lorry - auto collision
-
రాంగ్ రూట్లో వెళ్తుండగా.. లారీ టైర్ మారుస్తుండగా..!
మద్నూర్/బాల్కొండ: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సోమవారం రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. కామారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు, నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. వీరిలో ఒక ఇంటర్ విద్యార్థి ఉన్నాడు. కామారెడ్డి జిల్లా మద్నూర్ నుంచి ఆటో రాంగ్రూట్లో మేనూర్ వద్ద 161వ జాతీయ రహదారిపైకి వెళ్లగా, అదే సమయంలో హైదరాబాద్ నుంచి నాందేడ్ వైపు లారీ ఎదురుగా వస్తోంది. అదుపుతప్పిన ఆటో లారీ కిందకి చొచ్చుకుపోయి నుజ్జునుజ్జయ్యింది. దీంతో ఆటోలో ఉన్న ఐదుగురి శరీర భాగాలు చితికిపోయాయి. పోలీసులు వచ్చి రెండు క్రేన్ల సహాయంతో లారీని పైకి లేపి ఆటోను బయటకు లాగారు. అందులోని ఐదుగురి శవాలను బయటకు తీశారు. మృతుల్లో ఒకరు మద్నూర్ మండలం మేనూర్‌కు చెందిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి బోయిన్‌వార్ క్రిష్ణ(17), మహారాష్ట్రకు చెందిన మహాజన్ భుజంగ్(55), నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన బొలిశెట్టి లింబన్న(48), రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జాలపల్లి శ్రీరాంకాలనీకి చెందిన షేక్ ముజీబ్(19)గా గుర్తించారు. మరొకరిని గుర్తించాల్సి ఉంది. మృతదేహాను పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై రాకపోకలు దాదాపు గంటపాటు నిలిచిపోయాయి. కాగా, ప్రమాదానికి కారణమైన ఆటో సోమవారం తెల్లవారు జామున నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రం నుంచి చోరీకి గురి అయింది కావడం గమనార్హం. రోడ్డుపై లారీ టైర్లు మారుస్తుండగా... ఆర్మూర్ నుంచి నిర్మల్ వైపు హరియాణాకు చెందిన లారీ కొబ్బరి బొండాల లోడుతో వెళ్తుండగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం కిసాన్‌నగర్ శివారు లో 44వ జాతీయ రహదారిపై టైర్ పంక్చర్ అయింది. నడిరోడ్డుపై లారీని నిలిపి ఎలాంటి సిగ్నల్ వేయకుండానే డ్రైవర్ రాబిన్‌ఖాన్(25) టైరు మారుస్తుండగా వెనుక నుంచి వచ్చిన కంటైన ర్ వేగంగా ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. కంటైనర్ డ్రైవర్ రస్మోద్దీన్ ఖాన్(20) తీవ్రగాయాలై అందులోనే ప్రాణా లు విడిచాడు. కంటైనర్ క్లీనర్ ఖుర్షీద్‌కు తీవ్రగాయాలు కాగా అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. ప్రమాదం కారణంగా జాతీయరహదారిపై సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాటిని దారి మళ్లించారు. లారీలో ఉన్న మరో డ్రైవర్ తారీఫ్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. -
బంధువుల ఇంటికి వెళ్తుండగా..
జగదేవ్‌పూర్ (గజ్వేల్): బంధువుల ఇంట్లో జరిగే ఓ కార్యానికి ఆటోలో వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. సిద్దిపేట జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగింది. జగదేవ్‌పూర్ గ్రామానికి చెందిన కొట్టాల కవిత (31), కొట్టాల లలిత (38), కొంతం చంద్రయ్య(47), కొంతం లక్ష్మి, శ్రీపతి కనకమ్మలు జగదేవ్‌పూర్‌కే చెందిన శ్రీగిరిపల్లి కనకయ్య(33)కు చెందిన ఆటోలో మెదక్ జిల్లా తూప్రాన్ మండల పరిధిలోని ఇస్లాంపూర్‌కు బంధువుల ఇంట్లో జరిగే ఓ కార్యానికి బయలుదేరారు. అలిరాజ్‌పేట గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా వచ్చిన లారీ వీరి ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కనకయ్య, కవిత అక్కడికక్కడే మృతి చెందారు. కొంతం చంద్రయ్య, లక్ష్మి, లలిత, కనకమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ కృష్ణమూర్తి సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా, కొంతం చంద్రయ్య, కొట్టాల లలిత మృతి చెందారు. మృతుల్లో కవిత, లలిత తోటి కోడళ్లు. భార్యాభర్తల్లో చంద్రయ్య మృతి చెందగా, భార్య లక్ష్మి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మృతులు, గాయపడిన వారంతా కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కన్నీటి సంద్రం: ఇద్దరూ ఉన్నత చదువులు చదివిన వారే..
ఆ ఇద్దరు యువకులు జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఓ వైపు కుటుంబాన్ని పోషిస్తూ.. మరో వైపు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు కష్టపడుతున్నారు. మరో వ్యక్తి ఆటో నడుపుతూ కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వారి జీవితాలను కబళించింది. దీంతో ఆయా కుటుంబాలకు చెందిన వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సాక్షి, నెల్లూరు(చిల్లకూరు): మండలంలోని చేడిమాల గ్రామ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు వ్యక్తులు తమ కుటుంబాలను పోషిస్తున్న వారే. వారి మృతితో మూడు కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. పోలీసుల కథనం మేరకు.. గూడూరు అడివి కాలనీకి చెందిన మిడతూరి సుధాకర్ (50) ఆటో నడుపుతుంటాడు. గూడూరు రూరల్ మండలంలోని చెన్నూరులో దళితవాడకు చెందిన నందిపాక హరిసాయి (27), మాతంగి రాజశేఖర్ (28) సమీప బంధువులు. ఇద్దరూ గూడూరులోని సొసైటీ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. కంపెనీకి చెందిన వస్తువులను చుట్టుపక్కల మండలాల్లో చిన్నపాటి దుకాణాలకు విక్రయిస్తుంటారు. వస్తువులు విక్రయించి వెళ్తుండగా.. సుధాకర్ ఆటోలో బుధవారం హరిసాయి, రాజశేఖర్ కోట, చింతవరం వెళ్లారు. అక్కడ వస్తువులు విక్రయించి రాత్రి తిరిగి గూడూరుకు బయలుదేరారు. చేడిమాల వద్ద రోడ్డుపై వెళ్తున్నారు. అక్కడ కంకర తోలి ఉండడంతో సుధాకర్ ఆటోను పక్కకు తప్పించబోయిన సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. దీంతో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు కాగా అందులో ఉన్న ముగ్గురూ లారీ చక్రాల కింద నలిగి ప్రాణాలొదిలారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్సై సుధాకర్‌రెడ్డి సిబ్బందితో కలసి అక్కడికి చేరుకుని చక్రాల కింద నిలిగిన మృతదేహాలను బయటకు తీయించి గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా మృతదేహాలకు గురువారం పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అక్కడ మూడు కుటుంబాలు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఇద్దరూ ఉన్నత చదువులు చదివారు ►చెన్నూరుకు చెందిన నందిపాక రమణయ్య, కృష్ణమ్మలకు ఒక్కగానొక్క కుమారుడు హరిసాయి. బీఎస్సీ చదివాడు. ఎస్సై అవ్వడమే అతని లక్ష్యం. ఓ వైపు అందుకు సిద్ధమవుతూ.. మరోవైపు కుటుంబ పోషణ నిమిత్తం ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. హరిసాయి సంపాదన మీదనే కుటుంబం ఆధారపడి జీవిస్తోంది. మరో నెలలో ఇతడి వివాహం జరగాల్సి ఉంది. దీనికోసం తల్లిదండ్రులు ఏర్పాట్లు చేశారు. ఇంతలోనే కొడుకు చనిపోవడంతో వారు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ►మాతంగి రాగయ్య, మాధవిలకు ఒక్కగానొక్క కుమారుడు రాజశేఖర్. ఇతను బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఇంతలో ఖాళీగా ఉండడం ఇష్టంలేక కుటుంబానికి అండగా ఉండేందుకు హరిసాయితో కలిసి పని చేస్తున్నాడు. ఇద్దరూ ప్రమాదంలో మృతిచెందడంతో దళితవాడలో విషాదం నెలకొంది. ►ఆటో డ్రైవర్ సుధాకర్‌కు భార్య ఉన్నారు. వారిద్దరి కొడుకులకు వివాహమైంది. ప్రస్తుతం భార్య, సుధాకర్ కలిసి ఉంటున్నారు. ఇంటి పెద్ద చనిపోవడంతో ఆమె గుండెలవిసేలా విలపిస్తున్నారు. చదవండి: (సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ ఫ్రమ్ హోం.. కూతురి గోల్డ్ చైన్ విషయమై భర్తతో గొడవ, దాంతో) -
దొరకని ఆ ఐదుగురి జాడ
సంగం: నెల్లూరు–ముంబై రహదారిపై గురువారం రాత్రి లారీ ఢీకొనడంతో వాగులో ఆటో పడిపోయిన ఘటనలో గల్లంతైన ఐదుగురి జాడ శుక్రవారం రాత్రి వరకు తెలియరాలేదు. కుటుంబ సభ్యుడి కర్మకాండలు ముగించుకుని దైవ సన్నిధిలో నిద్ర చేయడానికి వెళుతున్న ఓ కుటుంబం ఊహించని రీతిలో నెల్లూరు జిల్లా సంగం సమీపంలో గురువారం రాత్రి ప్రమాదానికి గురైన విషయం విదితమే. ఈ దుర్ఘటనలో ఆత్మకూరు పట్టణంలోని జ్యోతినగర్‌కు చెందిన కర్రా నాగరాజు, భార్య పద్మ, కర్రా పుల్లయ్య, అతని భార్య సంపూర్ణమ్మ, దివానపు ఆదెమ్మ గల్లంతైన విషయం విదితమే. ఈ ప్రమాదంలో ఏడుగుర్ని సురక్షితంగా బయటకు తీసినప్పటికీ వారిలో బాలిక నాగవల్లి (14) ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. గల్లంతైన వారి కోసం జాయింట్ కలెక్టర్ హరేంద్రప్రసాద్, ఎస్పీ విజయారావు, అడిషనల్ ఎస్పీ వెంకటరత్నం, ఆత్మకూరు ఆర్డీవో చైత్రవర్షిణి ఆధ్వర్యంలో బృందాలు బీరాపేరు వాగులో గాలిస్తున్నాయి. వాగులో ప్రవాహ ఉధృతి శుక్రవారం మరింత పెరగడంతో ఎంత వెతికినా ఒక్కరి జాడ కూడా తెలియరాలేదు. శుక్రవారం ఉదయం క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన ఆటోను వాగులోంచి బయటకు తీశారు. ఎన్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్ల సహాయంతో బీరాపేరు వాగంతా జల్లెడ పట్టారు. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు ఆదేశాల మేరకు కృష్ణపట్నం నుంచి మరబోటును తెప్పించి క్రేన్ సహాయంతో కిందకు దింపారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
మరికొన్ని రోజుల్లో వివాహ బంధంతో జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభిద్దామనుకున్న ఆ యువతిని విధి చిన్నచూపు చూసింది. పెళ్లి బట్టలు కొనుగోలు చేసేందుకు ఉత్సాహంగా వెళ్తున్న ఆ కుటుంబంపైకి ట్రెయిలర్ లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కాబోయే వధువుతోపాటు ఆమె తల్లి, సోదరుడు, బాబాయి, పిన్ని, ఆటో డ్రైవర్ కన్నుమూశారు. – సాక్షి, మహబూబాబాద్ ఏం జరుగుతుందో ఆలోచించే లోగానే... సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఎర్రకుంట తండాకు చెందిన జాటోతు కస్నానాయక్–కల్యాణి (45) దంపతుల కుమార్తె ప్రమీల అలియాస్ మరియమ్మ (23) వివాహం డోర్నకల్ మండలం చాంప్లా తండా గ్రామ పరిధిలోని ధరావత్ తండాకు చెందిన ధరావత్ వెంకన్న–లలిత దంపతుల ప్రథమ కుమారుడు వినోద్‌తో నిశ్చయమైంది. వచ్చే నెల 10న పెళ్లి జరగాల్సి ఉండగా ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లి బట్టల కొనుగోలు కోసం వరంగల్‌కు శనివారం వెళ్దామని చెప్పిన ప్రమీల తండ్రి కస్నా నాయక్ పనికి వెళ్లగా శుక్రవారమే బట్టలు కొంటే బాగుంటుందనే ఆలోచనతో ప్రమీల, ఆమె తల్లి కల్యాణి, సో దరుడు ప్రదీప్ (25), బాబాయి జాటోతు ప్రసాద్ (42) చిన్నమ్మ లక్ష్మి (39) కలసి జాటోతు రాములు నాయక్ (33) ఆటోలో శుక్రవారం ఉద యం 10 గంటలకు గూడూరు మీదుగా వరంగల్ బయలుదేరారు. సుమారు 40 నిమిషాల ప్రయాణం అనంతరం మర్రిమిట్ట–భూపతిపేట మధ్యలో జాతీయ రహదా రి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్‌కు చెందిన ట్రెయిలర్ లారీ ఎదురుగా వస్తూ అతివేగంగా ఆటోను ఢీకొట్టడమే కాకుండా దాన్ని సుమారు 150 మీటర్లు తోసుకెళ్లింది. దీంతో ఏం జరిగిందో తెలిసేలోపే ఆటోలోని వారు విగత జీవులుగా మారారు. ఫలితంగా మల్లంపెల్లి–సూర్యాపేట జాతీయ రహదారి రక్తపు మడుగుగా మారింది. లారీ డ్రైవర్ ధరావత్ కిషన్ అతివేగంగా నడపటమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రమాద సమయంలో లారీ డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదవార్త తెలియగానే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను తీసుకెళ్లేందుకు ట్రాక్టర్లోకి ఎక్కించారు. మృతదేహాలను ట్రాక్టర్లో తరలిస్తుండగా అడ్డుకుంటున్న స్థానికులు స్థానికుల ఆందోళన... రోడ్డు ప్రమాద వార్త తెలుసుకొని ఎర్రకుంట తండావాసులు పెద్దసంఖ్యలో ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలిస్తున్న ట్రాక్టర్‌ను అడ్డుకొని రోడ్డుపై ధర్నాకు దిగారు. తక్షణమే బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఏరియా ఆస్పత్రికి మృతదేహాలను తరలించే ప్రయత్నం చేయడం, చర్చల పేరుతో కాలయాపన చేస్తుండటంపై గ్రామస్తులు పోలీసులతో ఘర్షణకు దిగారు. దీంతో రాత్రి వరకు మృతదేహాల తరలింపులో జాప్యం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన రాస్తారోకో రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. చివరకు విషయం తెలుసుకున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ ఘటనాస్థలికి చేరుకొని మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఎన్‌హెచ్ కాంట్రాక్టర్‌తో ఫోన్లో మాట్లాడి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని సూచించారు. చివరకు కాంట్రాక్టర్ ద్వారా రూ. 5 లక్షల చొప్పున, ప్రభుత్వం నుంచి రూ. లక్ష చొప్పున మృతుల కుటుంబాలకు పరిహారం అందేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో తండావాసులు ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. సాయమే చంపేసింది! నేషనల్ హైవే నిర్మాణ కాంట్రాక్టర్‌కు మొరం ఇచ్చేందుకు ఎవరూ సహకరించలేదు. దీంతో జాటోతు కస్నా నాయక్ తనకు సంబంధించిన మూడెకరాల బంజరు భూమి నుంచి మొరం తీసుకెళ్లేందుకు సమ్మతించాడు. ఈ మేరకు భూమిలో మొరం తీసేందుకు వినియోగించే ప్రొక్లెయిన్ తీసుకురావడానికి లారీతో డ్రైవర్ భూపతిపేట నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలోనే కస్నానాయక్ కుటుంబ సభ్యులు వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. దీంతో సాయం చేయాలని ముందుకు రావడమే తన కుటుంబీకులను పొట్టన పెట్టుకుందంటూ కస్నా నాయక్ రోదించాడు. మర్రిమిట్ట ప్రమాదంపై గవర్నర్, సీఎం దిగ్భ్రాంతి సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ వేర్వేరు ప్రకటనల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం జరిగిన తీరుపై సీఎం కేసీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సేవలు వెంటనే అందించాలని ఆదేశించారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
గూడూరు: మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ - ఆటో ఢీకొనడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మృతులంతా గూడూరు మండలం ఎర్రకుంట్ల తండాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు. దుస్తుల కొనుగోలు కోసం వరంగల్‌కు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. వారు ప్రయాణిస్తున్న ఆటో గూడూరు శివారుకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. అందులో ప్రయాణిస్తున్న వారంతా అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల్లో ఇటీవల పెళ్లి కుదిరిన యువతి కూడా ఉన్నట్టు తెలిసింది. ఆమె పెళ్లికి బట్టలు కొనుగోలు చేసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం. కాగా, ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. లారీ కింద కూరుకుపోయిన ఆటోను పోలీసులు అతికష్టమ్మీద బయటకు తీశారు. లారీని ప్రొక్లెయిన్‌తో పక్కకు నెట్టారు. అయితే ప్రమాదానికి లారీ అతివేగంగా రావడమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. -
అనంతలో ఘోరరోడ్డు ప్రమాదం..
-
అనంతపురంలో ఘోరరోడ్డు ప్రమాదం
సాక్షి, అనంతపురం: జిల్లాలోని గుత్తి హైవేపై ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకెళ్తే.. కూలీలతో వెళ్తున్న డీజిల్ ఆటో తొండపాడు బస్టాప్‌లో ఆగి ఉండగా.. వెనుకవైపు నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలు కాగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులంతా పత్తి పంట కోతకు పెద్దవడుగూరుకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్టు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (పెళ్లిరోజే కబళించిన మృత్యువు) -
ఆటోను ఢీకొన్న లారీ
చిల్లకూరు: వేగంగా దూసుకువచ్చిన లారీ ఢీ కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం నాంచారంపేట వద్ద బుధవారం జరిగింది. చిల్లకూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కొందరు గూడూరు వెళ్లారు. బుధవారం అక్కడ్నుంచి ఆటోలో స్వగ్రామాలకు ప్రయాణమయ్యారు. నాంచారంపేట వద్దకు వచ్చేసరికి.. గూడూరు బైపాస్‌లోని సిలికా యార్డులో ఇసుక లోడ్ చేసుకునేందుకు వెళ్తున్న లారీ వీరి ఆటోను ఢీకొట్టింది. ఆటో పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏరూరు గ్రామానికి చెందిన మామిడాల బుజ్జమ్మ (55), కలవకొండకు చెందిన ముడి శిఖామణి(52) అక్కడికక్కడే మృతి చెందారు. బల్లవోలుకు చెందిన భారతి(38)ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరుకు తరలించారు. మిగిలిన వారికి గూడూరు ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
ఆటోను ఢీకొన్న లారీ
బత్తలపల్లి: ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన అనంతపురం జిల్లా బత్తలపల్లి సమీపంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తాడిమర్రి మండలం పిన్నదరి గ్రామానికి చెందిన దంపతులు సాకే నారాయణస్వామి (45), సాకే ఆదెమ్మ (40) బొప్పాయి కాయలు అమ్ముకునేందుకు సొంత ఆటోలో రోజూ బత్తలపల్లికి వస్తుంటారు. రోజులాగే ఆదివారం తెల్లవారుజామున ఆటోలో బత్తలపల్లికి వస్తుండగా అదే గ్రామానికి చెందిన చెన్నకేశవులు (46), పెద్దక్క (44) వ్యక్తిగత పనులపై వెళ్తూ అదే ఆటోలో ఎక్కారు. ఆటో బత్తలపల్లి ఇందిరమ్మ కాలనీ వద్దకు రాగానే బెంగళూరు నుంచి తాడిపత్రి వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు కాగా నారాయణస్వామి, ఆదెమ్మలు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ఇద్దరిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే లారీని వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందడంతో పిన్నదరి గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి. ఘటన వివరాలు .. ఎక్కడ?: అనంతపురం జిల్లా బత్తలపల్లిలో ఎప్పుడు?: ఆదివారం తెల్లవారుజామున కారణం: లారీ వేగంగా వచ్చి ఆటోను ఢీకొనడం పర్యవసానం: ఆటోలో ఉన్న ఒకే గ్రామానికి చెందిన నలుగురు దుర్మరణం -
అంత్యక్రియలకు వస్తూ ...అనంతలోకాలకు
సాక్షి, ధారూరు: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళుతూ ముగ్గురు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. ధారూరు మండలంలోని ఎబ్బనూర్ గ్రామానికి చెందిన చాకలి భీమయ్య(28) రోడ్డు ప్రమాదంలో గురువారం రాత్రి మృతిచెందాడు. కాగా, ఇదే గ్రామానికి చెందిన మృతుడి దాయాదులు చాకలి గోపాల్, జగన్ అన్నదమ్ములు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం గ్రామానికి వలస వెళ్లారు. మరణవార్త తెలుసుకున్న గోపాల్, జగన్‌లు శుక్రవారం ఉదయం అంత్యక్రియలకు హాజరయ్యేందుకు రామచంద్రాపురం నుంచి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో బయలుదేరారు. ఎబ్బనూర్ చెరువు మూలమలుపు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ వీటి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో పల్టీకొట్టింది. ఇందులో ప్రయాణిస్తున్న గోపాల్, జగన్ భార్యలు కమలమ్మ(44), శారద(32)తో పాటు జగన్ కూతురు అర్చన(11) అక్కడిక్కడే మృతిచెందారు. గోపాల్ తలకు తీవ్రగాయాలయ్యాయి. ఇతని పెద్ద కూతురు సంతోష(22) చేయి విరిగింది. జగన్ మొదటి కూతురు అక్షయ(13) తీవ్ర గాయాలై స్పృహ కోల్పోయింది. క్షతగాత్రులను వెంటనే ప్రైవేటు వాహనంలో వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో గోపాల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. ఆటో నడుపుతున్న జగన్ ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు. ఈ సంఘటనతో మండల ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతదేహాల వద్ద కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కాగా వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ ఎబ్బనూర్ గ్రామానికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అన్నదమ్ములు కష్టజీవులు గోపాల్ సొంతంగా ఆటో కొనుగోలు చేసి నడుపుతుండగా, తమ్ముడు జగన్ తోపుడు బండిపై పండ్లు విక్రయిస్తుంటాడు. వీరి భార్యలు దుస్తులు ఇస్త్రీ చేస్తూ కుటుంబ పోషణకు కొంత చేయూతను అందిస్తున్నారు. వారి పిల్లలను నివాసం ఉండే చోటు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోనే చదివిస్తున్నారు. గ్రామంలో ఉపాధి లేక అంతర్ జిల్లాకు వెళితే విధి వక్రీకరించి తమ భార్యలను కోల్పోయామని వారు రోదిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. -
ముగ్గురి మృతి
సీతానగరం: సీతానగరం ఓవర్ బ్రిడ్జి వద్ద ఆటోను వెనుక నుంచి వచ్చిన లారీ ఆదివారం ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. నలుగురికి తీవ్ర గాయాలు కాగా, ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే...లక్ష్మీపురం గ్రామానికి చెందిన నరం కాంతమ్మ(50) మసాల సామాన్లు విక్రయిస్తుంటుంది. ఆదివారం జోగింపేటలో సరుకును విక్రయించి పార్వతీపురం నుంచి బొబ్బిలి వైపు వెళ్తున్న ఆటోలో ఎక్కి సీతానగరం వద్ద బ్రిడ్జి వద్ద ఆపాలని కాంతమ్మ చెప్పింది. రాష్ట్రీయ రహదారిపై ఉన్న ఆర్వోబీ దగ్గర ఆటో దిగి కాలనీలో ఉన్న కుమారుడు జాన్ ఇంటికి వెళ్లేందుకు సిద్ధపడుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టింది. దీంతో కాంతమ్మ తలపై నుంచి రెండు టైర్లు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. నలుగురికి బలమైన గాయాలయ్యాయి. తీవ్రంగా గాయాల పాలైన వారిలో అప్పయ్యపేటలో ఆటో ఎక్కిన ఎం.లక్ష్మి, కె.సునీత, బి.భాగ్యలక్ష్మి, బి.సావిత్రమ్మ ఉన్నారు. వీరితో పాటు మింది జగన్నాధం, ఈర్ల వినయ్‌కుమార్, ఆటో డ్రైవరు నాగభూషణరావులకు స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ డి.సాయిక్రిష్ణ గాయపడ్డ వారిని స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు. మృతురాలు కాంతమ్మకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కారు ఢీకొని... రామభద్రపురం: మండలంలోని కొండపాలవలస వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కోటశిర్లాం గ్రామానికి చెందిన మిత్తిరెడ్డి లక్ష్మణ(35) విశాఖపట్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు...లక్ష్మణ మోటారుసైకిల్‌తో రామభద్రపురం నుంచి బాడంగి ఆసుపత్రికి వెళ్తుండగా శ్రీకాకుళం నుంచి ఎదురుగా వస్తున్న కారు కొండపాలవలస వద్ద ఢీకొట్టింది. దీంతో తలకు తీవ్రమైన గాయమైంది. చికిత్స నిమిత్తం బాడంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం విజయనగరం తరలించారు. అక్కడ నుంచి విశాఖపట్నం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్ఐ డిడి.నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మణ తాపీ పని చేస్తూ జీవిస్తూ ఇలా ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఎలా బతికేదంటూ బోరుమన్నారు. లక్ష్మణకు భార్య రమణమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సాయం చేసేందుకు వెళ్లి...తిరిగొచ్చే క్రమంలో... లక్ష్మణ రామభద్రపురం మండల కేంద్రంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రౌతు బోగేశ్వరరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకి ఆటోలో తరలించాడు. ఈ క్రమంలో లక్ష్మణ ద్విచక్ర వాహనం రామభద్రపురంలో ఉండిపోయింది. దీన్ని తీసుకువెళ్లేందుకు రామభద్రపురం వచ్చి తిరిగి బోగేశ్వరరావు మృతదేహం వద్దకు వెళ్తుండగా ఇలా మృత్యువాత పడ్డాడు. దీంతో కోటశిర్లాంలో విషాదం అలముకొంది. రోడ్డు ప్రమాదంలో... నెల్లిమర్ల రూరల్: మండలంలో చిన రాడపేట జంక్షన్ వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు అందించిన వివరాలు...విజయనగరంలో పూల్‌బాగ్ కాలనీకి చెందిన దాసు సూర్యనారాయణ(44) చినబూరాడపేట గ్రామంలో నివాసముంటున్న తన కుమార్తెను చూసేందుకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో బూరాడపేట జంక్షన్ వద్ద ఆటో వెనుక భాగంలో ఎక్కుతుండగా అదుపుతప్పి వెనక్కి పడిపోయాడు. తలకు తీవ్ర గాయం కావడంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను స్థానికులు విజయనగరం కేంద్ర ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ తరలించారు. కేజీహెచ్‌కు తరలిస్తుండగానే మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతునికి భార్యతో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు. నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ, ఆటో ఢీ.. ఇద్దరి మృతి
మెదక్: ఎదురెదురుగా వస్తున్న లారీ, ఆటో ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మెదక్ జ్లిలా గజ్వేల్ మండలం సిరిగిరిపల్లి గ్రామ సమీపంలో ఆదివారం జరిగింది. వివరాలు.. 11 మంది ప్రయాణికులతో జగదేవ్‌పూర్ నుంచి గజ్వేల్ వెళ్తున్న ఆటో సిరిగిరిపలి వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న జగదేవ్‌పూర్ గ్రామానికి చెందిన రాకేష్(16)తోపాటు దాసేపల్లి గ్రామానికి చెందిన రాములమ్మ(56) అక్కడికక్కడే మృతిచెందారు. ఆటోలో ఉన్న మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటోను ఢీకొన్న లారీ.. ఏడుగురికి గాయాలు
గుంటూరు: వేగంగా వెళ్తున్న లారీ ముందున్న ఆటోను ఢీకొట్టడంతో అందులో ఉన్న ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని సత్తెనపల్లి మండలం కంటెపూడి గ్రామ సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కొమ్మెరపుడి నుంచి సత్తెనపల్లి వెళ్తున్న ఆటోను గుంటూరు నుంచి సత్తెన పల్లి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఏడుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.