madatha venkatgaud
-
ఎమ్మెల్యేను తప్పుదోవ పట్టిస్తున్నారు..
ఇల్లెందు: ఎమ్మెల్యే హరిప్రియ వర్గీయులే ఆమెను తప్పుదోవ పట్టిస్తున్నారని, తమపై అవాకులు, చివాకులు పేడితే సహించబోమని మడత వెంకట్‌గౌడ్ వర్గీయులు హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం జగదాంబా సెంటర్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు సిలివేరు సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ హాబీబ్‌బేగ్‌లు మాట్లాడుతూ.. గులాబీ కండువాలు వేసుకోని వారు కూడా తమ గురించి, పార్టీ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. పార్టీ ప్రారంభం నుంచి జెండా మోసిన తమకే పార్టీ నియమావళి, క్రమశిక్షణ నేర్పుతున్నారని, తాము టీఆర్ఎస్లో లేకుండా ఎక్కడున్నామో తేల్చాలని వారు డిమాండ్ చేశారు. ఒక నాయకుడు 15 ఏళ్ల క్రితం పార్టీ నిధులు స్వాహా చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన చరిత్ర మర్చిపోయి మాట్లాడితే చరిత్ర క్షమించదన్నారు. 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నామని చెప్పుకుంటున్న వారు ఈ ప్రాంతం కోసం పుల్లంత పని చేయలేదన్నారు. కనీసం ఒక్కరికైనా కులం, ఆధాయం ధ్రువపత్రమైనా ఇప్పించిన చరిత్ర మీకుందా అని ప్రశ్నించారు. కోట్లు సంపాదించుకోవటం పని చేసే మీరు ఇతరుల గురించి మాట్లాడే ముందు తమ గురించి కూడా తెలుసుకోవాలని హితవు పలికారు. రొంపేడు పంచాయతీలో ఓ గిరిజనుడి భూమి 20 ఎకరాలు పట్టా చేయించుకున్న చరిత్ర మీదని ఆరోపించారు. వెంకట్‌గౌడ్ మీద చేసిన ఆరోపణలకు ఆధారాలతో రావాలని, అసత్య ఆరోపణలు చేస్తే ప్రజలు క్షమించరన్నారు. స్టేషన్‌బస్తీ మీటింగ్‌లో మాట్లాడిన విషయాలు వాస్తవాలేనని స్పష్టం చేశారు. మడత వెంకట్‌గౌడ్ వర్గీయులు అసలు టీఆర్‌ఎస్‌నా కాదా తేల్చమని సవాల్ విసిరారు. పార్టీ కార్యక్రమాలు అంటే అందరికి తెలిపి చేయాలని, కొంత మందికి తెలిపి రహస్యంగా చేయటం అవాకులు, చెవాకులు పేలుతున్నారని భావ్యమా అని ప్రశ్నించారు. మడత వెంకట్‌గౌడ్ గాలి నుంచి ఊడి పడలేదని, కేసీఆర్‌నే చేర్చుకున్నారని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో 15 వేల మెజార్టీ సాధించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ రోజుల విమర్శలు చేసే వారు ఆనాడు ఎక్కడ ఉన్నారని, ఎవరి గెలుపు కోసం పని చేశారో చరిత్ర ప్రజల ముందు ఉందన్నారు. ఆర్అండ్ఆర్ కాలనీలో అవినీతి జరిగిందని గగ్గోలు పెడితే ఆనాడే విచారణ జరిగిందని, దోషులను ఎందుకు తేల్చలేదని ప్రశ్నించారు. పార్టీని ఎలా కాపాడుకోవాలో, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండాను మున్సిపాల్టీ మీద ఎలా ఎగుర వేయాలో తమకు తెలుసని, బెదిరింపులకు భయపడే వారు ఇక్కడ ఎవరూ లేరని అన్నారు. ఇల్లెందు మున్సిపాల్టీలో గులాబీ జెండా ఎగుర వేసి కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ఇస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నేతలు గీకూరి వెంకన్న, కమల్‌కోరీ, అబ్ధుల్ మన్నాన్, గుండంపల్లి సతీష్, ఇమామ్, మానుపూరి రమేష్, జబ్బార్, కన్నా, గిరి,వీరస్వామి, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ మునుగుతున్న నావ
అగ్ర నేతల తీరు బాధిస్తోంది - డీసీసీ అధ్యక్షుడి తీరు పార్టీకి నష్టం - జిల్లా, రాష్ట్ర నేతలపై ‘మడత’ ఫైర్ - త్వరలో కాంగ్రెస్‌కు మడత - వెంకటగౌడ్ రాజీనామా...? ఇల్లెందు : అసెంబ్లీ , మున్సిపల్ ఎన్నికల్లో ఏ ఒక్క అగ్ర నేత ఇల్లెందు వైపు తిరిగి చూడలేదు. పైసా పార్టీ ఫండ్ ఇవ్వలేదు. మా సొంత డబ్బులతోనే ఎమ్మెల్యేను, ఎంపీటీసీలను, సర్పంచ్‌లను, జడ్పీటీసీలను, మున్సిపల్ కౌన్సిలర్లను గెలిపించుకున్నాము. అయినా ఏడాది కాలంలో ఒక్క నాయకుడు కూడా ఇల్లెందు వైపు తిరిగి చూడలేదు. స్థానిక నాయకత్వాన్ని సంప్రదించకుండా ఏకంగా డీసీసీ అధ్యక్షుడు ఐతా సత్యం ఓ కౌన్సిలర్‌కు మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ పదవీ కట్టబెడుతూ లేఖ పంపించటం తమను బాధకు గురి చేసిందని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు మడత వెంకట్‌గౌడ్ అన్నారు. గురువారం సాయంత్రం ఆయ న స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ జిల్లా, రాష్ట్ర నేతలపై మాజీ మంత్రులపై ఆయన ఫైర్ అయ్యారు. ఇల్లెందు నియోజకవర్గంలో సమష్టి కృషితో ఎంపీటీసీ, జడ్పీటీసీల నుంచి మున్సిపల్ కౌన్సిలర్ల వరకు 40 మంది ప్రజాప్రతినిధులను గెలిపించుకు ని బలమైన పార్టీగా నిలిపినట్లు ఆయన తె లిపారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిని, పార్టీ నుంచి బహిష్కరించిన వారిని ప్లీనరీకి హాజరయ్యే పాస్‌లు ఇచ్చి కష్టపడి పని చేసిన వారికి పాస్‌లు ఇవ్వకుండా అవమాన పర్చారని అన్నారు. అలాంటి సందర్భంలోనే ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆనాడే ప్లీనరీ నిండు సభలో పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారని, కనకయ్య పార్టీ వీడటానికి అప్పటి పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కారణమన్నారు. కనకయ్య వెళ్లిన ఏడాది కా లంగా ఇల్లెందు నియోజకవర్గంలో పార్టీ ని కాపాడుకునేందుకు అగ్ర నేతలు ఎం దుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు. రెండు నెలల క్రితం పీసీసీ అధ్యక్షుడు భట్టి, రాంరెడ్డి, వనమా ఇల్లెందు వచ్చినప్పడు మున్సిపల్ చైర్మన్‌ను ఆహ్వానించకుండా, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సభ నిర్వహించటంతో తాము తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలిపారు. తాజాగా మున్సిపల్ కౌన్సిలర్లను, చైర్మన్‌ను సంప్రదించకుండా ఫ్లోర్‌లీడర్ ఎంపిక పత్రం ఇవ్వటం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. అగ్ర నేతల తీరుతో మనస్థాపానికి గురైన తాము త్వరలో కాంగ్రెస్‌కు రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మడత రమా, కౌన్సిలర్లు బొబ్బిలి అజయ్‌కుమార్, బానోత్ రవినాయక్, కమల్‌కోరీ, కొనకంచి పద్మ, స్వర్ణలత, కొప్పుల తిరుపతిరావు, పర్రె శ్రీనివాస్, మన్నాన్, రాంజీ,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.