Liquid funds
-
మ్యూచువల్ ఫండ్ ఆస్తులు తగ్గాయ్
న్యూఢిల్లీ: డిసెంబర్ నెలలో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు తగ్గుదలను నమోదుచేశాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(యాంఫీ) విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం.. గత నెల్లో రూ. 61,810 కోట్ల ఉపసంహరణ చోటుచేసుకుంది. దీంతో ఈ పరిశ్రమలోని 44 సంస్థల నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) 2% తగ్గి రూ. 26.54 లక్షల కోట్లకు పడిపోయాయి. ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు నియంత్రణ సంస్థ సెబీ తీసుకున్న చర్యలతో గతేడాది నవంబర్ నెల్లో మొత్తం నిర్వహణ ఆస్తి గరిష్టంగా రూ. 27.04 లక్షల కోట్లకు చేరుకోవడం తెలిసిందే. కాగా, ఆ సమయంలో భారీగా ఇన్‌ఫ్లో పెరిగిన రుణ–ఆధారిత పథకాల్లోనే గత నెల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ స్కీముల్లోని లిక్విడ్ ఫండ్స్, నగదు విభాగాల్లోని ట్రెజరీ బిల్లులు, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్, కమర్షియల్ పేపర్లు వంటి స్వల్పకాలిక సాధనాల నుంచి రూ. 71,000 కోట్ల మేర ఉపసంహరణ చోటుచేసుకుంది. వీటితో పాటు ఒక రోజులో మెచ్యూర్ అయ్యే ఓవర్ నైట్ ఫండ్స్‌లో రూ. 8,800 కోట్లు వెనక్కువెళ్లాయి. అయితే, అధిక రేటింగ్ కలిగిన బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ ఫండ్స్‌లో రూ. 4,770 కోట్లు చేరాయి. గత నెల్లో అమ్మకాల వెల్లువకు కారణం రుణ–ఆధారిత పథకాల్లో భారీగా విక్రయాలే అని పైసా బజార్ డాట్ కామ్ కో–ఫౌండర్ అండ్ సీఈఓ నవీన్ కుక్రేజా విశ్లేషించారు. ఈక్విటీ ఆధారిత ఫండ్స్‌లో జోరు.. గత నెలలో దేశీ స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలను తిరగరాసుకుంటూ దూసుకెళ్లిన నేపథ్యంలో ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్స్ రూ. 4,432 కోట్ల ఇన్‌ఫ్లోను ఆకర్షించాయి. స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు నిరాశాజనకంగా ఉండడంతో లార్జ్‌క్యాప్ ఫండ్స్‌లోకి ప్రవాహం పెరిగిందని కుక్రేజా విశ్లేషించారు. సిప్ సూపర్.. డిసెంబర్లో క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళికల(సిప్) ద్వారా చేరిన పెట్టుబడులు రూ. 8,518 కోట్లు కాగా, దీంతో సిప్ అసెట్ బేస్ ఏకంగా జీవితకాల గరిష్టానికి చేరింది. గతనెల చివరినాటికి అసెట్ బేస్ రూ. 3.17 లక్షల కోట్లకు పెరిగింది. రిటైల్ ఇన్వెస్టర్లలో ఫండ్స్‌పై విశ్వాసం పెరిగినందున సిప్ పెట్టుబడులు జోరందుకుంటున్నాయని యాంఫీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎన్.ఎస్.వెంకటేష్ అన్నారు. గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ రూ. 27 కోట్లను ఆకర్షించాయి. -
ఎన్‌బీఎఫ్‌సీలకు కొత్తగా ఎల్‌సీఆర్
న్యూఢిల్లీ: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్బీఎఫ్సీ) సంబంధించి లిక్విడిటీ కవరేజీ రేషియో (ఎల్‌సీఆర్)ను ఆర్బీఐ తీసుకురానుంది. డిపాజిట్లు తీసుకునే అన్ని ఎన్బీఎఫ్సీలతోపాటు, రూ.5,000 కోట్ల ఆస్తులున్న ప్రతీ ఎన్బీఎఫ్సీ కూడా ఈ విధానం పరిధిలోకి రానుంది. ఈ మేరకు ఆర్బీఐ నూతన మార్గదర్శకాలను రూపొందించింది. ఇందుకు సంబంధించి ముసాయిదా మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేసింది. ఎన్బీఎఫ్సీ రంగంలో లిక్విడిటీ సమస్యలకు ముగింపు పలకడం, ఐఎల్ఎఫ్ఎస్ తరహా సంక్షోభాల నివారణ కోసం ఆర్బీఐ ఈ చర్యలను చేపట్టింది. ఎల్‌సీఆర్ విధానానికి ఎన్బీఎఫ్సీ రంగం సాఫీగా మారేందుకు వీలుగా... 2020 ఏప్రిల్ నుంచి 2014 ఏప్రిల్ వరకు నాలుగేళ్ల కాలంలో అంచలంచెలుగా అమలు చేయాలన్నది ఆర్బీఐ ప్రణాళిక. ‘‘ఎన్బీఎఫ్సీలు తప్పనిసరిగా తగినంత అధిక నాణ్యత కలిగిన లిక్విడ్ ఆస్తులను (హెచ్క్యూఎల్ఏ) కలిగి ఉండాలి. తీవ్రమైన నిధుల లభ్యత సమస్య ఏర్పడినప్పుడు ఈ ఆస్తులను 30 రోజుల అవసరాలకు సరిపడా నగదుగా మార్చుకోవచ్చు’’ అని ఆర్బీఐ ముసాయిదా మార్గదర్శకాల్లో తెలియజేసింది. 60 శాతం ఎల్‌సీఆర్ ‘‘2020 ఏప్రిల్ 1 నుంచి ఎల్‌సీఆర్ నిబంధనలకు ఎన్బీఎఫ్సీలు కట్టుబడి ఉండాలి. కనీసం 60 శాతంగా ఎల్‌సీఆర్ ఉండాలి. క్రమంగా 2024 ఏప్రిల్ నాటికి ఈ కవరేజీని 100 శాతానికి చేరాల్సి ఉంటుంది’’అని ఆర్బీఐ పేర్కొంది. ఎన్బీఎఫ్సీ రంగంలో ఇటీవలి పరిణామాల విశ్లేషణ తర్వాతే ఈ మార్గదర్శకాలను తీసుకొచ్చినట్టు తెలిపింది. ఇక అప్లికేషన్ ఆఫ్ జనరిక్ అస్సెట్ లయబిలిటీ మేనేజ్మెంట్ (ఏఎల్ఎమ్) తదితర ఇతర మార్గదర్శకాలు కూడా ఈ ముసాయిదాలో ఉన్నాయి. ఎన్బీఎఫ్సీ ఉన్నత స్థాయి యాజమాన్యంతో కూడిన అస్సెట్ లయబిలిటీ మేనేజ్మెంట్ కమిటీ (ఏఎల్సీవో)ని కూడా ఆర్బీఐ ప్రతిపాదించింది. లిక్విడిటీ రిస్క్ నిర్వహణ కోసం దీన్ని సూచించింది. ఎన్బీఎఫ్సీ రుణ కార్యకలాపాలపై ఇబ్బందులు ఎదురైతే ఎదుర్కొనేందుకు అత్యవసర నిధి ప్రణాళికను కూడా రూపొందించుకోవాలని పేర్కొంది. -
అత్యవసర నిధి సొమ్ములకు లిక్విడ్ ఫండ్స్
అనుకోకుండా ఒక లావాదేవీ ద్వారా రూ. 30 లక్షలు వచ్చాయి. ఈ డబ్బులు ప్రస్తుతం నాకు అవసరం లేదు. వీటిని ఎలా ఇన్వెస్ట్ చేయాలో సలహా ఇవ్వండి. ? – వీరేష్, నెల్లూరు ఈ సొమ్ములను మీరు ఎలా ఉపయోగిస్తారో అనే దానిని బట్టి ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు ఉంటాయి. మార్కెట్ బాగా ఉంది కదా అని గుడ్డిగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం సరైన పనికాదు. జీవితంలో ఇలాంటి అనూహ్య లాభాలు ఒక్కసారి వస్తాయి. అందుకని ఈ సొమ్ములను ఇన్వెస్ట్ చేయడంలో జాగ్రత్తగా వ్యవహరించండి. అనూహ్య లాభాలు కాబట్టి.. ఎలా బడితే అలా ఇన్వెస్ట్ చేయకండి. సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ)ని మూడేళ్ల పాటు పాటించండి. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను నిర్వహించే సంస్థకు చెందిన ఒకటి లేదు రెండు డెట్ ఫండ్స్‌ను ఎంచుకోండి. ఈ రూ.30 లక్షల మొత్తాన్ని ఈ డెట్ ఫండ్స్‌లో ఒకేసారి ఇన్వెస్ట్ చేయండి. నెలకు కొంత మొత్తం చొప్పున ఈ ఫండ్స్ నుంచి ఎస్టీపీ మార్గంలో మీరు దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న ఈక్విటీ ఫండ్స్‌లోకి ఈ పెట్టుబడులను బదిలీ చేయండి. ఈ ఈక్విటీ ఫండ్స్‌లో ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కనీసం ఐదేళ్లపాటైనా కొనసాగిస్తే, మీకు మంచి రాబడులు వస్తాయి. నేను నా పిల్లల ఉన్నత చదువుల నిమిత్తం నెలకు రూ.3,000 నుంచి రూ.5,000 వరకూ పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను. తగిన సూచనలు ఇవ్వండి ? – మనోజ్, కరీంనగర్ పిల్లల ఉన్నత చదువులకు వివిధ దశల్లో పెద్ద మొత్తాలు అవసరమవుతాయి. పాఠశాల విద్య ముగిసిన తర్వాత వాళ్లు కాలేజీలో చేరేటప్పుడు, కాలేజీ విద్య ముగిసి, డిగ్రీలో చేరేటప్పుడు, ఆ తర్వాత పీజీ చేసేటప్పుడు మీకు డబ్బులు అవసరమవుతాయి. మొదటి దశ డబ్బులు మరో ఐదేళ్లలో అవసరమనుకుంటే, ముందుగా ఒక బ్యాలన్స్డ్ ఫండ్‌లో ఇప్పటి నుంచే ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి. రెండో దశ డబ్బులు మరో పదేళ్లలో అవసరమనుకుంటే ఇప్పటి నుంచే కొంత మొత్తాన్ని మల్టీ క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. మూడో దశకు అవసరమైన డబ్బులు మరో పదిహేనేళ్లలో అవసరమనుకుంటే ఇప్పటి నుంచే కొంత మొత్తాన్ని ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఈ ఫండ్స్‌లో ప్రతి నెలా కొంత, కొంత మొత్తాన్ని సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి రాబడులు వస్తాయి. ఆయా దశ డబ్బులు అవసరమయ్యే ఏడాదికి ముందే ఆయా ఫండ్స్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవాలి. ఉదాహరణకు మొదటి దశ డబ్బులు మీకు ఐదేళ్లలో అవసరమనుకుంటే, నాలుగో ఏట నుంచి ఆ ఫండ్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోండి. ఐదే ఏటనే తీసుకోవాలనుకుంటే మార్కెట్ పతన బాటలో ఉంటే మీకు తగిన రాబడులు రావు. అందుకని ఒక ఏడాది ముందే ఇన్వెస్ట్మెంట్స్ ఉపసంహరించుకుంటే మంచిది. నేను ఒక సెక్టోరియల్ ఫండ్‌లో రెండు నుంచి మూడేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. తగిన ఫండ్‌ను సూచించండి? – కల్పన, హైదరాబాద్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే దానర్థం డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు పొందాలని. అయితే సెక్టోరియల్ ఫండ్స్ దీనికి పూర్తిగా విరుద్ధం. ఈ ఫండ్స్ కేవలం ఒక్క రంగం కంపెనీలోనే ఇన్వెస్ట్ చేస్తాయి. సెక్టోరియల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే బలమైన కారణాలుండాలి. మీ పోర్ట్‌ఫోలియోలో లేని రంగం కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడానికి సెక్టోరియల్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. లేకుంటే. సదరు రంగంపై మీకు అపారమైన అవగాహన, పరిజ్ఞానం ఉండి, భవిష్యత్తులో ఈ రంగం అంతులేని వృద్ధిని సాధిస్తుందనే అంచనాలు మీకు ఉంటేనే సెక్టోరియల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఇవేవీ లేనప్పుడు సెక్టోరియల్ ఫండ్స్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. నేను కోటక్ గోల్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. స్టాక్ మార్కెట్ బాగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో పుత్తడిపై పెట్టుబడి పెట్టడం సమంజసమేనా ? – సారథి, విజయవాడ భారత్‌లో పుత్తడికి బాగా ప్రాధాన్యం ఉంది. కానీ దీర్ఘకాలంగా ఇది మంచి రాబడులనిస్తుందనే నమ్మకం చాలా మంది మార్కెట్ నిపుణుల్లో ఉండదు. కొన్ని యాదృచ్చిక కారణాల వల్ల మాత్రమే గత కొంత కాలంగా ఇది ఆకర్షణీయమైన పెట్టుబడిగా నిలుస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, పుత్తడి ఈటీఎఫ్‌లు అందుబాటులోకి రావడం వల్ల బంగారానికి డిమాండ్ పెరిగింది. కాదూ, కూడదు పుత్తడిలో కొంతైనా పెట్టుబడి పెట్టాల్సిందేనన్న పట్టుదల మీకు ఉంటే సావరిన్ గోల్డ్ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. పుత్తడి రాబడులతో పాటు కొంత వడ్డీ కూడా మీరు పొందవచ్చు. వివిధ ఆర్థిక లక్ష్యాల సాధన కోసం ఈక్విటీ, డెట్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. పుత్తడిని కాదు. అత్యవసర నిధి పెట్టుబడులను లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా ? – వెంకట్, విశాఖ పట్టణం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకోగలిగే వీలుండేలా అత్యవసర నిధి పెట్టుబడులు ఉండాలి. ఈ తరహా అత్యవసర నిధి పెట్టుబడులపై వీలైనంత ఎక్కువగా రాబడి పొందాలనే ఆలోచన సరైనదే. సాధారణంగా అత్యవసర నిధులను చాలా మంది సేవింగ్స్ ఖాతాలో ఉంచేస్తారు. దీనిపై వచ్చే వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది. లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే అంతకంటే అధికంగానే రాబడులు పొందవచ్చు. అదృష్టవశాత్తూ మూడేళ్ల పాటు ఈ అత్యవసర నిధి సొమ్ములను వాడే అవసరం మీకు రాకుంటే, మూడేళ్ల పాటు ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను లిక్విడ్ ఫండ్స్‌లో కొనసాగిస్తే, మీకు పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ద్వారా రూ.50,000 దాకా లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి, రిడీమ్ చేసుకునే వెసులుబాటు కూడా అందుబాటులోకి వచ్చింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్మ్యూచువల్ ఫండ్ వంటి కొన్ని సంస్థలు ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. మీరు అరగంట నుంచి గంట వ్యవధిలోనే లిక్విడ్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను రిడీమ్ చేసుకోవచ్చు. - ధీరేంద్ర కుమార్ ,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఇలా చేసై కోటిశ్వరులే !
♦ వేతనంలో మిగిలిన మొత్తం పెట్టుబడులకు ♦ అవసరాలు వస్తాయని అట్టే ఖాతాలో ఉంచేయొద్దు ♦ మూడు నెలల అవసరాల కోసం అత్యవసర నిధి ♦ ఇక మిగిలిన ప్రతీ రూపాయి ఇన్వెస్ట్‌మెంట్‌కే వెళ్లాలి ♦ అత్యవసర నిధిని కూడా లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టడం బెటర్ ఎంత సంపాదించినా పొదుపు, మదుపులు చేయకపోతే పేదవారికిందే లెక్క. సంపద సృష్టించుకోవాలంటే మంచి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేయాలంటే సంపాదించిన మొత్తంలో నిర్ణీత శాతాన్ని మిగల్చాలి. దాన్ని క్రమశిక్షణతో పెట్టుబడులకు మళ్లించాలి. వాస్తవానికి ఇదేమంత పెద్ద కష్టం కాదు. ఓ చిన్న సూత్రాన్ని ఫాలో అయిపోతే చాలు... సులభంగానే సంపదను కూడబెట్టవచ్చు. మిగులు వృథా కాకూడదు... సాధారణంగా ప్రతి నెలా ఆర్జిస్తున్న మొత్తం నుంచి ఇంటద్దె, కిరాణ, పాలు, పిల్లల స్కూలు ఫీజులు, వైద్యం, ప్రయాణ చార్జీలు.. ఇలా అన్ని ఖర్చులు పోను కొంత మిగులుతుంది. మిగలాలి కూడా. ఈ మిగులును కొందరు దుబారా ఖర్చులకు వాడేసుకుంటే, కొందరు కాస్త ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఏదైనా అనుకోని అవసరాలు ఎదురవుతాయన్న ఆలోచనతో కాస్త పక్కనబెడతారు. నిజానికి సంపద సృష్టికి విఘాతం కలిగించేది ఇదే. ముందుగా అసలు మీ నెలసరి ఖర్చులేంటి? ఎంత? అన్నది తేల్చుకోండి. ఇంటద్దె, కిరాణా, పాలు, కూరగాయలు, విద్యుత్తు, నీటి బిల్లు, పేపర్, కేబుల్ టీవీ, ఇంటర్నెట్, ఫోన్, ప్రయాణ చార్జీలు, పెట్రోల్ చార్జీలు, పిల్లల విద్యా వ్యయాలు, వినోదం, రెస్టారెంట్లలో విందులు, వైద్య వ్యయాలు, వస్త్రాలు, బీమా ప్రీమియం, రుణ వాయిదాలు, ఇతర వ్యయాలన్నీ లెక్కించి నెలకు ఎంత అవసరమో స్పష్టతకు రండి. వీటిని నెలసరి వేతనం నుంచి మినహాయిస్తే ఎంత మిగులు అన్నది తేలుతుంది. ఈ మిగులు మొత్తాన్ని మీరు నిరభ్యంతరంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ ఏం జరుగుతోంది...? మిగులు మొత్తాన్నీ రికరింగ్ డిపాజిట్లోకో, సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లోకో మళ్లిస్తున్నారా...? దీనికి అవుననే సమాధానం ఎక్కువ మంది నుంచి రాకపోవచ్చు. ఉదాహరణకు రూ.50,000 వేతనంలో నెల ఖర్చులు రూ.30,000 వేలు వస్తున్నాయనుకోండి. రూ.20,000 మిగులు ఉంటుంది. కానీ, ఎక్కువ మంది ఇందులో రూ.5,000 లేదంటే రూ.10,000కు మించి ఇన్వెస్ట్ చేయరు. అత్యవసరాల కోసం ఉంచుకుంటారు. అత్యవసర నిధి అవసరమే అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఆదుకునేందుకు ప్రత్యేక నిధి అన్నది అవసరమే. మూడు నుంచి ఆరు నెలల అవసరాలకు నిధిని పక్కన పెట్టుకోవాలి. మొదట చేయాల్సిందిదే. అంతే కానీ, ప్రతి నెలా వేతనంలో మిగిలిన మొత్తాన్ని అత్యవసరాల పేరుతో అలా ఉంచేయడమన్నది సమంజసం కాదు. ఎందుకంటే అత్యవసరాల కోసమని నెల వేతనంలో రూ.10 నుంచి రూ.20వేల వరకు, ప్రతి నెలా బ్యాంకు ఖాతాలో ఉంచేశారనుకోండి. వాటిని ఇతర అవసరాలకు వాడుకోకుండా ఉండగలరా...? మిగులు నిధులు కనిపిస్తూ ఉంటే... అవసరం ఏర్పడితే మరో ఆలోచన లేకుండా వాడేస్తారు. దీంతో ఆ నెలలో ఇన్వెస్ట్ చేయకుండా ఉంచినదంతా అదనపు ఖర్చు రూపేణా హరించుకుపోతుంది. కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ వచ్చిందనో, మరొకటో... ఆన్లైన్లో కంటికి నచ్చిన వస్తువును ఆర్డర్ చేసేందుకూ వెనుకాడరు. ఎందుకంటే ఆర్థిక శాస్త్రం ప్రకారం... సరఫరా ఎక్కువగా ఉంటే డిమాండ్లు కూడా ఎక్కువైపోతాయి. ఒక్కసారి ఇలా అదనపు ఖర్చులకు అలవాటు పడ్డారా... ఇక ఆపై అదే నిత్యకృత్యం అవుతుంది. దీనివల్ల నెల వేతనంలో మిగిలిన మొత్తం పూర్తిగా పెట్టుబడులకు వెళ్లలేదు. అంటే ఆ మేర ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోయింది. మరోవైపు అత్యవసరాల కోసం ఇన్వెస్ట్ చేయకుండా ఉంచిన రూ.10వేలు నిజంగా అత్యవసరాలకు కాకుండా సాధారణ అవరాలకే ఖర్చయిపోయింది. అప్పుడు నిజంగా అత్యవసరాలు ఎదురైతే...? పెట్టుబడులను వెనక్కి తీసుకుంటారా..? ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇవన్నీ తప్పిదాలే. చేయాల్సింది ఇదీ... ముందుగా మూడు నుంచి ఆరు నెలల పాటు కుటుంబ పోషణ, పెట్టుబడుల అవసరాలకు సరిపడా అత్యవసర నిధిని సమకూర్చుకోవాలి. ఉద్యోగం కోల్పోవడం, ఆరోగ్యపరంగా తీవ్ర అస్వస్థతకు గురవడం ఇతరత్రా సందర్భాల్లో ఆదుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీన్ని లిక్విడ్ ఫండ్స్‌లో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేందుకు సిద్ధంగా ఉంచుకోవాలి. ఇక పైన చెప్పుకున్న ఉదాహరణ ప్రకారం నెలసరి వేతనం రూ.50,000లో వాస్తవ కుటుంబ ఖర్చులు రూ.30,000 మాత్రమే. ఎందుకైనా మంచిది కొంతన్నా చేతిలో ఉండాలనుకుంటే... నెలసరి ఖర్చులు రూ.30,000కు అదనంగా ఓ పది శాతం రూ.3,000 దగ్గర ఉంచుకోవాలి. దీన్ని కూడా లిక్విడ్ ఫండ్స్‌లో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే అవసరమైనప్పుడు వెంటనే తీసేసుకోవచ్చు. మొత్తం రూ.33,000 పోను వేతనంలో రూ.17,000 మిగులు ఉంటుంది. ఈ మిగులును మొదట కొన్ని నెలల పాటు పైన చెప్పుకున్నట్టు మూడు నుంచి ఆరు నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధి సమకూర్చుకునేందుకు పక్కన పెట్టుకోవచ్చు. ఓ ఆరు నెలలకు అత్యవసర నిధి సిద్ధమైపోతుంది. ఇక ఆ తర్వాత నుంచి మిగులు మొత్తాన్ని దీర్ఘకాలిక లక్ష్యాలు, సంపద సృష్టికి ఇన్వెస్ట్‌మెంట్స్‌గా మళ్లించాలి. అవి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఆర్డీ, పీపీఎఫ్ ఇలా ఏవైనా కావచ్చు. ప్రతి ఏటా ఆర్జన పెరుగుతుంటుంది కదా... అలాగే ఖర్చులు కూడా. పెరుగుతున్న వేతనానికి అనుగుణంగా పెట్టుబడుల మొత్తాన్ని కూడా పెంచుకుంటూ వెళ్లాలి. ముందు అత్యవసర నిధి ఆ తర్వాత నెల ఖర్చులకు అదనంగా 10 శాతం స్వల్పకాలిక సర్దుబాటు నిధి ఒక నెలలో సర్దుబాటు నిధి మిగిలిపోతే దాన్ని అత్యవసర నిధికి మళ్లించాలి నెలలో మిగులు మొత్తం పెట్టుబడులకు మళ్లించాలి ఇలా చేస్తే వృ«థాకు బ్రేక్ పడతుంది. వ్యయంలో, పెట్టుబడుల్లో క్రమశిక్షణ అలవడుతుంది. చివరిగా సంపద సాకారమవుతుందన్నది నిపుణుల విశ్లేషణ. -
లిక్విడ్ ఫండ్స్ పెట్టుబడులపై పన్నులుంటాయా?
లిక్విడ్ ఫండ్స్‌పై పన్నులు ఎలా ఉంటాయి? లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి వాటిపై లాభాలనార్జిస్తే, ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా? – సాగర్, విశాఖపట్టణం లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే గడించే మూలధన లాభాలపై పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన లిక్విడ్ ఫండ్స్ యూనిట్లను మూడేళ్లలోపు విక్రయిస్తే, వాటిపై వచ్చే లాభాలపై మీరు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ లాభాలను మీ మొత్తం ఆదాయానికి జత చేసి మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను విధిస్తారు. ఒక వేళ మూడేళ్ల కాలానికి మించిన తర్వాత ఈ యూనిట్లను విక్రయిస్తే, వీటిపై వచ్చే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై 20 శాతం పన్ను (ఇండెక్సేషన్ ప్రయోజనంతో కలుపుకొని) చెల్లించాల్సి ఉంటుంది. నా భార్య ఒక ప్రైవేట్ కంపెనీలో ఆరేళ్లు పనిచేసి మానేసింది. ఇటీవలే ప్రావిడెండ్ ఫండ్(పీఎఫ్) మొత్తాన్ని విత్‌డ్రా చేసింది. ఈ విత్‌డ్రా చేసిన మొత్తంపై పీఎఫ్ డిపార్ట్మెంట్ ఎలాంటి పన్నుకోత విధించలేదు. ఐటీ రిటర్న్ దాఖలు చేసేటప్పుడు ఈ పీఎఫ్ విత్‌డ్రాయల్‌ను చూపించాలా ? ఒక వేళ చూపించాల్సి వస్తే, ఈ మొత్తాన్ని ఏ పద్దు కింద చూపించాలి? – వివేక్, హైదరాబాద్ రెండు సందర్భాల్లో ఈపీఎఫ్ఓ(ఎంప్లాయీ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్) పీఎఫ్ విత్డ్రాయల్స్పై టీడీఎస్(ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) ను విధిస్తుంది. మొదటి సందర్భం,..ఈపీఎఫ్ విత్‌డ్రాయల్ మొత్తం రూ.50,000 కంటే తక్కువగా ఉన్నప్పుడు, ఇక రెండోది. ఎవరైనా ఉద్యోగి ఒక కంపెనీలో నిరంతరంగా ఐదేళ్లలోపే పనిచేసి, పీఎఫ్ విత్‌డ్రాయల్ మొత్తం రూ.50,000 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు.. ఈ రెండు సందర్భాల్లోనే పీఎఫ్ విత్‌డ్రాయల్‌పై టీడీఎస్ ఉంటుంది. మీ భార్య ఒక కంపెనీలో 5 ఏళ్లకు మించి పనిచేసినందున పీఎఫ్ విత్‌డ్రాయల్‌పై ఎలాంటి టీడీఎస్‌ను ఈపీఎఫ్ఓ విధించలేదు. ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసేటప్పుడు ఈ పీఎఫ్ మొత్తాన్ని కూడా చూపించాల్సి ఉంటుంది. వేతనం నుంచి ఆదాయం అనే పద్దు కింద ఈ మొత్తాన్ని చూపించాల్సి ఉంటుంది. నేను కొంత మొత్తానికి హెచ్డీఎఫ్సీ లైఫ్ క్లిక్ 2 ప్రొటెక్ట్ అనే టర్మ్ ప్లాన్‌ను తీసుకున్నాను. అయితే ఈ ప్లాన్‌లో యాక్సిడెంట్ బెనిఫిట్, క్రిటికల్ ఇల్నెస్లకు కవరేజ్ లేదు. ఈ రెండు కవరేజ్‌లు ఉన్న మరో టర్మ్ ప్లాన్, ఐసీఐసీఐ ప్రు ఐప్రొటెక్ట్ ఐ స్మార్ట్–లైఫ్ ఆప్షన్‌ను అదనంగా తీసుకోవాలనుకుంటున్నాను. ఇలా అదనపు టర్మ్ ప్లాన్‌ను తీసుకోవాలా ? లేక హెచ్డీఎఫ్సీ సంస్థనే ఈ రెండు కవరేజ్‌లు కూడా జత చేయమని అడిగి కొంచెం ఎక్కువగా ప్రీమియమ్ చెల్లించాలా ? తగిన సలహా ఇవ్వగలరు ? – నాగేశ్, విజయవాడ క్రిటికల్ ఇల్నెస్, పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ ప్రయోజనాలు ఉన్న మరో టర్మ్ ప్లాన్‌ను తీసుకుంటే ఎక్కువ ప్రయోజనమా ?లేక ప్రస్తుతమున్న టర్మ్ప్లాన్కే రైడర్లను జత చేస్తే ఎక్కువ ప్రయోజనమా అనే విషయాలపై మీరు ముందుగా మదింపు చేయండి. మీరు ప్రస్తుతం తీసుకున్న హెచ్డీఎఫ్సీ లైఫ్ క్లిక్ 2 ప్రొటెక్ట్ టర్మ్ ప్లాన్‌కు క్రిటికల్ ఇల్నెస్ రైడర్‌ను జత చేయవచ్చు. కొంత అధిక ప్రీమియమ్‌ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక 30 ఏళ్ల పొగ తాగని వ్యక్తికి 30 ఏళ్ల బేసిక్ లైఫ్ కవర్‌కు ప్రీమియమ్ ఏడాదికి రూ.10,332గా ఉంటుంది. దీనికి క్రిటికల్ ఇల్నెస్ రైడర్‌ను జత చేశారనుకోండి, అప్పుడు చెల్లించాల్సిన ప్రీమియమ్రూ.15,979కు పెరుగుతుంది. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్‌ను కూడా జత చేస్తే, ప్రీమియమ్ రూ.21,698కు పెరుగుతుంది. ఐసీఐసీఐ ప్రు ఐప్రొటెక్ట్ ఐ స్మార్ట్ను తీసుకుంటే, ఈ ప్లాన్‌కు సంబంధించి బేసిక్ కవరేజ్ ఒక 30 ఏళ్ల పొగ తాగని వ్యక్తికి 30 ఏళ్ల బేసిక్ లైఫ్ కవర్‌కు ప్రీమియమ్ ఏడాదికి రూ.8,906గా ఉంది. దీనికి క్రిటికల్ ఇల్నెస్ రైడర్‌ను జత చేస్తే, అప్పుడు చెల్లించాల్సిన ప్రీమియమ్ రూ.13,074కు పెరుగుతుంది. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్‌ను కూడా జత చేశారనుకోండి, ప్రీమియమ్ రూ.18,742కు పెరుగుతుంది. అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోండి. బ్యాంక్ సేవింగ్స్ ఖాతాకు ప్రత్యామ్నాయంగా ఆర్బిట్రేజ్ ఫండ్స్‌ను పరిగణించవచ్చా ? ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని మంచి ఆర్బిట్రేజ్ ఫండ్స్‌ను సూచించండి? – తేజశ్విని, ఈమెయిల్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాతో పోల్చితే ఆర్బిట్రేజ్ ఫండ్స్ మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఆర్బిట్రేజ్ ఫండ్స్ దాదాపు లిక్విడ్ ఫండ్స్లాంటివే. ఈ ఫండ్స్ ద్వారా వచ్చే డివిడెండ్లపై మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఆర్బిట్రేజ్ ఫండ్స్‌కు ఉన్న మంచి ఆకర్షణీయ అంశాల్లో ఇది కూడా ఒకటని చెప్పవచ్చు. సేవింగ్స్ ఖాతాలో ఉన్న సొమ్ములపై వచ్చే రాబడుల కన్నా, ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రాబడులే అధికంగా ఉంటాయి మీరు ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని ఫండ్స్‌ను సూచిస్తున్నాం. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ ఆర్బిట్రేజ్ ఫండ్, ఐడీఎఫ్సీ ఆర్బిట్రేజ్ ఫండ్, జేఎం ఆర్బిట్రేజ్ అడ్వాంటేజ్ ఫండ్, ఇన్వెస్కో ఇండియా ఆర్బిట్రేజ్ ఫండ్, కోటక్ ఈక్విటీ ఆర్బిట్రేజ్ ఫండ్, రిలయన్స్ ఆర్బిట్రేజ్ అడ్వాండేజ్ ఫండ్, ఎస్బీఐ ఆర్బిట్రేజ్ అపర్చునిటీస్ ఫండ్. ఈ ఫండ్స్‌లో ఏదో ఒకదానిని ఎంచుకొని ఆ ఫండ్ డైరెక్ట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయండి. -
రెండేళ్ల పెట్టుబడులకు ఆర్బిట్రేజ్ ఫండ్స్ బెస్ట్
ప్రస్తుతం నా దగ్గర రూ. 2 లక్షలున్నాయి. నా కూతురు ప్రస్తుతం పదవ తరగతి చదువుతోంది. ఈ డబ్బులను తన ఉన్నత విద్య కోసం వినియోగించాలనుకుంటున్నాను. అంటే రెండు/మూడేళ్ల తర్వాత ఈ డబ్బులు నాకు అవసరం అవుతాయి. అప్పటిదాకా ఈ సొమ్ములను దేంట్లో ఇన్వెస్ట్ చేయమంటారు ? లిక్విడ్ స్కీమ్, డైనమిక్ బాండ్ ఫండ్ లేదా ఆర్బిట్రేజ్ ఫండ్‌లోనా ? తగిన సలహా ఇవ్వండి. - శ్రీనివాస్, గుంటూరు మీ జాబితా నుంచి లిక్విడ్ ఫండ్స్‌ను తీసేయండి. స్వల్పకాలిక పెట్టుబడుల కోసమైతేనే లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. కొన్ని వారాలు, లేదా నెలలు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, లిక్విడ్ ఫండ్స్‌ను పరిశీలించాలి. మూడేళ్లకు ముందే మీకు ఈ డబ్బులు అవసరమైతే, మీరు ఆర్బిట్రేజ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. పన్ను అంశాల దృష్ట్యా ఆర్బిట్రేజ్ ఫండ్స్‌ను ఈక్విటీ ఫండ్స్‌గానే పరిగణిస్తారు. అంటే ఈ ఫండ్స్‌లో ఏడాదికి మించి మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగిస్తే మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. మూడేళ్ల తర్వాత మీకు ఈ డబ్బులు అవసరమైన పక్షంలో డైనమిక్ బాండ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. మీరు కనుక అధిక పన్ను ట్యాక్స్ స్లాబ్‌లో ఉంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. ఈ ఫండ్స్‌లో మీ పెట్టుబడులను మూడేళ్లకు మించి ఇన్వెస్ట్ చేస్తే మీరు 20 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి(ఇండెక్సేషన్‌తో కలిపి) ఉంటుంది. ఒకవేళ మూడేళ్లలోపే మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకుంటే, ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చిన లాభాలను స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. వీటిని మీ మొత్తం ఆదాయానికి కలిపి మీ ఆదాయపు పన్ను ట్యాక్స్ శ్లాబ్‌ననుసరించి పన్ను లెక్కిస్తారు. వడ్డీరేట్లు తగ్గితే, డైనమిక్ బాండ్ ఫండ్స్ మంచి రాబడులనే ఇస్తాయి. నా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అకౌంట్ కాలపరిమితి వచ్చే ఏడాది ముగియనున్నది. దీనిని పొడిగించుకోవచ్చా ? పొడిగించుకోవాలంటే నేను ఏం చేయాలి? - సౌభాగ్య, హైదరాబాద్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్(ఎస్సీఎస్ఎస్) అకౌంట్ కాలపరిమితి ఐదు సంవత్సరాలు. ఐదేళ్ల తర్వాత ఈ ఎస్సీఎస్ఎస్ అకౌంట్‌ను మరో మూడేళ్ల పాటు పొడిగించుకోవచ్చు. లేదా ఈ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవచ్చు. డబ్బులు తీసుకోవాలంటే, ఫారమ్ ఈను పాస్‌బుక్‌తో పాటు సమర్పించాలి. అకౌంట్‌ను పొడిగించుకోవాలంటే ఏడాదిలోపు ఫారమ్ బిని సమర్పించాలి. అకౌంట్ పొడిగింపు మీరు దరఖాస్తు చేసినప్పటి నుంచి కాకుండా మెచ్యూరిటీ తేదీ నుంచి మరో మూడేళ్లు ఉంటుంది. ఈ రెండింటిలో ఏ ఫారమ్‌ను డిపాజిటర్ దాఖలు చేయలేకపోతే, అకౌంట్‌ను మూసివేసినట్లుగానే భావిస్తారు. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్‌కు ఎంతైతే వడ్డీరేటు వస్తుందో అంతే వడ్డీరేటు మెచ్యూరిటీ అకౌంట్‌పై వస్తుంది. పదేళ్ల క్రితం రెండు జీవన్ సరళ్ పాలసీలు తీసుకున్నాను. ఒక్కోదానికి ఏడాది ప్రీమియం రూ. 24,000గా ఉంది. ఈ పాలసీలను కొనసాగించమంటారా? - జాన్సన్, నెల్లూరు ఎల్ ఐసీ జీవన్ సరళ్ పాలసీ ఎండోమెంట్ పాల సీ. ఇలాంటి పాలసీలకు వ్యయాలకు సంబంధించి పారదర్శక విధానాలుండవు. బీమా మొత్తానికి కొంత లాయల్టీ బోనస్‌ను కలిపి చెల్లిస్తారు. పదవ పాలసీ సంవత్సరం నుంచి లాయల్టీ మొత్తాలను పొందవచ్చు. మీరు ఈ పాలసీ తీసుకొని పదేళ్లయినందున మీకు లాయల్టీ బోనస్ అందిఉండాలి. కొంత మొత్తాన్ని పదేళ్ల పాటు డిపాజిట్ చేస్తే ఏడాదికి 7.5 శాతం వడ్డీ లెక్కేసుకున్నా ఆ మొత్తం రెట్టింపవుతుంది. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను కూడా ఈ పాలసీ ఇవ్వలేదనే చెప్పవచ్చు. మీరు చెల్లించే ప్రీమియమ్‌ను బట్టి చూస్తే, మీ జీవన్ సరళ్ పాలసీ రూ.5 లక్షల బీమా ఉంటుందని తెలుస్తోంది. మీపై ఆధారపడినవారికి వారి ఆర్థిక అవసరాలను ఈ మొత్తం తీర్చలేదు. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే ఇది తగిన జీవిత బీమాను ఇవ్వలేదు. మరోవైపు ఇది ఉత్తమమైన ఇన్వెస్ట్మెంట్ కాదని చెప్పవచ్చు. అందుకని ఇలా బీమా, ఇన్వెస్ట్మెంట్స్ కలగలసిన స్కీమ్‌లకు దూరంగా ఉండమని ఇన్వెస్టర్లకు సలహా ఇస్తాం. జీవిత బీమా కోసం టర్మ్ బీమా ప్లాన్ తీసుకోవాలి. ఇవి చాలా చౌక. తక్కువ ప్రీమియంతోనే ఎక్కువ మొత్తానికి బీమా పాలసీ తీసుకోవచ్చు. మీకు కనుక దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు ఉంటే, డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో నెలకు కొంత మొత్తాన్ని ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
పెన్షన్ ఫండ్స్ ఉన్నాయా..?
నాకు ఒక ప్రైవేట్ బ్యాంక్‌లో సేవింగ్స్ అకౌంట్ ఉంది. 7 శాతం వరకూ వడ్డీ వస్తుంది. వివిధ పథకాల్లో పొదుపు చేయగా మిగిలిన సొమ్ములను లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాను. డెట్ ఫండ్స్‌కు సంబంధించి పన్నుల్లో మార్పుచేర్పులు జరిగిన నేపథ్యంలో నేను ఇలా చేయడం సరైనదైనా? తగిన సూచనలివ్వండి? - గోపాల్, వరంగల్ మిగులు నిధులను లిక్వ్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైనదే. ఎప్పుడైనా వాటి నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. అంతేకాకుండా రాబడులు కూడా బాగానే వస్తాయి. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కంటే అధికంగానే వస్తాయి. లిక్విడ్ ఫండ్స్‌లో మొదటి ఐదేళ్లలో ఏడాదికి 8 శాతం చొప్పున రాబడులు వస్తాయి. 91 రోజుల మెచ్యూరిటీకి మించిన ఏ ఇన్వెస్ట్మెంట్ సాధనంలో లిక్విడ్ ఫండ్స్ పెట్టుబడులు పెట్టవు. అందుకనే ఇతర డెట్ ఫండ్స్‌పై వడ్డీరేట్ల హెచ్చుతగ్గుల ప్రభావం ఉన్నట్లుగా లిక్విడ్ ఫండ్స్‌పై ఉండదు. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో స్థిరమైన రాబడులు వస్తాయి. కానీ కొన్ని ఇబ్బందులుంటాయి. ఉదాహరణకు యెస్ బ్యాంక్ రూ.1 లక్షకు మించిన బ్యాలెన్స్ ఉన్న సేవింగ్స్ అకౌంట్‌కు 7శాతం వడ్డీని ఇస్తోంది. రూ. లక్ష కంటే తక్కువగా ఉంటే 6 శాతం వడ్డీరేటునే ఇస్తోంది. ఈ బడ్జెట్లో లిక్విడ్ ఫండ్స్‌కు సంబంధించి పన్ను విషయాల్లో కొన్ని మార్పులు, చేర్పులు జరిగాయి. ఏడాది నుంచి మూడేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేసే వారికే ఈ మార్పులు వర్తిస్తాయి. ఏడాది లోపు ఇన్వెస్ట్‌మెంట్స్‌పై షార్ట్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంది. వ్యక్తుల ఆదాయపు పన్న స్లాబ్‌ననుసరించి ఈ పన్ను ఉంటుంది. అందుకని మూడేళ్లలోపు మీరు మీ పెట్టుబడులను ఉపసంహరించుకుంటే, మీరు మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి 10-30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. నేను, మావారు హెచ్డీఎఫ్సీ క్లిక్2ప్రొటెక్ట్ నుంచి చెరొక కోటి రూపాయలకు టర్మ్ బీమా పాలసీలు తీసుకున్నాం. ఇది సరైన టెర్మ్ బీమా ప్లానేనా? ఈ ప్లాన్‌లోనే కొనసాగమంటారా? ఇన్వెస్ట్ చేయడానికి ఉత్తమమైన పెన్షన్ మ్యూచువల్ ఫండ్స్‌ను సూచించండి? యాన్యుటీ ఆధారిత ప్లాన్లను ఎంచుకోవడం కరెక్టేనా? - మల్లిక, హైదరాబాద్ హెచ్డీఎఫ్సీ క్లిక్2ప్రొటెక్ట్ అనేది ఉత్తమమైన ఆన్లైన్ టర్మ్ బీమా పాలసీల్లో ఒకటి. సరైన మొత్తానికి టర్మ్ బీమా పాలసీని తీసుకోవడం సరైన నిర్ణయం. మీరు రిటైరయ్యేవరకూ, లేదా మీ కుటుంబంలో మీ వారసులు సంపాదన పరులయ్యేంత వరకూ ఈ ప్లాన్‌లో కొనసాగండి. రిటైర్మెంట్ ఫండ్స్‌గా పేరున్న రెండు మ్యూచువల్ ఫండ్స్ అయితే ఉన్నాయి. అయితే రిటైరైన తర్వాత ఇవి రెగ్యులర్ పింఛన్‌ను ఆఫర్ చేయడం లేదు. ప్రస్తుతానికైతే మార్కెట్లో స్పెషలైజ్డ్ పెన్షన్ ఫండ్ ఏదీ అందుబాటులో లేదు. ఇలాంటి ఫండ్స్ గురించి బడ్జెట్లో ప్రస్తావించారు. అయితే మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఈ పెన్షన్ ఫండ్స్‌పై కసరత్తు చేస్తున్నాయి. త్వరలో అందుబాటులోకి రావచ్చు. పెన్షన్ ఫండ్స్‌కు ప్రత్యామ్నాయంగా యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్(యూఎల్‌పీపీ), ఎండోమెంట్ పెన్షన్ ప్లాన్స్‌ను పరిశీలించవచ్చని కొందరు చెబుతుంటారు. కానీ ఇది సరికాదు. యూనిట్ లింక్డ్ ప్లాన్స్ ఖరీదైనవే కాకుండా ఇవి ఇచ్చే రిటర్న్‌లు తక్కువగా ఉంటాయి. ఇక ఎండోమెంట్ పెన్షన్ ప్లాన్ల వ్యయాలు, ఖర్చులు మీ రాబడులను తినేస్తాయి. రిటైర్మెంట్ కోసం పొదుపు చేయడానికి ఉత్తమమైన వ్యూహం ఒకటుంది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడమే ఈ వ్యూహం. రిటైర్మెంట్ దగ్గరకు వచ్చినప్పుడు బీమా కంపెనీల నుంచి ఇమ్మిడియేట్ యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు. నా వయస్సు 42 సంవత్సరాలు. రానున్న పదేళ్లలో నేను రూ.75 లక్షల వరకూ ఇన్వెస్ట్ చేయగలను. ఒక ప్రైవేట్ బ్యాంక్ 9 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. కొంతమంది మిత్రులేమో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటున్నారు. తగిన సూచనలివ్వండి? - ప్రహ్లాదరావు, విజయవాడ మీరు పొదుపు చేయాలనుకుంటున్న మొత్తంలో సగభాగాన్ని బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. అయితే స్వల్పకాలానికే ఎఫ్డీ తీసుకోండి. మిగిలిన మొత్తాన్ని ఏదైనా బ్యాలెన్స్డ్ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. ఇలా ఒక ఆర్నెల్ల నుంచి ఏడాది పాటు చేయండి. ఇలాచేయడం వల్ల సిప్ ఎలా పని చేస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ రాబడులు, ఎఫ్‌డీల రాబడులు, మ్యూచువల్ ఫండ్స్ పనితీరు తదితర అంశాలపై మీకు ఒక అవగాహన వస్తుంది. ఆ తర్వాత ఇతర మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక బ్యాలెన్స్డ్ ఫండ్స్ విషయానికొస్తే, ఇవి సురక్షితమైనవి, వృద్ధికి అవకాశం కలవి. ఎఫ్డీలపై వచ్చే రాబడులతో పోల్చితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కు పన్ను ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. -
‘సిప్’ చేయడమే ఉత్తమం...
నేను రూ. 50,000 నుంచి రూ.60,000 వరకూ ఇన్వెస్ట్ చేయగలను. బుల్‌మార్కెట్ నడుస్తున్న ప్రస్తుత నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం తెలివైన పనేనా? ఒకేసారి ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయమంటారా? లేక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)ను ఎంచుకోమంటారా? సిప్ విధానాన్ని ఎంచుకుంటే ప్రస్తుత బుల్‌మార్కెట్ ప్రయోజనాలను నేను కోల్పోతానేమో అనిపిస్తోంది. తగిన సూచనలివ్వండి. -ఆర్. సుధాకర్, వైజాగ్ ఎటువంటి పరిస్థితుల్లోనైనా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానాన్నే ఎంచుకోవడం ఉత్తమం. ఎనిమిది, తొమ్మిది నెలల నుంచి స్టాక్ మార్కెట్లలో బుల్న్ ్రనడుస్తూనే ఉంది. ఎప్పుడు కరెక్షన్ వస్తుందనేది ఎవరూ చెప్పలేరు. ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసినప్పుడు, మార్కెట్లు పడిపోతే అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ విలువ కూడా పడిపోతుంది. అలాగని మార్కెట్లు పడిపోయేదాకా వేచిచూసి, ఇన్వెస్ట్ చేయడం కూడా సరైన విధానం కాదు. మార్కెట్లు ఎప్పుడు పడిపోతాయో ఎవరూ కచ్చితంగా అంచనా వేయలేరు. చాలా మంది ఇన్వెస్టర్లు ఏం చేస్తారంటే, మార్కెట్లు గరిష్ట స్థాయిల్లో ఉన్నప్పుడు, తమ దగ్గర డబ్బుల్లేకపోయినా, అప్పు తెచ్చైనా సరే, ఇన్వెస్ట్ చేస్తారు. మరోవైపు మార్కెట్లు పడిపోతున్నప్పుడు, తమ పెట్టుబడులు సగానికి సగం హరించుకుపోయినా అమ్మేస్తుంటారు. అధిక శాతం రిటైల్ ఇన్వెస్టర్లు చేసే తప్పు ఇదే. మార్కెట్ల నుంచి ప్రయోజనం పొందాలంటే, సరిగ్గా దీనికి వ్యతిరేకంగా వ్యవహరించాలి. అంటే మార్కెట్లు పడిపోతున్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. మార్కెట్లు పెరుగుతున్నప్పుడు అమ్మేసి లాభం కళ్లజూడాలి. అయితే మార్కెట్లు గరిష్ట స్థాయిలకు ఎప్పుడు చేరుకుంటాయో, ఎప్పుడు కనిష్ట స్థాయిలకు పడిపోతాయో అంచనా వేయడం కష్టం. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానం (సిప్) మేలు. మీ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులున్నప్పడు, ఈ మొత్తాన్ని మంచి రేటింగ్ ఉన్న లిక్విడ్ డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఈ ఫండ్‌ను నిర్వహిస్తున్న ఫండ్‌హౌస్ ఆధ్వర్యంలోని ఈక్విటీ ఫండ్‌ను ఎంచుకోండి. లిక్విడ్ డెట్‌ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్‌లోకి పెట్టుబడులను వారానికి/రెండు వారాలకు/ నెలకు ఒకసారి చొప్పున బదిలీ అయ్యే విధంగా సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ)ను ఎంచుకోండి. సిప్ విధానంలాగానే ఈ ఎస్టీపీ విధానం కూడా పనిచేస్తుంది. తేడా అల్లా సిప్‌లో సేవింగ్ బ్యాంక్ అకౌంట్ నుంచి మీ సొమ్ములు మ్యూచువల్ ఫండ్‌లోకి వెళ్లిపోతాయి. ఎస్టీపీలో అయితే మీ ఇన్వెస్ట్మెంట్స్ లిక్విడ్ ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్‌కు బదిలీ అవుతాయి. ఎస్టీపీ విధానం వల్ల సేవింగ్స్ అకౌంట్లో డబ్బుల కన్నా లిక్విడ్ ఫండ్స్‌లోని ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మీకు ఎక్కువ వడ్డీ వస్తుంది. మరోవైపు ఈక్విటీల్లో చిన్న మొత్తాల్లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేసినట్లూ అవుతుంది. లిక్విడ్ ఫండ్స్‌కు ఎలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు. ఒకే ఫండ్‌హౌస్‌కు సంబంధించిన ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్‌కు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేస్తే క్యాపిటల్ గెయిన్స్ పన్నును చెల్లించాల్సి ఉంటుందా? ఉదాహరణకు ఒక స్వల్పకాలిక డెట్ ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్‌కు నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ) విధానంలో బదిలీ చేశాననుకోండి. డెట్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఆర్జించిన లాభాలపై నేను ఏమన్నా పన్ను చెల్లించాల్సి ఉంటుందా? -ప్రతిభ, నిజామాబాద్ ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌కు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేయడాన్ని సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ) అంటారు. సాధారణంగా చాలా మంది డెట్ ఫండ్స్‌లోని తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఈక్విటీ ఫండ్స్‌లోకి ఈ ఎస్టీపీ విధానంలో బదిలీ చేస్తుంటారు. పన్ను బాధ్యత విషయానికొస్తే, ఇలా ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేయడాన్ని మ్యూచువల్ ఫండ్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించి, మరో కొత్త మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడంగా భావిస్తారు. ఒకే ఫండ్ హౌస్‌కు చెందిన రెండు మ్యూచువల్ ఫండ్స్ మధ్య ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేసినా అదే విధంగా పరిగణిస్తారు. మీ స్వల్పకాలిక డెట్ ఫండ్‌పై మీకు దీర్ఘకాలిక లాభాలు వచ్చినట్లయితే, మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, మీరు మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కొన్న 36 నెలలలోపే వాటిని వేరే ఫండ్‌లోకి బదిలీ చేస్తే మీరు స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ రాబడులను మీ మొత్తం ఆదాయానికి కలిపి మీ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం పన్నును లెక్కిస్తారు. ఒక వేళ 36 నెలల తర్వాత వేరే ఫండ్‌లోకి బదిలీ చేస్తే, దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్‌గా పరిగణిస్తారు. ఈ దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్‌పై ఇండేక్సేషన్‌తో కలిపి 20 శాతం పన్ను లెక్కిస్తారు. ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏడాదికి మించి కొనసాగిస్తే, మీ తుది రాబడులపై మీరు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈక్విటీ ఫండ్స్‌పై వచ్చే దీర్ఘకాలిక రాబడులపై పన్ను మినహాయింపులుండడమే దీనికి కారణం. మ్యూచువల్ ఫండ్‌హౌజ్‌లు డెరైక్ట్ ప్లాన్లపై ట్రయల్ కమీషన్‌ను వసూలు చేస్తాయా? -మహ్మద్ ఇక్బాల్, హైదరాబాద్ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను అమ్మిపెట్టినందుకు ఏజెంట్లకు మ్యూచువల్ ఫండ్ సంస్థలు చెల్లించే వార్షిక రికరింగ్ ఫీజులనే ట్రయల్ కమీషన్‌గా వ్యవహరిస్తారు. డెరైక్ట్ ఫండ్స్ విషయంలో వినియోగదారుడికి, ఫండ్హౌజ్కు మధ్య ఎలాంటి దళారులుండరు. అందుకే డెరైక్ట్ ప్లాన్స్‌పై ఎలాంటి ట్రయల్ కమీషన్లుండవు. ఏజెంట్ చేసిన వ్యాపారాన్ని బట్టి రికరింగ్ ప్రాతిపదికన ట్రయల్ కమీషన్‌ను లెక్కిస్తారు. అందుకే ఎన్ఏవీ పెరిగినా, ఎక్కువ యూనిట్లను అమ్మిపెట్టినా ఏజెంట్లకు ప్రయోజనం కలుగుతుంది. ఈక్విటీ ఫండ్స్‌పై ట్రయల్ కమీషన్ 0.2 శాతం నుంచి 1 శాతంగా, డెట్ ఫండ్స్‌పై 0.10 శాతం నుంచి 1 శాతంగా ఉంటుంది. -
స్వల్పకాలానికి లిక్విడ్ ఫండ్స్ ఓకేనా?
నేను రూ.15 లక్షలను 45 రోజుల నుంచి 90 రోజుల కాలానికి ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 7.25 శాతం, సేవింగ్స్ అకౌంట్ అయితే 6 శాతం చొప్పున రాబడులు వస్తాయి. ఇక మ్యూచువల్ ఫండ్స్ ఎలాంటి రాబడులు ఇస్తాయోనని మీ వెబ్సైట్ ఆధారంగా మదింపు చేశాను. 3 శాతం రాబడి అని తేలింది. అయితే ఇది వార్షిక రాబడా ? లేక చక్రగతిన వస్తుందా? అనేది స్పష్టం చేయగలరు. స్వల్పకాలానికి లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడితే మంచి రాబడులు వస్తాయని మిత్రులంటున్నారు. తగిన సలహా ఇవ్వండి. - జగన్నాథ్, నిజామాబాద్ మ్యూచువల్ ఫండ్స్ విషయమై మీరు మదింపు చేసిన 3 శాతం రాబడి వార్షికమైనది కాదు. మూడు నెలలకు వచ్చే రాబడి. ఫిక్స్డ్ డిపాజిట్లపై 7.25 శాతం, బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌పై 6 శాతం చొప్పున వార్షిక రాబడులు వస్తాయి. ఈ ఏడాది మే 22 నాటికి లిక్విడ్ ఫండ్స్ వార్షిక రాబడి 9.05 శాతంగా ఉంది. రాబడుల పరంగా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నదే ప్రాధాన్యతా అంశమైతే, స్వల్పకాలానికి లిక్విడ్ ఫండ్స్ ఉత్తమం. ఇక మీరు పన్ను విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై రాబడి రూ.10,000 మించితే మీ ట్యాక్స్స్లాబ్ను అనుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి సంవత్సరంలోనే సొమ్మును ఉపసంహరించుకుంటే షార్ట్‌టెర్మ్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. డివిడెండ్ రీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్‌ను ఎంచుకుంటే, డివిడెండ్లను తాజా ఇన్వెస్ట్మెంట్స్గానే పరిగణిస్తారు. దీంతో మీ రాబడి తక్కువగానే ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే లిక్విడ్ ఫండ్స్ ఉత్తమమైన ఆప్షన్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అప్పుడప్పుడు ఒక ఫండ్ లక్ష్యాలు/ఉద్దేశాలు/బెంచ్‌మార్క్‌ను మారుస్తుంటాయని విన్నాను. అలా ఎందుకు చేస్తాయి? ఇలా మార్చడానికి సెబీ/ఏఎంఎఫ్ఐల నుంచి ముందస్తు అనుమతులు తీసుకుంటాయా? ఇలా మార్చే విషయాన్ని ఇన్వెస్టర్లకు కూడా తెలియజేస్తారా? మార్పు, చేర్పుల విషయం నచ్చకపోతే ఇన్వెస్టర్లు సదరు ఫండ్ నుంచి వైదొలగడానికి కొంత సమయం ఇస్తారా? - పర్వీన్, హైదరాబాద్ సెబీ నియమనిబంధనల ప్రకారమే మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఏదైనా ఫండ్ లక్ష్యాలు/ఉద్దేశాలు/బెంచ్‌మార్క్‌ల విషయంలో మార్పులు, చేర్పులు చేస్తాయి. ఈ మార్పుల విషయాలను మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఇన్వెస్టర్లకు తప్పనిసరిగా రాతపూర్వకంగా తెలియజేస్తాయి. రెండు మ్యూచువల్ ఫండ్ సంస్థలు విలీనమైనా, లేదా ఒకే మ్యూచువల్ ఫండ్ సంస్థలోని రెండు స్కీమ్‌లను విలీనం చేసినా ఇలాంటి మార్పులు, చేర్పులు జరుగుతాయి. ఒకవేళ ఎలాంటి విలీనం జరగకపోయినా కూడా మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఇలాంటి మార్పులు, చేర్పులు చేయవచ్చు. ఇక ఈ మార్పులు నచ్చని ఇన్వెస్టర్లు తమ ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకోవడానికి మ్యూచువల్ ఫండ్ సంస్థలు కొన్ని రోజుల గడువునిస్తాయి. ఎలాంటి ఎగ్జిట్ లోడ్‌ను వసూలు చేయరు. అయితే పన్ను అంశాలు షరా మామూలుగానే ఉంటాయి. వీటికీ, మ్యూచువల్ ఫండ్ సంస్థలకూ ఎలాంటి సంబంధం లేదు. నేను మ్యూచువల్ ఫండ్స్‌లో రూ. లక్ష వరకూ పెట్టబడులు పెట్టగలను. సగటు స్థాయి రిస్క్‌ను భరించగలను, కానీ నాకు అధిక రాబడులు కావాలి. దీని కోసం నేను బిర్లా సన్‌లైఫ్ ప్యూర్ వాల్యూ ఫండ్‌ను షార్ట్‌లిస్ట్ చేశాను. ఇప్పుడు ఈ ఫండ్ ఎన్ఏవీ ఆల్‌టైమ్ హైలో ఉంది. ఇప్పుడే ఇన్వెస్ట్ చేయమంటారా ? లేదా మార్కెట్ కొంత కరెక్షన్కు గురైన తర్వాత ఇన్వెస్ట్ చేయమంటారా? - డేనియల్, గుంటూరు ఇటీవల మార్కెట్ పెరిగిన ఫలితంగా బాగా ప్రయోజనం పొందిన కొన్ని ఫండ్స్‌లో బిర్లా సన్‌లైఫ్ ప్యూర్ వాల్యూ ఫండ్ ఒకటి. మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ ఫండ్ బాగా వృద్ధి సాధించింది. గత ఏడాది కాలంలో ఈ ఫండ్ 88 శాతం వృద్ధి సాధించింది. అయితే ఇదే మాదిరి రాబడులు భవిష్యత్‌లో కూడా వస్తాయని ఆశించకూడదు. ఏదైనా ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ ఫండ్ ఇటీవలి పనితీరునే పరిగణనలోకి తీసుకోకూడదు. ఏది ఏమైనా ఇన్వెస్ట్ చేయడానికి ఇది మంచి ఫండ్ అనే చెప్పవచ్చు. ఇది మీ పోర్ట్‌ఫోలియోలో ఒక భాగంగా ఉండాలి. ఒకే ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలని మీరు భావిస్తే మాత్రం ఇది సరైన ఫండ్ కాదని చెప్పవచ్చు. అంతేకాకుండా ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం సరైన పద్ధతి కాదు. మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని 6-8 నెలల కాలానికి విస్తరిస్తే సముచితంగా ఉంటుంది.