Mechanical Engineer
-
ఇండియన్ రైల్వే నుంచి స్పేస్ఎక్స్ వరకు..
SpaceX Sanjeev Sharma: అమెరికాకు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ ఇటీవల చేసిన అంతరిక్ష ప్రయోగం విజయవంతం అయింది. స్టార్ఫిష్ రాకెట్‌తో పాటు స్పేస్‌లోకి దూసుకెళ్లిన బూస్టర్ తిరిగి యథాస్థానానికి వచ్చేలా చేసిన ప్రయోగం అందరి దృష్టిని ఆకర్షించింది. స్పేస్ రీసెర్చిలో అత్యద్భుతంగా పేర్కొంటున్న ఈ ప్రయోగాన్ని సౌత్ టెక్సాస్‌లోని స్టార్‌బేస్ నుంచి స్పేస్ఎక్స్ శాస్త్రవేత్తలు విజయవంతం చేశారు. ఈ సెంటిస్టుల బృందంలో మనదేశానికి చెందిన సంజీవ్ శర్మ కీలకపాత్ర పోషించారు. ఆయనకు సంబంధించిన లింక్డిన్ ప్రొఫైల్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.అంచెలంచెలుగా ఎదిగి..శ్రీసాయి దత్తా అనే యూజర్ సంజీవ్ శర్మకు సంబంధించిన విద్యా, ఉద్యోగ వివరాలు ఎక్స్‌లో షేర్ చేశారు. ఫ్రం ఇండియన్ రైల్వేస్ టు స్పేస్ఎక్స్’ పేరుతో ఈ వివరాలను వెల్లడించారు. ఒకప్పుడు ఇండియన్ రైల్వేలో పనిచేసిన ఆయన పస్తుతం స్పేస్ఎక్స్ సంస్థలో ప్రిన్సిపల్ ఇంజనీర్‌గా పనిచేస్తూ రోదసి ప్రయోగాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. భారతీయ రైల్వేలో 11 ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదివి.. అంచెలంచెలుగా ఎదిగి అంతరిక్ష ప్రయోగాల్లో పాలుపంచుకుంటున్నారు.అమెరికాలో ఉన్నత విద్యరూర్కీ ఐఐటీలో మెకానికల్ ఇంజనీర్ చదువు పూర్తైన తర్వాత సంజీవ్ శర్మ 1990లో ఇండియన్ రైల్వేలో డివిజినల్ మెకానికల్ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించారు. 1994లో డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్‌గా ఆయన ప్రమోషన్ లభించింది. 2001 వరకు ఈ జాబ్‌లో ఆయన కొనసాగారు. తర్వాత రైల్వే ఉద్యోగం వదిలిపెట్టి అమెరికా వెళ్లి కొలరాడో యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ సాధించారు. 2003లో సీగేట్ టెక్నాలజీ కంపెనీలో స్టాఫ్ మెకానికల్ ఇంజనీర్‌గా చేరారు. ఇదే సమయంలో మిన్నెసోటా యూనివర్సిటీ నుంచి మేనేజ్మెంట్ ఆఫ్ టెక్నాలజీలో మరో మాస్టర్ డిగ్రీ చేశారు. 2013లో స్పేస్ఎక్స్ సంస్థలో స్ట్రక్చర్స్ గ్రూప్ డైనమిక్స్ ఇంజినీర్‌గా జాబ్ సంపాదించారు. అక్కడ ఐదేళ్లు పనిచేసిన తర్వాత 2018లో మ్యాటర్నెట్ కంపెనీకి మారారు. మళ్లీ 2022లో స్పేస్ఎక్స్కు తిరిగొచ్చారు. ‘బూస్టర్’ ప్రయోగం సక్సెస్ నేపథ్యంలో సంజీవ్ శర్మ పేరు తాజాగా వెలుగులోకి వచ్చింది."From Indian Railways to SpaceX, From Building Trains to building Starships & catching them"Podcast of Sanjeev Sharma- Principal Engineer for #Starship Dynamicshttps://t.co/mzD2QEQTWa pic.twitter.com/fbDXXJf8sx— SRI SAIDATTA (@nssdatta) October 15, 2024ఓపిక అంటే ఇది..ఇండియన్ రైల్వే నుంచి స్పేస్ఎక్స్ వరకు సాగిన సంజీవ్ శర్మ విజయ ప్రస్థానంపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారతీయ రైల్వేలో 11 సంవత్సరాలు పనిచేసి ఆ తర్వాత ప్రైవేట్ సంస్థకు మారడం అంటే మామూలు విషయం కాదు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే సౌలభ్యాలు, సౌకర్యాలను వదులుకోవడానికి చాలా మంది ఇష్టపడరని నెటిజన్ ఒకరు పేర్కొన్నారు. ‘ఓపిక అంటే ఇది. స్పేస్ఎక్స్లో చేరడానికి ముందు సంజీవ్ శర్మకు 20 సంవత్సరాల కెరీర్ ఉంద’ని మరొకరు కామెంట్ చేశారు. 2008లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ సంజీవ్ శర్మ ప్రమోషన్ సంపాదించారంటే ఆయన ఎంత ప్రతిభావంతుడో అర్థమవుతోందని మరో నెటిజన్ మెచ్చుకున్నారు. చదవండి: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఏపీ వాసుల మృతి -
ఇకపై మీ పంట వృథా కాదు, ఇంజనీర్ సృష్టించిన సోలార్ డ్రైయర్
ప్రకృతి చాలా చిత్రమైంది. ధాన్యాన్ని ఎండించి ఇస్తుంది. కాయగూరలను పండించి ఇస్తుంది. ధాన్యం ఏడాదంతా నిల్వ ఉంటుంది. కాయలు పండ్లకు రోజులే జీవిత కాలం. ఆ కాయలు పండ్లను కూడా ఎండబెడితే... అవి కూడా ఏడాదంతా నిల్వ ఉంటాయి. ముందు చూపు ఉంటే ఏదీ వృథా కాదు, దేని ధరా కొండెక్కదు... అని నిరూపించాడు ఇందోర్‌కు చెందిన మెకానికల్ ఇంజనీర్ వరుణ్ రహేజా. రైతుల ఆత్మహత్యలు, టొమాటోలు కోసిన ధరలు కూడా రావని పంటను వదిలేయడం వంటి వార్తలు తనను కలచి వేశాయి. పంటను నిల్వ చేసుకోగలిగితే రైతుల నష్టాలు, మరణాలను నివారించవచ్చనుకున్నాడు. కరెంట్ లేని ప్రదేశాల్లో కూడా ఉపయోగకరంగా ఉండడానికి సూర్యరశ్మితో పనిచేసే సోలార్ డ్రైయర్‌ను రూపొందించాడు. గత వేసవిలో కిలో రెండున్నర రూపాయల చొప్పున సేకరించిన టొమాటోలను డ్రైయర్‌లో ఎండబెట్టి తన ప్రయోగ ఫలితాన్ని నిరూపించాడు వరుణ్. యువతలో సామాజిక స్పృహ మెండుగా ఉన్నప్పుడు, చదువుతో వచ్చిన జ్ఞానం తన ఉన్నతితో పాటు సామాజికాభివృద్ధికి కూడా దోహదం చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ప్రయోగాలు సాధ్యమవుతాయి. వరుణ్ చేసిన ప్రయోగం వ్యవసాయరంగానికి మేలు చేస్తోంది. ఆలోచన... ఆసక్తి! ‘‘నేలలో నాటిన విత్తనం నుంచి ఒక చెట్టు మొలవడం, అది పెద్దయి... పూత పూసి కాయ కాచి అది పండే వరకు ప్రతిదీ ప్రకృతి చేసే అద్భుతమే. పంటను, పొలాన్ని సంరక్షించడంలో రైతు పడే కష్టాన్ని కొలవడానికి ఏ పరికరమూ ఉండదు. అలాంటిది పండించిన పంటను చేతులారా నేలపాలు చేసేటప్పుడు రైతు అనుభవించే ఆవేదన ఎలాంటిదో నాకు తెలియదు, కానీ ఆ పంట నేలపాలవుతుంటే నా మనసు మౌనంగా రోదించేది. పంటను నిల్వ చేసుకునే అవకాశం ఉంటే ఆ రైతు తన చేతులారా పండించిన పంటను అలా నేలపాలు చేయడు కదా అనిపించేది. ఈ ఆలోచనలు నేను మెకానికల్ ఇంజనీర్‌గా ఇంటర్న్న్షిప్ చేస్తున్న సమయంలో ఒక కొలిక్కి వచ్చాయి. పోషకాలు వృథా కాని విధంగా పండ్లు, కాయల్లోని తేమను సహజంగా తొలగించగలిగితే పంటను నిల్వ చేయవచ్చు. అది సౌరశక్తితో సాధ్యమని తెలిసిన తర్వాత నా ప్రయత్నాలను ముమ్మరం చేశాను. సోలార్ డ్రైయర్‌ను రూపొందించడంతోపాటు అన్ని రకాల రైతులకు అది అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఒక ప్రదేశంలో స్థిరంగా ఉండే పాలీ హౌస్‌తోపాటు ఇరవై కిలోల నుంచి వంద కిలోల కెపాసిటీ గలిగిన పోర్టబుల్ డ్రైయర్లను కూడా రూపొందించాను. వీటిని ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. మేధ సమాజానికి ఉపయోగపడాలి! నేను చేసే పని నాకు నచ్చినదై ఉండాలి. ఒకరు చెప్పిన పని చేయడానికి నా మేధను పరిమితం చేయడం నాకిష్టం లేదు. నేను చేసే పని సమాజానికి ఉపయోగపడేదై ఉంటే అందులో లభించే సంతృప్తి అనంతం. టొమాటోల ధరలు వార్తల్లో ఉండడాన్ని చూస్తూనే పెరిగాను. రైతన్నల శ్రమకు ఫలితం కొనుగోలు చేసే వ్యాపారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటోంది. పండించిన రైతులు ఎప్పుడూ అనిశ్చితిలోనే ఉంటున్నారు. సప్లయ్ చైన్ దళారులతో నిండిపోయి, రైతుకు ఉపయుక్తంగా లేకపోవడమే ఇందుకు కారణం. పొలంలో పండిన పంట వంటగదికి చేరేలోపు వివిధ దశల్లో 30 నుంచి 40 శాతం వృథా అవుతోంది. ఆ వృథాని అరికట్టడం, పండించిన రైతుకు తన పంటకు తగిన ధర నిర్ణయించగలిగే స్థితి కల్పించడం నా లక్ష్యం. అందుకే పంటను ఎండబెట్టి నిల్వ చేసే ఇండస్ట్రీని స్థాపించాను’’ అన్నాడు తన ప్రయోగాల కోసం రహేజా సోలార్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్థాపించిన వరుణ్ రహేజా. వరుణ్ కొత్త పరికరాల రూపకల్పనలో నిమగ్నమై ఉంటే, అతడు నెలకొల్పిన పరిశ్రమను తల్లి బబిత నిర్వహిస్తున్నారు. -
ఆ సీట్లు ఏమైనట్టు?
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది సివిల్, మెకానికల్ సీట్లు భారీగా తగ్గే అవకాశం కన్పిస్తోంది. తొలి విడత కౌన్సెలింగ్‌లో చేర్చిన సీట్ల వివరాలే దీనికి నిదర్శనం. ఇప్పటివరకూ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చిన సీట్లలో ఎక్కువగా కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ ఏఐఎంఎల్, ఇతర కంప్యూటర్ కోర్సులవే ఉన్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో సీట్లు తక్కువగా కన్పిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే ఈ విభాగాల్లో సీట్లు కంప్యూటర్ కోర్సుల్లోకి మారబోతున్నాయా? లేదా కాలేజీలు రద్దు చేసుకుంటాయా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పటికే వంద కాలేజీల వరకూ సంప్రదాయ కోర్సుల్లో సీట్లు తగ్గించాలని, కంప్యూటర్ సైన్స్, ఇతర కోర్సుల్లో సీట్లు పెంచాలని దరఖాస్తు చేసుకున్నాయి. ఈ కారణంగానే దాదాపు 40 వేల సీట్లను కౌన్సెలింగ్‌లో పెట్టలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆప్షన్లన్నీ సీఎస్ఈ వైపే... ఎంసెట్ కౌన్సెలింగ్‌కు ఇప్పటివరకు 60 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలి విడత సీట్లు కేటాయించే నాటికి ఈ సంఖ్య 80 వేలు దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఇంజనీరింగ్ విభాగంలో 1,56,879 మంది అర్హత సాధించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో ఎక్కువ మంది కంప్యూటర్ కోర్సులకే ఆప్షన్లు ఇస్తున్నారు. ఇందులో ఎంసెట్, జేఈఈ ర్యాంకర్లు కూడా ఉన్నారు. తొలిరోజు దాదాపు 6 వేల మంది ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో 5 వేలు సీఎస్సీ, ఇతర కంప్యూటర్ కోర్సులవే ఉన్నాయి. తొలి విడత కౌన్సెలింగ్‌లో కూడా 62,079 సీట్లు చేర్చారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.05 లక్షల ఇంజనీరింగ్ సీట్లుండగా, ఇందులో సివిల్ 3087, మెకానికల్ 2667, ఎలక్ట్రికల్ 3854 సీట్లు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 30 శాతం తగ్గాయి. ప్రైవేటు కాలేజీలు కోరినట్టు బ్రాంచీల్లో సీట్ల మార్పు జరిగితే కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో సీట్లు పెరుగుతాయి. ఎందుకంటే గత ఏడాది సివిల్‌లో 36.38, మెకానికల్‌లో 31.92, ఈఈఈలో 56.49 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఆ సీట్లపై ప్రైవేటు కాలేజీల గురి కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో ఈ ఏడాది భారీగా సీట్లున్నాయి. అయినప్పటికీ విద్యార్థుల డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ప్రైవేటు కాలేజీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. జేఈఈ, ఎంసెట్‌లో 3 వేల లోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థుల చేత మొదటి కౌన్సెలింగ్‌లోనూ దరఖాస్తు చేయిస్తున్నాయి. వీళ్లకు కంప్యూటర్ కోర్సుల్లో తొలి దశలోనే సీట్లు వచ్చే అవకాశం ఉంది. ముందు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పటికీ, ఆఖరి కౌన్సెలింగ్ వరకూ వీళ్లు కాలేజీల్లో చేరరు. జేఈఈ ర్యాంకు ఉండటంతో జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరతారు. రాష్ట్రంలో అన్ని కౌన్సెలింగ్‌లు పూర్తయిన తర్వాత రాష్ట్రంలో తొలి విడతలో వచ్చిన సీటును వదులుకుంటున్నారు. అప్పుడు ప్రైవేటు కాలేజీలు స్పాట్ అడ్మిషన్లో ఇష్టమొచ్చిన వాళ్లకు భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని సీట్లు ఇస్తున్నట్టు ఆరోపణలున్నాయి. అయితే, దీన్ని కట్టడి చేయడం ఎవరి వల్లా కావడం లేదని సాక్షాత్తు అధికార వర్గాలు చెబుతుండటం కొసమెరుపు. -
సూపర్ వాటర్ ఫిల్టర్ : ధర రూ. 30
సాక్షి, బెంగళూరు : ఔత్సాహిక యువకుడు తన వినూత్న ఆలోచనతో విప్లవాత్మక ఆవిష్కరణకు నాంది పలికాడు. అతి తక్కువ వ్యయంతో పోర్టబుల్ వాటర్ ఫిల్టర్‌ను తయారు చేసిన పలువురి ప్రశంసలందు కుంటున్నాడు. మామూలు క్యాప్‌లా వుండే ఈ చిన్న పరికరం ద్వారా ఎంత మురికిగా ఉన్న నీటినైనా క్షణాల్లో పరిశుభ్రంగా మార్చుకోవచ్చు. మనం వినియోగించే అతి చిన్న వాటర్ బాటిల్స్‌కు దీన్ని వాడుకోవచ్చు. ‘ప్యూరిట్ ఇన్ పాకెట్’ పేరుతో తీసుకొచ్చిన ఈ సాధనం ధర కేవలం రూ. 30 మాత్రమే. 30 రూపాయలలో స్వచ్ఛమైన తాగునీటిని అందించే ఈ పరికరాన్ని త్వరలోనే పెద్ద ఎత్తున వినియోగంలోకి తేవాలని ప్రయత్నంలో ఉన్నారు దీని రూపకర్త. దీంతోపాటు సముద్ర నీటిని కూడా శుద్ధమైన తాగునీటిగా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అంతేకాదు ఈ ప్రక్రియలో దీన్నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయాలనేది తమ భవిష్యత్తుగా ప్రణాళికగా చెప్పారు. కర్నాటకకు చెందిన 22 ఏళ్ల మెకానికల్ ఇంజనీర్ నిరంజన్ కరాగి దీని సృష్టికర్త. ఆవిష్కరణకు నాంది ఎలా అంటే బెల్గాంలోని ఒక ప్రభుత్వ పాఠశాల పక్కన ఉన్న స్టేడియంలో ఆడటానికి వెళ్ళాడు, అక్కడ విద్యార్థులు ట్యాప్ నుండి అపరిశుభ్రమైన నీరు తాగడం చూసి కలత చెందాడు. మరుసటి రోజు సాయంత్రం మార్కెట్లో వాటర్ ఫిల్టర్ల రేట్లను పరిశీలించాడు. వాటి ఖరీదు అతనిని బాధ మరింత రెట్టింపైంది. దీంతో పరిష్కారం వైపు దృష్టి సారించాడు. ఆ ఆలోచన కొత్త ఆవిష్కారానికి బీజం వేసింది. కొన్ని రోజుల నిరంతర శ్రమ తరువాత 100 లీటర్ల నీటిని శుభ్రంచేసే చిన్న వడపోత యంత్రాన్ని రూపొందించాడు. దాన్ని తన ప్రొఫెసర్లకు చూపించాడు, కాని అది చాలా చిన్న ప్రాజెక్ట్ కావడంతో వారు దానిపై ఆసక్తి చూపలేదు. అయినా ఎక్కడా నిరాశ చెందకుండా పట్టుదలగా ముందుకు కదిలాడు. సరసమైన ధరలో దీనిని పేదలకు అందించే దిశగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నాడు. కానీ ఇందుకోసం పెట్టుబడి కావాలి కదా. చివరకు దేశ్‌పాండే ఫౌండేషన్ వారి సహకారంతో 2017లో రూ .12,000 పెట్టుబడితో ఈ ట్యాప్ లాంటి ఫిల్టర్లను తయారు చేయడం ప్రారంభించాడు. అసలు దీని ప్రారంభ ధర 20 రూపాయలు మాత్రమే. అయితే జీఎస్టీ ప్రవేశపెట్టిన తరువాత అతను దానిని రూ .30 కి పెంచాల్సి వచ్చిందట. ప్రధానంగా సోషల్ మీడియా ద్వారానే తన పరికరానికి ఎక్కువ ప్రాధాన్యత వచ్చిందని నిరంజన్ సంతోషంగా చెబుతారు. ప్రస్తుతం 2000 లీటర్ల నీటిని శుభ్రపరచగల అధునాతన ఫిల్టర్‌ను అభివృద్ధి చేస్తున్నాననీ, దీనికి రూ .100 -150 రూపాయలు ఖర్చు అవుతుందని నిరంజన్ తెలిపారు. అలాగే మార్కెట్లో లభించే ఖరీదైన ఫిల్టర్లతో పోలిస్తే తన నిర్నల్ భారతదేశంలో అత్యంత సురక్షితమైన, శుభ్రమైన తాగునీటిని అందిస్తుందని, 95 శాతం బ్యాక్టీరియాను నిర్మూలిస్తుందని హామీ ఇస్తున్నారు. అవార్డులు కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన ఎలివేట్ 100 కార్యక్రమంలో రూ .20 లక్షల సీడ్ ఫండింగ్, సహా వివిధ కార్యక్రమాలలో అవార్డులను గెలుచుకుంది. పాల్గొన్న 1,700 మందిలో బహుమతి నిరంజన్ గెలుచుకున్నారు. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ మరియు ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌కెసిసిఐ) నుండి ప్రశంసలు అందుకోవడం విశేషం. తాజాగా సెప్టెంబర్ 7 న బెంగళూరులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ‘యంగ్ ఎంటర్ప్రెన్యూర్’ అవార్డును కూడా అందుకున్నారు. వాస్తవానికి, ఈ ప్రత్యేక వడపోత పరికరం డల్లాస్‌లోని భారతీయుల ఆధ్వర్యంలోని 'కుచ్ కుచ్ బాతేం' అనే రేడియో కార్యక్రమంలో ప్రసారం కావడంతో వెలుగులోకి వచ్చింది. యుఎస్‌లోని 40 ప్రాంతాలలో ఇది ప్రసారం కావడంతో కార్యక్రమం తరువాత, నిరంజన్ తన ఉత్పత్తికి విరివిగా ఆర్డర్లు వచ్చాయి. నిరంజన్ వ్యాపారానికి దేశంలోని కర్ణాటక , మహారాష్ట్రలతోపాటు, సింగపూర్, ఖతార్, ఆఫ్రికానుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. A 30 Rs portable water filter. pic.twitter.com/8L01UrCbJ5 — Aggressive Indian (@bharat_builder) September 9, 2019 -
ఇండియా వద్దనుకుంది.. జపాన్ కళ్లకద్దుకుంది
చెన్నై : వాయు కాలుష్యానికి ప్రధాన కారణం.. వాహనాలు. మన దేశంలో వీటి వినియోగం రోజురోజుకు పెరుగుతుంది. ప్రస్తుతం ఇంటికో బైక్ అయినా తప్పనిసరి అన్నట్లు మారాయి పరిస్థితులు. ఈ వాహనాల నుంచి వెలువడే పొగలో ఉండేవన్ని కాలుష్య.. అనారోగ్య కారకాలే. అలా కాకుండా ఈ వాహనాల నుంచి వెలువడే పొగలో ఆక్సిజన్ ఉంటే. వినడానికి కాస్త అత్యాశగా అనిపిస్తున్న ఇది మాత్రం వాస్తవం. కొయంబత్తూరుకు చెందిన ఓ మెకానికల్ ఇంజనీర్ ఈ అద్భుతాన్ని నిజం చేసి చూపాడు. హైడ్రోజన్ వాయువును ఇందనంగా వినియోగించుకుని.. ఆక్సిజన్‌ను విడుదల చేసే ఓ ఎకో ఫ్రెండ్లీ ఇంజన్ని కనుగొన్నాడు. సౌందిరాజన్ కుమారసామి అనే మెకానికల్ ఇంజనీర్ ఈ అద్భుతాన్ని సృష్టించాడు. ఈ క్రమంలో అతను మాట్లాడుతూ.. ‘ఇది నా కల. దీన్ని సాధించడం కోసం దాదాపు పదేళ్ల నుంచి శ్రమిస్తున్నాను. హైడ్రోజన్ని ఇందనంగా వినియోగించుకుని.. ఆక్సిజన్ని విడుదల చేసే ఈ ఎకో ఫ్రెండ్లీ ఇంజన్ని కనుగొన్నాను. ప్రపంచంలో ఇలాంటి రకమైన ఆవిష్కరణ ఇదే మొదటిది. దీన్ని భారతదేశంలో వినియోగంలోకి తీసుకురావాలనేది నా కల. అందుకోసం ప్రతి కార్యాలయం తలుపు తట్టాను. కానీ ఎవరూ దీనిపట్ల సానుకూలంగా స్పందించలేదు. దాంతో జపాన్ ప్రభుత్వాన్ని కలిసి దీని గురించి వివరించాను. వారు నాకు అవకాశం ఇచ్చారు. త్వరలోనే ఈ ఇంజన్ని జపాన్‌లో ప్రారంభిచబోతున్నాను’ అని తెలిపారు సౌందిరాజన్. -
ఏడాదికి రూ.70 లక్షల వేతనం
ఒక సాదాసీదా ఎలక్ట్రిషియన్ కొడుకు... అప్పటికే మూడు సార్లు అనుకున్న లక్ష్యం విఫలమైంది. అయినప్పటికీ ఎక్కడా కూడా పట్టు వదలలేదు. ఎలాగైనా తన లక్ష్యాన్ని చేరుకోవాలని నిరంతరం శ్రమించాడు. ఎట్టకేలకు ఆ విద్యార్థి చెంతకే ఓ అమెరికన్ కంపెనీ వచ్చి వాలింది. ఆ విద్యార్థిని వదులుకోలేక భారీ ప్యాకేజీతో తన కంపెనీలోకి నియమించుకుంది. ఆ విద్యార్థే జామియా మిల్లియా ఇస్లామియా(జేఎంఐ)కు చెందిన మహమ్మద్ ఆమీర్ అలీ. అతడి స్టోరీ యువతరానికి స్ఫూర్తిదాయకం. జేఎంఐ స్కూల్ బోర్డు పరీక్షల్లో అలీ మంచి మార్కులు సంపాదించాడు. కానీ మూడేళ్ల పాటు బీటెక్ కోర్స్‌లో సీటే దొరకలేదు. తొలి ప్రయత్నంలో నిరాశ. ఆ తర్వాత రెండు సార్లు విఫలమే. అయినప్పటికీ ఎక్కడ కూడా పట్టువిడవలేదు. మూడు సార్లు విఫలమనంతరం అలీ ఆశలకు కాస్త ఊరటనిస్తూ.. జేఎంఐలో డిప్లొమాలో మెకానికల్ ఇంజనీరింగ్ అర్హత లభించింది. అప్పటికే పలుమార్లు విఫలమైన అనంతరం జేఎంఐలో సీటు దక్కించుకున్న అలీ.. నలుగురికి ఉపయోగపడేలా ఏదైనా సాధించాలనుకున్నాడు. భవిష్యత్తు తరం వారికి ఉపయోగపడే ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రాజెక్ట్ వర్క్‌చేయడం ప్రారంభించాడు. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు సరియైన ఛార్జింగ్ సదుపాయాలు లేవు. వీటిపై ఎక్కువగా దృష్టిసారించాడు అలీ. ఒకవేళ అలీ ప్రాజెక్ట్ విజయవంతమైతే.. ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సదుపాయాలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను అమెరికా కంపెనీ ఫ్రిసన్ మోటార్ వ్రెక్స్ గుర్తించింది. జేఎంఐ వెబ్సైట్లో ఈ ప్రాజెక్ట్ వర్క్‌ను చూసిన ఫ్రిసన్ వెంటనే యూనివర్సిటీ అధికారులను సంప్రదించింది. స్కైప్, టెలిఫోనిక్ ఇంటర్వ్యూల ద్వారా నెల పాటు అలీతో నిరంతరం కమ్యూనికేషన్ జరిపిన ఫ్రిసన్.. బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇంజనీర్‌గా తన కంపెనీలోకి నియమించుకుంది. వేతనం ఎంత అనుకుంటున్నారు? వింటే మీరే ఆశ్చర్యపోతారు. 1,00,008 డాలర్లు అంటే సుమారు 70 లక్షల రూపాయలన్నమాట. ఒక జామియా విద్యార్థికి ఈ మేర వేతనంతో ఉద్యోగం దొరకడం ఇదే తొలిసారి. జేఎంఐ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇదే అత్యధిక ప్యాకేజీ అని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. అలీ తండ్రి శంషాద్ అలీ జేఎంఐలోనే ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నారు. ఎలక్ట్రిక్ పరికరాలు ఎలా పనిచేస్తాయని తనను చాలాసార్లు అలీ అడుగుతుండే వాడని శంషాద్ చెప్పారు. -
కోహ్లికి గట్టిగా బుద్ధి చెప్పాలని..!
స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే భారత్ క్రికెట్ జట్టు కోచ్ పదవి నుంచి తప్పుకోవడానికి కెప్టెన్ విరాట్ కోహ్లియే కారణమని అంతా భావిస్తున్న సంగతి తెలిసిందే. కుంబ్లేను అవమానకరరీతిలో పదవి నుంచి తప్పుకునేలా చేసిన కోహ్లికి గట్టిగా బుద్ధి చెప్పాలని ఓ అభిమాని భావించాడు. అందుకే, వృత్తిపరంగా మెకానికల్ ఇంజినీర్ అయినప్పటికీ, భారత్ క్రికెట్ కోచ్ పదవికి అతను దరఖాస్తు చేశాడు. ఓ నిర్మాణ కంపెనీలో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న 30 ఏళ్ల ఉపేంద్రనాథ్ బ్రహ్మచారి తాజాగా భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేశాడు. 'అహంకారి అయిన కోహ్లిని సరైన దారిలో పెట్టేందుకే' తాను కోచ్ పదవికి దరఖాస్తు చేసినట్టు అతను తెలిపాడు. బీసీసీఐ వెబ్‌సైట్‌లోని ఈమెయిల్ఐడీ ఆధారంగా అతను ఈ దరఖాస్తు చేశాడు. కోచ్ పదవి నుంచి కుంబ్లేను తొలగించడానికి కోహ్లియే కారణమని దేశంలోని కోట్లాదిమంది క్రికెట్ ఫ్యాన్స్ అనుకుంటున్నట్టే తాను భావిస్తున్నట్టు అతను తన దరఖాస్తులో తెలిపాడు. 'లెజండరీ క్రికెటర్ అనిల్‌కుంబ్లే కోచ్ పదవి నుంచి తప్పుకోవడంతో నేను ఈ పదవికి దరఖాస్తు చేయాలని నిర్ణయించాను. ఎందుకంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి లెజండరీ క్రికెటర్లు కోచ్‌గా అవసరం లేదు. బీసీసీఐ ప్రకటన ప్రకారం మరోసారి మాజీ క్రికెటర్‌ను కోచ్‌గా ఎంపిక చేసినా.. కుంబ్లే తరహాలోనే ఆయనను కూడా కోహ్లి అవమానిస్తాడు. కాబట్టి ఎలాంటి క్రికెట్ నైపుణ్యం లేకున్నా నేనే కోచ్ పదవికి పర్ఫెక్ట్ చాయిస్. అహంకార పూరిత వైఖరితో నేను సర్దుకోగలను. మెల్లగా కోహ్లిని నేను సరైన దారిలోకి తీసుకొస్తాను. అప్పుడు బీసీసీఐ ఓ లెజండ్ క్రికెటర్‌ను కోచ్‌గా నియమించుకోవచ్చు' అంటూ బ్రహ్మచారి తన దరఖాస్తులో సరదాగా కామెంట్ చేశాడు. -
ఇక మెకానికల్ ఇంజనీర్లకు ఉద్యోగాలే ఉద్యోగాలు
ఇక మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు ఉద్యోగాలే ఉద్యోగాలు. పదిహేడు దేశాలు ఇప్పుడు తలుపులు బార్లా తెరిచి ఉద్యోగాలిస్తాం రండి అని పిలిచేందుకు రెడీ అవుతున్నాయి. మానవ వనరుల శాఖ ప్రయత్నాల వల్ల భారతదేశం ఇప్పుడు వాషింగ్టన్ ఒప్పంద దేశాల కూటమిలో భాగస్వామి అయింది. ఇందువల్ల భారత ఇంజనీర్లు సభ్య దేశాలలో ఉద్యోగాలకు ఆయా దేశాల వారితో సమానంగా పోటీ పడొచ్చు. శుక్రవారం ఈ ఒప్పందంలో భారత్ సంతకం చేసింది. ఇందులో జపాన్, మలేషియా, కొరియా, న్యూజీలాండ్, చైనా, ఐర్లండ్, యునైటెడ్ కింగ్ డమ్, అమెరికా, రష్యా, సింగపూర్, టర్కీ, కెనడా, చైనీస్ తైపే, హాంకాంగ్ లు సభ్యదేశాలు. తొలి దశలో 200 కు పైగా ఇంజనీరింగ్ కాలేజీలను తొలి శ్రేణిగా గుర్తించి, ఆ కాలేజీల విద్యార్థులకు ఒప్పంద దేశాల్లో ఉపాధి అవకాశాలు అందచేస్తారు. తరువాత రెండవ శ్రేణిలోని కాలేజీల ప్రమాణాలు మెరుగుపరిచి విద్యార్థులకు ఉద్యోగార్హత కల్పిస్తారు. దీని వల్ల భారత్ కూడా ఇంజనీరింగ్ విద్యకు ఒక ప్రధాన కేంద్రంగా తయారవుతుంది. దేశదేశాల విద్యార్థులు ఇక్కడ చదువుకునేందుకు వస్తారు. అయితే ఇది ఐటీ ఇంజీనీర్లకు వర్తించదు. వారు వాషింగ్టన్ ఒప్పందం కాక, సియోల్ ఒప్పంద పరిధిలోకి వస్తారు. సియోల్ ఒప్పందంలో భారత్‌ను భాగస్వామిగా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది కూడా జరిగితే మన విద్యార్థులకు ఉపాధాఇఅవకాశాలు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతాయి. -
ఆబాలగోపాలాన్ని విమానం ఎక్కించాడు!
ఊరికిచ్చిన మాట హర్యానా రాష్ట్రం కైతాల్ జిల్లాలో ఉన్న ఆ ఊరి పేరు కైసాల్. అప్పుడప్పుడు ఆకాశంలో చిన్నగా కనిపించే విమానాన్ని చూడడం తప్ప... ఆ ఊరి వాళ్లకు విమానం గురించి ఏమీ తెలియదు. విమానం ఎక్కడం అనేది ఇక కలలో మాట. ఇదే గ్రామానికి చెందిన బహదూర్ గుప్తా ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో మెకానికల్ ఇంజినీర్‌గా పని చేస్తూ ఉండేవాడు. గుప్తా ఊరికి వస్తే చాలు చిన్నాపెద్దా అతడిని అడిగే ప్రశ్నలన్నీ ఒకేలా ఉండేవి. ‘‘విమానం ఎంత పెద్దగా ఉంటుంది. మన ఊరంత ఉంటుందట కదా!?’’ ‘‘విమానం నుంచి కిందికి చూస్తే మనం చీమల్లా కనిపిస్తామా?’’ ఇక పిల్లలు అయితే ‘మమ్మల్ని విమానం ఎక్కించండి అంకుల్!’ అంటూ ఎప్పుడూ అడుగుతుంటారు. ‘‘తప్పకుండా’’ అని వాగ్దానం చేశాడు గుప్తా. వాగ్దానం అయితే చేశాడుగానీ, ‘ఇది విమానం’ ‘ఇందులో ఇలాంటి సౌకర్యాలు ఉంటాయి’ ‘పైలట్ ఇక్కడ కూర్చుంటాడు’ ఇలాంటి విషయాలను పూసగుచ్చినట్లు చెప్పడం ఎలా? ఆలోచించే క్రమంలో బహదూర్‌కు ఒక ఐడియా తట్టింది. అదే ఫాంటసీ ఫ్లైట్! బహదూర్ వ్యయప్రయాసలకోర్చి నిర్మించిన ‘ఫాంటసీ ఫ్లైట్’ అచ్చం విమానంలా ఉండడం మాత్రమే కాదు...లోపల కూడా విమానంలో ఉండే సౌకర్యాలు, వస్తువులు ఉంటాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా కైసాల్ గ్రామ ప్రజలందరూ ఈ విమానంలోకి ఎక్కి ఆనందించారు. పిల్లలకు ఈ విమానం చూపుతూ దాని గురించిన సమాచారాన్ని అరటిపండు వలిచి పెట్టినట్లు వివరిస్తుంటాడు బహదూర్. దేశవ్యాప్తంగా ఎంతోమంది గ్రామీణ విద్యార్థులు ఈ విమానాన్ని చూడడానికి వస్తుంటారు. ఇక్కడికి రావడం అనేది పిల్లలకు వినోద, విజ్ఞానయాత్రగా మారింది. ఒకేసారి 200 నుంచి 300 వరకు పిల్లలు ఈ విమానాన్ని చూడవచ్చు. పిల్లలు ‘కెప్టెన్ క్యాప్’ పెట్టుకొని, ఎయిర్ హోస్టెస్ డ్రెస్ వేసుకొని ఆనందిస్తుంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ‘ఫ్లైయిట్ ట్రైనింగ్ స్కూల్’గా కూడా ఉపకరిస్తుంది.