
సాక్షి, అనంతపురం : నగర శివారులోని జాతీయ రహదారి 44పై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపు తప్పి వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మరో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు వడియంపేటకు చెందిన వ్యవసాయ కూలీలుగా గుర్తించారు. ప్రమాదం జరిగినప్పుడు ఆటోలో 14మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా బుక్కచర్ల నుండి వడియంపేటకు వ్యవసాయ పనులకు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులంతా మహిళలే. పని వెళ్లిన తమవాళ్లు విగతజీవులుగా మారడటంతో కుటుంబసభ్యుల కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.