
సాక్షి, అనంతపురం: జిల్లాలోని గుత్తి హైవేపై ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకెళ్తే.. కూలీలతో వెళ్తున్న డీజిల్ ఆటో తొండపాడు బస్టాప్‌లో ఆగి ఉండగా.. వెనుకవైపు నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలు కాగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులంతా పత్తి పంట కోతకు పెద్దవడుగూరుకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్టు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (పెళ్లిరోజే కబళించిన మృత్యువు)