
లలిత్ మోదీ ఎంత డబ్బిచ్చాడు?
న్యూఢిల్లీ: నాటకాలండంలో నేర్పరంటూ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్పై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విరుచుకుపడిన కొద్దిసేపటికే తనయుడు రాహుల్ గాంధీకూడా ఆమెను అనుసరించారు. సహాయం చేసినందుకుగానూ లలిత్ మోదీ ఎంత డబ్బు ముట్టజెప్పాడో వెంటనే వెల్లడించాలని సుష్మాను డిమాండ్ చేశారు.
'నా స్థానంలో మీరుంటే ఏం చేసేవారని సుష్మా స్వరాజ్.. మా అమ్మ (సోనియా గాంధీ)ని అడిగారు. ఆ ప్రశ్నకు సమాధాంనం నేను చెబుతా. సుష్మాజీ.. మా అమ్మ మీలా చట్టవ్యతిరేకమైన పనులు చేయరని కచ్చితంగా చెప్పగలను. మీరు మీ శాఖను చీకటిమయం చేశారు. తనకు సహాయం చేసినందుకు లలిత్ మోదీ మీ కుటుంబానికి ఎంత డబ్బిచ్చాడో వెల్లడించాలి' అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.