Mariam
-
జైల్లో షరీఫ్‌కు బీ–క్లాస్ వసతి
ఇస్లామాబాద్: అవెన్‌ఫీల్డ్ కేసులో శుక్రవారం అరెస్టయిన పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మరియమ్‌లకు రావల్పిండిలోని అదియాలా జైలులో బీ–క్లాస్ వసతులు కల్పించినట్లు స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. లాహోర్ విమానాశ్రయంలో దిగగానే వీరిద్దరిని అరెస్ట్ చేసిన అధికారులు విమానంలో రావల్పిండికి తరలించారు. తర్వాత షరీఫ్, మరియమ్లను అదియాలా జైలుకు తీసుకెళ్లారు. అక్కడికి చేరుకున్న వైద్యులు షరీఫ్, మరియమ్‌లకు వైద్య పరీక్షలు నిర్వహించి వీరు ఆరోగ్యంగా ఉన్నట్లు తేల్చారు. శనివారం ఉదయం అల్పాహారంలో భాగంగా వీరిద్దరికి ఎగ్ఫ్రై, పరోటా, టీని జైలు అధికారులు ఇచ్చారు. ఉన్నతస్థాయి విద్యావంతులు, ధనికులు తదితరులకు జైలులో బీ– క్లాస్ వసతిని కల్పిస్తారు. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం బీ–క్లాస్ ఖైదీల గదిలో ఓ మంచం, కుర్చీ, లాంతరు, ఓ అల్మారా తదితర సౌకర్యాలుంటాయి. ఖైదీల ఆర్థిక స్థోమతను బట్టి జైలు గదిలో టీవీ, ఏసీ, ఫ్రిజ్, వార్తాపత్రికలు సమకూర్చేందుకు జైళ్ల శాఖకు అధికారాలున్నాయి. ప్రస్తుతం బీ–క్లాస్ వసతులు అనుభవిస్తున్న షరీఫ్, మరియమ్‌లకు సీ–క్లాస్‌లోని నిరక్షరాస్యులైన ఖైదీలకు చదువు చెప్పే బాధ్యతను అప్పగించే అవకాశముంది. పంజాబ్ ప్రావిన్సులో ఘర్షణలు.. షరీఫ్, ఆయన కుమార్తె మరియమ్ అరెస్టులను నిరసిస్తూ వారి స్వస్థలమైన పంజాబ్ ప్రావిన్సులో పలుచోట్ల మద్దతుదారులు పోలీసులతో గొడవకు దిగారు. ఈ ఘర్షణల్లో దాదాపు 50 మంది షరీఫ్ మద్దతుదారులు, 20 మంది పోలీసులు గాయపడ్డారు. కాగా, శుక్రవారం షరీఫ్ రాక నేపథ్యంలో అరెస్ట్‌చేసిన 370 పీఎంఎల్–ఎన్ నేతల్ని, కార్యకర్తల్ని విడుదల చేయాలని లాహోర్ హైకోర్టు ఆదేశించింది. -
నవాజ్ షరీఫ్ అరెస్ట్
లాహోర్: తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ స్వదేశంలో అడుగుపెట్టిన పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కూతురు మరియమ్ అరెస్టయ్యారు. పనామా పత్రాల కేసులో షరీఫ్‌కు పదేళ్లు, మరియమ్‌కు ఏడేళ్ల జైలుశిక్ష పడింది. శుక్రవారం రాత్రి లాహోర్ విమానాశ్ర యంలో దిగిన వెంటనే వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. భద్రతా అధికారులు విమానంలోకి ప్రవేశించి వారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. అక్కడే ఎదురుచూస్తున్న షరీఫ్ తల్లిని కలుసుకునేందుకు వారికి అనుమతిచ్చారు. తర్వాత ఇద్దరినీ ప్రత్యేక హెలికాప్టర్లో ఇస్లామాబాద్‌కు తరలించారు. అనంతరం షరీఫ్‌ను రావల్పిండిలోని అదియాలా జైలుకు, మరియమ్‌ను తాత్కాలిక సబ్‌జైలుగా ఏర్పాటుచేసిన సీహాలా రెస్ట్ హౌజ్‌కు తీసుకెళ్లారు. లాహోర్‌లో ఉత్కంఠ.. పాక్‌కు రాగానే షరీఫ్‌ను అరెస్ట్ చేస్తామని అధికారులు ప్రకటించడంతో లాహోర్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు 10 వేల మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. 300 మంది షరీఫ్ మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు. లాహోర్ వెళ్లే అన్ని దారులను మూసివేశారు. విమానాశ్రయానికి రాకపోకలపై ఆంక్షలు విధించారు. 144వ సెక్షన్ అమల్లో ఉన్నా షరీఫ్ సోదరుడు షాబాజ్ తన అనుచరులతో కలసి భారీ ర్యాలీ నిర్వహించారు. విమానాశ్రయం సమీపంలో షరీఫ్ మద్దతుదారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. లాహోర్‌లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. లండన్ నుంచి పాకిస్తాన్‌కు బయల్దేరిన షరీఫ్, మరియమ్‌లు మూడు గంటలు ఆలస్యంగా లాహోర్ చేరుకున్నారు. లండన్ నుంచి అబుదాబికి నిర్ణీత సమయంలోనే చేరుకున్నా అక్కడి నుంచి లాహోర్ రావాల్సిన విమానం ఆలస్యంగా బయల్దేరింది. ఉద్రిక్త పరిస్థితుల్లో పాక్‌లో అడుగుపెట్టడం మంచి నిర్ణయమేనా? అని అబుదాబి విమానాశ్రయంలో విలేకరులు షరీఫ్‌ను ప్రశ్నించగా..దేశంలోని పరిస్థితుల గురించి తనకు తెలుసని అన్నారు. దేశ తలరాత మార్చేందుకే తాను తిరిగొస్తున్నట్లు చెప్పారు. గుడ్డిగా ప్రతీకారం తీర్చుకునేందుకే.. అంతకుముందు, నవాజ్ షరీఫ్ తన దేశ పౌరులనుద్దేశించి ప్రసంగించిన వీడియోను మరియమ్ ట్వీట్ చేశారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, దేశ భవిష్యత్తును మార్చడానికి తనకు మద్దతుగా నిలవాలని షరీఫ్ కోరారు. ‘అసలు ఇందులో కేసు లేదు, తీర్పు లేదు. గుడ్డిగా ప్రతీకారం తీర్చుకునేందుకు ఆటలు ఆడుతున్నారు. నాకు వ్యతిరేకంగా కేసులే లేవు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలనుకున్నాను కాబట్టే.. ఫిక్సింగ్‌కు పాల్పడి రాజకీయాల నుంచి నన్ను దూరంగా ఉంచడానికి పనామా పత్రాల కేసును తెరపైకి తెచ్చారు. నేనేం చేయాలో అదే చేశాను. నాకు పదేళ్ల శిక్ష పడిందని తెలుసు. పాక్‌లో అడుగుపెట్టిన మరుక్షణమే జైలుకు తరలిస్తారని తెలుసు. నేను చేస్తున్నదంతా మీకోసమేనన్న సంగతిని గ్రహించండి’ అని అన్నారు. పంజాబ్ ప్రావిన్సులో తన అనుచరులపై కొనసాగుతున్న అణచివేత..ప్రభుత్వానికి తానంటే ఉన్న భయాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు. అందుకే లాహోర్ విమానాశ్రయానికి వేలాది మంది మంది మద్దతుదారులు రాకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. ఆసుపత్రిలో తన తల్లి వెంటిలేటర్‌పై ఉన్న చిత్రాలను కూడా మరియమ్ పోస్ట్ చేశారు. -
జైలుకే తీసుకెళ్తారని నాకూ తెలుసు.. వైరల్
లాహోర్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మర్యమ్ శుక్రవారం దేశంలో అడుగుపెట్టగానే అరెస్ట్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మరోవైపు యూఏఈలోని అబుదాబి ఎయిర్‌పోర్టులో బయలుదేరిన అనంతరం షరీఫ్ ఓ వీడియోను షేర్ చేశారు. జైలుశిక్ష ఎదుర్కోనున్న నేపథ్యంలో విమాన ప్రయాణ సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘నన్ను నేరుగా జైలుకు తీసుకెళ్తారని తెలుసు. పాక్ ప్రజల కోసం నేను ఈ వీడియో షేర్ చేస్తున్నా. వచ్చే తరాల వారి భవిష్యత్తు కోసం త్యాగాలు చేశాను. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. పాక్ భవితవ్యాన్ని మనందరం కలిసి తేల్చాలంటూ’పాక్ ప్రజలకు నవాజ్ షరీఫ్ పిలుపునిచ్చారు. బ్రిటన్ నుంచి బయలుదేరిన షరీఫ్, మర్యమ్‌లను శుక్రవారం ఉదయం అబుదాబి ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడినుంచి ఇతిహాద్ ఈవై 243 విమానంలో లాహోర్‌కు చేరుకోనున్నారు. కాగా, లండన్‌లోని ఎవన్‌ఫీల్డ్ అపార్ట్మెంట్ కేసులో పదేళ్ల జైలుశిక్ష ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఏడేళ్ల జైలుశిక్ష ఎదుర్కొంటున్న ఆయన కుమార్తె మర్యమ్ లాహోర్‌లో అడుగుపెట్టగానే పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. నేటి సాయంత్రం 6.15 గంటలకు నవాజ్, ఆయన కుమార్తె మర్యమ్ బ్రిటన్ నుంచి లాహోర్‌కు చేరుకోనున్న నేపథ్యంలో వీరిద్దరిని ఎయిర్‌పోర్ట్‌లోనే అరెస్ట్ చేయాలని నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) చైర్మన్ జావేద్ ఇక్బాల్ ఆదేశించిన విషయం తెలిసిందే. వీరిద్దరినీ రావల్పిండిలోని అదియాలా జైలుకు తరలించాలని చూస్తున్నారు. అరెస్ట్ సందర్భంగా నగరంలో అల్లర్లు తలెత్తకుండా 10,000 మంది పోలీసుల్ని అధికారులు మోహరించారు. -
జైలుకే తీసుకెళ్తారని నాకూ తెలుసు.. వైరల్
-
నిరసనకారులపై మాజీ ప్రధాని మనవళ్ల జులుం
న్యూఢిల్లీ : పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మనవళ్లను లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తన అపార్ట్మెంట్ వద్ద ఓ వ్యక్తిపై భౌతికదాడికి దిగి అతడిని గాయపరిచాడన్న కారణంగా పోలీసులు రంగంలోకి దిగి చర్యలు తీసుకున్నారు. షరీఫ్ కుమారుడికి లండన్ లోని పార్క్‌లేన్‌లో ఎవన్‌ఫీల్డ్ అపార్ట్మెంట్ ఉంది. ఈ అపార్ట్మెంట్ కేసులో పదేళ్ల జైలుశిక్ష ఎదుర్కొంటున్న నవాజ్ షరీఫ్, ఏడేళ్ల జైలుశిక్ష ఎదుర్కొంటున్న ఆయన కుమార్తె మర్యమ్ శుక్రవారం దేశంలో అడుగుపెట్టగానే అరెస్ట్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులు ఎవన్‌ఫీల్డ్ అపార్ట్మెంట్ వద్ద ధర్నాకు దిగి షరీఫ్ మనవళ్లు జునైద్ సఫ్దార్, జకారియా షరీఫ్‌లపై విమర్శలు చేయడంతో పాటు అసభ్యపదజాలంతో తిట్టారు. ఈ క్రమంలో ఈ ఇద్దరూ తమను విమర్శిస్తున్న ఓ వ్యక్తిని కాలర్ పట్టుకుని లాగి దాడి చేశారు. షరీఫ్ కూతురు మర్యమ్ కుమారుడు జునైద్, కాగా షరీఫ్ కుమారుడు హుస్సేన్ తనయుడు జకారియా అన్న విషయం తెలిసిందే. బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న లండన్ పోలీసులు జునైద్, జకారియాలను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేయడానికి వచ్చిన సమయంలో పోలీసులతో వారు వాగ్వివాదానికి దిగారు. ఓ వ్యక్తి మాపై దాడి చేసేందుకు చూడగా అతడిని అడ్డుకునేందుకు యత్నించామని, తమను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని షరీఫ్ మనవళ్లు పోలీసులను ప్రశ్నించారు. -
అడుగు పెట్టగానే అరెస్ట్!
లాహోర్: పాకిస్తాన్లో రాజకీయం మరింత ముదిరింది. ఎవన్‌ఫీల్డ్ అపార్ట్మెంట్ కేసులో పదేళ్ల జైలుశిక్ష ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఏడేళ్ల జైలుశిక్ష ఎదుర్కొంటున్న ఆయన కుమార్తె మర్యమ్ శుక్రవారం దేశంలో అడుగుపెట్టగానే అరెస్ట్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. లాహోర్‌లో అల్లర్లు తలెత్తకుండా పాకిస్తాన్ ముస్లిం లీగ్(నవాజ్) పార్టీకి చెందిన 300 మంది నేతలు, కార్యకర్తల్ని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నేడు సాయంత్రం 6.15 గంటలకు నవాజ్, ఆయన కుమార్తె మర్యమ్ బ్రిటన్ నుంచి లాహోర్‌కు చేరుకోనున్న నేపథ్యంలో వీరిద్దరిని ఎయిర్‌పోర్ట్‌లోనే అరెస్ట్ చేయాలని నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్ఏబీ) చైర్మన్ జావేద్ ఇక్బాల్ ఆదేశించారు. అరెస్టుచేసి వీరిద్దరినీ రావల్పిండిలోని అదియాలా జైలుకు తరలించాలని చూస్తున్నారు. అరెస్ట్ సందర్భంగా నగరంలో అల్లర్లు తలెత్తకుండా 10,000 మంది పోలీసుల్ని అధికారులు మోహరించారు. -
మలాలా సిస్టర్స్
టీన్ ట్విన్స్ ఈ ఇద్దరు అమ్మాయిలు... మలాలా ఏ లక్ష్యం కోసం అయితే ఉద్యమించారో ఆ లక్ష్యసాధనకు పాటు పడుతున్నారు. బాలికల చదువు కోసం, సమాజంలో మార్పు కోసం కృషి చేస్తున్నారు. వీళ్ల చురుకుదనం మలాలానే ముగ్ధురాలిని చేసింది! మలాల ధ్యేయానికి తోబుట్టువులను చేసింది! మలాల యూషఫ్సాయ్! ప్రపంచానికి ఒక అబ్బురం. పద్నాలుగేళ్లకే తాలిబన్ తీవ్రవాదులతో పోరాటం, పదిహేడేళ్ల వయసుకే నోబెల్ శాంతి బహుమతి, ఇంకా టీనేజ్‌లో ఉండగనే ఇప్పుడు... బాలికల చదువు కోసం అంతర్జాతీయంగా ప్రచారోద్యమాన్ని నడపడం. ఇవన్నీ ఈ పాకిస్తానీ అమ్మాయిని ప్రపంచానికే ఓ బ్రాండ్ అంబాసిడర్ స్థాయికి చేర్చాయి! వారం క్రితమే మలాలా కెనడా గౌరవ పౌరసత్వం కూడా పొందారు. కెనడా చట్టసభలో ప్రసంగించారు. కెనడా పార్లమెంటు చరిత్రలోనే అతి చిన్నవయసు అతిథి ప్రసంగం అది. ఒక్కమాటలో... మలాలా ఓ ‘గర్ల్ వండర్’! అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది... మలాలా గురించి కాదు. మలాలానే అబ్బుర పరచిన ఇద్దరు అమ్మాయిల గురించి! వాళ్లదీ పాకిస్తానే కానీ, వాళ్లు ఉంటున్నది కెనడాలో. గౌరవ పౌరసత్వం అందుకోడానికి మలాలా వస్తున్నారని తెలిసి, ఆమెను ఎటూ కెనడా ‘ఎంగ్ అండ్ ఎనర్జిటిక్’ ప్రధాని జస్టిన్ ట్రూడో కలుస్తారని ఊహించి... వాళ్లిద్దర్నీ కలిపి ఇంటర్వూ్య చెయ్యాలని ఈ ఇద్దరు హైస్కూల్ విద్యార్థినులు స్కెచ్ వేసుకున్నారు. వేసుకున్నట్లే ఇంటర్వూ్య కూడా చేసేశారు. వాళ్లలో ఒక అమ్మాయి మరియమ్. ఇంకో అమ్మాయి నివాళ్ రెహమాన్. ఇద్దరూ కవల పిల్లలు. టీనేజ్ జర్నలిస్టులు. పదిహేనేళ్ల వయసు ఉంటుంది. ఇంటర్వూ చేశారని వీళ్లను జర్నలిస్టులు అనడం కాదు. ఏడాదిగా వీళ్లొక యూట్యూబ్ చానల్ నడుపుతున్నారు! ఆ చానల్ పేరు ‘ది వరల్డ్ విత్ ఎంఎన్ఆర్’. సమాజంలో మార్పును కోరుకునేవారందరూ కలుసుకునే కూడలి అది. మలాలా లాగే పన్నెండేళ్ల వయసులో వీళ్లు కూడా బాలికల చదువు ప్రాముఖ్యాన్ని సమాజానికి తెలియజెప్పే కార్యకర్తల్లా స్వచ్ఛందంగా బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు. తల్లిదండ్రులు వీరికి సహకరించారు. బాలికల చదువుకు సహకరించడమే పెద్ద సంస్కరణ అయిన పరిస్థితుల్లో ‘బాలికల్ని చదివించండి’ అనే ప్రచారోద్యమానికి సహకరించడం పెద్ద సాహసమే కదా! ఇక ఈ పిడుగులు మలాలాను, కెనడా ప్రధాని ట్రూడోను ఎంత చక్కగా, ఎంత చకచకా ఇంటర్వూ చేశారో తెలుసుకోవాలంటే వీడియోను (The Day We Interviewed Malala and Justin Trudeau) చూడాల్సిందే. ఇంటర్వూ ప్రారంభానికి ముందు... తమదొక జెండర్ ఈక్వాలిటీ టీమ్ అని ఆ పెద్దవాళ్లిద్దరితో (మలాలా, ట్రూడో) తమను కలిపేసుకున్నారు ఈ చిన్నవాళ్లిద్దరు! ఆ గడుసుదనానికి వాళ్లవైపు నవ్వుతూ చూశారు ట్రూడో, మలాలా. ఇక ప్రశ్నలు మొదలయ్యాయి. ట్రూడో పాలనా విభాగాలలో మహిళలకు సమాన అవకాశాలు, బాలిక విద్యకోసం కెనడాలో పెట్టుబడులు వంటి కెనడాకే పరిమితమైన ప్రశ్నలతో పాటు... ట్రుడోను, మలాలాను ఉమ్మడిగా అడిగిన ప్రశ్నలూ ఉన్నాయి. మీరు కొత్తగా చదివిన పుస్తకం, మీకు స్ఫూర్తిని ఇచ్చిన మహిళ, పనిలో మునిగిపోయినప్పుడు వేళకాని వేళల్లో మీరు తినే ఆహారం, మిమ్మల్ని ఎప్పుడూ నవ్వించే వ్యక్తి, మీరు వెళ్లాలనుకుంటున్న దేశం (ఈ ప్రశ్నకు సమాధానంగా ట్రూడో పాకిస్తాన్ అని చెప్పారు. మలాల ఇండియాతో పాటు మరి కొన్ని దేశాల పేర్లు చెప్పారు), స్కూల్లో మీరు నేర్చుకున్న మంచి పాఠం, యువ విద్యార్థులకు మీరిచ్చే సలహా... ఇలా సరదా సరదాగా, కొంచెం సీరియస్‌గా ఉండే ప్రశ్నలు అడిగారు. వాటికి ట్రూడో, మలాలా ఇచ్చిన సమాధానాలు స్ఫూర్తివంతంగా ఉన్నాయి. నిజానికి ఇది... నలుగురు నిలుచుని మాట్లాడుకున్నట్లుగానే ఉంది కానీ, ఒక గంభీరమైన ఇంటర్వూ్యలా లేదు. ఆ ఇద్దరు అమ్మాయిలు... లేని గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ మాట్లాడ్డం చూసి ట్రూడో, మాలాల ముచ్చటపడినట్లే కనిపించారు. తర్వాత వీళ్లిద్దరి గురించీ మలాలా తన బ్లాగులో గొప్పగా రాశారు కూడా. నిజమైన కవలలుగా మాత్రమే కాదు, మలాలా ఉద్యమదీక్షకు కూడా ఈ ఇద్దరు అమ్మాయిలు కవలలు అని చెప్పాలి. – కొటేరు శ్రావణి, ‘సాక్షి’ వెబ్ మలాలా, ట్రూడోలను ఇంటర్వ్యూ చేస్తున్న మరియం, నివాళ్