manukota district
-
కేటీఆర్ ఫ్లెక్సీలను చించేసిన గుర్తుతెలియని వ్యక్తులు
-
కలబడ్డవారు.. కలిసిపోయారు
సాక్షి, మహబూబాబాద్: గత ఎన్నికల్లో వారు పోటాపోటీగా బరిలో నిలిచారు. ప్రత్యర్థి ఓటమే లక్ష్యంగా వ్యూహాలు పన్నారు. కాలంగిర్రున తిరిగింది. ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీలో ప్రాధాన్యత దక్కకపోవటం.. ఇతర కారణాలేవైనా ఒక్కసారిగా సమీకరణలు మారిపోయాయి. గత ఎన్నికల్లో ఎవరినైతే ఓడించాలని శతవిధాలా ప్రయత్నించారో ఇప్పుడు వారికే మద్దతుగా నిలిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. వారి గెలుపుకోసం స్వయంగా ప్రచారం చేస్తున్నారు. కత్తులు దూసుకున్నవారే 2014 ఎన్నికల్లో మానుకోట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున మాలోతు కవిత, టీఆర్ఎస్ తరఫున శంకర్‌నాయక్ తలపడ్డారు. డోర్నకల్‌లో కాంగ్రెస్ నుంచి రెడ్యానాయక్, టీఆర్ఎస్ నుంచి సత్యవతి రాథోడ్ పోటీపడ్డారు. మారిన రాజకీయ సమీకరణలతో గెలిచిన రెడ్యానాయక్, ఓడిపోయిన మాలోతు కవిత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అందరూ ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఎడమోహం పెడమోహంలాగా కొనసాగారు. కొన్ని సందర్భాల్లో తీవ్ర విమర్శలు సైతం చేసుకున్నారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ నుంచి టిక్కెట్ కోసం ఇరువురు కూడా తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. కానీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్టింగ్‌లకే సీట్లు ఇచ్చారు. దీంతో వీరు సహాయ నిరాకరణ చేశారు. కేసీఆర్, కేటీఆర్ అసంతృప్తులతో మాట్లాడి పార్టీ గెలుపుకోసం కృషిచేయాలని ఆదేశించారు. దీంతో మాలోత్ కవిత తాజా మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయకు మద్దతుగా, సత్యవతి రాథోడ్ రెడ్యానాయక్ గెలుపుకోసం ప్రచారం చేస్తున్నారు. గెలుపు కోసం ప్రచారం నియోజకవర్గ సమన్వయ సమావేశం ఆపద్ధర్మ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన ఇటీవల నిర్వహించారు. కడియం ప్రయత్నాలు ఫలించకపోవడంతో కేటీఆర్ రంగంలోకి దిగారు. పార్టీని గెలిపించండి భవిష్యత్‌లో మీకు అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. దీంతో అలకవీడిన సత్యవతి, కవిత టీఆర్ఎస్ అభ్యర్థుల గెలపుకోసం నేరుగా ప్రజాక్షేత్రంలోకి దిగారు. నియోజకవర్గవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. -
జిల్లా కార్యాలయాల పనులు ముమ్మరం
తాత్కాలిక భవనాల్లో కలెక్టర్ చాంబర్, గోడల నిర్మాణం మహబూబాబాద్ : మానుకోట జిల్లా కార్యాలయాల పనులు తాత్కాలిక భవనాల్లో ముమ్మరంగా సాగుతున్నాయి. జేసీ, ఇతర అధికారులు తాత్కాలిక భవనాలను ఇప్పటికే ఎంపిక చేశారు. ఈమేరకు వాటిలో అవసరమైన పనులు చేపట్టారు. పట్టణ శివారు ఇందిరానగర్ కాలనీలోని వైటీసీ భవనాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కేటాయించారు. తొర్రూరురోడ్లోని ఐటీఐ భవనాన్ని ఎస్పీ కార్యాలయానికి, వెంకటేశ్వర్లబజార్‌లోని అద్దె భవనాన్ని ఎస్పీ క్యాంపు కార్యాలయానికి అప్పటించారు. ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్స్, జిల్లా కోశాధికారి కార్యాలయంగా సమీకృత సంక్షేమ వసతి సముదాయ భవనాన్ని, ఎంఈఓ కార్యాలయాన్ని డీఈఓ కార్యాలయంగా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంగా, మానుకోటలో నిర్మాణంలో ఉన్న ఏపీడీ కార్యాలయాన్ని డ్వామా డీఆర్డీఏ పీడీ కార్యాలయంగా, సబ్ డీఎఫ్ఓ కార్యాలయాన్ని డీఎఫ్ఓ కార్యాలయంగా, ఎంపీడీఓ కార్యాలయాన్ని జిల్లా పరిషత్ కార్యాలయంగా ఎంపిక చేశారు. ఇరిగేషన్ కార్యాలయంలో ఉన్నతాధికారి కార్యాలయం, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ కార్యాలయాల్లో ఉన్నతాధికారుల కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఏరియా ఆస్పత్రిలో ఒక క్వార్టర్‌ను ఖాళీ చేయించి డీసీహెచ్ఎస్కు కేటాయించారు. కలెక్టర్ చాంబర్ పనులు కలెక్టరేట్ కోసం కేటాయించిన వైటీసీ భవనంలో 24 గదులు ఉన్నాయి. ఈ భవనంలో పనులు వేగంగా సాగుతున్నాయి. కింద ఉన్న రెండు గదులను కలెక్టర్ చాంబర్, దాని పక్కనున్న రెండు గదులను జేసీ చాంబర్‌గా నిర్ణయించి అవసరమైన గోడలు నిర్మిస్తున్నారు. దాని వెనుకనున్న రెండు గదుల్లో డీఆర్ఓ కార్యాలయం, మరో గదిని ఏఓ కార్యాలయానికి కేటాయించి పనులను వేగంగా చేస్తున్నారు. ఆ కార్యాలయానికి రోడ్డు పనులను కూడా చేపట్టారు. సోమవారం ఆ పనులను జేసీ పరిశీలించి ఏర్పాట్లపై ఆర్డీఓ జి.భాస్కర్‌రావుకు, ఆర్అండ్బీ ఈఈ పుల్లాదాస్కు పలు సూచనలు ఇచ్చారు. ఇతర భవనాల్లో... ఏరియా ఆస్పత్రిలో ఒక క్వార్టర్స్‌ను ఖాళీ చేయించి శుభ్రం చేశారు. ఫర్నీచర్ సమకూర్చుతున్నారు. మానుకోటలో ఏపీడీ కార్యాలయం భవన నిర్మాణంలో ఉండగా అదే భవనాన్ని డ్వామా, డీఆర్డీఏ పీడీ కార్యాలయంగా కేటాయించి నిర్మాణ పనులను వేగవంతం చేశారు. ఎంఈఓ కార్యాలయానికి ఏకంగా డీఈఓ కార్యాలయంగా మానుకోట జిల్లాగా బోర్డు కూడా రాయించారు. ప్రస్తుతం ఉన్న ఫర్నీచర్తోనే డీఈఓ కార్యాలయం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. కార్యాలయం పక్కనే గదులను నిర్మించేందుకు ఆ విభాగం ఇంజీనీర్ పరిశీలించినప్పటికీ ఆలస్యమవుతున్నందున ఆ భవనంలోనే ఎలాంటి నిర్మాణాలు లేకుండా కార్యాలయాన్ని నిర్వహించేందుకు సిద్ధం చేశారు. ఆ తర్వాత ఎంఈఓ కార్యాలయాన్ని మరో చోటికి మార్చే ఆలోచన చేస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో గానీ ఇతర శాఖ కార్యాలయాల్లో పెద్దగా పనులు జరుగడం లేదు. ప్రస్తుతం ఐటీఐ భవనంలో నేటికి కళాశాల తరగతులు జరుగుతున్నాయి. ఎలాంటి పనులు చేపట్టలేదు. -
మానుకోటలో భవనాలు పరిశీలించిన ఐజీ
మహబూబాబాద్ : మానుకోట జిల్లా ఎస్పీ కార్యాలయానికి పట్టణ శివారులో కేటాయించిన ఐటీఐ భవనం, ఎస్పీ క్యాంప్ కార్యాలయం కోసం తీసుకున్న అద్దె భవనాన్ని ఐజీ మల్లారెడ్డి, రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా శనివారం పరిశీలించారు. ఐటీఐ భవనంలో గదులు, నీటి సౌకర్యం, రోడ్డు సౌకర్యం, తదితర విషయాలపై స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా ఏర్పాటు నేపథ్యంలో తాత్కాలిక కార్యాలయాల కోసం తీసుకున్న భవనాలు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం రూ.50లక్షలు మంజూరు చేసిందని పేర్కొన్నారు. 11న కార్యాలయాల ఏర్పాటు కోసం రంగం సిద్ధం చేశామని చెప్పారు. అనంతరం కలెక్టరేట్ కోసం కేటాయించిన వైటీసీ భవనాన్ని కూడా ఆయన పరిశీలించారు. కార్యాలయానికి రోడ్డు సౌకర్యం కల్పిం చేందుకు కృషిచేయాలని ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ను కోరగా అంగీకరించారు. ఐజీతో డీఎస్పీ బి.రాజమహేంద్రనాయక్, సీఐ నందిరామ్‌నాయక్, సిబ్బం ది పాల్గొన్నారు. -
మానుకోట జిల్లాలో మూడు సబ్డివిజన్లు
ఐటీఐలో ఎస్పీ ఆఫీస్ అద్దె భవనంలో క్యాంప్ కార్యాలయం అదనంగా నాలుగు పీఎస్‌ల చేరిక మహబూబాబాద్ : నూతనంగా ఏర్పడే మానుకోట జిల్లాలో పోలీస్ శాఖ కా ర్యాలయాల ఏర్పాటు పనులు వేగంగా సాగుతున్నాయి. మానుకోటలో ఇప్పటికే పోలీస్ సబ్‌డివిజన్ ఒకటి ఉండగా కొత్తగా రెండు సబ్ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. ఎస్పీ క్యాంప్ కార్యాలయ భవనాన్ని ఇప్పటికే అద్దెకు తీసుకున్నారు. మానుకోట జిల్లా విభజన, ఇతర అంశాలపై ఎస్పీ కార్యాలయంలో ఇటీవల చర్చిం చినట్లు సమాచారం. మానుకోట సబ్‌డివిజన్‌లో... మానుకోట సబ్ డివిజన్ పరిధిలో మానుకోట టౌన్, రూరల్, కేసముద్రం, గూడూ రు, కొత్తగూడ పోలీస్స్టేషన్లు ఉన్నాయి. మూడు సర్కిళ్ల పరిధిలో 5 పోలీస్స్టేషన్లు ఉన్నాయి. తొర్రూరు సర్కిల్ పరిధిలో తొర్రూరు, నెల్లికుదురు, నర్సింహులపేట మం డలాలు ఉన్నాయి. కానీ తొర్రూరును సబ్‌డివిజన్ చేసేందుకు ప్రతిపాదనలు తయా రు చేశారు. దాని పరిధిలో తొర్రూరు, నెల్లికుదురు సర్కిల్, నర్సింహులపేట, మరి పెడ సర్కిల్ చేర్చుతున్నారు. రెండు సర్కిళ్ల పరిధిలో నాలుగు పోలీస్స్టేషన్లు వస్తున్నా యి. డోర్నకల్ సబ్‌డివిజన్ పరిధి లో డోర్నకల్ టౌన్ పీఎస్, కురవి, సీరోలు సర్కిల్, బయ్యారం, గార్ల సర్కిల్‌ను చేర్చనున్నారు. సబ్ డివిజన్లు 3.. పోలీస్స్టేషన్లు 14 మానుకోట సబ్ డివిజన్ పరిధిలో మూడు సర్కిళ్లు, డోర్నకల్ సబ్ డివిజన్ పరిధిలో మూడు సర్కిళ్లు, తొర్రూరు కింద రెండు సర్కిళ్లు మొత్తం కలిసి 14 పోలీస్స్టేషన్ల పరిధిలోకి వస్తున్నాయి. గతంలో 10 పోలీస్స్టేషన్లు ఉండగా రెండు మండలాల చేరికతో వాటి సంఖ్య 14కు చేరింది. కాగా ప్రస్తుతం ఉన్న పోలీస్స్టేషన్లలోనే కార్యాలయాలు కొనసాగించనున్నారు. ఆతర్వాత ముగ్గురు డీఎస్పీల కోసం భవనాలు పరి శీలించనున్నారు. ఇదిగా ఉండగా ఎస్పీ క్యాంప్ కార్యాలయం, రెసిడెన్స్ కోసం పట్టణంలోని వెంకటేశ్వర్లబజార్‌లోని భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. ఆ భవనానికి సంబంధించి కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ భవనంలోనే ఆఫీస్, ఎస్పీ నివసిస్తారని పోలీసులు తెలిపారు. ఐటీఐ.. ఎస్పీ కార్యాలయం పట్టణంలోని తొర్రూరు రోడ్లో సబ్‌జైల్ ఎదు ట ఉన్న ఐటీఐ భవనాన్ని ఎస్పీ కార్యాలయంగా కేటాయించారు. ఇందులోనే ఎస్పీ కార్యాలయం, ఎస్బీ, డీఆర్బీ, పోలీస్ కంట్రోల్‌రూమ్, ఏఆర్ హెడ్‌క్వార్టర్స్, క్లూస్ టీమ్, ఎంటీఓ, ఇతర విభాగాల శాఖలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ కార్యాలయానికి వెళ్లేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేదు. పోలీస్విభాగానికి భవనాల కేటాయింపు దాదాపు పూర్తయినట్లే. మానుకోట డీఎస్పీ ప్రమోషన్లో ఉండటంతో ఆయనకు ఏఎస్పీగా ఇచ్చి మానుకోట బాధ్యతలను అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. -
ఏరియా ఆస్పత్రి అప్‌గ్రేడ్!
మానుకోట జిల్లాతో మోక్షం లభించే అవకాశం బ్లడ్‌బ్యాంక్, మెరుగైన వైద్యానికి మోక్షం మహబూబాబాద్ : మానుకోట ఏరియా ఆస్ప త్రి అప్‌గ్రేడ్ కానుంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా మానుకోట జిల్లా ఏర్పడిన తర్వాత ఆస్పత్రి అభివృద్ధికి మోక్షం లభించనుంది. ప్రస్తుతం 300 పడకలకు అప్‌గ్రేడ్ చేయాలనే డిమాండ్ ఉండగా, జిల్లా ఏర్పాటుతో మరింత ఎక్కువ పడకలు, మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తానికి వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రి తరహాలో అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తోంది. మానుకోట ఏరియా ఆస్పత్రిని 1999సంవత్సరంలో నిర్మిం చారు. వంద పడకల ఆస్పత్రే అయినప్పటికీ మానుకోట డివిజన్‌తోపాటు ఖమ్మం జిల్లాలోని గార్ల, బయ్యారం, ఇల్లందు నుంచి కూడా రోగు లు ఇక్కడికి వస్తుంటారు. రోజూ ఓపీలో 800 మంది నుంచి వెయ్యి మంది వరకు వైద్యులు చూస్తారు. వైద్యులు, సిబ్బంది సరిపడ సంఖ్య లో ఉన్నప్పటికీ బెడ్లు ఎక్కువగా లేవు. దీంతో రోగులకు వైద్యం అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మానుకోటలోని జాతీయ రహదారిపై ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. దీంతో వైద్యులకు పనిభారం పెరుగుతోంది. వైద్యుల మధ్య కొన్ని సమస్యలు తలెత్తాయి. వా రికి ప్రైవేట్ ఆస్పత్రులు ఉండటం వల్ల కూడా విభేదాలు ఏర్పడి గ్రూపులుగా ఏర్పడ్డారు. అందుబాటులో ఉన్నతాధికారులు అయితే జిల్లా కాబోతున్న తరుణంలో డీసీహెచ్ఎస్, డీఎంహెచ్ఓ, ఇతర ఉన్నతాధికారులు కూడా ఉండనున్నారు. బ్లడ్‌బ్యాంక్ అందుబాటులోకి వస్తుంది. అన్ని విభాగాలకు డాక్టర్లు వస్తా రు. ఫిజీషియన్, సివిల్ సర్జన్స్, తదితర వైద్యు లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆస్పత్రి కూడా 500 పడకల ఆస్పత్రిగా ఏర్పడే అవకాశం ఉంది. జిల్లాగా ఏర్పడిన తర్వాత ఏరియా ఆస్పత్రి అన్నివిధాలా అభివృద్ధి చెందుతుంద ని, సిటీ స్కాన్ వంట సౌకర్యాలతో మెరుగైన వైద్యం అందుతుందని పలువురు అంటున్నా రు. ఆస్పత్రి అప్‌గ్రేడ్ కోసం కొన్నేళ్లుగా ఆందోళనా ఫలితం లేకపోయింది. చివరికి జిల్లా ఏర్పాటుతో ప్రజల ఆకాంక్ష నెరవేరనుంది. -
ప్రైవేట్ సంస్థకు వైటీసీ భవనం
మానుకోట జిల్లా కలెక్టర్ ఆఫీస్ యోచన విరమణ మారిన నిర్ణయంతో మెుదటికి వచ్చిన ప్రభుత్వ ఆఫీస్‌ల ఏర్పాటు మహబూబాబాద్ : మానుకోట జిల్లా దాదాపు ఖరారు కాగా, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అధికారులు భవనాలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో మానుకోట జిల్లా కలెక్టర్ కార్యాలయం కోసం పట్టణ శివారులోని వైటీసీ (గిరిజన యువజన శిక్షణ కేంద్రం) భవనాన్ని కొద్దిరోజుల క్రితం నిర్ణయించారు. అయితే తాజాగా ఈ భవనాన్ని ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు వ్యవహారంలో పలు సమస్యలు తలెత్తనున్నాయి. ఇటీవల పరిశీలించిన జేసీ జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు భవనాలను పరిశీలించేందుకు కొద్ది రోజుల క్రితం జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ పట్టణంలో పర్యటించారు. రెవెన్యూ అధికారులు తెలిపిన సమాచారం మేరకు పట్టణ శివారులోని ఇందిరానగర్ కాలనీవద్ద ఉన్న వైటీసీ భవనాన్ని పరిశీలించారు. ఇతర భవనాలను కూడా చూశారు. వైటీసీ భవన పక్కనే ఉన్న ఖాళీ స్థలాల గురించి జేసీ ఆరా తీశారు. ఇక్కడ ఎన్ని ఎకరాలు ఉందని, ప్రభుత్వ కార్యాలయాలకు అనుకూలమేనా అని ఆర్డీఓను అడిగి తెలుసుకున్నారు. అనంతారం రోడ్డులోని ప్రభుత్వ భవనాలు, స్థలాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అందరూ వైటీసీ భవనమే తాత్కాలిక కలెక్టరేట్ అని నిర్దారణకు వచ్చారు. ‘గ్రామర్’కు కేటాయింపు జిల్లా కార్యాలయాల కోసం పరిశీలన జరుగుతుండగానే ఐటీడీఏకు సంబంధించిన కమిషనరేట్ ఈ భవనాన్ని గ్రామర్ అనే ఓ ప్రైవేట్ సం స్థకు ఇటీవల అద్దెకు ఇచ్చింది. ఈ విషయం ఏటీడబ్ల్యూఓ దేశీరామ్నాయక్ ధ్రువీకరించా రు. ఆ సంస్థ గిరిజన యువతీ యువకులకు శిక్షణ ఇవ్వనుంది. ప్రస్తుతం ఈ భవనంలో గిరి జన బాలుర ఆశ్రమ పాఠశాల తరగతులు నిర్వహిస్తున్నారు. తక్షణమే ఖాళీ చేయాలని సంబంధిత అధికారులు ఏటీడబ్ల్యూఓను ఆదేశించారు. వారం రోజుల్లో ఆ తరగతులను పక్కనే ఉన్న ఇంటిగ్రేటెడ్ బాలికల హాస్టల్ భవనంలోకి మా ర్చనున్నారు. వైటీసీ భవనం వైపు రోడ్డు పను లు చేస్తుండగా నూతన కలెక్టరేట్ కార్యాలయా న్ని దృష్టిలో పెట్టుకొని రోడ్డు వేస్తున్నట్లు ప్రజ ల్లో నమ్మకం కలిగింది. కానీ సంబంధిత శాఖ అధికారులు ప్రైవేట్ సంస్థకు అద్దెకు ఇవ్వడంతో అయోమయం నెలకొంది. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్పష్టమవుతోంది. మరికొన్ని భవనాలను సైతం సంబంధిత ఉన్నతాధికారులు పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. అయితే ఆయా శాఖల అధికారులు కూడా ఇలాగే ఇతర సంస్థలకు అప్పగిస్తే ప్రభుత్వ కార్యాలయాల భవనాలు లేకుండాపోయే అవకాశం ఉంది. సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే జిల్లా ఏర్పాటు విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తవు.