Legendary Actor
-
Superstar Krishna: లెజెండరీ యాక్టర్ కృష్ణ జయంతి.. ఈ రేర్ ఫొటోస్ చూశారా?
-
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
కైకాల మృతి.. స్వగ్రామంలో విషాదఛాయలు.. కంటతడి పెట్టిన స్నేహితులు
గుడ్లవల్లేరు: ప్రముఖ సినీనటుడు కైకాల సత్యనారాయణ మరణవార్తతో ఆయన స్వగ్రామం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో విషాదఛాయలు అలముకున్నాయి. కైకాలతో అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఆయన స్నేహితులు, గ్రామస్తులు విచారం వ్యక్తంచేశారు. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుని కంటతడి పెట్టారు. సినీనటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తరచూ తాను పుట్టి, పెరిగిన ఊరికి వచ్చేవారని, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సందడి చేసేవారని చిన్ననాటి స్నేహితులు కానూరి పూల రామకృష్ణారావు, బాడిగ ఫణిభూషణరావు, కానూరి రాజేంద్రప్రసాద్‌లు చెప్పారు. కౌతవరంలో తన తాత కంభంమెట్టు రామయ్య పేరిట ప్రభుత్వ ప్రసూతి కేంద్రం ఏర్పాటుకు కృషిచేశారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో సుమారు రూ.40లక్షల ప్రభుత్వ నిధులతో కొత్త ఆస్పత్రిని నిర్మించేలా చూశారు. కౌతవరం–చేవెండ్ర రోడ్డు నిర్మాణం కూడా ఆయన వల్లే సాధ్యమైందని గ్రామస్తులు తెలిపారు. -
కొత్త విలనీకి పెట్టింది పేరుగా...
హీరో గానూ, ప్రతినాయ కుడిగానూ 200కు పైగా సినిమాల్లో నటించి ఒక నటుడిగా భారతీయ సినీ చరిత్రలో తన స్థానాన్ని నిలుపుకొన్న నటుడు అజిత్. మొదట హీరోగా నటించి, తర్వాత ఆధునిక పాశ్చాత్య ఆహార్యంతో ఆయన విలన్ పాత్రలకు గొప్ప హుందాతనాన్ని తెచ్చాడు. ఆయన అసలు పేరు అజిత్ హమీద్ అలీఖాన్. 1922 జనవరి 27న గోలకొండలో జన్మించాడు. ఆయన తండ్రి బషీర్ అలీ ఖాన్ పఠాన్ నిజామ్ సైన్యంలోనూ, పరిపాలనా విభాగంలోనూ పని చేశాడు. అజిత్ వరంగల్ గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్న రోజుల్లో... అతడి ప్రతిభను గుర్తించిన తోటి విద్యార్థులు, టీచర్లు ఆయనను సినిమాల్లో చేరమని ప్రోత్సహించడంతో అటువైపు ఆలోచిం చాడు. కానీ తండ్రికి అజిత్ సినిమాల్లో చేరడం అంతగా ఇష్టం ఉండేది కాదు. అయినా అజిత్ ఒక రోజు తన పుస్తకాలు అమ్మేసి 1943లో బొంబాయి రైలెక్కేశాడు. తన వెంట హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కవి షాహిద్ సిద్దికీ బోంబేలో ప్రముఖ దర్శకుడు రఫీక్ ఘజ్నవీకి రాసిన ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళాడు. బోంబే వెళ్ళగానే రఫీక్ ఘజ్నవీని కలిసి పరిచయం చేసు కున్నాడు అజిత్. కానీ అప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రఫీక్ తాను సినిమాలు తీయడం లేదని చెప్పడంతో ఇక ఎక్స్ట్రా వేశాలు వేస్తూ మూడేళ్లు గడిపాడు. 1946లో ఇన్ఫర్మేషన్ ఫిల్మ్స్ ఆఫ్ ఇండియా సంస్థ నిర్మించే డాక్యుమెంటరీ సినిమాలల్లో పనిచేసే అవకాశం అతడికి వచ్చింది. ఒక్కో ఫిల్మ్‌కు అజిత్‌కు 125 రూపాయల పారితోషికం లభించేది. అలా అజిత్ వేస్తున్న పాత్రలు, అతనిలోని ప్రతిభ కొంతమంది సినీ నిర్మాతలు, దర్శకుల దృష్టిలో పడ్డాయి. క్రమంగా అవకాశాలు పెరిగిపోయాయి. 1946లో గీతా బాలి హీరోయిన్గా అజిత్ హీరోగా ‘షా–ఏ–మిశ్రా’ సినిమా రూపొందింది. అలా అజిత్ సినీ ప్రస్థానం హీరోగా మొదలయింది. తర్వాత హాతిమ్ తాయి (1947), పతంగా, జీవన్ సాథీ (1949), బేకసూర్ (1950) తదితర సినిమాలతో అజిత్ క్రమంగా నటుడిగా స్థిరపడ్డాడు. 1945లో వచ్చిన ‘నాస్తిక్’ సినిమా ఆర్థికంగా గొప్ప విజయం సాధించడంతో అజిత్ బొంబేలో నటుడిగానూ, అటు ఆర్థికంగానూ స్థిరపడ్డాడు. 1955లో విడుదల అయిన ‘మరైన్ డ్రైవ్’ సినిమా 50 వారాలు ఆడి సాధించిన విజయం అజిత్‌లో నూతనో త్సాహాన్ని నింపింది. అందులో బీనా రాయ్ హీరో యిన్. తర్వాత ‘26 జనవరి’ 1956లో విడుదల అయింది. అందులో నళినీ జయంత్ నాయకి. అజిత్ హీరోగా నళిని జహాంత్తోనే అధిక సినిమాల్లో నటించాడు. హిందీ సినిమా రంగానికి సంబంధించి నటన, నిర్మాణ, దర్శకత్వ తదితర అన్నీ రంగాల్లో ప్రధాన భూమికను పోషించిన ‘కపూర్’ వంశంతో అజిత్‌కు మంచి సంబంధాలు ఉండేవి. 1966లో రాజేంద్ర కుమార్ హీరోగా వచ్చిన ‘సూరజ్’లో విలన్‌గా నటించి తన నూతన అధ్యాయాన్ని ఆరంభించాడు అజిత్. అప్పటికే విలన్లుగా పలువురు నటులు స్థిరపడి ఉన్నప్పటికీ అజిత్ తనదైన ప్రత్యేకతతో ‘ప్రిన్స్’ లాంటి పలు సినిమాలతో విలన్‌గా నిలదొక్కుకో గలిగాడు. 1973లో వచ్చిన ‘జంజీర్’ ఆయన విలనీ పాత్రలకు స్థిరమైన స్థానాన్ని ఇచ్చింది. అలా అజిత్ 57కు పైగా సినిమాల్లో విలన్ పాత్రల్ని పోషించాడు. అలా విలన్‌గా కెరీర్ కొనసాగుతూ ఉండగానే అజిత్ 1985లో సినిమాల్ని మానుకుని కుటుంబంతో సహా హైదరాబాద్ చేరుకున్నాడు. 1998 అక్టోబర్ 21న తన 76వ ఏట తాను అమితంగా ఇష్టపడే హైదరబాద్ నగరంలోనే తుది శ్వాస విడిచాడు. - వారాల ఆనంద్ సినీ విమర్శకుడు (‘దక్కన్ హెరిటేజ్ ట్రస్ట్’ తరఫున అజిత్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా...) -
నలభయ్యేళ్ల తర్వాత వేదిక పంచుకున్నాం
‘‘పండంటి కాపురం’ చిత్రంలో జయసుధ నా కూతురిగా నటించింది. ఆమెకి కూడా అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే నాకు ఈ లైఫ్‌టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు రావడం ఆనందంగా ఉంది’’ అని సీనియర్ నటి జమున అన్నారు. వీబీ ఎంటర్టైన్మెంట్స్పై ఆరేళ్లుగా బుల్లి తెర అవార్డులను అందిస్తున్న విష్ణు బొప్పన గత రెండేళ్లుగా వెండి తెర అవార్డులను కూడా అందిస్తున్నారు. ఈ ఏడాది జమునకు లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్టు, జయసుధకు లెజెండరీ అవార్డుతో పాటు పలువురు కళాకారులకు అవార్డులను అందజేశారు. జయసుధ మాట్లాడుతూ– ‘‘గతంలో ‘పండంటి కాపురం’లో జమునమ్మకు కూతురిగా నటించాను. నలభై ఏళ్ల తర్వాత ఆమె, నేను ఒకే వేదిక మీద కలిసి అవార్డును తీసుకోవడం గర్వంగా ఉంది’’ అన్నారు. ‘‘నాకు సపోర్ట్ అందిస్తున్న శతాబ్ధిటౌన్ షిప్ ప్రైవేట్ లిమిటెడ్‌కి ధన్యవాదాలు. వారు తోడుగా ఉన్నారు కాబట్టే ఈ కార్యక్రమాలు చేస్తున్నాను’’ అన్నారు విష్ణు బొప్పన. ‘‘నాకు ఆల్ రౌండర్ అవార్డు ఇవ్వడం ఆనందంగా ఉంది’’ అన్నారు బాబూమోహన్. ‘‘బెస్ట్ డైలాగ్ అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అన్నారు సంపూర్ణేష్ బాబు. ఫ్యామిలీ మూవీగా ‘సమ్మోహనం’ చిత్రానికి వీకే నరేశ్, ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రానికి బ్యూటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఇషా రెబ్బా, ‘ఎఫ్ 2’కి కమెడియన్‌గా రఘుబాబు ఇలా పలువురు తారలకు అవార్డులను ప్రదానం చేశారు. -
అభినయ రుషి
నటుడిగా ఆయన ఉన్నత శిఖరాలందుకోవడానికి మరో కారణం ఎప్పటికప్పుడు కాలానుగుణంగా, ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా, మారుతున్న సినీ వాతావరణానికి తగ్గట్టుగా తనని తాను పునః సృజించుకోవడం (రీఎన్వెంటింగ్). ఒక వ్యక్తితోనే ఒక పరిశ్రమ నిలబ డదుగానీ, ఆ వ్యక్తి లేకపోతే ఆ పరిశ్రమలో ఎప్పటికీ పూరించలేని ఒక ఖాళీ ఏర్పడవచ్చు. అక్కినేని లేని లోటు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఇలాంటిదే. అక్కినేని జీవిత చరిత్ర, సినిమా చరిత్ర మనకు తెలిసిందే. ఆయనలా అధికంగా ఇంటర్వ్యూలు ఇచ్చినవారు, అసాధారణ జ్ఞాపకశక్తితో గతాన్ని అవలీలగా మనకు అందించిన వారు ఎవరూలేరు. తెలుగు సిని మారంగంలో, ఆమాటకొస్తే దక్షిణ భారత సినిమారంగంలో నటనకు ఉన్న అర్ధాన్నీ , రూపురేఖలనూ మార్చిన ఘనత ఆయనది. దక్షిణ ప్రాంతం సినిమాల్లో నాయకుల నటన నాటక రంగ అభినయానికి దగ్గరగా ఉన్న రోజులలో ఓవరాక్షన్ గొప్ప నటనగా చలామణి అవుతున్న కాలంలో అండర్‌ప్లే అంటే ఏమిటో చేసి చూపించిన ప్రతిభ అక్కినేనిది. నాటకరంగంలో నటనకూ, చలనచిత్ర నటనలో ఉన్న తేడాను బహుశా మొట్టమొదట గుర్తించిన నటుడు నాగేశ్వరరావుగారే. అక్కినేని సినీజీవితాన్ని విహంగవీక్షణం చేస్తే, పురా ణ పాత్రలు, జానపద నాయక పాత్రలతో సినీరంగ ప్రవే శం చేశారు. కానీ ఆ రెండూ నిజానికి ఆయనకు నప్పే పాత్రలు కావు. ఆ విషయాన్ని అందరికంటే ముందు గ్రహించింది బహుశా ఆయనే. పరిమితులు తెలుసునన్నంత మాత్రాన అక్కినేని సవాళ్లకు భయపడ్డారనికాదు. ఎలాంటి సవాలైనా స్వీకరిం చే సత్తా ఆయనకుంది. దేవదాసు పాత్ర ఒప్పుకోవడమే ఒక పెద్ద సవాలు. మిస్సమ్మలో తన ప్రధాన ప్రత్యర్థి ఎన్టీ రామారావు నాయకుడని తెలిసీ అప్రధాన హాస్య పాత్రను స్వీకరించడం మరో సవాలు. అన్నిటికంటే గొప్ప సవాళ్లు భూకైలాస్, శ్రీకృష్ణార్జునయుద్ధం చిత్రాల్లో ఎన్టీఆర్ దేదీప్య మానంగా వెలిగిపోతాడని తెలిసీ, తనకు మామూలుగా ఒప్పని పాత్రలు (నారదుడు, అర్జునుడు) స్వీకరించి మెప్పించడం. నటుడిగా ఆయన ఉన్నత శిఖరాలందుకోవడానికి మరో కారణం ఎప్పటికప్పుడు కాలానుగుణంగా, ప్రేక్ష కుల అభిరుచులకు అనుగుణంగా, మారుతున్న సినీ వాతావరణానికి తగ్గట్టుగా తనని తాను పునః సృజించు కోవడం (రీఎన్వెంటింగ్). గంభీరమైన కుటుంబ కథా నాయకుడిగా లెక్కకు మించి బోరు కొట్టించే సంఖ్యలో సినిమాలు చేశాక, 1970లలో గ్రామీణ అల్లరి పిల్ల వాడిగా, స్టెప్పులు వేసిన సాహసం ఈ పునః సృజనలో భాగమే. అన్ని కథలూ ఒకేలా తయారవుతున్న తరు ణంలో నవలలను తెరకెక్కించడానికి సంపూర్ణంగా మద్ద తు ఇవ్వడం, ఆ పాత్రలకు తనదైన సృజనను అందిం చడం కూడా ఇటువంటిదే. వయసు పైబడటంతో సిని మాలకు స్వస్తి చెప్పక, మామూలు యాంత్రికమైన తండ్రి పాత్రలతో సరిపెట్టుకోక, సీతారామయ్యగారిగా నటించ డం కూడా ఈ పునః సృజనలో భాగమే. ఆయనతో స్నేహం గొప్ప అనుభూతి- వెండి తెరమీద చూసి ఆనందించిన నటుడితో పరిచయం అవుతుందనీ, గంటలకొద్దీ వారితో మాట్లాడతామని అనుకోము. కానీ అక్కినేనిగారిని దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం లభించిన సందర్భంగా 1990లో దూరదర్శన్ కోసం ఇంట ర్వ్యూ చేసిన నాటి నుంచి ఆయనతో ఒక అరుదైన స్నేహం ఏర్పడింది. సాహిత్య సభల్లో నా ప్రసంగాలను ఆయన మెచ్చుకున్నపుడు, మా యూనివర్శిటీలో మహాసభలకు ఆయన కోసం నేను ఆంగ్లంలో ఉపన్యాసం రాసి ఇచ్చినపుడూ, తన పేరిట స్థాపించిన జాతీయ పురస్కారం కోసం తొలిసారిగా దేవానంద్‌ని ఎంపిక చేసి, నన్ను మాస్టర్ ఆఫ్ సెరిమనీస్గా ఉండి, ఆ సభను ఇంగ్లీషులో నిర్వహించమని ఆయన కోరినపుడూ, వరల్డ్ స్పేస్ రేడియో కోసం నాకు సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చినపుడూ... ఇలా ఎన్నో సంభాషణలూ... అపుడపుడూ ఫోన్లో కూడా. ఒక్క సన్నివేశం బాగా గుర్తు. నేను హడావిడిగా యూని వర్శిటీకి బయల్దేరుతున్నపుడు, నా లాండ్‌లైన్ మోగింది. నేను తీయగానే ‘ఎవరండీ?’ అన్నా. ‘నాగేశ్వరరావు’ని అన్నారు. ‘ఏ నాగేశ్వరరావండీ?’ అని విసుగ్గా అన్నాను, అప్పటికే బస్సు మిస్సయ్యానన్న చికాకుతో. ‘అక్కినేని నాగేశ్వరరావు అంటారండీ నన్ను’ అన్నారు ఎంతో సౌమ్యంగా. మరో సన్నివేశం- వరల్డ్ స్పేస్‌లో ఉన్నప్పుడు మా కొత్త స్టూడియోని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తే ఒప్పుకున్నారు. కారు పంపుతానని చెప్పాను. ‘మీకు కారున్నట్టుందిగా’ అన్నారు. ‘ఉంది కానీ అది చిన్నది. మారుతీ జెన్. మంచి కారు పంపుతాను’ అని గొణిగాను. ‘‘మీకు బాగున్నది నాకెందుకు బాగుండదూ. పైగా మీతో వస్తే కబుర్లు చెప్పుకోవచ్చు.’’ అని నా కారులోనే స్టూడియోకు వచ్చారు. అక్కినేనిగారు మా అమ్మాయి పెళ్లికి వచ్చి, రెండు గంటలకుపైగా ఉండి, మామూలు బంధువులా మా వాళ్లందరితోనూ కలిసిపోయి మాట్లాడారు. అన్నపూర్ణమ్మగారు కాలం చేసినపుడు, పరామర్శకు వెళ్లిన సందర్భంలో ఆయన నాతో గంటకుపైగా ఎన్నో విషయాలు మాట్లాడారు. ‘‘చాలా ఇంటర్వ్యూలు ఇచ్చానుగానీ, మీరు చేసిన ఆ పాత ఇంటర్వ్యూ నాకెంతో ఇష్టం’’ అన్నారాయన. ‘ఎందుకో తెలీదుగానీ మిమ్మల్ని నేను చాలా అడ్మయిర్ చేస్తాను’’ అని అన్నారు అక్కినేనిగారు. ఆయన్ని ఈరోజు ఆఖరిసారిగా చూస్తున్నప్పుడు ‘‘మనిషంటే ఇలా తృప్తిగా, పరిపూర్ణ జీవితం గడిపి, ప్రశాంతంగా శాశ్వత నిద్ర చేస్తూ తనలా ఉండమని మనకు స్ఫూర్తినివ్వాలి’’ అనిపించిది. బహుశా అదే మనం ఆయనకు ఇవ్వగలిగిన నివాళి. మృణాళిని, విమర్శకురాలు, సాహిత్యవేత్త