NH44
-
అనంతలో ఘోరరోడ్డు ప్రమాదం..
-
అనంతపురంలో ఘోరరోడ్డు ప్రమాదం
సాక్షి, అనంతపురం: జిల్లాలోని గుత్తి హైవేపై ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకెళ్తే.. కూలీలతో వెళ్తున్న డీజిల్ ఆటో తొండపాడు బస్టాప్‌లో ఆగి ఉండగా.. వెనుకవైపు నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలు కాగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులంతా పత్తి పంట కోతకు పెద్దవడుగూరుకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్టు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (పెళ్లిరోజే కబళించిన మృత్యువు) -
ఎన్‌హెచ్ 44పై ఘోర రోడ్డు ప్రమాదం
-
ఎన్‌హెచ్ 44పై ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, అనంతపురం : నగర శివారులోని జాతీయ రహదారి 44పై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపు తప్పి వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మరో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు వడియంపేటకు చెందిన వ్యవసాయ కూలీలుగా గుర్తించారు. ప్రమాదం జరిగినప్పుడు ఆటోలో 14మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా బుక్కచర్ల నుండి వడియంపేటకు వ్యవసాయ పనులకు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులంతా మహిళలే. పని వెళ్లిన తమవాళ్లు విగతజీవులుగా మారడటంతో కుటుంబసభ్యుల కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గురుకుల పేరంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాస్తారోకో
అలంపూర్ : న్యూక్యాలిటీ పాలసీ (ఎన్క్యూపీ)ని కొనసాగించాలని తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోíసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఉన్నతమైన, నాణ్యమైన విద్యను గురుకులాల్లో అందజేయడానికి సాంఘిక, సంక్షేమ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్క్యూపీ విధానాన్ని ప్రివేశపెట్టారని తెలిపారు. కానీ గురుకుల ఉపాధ్యాయులు ఆందోళనలు చేయడం బాధకరమన్నారు. ఉపాధ్యాయులు ఎన్క్యూపీ అమలుకు పూర్తిస్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వరలక్ష్మి, వెంకటమ్మ, మారెన్న, మాజీ ఎంపీటీసీ మద్దిలేటి, రవికుమార్, రామమద్దిలేటి, ఏసన్న, మహేష్, ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, మద్దిలేటి, కృష్ణ, రవీందర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్‌హెచ్‌పై ప్రైవేట్ బస్సు బోల్తా
– 8మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు – దివిటిపల్లి, షేర్‌పల్లి మధ్య ఘటన మహబూబ్‌నగర్ క్రైం : అనుకున్న సమయానికి ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చాలన్న ఆత్రుతలో డ్రైవర్ అతివేగంగా నడపటం వల్ల ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూర్ నుంచి హైదరాబాద్‌కు 32మంది ప్రయాణికులతో ఓ ప్రైౖవేట్ ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. ఆదివారం తెల్లవారుజామున మహబూబ్‌నగర్ మండలంలోని దివిటిపల్లి, షేర్‌పల్లి మధ్య జాతీయ రహదారిపై అదుపుతప్పి పక్కన ఉన్న పంట పొలాల్లో దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో ఎనిమిది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు కావడంతో మిగతావారు గమనించి వెంటనే క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై పోలీసులకు సమాచారమివ్వడంతో సంఘటన స్థలాన్ని రూరల్‡ఎస్ఐ రాజేశ్వర్‌గౌడ్ పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు.