Librarian
-
అనంతపురం కేంద్రీయ విద్యాలయంలో లైబ్రేరియన్ లైంగిక వేధింపులు
-
కేంద్రీయ విద్యాలయంలో వేధింపులు.. లైబ్రేరియన్‌పై పేరెంట్స్ దాడి
సాక్షి, అనంతపూర్: విద్యా బుద్ధులు చెప్పాల్సిన టీచర్లు, లెక్చరర్లు విద్యార్థినిల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థినిలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా కేంద్రీయ విద్యాలయంలో లైబ్రేరియన్ లైంగిక వేధింపులకు పాల్పడటంతో బాధితురాలి పేరెంట్స్ అతడిపై దాడి చేశారు. ఈ ఘటన అనంతపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఎస్కేయూలోని కేంద్రీయ విద్యాలయంలో లైబ్రేరియన్ భాను ప్రకాశ్ నాయక్ విద్యార్థినిలను లైంగిక వేధింపులకు గురిచేశాడు. విద్యార్థులను భాను ప్రకాశ్ దుర్భాషలాడాడు. ఇక, విద్యార్థులు తమ పేరెంట్స్‌కు చెప్పారు. దీంతో, ఆగ్రహానికి లోనైన విద్యార్ధులు పేరెంట్స్, బంధువులు.. భానుప్రకాశ్‌కు దేహశుద్ది చేశారు. ఈ క్రమంలో కేంద్రీయ విద్యాలయంలో పేరెంట్స్ ఆందోళనకు దిగారు. అంతేకాకుండా భాను ప్రకాశ్‌పై ప్రిన్సిపాల్‌కు పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: Cyber Crime: రూ. 5 కట్టమని.. రూ.1.85 లక్షలు దోచుకున్నారు -
పుస్తకంగా 12 ఏళ్ల బాలిక వలస గాథ
యుద్ధంతో శిథిలావస్థకు చేరిన ఉక్రెయిన్ నుంచి ఇప్పటికే 70 లక్షలకు పైగా పౌరులు వలస బాట పట్టడం తెలిసిందే. అలా కుటుంబంతో పాటు ఖర్కీవ్ నుంచి డబ్లిన్ వలస వెళ్లిన యెవా స్కలెట్‌స్కా అనే 12 ఏళ్ల బాలిక తన భయానక అనుభవాలను గ్రంథస్థం చేయనుంది. వాటిని ‘యూ డోంట్ నో వాట్ వార్ ఈజ్: ద డైరీ ఆఫ్ అ యంగ్ గాళ్ ఫ్రం ఉక్రెయిన్’ పేరిట పుస్తకంగా ప్రచురించేందుకు హారీపోటర్ సిరీస్ ప్రచురణకర్త బ్లూమ్స్బరీ ముందుకొచ్చింది. అక్టోబర్ కల్లా పుస్తకాన్ని విడుదల చేస్తామని ప్రకటించింది. యెవా ఖర్కీవ్‌లో తన నానమ్మతో కలిసి ఉండేది. ఫిబ్రవరి 24న భారీ బాంబుల మోతతో మేల్కొన్నది మొదలు ఆమె జీవితం మారిపోయింది. బాంబులు, క్షిపణుల దాడి నుంచి తప్పించుకునేందుకు వారు షెల్టర్లలో తలదాచుకున్నారు. పరిస్థితి విషమిస్తుండటంతో వారిద్దరూ వలస బాట పట్టారు. అక్కడ ఇంగ్లండ్ జర్నలిస్టుల బృందాన్ని యెవా కలిసింది. తన అనుభవాలతో ఏ రోజుకా రోజు ఆమె రాసుకున్న డైరీ చూసి ఆ రాతల్లో లోతు, వయసుకు మించిన పరిపక్వతకు వాళ్లు ఆశ్చర్యపోయారు. ఇదంతా ఇప్పుడు పుస్తక రూపంలో రానుంది. యెవా గాథ మమ్మల్ని ఎంతగానో కదిలించిందని పుస్తక ఇంగ్లండ్, కామన్వెల్త్ దేశాల ప్రచురణ హక్కులు కొనుగోలు చేసిన ఇలస్ట్రేటెడ్ పబ్లిషింగ్ ఎడిటర్ సలీ బీట్స్ అన్నారు. ‘యుద్ధ బీభత్సం ఆమె చిన్నారి కళ్లు ఎలా చూశాయో అలాగే పుస్తక రూపు సంతరించుకోనుంది. అందరూ చదివి తీరాల్సిన పుస్తకమిది’అని అభిప్రాయపడ్డారు. పుస్తక ప్రచురణ హక్కులు 12 భాషల్లో అమ్ముడయ్యాయట. -
ఆమె ఒక నడిచే గ్రంథాలయం
మొబైల్ లైబ్రరీలు తెలుసు. టూ వీలర్ మీద వచ్చి పుస్తకాలు ఇచ్చి వెళ్లేవారు కూడా ఉన్నారు. కాని 64 ఏళ్ల రాధామణికి రెండు కాళ్లే వాహనం. రోజుకు నాలుగు కిలోమీటర్లు చుట్టుపక్కల పల్లెలకు తిరిగి స్త్రీలకు ఆమె పుస్తకాలు ఇస్తుంది. తిరిగి తెచ్చుకుంటుంది. ఊరి గ్రంథాలయ నిర్వహణలో భాగంగా గత 8 ఏళ్లుగా ఆమె సాగిస్తున్న నడక కొన్ని వెలుతురు నక్షత్రాలనైనా ఉదయించేలా చేస్తోంది. వాకింగ్ లైబ్రరీగా పేరు తెచ్చుకున్న రాధామణి పరిచయం ఇది. ఈశాన్య కేరళలో చిన్న ఊరైన వాయనాడ్‌లో నివసించే 64 ఏళ్ల రాధామణి దిన చర్య మనం తెలుసుకోదగ్గది. ఆమె ఐదున్నరకంతా నిద్ర లేస్తుంది. తొమ్మిది లోపు ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుంటుంది. ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న లైబ్రరీకి ఉద్యోగం నిమిత్తం వెళుతుంది. అక్కడ ఒక సంచిని తీసుకుని పుస్తకాలను పెట్టుకుంటుంది. ఆ తర్వాత సాయంత్రం వరకూ ఆమె చుట్టు పక్కల నాలుగు కిలోమీటర్ల వరకూ ఉండే ఇళ్లకు తిరుగుతూ ఉంటుంది. ఎందుకు? అక్కడి శ్రామిక స్త్రీలకు పుస్తకాలు ఇచ్చేందుకు. వారు చదువుకున్నవి తెచ్చుకునేందుకు. అలా ఆమె గత ఎనిమిదేళ్లుగా అలుపెరగక చేస్తూనే ఉంది. స్త్రీ చదువుకోవాలి కేరళ ప్రభుత్వం ప్రజలలో పఠనాభిలాష గురించి అందునా స్త్రీల పఠనాభిలాష గురించి శ్రద్ధ పెడుతోంది. ప్రతి ఊళ్లో గ్రంథాలయాల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. ఆ గ్రంథాలయాలను నిర్వహించడానికి, సభ్యత్వాలు కట్టించడానికి స్త్రీలనే నియమిస్తోంది. ఆ కార్యక్రమాన్ని అక్కడ ‘వనితా వయోజక పుస్తక వితరణ పద్ధతి’ అని పిలుస్తున్నారు. వాయనాడ్‌లో 60 ఏళ్లుగా లైబ్రరీ ఉంది. అందరూ అక్కడికి వచ్చి చదువుకునేవారు. అయితే పని చేసుకుని జీవించే స్త్రీలు లైబ్రరీకి వచ్చి చదవలేరు. అంత సమయం ఉండదు. అందుకే వారి దగ్గరకే పుస్తకాలు తీసుకెళ్లి ఇచ్చే ఉద్యోగులను లైబ్రరీలు నియమించుకున్నాయి. రాధామణి 8 ఏళ్ల క్రితం ఆ ఉద్యోగంలో చేరింది. వారపత్రికలతో మొదలెట్టి.... రాధామణి చాలా కాలం ఒక ప్రింటింగ్ ప్రెస్‌లో చిన్న ఉద్యోగం చేసింది. ఆ తర్వాత ప్రైమరీ టీచర్‌గా పని చేసింది. ఆ పని నుంచి బయటపడే సమయానికి లైబ్రరీలో ఉద్యోగం దొరికింది. ‘నేనూ స్త్రీనే. నాకు లోకం పుస్తకాల ద్వారానే తెలిసింది. నా తోటి స్త్రీలు కూడా పుస్తకాల ద్వారాన్నే ఈ ప్రపంచాన్ని తెలుసుకోవాలి’ అని రాధామణి అంటుంది. ఇప్పుడు వాయనాడ్ లైబ్రరీకి 130 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 90 మంది స్త్రీలే. వాటిలో చాలా సభ్యత్వాలను రాధామణి కట్టించింది. కొందరి సభ్యత్వ రుసుం తనే కట్టింది కూడా. ‘వారి చదువుకోవాలనే కోరికకు డబ్బు అవరోధం కాకూడదు’ అంటుంది. రాధామణి ఇంటింటికి తిరిగి పుస్తకాలు ఇచ్చేటప్పుడు మొదట చాలామంది స్త్రీలు పాపులర్ వారపత్రికలనే అడిగేవారు. కాని మెల్లమెల్లగా నవలలు... ఇప్పుడు విజ్ఞానం కలిగించే పుస్తకాలను అడిగి చదువుతున్నారు. ‘వారు చదివిన పుస్తకాల్లోని విశేషాలు వారు చెప్పేటప్పుడు ఆ కళ్లల్లో వెలుగు నాకు చాలా సంతోషం కలిగిస్తుంది’ అంటుంది రాధామణి. నడిచే గ్రంథాలయం 64 ఏళ్ల వయసులో రాధామణి వాహనం నడపలేదు. ఇంటింటికి తిరిగేందుకు ఆమెకు ప్రత్యేక వాహనం లేదు. అందుకే ఆమె నడిచి తిరుగుతుంది. అందువల్ల ఆమెను ‘నడిచే గ్రంథాలయం’ అంటారు. భర్త నడిపే చిల్లర అంగడిలో సాయంత్రాలు అతనికి సాయం చేస్తుంది రాధామణి. పుస్తకాలతోనే ఆమె ప్రపంచం. పుస్తకాలు చదివి చదివి రాధామణి ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం సంపాదించింది. కొంచెం ఫ్రెంచ్ కూడా నేర్చుకుంది. ఆమెకు పర్యాటక ప్రాంతాలంటే ఇష్టం కనుక ప్రపంచంలోని చాలా పర్యాటక స్థలాల గురించి ఇట్టే చెబుతుంది. పుస్తకానికి మించిన సంపద లేదని పెద్దలు అంటారు. పుస్తకాన్ని మనమంతా బాగా చదవాలని రాధామణి పిలుపునిస్తోంది. – సాక్షి ఫ్యామిలీ -
నిరుద్యోగుల చూపు..ఆ వైపు..
సాక్షి, పెద్దపల్లికమాన్ : పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగుల చూపంతా జిల్లా కేంద్రంలో గల గ్రంథాలయం పై పడింది. ఉరుకుల పరుగుల జీవితంలో ఇంటివద్దే కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధం కావడం సాధ్యం కాని పరిస్థితి. ఇలా అయితే తమ లక్ష్యం నీరుగారి పోతోందని భావించిన యువత గ్రంథాలయాలకు వచ్చి రోజంతా ఇక్కడే పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు మెయిన్స్ పరీక్షలు, దక్షిణ మధ్య రైల్వేలో పోలీసు, బీఎస్ఎన్లో టీటీఎ, ఎల్ఐసీలో పలు ఉద్యోగాలకు పరీక్షలుండడంతో పటు గ్రామాల నుంచి జిల్లా కేంద్ర గ్రంథాలయానికి నిరుద్యోగులు తరలివస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచే.. పెద్దపల్లితో పాటు అప్పన్నపేట బంధంపల్లి, రాఘవపూర్, రంగంపల్లి, హన్మంతునిపేట లాంటి గ్రామాల నుంచి విద్యార్థులు ఉదయం 8గంటల నుండి పెద్దపల్లి జిల్లా కేంద్ర గ్రంథాలయానికి వస్తున్నారు. ఉద్యోగ సాధనే లక్ష్యంగా నిర్ధేశించుకున్న వీరు రాత్రి 8గంటల వరకు గ్రంథాలయంలోనే పఠనం చేస్తున్నారు. సొంతగా తెచ్చుకున్న పుస్తకాలతో గంటల తరబడి చదువుతున్నారు. అరకొర సౌకర్యాలే.... పట్టణం జిల్లాగా మారిన గ్రంథాలయ అభివృద్ధి జరుగడం లేదు. గత సంవత్సరం కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా దాతలు ఇచ్చిన కొన్ని పుస్తకాలు తప్ప కాంపిటిషన్‌కు ఉపయోగపడే పుస్తకాలు లేవని పాఠకులు విమర్శిస్తున్నారు. తెలంగాణ సాహిత్య, ఉద్యమ చరిత్రలతో పాటు అన్ని పోటీ పరీక్షలకు సరిపడ పుస్తకాలను తెప్పించాలని గ్రంథాలయ అధికారికి పలుమార్లు పుస్తకాల లిస్టు ఇచ్చామని నిరుద్యోగ యువత తెలిపారు. ఉన్న అడపాతడపా పుస్తకాలను గ్రంథాలయంలోని వెనుక రూంలో ఉంచి తాళం వేసి ముందుగా ఉండే హాల్‌ను మాత్రమే తెరిచి ఉంచి సిబ్బంది మాత్రం అందుబాటులో ఉంచారని పాఠకులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ డిస్కర్షన్ సాధ్యం.. కానిస్టేబుల్, ఎస్ఐ, రైల్వే ఉద్యోగాలకు సాధన కోసం గత సంవత్సరం నుంచి పెద్దపల్లి గ్రంథాలయానికి వస్తున్నాను. ఇంట్లో చదివేటప్పుడు అనేక సందేహాలు వస్తాయి. కానీ ఇక్కడ ఫ్రెండ్స్‌తో గ్రూప్ డిస్కర్షన్ చేయడం వల్ల అనుమానాలు సులభంగా నివృత్తి చేసుకోవచ్చు. – ఇ.సతీష్, సాగర్‌రోడ్ ఏకాగ్రతకు అనువైన ప్రదేశం డిగ్రీ పూర్తి చేశాను. కానిస్టేబుల్, ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకొని అర్హత సాధిస్తా. గ్రంథాలయంలో ఎక్కువ మంది చదువటం వల్ల వారిని చూసి చదువాలనే కసితో పాటు ఏకాగ్రత పెరుగుతుంది. అందుకనే ప్రతిరోజు గ్రంథాలయానికి వచ్చి చదువుకుంటున్న. – రాజుకర్, శాంతినగర్ ప్రశాంతంగా ఉంటుందని.. రైల్వేరిక్రూట్‌మెంట్ బోర్డ్, టీఎస్పీఎస్సీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాను. ఇంట్లో చదవాలంటే టీవీ శబ్దాలు, మోటార్ వాహనాల శబ్దాలతో చదువుపై ఏకాగ్రత చేయలేకపోతున్న. ఏకాగ్రతతో చదవాలంటే గ్రంథాలయం ఒక్కటే అనువైన స్థలమని ఇక్కడమిత్రులతో కలిసి చదువుతున్నాను. – ఎ.రమేష్, పెద్దపల్లి పుస్తకాలు అన్నీ తెస్తాం గ్రంథాలయంలో ఇద్దరే ఉద్యోగులు ఉండడం వలన సిబ్బంది కొరత ఉంది. వీరు సమయాన్ని విభజించి షిప్టుల వారిగా పనిచేస్తారు. గ్రంథాలయంలో సిబ్బంది లేనట్లు పాఠకులు నా దృష్టికి తీసుకరాలేదు. అలా జరిగితే మెమోలు జారీ చేసి కఠిన చర్య తీసుకుంటాం. రెండు రోజుల్లో కాంపిటీషన్ పుస్తకాలను తెప్పించి పాఠకులకు అందుబాటులో ఉంచుతాం. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి. – గ్రంథాలయ అధికారి, గఫూర్ -
చదువుల గుడికి యావదాస్తి విరాళం!
ఏ దానం చేసినా.. ఎదుటివారు దాని నుంచి ప్రతిఫలం పొందేది కొన్నిరోజులే అందుకే అన్ని దానాల్లోకెళ్ల ఉత్తమమైనది విద్యాదానమంటారు. ఎందుకంటే.. మనిషిని తన కాళ్లమీద తాను నిలబడేలా చేసేది విద్య మాత్రమే. మరి విద్యాదానమంటే.. మనకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచడమే. అమెరికాకు చెందిన రాబర్ట్ మొరిన్ అనే వ్యక్తి కూడా విద్యాదానం చేశాడు..కానీ జ్ఞానాన్ని పంచడం ద్వారా కాదు.. తన యావదాస్తిని ఇవ్వడం ద్వారా..ఆస్తి దానమివ్వడం విద్యాదానమెలా అవుతుంది? ...కదా అదెలాగో ఓసారి మీరే చదవండి... జీవితంలో బాగా డబ్బు సంపాదిస్తున్నవారు... చిన్నప్పుడు తాము చదువుకున్న పాఠశాలకు ఎంతోకొంత విరాళామివ్వడం గురించి ఎన్నోసార్లు విన్నాం. ఎందుకంటే తాము ఇంత గొప్పవాళ్లుగా ఎదగడానికి కారణమైన పాఠశాల రుణం తీర్చుకునేందుకేనని చెబుతారు. కానీ అమెరికాలో ఓ వ్యక్తి తన యావదాస్తిని తాను చదువుకొని, ఉద్యోగం చేసిన యూనివర్సిటీకి విరాళంగా ఇచ్చేశాడు. వివరాల్లోకెళ్తే.. అమెరికాలోని న్యూ హంప్‌షైర్ యూనివర్సిటీకి ఇటీవల 4 మిలియన్ డాలర్ల(దాదాపు రూ. 27కోట్ల రూపాయలు) చెక్కు విరాళంగా అందింది. అంతటి భారీ విరాళాన్ని ఎవరు ఇచ్చారా? అని చూస్తే... దానిమీద రాబర్ట్ మొరిన్ అని రాసి ఉంది. అది చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మొరిన్ అదే విశ్వవిద్యాలయంలో చదువుకొని, అందులోనే లైబ్రేరియన్‌గా ఉద్యోగంలో చేరి, యాభై సంవత్సరాలపాటు విధులు నిర్వర్తించి ఇటీవలే చనిపోయిన వ్యక్తి. యూనివర్సిటీలో ఉద్యోగం చేసిన ఓ సామాన్య వ్యక్తి ఇంత భారీ విరాళం ఇవ్వడం గురించి తెలిసి అంతా అవాక్కయ్యారు. న్యూ హంప్‌షైర్ యూనివర్సిటీలో 1961లో డిగ్రీ పూర్తి చేసిన మొరిన్ అందులోనే లైబ్రేరియన్‌గా ఉద్యోగంలో చేస్తూ... గత ఏడాది మరణించాడు. అయితే తన మరణాంతరం తాను సంపాదించిన డబ్బు అంతా యూనివర్సిటీకే చెందాలని తన ఆర్థిక సలహాదారుతో చెప్పాడట. అందుకే అతను యూనివర్శిటీకి ఆ చెక్‌ను అందించారు. మొరిన్ జీవితకాలంలో ఎప్పుడూ విహారయాత్రలకు వెళ్లలేదని.. ఎక్కువగా ఖర్చు చేసేవాడు కాదని.. పాత కారులోనే తిరిగేవాడని మొరిన్ ఆర్థిక సలహాదారు తెలిపారు. మొరిన్ పంపించిన డబ్బులో లక్ష డాలర్లు లైబ్రరీ అభివృద్ధికి.. మిలియన్ డాలర్లు యూనివర్సిటీ ఫుట్‌బాల్ స్టేడియం మరమ్మతులకు ఖర్చు చేస్తామని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. మిగతా డబ్బుతో విద్యార్థుల కోసం ఒక కెరీర్ సెంటర్‌ను స్థాపించనున్నారట. జ్ఞానాన్ని నేర్పి.. జీవితాన్ని ఇచ్చిన చదువులగుడికి సంపన్నులు కొంత డబ్బును ఇవ్వడం సాధారణమే కానీ.. సాధారణ ఉద్యోగి తన ఆస్తినంతా విరాళంగా ఇవ్వడం నిజంగా గొప్ప విషయమే కదా! -
లైబ్రేరియన్లను టీచర్లుగా గుర్తించండి
విశ్వవిద్యాలయాల్లో పనిచేసే లైబ్రేరియన్లు టీచర్ల నిర్వచన పరిధిలోకి వస్తారని హైకోర్టు తేల్చి చెప్పింది. అందువల్ల వారు 60 ఏళ్ల వరకు సర్వీసులో కొనసాగేందుకు అర్హులని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యామయూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ బి.శివశంకరరావు ఇటీవల తీర్పు వెలువరించారు. లైబ్రేరియన్లను నాన్-వెకేషన్ అకడమిక్ స్టాఫ్‌గా పరిగణిస్తూ ఉన్నత విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ అబ్దుల్ హకీమ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని సింగిల్ జడ్జి కొట్టేశారు. దీనిపై హకీం ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై తుది విచారణ జరిపిన జస్టిస్ సంజయ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. చట్ట సవరణల అనంతరం లైబ్రేరియన్ల సర్వీసు నిబంధనల్లో గణనీయ మార్పులు వచ్చాయని ధర్మాసనం తెలిపింది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రిసెర్చ్ (ఐసీఏఆర్) సిఫారసుల మేరకు ఎంఎస్సీ, పీహెచ్డీ విద్యార్థులు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సెస్సైస్ కోర్సు చేయడం తప్పనిసరి చేయడం జరిగిందంది. ఈ నేపథ్యంలో లైబ్రేరియన్లను అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పరిగణించడం మొదలుపెట్టారని తెలిపింది. వ్యవసాయ యూనివర్సిటీల చట్టం ప్రకారం టీచర్ నిర్వచన పరిధిలోకి ప్రొఫెసర్లు, రీడర్, లెక్చరర్లు, యూనివర్సిటీ నియమించి, గుర్తించిన ఇతర వ్యక్తులు వస్తారంది. ఈ పరిస్థితుల్లో లైబ్రేరియన్లు టీచర్ల నిర్వచన పరిధిలోకి వస్తారని, వారు కూడా 60 ఏళ్ల వరకు సర్వీసులో కొనసాగవచ్చునని తెలిపింది. -
సత్యం రామలింగరాజు.. లైబ్రేరియన్
హైదరాబాద్: చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న సత్యం రామలింగరాజుకు లైబ్రరీ బాధ్యతలను అప్పగించినట్లు జైలు పర్యవేక్షణాధికారి కొలను వెంకటేశ్వర్‌రెడ్డి గురువారం తెలిపారు. అతని తమ్ముడు రామరాజుకు వయోజనవిద్య బాధ్యత అప్పగించామన్నారు. జైలులో దాదాపుగా వెయ్యికి పైగా ఉన్న ఖైదీలలో 300 మంది వరకు చురుకుగా పనిచేస్తారని, మిగతా వారందరికీ వారివారి వృత్తిరీత్యా పనులు కేటాయించామన్నారు. నిత్యం పుస్తక పఠనంలో గడుపుతున్న రామలింగరాజుకు లైబ్రరీ సరైందని భావించిన కమిటీ సభ్యులు ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు వివరించారు. -
ప్రాథమిక పాఠశాలల్లో గ్రంథాలయాలు
వేములపల్లి, న్యూస్‌లైన్: ప్రాథమిక పాఠశాలల్లో గ్రంథాల యాలను ఏర్పాటుచేయాలని ప్రాథమిక విద్యాశాఖ నిర్ణయించింది. గ్రంథాల య సంస్థ, ప్రాథమిక విద్యాశాఖ సంయుక్తంగా ఏర్పాట్లకు సిద్ధపడింది. ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో మేధాశక్తి, పుస్తక పఠనం, దేశభక్తి పెంపొందించేందు కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బాలల ది నోత్సవం సందర్భంగా గురువారం నుంచి ప్రాథమిక పాఠశాలల్లో గ్రంథాలయాలను ప్రారంభించనున్నా రు. ప్రాథమిక విద్యాశాఖ ఆదేశాల ప్రకారం 200 మంది విద్యార్థులున్న ప్రతి ప్రాథమిక పాఠశాలను గ్రం థాలయం ఏర్పాటుకు ఎంపిక చేయాల్సి ఉంది. అలా విద్యార్థులు లేకుంటే జిల్లాకు 50 ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేయా ల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలో మొదటి విడతగా 23 పాఠశాలలను ఎంపిక చేశా రు. మిగిలిన పాఠశాలలను దశల వారీగా ఎంపిక చేయనున్నారు. గ్రంథాలయాల్లో పిల్లలకు ఉపయోగపడే దేశభక్తి, మహానీ యుల చరిత్ర, వ్యక్తిత్వ వికాసం, చరిత్ర, బాలల సాహిత్యం, నీతి కథలు, సంప్రదాయాలు, సంస్కృతికి సంబంధించిన పుస్తకాలతోపాటు ప్రముఖ దినపత్రికలను ఏర్పాటు చేస్తారు. ప్రత్యేక పిరియడ్ విద్యార్థుల్లో మేధాశక్తిని పెంచేందుకు గ్రంథాలయాల్లో పుస్తక పఠనానికి ప్రత్యేక పిరియడ్‌ను కేటాయిస్తారు. ఈ పిరియడ్‌కు ప్రత్యేక ఉపాధ్యాయుడిని నియమిస్తారు. గ్రంథాలయ ఉపాధ్యాయుడు సమీప గ్రంథాలయం నుంచి 15 రోజులకొకసారి 100 నుంచి 200 రకాల పుస్తకాలను తీసుకొచ్చి విద్యార్థులతో చదివించాల్సి ఉంటుంది. జిల్లాలో ఎంపికైన పాఠశాలలు జిల్లాలో మొదటి విడతగా 23 ప్రాథమిక పాఠశాలలను గ్రంథాలయాల ఏర్పాటుకు ఎంపిక చేశారు. అనుముల మండలం అనుముల, చందంపేట మండలం పెద్దమునిగల్, కంబాలపల్లి, చండూరు మండలం బోడంగిపర్తి, చివ్వెంల మండలం కుడకుడ, చందుపట్ల, దేవరకొండ మండలం తాటికోలు, డిండి మండలం తవక్లాపూర్, అర్వపల్లి మండలం జాజిరెడ్డిగూడెం, తిమ్మాపురం, కట్టంగూర్ మండలం చెర్వుఅన్నా రం, మర్రిగూడ మండలం శివన్నగూడెం, మఠంపల్లి మండలం వరదాపురం, పెదవీడు, మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి, ఆలగడప, పీఏపల్లి మండలం వడ్డిపట్ల, పెద్దవూర మండలం పులిచర్ల, రామన్నపేట మండలం వెల్లంకి, సూర్యాపేట మండలం బాలెంల, టేకుమట్ల, త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి, తుంగతుర్తి మండలం గొట్టిపల్లి ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేశారు.