చేరుకుంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. గోదావరి డెల్టా కాలువలకు 9 వేల క్యూసెక్కులను విడుదల చేస్తూ బ్యారేజ్ 175 గేట్లను పూర్తిగా ఎత్తివేసి 14,76,919 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
శ్రీశైలంలోకి కొనసాగుతున్న ప్రవాహం.. రెండు రోజుల్లో ఫుల్
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం తగ్గింది. బుధవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,32,164 క్యూసెక్కులు చేరుతోంది. నీటి మట్టం 877.6 అడుగులకు చేరింది. నీటి నిల్వ 176.33 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 39 టీఎంసీలు అవసరం. శనివారంనాటికి ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గడంతో కృష్ణా ప్రధాన పాయలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి 78,314 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి 1,26,405 క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలంలోకి శుక్రవారం కూడా 2 లక్షల క్యూసెక్కులకంటే ఎక్కువగానే ప్రవాహం కొనసాగనుంది. సాగర్‌కు దిగువన పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో పులిచింతల ప్రాజెక్టులోకి 4,588 క్యూసెక్కులు వస్తోంది. పులిచింతలకు దిగువన పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజిలోకి 16,192 క్యూసెక్కులు వస్తోంది. ఇక్కడి నుంచి కృష్ణా డెల్టాకు 8,991 క్యూసెక్కులు, సముద్రంలోకి 7,201 క్యూసెక్కులు వదులుతున్నారు. ఇదీ చదవండి: ధవళేశ్వరం, పోలవరం వద్ద తగ్గిన వరద.. శ్రీశైలం వద్ద ఉధృతి -
బలమైన వాదనలు వినిపించండి: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీపై సెప్టెంబర్ 1న జరగనున్న పూర్తిస్థాయి కృష్ణా బోర్డు సమావేశంలో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం బలమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. బోర్డు భేటీలో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేశారు. బోర్డు సమావేశంలో చర్చకు రాబోయే ఎజెండాలోని అంశాలపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయమైన నీటి వాటా కోసం కృష్ణా బోర్డు, ట్రిబ్యునళ్లు సహా అన్ని రకాల వేదికలపై బలమైన వాదనలు వినిపించాలన్నారు. బోర్డు సమావేశంలో సాధికారిక సమాచారంతో సమర్థంగా వాదనలు వినిపించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్, ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, సీఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్‌రెడ్డి, ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, మాజీ అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో సీనియర్ న్యాయవాది రవీందర్రావు, ఇంటర్ స్టేట్ విభాగం చీఫ్ ఇంజనీర్ మోహన్ కుమార్, సూపరింటెండెంట్ ఇంజనీర్ కోటేశ్వర్రావు పాల్గొన్నారు. -
‘కృష్ణా’ గేట్లన్నీ ఓపెన్
సాక్షి, హైదరాబాద్/నాగార్జునసాగర్/హుజూర్నగర్: ఎగువన ఆల్మట్టి నుంచి దిగువన పులిచింతల దాకా కృష్ణా నదిలో భారీ ప్రవాహం కొనసాగుతోంది. అన్ని ప్రధాన ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆగస్టు తొలివారంలోనే అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తడం 2009 ఏడాది తర్వాత ఇదే తొలిసారికావడం విశేషం. కృష్ణా పరవళ్లతో బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. సాగర్ సహా అన్ని ప్రాజెక్టులు నిండటంతో తాగునీటి అవసరాలు తీరడంతోపాటు వానాకాలం, యాసంగి రెండు పంటలకు సాగునీరు అందుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎగువన కుండపోత వానలతో..: మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన వర్షాలకు గత నెలలోనే ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండిపోయాయి. తర్వాత కూడా వానలు కొనసాగడంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. ఆ నీళ్లన్నీ జూరాల మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టు కూడా నాలుగు రోజుల కిందటే నిండటంతో గేట్లు ఎత్తివేశారు. తాజాగా నాగార్జున సాగర్ సైతం నిండింది. ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయానికి నీటి నిల్వ 297 టీఎంసీలు దాటింది. ఎగువ నుంచి 4.38 లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగుతుండటంతో డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గత ఏడాది ఇదే సమయానికి సాగర్‌లో 206 టీఎంసీల నిల్వ మాత్రమే ఉండగా.. ఈసారి పూర్తిగా నిండింది. 2009 తర్వాతి నుంచి చూస్తే.. ఆగస్టు తొలివారంలోనే సాగర్ గేట్లు ఎత్తడం, మొత్తం కృష్ణా ప్రాజెక్టుల గేట్లు ఎత్తి ఉంచడం ఇదే తొలిసారి అని ప్రాజెక్టు ఇంజనీర్లు తెలిపారు. 2 పంటలకు ఢోకా లేనట్టే.. సాగర్ నిండుకుండలా మారడంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆదివారం నుంచే ఎడమ కాల్వ కింద సాగు అవసరాలకు నీటి విడుదల మొదలైంది. ప్రాజెక్టు ఇప్పటికే నిండటం, అక్టోబర్ వరకు కూడా ప్రవాహాలు వచ్చే అవకాశాలు ఉండటంతో ఈసారి వానాకాలం, యాసంగి పంటల సాగుకు ఇక్కట్లు తప్పనున్నాయి. ఈ ఏడాది వానాకాలంలో సాగర్ కింద 6.40 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక తయారైంది. అంటే సుమారు 60 టీఎంసీల నీటిని 6 నుంచి 7 తడుల్లో ఇవ్వనున్నారు. సాగర్‌పై ఆధారపడ్డ ఏఎమ్మార్పీ, హైదరాబాద్, మిషన్ భగీరథ, నల్లగొండ జిల్లా తాగు అవసరాలకు ఇబ్బంది తప్పనుంది. -
రాయలసీమ ద్రోహి చంద్రబాబు: మంత్రి పెద్దిరెడ్డి
-
రాయలసీమ ద్రోహి చంద్రబాబు: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరవు ప్రాంతానికి తాగు, సాగు నీరు రాకుండా బాబు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు రావడాన్ని చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా తమ ప్రభుత్వం తాగు, సాగు నీరు అందించి తీరుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
తీరనున్న నల్లగొండ నీటిగోస: మరో 3 ఎత్తిపోతలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను వినియోగించుకుంటూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మరో రెండు నియోజకవర్గాల్లో ఆయకట్టుకు నీరందించేలా మూడు ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. మిర్యాలగూడ, నకిరేకల్ నియోజకవర్గాల్లో సాగునీరందని ప్రాంతాలకు నీరు అందించేలా రూ.160 కోట్లతో ప్రతిపాదనలు తయారుచేసింది. నకిరేకల్ నియోజకవర్గంలో 8,058 ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా కట్టంగూరు మండలం, చెరువు అన్నారం గ్రామ పరిధిలో అయితిపాముల ఎత్తిపోతల పథకాన్ని రూ.122 కోట్లతో నిర్మించనుంది. మొత్తం నాలుగు పంపులను వినియోగిస్తూ 80 క్యూసెక్కుల నీటిని తరలించేలా ఈ ఎత్తిపోతలను నిర్మించనున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో దామరచెర్ల మండలంలోని వీర్లపాలెం గ్రామం వద్ద వీర్లపాలెం ఎత్తిపోతలను రూ.29.20 కోట్లతో ప్రతిపాదించగా, దీనిద్వారా 2,500 ఎకరాలకు నీరిస్తారు. ఇదే నియోజకవర్గంలోని వేములపల్లి గ్రామం సమీపంలో తోపుచెర్ల ఎత్తిపోతలను రూ.10.19 కోట్లతో ప్రతిపాదించగా, దీనిద్వారా 315 ఎకరాలకు నీరందనుంది. ఇప్పటికే నాగార్జునసాగర్, సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలో నెల్లికల్, దున్నపోతుల గండి, బొంతపాలెం, కేశవాపురం, పొగిళ్ల, ముక్త్యాల, జా¯Œ పహాడ్, అంబాభవాని, కంబాలపల్లి, ఏకేబీఆర్ వంటి ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ ఎత్తిపోతల పథకాలకు సంబంధించి మొత్తం రూ.2,500 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. -
సొంత జిల్లాకు బాబు తీరని ద్రోహం
సొంత జిల్లాకు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీరని అన్యాయం చేశారు. తన పాలనలో అస్మదీయులకు లబ్ధి చేకూర్చడంపైనే దృష్టి సారించారు. ప్రాజెక్టుల అంచనాలు ఎడాపెడా పెంచేసి, ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు చేసి జిల్లా రైతాంగం నోట్లో మట్టికొట్టారు. హంద్రీ–నీవా ప్రాజెక్టు రెండోదశలో భాగమైన కుప్పం ఉపకాలువ పనులు 90 శాతం పూర్తయినా కృష్ణా జలాలు తరలించలేదని గగ్గోలు పెట్టిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వల్ల చిత్తూరు, కడప జిల్లాకు తీరని అన్యాయం జరిగింది. వేల కోట్లు ఖర్చు చేసినా ప్రాజెక్టు పనులు నిరుపయోగం అయ్యేందుకు ప్రత్యక్ష కారకులయ్యారు. బి.కొత్తకోట: జిల్లాలో హంద్రీ–నీవా ప్రాజెక్టుకు సంబంధించిన ఉపకాలువలు, రిజర్వాయర్లలో ఒక్క పుంగనూరు ఉపకాలువ మినహా మిగిలిన మొత్తం ప్రాజెక్టుకు కృష్ణా జలాలను అనంతపురం జిల్లాలోని ప్రధాన కాలువ ఎన్పీకుంట మండలం నుంచి తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దమండ్యంలోకి ప్రవేశిస్తుంది. దీనికి మధ్యలో పెద్దరాంపల్లె–పుల్లకూరవాండ్లపల్లె (ఎన్పీ కుంట మండలం) మధ్యలోని సొరంగం కీలకం. ఈ సొరంగం మీదుగానే కృష్ణా జలాలు రావాలి. అయితే గత టీడీపీ పాలనలో సొరంగం పనులు పూర్తి చేయించకపోవడంతో జలాల తరలింపు ఆగిపోయింది. ఈ పనుల అంచనాలను పెంచుకున్నా.. పనులపై శ్రద్ధ చూపకపోవడంతో జిల్లాలో రూ.3,500 కోట్ల పనులు నిరుపయోగమయ్యాయి. తద్వారా గత టీడీపీ పాలనలో రెండు జిల్లాలకు తీరని అన్యాయం జరిగింది. అంచనా పెంచి వదిలేసిన వైనం.. అనంతపురం జిల్లాలోని ఎన్పీ కుంట మండలం పెద్దరాంపల్లె–పుల్లకూరవాండ్లపల్లె మధ్యలో 5.20 మీటర్ల వ్యాసంతో సొరంగం తవ్వకం, లైనింగ్ పనులను కిలోమీటర్ 412.000 నుంచి 415.000 వరకు పూర్తి చేయాల్సి ఉంది. మొత్తం 3.5 కిలోమీటర్ల సొరంగం తవ్వకం, లైనింగ్, రెండువైపులా 150 మీటర్ల కాలువ నిర్మాణం పనులను రూ.27.12 కోట్లతో శ్రీఅవంతిక సాయి వెంకట జాయింట్ వెంచర్ సంస్థ చేపట్టింది. ఈ సంస్థ 2015 మార్చినాటికి రూ.6.34 కోట్ల పనులు చేసి చేతులు దులుపుకుంది. మరో రూ.20.78 కోట్ల పనులు నిలిచిపోగా గత ప్రభుత్వం పనుల అంచనాలను పెంచుకునే చర్యల్లో భాగంగా 2016లో రూ.6.0679 కోట్ల సొరంగం, కాలువ పనులకు అంచనాలు పెంచి టెండర్లు నిర్వహించగా మ్యాక్స్ ఇన్ఫ్రా(ఐ) లిమిటెడ్ సంస్థ రూ.15.08 కోట్లకు పనులు దక్కించుకుంది. ఈ సంస్థ ఐదేళ్లలో రూ.6.64 కోట్ల పనులే చేసి మిగిలిన రూ.8.43 కోట్ల పనులు వదిలేసింది. లైనింగ్ పనులను వెడ్సర్ కన్స్ట్రక్చర్ సంస్థకు రూ.17.75 కోట్లకు అప్పగించగా రూ.65 లక్షల పనులే పూర్తి చేసినట్టు సమాచారం. సొరంగానికి సంబంధించి గత ప్రభుత్వం చివరినాటికి 115 మీటర్ల పనులు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. కదిరి వైపు నుంచి ఈ పనులు పెద్దమండ్యం వైపునకు సాగే కాలువ వైపు ఆగిపోయాయి. పూర్తయితే కృష్ణమ్మ గలగల అనంతపురం జిల్లా కదిరి సమీపంలో హంద్రీ–నీవా రెండు కాలువలు విడిపోతాయి. కుడివైపున పుంగనూరు ఉపకాలువ తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దతిప్పసముద్రం మండలంలోకి ప్రవేశించి పలమనేరు నియోజకవర్గం నుంచి మొదలయ్యే కుప్పం ఉపకాలువలో కలుస్తుంది. ఎడమవైపు నుంచి సాగే ప్రధాన కాలువ ఎన్పీ కుంట మండలం మీదుగా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దమండ్యంలోకి ప్రవేశించి వైఎస్సార్ కడప జిల్లాకు వెళ్తుంది. పెద్దమండ్యం మండలం నుంచి అడవిపల్లె రిజర్వాయర్‌కు నీటిని తరలించే కాలువల నిర్మాణం జరిగింది. ఈ సొరంగం పూర్తయితే జిల్లాలోని అడవిపల్లె, కలిచర్ల, వైఎస్సార్ కడప జిల్లాలోని శ్రీనివాసపురం రిజర్వాయర్లకు, ఉపకాలువలు, డిస్ట్రిబ్యూటరీలకు కృష్ణా జలాలు అందుతాయి. జిల్లాలో సాగే 30 కిలోమీటర్ల ప్రధానకాలువ, 30.750 కిలోమీటర్ల తంబళ్లపల్లె ఉపకాలువ, 44.200 కిలోమీటర్ల చింతపర్తి ఉపకాలువ, 25.170 కిలోమీటర్ల ఎల్లుట్ల ఉపకాలువ, 23.500 కిలోమీటర్ల వాయల్పాడు ఉపకాలువ, 142.200 కిలోమీటర్ల నీవా ఉపకాలువ, 0.125 టీఎంసీ సామర్థ్యం కలిగిన కలిచర్ల రిజర్వాయర్, 1.418 టీఎంసీ సామర్థ్యం కలిగిన అడవిపల్లె రిజర్వాయర్లకు కృష్ణాజలాల తరలింపు సాధ్యమవుతుంది. అడవిపల్లె నుంచి హంద్రీ–నీవా కాలువ ద్వారా చిత్తూరు సమీపంలోని ఎనీ్టఆర్ జలాశయానికి చిత్తూరు నగర ప్రజల తాగునీటికి నీరు తరలిస్తారు. ఈ పనులు పూర్తి చేసేందుకు రూ.3,500 కోట్లు ఖర్చు చేశారు. 3 మాసాల్లో పూర్తికి లక్ష్యం ఎన్పీ కుంట మండలంలో ఆగిన సొరంగం పనులకు సంబంధించిన కాంట్రాక్టర్‌కు గత ప్రభుత్వంలో రూ.1.20 కోట్లు, ఏడాదిగా జరిగిన పనుల బిల్లు రూ.50 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లులు చెల్లించాలి. మిగిలిపోయిన సొరంగం పనులను మూడు మాసాల్లో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. – ఎం.వెంకటరమణ, హెచ్‌ఎన్‌ఎన్‌ఎస్ ఎస్ఈ, అనంతపురం 35 మీటర్లు తవ్వించాం.. ఈ ఏడాది కాలంలో 35 మీటర్ల సొరంగం పనులు చేయించాం. రెండు లేక మూడు నెలల్లో పనులు పూర్తి చేయించాలని ప్రయత్నాలు చేస్తున్నాం. గతంలో కాంట్రాక్టర్ పనులు సత్వరమే పూర్తి చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. సొరంగం పని పూర్తయ్యాక లైనింగ్ పనులు చేపడతాం. – రాజగోపాల్, హెచ్ఎన్ఎస్ఎస్ ఈఈ, ధర్మవరం -
నదుల్లోకి చేరే నీటిని శుభ్రపరచాలి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాలు కలుషితం అవుతున్నాయని, నదుల్లోకి చేరే నీటిని శుభ్రపరచాల్సిన అవసరముందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంత పునరుజ్జీవన ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పన సన్నాహక సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడు తూ, గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల పరిరక్షణ కోసం కేంద్రం నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. నదులకు 5 కి.మీ. దూరం నుంచి రైతుల పొలాలలో నీడనిచ్చే చెట్లు, ఉద్యాన పంటలు వంటివి వేయాలన్నారు. వాగులకు రెండు కిలోమీటర్ల పరిధిలో భారీగా పచ్చదనాన్ని పెంచాలన్నారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ద్వారా 25 లక్షల ఎకరాల భూమిలో పచ్చదనం వెల్లివిరుస్తుందన్నారు. ఈ సమావేశంలో ఇండియన్ ఫారెస్ట్ బయో డైవర్సిటీ సంచాలకులు జయప్రసాద్, శాస్త్రవేత్త డీఆర్ఎస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణమ్మ మెరిసె.. బెజవాడ మురిసె
-
నేడు మల్లన్న ముంగిట్లో కృష్ణమ్మ!
సాక్షి, అమరావతి, నిడదవోలు, ధవళేశ్వరం: పశ్చిమ కనుమల్లో వర్షాలు కొనసాగుతుండటం, నిండుకుండల్లా మారిన ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లోకి చేరిన వరదను చేరినట్టుగా దిగువకు విడుదల చేస్తుండటంతో కృష్ణా నది పరవళ్లతో పోటెత్తుతోంది. ఆల్మట్టిలోకి 2 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో అంతే నీటిని నారాయణపూర్‌కు వదులుతున్నారు. నారాయణపూర్ కూడా నిండటంతో 20 గేట్లు ఎత్తివేసి 1.90 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన జూరాలకు వదులుతున్నారు. జూరాలలో జలవిద్యుదు త్పత్తి చేస్తూ 29 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా వరద ప్రవాహం బుధవారం ఉదయానికి శ్రీశైలం చేరనుంది. ప్రస్తుతం శ్రీశైలంలో 885 అడుగులకుగానూ 804 అడుగుల్లో నీటి నిల్వ ఉంది. కృష్ణా ఉప నదులైన తుంగభద్ర, బీమాలో వరద తగ్గుముఖం పట్టింది. తుంగభద్ర జలాశయంలోకి 15,281 క్యూసెక్కులు చేరుతుండగా బీమా నుంచి ఉజ్జయినిలోకి 55,439 క్యూసెక్కులు చేరుతున్నాయి. కాఫర్ డ్యామ్ మీదుగా గోదావరి వరద భారీ వర్షాలు, ఉప నదులు శబరి, ఇంద్రావతి ఉప్పొంగుతుండటంతో గోదావరిలో వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్దకు 4.22 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరింది. కాఫర్ డ్యామ్ మీదుగా గోదావరి వరద ప్రవహిస్తోంది. కొత్తూరు కాజ్‌వేను వరద ముంచెత్తడంతో 29 గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలోకి 4,22,117 క్యూసెక్కుల వరద వస్తుండగా 4,22,812 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. డెల్టా కాలువలకు 5,700 క్యూసెక్కులు వదులుతున్నారు. మరో రెండు రోజుల పాటు గోదావరిలో వరద ఉధృతి కొనసాగే అవకాశాలు ఉన్నాయని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పోలవరం స్పిల్‌వే నుంచి నీరు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రాజెక్టు ఈఈ డి.శ్రీనివాసరావు తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం సోమవారం 23.09 అడుగులు ఉండగా మంగళవారం 26.07 అడుగులకు పెరిగింది. ఒడిశాలో వర్షాలతో వంశధారలో వరద మరింత పెరిగింది. గొట్టా బ్యారేజీలోకి సోమవారం రాత్రి ఏడు గంటలకు 11,722 క్యూసెక్కులు చేరుతుండగా 6,971 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. -
రాజన్న నిను మరువలేమన్న..
సాక్షి, తెనాలి : తెనాలి ప్రాంతమే కాదు, కృష్ణా డెల్టాకు చిరకాలంగా కలగా మిగిలిపోయి, టీడీపీ పాలకులు పునాదిరాళ్లకే పరిమితం చేసిన పులిచింతల రిజర్వాయరుకు 2004 అక్టోబర్‌లో వైఎస్ శంకుస్థాపన చేశారు. అదే రోజు తెనాలి బహిరంగసభలో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుతో కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను అందిస్తానని చెప్పారు. ఆ ప్రకారం పులిచింతల, పోలవరం ప్రాజెక్టులను పనులు చకచకా ఆరంభించి చిత్తశుద్ధి చాటుకున్నారు. కృష్ణా పశ్చిమ డెల్టాలో రబీలో విస్తారంగా పెరుగుతూ వచ్చిన మొక్కజొన్నకు, ఏప్రిల్ ఆఖరు వరకు పంట కాలువల ద్వారా నీటిని సరఫరా చేశారు. కోరిన వరాలనిచ్చిన ప్రజాబంధువు.. గుంటూరు–హనుమాన్‌పాలెం డబుల్ లైన్ రహదారి, కొల్లిపర గ్రావుం నుంచి కృష్ణా కరకట్ట వరకు రెండులైన్ల సిమెంటు రోడ్డు, రూ.117 కోట్ల వ్యయంతో కృష్ణా కుడి వరద కట్ట విస్తరణ, మున్నంగిలో 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌తో సహా వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను నిర్వహించారు. గొడవర్రు వద్ద బ్యాంక్ కెనాల్‌పై బల్లకట్టు మునిగి 14 మంది చనిపోతే కృష్ణా పశ్చిమ మెయిన్ కెనాల్, రేపల్లె బ్యాంక్ కెనాల్‌పై 25 చోట్ల కాలిబాట వంతెనలు నిర్మించారు. భారీ పథకాలతో భరోసా... తెనాలిలో నిర్మించిన రాజీవ్ గృహకల్ప సముదాయాలను వైఎస్ స్వయంగా ప్రారంభించారు. అప్పుడే పట్టణం మెుత్తానికి రక్షిత మంచినీటి కోసం ఉద్దేశించిన రూ.93 కోట్ల కృష్ణా జలాల పథకానికి శంకుస్థాపన చేశారు. పట్టణంలోని యడ్ల లింగయ్యకాలనీలో అగ్ని ప్రమాదం కారణంగా ఇళ్లు కోల్పోయిన బాధితులకు నూరు శాతం పక్కాగృహాలను నిర్మించారు. చంద్రబాబునాయుడు పేరుతో ఉన్న మరో కాలనీలో మురుగు కాలువల నిర్మాణానికి రూ.30 లక్షల నిధులను మంజూరు చేశారు. కళాకారులకు ప్రభుత్వ పింఛన్‌ను రూ.200 నుంచి రూ. 500లకు పెంచి, అప్పటికి 21 నెలల బకాయిలను చెల్లించారు. కొ త్తగా మరో ఏడువేల మందికి ఇచ్చిన పింఛన్ల లో యాభైమందికి పైగా తెనాలి కళాకారులకు దక్కాయి. -
కృష్ణాకే గతిలేదు.. గోదావరి నీళ్లంట!
సాక్షి,పోరుమామిళ్ల : ఎన్నికల వేళ సీఎం చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రకటన చేశారు.వెలుగొండ నుంచి గోదావరి నీళ్లు తెప్పిస్తామని మొన్న బద్వేలులో జరిగిన సభలో పేర్కొన్నారు. పూర్తయిన బ్రహ్మంసాగర్‌కు కృష్ణాజలాలు ఇవ్వడం అంతంతమాత్రమే.వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. మళ్లీ గోదావరి పల్లవి అందుకున్నారు.గోదావరి జలాలు ఎలా తెస్తారో అయనకే తెలియాలి. వైఎస్సార్సీపీ నేతలు బ్రహ్మంసాగర్ నుంచి నీరందని పొలాలకు వెలుగొండ నుంచి అందించాలని నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, తదుపరి కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఒప్పించడంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి సఫలీకృతులయ్యారు. ఐదేళ్లుగా అధికారంలో ఉన్న సీఎం చంద్రబాబు ఏనాడూ దీనిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్నికళ వేళ ఇలా ప్రకటన చేయడంపై ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈసారి ఆయన మాటలను నమ్మేందుకు సిద్ధంగా లేరు. నందమూరి తారక రామారావు ప్రసాదించిన వరం తెలుగుగంగ ప్రాజెక్టు, బ్రహ్మంసాగర్ చంద్రబాబు పాలనలో కనుమరుగైన సంగతి ప్రజలు మరిచిపోలేదు. వైఎస్ జలయజ్ఞంతో బద్వేలుకు తెలుగుగంగ జలాలు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యంతో మళ్లీ పురుడు పోసుకుంది తెలుగుగంగ ప్రాజెక్టు. జలయజ్ఞంతో కుడి, ఎడమ కాలువలు పూర్తయ్యాయి. బ్రహ్మంసాగర్‌కు తెలుగుగంగ జలాలు చేరాయి. బద్వేలు ప్రజలు కష్ణాజలాలు కళ్లారా చూశారు. పంటలు సాగు చేశారు. ఆ నాయకుడు అనంతలోకాలకు వెళ్లడం, చంద్రబాబు అధికారంలోకి రావడంతో మళ్లీ గ్రహణం పట్టిందంటున్నారు ప్రజలు.ఉత్తరాదిన కురిసిన భారీ వానలకు వరదలు వచ్చి శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు చేరినా బ్రహ్మంసాగర్‌కు కనీసం 10 టీఎంసీ నీరివ్వలేదు. 17 టీఎంసీ సామర్థ్యం కలిగిన బ్రహ్మంసాగర్‌కు 5 టీఎంసీలతోనే సరిపెట్టారు. ఆ నీరు కూడా ఆర్టీపీపీకి తరలించారు. లక్షా అరవై అయిదు వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు 1983లో ప్రారంభమైన తెలుగుగంగ ప్రాజెక్టు 2005లో వైఎస్ హయాంలో పూర్తయింది. కాలువలు తయారై పుష్కరకాలం గడచినా ఒక్క ఎకరా భూమికి నీరు అందలేదు. అమ్మకు అన్నంపెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులంటే నమ్మాలా? పోరుమామిళ్ల, బద్వేలు ప్రాంతాలకు మూడు టీఎంసీలు ఇస్తే యాభైవేల ఎకరాలు సాగుకు నోచుకుంటాయి. బ్రహ్మంసాగర్‌కు 10 టీఎంసీలు వదిలితే లక్ష ఎకరాలు సాగవుతాయి. రెండు పట్టణాల ప్రజలకు తాగునీరు లభిస్తుంది. ఇందుకు కష్ణా జలాలే చాలు. మళ్లీ గోదావరి దాకా పోవాల్సిన అవసరం లేదు. కష్ణా నీరు ఇవ్వని ముఖ్యమంత్రి గోదావరి జలాలు తెస్తాడంటే జనాలు నవ్వరా? అమ్మకు అన్నం పెట్టనోడు అత్తకు బంగారు గాజులు చేయిస్తానంటే నమ్ముతారా? అచ్చం అలాగే ఉంది చంద్రబాబు వైఖరి. శ్రీశైలం నుంచి సకాలంలో నీరు వదిలితే బద్వేలులో కరువు ఉండదు. అందుకు శాశ్వత జీఓ విడుదల చేయాలి. అదేం చేయకుండా ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారు. బద్వేలు ఓటర్లనే కాదు రాయచోటి ఓటర్లను మాయ చేసేందుకు వారికి కష్ణాజలాల ఎర వేశారు. ఓటర్లు చంద్రబాబు గారడీలకు మోçసపోయేందుకు సిద్ధంగా లేరనే వాస్తవం ఆయన తెలుసుకొనే సమయం చాలా దగ్గరలోనే ఉందని పలువురు పేర్కొంటున్నారు. వెలుగొండ నీళ్లు కూడా ఇస్తాడట 1996లో చంద్రబాబే వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. తర్వాత దాన్ని మరచిపోయారు. వెలుగొండ వల్ల పోరుమామిళ్ల, కలసపాడు మండలాల్లోని 25 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. ఇది ఇప్పటి కల కాదు. నాలుగు దశాబ్దాల పోరాటం. అయినా పూర్తి కాలేదంటే పాలకుల చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థం అవుతోంది. -
ఎస్ఎల్బీసీ పూర్తికి మరో రెండేళ్లు
సాక్షి, హైదరాబాద్: ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(ఎస్ఎల్బీసీ) సొరంగ పనుల పూర్తికి మరో రెండేళ్లకుపైగా పట్టే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా కృష్ణా నదీజలాలను వినియోగించుకొని తెలంగాణలోని అవిభాజ్య మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలోని సుమారు నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు పురుడుపోసుకున్నది. 2020 అక్టోబర్ 31 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిపూర్తి చేసి తీరుతామంటూ పనులు చేపట్టిన జయప్రకాశ్ అసోసియేట్ అనే సంస్థ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. ప్రాజెక్టు ఆరంభం నుంచి సొరంగం పనుల్లో ఎప్పుడూ ఓ ఆటంకం ఎదురవుతోంది. తాజాగా టన్నెల్ బోరింగ్ మిషన్ పాడవడంతో దాని మరమ్మతులకు మరో రూ.60కోట్లు అడ్వాన్స్ కోరగా ప్రభుత్వం అందుకు సమ్మతించింది. అవాంతరాలు.. జాప్యం 2004లో ఎస్ఎల్బీసీ సొరంగం పనులకు రూ.2,813 కోట్లతో టెండర్లు పిలవగా 2005 ఆగస్టులో రూ.1,925 కోట్లకు జయప్రకాశ్ అసోసియేట్ ఏజెన్సీ పనులు దక్కించుకుంది. ఈ పనులను 2010 వరకు పూర్తి చేయాల్సి ఉన్నా, భూసేకరణ సమస్యలు, వరదల కారణంగా పనులు ఆలస్యంగా కొనసాగుతున్నాయి. పనుల ఆలస్యం కారణంగా వ్యయం రూ.4,200 కోట్లకు పెరిగింది. ఇందులో ఇప్పటివరకు రూ.2,200 కోట్లు ఖర్చు చేశారు. మిగతా పనులు కొనసాగుతుండగా, ఇటీవల ఔట్లెట్ టన్నెల్ బోరింగ్ మిషన్ మరమ్మతులకు గురైంది. ఈ బోరింగ్ మిషన్ బేరింగ్, కన్వెయర్బెల్టు పాడవడంతో పనులు నిలిచిపోయాయి. ఈ బోరింగ్ మిషన్ మరమ్మతులకే ఏడు నెలలు పట్టనున్న నేపథ్యంలో డెడ్లైన్లో పనుల పూర్తి సాధ్యమా అన్నదానిపై అనేక సందేహాలున్నాయి. -
హే...కృష్ణా!
► కృష్ణా మూడో దశతో పాక్షికంగా నీటి సరఫరా ► శివార్లలో ఇంకా తీరని దాహార్తి ► అసంపూర్తిగా ఫిల్టర్‌బెడ్స్, జంక్షన్లు, రింగ్‌మెయిన్ నిర్మాణం ► అల్లాడుతున్న జనం సాక్షి, సిటీబ్యూరో : కృష్ణా మూడోదశ ట్రయల్న్‌త్రో నగరానికి పాక్షికంగా మంచినీటి సరఫరా జరుగుతున్నా... శివార్ల దాహార్తి తీరడం లేదు. నగరానికి అదనంగా 22.5 మిలియన్ గ్యాలన్ల జలాలను తరలిస్తున్నట్లు జలమండలి ఆర్భాటంగా ప్రకటిస్తున్నా.. ప్రయోజనం కనిపించడం లేదు. మూడో దశలో భాగంగా న ల్గొండ జిల్లా కోదండాపూర్ వద్ద సుమారు 34 ఫిల్టర్బెడ్ల నిర్మాణం పూర్తి కాకపోవడం... నీటిని నగరం నలుమూలలకు సరఫరా చేసేందుకు అవసరమైన రింగ్‌మెయిన్-1 పనుల్లో ఐదు కిలోమీటర్లు అసంపూర్తిగా ఉండడం... జంక్షన్ల నిర్మాణ పనులు టెండర్ల దశలో ఉండడంతో మూడో దశతో దాహార్తి తీరుతుందనుకున్న వారు మరికొన్నాళ్లు వేచి ఉండక తప్పని దుస్థితి నెలకొంది. లెక్కల చిక్కులు.. కృష్ణా మూడోదశలో కోదండాపూర్‌లో నిర్మించాల్సిన 40 ఫిల్టర్బెడ్లలో ఇప్పటికి కేవలం 6 మాత్రమే పూర్తయినట్లు సమాచారం. మరోవైపు ఇక్కడ ఏర్పాటు చేసిన 8 మోటార్లలో రెండింటిని మాత్రమే ప్రారంభించి.. నగరానికి నిత్యం 22.5 ఎంజీడీల నీటిని పంపింగ్ చేస్తున్నట్లు తెలిసింది. కృష్ణా ఫేజ్-1, ఫేజ్-2లో సరఫరా చేస్తున్న 180 ఎంజీడీలలో కొంత మేర తగ్గించి... మూడోదశలో 22.5 ఎంజీడీలు సరఫరా చేస్తున్నట్లు అంకెల గారడీ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. కొందరు అధికారులు ఏకంగా మూడోదశలో అదనంగా నిత్యం 30 ఎంజీడీలు తరలిస్తున్నట్లు సర్కారు పెద్దలు, మంత్రులను తప్పుదోవ పట్టిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ వరకూ నిరీక్షణ రూ.1670 కోట్ల అంచనాతో చేపట్టిన కృష్ణా మూడోదశలో నగరానికి పూర్తి స్థాయిలో 90 ఎంజీడీలు తరలించాలని నిర్ణయించిన విషయం విదితమే. ఈ నీటిని తీవ్ర దాహార్తితో అలమటిస్తున్న ఉప్పల్, కాప్రా, మల్కాజ్గిరి, అల్వాల్, సైనిక్‌పురి, బోడుప్పల్, ప్రశాసన్‌నగర్, మైలార్‌దేవ్‌పల్లి తదితర ప్రాంతాలకు రెండురోజులకోమారు సరఫరా చేయాంటే సుమారు 50జంక్షన్ల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సి ఉంది. ఈ పనులకు ప్రస్తుతం జలమండలి టెండర్ల ప్రక్రియను చేపట్టింది. మరోవైపు రింగ్‌మెయిన్-1లో ఐదు కిలోమీటర్ల మేర పైప్‌లైన్ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ప్రధాన నగరంలో ట్రాఫిక్ చిక్కులు, జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన రహదారి కోత అనుమతులు ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఈ పనులు మందగమనంలో సాగుతున్నాయి. ఇక కోదండాపూర్లోనూ 34 ఫిల్టర్బెడ్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. ఈ కారణాల రీత్యా మూడోదశను పూర్తి స్థాయిలో సాకారం చేయాలంటే ఈ ఏడాది సెప్టెంబరు వరకు నిరీక్షించకతప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పనులపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయిలో సమీక్ష నిర్వహిస్తేనే త్వరితగతిన పూర్తవుతాయని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. -
కృష్ణాజలాలు లేకుంటే సీమ ఎడారే: నారాయణ
మదనపల్లె: కృష్ణాజలాలను అదనంగా తీసుకురాకపోతే రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. ఆదివారం చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని పార్టీ కార్యాలయంలో రాయలసీమ పరిధిలోని నాలుగు జిల్లాల పార్టీ కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలతో హంద్రీ-నీవా ప్రాజెక్టు సాధనకై రైతు సదస్సును నిర్వహించారు. నారాయణ మాట్లాడుతూ కృష్ణామిగులు జలాలను రాయలసీమ ప్రాంతానికి తీసుకురావడంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ఎన్టీఆర్ హయాంలో చేపట్టిన హంద్రీ-నీవా, గాలేరు ప్రాజెక్టుల నిర్మాణ పనులు పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటికీ అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయని తెలపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు వెడల్పు చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం రాయలసీమకు 40 టీఎంసీల కృష్ణాజలాలు ఇస్తున్నారని దాన్ని వంద టీఎంసీలకు పెంచాలని డిమాండ్ చేశారు. నీటి సమస్య పరిష్కారం కోసం డిసెంబర్ 5న రాయలసీమలోని అన్ని జిల్లాల మండల కార్యాలయాల ఎదుట తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నట్టు ఆయన చెప్పారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అసమర్థ పాలన వల్ల చిత్తూరు జిల్లాలోనూ నీటి సమస్య పెరిగిపోయిందన్నారు. సమావేశం జరుగుతుండగా టీడీపీ నాయకులు మధ్యలో వచ్చి సమైక్యవాదానికి మద్దతు తెలపాలని ఆయన్ను డిమాండ్ చేశారు. చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతాన్ని వదిలి సమైక్యానికి కట్టుబడితే తాను చెవులు కోసుకుంటానని వారితో నారాయణ అన్నారు. 28, 29న ఢిల్లీలో బైరెడ్డి ధర్నా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని విడదీస్తే రాజధానిని సీమాంధ్రలోనే ఏర్పాటు చేయాలని కోరుతూ రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డి ఈ నెల 28, 29 తేదీల్లో ఢిల్లీలో ధర్నా చేయనున్నారు. రాజధాని ఏర్పాటుతో పాటు నీటి ఒప్పందాలు సక్రమంగా జరగాలని, అలా కాని పక్షంలో రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.