limitations
-
కీలక నిర్ణయం.. ఇకపై ఖరీదైన పెళ్లిళ్లు, వేడుకలు వద్దు!
జైపూర్: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన వేడుక. ఇద్దరు వ్యక్తులు కలిసి ఏడడుగులు నడిచి జీవితాంతం ఒక్కటిగా ఉండాలని తెలిపే వేడుక వివాహం. అందుకే యువత వివాహం అనగానే, ఫోటో షూట్, సంగీత్, అంటూ బోలెడు ప్లాన్లు చేసుకుంటారు. దీని కోసం వాళ్లు ఎంతటి ఖర్చైన చేయడానికి వెనుకాడరు. ఇంకొందరైతే తమ స్థోమతకు మించి అప్పులు చేసి మరీ ఘనంగా జరుపుకుంటారు. వివాహం అనంతరం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. వీటికి చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతో భిల్వారా జిల్లాకు చెందిన జాట్ కమ్యూనిటీ పెళ్లి వేడుకల నిర్వహణపై ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా, రాజస్థాన్ మేవార్ జాట్ మహాసభ భిల్వారా ఆధ్వర్యంలో జాట్ సొసైటీ సమావేశం నిర్వహించారు. దీని ప్రకారం.. రాజస్థాన్ మేవార్ జాట్ మహాసభ ప్రధాన కార్యదర్శి శోభరామ్ జాట్ మాట్లాడుతూ సమాజంలో ఎక్కువగా జరుగుతున్న పెళ్లిళ్లు, ఇతర ఖర్చులను తగ్గించాలని నిర్ణయించారు. వివాహాలతో పాటు ఇతర వేడుకలలో.. మౌసర్లో కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొంటారు. వీటితో పాటు కార్యక్రమాలకు హాజరుకావాల్సిన సంఖ్యను కూడా పరిమితి చేశారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇకపై గరిష్టంగా 500 నుంచి 700 మంది పురుషులు హాజరుకావచ్చు. అంతే కాకుండా నగదు పరంగా కూడా కొన్ని పరిమితులు విధించుకున్నారు. వీటితో పాటు పెళ్లికి భారీ మొత్తంలో వెచ్చిస్తున్న ఖర్చుకు అడ్డుకట్ట వేస్తూ సమాజంలో సామూహిక వివాహాలను ప్రోత్సహించనున్నారు. అదే విధంగా.. ఇతర వేడుకల విషయంలో కూడా ఆయా కుటుంబాలు వారికి తాహాతులో ఖర్చు చేయాలని కమిటీ సూచించింది. -
ఎస్బీఐ ‘బేసిక్’ కస్టమర్లకు షాక్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులకు (బీఎస్‌బీడీ) షాకిచ్చింది. ఇకపై ఏటీఎం నుంచైనా, శాఖ నుంచైనా నగదు విత్‌డ్రాయల్ లావాదేవీలు నెలలో కేవలం నాలుగు సార్లు మాత్రమే ఉచితంగా ఉంటాయని వెల్లడించింది. అలాగే, ఏడాదికి 10 చెక్ లీఫ్లకు మించి తీసుకుంటే కూడా అదనంగా చార్జీలు వర్తిస్తాయని తెలిపింది. ఈ పరిమితి దాటితే ‘అదనపు విలువ ఆధారిత సర్వీసులు అందించినందుకు‘ గాను రూ. 15 నుంచి రూ. 75 దాకా చార్జీలు వర్తిస్తాయని ప్రకటించింది. బీఎస్‌బీడీ ఖాతాలకు సంబంధించిన నిబంధనలను ఈ మేరకు సవరించింది. వీటి ప్రకారం .. ఎస్బీఐ శాఖలు, ఏటీఎంలు లేదా ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి 4 ఉచిత నగదు విత్‌డ్రాయల్ లావాదేవీలు దాటితే రూ. 15 చార్జీలతో పాటు జీఎస్టీ అదనంగా వర్తిస్తుందని బ్యాంకు పేర్కొంది. జూలై 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. ఆర్థికేతర లావాదేవీలు, ట్రాన్స్ఫర్ లావాదేవీలు మాత్రం శాఖలు, ఏటీఎం, సీడీఎం (క్యాష్ డిస్పెన్సింగ్ మెషీన్ల)లలో ఉచితంగానే ఉంటాయని ఎస్బీఐ వివరించింది. అటు చెక్ బుక్ సర్వీసులకు సంబంధించి.. ఒక ఆర్థిక సంవత్సరంలో పది చెక్ లీఫ్లు ఉచితంగా ఉంటాయని తెలిపింది. అది దాటితే.. 10 లీఫ్ల చెక్ బుక్కు రూ. 40, 25 లీఫ్‌లదైతే రూ. 75 చార్జీలు వర్తిస్తాయి. వీటికి జీఎస్టీ అదనం. ఇక అత్యవసర చెక్ బుక్ కోసం రూ. 50 (జీఎస్టీ అదనం) చెల్లించాల్సి ఉంటుంది. అయితే, సీనియర్ సిటిజన్ కస్టమర్లకు మాత్రం చెక్ బుక్ సేవల పరిమితి నుంచి మినహాయింపు ఉంటుంది. కస్టమర్ వివరాల ధ్రువీకరణ నిబంధనలకు (కేవైసీ) లోబడి ఎవరైనా బీఎస్‌బీడీ ఖాతా తీసుకోవచ్చు. ప్రధానంగా ఎలాంటి చార్జీలు, ఫీజుల భారం పడకుండా బడుగు, బలహీన వర్గాలను పొదుపు వైపు మళ్లించేందుకు ఈ ఖాతాలను ఉద్దేశించారు. ఐఐటీ–బాంబే ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం 2015–20 మధ్య కాలంలో 12 కోట్ల బీఎస్‌బీడీ ఖాతాలపై సర్వీసు చార్జీలు విధించడం ద్వారా కస్టమర్ల నుంచి ఎస్బీఐ ఏకంగా రూ. 300 కోట్లు వసూలు చేసింది. చదవండి: Senior Citizens: బ్యాంకు ఖాతాదారులకు గుడ్‌న్యూస్...! -
విద్యాసాయంపై పరిమితి వద్దు
న్యూఢిల్లీ: విధుల్లో వైకల్యం పొందిన, అమరులైన జవాన్ల పిల్లలకు ప్రతినెలా రూ.10,000 చొప్పున అందిస్తున్న విద్యా సాయంపై గరిష్ట పరిమితిని ఎత్తివేయాలని రక్షణ శాఖ ఆర్థికశాఖకు విజ్ఞప్తి చేసింది. ఈ జవాన్ల పిల్లలకు అందిస్తున్న విద్యా సాయం రూ.10 వేలు దాటరాదని గతేడాది జూలై 1న కేంద్రం ఉత్తర్వులిచ్చింది. ‘జవాన్ల పిల్లలకు అందిస్తున్న విద్యాసాయంపై గరిష్ట పరిమితిని ఎత్తివేయాలని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిత్వశాఖకు విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నాం’ అని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. విద్యాసాయంపై కేంద్రం గరిష్ట పరిమితిని విధించడంపై త్రివిధ దళాల్లో పెద్దఎత్తున అప్పట్లో అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో ఆర్మీ, నేవీ, వాయుసేనకు చెందిన చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ(సీవోఎస్‌ఈ) ఈ పరిమితిని ఎత్తివేయాలని రక్షణశాఖకు లేఖ రాసింది. 1972లో తీసుకొచ్చిన పథకం కింద ప్రస్తుతం స్కూళ్లు, కళాశాలలు, ఇతర వృత్తివిద్యా సంస్థల్లో చదువుకునే జవాన్ల పిల్లలకు విద్యను పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. -
క్యాష్‌బ్యాక్ ఆఫర్ నిబంధనలు వర్తిస్తాయ్...
• క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉందేమో చూడండి • అక్కడే నిబంధనలు, పరిమితులూ ఉంటాయ్ • ధర విషయంలో ఒకటికి మూడు సైట్లలో విచారించుకోవాలి ఈ కామర్స్ కొనుగోళ్లు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. చివరికి ఉప్పు, పప్పు వంటి నిత్యావసరాలను కూడా ఇవి అమ్మేస్తున్నాయి. క్యాష్‌బ్యాక్ (కొన్న మొత్తం విలువలో నిర్ణీత శాతం మేర తిరిగి వెనక్కి వస్తుంది) కోసం డిస్కౌంట్ తదితర ఆఫర్లతో కస్టమర్లకు ఈ సంస్థలు గాలం వేస్తున్నాయి. నిజానికి ఈ ఆఫర్లు కస్టమర్లకు కూడా ఉపయోగకరమే. అయితే, ఈ ఆఫర్ల ప్రయోజనాన్ని అందుకోవాలంటే కొనుగోలు సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు అభిరామ్ ఎల్జీ 8కిలోల ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్ కొనుగోలు చేయాలనుకున్నాడు. క్యాష్ బ్యాక్, తగ్గింపు వంటి ఆఫర్లు ఏవైనా ఉన్నాయేమోనని ఆన్లైన్ పోర్టల్స్‌ను పరిశీలించాడు. అమెజాన్ సైటులో హెచ్డీఎఫ్సీ డెబిట్ కార్డులపై 5 శాతం, స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10 శాతం ఆఫర్ ఉందని తెలిసింది. పూర్తి వివరాలు తెలుసుకోకుండా కొనేస్తే పూర్తి ప్రయోజనం రాకపోవచ్చు. ఎందుకంటే ఇలాంటి ఆఫర్లకు పరిమితులు, నిబంధనలు ఉంటాయి. నిర్ణీత కాలపరిమితి అనేది కూడా ఉంటుంది. ఒక్కొక్క సమయంలో ఒక్కో బ్యాంకు కార్డులపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. క్యాష్ బ్యాక్ అంటే...? ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతో టైఅప్ అయ్యి ఆయా బ్యాంకు ఖాతాదారులు క్రెడిట్, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసే కొనుగోళ్లపై ఈ కామర్స్ పోర్టల్స్ అదనపు తగ్గింపును క్యాష్ బ్యాక్ రూపంలో అందిస్తుంటాయి. ఈ క్యాష్ బ్యాక్ ఆయా కస్టమర్ల బ్యాంకు ఖాతాల్లో క్రెడిట్ అవుతుంది. ఉదాహరణకు అమెజాన్ సైట్లో వాషింగ్ మెషిన్ ధర రూ.20వేలు ఉందనుకోండి. ఎస్బీఐ డెబిట్/క్రెడిట్‌కార్డు దారులకు 10 క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తే ఆ ఉత్పత్తి నికర కొనుగోలు విలువ రూ.18వేలు. సాధారణ తగ్గింపునకు ఈ క్యాష్ బ్యాక్ అదనం. ఇలాంటి ఆఫర్ ఉన్న సమయంలో ఉత్పత్తి ధర చాలా తక్కువకే వస్తుంది. కానీ, అదే సమయంలో ఇతర ఈకామర్స్ పోర్టల్స్‌లో అదే ఉత్పత్తి ధర ఎంతుందన్న అంశాన్ని పరిశీలించుకోవాలి. ఆఫర్లకు పరిమితులు క్యాష్ బ్యాక్ ఆఫర్ల విషయంలో పరిమితులు కూడా ఉంటాయని తెలుసుకోవాలి. ఉదాహరణకు రూ.20వేల వాషింగ్ మెషిన్‌పై 15 శాతం క్యాష్ ఉందనుకోండి. ఈ లెక్కన రూ.3,000 క్యాష్ బ్యాక్ రూపంలో వెనక్కి రావాలి. కానీ అక్కడ కార్డు సంస్థ గరిష్ట క్యాష్ బ్యాక్ రూ.2,000కే పరిమితం అనే నిబంధన విధించి ఉండవచ్చు. ఇక, కనీస లావాదేవీ విలువ అంటూ మరో నిబంధన కూడా ఉంటుంది. రూ.2,000 లేదా రూ.5,000 అంతకంటే ఎక్కువ కొనుగోలు విలువ ఉండాలని షరతు విధించి ఉండవచ్చు. అలాగే, ఒక క్రెడిట్ కార్డుపై ఒక్కసారి జరిపే లావాదేవీకే క్యాష్ బ్యాక్ పరిమితం చేయవచ్చు. క్యాష్ బ్యాక్లలో రకాలు ఈ క్యాష్బ్యాక్లలో నూ రకాలు ఉ న్నాయి. ఒక విధానంలో తక్షణమే క్యాష్ బ్యాక్ ప్రయోజనం లభి స్తుం ది. అంటే అప్పటికప్పుడే ఆఫర్ మేర బిల్లు మొత్తంలో తగ్గింపు లభిస్తుంది. అది పోను మిగిలిన విలువమేర చెల్లిస్తే సరిపోతుంది. మరో విధానంలో కొనుగోలు తర్వాత కొన్ని రోజులకు గానీ ఆ క్యాష్ బ్యాక్ రాదు. ఇక క్యాష్ బ్యాక్ ఆఫర్ అప్పటికప్పుడు చెల్లింపుల ద్వారా చేసే కొనుగోళ్లకే పరిమితం కాదు. ఈఎంఐ విధానంలో కొనుగోళ్లపైనా అందుబాటులో ఉండవచ్చు. అయితే, చెల్లింపులు చేసే ముందు అక్కడున్న నిబంధనలు, మినహాయింపులు, పరిమితుల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. -
అస్తిత్వ ఉద్యమాలూ, పరిమితులూ
అభిప్రాయం ప్రతి అస్తిత్వ ఉద్యమానికీ ఫలితాలూ, పరిమితులూ వుంటాయని సమాజ చలనం తెలియజేస్తూనే వుంటుంది. ఫలితాలు అంటే, ఆ ఉద్యమం సమాజం దృష్టికి తెచ్చిన కొత్త అంశాలు. పరిమితులు అంటే, ఆ ఉద్యమం లోపలా, బయటా వున్న పరిమితులు. లోపల వున్న పరిమితులు, ఉద్యమాన్ని అంతకు మించి ముందుకు వెళ్ళలేని పరిస్థితిని కల్పిస్తాయి. దాంతో అది బయటి పరిమితి అవుతుంది. సమాజంలో కులాల మధ్యా, మతాల మధ్యా, జాతుల మధ్యా, స్త్రీ, పురుషుల మధ్యా అసమానతలున్నంతవరకూ అస్తిత్వ ఉద్యమాలు పుట్టుకొస్తూనే వుంటాయి. మరి, అన్ని అసమానతలూ అలా వుండగానే (ఇంకా పెరుగుతుండగా) అస్తిత్వ ఉద్యమాలు ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఎందుకొస్తున్నట్టు? ఆ ఉద్యమాల లోపల వున్న పరిమితే బయటి పరిమితికి కారణం అన్నాము. ఆ లోపలి పరిమితులేమిటి? ఏ అస్తిత్వవాద లక్ష్యమైనా ఏముంటుంది? తమకు జరుగుతున్న అన్యాయాన్ని సమాజం దృష్టికి తీసుకెళ్ళడం. ఇందులో తప్పు పట్టవలసిందేమీ లేదు. తమకు జరుగుతున్న అన్యాయాన్నే గుర్తించలేనివాళ్ళు ఇతరులకు జరుగుతున్న అన్యాయాన్ని ఏం గుర్తిస్తారు? అయితే, సమాజంలో అన్ని అసమానతలకూ మించిన అసమానత వున్నది. పేద, ధనికుల మధ్య వున్న తేడా! దీన్ని ఏ అస్తిత్వవాదమూ అంతగా పట్టించుకోదు. పేదలకూ ధనికులకూ మధ్య వున్న తేడా ఆర్థికపరమైనది. అస్తిత్వ ఉద్యమాలకు కారణం సామాజికమైనది. రెండింటినీ కలిపి చూడవచ్చా... అనవచ్చు. కలిసే వున్నప్పుడు కలిపి చూడక తప్పదు. సామాజిక పరమైన అసమానతలు ఆర్థిక పరమైన అసమానతలకూ, ఆర్థిక పరమైన అసమానతలు సామాజిక అసమానతలకూ కారణాలవుతున్నాయి. ఇందుకు స్త్రీ అస్తిత్వవాదం ఒక ఉదాహరణ. స్త్రీ చైతన్యవాదమన్నా, ఫెమినిజమన్నా అదే. చాలా న్యాయమైనది. అంత న్యాయమైన ఉద్యమం కూడా కొంతవరకూ కదిలి కదిలించి ఆగింది. సాహిత్యంలోనూ అది తీసుకొచ్చిన సంచలనం ఆగి, కొంత స్తబ్దతకు గురయింది. ఇంకేం చెయ్యాలో తెలీని కొందరు పురాణ పాత్రలకు స్త్రీవాద పాఠాలు చెబుతున్నారు. అయితే, స్త్రీలపై అన్ని రకాలుగా సాగుతున్న అణచివేతనూ, వివక్షనూ స్త్రీవాదం గట్టిగా ప్రశ్నించింది. పురుషాధిపత్యాన్ని ప్రశ్నించడంలో కొంత తప్పు ధోరణి కనిపించినా, అస్తిత్వ ఉద్యమాల ప్రారంభంలో వుండే అత్యుత్సాహంగా, ఆవేశంగా దాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే, ఆ స్త్రీ చైతన్యవాదం స్త్రీలనే కలుపుకోలేక పోయిందని అనక తప్పదు. దళిత కుటుంబాలకు చెందిన స్త్రీలు, ఎగువ మధ్య తరగతికీ, ఆపై వాళ్ళకూ చెందిన స్త్రీవాదంగా దాన్ని భావించారు. సామాజిక పరమైన అసమానతలు ఆర్థిక పరమైన అసమానతకూ, ఆర్థిక పరమైన అసమానత సామాజిక పరమైన అసమానతకూ కారణాలవుతాయంటే ఇదే. స్త్రీ అస్తిత్వవాదం కోరిందేమిటి? తమను మనుషులుగా గుర్తించాలని కాదు. స్త్రీలుగా గుర్తించాలనే. అందువల్ల, సహజంగానే వాళ్లు ఏ వర్గానికి చెందిన స్త్రీలో వాళ్ళ అస్తిత్వవాదంగానే అది వుండిపోయింది. ఒక్క స్త్రీ అస్తిత్వవాదమే కాదు, అన్ని అస్తిత్వవాదాల, లేదా ఉద్యమాల పద్ధతీ అదే. మైనారిటీ అస్తిత్వవాదం, తమను మైనారిటీలుగా గుర్తించాలనే కోరుతుంది. వివిధ కుల సంఘాలన్నీ తమను ఆ కులం వారుగా గుర్తించాలనే కోరుకుంటాయి. ఈ ఆలోచన స్త్రీల గురించి స్త్రీలే రాయాలనీ, ఫలానా కులం గురించి ఆ కులం వారే రాయాలనేంత విపరీత ధోరణికి వెళ్ళడము చూశాం. దాంతో ఏ అస్తిత్వ ఉద్యమానికీ మరొక అస్తిత్వ ఉద్యమం మద్దతు లభించదు. కొన్ని సందర్భాల్లో ఒకదానికి మరొకటి వ్యతిరేకం కూడా! ఒక్కమాటలో చెప్పాలంటే, అస్తిత్వ ఉద్యమాల ఆలోచన తాము కోరుతున్న వాటిని సాధించడం మీద కన్నా, అస్తిత్వాన్ని కాపాడుకోవడం మీదనే ఎక్కువగా వుంటుందనాలి. ఆ పరిమితే ఆ ఉద్యమాలు సాధించినవాటికీ వర్తిస్తుంది. - పి. రామకృష్ణ -
పెట్టుబడులపై పరిమితులు ఎత్తివేయాలి
- అప్పుడే ఇతర దేశాలతో పోటీపడటం సాధ్యం - ప్రభుత్వానికి నిపుణుల ప్యానెల్ నివేదిక న్యూఢిల్లీ: ఆర్థిక రంగంలో అంతర్జాతీయంగా ఇతర దేశాలతో పోటీపడాలంటే భారత్ పెట్టుబడులపై పరిమితులను క్రమంగా ఎత్తివేయాలని స్టాండింగ్ కౌన్సిల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ సిఫార్సు చేసింది. అలాగే , నియంత్రణ.. పన్నుల వ్యవస్థలను మెరుగుపర్చాలని పేర్కొంది. అంతర్జాతీయంగా భారతీయ ఆర్థిక రంగం పోటీపడే సత్తాను అధ్యయనం చేసి, తగు పరిష్కార మార్గాలు సూచించేందుకు 2013 జూన్‌లో ఆర్థిక శాఖ ఈ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఇది తాజాగా తొలి నివేదికను ఆర్థిక శాఖకు సమర్పించింది. ఈ నివేదికపై సంబంధిత వర్గాలు అక్టోబర్ 6 దాకా ఆర్థిక శాఖకు తమ అభిప్రాయాలు పంపవచ్చు. ఇతర దేశాలతో పోటీపడాలంటే ప్రధానంగా పెట్టుబడులపై పరిమితులను క్రమబద్ధీకరించి.. క్రమంగా తొలగించాలని, సాంకేతికంగా పటిష్టమైన ఆర్థిక నియంత్రణ వ్యవస్థను రూపొందించుకోవాలని, స్థానికత ఆధారంగా పన్నుల విధించే విధానానికి మళ్లాల్సి ఉంటుందని కమిటీ పేర్కొంది. ఇందులో భాగంగా సంస్కరణల ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం స్వల్ప, మధ్యకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కమిటీ సూచించింది. అలాగే, వీటి అమలు బాధ్యతలను కూడా స్పష్టంగా నిర్దిష్ట విభాగాలకు అప్పగించాలని పేర్కొంది. భారతీయ అసెట్స్‌పై ఆధారిత ఆర్థిక లావాదేవీలు విదేశాల్లో గణనీయంగా జరుగుతున్నాయని కమిటీ వివరించింది. రూపాయి డెరివేటివ్స్, మార్కెట్స్ సూచీ నిఫ్టీలో ట్రేడింగ్ భారీ స్థాయిలో దాదాపు 20 బిలియన్ డాలర్ల మేర రోజువారీ టర్నోవరు ఉంటోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో పుష్కలంగా వనరులున్న భారత్‌కు .. మార్కెట్లో ఆధిపత్యం కోసం కృషి చేయాలని కమిటీ అభిప్రాయపడింది. -
ఇంత తాగితే ‘పర్లేదు’!
మద్యం ఎంత తక్కువ మోతాదులో తీసుకున్నా కూడా.. మనిషి శరీరంలోని దాదాపు ప్రతి వ్యవస్థపైనా ప్రభావం చూపుతుంది. మెదడు ఏక కాలంలో చాలా అంశాలతో వ్యవహరించాల్సి ఉంటుంది. నిర్విరామంగా లెక్కలేనంత సమాచారాన్ని విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. మద్యం.. మెదడు చురుకుదనంపై, తక్షణ నిర్ణయం తీసుకునే సామర్థ్యంపై, చుట్టూ పరిస్థితుల్లో మార్పులకు వేగంగా స్పందించే సామర్థ్యంపై, కీలక సమయాల్లో కచ్చితమైన, కొన్ని సందర్భాల్లో క్లిష్టమైన చర్యలు చేపట్టడంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మద్యం మోతాదు ఒక డ్రైవరుపై ఎలా ప్రభావం చూపుతుందంటే... 20 ఎం.జి./డెసీలీటర్ : మద్యం మోతాదు 0.02 కు చేరగానే.. పరిస్థితులను ఆకళింపు చేసుకుని నిర్ణయానికి వచ్చే (జడ్జిమెంట్) సామర్థ్యం, ప్రశాంతత కొంత కోల్పోవటం ప్రారంభమవుతుంది. మూడ్ మారిపోతుంటుంది. ఫలితంగా చూపు మందగించటం మొదలవుతుంది. ఏక కాలంలో రెండు పనులు చేసే సామర్థ్యం తగ్గిపోతుంటుంది. 50 ఎం.జి./డెసీలీటర్ : మెదడులో ఆలోచనలకు అనుగుణంగా శరీర కండరాల కదలిక (సైకోమోటార్) ప్రక్రియ గణనీయంగా కుంటుపడుతుంది. కంటి కదలికలు మందగిస్తాయి. దృష్టి కోణం, ప్రతిస్పందన సమయం, సమాచార విశ్లేషణలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఫలితంగా సమన్వయం తగ్గిపోతుంది. కదిలే వస్తువులను గమనించే సామర్థ్యం తగ్గిపోతుంది. స్టీరింగ్‌ను నియంత్రించటం కష్టమవుతుంది. డ్రైవింగ్‌లో అత్యవసర పరిస్థితులకు స్పందించటం తగ్గిపోతుంది. 80 ఎం.జి./డెసీలీటర్ : కండరాల సమన్వయం (ఉదాహరణకు మాట, చూపు, ప్రతిస్పందించే సమయం, వినికిడి) కనిష్టానికి పడిపోతుంది. ప్రమాదాన్ని గుర్తించటం, నిర్ణయానికి రావటం మరింత కష్టంగా మారుతుంది. స్వీయ నియంత్రణ, విచక్షణ, జ్ఞాపకం కుంటుపడతాయి. ఫలితంగా.. దృష్టి (లేదా ఆలోచన) కేంద్రీకరించటం తరిగిపోతుంది. తాత్కాలికంగా జ్ఞాపకశక్తిని కోల్పోతారు. మాటలపై నియంత్రణ కోల్పోతారు. సమాచారాన్ని విశ్లేషించే సామర్థ్యం (సిగ్నల్‌ను గమనించటం, చూపుతో పరిశీలించటం వంటివి) తగ్గిపోతుంది. కచ్చితత్వం కుంటుపడుతుంది. ‘30’ దాటితే కేసు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన రోడ్ సేఫ్టీ ఇన్ టెన్ కంట్రీస్ (ఆర్ఎస్-10) ప్రాజెక్టు కింద లభించిన ఉపకరణాలను వినియోగించి ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్‌డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నారు. మద్యం తాగి చిక్కినవారిని కోర్టుకు తీసుకువెళ్లాలంటే సెక్షన్ 185 ప్రకారం బుక్ చేసి, ఆధారాలతో వెళ్లడం అవసరం. చట్ట ప్రకారం ప్రతి 100 మిల్లీలీటర్ల రక్తంలో 30 మిల్లీగ్రాములు అంతకంటే ఎక్కువ ఉంటేనే చర్యలు తీసుకునే వీలుంది. బ్రీత్ ఎనలైజర్లు అల్కహాల్ పరిమాణాన్ని ప్రింట్ అవుట్ రూపంలో ఇస్తాయి. యూత్... టూ వీలర్స్... మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్లనే రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని హైదరాబాద్ పోలీసుల అధ్యయనంలో తేలింది. దీన్ని నివారించి ప్రమాదాలను, మృతుల సంఖ్యను తగ్గించేందుకు పోలీసు కమిషనర్ నవంబర్ 4, 2011న మొదటిసారిగా హైదరాబాద్‌లో ‘డ్రంకన్ డ్రైవ్’తనిఖీలకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి నేటి వరకు ఈ తనిఖీల్లో 46,252 మంది పట్టుబడగా వీరిలో 4500 మందికి జైలు శిక్షలు పడ్డాయి. అత్యధికంగా ఇద్దరు లారీ డ్రైవర్లకు రెండు నెలల జైలుశిక్ష వేశారు. ఇక జరిమానా రూపంలో వీరందరి నుంచి రూ.7,56,17,977 వసూలయ్యాయి. పట్టుబడ్డవారిలో అత్యధికంగా 33490 ద్విచక్రవాహనదారులు ఉన్నారు. రెండోస్థానంలో కార్లు(10255), మూడో స్థానంలో ఆటో డ్రైవర్లు (1916 ) ఉన్నారు. వయసులవారీగా పరిశీలిస్తే 21-30 ఏళ్ల వయసువారు 21571 మంది. 31-40 ఏళ్లవారు 14772 మంది. 70కిపైగా వయసున్నవారు 1352 మంది. పట్టుబడిన వారిలో ఆల్కహాల్ పరిమాణం 51-100 మిల్లీ గ్రాములున్నవారు 20186 మంది. వీరినే వర్గాలవారీగా చూస్తే అత్యధికంగా ప్రైవేటు ఉద్యోగులు(16,309), అత్యల్పంగా ఉపాధ్యాయులు(29). అనుమతించబడే మద్య పరిమితి వివిధ దేశాల్లో వివిధ రకాలుగా ఉంది. భారత్ 30 ఎం.జి./డెసీలీటర్ స్పెయిన్ 25 ఎం.జి./డెసీలీటర్ ఇజ్రాయెల్ 24 ఎం.జి./డెసీలీటర్ నార్వే 20 ఎం.జి./డెసీలీటర్ స్వీడన్ 20 ఎం.జి./డెసీలీటర్ రష్యా 20 ఎం.జి./డెసీలీటర్ పోలండ్ 20 ఎం.జి./డెసీలీటర్ ఎస్తోనియా 20 ఎం.జి./డెసీలీటర్