linked
-
లాలూ ఫ్యామిలీకి ఈడీ షాక్.. రూ.6 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్..
పాట్నా: ల్యాండ్ ఫర్ జాబ్ స్కాంలో బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు చిక్కెదురైంది. ఈ మేరకు లాలూ కుటుంబానికి సంబంధించిన రూ.6కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 2004 నుంచి 2009 మధ్య లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే ఉద్యోగాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీ దేవీని ఈడీ గత మేలోనే ప్రశ్నించింది. ఆమెతో పాటు వరుసగా బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఆర్జేడీ ఎంపీలు మిసా భారతి, చండ యాదవ్, రాగిని యాదవ్‌ల నుంచి కూడా సమాచారాన్ని ఈడీ రాబట్టింది. ఈ కేసులో గత జులైలోనే దాదాపు 18 మందిపై సీబీఐ ఛార్జ్‌షీటును దాఖలు చేసింది. 2004 నుంచి 2009 మధ్య రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు లాలూ ప్రసాద్ రైల్వేలో గ్రూప్ డీ ఉద్యోగాల్లో అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. బిహార్‌కు చెందిన అభ్యర్థులకు ఉద్యోగాలను అక్రమంగా కేటాయించారని, బదులుగా ఉద్యోగం పొందిన అభ్యర్థులు తమ భూములను లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి రాసి ఇచ్చారనేది ఆరోపణ. దీనిపై కొన్నేళ్లుగా దర్యాప్తు నడుస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో లాలూకు చెందిన రూ.6 కోట్ల ఆస్తులను అటాచ్ చేయడం గమనార్హం. ఇదీ చదవండి: జైపూర్ ఎక్స్‌ప్రెస్ ఘటన: చేతన్ షార్ట్ టెంపర్.. అందుకే ఈ ఘోరం! -
ఏ మొబైల్ నెంబర్ ఆధార్ కి లింక్ అయ్యిందో.. ఇప్పుడు మీ మొబైల్ లోనే ఇలా చూసుకోవచ్చు
-
వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం
జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ ఆమోదం ప్రభుత్వానికి పంపాలని తీర్మానం కాకినాడ సిటీ : వ్యవసాయ పనులకు కూలీల కొరత సమస్య ఎదుర్కొంటున్నందున రైతులు, కూలీలకు ఉభయతారకంగా వ్యవసాయ పనులను ఉపాధి హామీ పనులతో అనుసంధానం చేసేందుకు జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) ఆమోదించి ప్రభుత్వానికి పంపాలని తీర్మానం చేసింది. గురువారం కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ హాలులో దిశ కమిటీ సమావేశం ఎంపీ, కమిటీ చైర్మన్ మాగంటి మురళీమోహన్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారం అందిస్తున్న 28 అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జిల్లాలో అమలవుతున్న తీరును కమిటీ విస్తృతంగా సమీక్షించింది. సమావేశాన్ని చైర్మన్ మురళీమోహన్ ప్రారంభిస్తూ జిల్లాకు నూతనంగా వచ్చిన కలెక్టర్ కార్తికేయ మిశ్రా, జాయింట్ కలెక్టర్ ఎ.మల్లికార్జునను అభినందించారు. అభివృద్ధి, సంక్షేమాలకు దూరంగా ఉన్న ఏజెన్సీ ప్రాంత ప్రజల సమస్యలపై చర్చించేందుకు దిశ కమిటీ సమావేశాన్ని రంపచోడవరంలో నిర్వహించాలన్న కలెక్టర్ ప్రతిపాదనను చైర్మన్ స్వాగతిస్తూ కమిటీ తదుపరి సమావేశాన్ని రంపచోడవరంలోనే నిర్వహిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రయోజనాలు లక్ష్యిత వర్గాలకు చేరేలా చూడాలని ఆదేశించారు. ప్రధాని సూచనల మేరకు తన నియోజకవర్గంలోని సంజీవపురం, రంగాపురం (అనపర్తి నియోజకవర్గం), ఉండేశ్వరపురం (రాజానగరం నియోజకవర్గం) గ్రామాలను దత్తత తీసుకున్నానని, ఈ గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి అధికారులు సహకరించాలని చైర్మన్ కోరారు. అనంతరం పథకాల వారీగా సుదీర్గ సమీక్ష నిర్వహించారు. ఉపాధి పనులను పెద్ద ఎత్తున ఏజెన్సీ, అప్లాండ్ 30 మండలాల్లో చేపట్టాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు కోరగా, డెల్టా ప్రాంతంలో కాల్వలో తూడు, డెక్క తొలగింపు పనులు చేపడితే రైతులకు ప్రయోజనకరంగా ఉండగలదని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. డెల్టా ప్రాంతంలోని దేవాదాయ, పంచాయతీ చెరువుల అభివృద్ధిని మిషన్ కాకతీయ శైలిలో చేపట్టాలని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కోరారు. ఏజెన్సీ మండలాల్లో ఉపాధి హామీ పనుల వేతనాల చెల్లింపులో కూలీలను మోసగిస్తున్నారని, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుని కాజేసిన కూలీల సొమ్మును తిరిగి రాబట్టాలని ఎమ్మెల్సీ టి.రత్నాబాయి కోరారు. కూలీలకు గతంలో ఇచ్చినట్టు ఎంత కూలీ వచ్చిందో తెలిపే పే స్లిప్పులు జారీ చేయాలని, బ్యాంకులకు వెళ్లి కూలీ డ్రా చేసుకోలేక పోతున్నందున బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా చెల్లింపులు ఏర్పాటు చేయాలని విలీన మండలాల ఎంపీపీలు కోరారు. ఈ సమావేశంలో ఎంపీ తోట నరసింహం, శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, పిల్లి అనంతలక్ష్మి, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ వి.విజయరామరాజు, ఎంపీపీలు, నామినేటెడ్ సభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
పనామా పేపర్లలో మాల్యా!
న్యూఢిల్లీ: సుమారు రూ. 9000 కోట్ల బకాయిలతో వివాదంలో ఇరుక్కున్న లిక్కర్ టైకూన్ విజయ్ మాల్యా పేరు పనామా పేపర్లలో ప్రముఖంగా నిలిచింది. స్వదేశంలో పన్నులు ఎగవేస్తూ విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్న 500 మంది భారతీయుల్లో విజయ్ మాల్యా పేరు కూడా చేరింది. ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) దశలవారీగా విడుదల చేస్తున్న పనామా పేపర్స్ తాజా వివరాల్లో మాల్యా బండారాన్ని బహిర్గతం చేసింది. మిగిలినవాళ్లలో చాలామంది పరోక్ష సంబంధాలే కలిగి ఉండగా.. మాల్యా మాత్రం ప్రత్యక్షంగా ఆయా సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారు. ఫిబ్రవరి 15, 2006 నుంచి పనిచేస్తున్న బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ సంస్థ వెంచర్ న్యూ హోల్డింగ్ లిమిటెడ్ సంస్థతో, విజయ్ మాల్యాకు ప్రత్యక్షంగా సంబంధాలున్నాయని ప్రకటించి మరో సంచలనానికి తెరతీసింది. దాదాపు రూ. 4వేల కోట్ల తన సొంత డబ్బును ఆయన ఈ సంస్థలో డైరెక్టుగానే పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. బెంగళూరులోని ఆయన ఇంటి చిరునామా నంబర్ 3, విఠల్ మాల్యా రోడ్, బెంగళూరు పేరుతో రిజిస్టరై ఉన్న సంస్థ కార్యాలయం ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. ఇక ఆయన పోర్టికులస్ ట్రస్ట్ నెట్ అనే మరో కంపెనీలో డైరెక్టుగా పెట్టుబడులు పెట్టారు. ఐసీఏజె అందించిన సమాచారం ప్రకారం ఈ పోర్టికులస్ ట్రస్టులో విదేశీ దొంగఖాతాల కోసం 'వన్ స్టాప్ సొల్యూషన్' సెటింగ్ ఉందని తెలిపింది. దీంతోపాటు మాల్యా పేరు బయటకు రానీయకుండా ఫోన్సెకా ఎన్నో జాగ్రత్తలు తీసుకుందని కూడా తెలుస్తోంది. దక్షిణ పసిఫిక్ ప్రాంతంలోని ప్రముఖమైన కుక్ దీవుల్లో పోర్టికులస్ ట్రస్ట్ మూలాలు ఉన్నాయని పేర్కొంది. అయితే ఆయన ఇతర కంపెనీలు దేనికీ వెంచర్ న్యూ హోల్డింగ్స్ తో సంబంధం లేకపోవడం మరో ట్విస్ట్. -
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధార్ అస్త్రం
-
డ్రైవింగ్ లైసెన్స్‌కూ ఆధార్ తప్పనిసరి?
-
విద్యార్థులకూ ‘ఆధార్’ !
శ్రీకాకుళం: అన్నివర్గాల వారిని ఆందోళనకు గురిచేస్తున్న ఆధార్ నంబర్ల అనుసంధానం తాజాగా విదార్థులను తాకింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న సరస్వతీ పుత్రుల ఆధార్ నంబర్లను సేకరించి వాటిని రికార్డుల్లో నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జిల్లాలో శుక్రవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. పలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో అక్రమాలను అరికట్టేందుకు ఈ నిర్ణ యం తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు యూని ఫారాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉపకార వేతనాలను కూడా అందజేస్తున్నారు. పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపించేందుకుగానూ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పేర్లను నమోదు చేస్తున్నట్టు రాష్ట్ర అధికారులు గుర్తించారు. పాఠశాలల్లో చదవని విద్యార్థుల పేర్లను రికార్డుల్లో నమోదు చేయడం వల్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. అలాగే ఎనిమిదేళ్ల క్రితం పాఠశాలలో ఒకటో తరగతిలో చేరిన విద్యార్థుల వివరాలను ఇటీవల పరిశీలించి వీరు 8వ తరగతిలో చేరేరా లేరా అన్నది పరిశీలించగా జిల్లాలో ఐదు వేల మంది వరకు తగ్గినట్లు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితే ఉండడంతో ఇటువంటి వాటిని అరికట్టడం ద్వారా ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టకుండా చూడాలని నిర్ణయించారు. అలాగే ప్రైవేటు విద్యాసంస్థల్లో అనుమతులకు మించి విద్యార్థులను చేర్చుకుంటూ ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపిస్తున్నారన్న విషయం కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఇలా చేయడం వల్ల పన్నుల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోందని రాష్ట్ర అధికారులు భావించారు. ఇటువంటి వాటిని అరికట్టాలని, విద్యార్థి పేరు ప్రైవేటు లేదా ప్రభుత్వ పాఠశాలల్లో ఏదో ఒక చోట మాత్రమే ఉండేలా చూడాలని నిర్ణయించి ఆధార్‌కార్డు నంబర్‌ను విద్యార్థుల రికార్డులో నమోదు చేస్తే చాలా వరకు అరికట్ట వచ్చునని సర్కార్ భావించింది. వెంటనే ఆధార్ నంబర్లను సేకరించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కొందరు అవినీతి అధికారులు చిత్తశుద్ధితో ఈ పని చేస్తారా లేనా అని అనుమానించి భవిష్యత్‌లో ఆధార్ నంబర్‌ను 10వ తరగతి మార్కుల జాబితా లో నమోదు చేయాలన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు సమాచారం. -
ఆధార్‌లేకుంటే....రుణమాఫీ లేనట్లే....