Maharashtra BJP
-
బీజేపీ ‘మహా’ షో వెనక...
ఐదు నెలల కిందటి ముచ్చట. గత మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీకి తేరుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. 48 సీట్లకు ఆ పార్టీ సారథ్యంలోని అధికార మహాయుతి సంకీర్ణానికి దక్కింది కేవలం 17. అధికారం కోసం పుట్టుకొచి్చన అవకాశవాద కూటమి అంటూ అసలే ఇంటాబయటా విమర్శలు. పైపెచ్చు శివసేన, ఎన్సీపీలను చీల్చిందంటూ బీజేపీకి అంటిన మరక. కాంగ్రెస్ సారథ్యంలోని ఎంవీఏకు ఏకంగా 30 లోక్‌సభ స్థానాలు. ప్రభుత్వ వ్యతిరేకత. రైతులతో పాటు పలు వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నేపథ్యంలో విపక్ష ఎంవీఏ కూటమి జైత్రయాత్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగడం ఖాయమని, అధికార కూటమి పుట్టి మునగడం ఖాయమని జోరుగా విశ్లేషణలు. ఇన్ని ప్రతికూలతలను అధిగమిస్తూ బీజేపీ దుమ్ము రేపింది. దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా మరోసారి రుజువు చేసుకోవడమే గాక అతి కీలకమైన పెద్ద రాష్ట్రంలోపై పూర్తిగా పట్టు సాధించడంలో కూడా కాషాయ పార్టీ విజయవంతమైంది. ఐదంటే ఐదు నెలల్లో మహారాష్ట్ర ప్రజల తీర్పులో ఇంతటి మార్పు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది! ఎందుకంటే లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ సాధించలేక చతికిలపడ్డ బీజేపీ మహారాష్ట్రలో మరీ పేలవ ప్రదర్శనే చేసింది. 28 చోట్ల పోటీ చేసి 9 స్థానాలే గెలిచింది. 2019తో పోలిస్తే ఏకంగా 14 సీట్లు కోల్పోయింది. కాంగ్రెస్, ఉద్ధవ్ శివసేన, శరద్ పవార్ ఎన్సీపీలతో కూడిన మహా వికాస్ అఘాడీ కూటమి మొత్తం 48 లోక్‌సభ స్థానాల్లో ఏకంగా 30 సీట్లు కైవసం చేసుకుంది. అధికారం కోసం శివసేన, ఎన్సీపీలను చీలి్చనందుకు రాష్ట్ర ప్రజలు బీజేపీకి ఇలా గట్టి గుణపాఠం చెప్పారంటూ కాంగ్రెస్ తదితర విపక్షాలన్నీ ఎద్దేవా చేశాయి. ఈ నేపథ్యంలో తాజా అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. సంకీర్ణ భాగస్వాములైన షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీలతో కలసికట్టుగా తిరుగులేని ప్రదర్శన చేసి తీరాల్సిన అనివార్యతను పార్టీ ఎదుర్కొంది. కనీవినీ ఎరగనంతటి ఘనవిజయంతో ఈ కఠిన పరీక్షలో నెగ్గిన తీరు పరిశీలకులనే అబ్బురపరుస్తోంది. తరచి చూస్తే మహాయుతి సాధించిన అద్భుత ఫలితాలకు దోహదపడ్డ కారణాలెన్నో... మహిళల ఓట్లు లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో వచ్చిన వ్యతిరేక ఫలితాలకు కారణాలను బీజేపీ విశ్లేíÙంచుకుని సకాలంలో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కూటమి పక్షాలను కలుపుకుని పోతూనే ఎక్కడికక్కడ స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించింది. లోక్‌సభ ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకున్నామని, వాటిని తూచా తప్పకుండా అమలు చేయడమే ఇంతటి విజయానికి కారణమని ఎన్సీపీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి. ఎప్పట్లాగే ఈసారి కూడా రాష్ట్రంలో మహిళల ఓటింగ్ శాతం హెచ్చుగా నమోదైంది. దాంతో మహిళలకు, వారి సంక్షేమానికి సంబంధించిన అంశాలకు కూటమి బాగా ప్రాధాన్యమిచి్చంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనకబడ్డ వర్గాల్లోని 18–60 ఏళ్ల మధ్య వయసు మహిళలకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం అందిస్తూ ఇటీవలి బడ్జెట్లో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి మఝీ లడ్కీ బెహన్ పథకం సూపర్‌హిట్‌గా నిలిచింది. దీనితో ఏకంగా 2.35 కోట్ల మందికి లబ్ధి కలిగింది. నాటినుంచే వాతావరణం బీజేపీ కూటమికి అనుకూలంగా మారడం మొదలైంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఘనవిజయానికి ప్రధాన కారణమైన ఈ పథకం మహారాష్ట్రలోనూ పని చేసింది. ఈసారి గెలిస్తే ఆ మొత్తాన్ని రూ.2,100కు పెంచుతామని ప్రకటించడం అధికార కూటమికి మరింత కలిసొచ్చింది. తామొస్తే మహిళలకు నెలకు ఏకంగా రూ.3,000 ఇస్తామన్న ఎంవీఏ ప్రకటనను ప్రజలు పెద్దగా నమ్మలేదు. కర్నాటక వంటి రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం వంటి ఎన్నికల హామీలకు కాంగ్రెస్ కత్తెర వేయనుందన్న వార్తలు కూడా ఇందుకు కొంతవరకు కారణమని చెబుతున్నారు. లోక్‌సభతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఏకంగా 70 లక్షల ఓట్లు అదనంగా పోలయ్యాయి. వీటిలో 43 లక్షలు మహిళల ఓట్లే! వాటిలో అత్యధిక ఓట్లు మహాయుతికే పడ్డట్టు స్పష్టమవుతోంది. నిలబెట్టిన నినాదాలుహిందూత్వ భావజాలంతో కూడిన దూకుడైన నినాదాలు ఈ ఎన్నికల్లో ఓట్లరపై గట్టిగా ప్రభావం చూపాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘కటేంగే తో బటేంగే’, మోదీ ఇచి్చన ‘ఏక్ హై తో సేఫ్ హై’నినాదాలు రాష్ట్రమంతటా మార్మోగాయి. ముస్లిం ఓటర్లు ఎంవీఏ వైపు సంఘటితం అవుతున్నారన్న సంకేతాలతో ప్రచారం చివరి దశలో ఈ నినాదాల జోరును బీజేపీ మరింత పెంచింది. బీజేపీ ‘ఓట్ జిహాద్’కు పాల్పడుతోందంటూ విపక్షాలు దుయ్యబడితే ఆ విమర్శలను కూడా తమకు అనుకూలంగా మలచుకుంది. వాటికి కౌంటర్‌గా రాష్ట్ర బీజేపీ అగ్ర నేత, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇచ్చిన ‘ఓట్ల ధర్మయుద్ధం’వంటి నినాదాలు కూడా గట్టిగానే పేలాయి. ఓటు బదిలీ – పోల్ మేనేజ్మెంట్గ్రామ, బూత్ స్థాయి దాకా బీజేపీ కూటమి ఎక్కడికక్కడ సమర్థంగా పోల్ మేనేజ్మెంట్ నిర్వహించింది. దీనికి తోడు మహాయుతి కూటమి పారీ్టల మధ్య ఓట్ల బదిలీ విజయవంతంగా జరిగింది. ఎంవీఏ కూటమి పారీ్టలు ఈ విషయంలో దారుణంగా విఫలమయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో బాగా కలిసొచి్చన కులగణన కార్డు ఈసారి అంతగా పని చేయకపోవడానికి మహాయుతి పార్టీల మధ్య జరిగిన ఓట్ల బదిలీ ప్రధాన కారణంగా నిలిచింది. హిందూత్వ – ఆరెస్సెస్ దన్ను సర్వం మోదీమయంగా వ్యవహరిస్తున్న బీజేపీ తీరుపై దాని మాతృ సంస్థ ఆరెస్సెస్ తీవ్ర అసంతృప్తితో ఉందని, అందుకే లోక్‌సభ ఎన్నికల్లో పారీ్టతో అంటీముట్టనట్టుగా వ్యవహరించిందని వార్తలు రావడం తెలిసిందే. యూపీ వంటి కీలక రాష్ట్రాల్లో ఇది బీజేపీకి చాలా నష్టం చేసింది. మహారాష్ట్రలో అలా జరగకుండా పార్టీ ముందునుంచే జాగ్రత్త పడింది. దానికి తోడు ఈ ఎన్నికలను రాష్ట్రంలో బీజేపీకి చావో రేవో తరహా పోరాటంగా భావించి ఆరెస్సెస్ కూడా అన్నివిధాలా దన్నుగా నిలిచింది. రెండూ కలిసి హిందూత్వ భావజాలాన్ని రాష్ట్రంలో మూలమూలలకూ తీసుకెళ్లాయి. ఇందుకు సోషల్ మీడియాను కూడా విస్తృతంగా ఉపయోగించుకున్నాయి. ఈ విజయం తాలూకు ఘనతలో సింహభాగం ఆరెస్సెస్ కార్యకర్తలదేనన్న సీనియర్ జర్నలిస్టు ప్రకాశ్ అకోల్కర్ వ్యాఖ్యలే ఆ సంస్థ పోషించిన పాత్రకు నిదర్శనం. -
ఎన్నికల ప్రచారంలో నటుడు గోవిందాకు అస్వస్థత
ముంబయి: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నటుడు గోవిందా అస్వస్థతకు గురయ్యాయి. జల్గావ్లోని ముక్తైనగర్, బోద్వాడ్, పచోరా, చోప్రాలలో మహాయుతి అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం పచోరాలో రోడ్ షో నిర్వహిస్తుండగా గోవిందా ఛాతీ నొప్పితో బాధపడ్డారు. వెంటనే ఇతర నేతలు గోవిందాను ఆస్పత్రికి తరలించారు.మహాయుతిలోని శివసేన (షిండే వర్గం) నేత గోవిందా పచోరాలో రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో అనారోగ్యం పాలవడంతో మధ్యలోనే ప్రచార కార్యక్రమాన్ని నిలిపివేశారు. ఈ రోడ్ షోలో గోవిందా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మద్దతు ఇవ్వాలని, బీజేపీ, శివసేన, ఎన్సీపీతో కూడిన అధికార కూటమికి ఓటు వేయాలని ప్రజలను కోరారు.ఇటీవల ముంబైలోని తన ఇంట్లో ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడం వల్ల గోవిందా కాలికి గాయమైంది. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గోవిందా త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. నాడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత గోవింద తొలుత వీల్ చైర్ లో కనిపించారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థనను చేసిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.నవంబర్ 20న మహారాష్ట్రలోని అన్ని స్థానాలకు ఓటింగ్ జరిగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న నిర్వహించనున్నారు. నవంబర్ 18తో ఎన్నికల ప్రచారం ముగియకముందే అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో తమ సత్తా చాటాయి. ఈ క్రమంలో గోవిందా శివసేన, మహాయుతిల ప్రచారానికి వెళ్లారు. గోవిందా పాల్గొన్న రోడ్ షోను తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.ఇది కూడా చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్ -
ఎంపీగా పోటీచేయనున్న ప్రముఖ హీరోయిన్
ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంపై నిత్యం చర్చలు జరుగుతున్నాయి. ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈలోగా, మహారాష్ట్రలోని ముంబై లోక్‌సభ నియోజకవర్గంలో మాధురీ దీక్షిత్ బ్యానర్లు వెలిశాయి. బీజేపీ ప్రస్తుత ఎంపీ పూనమ్ మహాజన్ స్థానంలో వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మాధురీ దీక్షిత్ రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు చాలా రోజుల నుంచే వినిపిస్తున్నాయి. ఈ పుకార్లకు బలం చేకూర్చేందుకు బీజేపీ సీనియర్ నేతలతో ఆమె టచ్‌లో ఉంది. కొద్ది రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముంబైలోని మాధురీ దీక్షిత్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు సంబంధించిన బుక్‌లెట్‌ను నటికి షా బహుమతిగా ఇచ్చారు. దీని తర్వాత మాధురీ దీక్షిత్ బీజేపీలో చేరుతారనే చర్చకు మరింత బలం చేకూరింది. కాబట్టి ఆమె ఎన్నికల రంగంలోకి దిగే అవకాశం దాదాపు ఖాయం అయినట్లే. ఈ విషయంపై ఇప్పటి వరకు మాధురి ఎలాంటి స్పందనా ఇవ్వలేదు. ఉత్తర మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గాన్ని దివంగత బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ కుమార్తె పూనమ్ మహాజన్ పాలిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి 2014, 2019లో వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. ప్రస్తుతం సాయిబాబ వార్షిక ఉత్సవాల సందర్భంగా ఈ ప్రాంతమంతా నటి మాధురీ దీక్షిత్ బ్యానర్లు వెలిశాయి. ఇందులో విశేషమేమిటంటే.. అక్కడ మాధురీ దీక్షిత్ బ్యానర్ లేదా ఫ్లెక్స్ బహిరంగంగా పెట్టడం ఇదే తొలిసారి. ముంబైలోని మొత్తం 6 లోక్‌సభ నియోజకవర్గాల్లో నార్త్-ముంబై, నార్త్ సెంట్రల్ ముంబైలు బీజేపీకి అత్యంత బలమైన రెండు నియోజకవర్గాలు. వీటిలో పూనమ్ మహాజన్ నియోజకవర్గం నార్త్ సెంట్రల్ ముంబై. ఈ నియోజకవర్గంలో మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ మొత్తం లోక్‌సభ నియోజకవర్గం ఎక్కువగా బీజేపీ, షిండే గ్రూపు ఆధిపత్యంలో ఉంది. పూనమ్ మహాజన్ ఈ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. కాబట్టి ఈ నియోజకవర్గం ప్రస్తుతం బీజేపీకి అనుకూలమైనదిగా చెప్పవచ్చు. లోక్‌సభ ఎన్నికల్లో నటి మాధురీ దీక్షిత్ బీజేపీ నుంచి ముంబైలో పోటీ చేస్తారని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని నటి మాత్రమే కాదు బీజేపీ పార్టీ కూడా ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర బావాంకులే మాట్లాడినా ఇంతవరకు దీనిపై ఎలాంటి ప్రతిపాదన జరగలేదని ఆయన చెప్పారు. ఈ విషయంలో పార్టీ నేతల నిర్ణయమే అంతిమమని ఆయన అన్నారు. నటి మాధురీ దీక్షిత్‌కు సంబంధించిన ఆ బ్యానర్స్‌తో బీజేపీ ఎన్నికలతో ఎటువంటి సంబంధం లేదని అక్కడి నేతలు కొందరు చెప్పుకొస్తున్నారు. మోదీ ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రముఖులకు, వ్యాపారులకు, సినీ పరిశ్రమకు చెందిన వారికి చేరవేసే పని కొన్ని నెలలుగా అక్కడి పార్టీలో సాగుతోంది. దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. నటి మాధురీ దీక్షిత్ ఇంటికి వెళ్లారు. అయితే మాధురీ దీక్షిత్ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా? ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీజేపీ వర్గాలు తెలిపాయి. -
Eknath Shinde-బీజేపీ మీరనుకుంటున్నట్టు కాదు: సీఎం షిండే
సాక్షి, ముంబై: బీజేపీ తనకు ఎందుకు మద్దతుగా నిలిచిందో చెప్పారు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే. ఆ పార్టీకి అధికారం మాత్రమే కాదు సిద్ధాంతం కూడా ముఖ్యమనేందుకు తమ ప్రభుత్వమే నిదర్శనమన్నారు. ఎమ్మెల్యేలు హిందుత్వానికే కట్టుబడి ఉండి తిరుగుబాటు చేయడం వల్లే ఉద్ధవ్ థాక్రే సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని వివరించారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ హయాంలో శివసేన ఎమ్మెల్యేలకు పనులు పూర్తి చేయడానికి కష్టంగా ఉండేదని షిండే పేర్కొన్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్ మాత్రం అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్షేత్రస్థాయిలో బలపడాలని చూశాయని ఆరోపించారు. బీజేపీపై ఆ అపోహ నిజం కాదు అధికారం కోసం బీజేపీ ఎమైనా చేస్తుందనే అపోహ ప్రజల్లో ఉందని, కాని అది నిజం కాదని షిండే అన్నారు. 50 మంది ఎమ్మెల్యేలు హిందుత్వానికి, సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నందుకే ఆ పార్టీ తమకు మద్దతుగా నిలిచిందని చెప్పారు. హిందుత్వం, అభివృద్ధే తమ ఉమ్మడి ఎజెండా అని, అందుకే బీజేపీకి తమకంటే చాలా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. సీఎం పదవి తనకిచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించిందని షిండే తెలిపారు. మహారాష్ట్రను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని ప్రధాని మోదీ తనకు సూచించారని షిండే ఈ సందర్బంగా చెప్పుకొచ్చారు. కేంద్రం నుంచి అన్నివిధాలుగా సహకారం ఉంటుందని బీజేపీ పెద్దలు హామీ ఇచ్చారని చెప్పారు. 200 స్థానాల్లో గెలుస్తారా? తాము చట్టవిరుద్ధంగా ఏమీ అధికారాన్ని చేపట్టలేదని షిండే అన్నారు. ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసే పోటీచేశాయని, తాము దానికే కట్టుబడి ఉన్నామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి 200 స్థానాల్లో గెలుస్తారా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ఇప్పటికే తమ కుటమిలో 170 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఇంకో 30 స్థానాలే గెలవాల్సి ఉందని చెప్పారు. దేవేంద్ర ఫడ్నవీస్ ఎంతో పెద్ద మనసు చేసుకుని తనకు సీఎం పదవి ఇచ్చి, ఆయన డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నారని షిండే అన్నారు. -
‘బాలీవుడ్‌ను ఎవరూ తరలించలేరు’
ముంబై: బాలీవుడ్‌ని ఎవరూ కూడా ముంబై నుంచి దూరం చేయలేరని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడతూ..ఫిల్మ్ సిటీ, సినీ పరిశ్రమకు అందించే సౌకర్యాలను అధ్యయనం చేయడానికి యోగీ ఇక్కడకు రావచ్చని, ప్రతి బీజేపీ నాయకుడుకి రాష్ట్రాన్ని, సినీ పరిశ్రమను అభివృద్ధి చేసే, సౌకర్యాలు కల్పించే హక్కు ఉందని అన్నారు. కొన్ని నివేదికల ప్రకారం మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సచిన్ సావంత్ బాలీవుడ్‌ను ముంబై నుంచి బయటకు తరలించడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ముంబై రానున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ పర్యటనలో యోగీ బాలీవుడ్ ప్రముఖులతో పాటు అక్కడి పారిశ్రామివేత్తలను కలవనున్నారు. (చదవండి: చట్టసభలోకి బాలీవుడ్ బ్యూటీ.!) -
అమ్మవారి ఆలయానికి అడ్డంకులే లేవిక
భైంసా(ముథోల్): చదువుల తల్లి సరస్వతీ క్షేత్రానికి మహారాష్ట్ర నుంచి భక్తులు అధికంగా వస్తారు. సరిహద్దు ప్రాంతంలో ఉన్న బాసరలో కొలువైన అమ్మవారిని దర్శించుకునేందుకు రైలుమార్గం ద్వారా చేరుకుంటున్నారు. అయితే మహారాష్ట్ర నుంచి నేరుగా బాసర వచ్చేలా రోడ్డు నిర్మించాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి గతంలోనే సూచించింది. తాజాగా ఈ ప్రతిపాదనను మరోమారు కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. మహారాష్ట్ర బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ భాస్కర్‌రావుపాటిల్ ఖథ్గాంకర్ ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న నితిన్‌గడ్కరి సైతం మహారాష్ట్రవాసి కావడంతో ఈ రోడ్డు నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకరించారు. కొత్త మార్గం 100 కిలోమీటర్ల రహదారిని రూ.50 కోట్లతో నిర్మించనున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి బాసర వరకు ఈ రోడ్డు నిర్మాణం జరుగనుంది. రాకపోకలకు ఇబ్బందులు... ప్రస్తుతం మహారాష్ట్రవాసులకు బాసర రావడానికి రోడ్డు మార్గం గుండా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నాందేడ్ నుంచి నర్సి, నయాగావ్, బిలోలి, కొండల్వాడి, ధర్మాబాద్ మీదుగా మన ప్రాంతంలోని బిద్రెల్లిగుండా బాసరకు రావాల్సి వస్తుంది. ఇలా బాసర క్షేత్రం చేరుకోవాలంటే నాందేడ్ నుంచి బాసర వరకు 130 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇక నాందేడ్ నుంచి భైంసా మీదుగా రావాలంటే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మూడేళ్లుగా ఈ రోడ్డు నిర్మాణంలోనే ఉంది. కార్లు, ఇన్నోవాలు మోకాళ్లలోతు గుంతలో పడి మరమ్మతు చేయించలేక ఈ మార్గాన్ని మరిచిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్రవాసులు బాసరకు వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాందేడ్ నుంచి భైంసా మీదుగా బాసర వెళ్లాలన్న 120 కిలోమీటర్లు ప్రయాణించాలి. అలా కాకుండా నాందేడ్ నుంచి నేరుగా కొత్తగా ప్రతిపాదనలు చేసిన రోడ్డుతో 100 కిలోమీటర్లు ప్రయాణించి అమ్మవారి క్షేత్రానికి చేరుకోవచ్చు. రూ.50 కోట్లతో... రూ.50 కోట్లతో సీఆర్ఎఫ్ నిధుల కింద ఈ రోడ్డును పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ అందింది. బాసర మీదుగా మహారాష్ట్రలోని నయాగావ్, బెల్లూర్, సిరస్కోట్పాట, జబ్బల్పూర్, చిం చోలి, బెల్లూర్పాట, బాలాపూర్పాట, రాంపూర్, ధర్మాబాద్, రత్నాలి, అత్కూర్పాట, బాబ్లీపాట, మంగ్నాలి, పాటోద, రోశన్గావ్, చిక్నాపాట, సా యిఖేడ్, బోల్సాపాట, బేల్గుజిరి, హరేగావ్, పిప్పల్‌గావ్, కారేగావ్పాట, కావల్గూడ, శింగాన్ పూర్, హర్స, బీజేగావ్, తొండాల, మహాటీ, ఖండ్ గావ్, హత్నిపాట, బాలేగావ్పాట, బాలేగావ్, ఇజ్జత్గావ్, మనూర్, బాయేగావ్, బోల్సాపాట, హంగిర్గ, టాక్లి, దారేగావ్తాండపాట, దారేగావ్, మాల్కౌట, పిప్పల్‌గావ్, శికాలతండా, అమ్దూ ర, మోగడ్, గాతసాహెబ్, శంకతీర్త్గాడేగావ్, మాల్టేక్డి, నాందేడ్ వరకు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. ఇదివరకే సర్వే... నాందేడ్ ఎంపీగా పనిచేస్తున్న సమయంలోనే భాస్కర్‌రావుపాటిల్ ఖథ్‌గావ్‌కర్ పలుమార్లు బాసర సరస్వతీ అమ్మవారి దర్శనానికి వచ్చారు. దర్శనం చేసుకున్నాక తన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఈ గ్రామాలగుండా రోడ్డు నిర్మించాలన్న ఆలోచనకు వచ్చారు. అప్పట్లోనే మహారాష్ట్ర ప్రాంతంలోని ఇంజినీర్ల బృందంతో సర్వేలు సైతం చేయించారు. ఈ గ్రామాలగుండా ప్రస్తుతం రోడ్డు ఉంది.పూర్తిస్థాయి రోడ్లు, కల్వర్టులు నిర్మించి అందరికి రాకపోకలకు ఉపయోగపడేలా నవీకరించాలని చాలా మార్లు సూచించారు. బీజేపీ మహారాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న మాజీ ఎంపీ భాస్కర్‌రావుపాటిల్ ఖథ్‌గావ్‌కర్ ఈ రోడ్డు నిర్మాణం చేపడుతామని చెబుతున్నారు. కేంద్రం ఈ నిధులు ఇస్తుందని త్వరలోనే రోడ్డు పూర్తవుతుందని అంటున్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే నాందేడ్ జిల్లాలోని నాందేడ్, ముథ్కేడ్, బిలోలి, నయాగావ్, ధర్మాబాద్, భోకర్ నియోజవకర్గాల పరిధిలోని గ్రామాలవాసులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఎంతో మందికి ఉపయోగపడే ఈ రోడ్డు నిర్మాణం జరిగితే బాసర సరస్వతీ అమ్మవారి క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య పెరగనుంది. మరింత తాకిడి... బాసర సరస్వతీ అమ్మవారి ఆలయం మీదుగా ఈ రోడ్ల నిర్మాణం పూర్తయితే భక్తుల తాకిడి పెరుగనుంది. ఇప్పటికే బాసర మీదుగా బోదన్, నర్సాపూర్, హైదరాబాద్ వరకు జాతీయ రహాదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇదే సమయంలో మహారాష్ట్ర వైపు నుంచి సైతం మరో రహదారి నిర్మాణానికి కేంద్రం ముందు ప్రతిపాదనలు ఉన్నాయి. మహారాష్ట్రలోని ఎన్నో గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడడంతో పాటు బాసర వరకు వచ్చే వీలున్న కారణంతో ఈ రోడ్డు నిర్మాణం త్వరలోనే జరుగనుంది. పైగా మహారాష్ట్రలోనూ కేంద్రంలోనూ బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఈ రోడ్డు నిర్మాణం ఇక త్వరలోనే పూర్తవుతుందని ఈ ప్రాంతవాసులు సైతం ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. -
సీట్ల కోసం కొట్లాట వద్దు
సాక్షి, ముంబై: రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ వాతావరణం బాగుందని,అంతా కలిసికట్టుగా పోటీచేసి అధికారం తెచ్చుకుందామని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అనవసరంగా సీట్ల కోసం పోట్లాడడం ఎందుకన్నారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ బీజేపీకి 135 స్థానాలిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీజేపీ, శివసేన కూటమిని అప్పట్లో వాజ్‌పేయి, అద్వానీ, శివసేన దివంగత అధిపతి బాల్‌ఠాక్రే ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ‘25 సంవత్సరాలుగా ఈ కూటమి చెక్కు చెదరకుండా కొనసాగుతోంది. ఇక ముందు కూడా ఇలాగే కొనసాగుతుంది’ అని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఇకమీదట ఆచితూచి మాట్లాడతానన్నారు. మోడీపై వ్యాఖ్యలను సహించబోమని బీజేపీ నేత మాధవ్ భండారీ పేర్కొనడంపై స్పందిస్తూ ఆయన అంటే తనకు ఎంతో గౌరవమన్నారు. అందువల్ల ఈ అంశంపై ఏమీ మాట్లాడదల్చుకోలేదన్నారు. బీజేపీని తానేనాడూ నిర్లక్ష్యం చేయలేదన్నారు. పొత్తు గురించి ప్రశ్నించగా ప్రతి సమస్యకు ఏదో ఒక ప్రత్యామ్నాయ మార్గం ఉంటుందన్నారు. రెండు రోజుల్లో పొత్తు విషయం ఓ కొలిక్కి వస్తుందన్నారు. తమ వల్లనే మోడీ లాభపడ్డారని తానేనాడూ అనలేదన్నారు. దేశ పరిస్థితులపైనే మాట్లాడానన్నారు.