మానుకోట జిల్లాలో మూడు సబ్‌డివిజన్లు
-
ఐటీఐలో ఎస్పీ ఆఫీస్
-
అద్దె భవనంలో క్యాంప్ కార్యాలయం
-
అదనంగా నాలుగు పీఎస్‌ల చేరిక
మహబూబాబాద్ : నూతనంగా ఏర్పడే మానుకోట జిల్లాలో పోలీస్ శాఖ కా ర్యాలయాల ఏర్పాటు పనులు వేగంగా సాగుతున్నాయి. మానుకోటలో ఇప్పటికే పోలీస్ సబ్‌డివిజన్ ఒకటి ఉండగా కొత్తగా రెండు సబ్ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. ఎస్పీ క్యాంప్ కార్యాలయ భవనాన్ని ఇప్పటికే అద్దెకు తీసుకున్నారు. మానుకోట జిల్లా విభజన, ఇతర అంశాలపై ఎస్పీ కార్యాలయంలో ఇటీవల చర్చిం చినట్లు సమాచారం.
మానుకోట సబ్‌డివిజన్‌లో...
మానుకోట సబ్ డివిజన్ పరిధిలో మానుకోట టౌన్, రూరల్, కేసముద్రం, గూడూ రు, కొత్తగూడ పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. మూడు సర్కిళ్ల పరిధిలో 5 పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. తొర్రూరు సర్కిల్ పరిధిలో తొర్రూరు, నెల్లికుదురు, నర్సింహులపేట మం డలాలు ఉన్నాయి. కానీ తొర్రూరును సబ్‌డివిజన్ చేసేందుకు ప్రతిపాదనలు తయా రు చేశారు. దాని పరిధిలో తొర్రూరు, నెల్లికుదురు సర్కిల్, నర్సింహులపేట, మరి పెడ సర్కిల్ చేర్చుతున్నారు. రెండు సర్కిళ్ల పరిధిలో నాలుగు పోలీస్‌స్టేషన్లు వస్తున్నా యి. డోర్నకల్ సబ్‌డివిజన్ పరిధి లో డోర్నకల్ టౌన్ పీఎస్, కురవి, సీరోలు సర్కిల్, బయ్యారం, గార్ల సర్కిల్‌ను చేర్చనున్నారు.
సబ్ డివిజన్లు 3.. పోలీస్‌స్టేషన్లు 14
మానుకోట సబ్ డివిజన్ పరిధిలో మూడు సర్కిళ్లు, డోర్నకల్ సబ్ డివిజన్ పరిధిలో మూడు సర్కిళ్లు, తొర్రూరు కింద రెండు సర్కిళ్లు మొత్తం కలిసి 14 పోలీస్‌స్టేషన్ల పరిధిలోకి వస్తున్నాయి. గతంలో 10 పోలీస్‌స్టేషన్లు ఉండగా రెండు మండలాల చేరికతో వాటి సంఖ్య 14కు చేరింది. కాగా ప్రస్తుతం ఉన్న పోలీస్‌స్టేషన్లలోనే కార్యాలయాలు కొనసాగించనున్నారు. ఆతర్వాత ముగ్గురు డీఎస్పీల కోసం భవనాలు పరి శీలించనున్నారు. ఇదిగా ఉండగా ఎస్పీ క్యాంప్ కార్యాలయం, రెసిడెన్స్ కోసం పట్టణంలోని వెంకటేశ్వర్లబజార్‌లోని భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. ఆ భవనానికి సంబంధించి కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ భవనంలోనే ఆఫీస్, ఎస్పీ నివసిస్తారని పోలీసులు తెలిపారు.
ఐటీఐ.. ఎస్పీ కార్యాలయం
పట్టణంలోని తొర్రూరు రోడ్‌లో సబ్‌జైల్ ఎదు ట ఉన్న ఐటీఐ భవనాన్ని ఎస్పీ కార్యాలయంగా కేటాయించారు. ఇందులోనే ఎస్పీ కార్యాలయం, ఎస్‌బీ, డీఆర్‌బీ, పోలీస్ కంట్రోల్‌రూమ్, ఏఆర్ హెడ్‌క్వార్టర్స్, క్లూస్ టీమ్, ఎంటీఓ, ఇతర విభాగాల శాఖలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ కార్యాలయానికి వెళ్లేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేదు. పోలీస్‌విభాగానికి భవనాల కేటాయింపు దాదాపు పూర్తయినట్లే. మానుకోట డీఎస్పీ ప్రమోషన్‌లో ఉండటంతో ఆయనకు ఏఎస్పీగా ఇచ్చి మానుకోట బాధ్యతలను అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది.