రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ విలనే
గోరఖ్‌పూర్: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్‌పై బీజేపీ ఎంపీ మహంత్ యోగి ఆదిత్యానాథ్ విరుకుపడ్డారు. సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా ఖేర్ విలన్ అని యోగి విమర్శించారు. 'విలన్ క్యారక్టర్ ఏంటో ప్రతి ఒక్కరికీ తెలుసు. రీల్ లైఫ్‌లో కాదు రియల్ లైఫ్‌లోనూ ఖేర్ విలనే. కోల్‌కతాలో ఖేర్ చేసిన వ్యాఖ్యలపై ఎక్కువ మాట్లాడదలచుకోలేదు' అని యోగి అన్నారు.
కోల్‌కతాలో ఇటీవల జరిగిన అసహనంపై చర్చలో ఖేర్ మాట్లాడుతూ.. 'బీజేపీ ఎంపీలు యోగి, సాధ్వి ప్రాచి అనుచితంగా మాట్లాడుతున్నారు. వారిద్దరినీ బీజేపీ నుంచి బహిష్కరించి జైల్లో వేయాలి' అని అన్నారు. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యానాథ్ ఘాటుగా స్పందించారు.