mahesh naidu
-
ఎస్పీని కలిసిన వైఎస్ వివేకా
► మహేష్నాయుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ కడప అర్బన్: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి శుక్రవారం ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణను కలిసి రెండు సమస్యలపై చర్చించారు. సుండుపల్లె మండలం ఎంపీపీ అజంతమ్మ ఇంటిని రాత్రికి రాత్రే ఎర్రచందనం స్మగ్లర్, టీడీపీ నాయకుడు మహేష్‌నాయుడు, మరికొంతమంది దౌర్జన్యంగా కూల్చివేశారు. సదరు నిందితులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్లు ఆయన విలేకరులకు తెలిపారు. ఆర్సీపీ నేతల సమస్యపై: ఆర్సీపీ నేతలు నిమ్మకాయల రవిశంకర్‌రెడ్డితోపాటు 11 మందిపై తాలూకా పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం రౌడీషీట్లను ఓపెన్ చేశారు. ఈ సమస్యపై అఖిలపక్ష నేతలు ఎస్పీని కలిసేందుకు వచ్చిన సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి ఎస్పీ బంగ్లాకు వచ్చారు. ఆ సమయంలో ఆర్సీపీ నేతలు వైఎస్ వివేకానందరెడ్డికి తాము ఎదుర్కొంటున్న సమస్య గురించి వివరించారు. స్పందించిన వైఎస్ వివేకా స్పందించి ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. రౌడీషీట్లు ఆర్సీపీ నేతల ప్రవర్తనను బట్టి భవిష్యత్తులో తొలగిస్తామని, సమస్యను పరిశీలిస్తామని ఎస్పీ తెలిపారని వైఎస్ వివేకా వెల్లడించారు. -
ఎర్రదొంగలకు ‘పచ్చ’ తివాచీ!
పీడీ యాక్టు నిందితుడికి జెడ్పీటీసీ టికెట్ ఎంపీపీ బరిలో నిలిచిన మరో బడా స్మగ్లర్ కుటుంబం ఎన్నికల్లో టీడీపీలో క్రియాశీల పాత్ర పోషించిన మరికొందరు నేరచరితులు తాజాగా టీడీపీ నేత బుల్లెట్ సురేష్ అరెస్ట్ రాజమండ్రి జైలులో రెడ్డినారాయణ, మహేష్‌నాయుడు సాక్షి ప్రతినిధి, కడప/చిత్తూరు నూతన ఆంధ్రప్రదేశ్‌లో నేరగాళ్లకు స్థానంలేకుండా చేస్తామంటూ హూంకరిస్తున్న ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చేతల్లో వారితోనే అంటకాగుతున్నారని తెలుస్తోంది. శేషాచలం అడవుల్లోని విలువైన ఎర్రచందనాన్ని దోచుకుంటున్న స్మగ్లర్లకు పార్టీ టికెట్లిచ్చి పోటీ చేయించడమే ఇందుకు నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన రెడ్డినారాయణ, మహేష్‌నాయుడు రాయలసీమలో ఎర్రచందనం స్మగ్లర్లుగా పేరుమోశారు. వారిపై వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో అనేక స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి. వైఎస్సార్ జిల్లా యంత్రాంగం 2010లో పీడీయాక్టు కూడా ప్రయోగించింది. అనంతరం కూడా వారు స్మగ్లింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తూనే వచ్చారు. వారే 2012లో రాయచోటి, రాజంపేట ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం విశేషంగా కృషి చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన మరో ఎర్రచందనం స్మగ్లర్ బుల్లెట్ సురేష్‌పై 20 కేసులు ఉన్నాయి. పది రోజుల కిందట సురేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేసినట్లు చూపించారు. ఆయన 2014 ఎన్నికల్లో చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభ విజయానికి తీవ్రంగా కృషి చేయడం గమనార్హం. వెన్నుతట్టి ఎన్నికల్లో ప్రోత్సాహం ఎర్రచందనం స్మగ్లర్లుగా గుర్తింపుబడ్డా, పీడీ యాక్టులో జైలు కెళ్లినా పర్వాలేదు... ఎన్నికల్లో పోటీ చేసి గెలవండంటూ వైఎస్సార్ జిల్లా సంబేపల్లె జెడ్పీటీసీ స్థానాన్ని రెడ్డినారాయణకు టీడీపీ కేటాయించింది. ఆ ఎన్నికల్లో ఆయన పోటీచేసి ఓడిపోయారు. మహేష్నాయుడి కుటుంబానికి సుండుపల్లె ఎంపీపీ పదవి కేటాయిస్తూ, ఆయన తల్లికి రెడ్డివారిపల్లె ఎంపీటీసీ టికెట్ అప్పగించారు. ఆమె గెలిచినప్పటికీ ఎంపీపీ పదవి మాత్రం దక్కలేదు. రెడ్డినారాయణ, మహేష్‌నాయుడు ఇరువురూ ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఉన్న ఎర్రచందనం కేసుల కారణంగా పీడీయాక్టులో రాజమండ్రి జైల్లో ఉన్నారు. వీరికే కాకుండా సుండుపల్లెలో మరో ఎర్రచందనం స్మగ్లర్ పటాల రమణ సోదరుడు వీరమల్లనాయుడుకు జెడ్పీటీసీ టికెట్ ఇచ్చారు. పటాల రమణపై పలు ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లె టీడీపీ ఎంపీటీసీగా గెలుపొందిన సుబ్బానాయుడుపై సైతం కేసులున్నాయి. మైదుకూరు మండలంలో బడా స్మగ్లర్ శ్రీని వాసులనాయుడు సైతం టీడీపీలో క్రియాశీల భూమిక పోషించేవారు. ప్రస్తుతం పీడీ యాక్టులో రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఆయన సోదరుడు వెంకటసుబ్బయ్య స్మగ్లర్‌గా రికార్డులకు ఎక్కారు. టీడీపీ మైదుకూరు ఇన్చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ ముఖ్య అనుచరుడు చినమల నరసింహులు యాదవ్ ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఉన్నారు. వీరంతా ఎన్నికల్లో టీడీపీ తరఫున చురుకైన పాత్ర పోషించారు. ఎర్రదొంగల్లో తెలుగు తమ్ముళ్లే అధికం అధికార పార్టీ నేతల అండదండలతో ఎర్రచందనం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. మొత్తం 198మంది ఎర్రదొంగలున్నట్లు గుర్తించిన పోలీసులు ఇప్పటివరకూ 110మందికిపైగా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువమంది టీడీపీ నేతలే ఉండటం గమనార్హం. అరెస్టు కాకుండా తప్పించుకు తిరుగుతున్న వారిలో చిత్తూరు జిల్లా టీడీపీ ప్రచార కార్యదర్శి వసంత్, మధుతో పాటు మరికొందరు సీనియర్ నేతలు ఉన్నారు. వీరిలో కొందరిపై ఇదివరకే పీడీ యాక్టు నమోదు చేశారు. ఇప్పుడు వారిపై పీడీ యాక్టు తొలగించడంతో పాటు, మిగిలిన దొంగలపై పీడీ యాక్టు నమోదు కాకుండా పోలీసులపై ఒత్తిడి తెచ్చేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఎర్రదొంగల అక్రమ సంపాదనలో వాటాలు ఉండటంతో వారిని రక్షించడం టీడీపీ కీలక నేతలకు అనివార్యంగా మారిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇతని పేరు బుల్లెట్ సురేష్. చిత్తూరు టీడీపీ నేత. ‘ఎర్ర’చందనం స్మగ్లింగ్‌లో ఆరితేరిన వ్యక్తి. 20 కేసులు ఉన్నాయి. చిత్తూరు టూటూన్ పోలీసు స్టేషన్లో రౌడీషీట్ కూడా ఉంది. 2014 ఎన్నికల్లో చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభ విజయానికి తీవ్రంగా కృషి చేశారు. చిత్తూరు తాలూకా, టూటౌన్, భాకరాపేట, యాదమరి, చిత్తూరుతో పాటు పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇతడు రెడ్డి నారాయణ. వైఎస్సార్ జిల్లా సంబేపల్లె మండలం గుట్టపల్లె వాసి. ఇతడు కూడా రాయచోటి నియోజకవర్గం టీడీపీలో కీలక నేత. ఆ పార్టీ కీలక నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఇతనిపై పీడీ యాక్టు కూడా నమోదైంది. రాయచోటి, పీలేరు, గంగవరం, కేవీపల్లె, వీరబల్లితో పాటు పలు స్టేషన్లలో పలు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి. ఇతని పేరు మహేష్ నాయుడు. వైఎస్సార్ జిల్లా సుండుపల్లె మండలం చప్పిడివాండ్లపల్లె. మహేష్ తల్లి శ్రీదేవి టీడీపీ తరఫున ఎంపీటీసీ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహేష్‌పై రెండుసార్లు పీడీ యాక్టు నమోదైంది. కేవీపల్లె, పీలేరు, కలకడతో పాటు పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ కీలక నేత. -
‘ఎర్ర’ దొంగలకు ఉచ్చు
* ఎర్రచందనం స్మగ్లర్ల జాబితాను సిద్ధం చేసిన పోలీసులు * రెండు జిల్లాలలో 57మంది అరెస్టుకు రంగం సిద్ధం * పోలీసుల అదుపులో టీడీపీ నాయకులు * స్మగ్లర్ల ఆస్తుల జప్తు చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్న పోలీసులు, అటవీ అధికారులు సాక్షి, కడప: ఎర్రచందనం అక్రమ రవాణాపై ఖాకీలు కన్నెర్ర చేశారు. స్మగ్లింగ్ పాల్పడుతున్న వారి జాబితాను సిద్ధం చేసి అరెస్టు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. రాయలసీమ జిల్లాల పోలీసులు మూకుమ్మడి వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే కొందరిని అరెస్టు చేసిన పోలీసులు, జాబితాలోని 57మందిని అరెస్టు చేసేందుకు వలపన్నారు. స్మగ్లర్లందరినీ అరెస్టు చేసి, వారి ఆస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది. ప్రపంచంలో ఎక్కడా లేని అత్యంత అరుదైన, విలువైన ఎర్రచందనం వనాలు రాయలసీమలో ఉన్నాయి. కొన్నేళ్లుగా ‘అడవి దొంగలు’ ఎర్రచందనం వృక్షాలను తెగనరికి విదేశాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వం దీన్ని అడ్డుకోలేకపోతోంది. కొందరు ప్రజా ప్రతినిధులు, రాజకీయనాయకుల కనుసన్నల్లో వారి అనుచరుల ద్వారా ఈ అక్రమ రవాణా సాగుతోంది. దీనికి అటవీ, పోలీసు అధికారులు కూడా పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో భారీగా ఎర్రచందనం సరిహద్దులు దాటింది. ఈ రెండు నెలల్లో అధికారుల తనిఖీల్లో పట్టుబడిన దుంగల విలువే దాదాపు రూ. 78 కోట్లు ఉంటుంది. ఇక తరలిపోయిన దుంగల విలువ రూ. 500 కోట్ల పైనే ఉంటుందని నిఘా వర్గాలు అంచనా. ఈక్రమంలో ఎర్రచందనం అక్రమరవాణాపై గవర్నర్ నరసింహన్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే అధికారులు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు నడుం బిగించారు. 57మంది స్మగ్లర్లు... ‘సీమ’లోని నాలుగు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా సాగేది చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలోనే అధికం. కర్నూలు, అనంతపురంతో పాటు ప్రకాశం జిల్లాలో కూడా అప్పుడప్పుడు రవాణా సాగుతుంది. దీంతో చిత్తూరు, కడప పోలీసులు 57మంది స్మగ్లర్లతో ఓ జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వీరితో వైఎస్సార్ జిల్లాకు సంబంధించి 26మంది, చిత్తూరు జిల్లాలో 31మంది ఉన్నట్లు పోలీసువర్గాలు తెలిపాయి. వీరిలో వైఎస్సార్ జిల్లాలో 21మంది, చిత్తూరు పరిధిలో ఆరుగురిపై పీడీ యాక్టు నమోదైంది. తిరుపతి పరిధిలో కూడా దాదాపు పదిమందికి పైగానే పీడీ యాక్టు నమోదైనట్లు తెలుస్తోంది. వీరితో పాటు మరికొందరు పేరుమోసిన స్మగ్లర్ల పేర్లను జాబితాలో చేర్చారు. ఈ జాబితాను స్మగ్లింగ్ కార్యకలాపాలు ముమ్మరంగా ఉన్న ప్రాంతాల్లోని సీఐలతో పాటు రాయలసీమలోని డీఎస్పీలకు అందజేసినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలోని వారు ఏ జిల్లా పరిధిలో దొరికితే అక్కడే అరెస్టు చేస్తున్నారు. పోలీసుల అదుపులో టీడీపీ నాయకులు ఈ ఆపరేషన్‌లో వైఎస్సార్ జిల్లాకు చెందిన స్మగ్లర్లు రెడ్డినారాయణ, మహేశ్ నాయుడులను కర్నూలు పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల్లో తెలుగుదేశంపార్టీ తరఫున చురుగ్గా పనిచేస్తున్నారు. రెడ్డినారాయణ స్వగ్రామం సంబేపల్లి మండలం గుట్టపల్లి. మహేశ్ నాయుడుది సుండుపల్లి మండలం చప్పిడివాండ్లపల్లి. మహేశ్ నాయుడు తల్లి శ్రీదేవి చప్పిడివాండ్లపల్లి ఎంపీటీసీగా టీడీపీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిద్దరూ సుండుపల్లెలోనూ ఉంటూ అక్రమ రవాణా సాగిస్తున్నారు. వీరితో పాటు వైఎస్సార్‌జిల్లా రైల్వేకోడూరుకు చెందిన కొందరి స్మగ్లర్లను కూడా కడప పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఆస్తుల జప్తుకు సిఫార్సు పోలీసులు అదుపులోకి తీసుకున్న దొంగలను పూర్తిస్థాయిలో విచారించి, వారికి సంబంధించిన ఆస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నారు. సుదీర్ఘంగా జైలు శిక్ష పడేలా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. రెండు జిల్లాలకు సంబంధించి ఇప్పటి వరకూ 18 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇదే విషయమై తిరుపతి టాస్క్ఫోర్సు పోలీసులను ‘సాక్షి’ సంప్రదిస్తే జాబితాను సిద్ధం చేశామని, కొందరిని అరెస్టు చేశామని చెప్పారు. ఆస్తుల జప్తునకు ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు చెప్పారు. జాబితాను పంపాం... కొందరిని అరెస్టు చేశాం జీవీజీ అశోక్‌కుమార్, ఎస్పీ, వైఎస్సార్‌జిల్లా ఎర్రచందనం స్మగ్లర్లకు సంబంధించి ఓ జాబితాను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపాం. రైల్వేకోడూరుకు సంబంధించిన కొంతమందిని అరెస్టు చేశాం. వారిని విచారిస్తున్నాం. వీలైనంత త్వరలో జాబితాలోని దొంగలందరినీ అరెస్టు చేసి విచారిస్తాం. -
స్మగ్లింగ్‌తో టీడీపీ నేతలకు లింకు