lalith gate
-
లలిత్ మోదీ కేసులో ఇంటర్ పోల్ తకరారు
ముంబై/లిస్బన్: లలిత్ గేట్ కుంభకోణంలో అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటర్ పోల్ మరో తకరారుకు తెరలేపింది. ఐపీఎల్ ప్రసార హక్కుల కుంభకోణం వ్యవహారంలో లలిత్ మోదీ నిజంగానే అక్రమాలకు పాల్పడ్డారా? లేక ఉద్దేశపూర్వకంగా ఇరికించారా? మీరు మోపిన అభియోగాల్లో వాస్తవం ఎంత? ఆమేరకు ఆధారాలున్నాయా? వంటి ప్రశ్నలు సంధిస్తూ వారంలోగా సమాధానాలు చెప్పాలని ఇంటర్ పోల్ సీబీఐని కోరింది. తీవ్రమైన ఆర్థిక నేరానికి పాల్పడ్డారనే ఆరోపణు ఎదుర్కొంటూ, ప్రస్తుతం విదేశం(పోర్చుగల్)లో నివసిస్తున్న లలిత్ మోదీపై ఈడీ గత ఆగస్టులో రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసింది. దీంతో ఈ కేసులోకి ఇంటర్ పోల్ రంగప్రవేశం చేసింది. కాగా, ఒక కేంద్ర మంత్రి సహా కొందరు బీసీసీఐ పెద్దలు ఉద్దేశపూర్వకంగా తనను టార్గెట్ చేశారని, ఈడీ ఆరోపణల ఆధారంగా తనకు నోటీసులు జారీచెయ్యొద్దంటూ లలిత్ మోదీ ఇంటర్ పోల్‌ను కోరాడు. అతని అప్పీలును పరిశీలించిన ఇంటర్ పోల్.. కేసు ప్రేరితమా? కాదా? అంటూ మౌలిక ప్రశ్నలు లేవనెత్తింది. లలిత్ మోదీ అప్పీళ్లపై వచ్చేవారం విచారణ జరగనున్నందున ఆలోపే సమాధానాలు పంపాలని ఇంటర్ పోల్ కోరింది. 'సాధారణంగా తాను దర్యాప్తు చేసే కేసుల వివరాలను ఈడీ.. భారతీయ కోర్టులకు తప్ప ఇతర అంతర్జాతీయ సంస్థలకు వెల్లడించదు. అలాంటిది పదేపదే వివరాలు తెలపాలంటూ ఇంటర్ పోల్ ఈడీని కోరుతోంది. లలిత్ మోదీ ఏదో ఒక ఇష్యూను ఇంటర్ పోల్ ముందుంచడం, వాటికి సమాధానాలివ్వాలంటూ ఇంటర్ పోల్, ఈడీని ప్రశ్నిస్తోంది. మొత్తంగా ఇదేదో కోర్టు విచారణ ఉందేకాని, దర్యాప్తుల సాగటంలేదు'అని ఈడీ సీనియర్ అధికారి ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి లలిత్ మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసింది ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్)నే అయినప్పటికీ, భారత్‌లో ఇంటర్ పోల్ కు సీబీఐ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్నందున ఆ సంస్థ ద్వారానే ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. ఈమేరకు ఈడీ నుంచి సమాచారం సేకరించి పంపాలని ఇంటర్ పోల్ సీబీఐని కోరింది. -
'రాహుల్ ఓ జ్ఞానంలేని మేధావి'
న్యూఢిల్లీ: మరోసారి సుష్మా స్వరాజ్‌కు బీజేపీ అండగా నిలిచింది. ఆమె ఎలాంటి తప్పు చేయలేదని లోక్‌సభలో స్పష్టం చేసింది. బుధవారం రాహుల్ గాంధీ ప్రసంగం పూర్తయ్యాక కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ లలిత్ గేట్ వ్యవహారంపై వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ జ్ఞానం లేని మేధావి అని ఆయన తీవ్రంగా విమర్శించారు. లలిత్ గేట్ వ్యవహారంలో సుష్మా స్వరాజ్ రాజీనామా చేసే ప్రసక్తి లేదని తెగేసి చెప్పారు. ఆమెపై చేసిన ఆరోపణలన్నీకూడా నిరాధారమైనవని చెప్పారు. ఐపీఎల్ కుంభకోణం 2009లో వెలుగులోకి వచ్చిందని చెప్పారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ సరిగా వ్యవహరించకపోవడం ద్వారానే ఇక్కడి వరకు వచ్చిందని చెప్పారు. రిజర్వ్ బ్యాంకు తెలియకుండానే దక్షిణాఫ్రికా బ్యాంకుకు ఐపీఎల్ సొమ్ము తరలిందని చెప్పారు. ఈ వ్యవహారంలో నాటి కాంగ్రెస్ పార్టీ లలిత్ మోదీకి లైట్ బ్లూ కార్నర్ నోటీసులు ఇచ్చిందని, ఇది దేశియ విమానాశ్రయాలకు మాత్రమే వర్తిస్తుందని, కానీ, అప్పటికే లలిత్ దేశం విడిచి లండన్ వెళ్లారని చెప్పారు. ఇక ఫెమా చట్టం కింద నాడు కేసులు పెట్టారని, దీని ప్రకారం అరెస్టు చేయడం కుదరదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మోదీ తప్పించుకు విదేశాల్లో తిరుగుతున్నారని అన్నారని, కానీ చట్టం దృష్ట్యా కోర్టుల దృష్ట్యా అది తప్పించుకొని తిరిగినట్లు కాదని వివరన ఇచ్చారు. బ్రిటన్ చట్టాల ప్రకారం ఏమేం చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకోండని తాము బ్రిటన్‌కు చెప్పామని, అసలు కాంగ్రెస్ పార్టీ సరిగా వ్యవహరించి ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండేవే కావని అన్నారు. తాము ఇప్పుడు లలిత్ మోదీ విషయంలో సరిగానే వ్యవహరిస్తున్నామని, అందుకే మనీ లాండరింగ్ కింద కేసులు నమోదుచేసినట్లు వివరించారు. -
తప్పులు చేసింది మేము కాదు.. మీరు.
-
తప్పులు చేసింది మేము కాదు.. మీరు
అధికారంలో ఉండగా తప్పుల మీద తప్పులు చేసింది కాంగ్రెస్ నాయకులే తప్ప.. తాను ఎలాంటి తప్పు చేయలేదని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. లలిత్ మోదీ వ్యవహారంపై లో్క్సభలో బుధవారం జరిగిన చర్చకు ఆమె సమాధానం ఇచ్చారు. ఈ సమయంలో కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేస్తుండటంతో.. తన సమాధానం వినేందుకు ప్రతిపక్షం సిద్ధంగా లేదని చెప్పారు. పి. చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలోనే ఆదాయపన్ను శాఖ ఆయన భార్య నళినీ చిదంబరాన్ని తమ న్యాయవాదిగా నియమించుకుందని, ఇది తప్పుకాదా అని సుష్మా స్వరాజ్ ప్రశ్నించారు. తన భర్త లలిత్ మోదీ పాస్‌పోర్టు విషయంలో న్యాయవాదిగా వ్యవహరించలేదని ఆమె చెప్పారు. లోక్‌సభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే చేసిన ఆరోపణలపై ఆమె ఈ విషయాలు చెప్పారు. తన కూతురు 9వ నెంబరు జూనియర్ అని, ఆ నెంబరులో ఉండే న్యాయవాదికి ఎవరైనా ఒక్క రూపాయైనా ఇస్తారా అని ప్రశ్నించారు. లలిత్ మోదీ నుంచి ఈ కేసులో తన కూతురికి ఒక్క రూపాయి కూడా లభించలేదని స్పష్టం చేశారు. తాను తన తప్పు అంగీకరించినట్లు మల్లికార్జున ఖర్గే చెబుతున్నారని, కానీ.. తాను మాత్రం కేవలం కేన్సర్‌తో బాధపడుతున్న ఒక భారతీయ పౌరురాలికి సాయం చేశానని మాత్రమే చెప్పానని ఆమె అన్నారు. అలాంటి మహిళకు సాయం చేయడం తప్పే అయితే.. తాను తన తప్పు అంగీకరిస్తాననే అన్నానని గుర్తుచేశారు. దీన్ని తాను తప్పు అంగీకరించినట్లు ఖర్గే భావిస్తారాన అని ప్రశ్నించారు. కాగా, ఈ చర్చ సందర్భంగా ఖత్రోచీ నుంచి బోఫోర్స్ వరకు కాంగ్రెస్ మీద వచ్చిన ఆరోపణలన్నింటినీ సుష్మా స్వరాజ్ ప్రస్తావించారు. అయితే.. ఆమె మాట్లాడుతున్నంత సేపు కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేస్తూనే ఉన్నారు. సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాలంటూ ఆమె ప్రసంగానికి అడ్డు తగిలారు. కానీ సుష్మా మాత్రం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. కాంగ్రెస్ మీద ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. ఆమె ఒక్కో ఆరోపణ చేస్తున్నపుడు కాంగ్రెస్ ఎంపీలు నినాదాల మీద నినాదాలు చేస్తూనే ఉన్నారు. 15 వేల మంది మరణానికి కారణమైన ఆండర్సన్‌ను దేశం నుంచి దాటించింది కాంగ్రెస్ నాయకత్వం కాదా అని నిలదీశారు. క్విడ్ ప్రో కో ప్రకారమే ఆండర్సన్‌ను దేశం దాటించారని ఆరోపించారు. శారదా కుంభకోణంలో నళినీ చిదంబరం కోటి రూపాయల ఫీజు తీసుకున్నారని అన్నారు. చాటుమాటు కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీకే అలవాటు తప్ప తమకు అలవాటు లేదని చెప్పారు. -
లలిత్ మోదీ ఎంత డబ్బిచ్చాడు?
న్యూఢిల్లీ: నాటకాలండంలో నేర్పరంటూ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌పై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విరుచుకుపడిన కొద్దిసేపటికే తనయుడు రాహుల్ గాంధీకూడా ఆమెను అనుసరించారు. సహాయం చేసినందుకుగానూ లలిత్ మోదీ ఎంత డబ్బు ముట్టజెప్పాడో వెంటనే వెల్లడించాలని సుష్మాను డిమాండ్ చేశారు. 'నా స్థానంలో మీరుంటే ఏం చేసేవారని సుష్మా స్వరాజ్.. మా అమ్మ (సోనియా గాంధీ)ని అడిగారు. ఆ ప్రశ్నకు సమాధాంనం నేను చెబుతా. సుష్మాజీ.. మా అమ్మ మీలా చట్టవ్యతిరేకమైన పనులు చేయరని కచ్చితంగా చెప్పగలను. మీరు మీ శాఖను చీకటిమయం చేశారు. తనకు సహాయం చేసినందుకు లలిత్ మోదీ మీ కుటుంబానికి ఎంత డబ్బిచ్చాడో వెల్లడించాలి' అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. -
లలిత్ మోదీ ఎంత డబ్బిచ్చాడు?
-
తొలిరోజే దద్దరిల్లిన రాజ్యసభ
-
ఊహించినట్లుగానే వాడివేడిగా..
న్యూఢిల్లీ : అంతా ఊహించినట్లుగానే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. లలిత్ 'మోదీ గేట్' తొలి రోజే పార్లమెంట్‌ను కుదిపేసింది. రాజ్యసభలోనూ ఇదే అంశంపై గందరగోళం చెలరేగింది. దాంతో విపక్షాల నిరసనల మధ్య సభ పన్నెండు గంటలకు వాయిదా పడింది. మంగళవారం ఉదయం రాజ్యసభ ప్రారంభమైన తర్వాత విపక్షాలు లలిత్ మోదీ వీసా వివాదాన్ని లేవనెత్తాయి. ఈ అంశాన్ని ప్రస్తావించిన కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ అధికారపక్షంపై ఎదురుదాడికి దిగారు. లలిత్ వీసా విషయంలో విదేశాంగ నియమాలు యథేచ్చగా ఉల్లంఘించినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీలు ఛైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలతో హోరెత్తించారు. లలిత్ గేట్‌పై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌పై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. లలిత్ మోదీ వీసా వివాదంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వైస్ ఛైర్మన్ కురియన్ ...అన్ని అంశాలు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, సభ్యులు తమ ఆందోళన విరమించి తమ తమ స్థానాల్లో కూర్చోవాలని సూచించినా ఫలితం లేకపోయింది. సభ్యుల నిరసనలు, నినాదాలతో కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలగటంతో ఆయన సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. కాగా అంతకుముందు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన బీజేపీ నేత ఎంజే అక్బర్‌తో ఛైర్మన్ హమీద్ అన్సారీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ చూపిన భారతీయులను సభ అభినందనల్లో ముంచెత్తింది. పీఎస్ఎల్వీ ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో బృందంపై ప్రశంసలు కురిపించిన సభ వింబుల్డన్ టైటిల్ గెలిచిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, లియాండర్ పేస్‌కు అభినందనలు తెలిపింది. మరోవైపు మొదటి రోజు ఎలాంటి అధికారిక కార్యక్రమాలు చేపట్టకుండానే లోక్ సభ వాయిదా పడింది. మంగళవారం సభ ప్రారంభమైన తర్వాత...... ఇటీవల మృతి చెందిన పార్లమెంట్ సభ్యులకు సభ నివాళి అర్పించింది. దివంగత సభ్యుల ఆత్మలకు శాంతి చేకూరాలంటూ... రెండు నిమిషాలు మౌనం పాటించింది. తర్వాత వరంగల్ ఎంపీ పదవికి టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి చేసిన రాజీనామాను ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. -
తొలిరోజే దద్దరిల్లిన రాజ్యసభ
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు ప్రారంభం రోజే విపక్షాల ఆగ్రహ జ్వాలల్లో పడ్డాయి. కొన్ని తీర్మానాల తర్వాత లోక్ సభ వాయిదా పడగా.. రాజ్యసభలో మాత్రం లలిత్ మోదీ వీసా వ్యవహారం దుమారం రేపింది. రాజ్యసభను దద్దరిల్లేలా చేసింది. విపక్షాలన్నీ స్పీకర్ పోడియం చుట్టుముట్టేందుకు ప్రయత్నించాయి. ప్లకార్డులు, పోస్టర్లతో సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. లలత్ మోదీపై ఎఫ్ఐఆర్ దాఖలైందని, ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు అందుకున్నారని చెప్పారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆనంద్ శర్మ లలిత్ మోదీ వ్యవహారాన్ని లేవనెత్తారు. లలిత్ మోదీ కుంభకోణాన్ని తొలిసారి గుర్తించింది ఇంగ్లాండ్ అని చెప్పారు. భార్య అనారోగ్యం పేరిట లలిత్ మోదీ విదేశాల్లో తిరుగుతున్నారని, రెడ్ కార్నర్ నోటీసులు ఉన్న ఓ వ్యక్తిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయడం లేదని, అక్కడ నుంచి భారత్‌కు ఎందుకు రప్పించడం లేదని నిలదీశారు. పది నెలలు గడుస్తున్నా లలిత్ మోదీని అరెస్టు చేయకపోవడానికి కారణాలేమిటో ప్రధాని చెప్పాలని ప్రశ్నించారు. ఆయన విదేశాలకు వెళ్లేందుకు మీ పార్టీ నేతలు సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సహకరించినా వారిపై ఎందుకు ఇప్పటివరకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ప్రభుత్వాలు మారుతుండొచ్చుగానీ, చట్టాలు మారవు కదా అని ప్రశ్నించారు. లలిత్ మోదీకి కావాలనే ఎన్డీయే సర్కార్ పరోక్షంగా సహకరిస్తోందని అని ఆనంద్ శర్మ ఆరోపించారు. దీనికి తోడు కాంగ్రెస్ నేతలు వీహెచ్లాంటివారు కూడా ఎన్డీయేపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. లలిత్ మోదీ వ్యవహారంపై చర్చించాలని, ఆయనను అరెస్టు చేయాలని, లలిత్ కు సహకరించిన నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌తో తమ ఎదురుగా ఉన్న బల్లలు చరుస్తూ కేకలు వేశారు. దీంతో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కలగజేసుకున్నారు. లలిత్ మోదీ వీసా వివాదంపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెప్పారు. తమ నేతలెవరూ ఏ తప్పూ చేయలేదని ఆయన చెప్పే యత్నం చేసినా వినకపోవడంతో రాజ్యసభ 12గంటల వరకు వాయిదా పడింది. -
'తప్పు చేయలేదు.. వాళ్లు రాజీనామా చేయరు'
న్యూఢిల్లీ: తమ మంత్రులెవరూ ఏ తప్పూ చేయలేదని, ఎవరు రాజీనామా చేసే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో సోమవారం ప్రధాని మోదీ అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న విపక్ష నేతలు ఇటీవల లలిత్ మోదీ గేట్‌కు సంబంధించి వార్తల్లో నిలిచిన సుష్మా స్వరాజ్, వసుంధర రాజే, విద్యార్హతల గురించి తప్పుడు సమాచారం ఇచ్చిన స్మృతి ఇరానీలను వెంటనే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. లేదంటే వారిపై ప్రత్యేక దర్యాప్తు జరిపించాలన్నారు. వారు అవినీతికి పాల్పడినా ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్నను లేవనెత్తారు. దీనిపై స్పందించిన వెంకయ్యనాయుడు తమ మంత్రులు ఎవరూ ఏ తప్పు చేయలేదని గట్టిగా సమర్థించారు. చట్ట విరుద్ధమైన పనులుగానీ, అవినీతికిగానీ వారు పాల్పడలేదని తెలిపారు. -
ఈడీకి మోదీ షాక్
ముంబై: ఐపీఎల్ స్కామ్‌స్టర్ లలిత్ మోదీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు షాకిచ్చాడు. గతవారం తాము జారీచేసిన సమన్లను మోదీ తిప్పిపంపారని ఈడీ అధికారులు మంగళవారం వెల్లడించారు. అయితే అది నిజంకాదని, ఇప్పటివరకు తమకు ఎలాంటి సమన్లు అందలేదని మోదీ తరఫు న్యాయవాది మహమ్మద్ ఎం అబ్దీ చెప్పుకొచ్చారు. ఐపీఎల్లో దాదాపు రూ.1700 కోట్ల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మోదీ.. 2008లో ఐపీఎల్ టీవీ ప్రసార హక్కుల విక్రయాలకు సంబంధించిన రూ. 425 కోట్ల చెల్లింపుల విషయంలో అక్రమాలకు పాల్పడ్డాడని ఈడీ నిర్ధారణకు వచ్చింది. ఈ క్రమంలోనే మూడువారాల్లోగా తన ఎదుట విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జరీచేసింది. కాగా, ఈ సమన్లు తీసుకునేందుకు తాను అర్హుడినికానంటూ మోదీ తరఫు న్యాయవాది సమన్లను తిప్పిపంపారని ఈడీ అధికారులు చెప్పారు. దీనిని కొట్టిపారేసిన అబ్దీ.. తనకు ఎలాంటి సమన్లు అందలేదని స్పష్టం చేశారు. 'ఈడీ అధికారుల తీరు మరీ విడ్డూరంగా ఉంది. ప్రస్తుతం లలిత్ నివసిస్తోన్న లండన్ అడ్రస్ వారికి తెలుసు. నిబంధనల ప్రకారం సమన్లు ఎలా పంపుతారో వారికి తెలియదా' అని అబ్దీ వ్యాఖ్యానించారు.