leggings issue
-
లెగ్గింగ్స్ వేసుకొచ్చారని మైనర్స్‌పై దారుణం
కోలకతా: పశ్చిమ బెంగాల్‌లోని ఒక మిషనరీ ఇంగ్లీషు మీడియం స్కూల్లో అమానుషం చోటు చేసుకుంది. పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా లెగ్గింగ్స్ వేసుకున్నారనే సాకుతో మైనర్ బాలికల పట్ల పాఠశాల యాజమాన్యం అవమానకరంగా ప్రవర్తించింది. సోమవారం జరిగిన ఈ ఘటన బాలికల తల్లితండ్రుల ఆందోళనతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..బెంగాల్ బీర్భూమ్ జిల్లాలోని ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన 4-9 సంవత్సరాల వయసున్న బాలికలు లెగ్గింగ్స్ వేసుకొని స్కూలుకు వచ్చారు. దీంతో పాఠశాల డ్రెస్ కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఆగ్రహంతో ఊగిపోయిన టీచర్లు మైనర్ బాలికల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఉష్టోగ్రతలు పడిపోయి, చలికి వణికిపోతున్నారన్న కనీస మానవత్వం కూడా లేకుండా..పిల్లలతో బలవంతంగా లెగ్గింగ్స్‌ను తీసి వేయించారు. రోజంతా అలాగే వుండేలా శిక్ష విధించారు. దీనిపై బాలికల తల్లదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరని అవమానకరమైన ఈ చర్య తమ మర్యాదకు భంగకరమని ఆవేదన చెందారు. అభశుభం తెలియని తమ ఆడబిడ్డల పట్ల అమానుషంగా ప్రవర్తించారని మండిపడుతూ శాంతినికేతన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన బిడ్డ లెగ్గింగ్ లేకుండా పాఠశాల నుండి బయటకు రావడం చూసి షాకయ్యాననీ, పాపకు లోదుస్తులు కూడా లేవని బాధిత బాలిక తండ్రి ఒకరు వాపోయారు. ఇది చాలా దారుణమని పేర్కొన్న ఆయన హెడ్మిస్ట్రెస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదును స్వీకరించి, తాము ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని పోలీసు అధికారి అభిషేక్ రాయ్ అన్నారు. పాఠశాల అధికారులు, ఉపాధ్యాయులతో మాట్లాడుతున్నామన్నారు. దీనిపై స్పందించిన యాజమాన్యం విద్యార్థులు డ్రెస్ కోడ్ పాటించాలని ఇప్పటికే చాలా సార్లు హెచ్చరించామంటూ తమ చర్యను సమర్ధించుకున్నారు. అయినా తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పామనీ, ఇంకా ఎందుకు ఆందోళన చేస్తున్నారో అర్థం కాలేదనీ పాఠశాల హెడ్ మిస్ట్రెస్ అర్చన ఫెర్నాండెజ్ అన్నారు. మరోవైపు ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ అనన్య చక్రవర్తి మాట్లాడుతూ, ఈ సంఘటన దారుణమైందని వ్యాఖ్యానించారు. విచారణ చేపడతామన్నారు. -
స్త్రీలోక సంచారం
♦ లెగ్గింగ్స్, యోగా ప్యాంట్ ధరించి పాఠశాలకు హాజరవుతున్న విద్యార్థినులను యు.ఎస్. విస్కాన్సిన్ రాష్ట్రంలోని కెనోషాలో అనేక పాఠశాలల యాజమాన్యాలు కటువుగా శిక్షించడంపై అమెరికాలోని పౌర హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జిమ్‌కు, వర్కవుట్లకు అనువుగా ఉండే ‘అథ్లెష్యూర్’ ఫ్యాషన్ ట్రెండ్ దుస్తులను ధరించి పాఠశాలకు రాకూడదని గత మార్చిలోనే ఆంక్షలు విధించినప్పటికీ, కొంతమంది విద్యార్థినులు వాటిని లక్ష్యపెట్టకుండా అవే దుస్తులను ధరించి పాఠశాలకు వస్తున్నందున వారిపై చర్య తీసుకోవడం తప్పడం లేదని పాఠశాలలు చెబుతుండగా.. కొందరి విషయంలో మాత్రమే స్కూళ్లు ఈ విధమైన వివక్షను పాటిస్తున్నాయని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ♦ 98 ఏళ్ల ‘మిస్ అమెరికా’ అందాల పోటీల చరిత్రలోనే తొలిసారిగా ఈ ఏడాది స్విమ్ సూట్ రౌండ్ లేకుండానే పోటీలను నడిపించిన ఘనత నిర్వాహకులకు దక్కినప్పటికీ.. ఆ పోటీలను టీవీలో చూసే వీక్షకుల సంఖ్య గత ఏడాదితో పోల్చి చూస్తే 19 శాతం తగ్గినట్లు ప్రముఖ సర్వే కంపెనీ ‘నీల్సన్’ వెల్లడించడంతో వచ్చే ఏడాది మళ్లీ స్విమ్ సూట్ రౌండ్ పునరుద్ధరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి! సాధారణ పరిస్థితుల్లోనే టీవీలో అందాల పోటీలను చేసేవారి సంఖ్య గత కొన్నేళ్లుగా తగ్గుముఖం పడుతుండగా.. ఈసారి స్విమ్ సూట్ రౌడ్‌ను తొలగించడంతో.. గత ఏడాది 50 లక్షల 35 వేలుగా ఉన్న టీవీ వీక్షకులు ఈ ఏడాది 40 లక్షల 34 వేలకు పడిపోయారని నీల్సన్ తన సర్వే ఫలితాల్లో తెలిపింది. ♦ లెబనాన్ (పశ్చిమాసియా) రాజధాని బీరుట్కు రోడ్డు మార్గంలో 20 నిముషాల ప్రయాణ దూరంలో ఉన్న జియాలోని ఓన్లీ ఉమెన్ ‘బెలెవ్యూ బీచ్ క్లబ్’లో ఏ ఆంక్షలూ లేకుండా మహిళలకు ఇప్పటి వరకు కల్పిస్తున్న ప్రవేశానికి ఇప్పుడు మరిన్ని సడలింపులు ఇచ్చారు. అసలు మగ దృష్టే పడని, స్త్రీలకు మాత్రమే అయిన, అది కూడా లెబనాన్ దేశ మహిళలకు మాత్రమే ప్రవేశం ఉన్న ఈ క్లబ్బులోకి మహిళలు బికినీ సహా, ఏ విధమైన వస్త్రధారణతోనైనా వచ్చి, ఆహ్లాదంగా విహరించే అవకాశం ఉండగా ఇప్పుడు మరింత స్వేచ్ఛగా ఎండపూట ఇసుకలో బేర్ బ్యాక్స్‌తో, బేర్ ఫ్రంట్స్తో సూర్యస్నానాలు చేసే వీలు కల్పించారు. ♦ వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు వాటికన్ సిటీలో జాతీయ క్యాథలిక్ బిషప్‌ల సదస్సును నిర్వహిస్తున్నట్లు వాటికన్ మహిళా ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. యు.ఎస్., చిలి, ఆస్ట్రేలియా, జర్మనీలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లోని క్యాథిలిక్ చర్చి బిషప్‌లు.. పిల్లలపై, నన్లపై అత్యాచారం జరుపుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వాటికన్ ప్రతిష్టను తిరిగి నిలుపుకోవడం కోసం పోప్ ఫ్రాన్సిస్ స్వయంగా పూనుకుని ఈ సదస్సును తలపెట్టారు. ♦ గత ఏడాది మొహర్రం రోజు దుర్గాపూజ విగ్రహాల నిమజ్జనం జరగకుండా ఆదేశాలు జారీ చేసి, ముస్లింల మెప్పు కోసం హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్న ఆరోపణలు ఎదుర్కొన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ ఏడాది కోల్‌కతాలోని 3,000 దుర్గాపూజ కమిటీలతో సహా, రాష్ట్రంలోని 28,000 కమిటీలకు.. ఒక్కో కమిటీకి 10,000 రూపాయలు చొప్పున నిధులను మంజూరు చేసింది. అయితే 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీపై పైచేయి సాధించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విధమైన హిందూ అనుకూల వైఖరిని ప్రదర్శిస్తున్నారు తప్ప, వారిపై ఆమె ప్రత్యేకమైన ప్రేమ ఏమీ లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. -
లెగ్గింగ్స్ వేసుకున్నారని..
ఇద్దరు అమ్మాయిలు లెగ్గింగ్స్ వేసుకున్నారని అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థ వారిని విమానం ఎక్కనివ్వలేదు. లెగ్గింగ్స్ వేసుకొచ్చిన మరో అమ్మాయిని కూడా విమానంలో వెళ్లాలంటే ఆ దుస్తులు మార్చుకోవాల్సిందిగా ఆదేశించారు. డెన్వర్ నుంచి మిన్నీపొలిస్ వెళ్లే విమానంలో ఈ ఘటన జరిగినట్లు షానన్ వాట్స్ అనే ప్రత్యక్ష సాక్షి ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ విషయమై ఆమె పెద్ద యుద్ధమే మొదలుపెట్టారు. దానికి మద్దతుగా అనేకమంది నెటిజన్లు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ తీరు మీద మండిపడ్డారు. ఆ విమానయాన సంస్థ మాత్రం, ఎవరైనా సరిగా దుస్తులు వేసుకోకపోతే వాళ్లను విమానం ఎక్కనివ్వకుండా అడ్డుకునే హక్కు తమకుందని వాదిస్తోంది. ఎవరైనా ప్రయాణికులు కాళ్లకు చెప్పులు వేసుకోకపోయినా, సరిగా దుస్తులు వేసుకోకపోయినా తాము విమానం ఎక్కనిచ్చేది లేదని స్పష్టం చేస్తోంది. అయితే.. సరైన దుస్తులంటే ఏంటో మాత్రం చెప్పలేదు. సాధారణ ప్రయాణికులనైతే లెగ్గింగ్స్ లేదా యోగా ప్యాంట్లు ధరించినా తాము అనుమతిస్తామని, కానీ పాస్ మీద ప్రయాణించేవాళ్లు మాత్రం తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సిందేనని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి జొనాథన్ గెరిన్ అన్నారు. ఆ అమ్మాయిలు ఇద్దరూ యునైటెడ్ ఉద్యోగుల పాస్ మీద ప్రయాణిస్తున్నారని, అందుకే తగిన డ్రస్ కోడ్ పాటించాల్సిందిగా చెప్పామని వివరించారు. కానీ, యునైటెడ్ వాదనను అమెరికన్లు కొట్టిపారేస్తున్నారు. ఎవరికైనా తమకు నచ్చిన దుస్తులు ధరించే హక్కు ఉంటుందని, దాని మీద విమానయాన సంస్థలు మోరల్ పోలీసింగ్ ఎలా చేస్తాయని మండిపడుతున్నారు. ఇది చాలా చికాకు వ్యవహారమని సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు లెగ్గింగ్స్ అనేవి సరైన దుస్తులు కావని ఎలా చెబుతారని.. ప్రయాణం చేసేటప్పుడు సుఖంగా ఉండేందుకు చాలామంది మహిళలు లెగ్గింగ్స్, యోగా దుస్తులు, అథ్లెటిక్ దుస్తులు ధరిస్తారని, ఇది కొత్తేమీ కాదని వాదిస్తున్నారు. తన పక్కనే కూర్చున్న అమ్మాయిని కూడా లెగ్గింగ్స్ వేసుకుని ప్రయాణించడానికి వీల్లేదని భయపెడితే.. ఆమె అప్పటికప్పుడు తన బ్యాక్‌ప్యాక్‌లోంచి వేరే డ్రస్ తీసుకుని మార్చుకుందని కూడా వాట్స్ చెప్పారు. Girls wearing LEGGINGS reportedly forced to change before @united would let them board and this...is...United's response... pic.twitter.com/KHJgau8tRE — Elizabeth Minkel (@elizabethminkel) 26 March 2017