జైట్లీతో రాజన్ భేటీ...
న్యూఢిల్లీ: స్థూల ఆర్థికాంశాలపై చర్చించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ నెల 29న ద్రవ్య పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినందున పరపతి విధానంలో కీలక పాలసీ రేట్లను కనీసం పావు శాతం తగ్గించే అవకాశాలున్నాయని అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. దాదాపు గంట సేపు సాగిన సమావేశంలో పలు అంశాలను చర్చించినట్లు చెప్పిన రాజన్.. వివరాలను వెల్లడించడానికి మాత్రం నిరాకరించారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ అక్కడి వడ్డీ రేట్లపై యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయించిన దరిమిలా ప్రపంచ, దేశీ ఎకానమీల్లో పరిణామాలు, పరిస్థితులు ఇందులో చర్చకు వచ్చినట్లు సమాచారం.