Life insurance coverage
-
ఎల్ఐసీ పాలసీల పునరుద్ధరణ ఆఫర్
హైదరాబాద్: వివిధ కారణాలతో రద్దయిన (ల్యాప్స్డ్) పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశాన్ని ఎల్ఐసీ మరో విడత కల్పించింది. కరోనాతో జీవిత బీమా కవరేజీకి ప్రాధాన్యం పెరిగిన క్రమంలో పాలసీదారుల ప్రయోజనాల కోణంలో ఎల్ఐసీ ఈ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ నెల 7 నుంచి మార్చి 25 వరకు పాలసీ పునరుద్ధరణ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఎల్ఐసీ ప్రకటించింది. లేట్ఫీజులో తగ్గింపును ఇస్తున్నట్టు తెలిపింది. వైద్య పరీక్షలకు సంబంధించి ఎటువంటి రాయితీలు ఉండవు. హెల్త్, మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలపైనా లేట్ ఫీజులో రాయితీ ఇస్తోంది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా పాలసీదారులు చివరిగా ప్రీమియం కట్టిన తేదీ నుంచి ఐదేళ్లకు మించకుండా ఉంటే పునరుద్ధరించుకునేందుకు అర్హత ఉంటుంది. రూ.లక్ష వరకు బీమాతో కూడిన ప్లాన్ల పునరుద్ధరణపై ఆలస్యపు రుసుంలో 20 శాతం (గరిష్టంగా రూ.2,000) తగ్గింపు పొందొచ్చు. రూ.1– 3 లక్షల మధ్య పాలసీలకు ఆలస్యపు రుసుంలో 25 శాతం (గరిష్టంగా రూ.2,500), రూ.3లక్షలకు పైన రిస్క్ కవర్‌తో కూడిన పాలసీలకు ఆలస్యపు రుసుంలో 30 శాతం (గరిష్టంగా రూ.3,000) తగ్గింపునిస్తోంది. మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలకు అయితే ఆలస్యపు రుసుంలో పూర్తి రాయితీ ఇస్తోంది. అధిక రిస్క్ కవర్‌తో ఉంటే టర్మ్ ప్లాన ఆలస్యపు రుసుంలో తగ్గింపు ఉండదు. -
మొబైల్ రీచార్జితో రూ. 4 లక్షల బీమా కవరేజీ
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ టెలికం సంస్థ భారతి ఎయిర్టెల్ తమ ప్రీ–పెయిడ్ మొబైల్ కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. రూ. 599 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకునేవారికి రూ. 4 లక్షల జీవిత బీమా కవరేజీ కూడా అందించనున్నట్లు తెలిపింది. భారతి యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్‌తో ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. సోమవారం కొత్తగా ప్రకటించిన రూ. 599 ప్లాన్‌తో రోజుకు 2 జీబీ డేటా, ఏ నెట్‌వర్క్‌కయినా అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లతో పాటు అదనంగా రూ. 4 లక్షల జీవిత బీమా కవరేజీ లభిస్తుందని ఎయిర్టెల్ వివరించింది. ఈ రీచార్జ్ వేలిడిటీ 84 రోజులు ఉంటుందని, ప్రతీ రీచార్జ్‌తో పాటు బీమా కవరేజీ ఆటోమేటిక్‌గా మూడు నెలల పాటు కొనసాగుతుందని తెలిపింది. 18–54 ఏళ్ల కస్టమర్లకు ఇది వర్తిస్తుందని.. ఇందుకోసం ప్రత్యేకంగా వైద్యపరీక్షలు అవసరం లేదని వివరించింది. దీన్ని ప్రస్తుతం ఢిల్లీతో పాటు కొన్ని రాష్ట్రాల్లోనే ప్రవేశపెట్టినట్లు, క్రమంగా ఇతర ప్రాంతాలకూ విస్తరించనున్నట్లు కంపెనీ వివరించింది. -
పెట్టుబడులపై రాబడితోపాటు బీమా
పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్ ఎవరైనా కానీ ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తట్టుకుని, దీర్ఘకాలంలో అధిక రాబడులు సమకూర్చుకోవాలన్న లక్ష్యంతోనే ఉంటారు. అయితే, ఇటీవలి కాలంలో ఈక్విటీ మార్కెట్లు ఎంతో అస్థిరతంగా మారాయి. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రిస్క్ తీసుకోలేని ఇన్వెస్టర్లు ఈ తరహా ఆటుపోట్ల నుంచి రక్షణకు బ్యాలన్స్డ్ లేదా హైబ్రిడ్ డెట్ ఫండ్స్‌ను పెట్టుబడుల కోసం పరిశీలించొచ్చు. ఇవి స్థిరమైన రాబడులను ఇస్తాయి. అదే సమయంలో పోర్ట్‌ఫోలియో రిస్క్‌ను తగ్గిస్తాయి. ఓ వ్యక్తి జీవితంలో ఎన్నో ఆర్థిక లక్ష్యాలు ఉంటుంటాయి. మధ్యలో ఊహించని ఆసక్మిక పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. కనుక పెట్టుబడులతోపాటు జీవిత బీమా రక్షణ కూడా ఉండడం ఎంతో అవసరం. సరైన జీవిత బీమా కవరేజీ కూడా ఒక రకమైన పెట్టుబడే అవుతుందంటారు నిపుణులు. ఈ రకంగా చూసినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు (ఏఎంసీలు) ఆఫర్ చేసే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు (యులిప్) జీవితానికి రక్షణతోపాటు, దీర్ఘకాలంలో సంపద సృష్టికి వీలు కల్పిస్తాయి. వీటిల్లో యూటీఐ యులిప్ ఇతర యులిప్‌లతో పోలిస్తే భిన్నమైన ఫీచర్లతో మెరుగ్గా ఉంటుంది. యూటీఐ యులిప్ ఓపెన్ ఎండెడ్, పన్ను ఆదా చేసే బీమా ప్లాన్. ఈ పథకంలో చేసే పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపుతోపాటు రూ.15 లక్షల వరకు జీవిత బీమా కవరేజీ లభిస్తుంది. సుదీర్ఘకాల చరిత్ర యూటీఐ యులిప్ మన దేశంలో మొట్టమొదటి యులిప్ పాలసీ. 1971 అక్టోబర్ 1న ఆరంభమైంది. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసే వారికి ఎల్ఐసీ నుంచి జీవిత బీమా కవరేజీ ప్లాన్ లభిస్తుంది. జీవిత బీమాతోపాటు ప్రమాద బీమా కవరేజీని కూడా యూటీఐ యులిప్ ఆఫర్ చేస్తుండటం గమనార్హం. పెట్టుబడి ఆస్తుల్లో 40 శాతాన్ని ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. మిగిలిన మొత్తాన్ని డెట్, మనీ మార్కెట్ సాధనాల్లో పెట్టుబడులు పెడతారు. రిస్క్ అన్నది తక్కువ నుంచి మధ్యస్థంగా ఉంటుంది. రూ.15 లక్షల వరకు జీవిత బీమా కవరేజీ, రూ.50 వేలకు ప్రమాద బీమా కవరేజీ తీసుకోవచ్చు. పైగా బీమా కవరేజీ కోసం ఇన్వెస్టర్లు రూపాయి చెల్లించక్కర్లేదు. ప్రీమియం భారాన్ని పూర్తిగా యూటీఐ మ్యూచువల్ ఫండ్ భరిస్తుంది. కాల వ్యవధి పాలసీ కాల వ్యవధి 10 నుండి 15 ఏళ్లు. ఇందులో టార్గెట్ అమౌంట్ అని ఉంటుంది. కనీసం రూ.15,000, గరిష్టం రూ.15 లక్షలు. ఇన్వెస్టర్ వీటిల్లో ఏ మేరకు టార్గెట్ అమౌంట్ ఎంచుకుంటే ఆ మొత్తాన్ని ఏడాదికోసారి లేదా అర్ధ సంవత్సరం వారీగా లేక సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తుండాలి. 12 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్కులు దీన్ని తీసుకోవచ్చు. వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉండడం గమనించాలి. ఇన్వెస్టర్ తనకు అవసరమైనప్పుడు పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు. ఎగ్జిట్‌లోడ్ ఉంటుంది. ఆలస్యపు చెల్లింపులపై పెనాల్టీ లేదు. మెచ్యూరిటీ బోనస్‌గా 10 ఏళ్ల పాలసీపై 5 శాతం, 15 ఏళ్ల పాలసీపై 7.5 శాతాన్ని టార్గెట్ అమౌంట్‌పై ఇవ్వడం జరుగుతుంది. కాల వ్యవధి తీరిన తర్వాత ప్రతీ ఏడాదికి టార్గెట్ అమౌంట్‌పై 0.50 శాతాన్ని కూడా బోనస్‌గా ఇస్తారు. కాల వ్యవధి తర్వాత క్రమానుగత పెట్టుబడుల ఉపసంహరణను ఎంచుకునే ఆప్షన్ ఉంది. ఈ పథకంలో ఎక్స్పెన్స్ రేషియో కేవలం 1.7 శాతం. ఇతర ఫండ్స్ పథకాల్లోని ఎక్స్పెన్స్ రేషియోతో పోలిస్తే తక్కువే. యులిప్ అంటే దీర్ఘకాలం కోసం తీసుకునేది. ఈ పథకంలో పదేళ్ల రాబడులను పరిశీలిస్తే వార్షికంగా 8.54 శాతం చొప్పున ఉన్నాయి. రిస్క్‌ను పరిమితం చేసి, రాబడులను అధికం చేసే విధానంలో ఈ పథకం పెట్టుబడులను కొనసాగిస్తుంటుంది. లార్జ్, మిడ్‌క్యాప్ స్టాక్స్‌ను ఎంచుకుని, దీర్ఘకాలం వాటిల్లో పెట్టబడులను కొనసాగించడం ఇదే తెలియజేస్తుంది. తక్కువ చార్జీలు, ఎటువంటి వైద్య పరీక్షలు అవసరం లేకపోవడం, పారదర్శకత, జీవిత, ప్రమాద బీమా కవరేజీలు ఇవన్నీ ‘యూటీఐ యులిప్’ను స్మార్ట్ పెట్టుబడి పథకంగా మార్చేశాయి. -
క్యాష్ బ్యాక్‌తో భవిత భద్రం
ఆశయాలను బట్టి ఒక్కొక్కరికీ ఒక్కో విధమైనవి ఉంటాయి. అయితే, వారు, వీరు అని భేదం లేకుండా ప్రతి ఒక్కరికీ కామన్‌గా ఉండే లక్ష్యాలు కొన్ని ఉంటాయి. కనుక భవిష్యత్ కోసం ప్లానింగ్ చేసుకోవడంతో పాటు వర్తమాన అవసరాలను కూడా తీర్చుకోగలగడం ముఖ్యం. అటు దీర్ఘకాలికమైన లక్ష్యాలపై ఎంతగా దృష్టి పెడతామో .. ఇటు స్వల్పకాలిక, మధ్యకాలికమైన మైలురాళ్లను సాధించడం కూడా అంతే ముఖ్యం. మొట్టమొదటి కారు కావొచ్చు, సొంత ఇల్లు కావొచ్చు, పిల్లల చదువు లేదా పెళ్లిళ్లు కావొచ్చు.. ఇవన్నీ కూడా ఆ కోవకే చెందుతాయి. కుటుంబానికి సంతోషాన్ని పంచే.. వీటన్నింటినీ సాధించేందుకు తగినన్ని నిధులు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో దీర్ఘకాలికమైన వాటితో పాటు స్వల్పకాలికమైన లక్ష్యాల సాధనకు కూడా తోడ్పడే క్యాష్ బ్యాక్ బీమా పాలసీలను గురించి వివరించేదే ఈ కథనం. క్యాష్ బ్యాక్ ప్లాన్ ప్రయోజనాలు.. ఇది చాలా సింపుల్ జీవిత బీమా పథకం. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలపై ప్రతికూల ప్రభావం పడకుండా.. స్వల్ప, మధ్యకాలిక లక్ష్యాల సాధనకు వివిధ సమయాల్లో నిర్దిష్ట మొత్తం పాలసీదారు చేతికి అందిస్తుంది. ఇంటి కొనుగోలు, పిల్లల చదువు, విహారయాత్రలు లాంటి భవిష్యత్ లక్ష్యాలను సాధించేందుకు తోడ్పాటు అందిస్తుంది. ప్రత్యేకతలేమిటంటే ... పరిమిత కాలం పాటు ప్రీమియంలు కడితే చాలు దీర్ఘకాలికమైన పెట్టుబడి ప్రయోజనాలు అందించడం ఈ తరహా ప్లాన్ల ప్రత్యేకత. ఉదాహరణకు ఇండియాఫస్ట్ క్యాష్ బ్యాక్ ప్లాన్ విషయం తీసుకుంటే 5/7/10 సంవత్సరాల పాటు పేమెంటు టర్మ్ ఉంటే .. 9/12/15 సంవత్సరాల పాటు పాలసీ కొనసాగుతుంది. ప్లాన్ కాల వ్యవధి కొనసాగినంత కాలం.. మధ్య మధ్యలో గ్యారంటీగా చెల్లించే మొత్తాలు చేతికి వస్తూ ఉంటాయి. ప్లాన్ మెచ్యూరిటీ వేళ అదనంగా లాయల్టీ బోనస్ కూడా లభిస్తుంది. ఇక, ఈ ప్లాన్‌లో జీవిత బీమా కవరేజీతో పాలసీదారు కుటుంబానికి ఇన్సూరెన్స్పరమైన భద్రత లభిస్తుంది. అలాగే, కట్టిన ప్రీమియంలు, పొందే ప్రయోజనాలపైనా పన్నులపరమైన ప్రయోజనాలు లభిస్తాయి. పన్ను ప్రయోజనాలు ... ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద చాలా మటుకు క్యాష్ బ్యాక్ ప్లాన్లకు సుమారు రూ. 1,50,000 దాకా కట్టే ప్రీమియంలకు ట్యాక్స్ డిడక్షన్ లభిస్తుంది. మెచ్యూరిటీ మొత్తంపైన, విత్‌డ్రాయల్స్ పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి. డెత్ బెనిఫిట్స్‌పై కూడా పన్నులు ఉండవు. ఎవరికి అనువైనవి ... భవిష్యత్ లక్ష్యాల సాధన కోసం సంసిద్ధులుగా ఉండాలనుకునే వారెవరికైనా కూడా ఈ పాలసీలు అనువైనవే. ఇది సింపుల్ ఎండోమెంట్ ప్లాన్. ప్లాన్ ఆఖర్లో మెచ్యూరిటీ మొత్తాన్ని (బోనస్ లాంటి వాటితో పాటు) అందుకోవడంతో పాటు ప్లాన్ కొనసాగినంత కాలం మధ్య మధ్యలో కాస్త కాస్త చొప్పున నగదు కూడా చేతికి వస్తుండాలని కోరుకునే వారికి ఈ ప్లాన్లు అనువైనవి.