ప్రైవేట్ సంస్థకు వైటీసీ భవనం
-
మానుకోట జిల్లా కలెక్టర్ ఆఫీస్ యోచన విరమణ
-
మారిన నిర్ణయంతో మెుదటికి వచ్చిన ప్రభుత్వ ఆఫీస్‌ల ఏర్పాటు
మహబూబాబాద్ : మానుకోట జిల్లా దాదాపు ఖరారు కాగా, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అధికారులు భవనాలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో మానుకోట జిల్లా కలెక్టర్ కార్యాలయం కోసం పట్టణ శివారులోని వైటీసీ (గిరిజన యువజన శిక్షణ కేంద్రం) భవనాన్ని కొద్దిరోజుల క్రితం నిర్ణయించారు. అయితే తాజాగా ఈ భవనాన్ని ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు వ్యవహారంలో పలు సమస్యలు తలెత్తనున్నాయి.
ఇటీవల పరిశీలించిన జేసీ
జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు భవనాలను పరిశీలించేందుకు కొద్ది రోజుల క్రితం జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ పట్టణంలో పర్యటించారు. రెవెన్యూ అధికారులు తెలిపిన సమాచారం మేరకు పట్టణ శివారులోని ఇందిరానగర్ కాలనీవద్ద ఉన్న వైటీసీ భవనాన్ని పరిశీలించారు. ఇతర భవనాలను కూడా చూశారు. వైటీసీ భవన పక్కనే ఉన్న ఖాళీ స్థలాల గురించి జేసీ ఆరా తీశారు. ఇక్కడ ఎన్ని ఎకరాలు ఉందని, ప్రభుత్వ కార్యాలయాలకు అనుకూలమేనా అని ఆర్డీఓను అడిగి తెలుసుకున్నారు. అనంతారం రోడ్డులోని ప్రభుత్వ భవనాలు, స్థలాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అందరూ వైటీసీ భవనమే తాత్కాలిక కలెక్టరేట్ అని నిర్దారణకు వచ్చారు.
‘గ్రామర్’కు కేటాయింపు
జిల్లా కార్యాలయాల కోసం పరిశీలన జరుగుతుండగానే ఐటీడీఏకు సంబంధించిన కమిషనరేట్ ఈ భవనాన్ని గ్రామర్ అనే ఓ ప్రైవేట్ సం స్థకు ఇటీవల అద్దెకు ఇచ్చింది. ఈ విషయం ఏటీడబ్ల్యూఓ దేశీరామ్‌నాయక్ ధ్రువీకరించా రు. ఆ సంస్థ గిరిజన యువతీ యువకులకు శిక్షణ ఇవ్వనుంది. ప్రస్తుతం ఈ భవనంలో గిరి జన బాలుర ఆశ్రమ పాఠశాల తరగతులు నిర్వహిస్తున్నారు. తక్షణమే ఖాళీ చేయాలని సంబంధిత అధికారులు ఏటీడబ్ల్యూఓను ఆదేశించారు. వారం రోజుల్లో ఆ తరగతులను పక్కనే ఉన్న ఇంటిగ్రేటెడ్ బాలికల హాస్టల్ భవనంలోకి మా ర్చనున్నారు. వైటీసీ భవనం వైపు రోడ్డు పను లు చేస్తుండగా నూతన కలెక్టరేట్ కార్యాలయా న్ని దృష్టిలో పెట్టుకొని రోడ్డు వేస్తున్నట్లు ప్రజ ల్లో నమ్మకం కలిగింది. కానీ సంబంధిత శాఖ అధికారులు ప్రైవేట్ సంస్థకు అద్దెకు ఇవ్వడంతో అయోమయం నెలకొంది. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్పష్టమవుతోంది. మరికొన్ని భవనాలను సైతం సంబంధిత ఉన్నతాధికారులు పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. అయితే ఆయా శాఖల అధికారులు కూడా ఇలాగే ఇతర సంస్థలకు అప్పగిస్తే ప్రభుత్వ కార్యాలయాల భవనాలు లేకుండాపోయే అవకాశం ఉంది. సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే జిల్లా ఏర్పాటు విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తవు.