medium
-
ఇకపై హిందీలోనూ ఇంజినీరింగ్.. ఐఐటీ జోధ్‌పూర్‌లో చేరొచ్చు
దేశంలో నూతన ఆవిష్కరణల విషయంలో రాజస్థాన్ ఎప్పుడూ ముందుంటుంది. విద్య లేదా వైద్యం... ఏదైనా ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ఏదో ఒక నూతన ఆవిష్కరణలు చేస్తూనే ఉంటారు. తాజాగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఐఐటీ ఓ వినూత్న ఆవిష్కరణ చేసింది.ఇకపై ఐఐటీ జోధ్‌పూర్‌లో చేరే విద్యార్థులు బీటెక్ కోర్సును హిందీ మీడియంలో చదువుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్డ్ ఆధారంగా విద్యార్థులకు బీటెక్‌లో ప్రవేశం కల్పిస్తారు. దేశంలో హిందీలో బీటెక్ చదువులను అందించే తొలి ఐఐటీగా జోధ్‌పూర్ ఐఐటీ నిలిచింది.ఆంగ్లంలో పరిమిత ప్రావీణ్యం కలిగిన విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని జోధ్‌పూర్ ఐఐటీ ఈ ప్రయత్నం మొదలుపెట్టింది. జాతీయ విద్యా విధానం 2020 కింద ఈ నూతన కోర్సును ప్రవేశపెడుతున్నారు. జోధ్‌పూర్ ఐఐటీలో ఇకపై హిందీ, ఇంగ్లీష్ మీడియంలలో బిటెక్ చేయవచ్చు. ఈ ప్రయోగం విజయవంతమైతే దేశంలోని ఇతర ఐఐటీలలో కూడా దీనిని అమలు చేసే అవకాశాలున్నాయి.దేశంలోని 50 శాతం మంది విద్యార్థులు భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని కలలుకంటుంటారు. అయితే ఆంగ్లంలో ఈ కోర్సులు ఉండటం వలన చాలామంది విద్యకు దూరమవుతున్నారు. ఈ లోటును భర్తీ చేసేందుకే జోధ్‌పూర్ ఐఐటీ ఇంజినీరింగ్ కోర్సులను హిందీ మాధ్యమంలో ప్రవేశపెడుతోంది. -
‘ఆంగ్ల బోధనపై చంద్రబాబు విమర్శలు చేయడం సిగ్గుచేటు’
-
ఎందుకింత తెగులు..?
తెలుగుమీడియం ఆకస్మిక రద్దుపై విమర్శల వెల్లువ ముందస్తు కసరత్తు లేకుండానే నిర్ణయం మున్సిపల్, నగరపాలక పాఠశాలల విద్యార్థుల ఆందోళన తెలుగు రాష్ట్రం.. అయితే తేనెలూరించే తెలుగు నుడికారంపై తెలుగుదేశం ప్రభుత్వమే కత్తిగట్టింది. ఈ ఏడాది నుంచి మున్సిపల్, నగరపాలక పాఠశాలల్లో తెలుగు మాథ్యమాన్ని రద్దు చేసి..ఆంగ్ల మాథ్యమమే నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆంగ్ల భాషపై మోజు కంటే కార్పొరేటుపై మోజే ఇందుకు కారణమంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకింత తెగులు.. అంటూ ప్రభుత్వ నిర్ణయానికి విద్యార్థులు, తల్లిదండ్రులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంగ్లిష్ మీడియం క్లాసుల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయకుండానే ఇంత హడావుడి నిర్ణయం ఏమిటని ఉపాధ్యాయులు ‘నారాయణ..నారాయణ’అంటున్నారు. రాయవరం (మండపేట) : దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణదేవరాయులు తెలుగు భాష కీర్తిని కొనియాడితే, తెలుగు పౌరుషాన్ని తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ప్రపంచానికి చూపించారు. తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటూ ఇంగ్లిష్ కవి ప్రశంసించారు. తెలుగు భాషకు ఉన్న ఇంతటి ఔనత్యాన్ని తెలుసుకుండీ కూడా.. కార్పొరేటు మోజుతో.. చంద్రబాబు హైటెక్ ప్రభుత్వం మున్సిపల్, నగరపాలక సంస్థల పాఠశాలల్లో తెలుగు భాషను పాతరేసేందుకు సిద్ధమవుతోందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జిల్లాలో ఇదీ పరిస్థితి.. రాజమహేంద్రవరం, కాకినాడ కార్పొరేషన్లతోపాటు రామచంద్రపురం, మండపేట, అమలాపురం, సామర్లకోట, పెద్దాపురం, తుని, పిఠాపురం మున్సిపాల్టీల్లో 226 ప్రాథమిక, 12 ప్రాథమికోన్నత, 47 ఉన్నత పాఠశాలలున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో 15,035, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1,461, ఉన్నత పాఠశాలల్లో 19,760 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 18,156 మంది బాలురు, 18,100 బాలికలు ఉన్నారు. ఉన్న పళంగా ఈ పాఠశాలల్లో ఆంగ్ల మాథ్యమం ప్రవేశపెట్టడంతో వారందరూ అయోమయ పరిస్థితిలో పడ్డారు. ఏకపక్ష నిర్ణయం.. మున్సిపల్ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టింది. ముందస్తు కసరత్తు లేకుండా ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ విధానం అమలు చేయాలంటూ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ తీసుకున్న ఈ నిర్ణయం వీరిని కలపరపెడుతున్నాయి. ఒక్కసారిగా ఆంగ్ల మాథ్యమం ప్రవేశపెడితే పాఠాలు బోధించే ఉపాధ్యాయులకూ కష్టమే. విద్యకు దూరమయ్యే ప్రమాదం.. మున్సిపల్ పాఠశాలల్లో పేద, బడుగు, బలమీన వర్గాల విద్యార్థులే ఎక్కువగా ఉంటారు. ఆంగ్ల భాష అందరికీ అవసరమే అయినా.. తెలుగు మీడియం పూర్తిగా పక్కనబెట్టి.. కేవలం ఇంగ్లిష్ మీడియం చదవాలంటే విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రంలో తెలుగు భాషకు పట్టం కట్టాల్సింది పోయి తెలుగును విద్యార్థి దశ నుంచే దూరం చేయడం సిగ్గచేటని పలువురు విమర్శిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలను చూసైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వైఎస్సార్ హయాంలో.. 2009లో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పేద విద్యార్థులకు ఇంగ్లిష్ చదువులు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో సక్సెస్ పేరుతో ఆరో తరగతి నుంచి తెలుగుతో పాటు ఆంగ్ల మాథ్యమం ప్రవేశ పెట్టారు. అయితే తెలుగు మీడియం రద్దు చేయలేదు. విద్యార్థులు ఆసక్తిని బట్టి ఇంగ్లిష్ మీడియంలో చదువుకునే అవకాశం కల్పించారు. ఈ నిర్ణయాన్ని ప్రజలు ఎంతో మెచ్చుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం తెలుగు మీడియాన్ని పూర్తిగా రద్దు చేయడం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందనే పలువురు విమర్శిస్తున్నారు. తొందరపాటు చర్య.. మున్సిపల్, కార్పొరేషన్ స్కూల్స్‌లో ఒకేసారి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం తొందరపాటు చర్య. ఇంగ్లిషుతో పాటు మాతృభాషను సమాంతరంగా కొనసాగించాలి. బలవంతపు చదువు వల్ల విద్యార్థులు చదువుకు దూరమవుతారు. – కవి శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ మీడియం ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలి విద్యార్థి మీడియంను ఎంచుకునే స్వేచ్ఛను కల్పించాలి. ఒకేసారిగా ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టడం, ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణ ఇవ్వకపోవడం వల్ల గందరగోళం ఏర్పడుతుంది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలి. – టి.కామేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్ -
తెలుగు మీడియం రద్దు దారుణం
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజా ధ్వజం కాకినాడ సిటీ : మున్సిపల్ స్కూల్స్‌లో తెలుగు మీడియం రద్దు చేయడం దారుణమని ఎస్ఎఫ్ఐ ఆందోళన వ్యక్తం చేసింది. స్థానిక కచేరిపేటలో ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో నిర్వహించిన ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు ఆర్. ఈశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి టి.రాజా మాట్లాడుతూ విద్యా రంగాన్ని ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తోందని ఆరోపించారు. మున్సిపల్ పాఠశాలలో తెలుగు మీడియం రద్దు వల్ల జిల్లాలో 38 వేల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారన్నారు. దేశం అంతా మాతృభాషలోనే విద్య ఉంటే రాష్ట్రంలో మాత్రం తెలుగు మీడియాన్ని రద్దు చేయడంతో విద్యా రంగానికి తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తుందో అర్ధమవుతుందన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఈ నెల 24న జిల్లాలోని అన్ని మున్సిపల్ కేంద్రాలలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం నిర్ణయం ఉపసంహరించకుంటే పెద్ద సంఖ్యలో విద్యార్థులను సమీకరించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సూరిబాబు, రామ్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఆంగ్ల మాధ్యమంపై ఊగిసలాట
భీమవరం టౌన్ : మున్సిపల్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ విద్యాబోధన ఊగిసలాటలో పడింది. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల యాజమాన్య పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రవేశపెట్టాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంలో మంత్రులు, అధి కారుల వ్యాఖ్యలు గందరగోళానికి గురి చేస్తున్నాయి. మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాబోధన ఉంటుం దని పేర్కొనగా.. విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు ఉంటాయని ప్రకటించారు. ఈ పాఠశాలల్లో జూన్ 11 నుంచి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. ఏ మాధ్యమంలో విద్యాబోధన చేస్తారనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత మాత్రం రాలేదు. తొలుత తెలుగు, ఆంగ్ల మాధ్యమాలకు సంబంధించి పాఠ్య పుస్తకాల కోసం ఇండెంట్ ఇవ్వాలంటూ ఉన్నతాధికారులు నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలొచ్చాయి. అందుకు అనుగుణంగానే జిల్లా అధికారులు ఇండెంట్ పెట్టారు. అనంతరం కేవలం ఆంగ్లమాధ్యమ పాఠ్య పుస్తకాలకు మాత్రమే ఇండెంట్ ఇవ్వాలంటూ ఆదేశించారు. దీంతో ఏం చేయాలో తెలియక జిల్లా అధికారులు ఇండెంట్ ఇవ్వకుండా మిన్నకుండిపోయారు. మెప్మా సహకారంతో.. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన దిశగా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సన్నద్ధం చేసేం దుకు ప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సహకారం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల మహిళలతో మున్సిపాలిటీల వారీగా అధికారులు సమావేశాలు నిర్వహించారు. మున్సిపల్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన అమలు చేస్తున్నామని, పిల్ల లందరినీ ఆ పాఠశాలల్లో చేర్పించాలంటూ ఇంటింటా ప్రచారం చేయించారు. ఆంగ్ల మాధ్యమంపై మక్కువతోనే తల్లిదండ్రులు తమ పిల్లలను కాన్వెంట్లకు పంపుతున్నారన్నది ప్రభుత్వ భావన. ఈ నేపథ్యంలోనే ఆంగ్లంలో బోధనతోపాటు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా 6 నుంచి 10వ తరగతి వరకు కెరీర్ ఫౌండేషన్ కోర్సుల ద్వారా విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తామని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. అయితే, ఆంగ్లమాధ్యమ బోధనకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేవు. పాఠశాలల్లో తగిన సౌకర్యాలు లేవు. మరోవైపు ఆంగ్లమాధ్యమ బోధనకు ఉపాధ్యాయులు సైతం సన్నద్ధంగా లేదు. ప్రభుత్వ పరంగా పాఠశాలల్లో చేసిన ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఏమీ లేవు. ఆంగ్లంలో బోధించేందుకు వీలుగా ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదు. పట్టణాల వారీగా పాఠశాలల సంఖ్య ఇలా.. పట్టణం ప్రాథవిుక ప్రాథవిు ఉన్నత కోన్నత పాఠశాలలు భీమవరం 35 01 06 ఏలూరు 38 04 07 నరసాపురం 20 05 06 నిడదవోలు 11 01 03 పాలకొల్లు 22 00 06 తాడేపల్లిగూడెం 19 01 06 తణుకు 14 02 01 మొత్తం 159 14 35 మాతృభాషలో బోధనే మంచిది ప్రాథమిక స్థాయి నుంచి మాతృభాషలో బోధన అవసరం. దీనివల్ల విద్యార్థుల్లో మానసిక వికాసం పెరుగుతుంది. తొలుత మాతృభాష, తరువాత హిందీ, ఆ తరువాత అంతర్జాతీయ భాషలో బోధన అవసరమని కొఠారి కమిషన్ సూచించింది. – ఎంఐ విజయకుమార్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి రెండు మాధ్యమాలూ ఉండాలి మున్సిపల్ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం బోధన ఒక్కటే పెడతామనడం సరికాదు. తెలుగులోనూ బోధన ఉండి తీరాలి. రెండూ ఉంటేనే విద్యార్థులు తమకు నచ్చిన మాధ్యమంలో చేరతారు. – టి.సత్యనారాయణమూర్తి, జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణ కార్యదర్శి పిల్లలు బడికి దూరమవుతారు బలవంతంగా ఆంగ్లమాధ్యమాన్ని రుద్దితే అర్థంకాక పిల్లలు స్కూలు ఎగ్గొట్టే ప్రమాదం ఉంది. మాతృభాషతోపాటు ఆంగ్ల మాధ్యమ బోధన కూడా అవసరమే. పూర్తిగా ఆంగ్లమాధ్యమ బోధన సరికాదు. – షేక్ సాబ్జీ, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాతృభాష బోధన అవసరం విద్యాహక్కు చట్టం ప్రకారం మాతృభాషలోనే బోధన ఉండాలి. 6వ తరగతి నుంచి ఆంగ్లమాధ్యమంలో బోధన చేస్తే బాగుంటుంది. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో బోధన ఉండి తీరాలి. – కోడి వెంకట్రావు, ప్రధానోపా«ధ్యాయుడు, భీమవరం -
పది వరకు ఆంగ్లం..ఆపై తెలుగు
ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు సక్సెస్ పాఠశాలలకు పెరుగుతున్న ఆధరణ ఇంటర్ కళాశాలలు లేక అవస్థలు ప్రైవేటుకు పంపలేకపోతున్న తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా, ఆంగ్ల మాద్యమాన్ని బోధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రారంభించిన సక్సెస్ పాఠశాలలకు మంచి ఆధరణ ఉంది. ప్రైవేటు పాఠశాలల్లో వేలాది రూపాయలు రుసుములు చెల్లించి చదివించలేని తల్లిదండ్రులు తమ చిన్నారులను ఈ పాఠశాలలకు పంపిస్తున్నారు. జిల్లాలో ఆంగ్లమాధ్యమంలో బోధించే కళాశాలలు సక్సెస్ పాఠశాలల సంఖ్యకు అనుగుణంగా లేవు. దీంతో ఆరు నుంచి పదో తరగతి వరకు ఇక్కడ చదువుతున్న వారికి ఇంటర్లో చేరాలంటే తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక ఇంగ్లిష్ మీడియం కళాశాల ఉండేలా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తల్లిదండ్రుల నుంచి విన్పిస్తోంది. - రాయవరం సక్సెస్ పాఠశాలల ద్వారా.. ఆంగ్లంలో వెనకబడి పోవడంతో సర్కారు పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు ఉన్నత విద్య, ఉద్యోగాల్లో వెనకబడి పోతున్నారని గుర్తించిన ప్రభుత్వం ప్రైవేటు ధీటుగా ఆంగ్ల మాద్యమ బోధన చేపట్టాలని నిర్ణయించింది. 2008-09 విద్యా సంవత్సరంలో సక్సెస్ పాఠశాలల పథకానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. జిల్లాలో 312 ఉన్నత పాఠశాలల్లో సక్సెస్ పాఠశాలలను ఏర్పాటు చేశారు. 2008లో ఆరో తరగతి నుంచి ఆంగ్ల మాద్యమం ప్రవేశ పెట్టగా 2013లో మొదటి బ్యాచ్ విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో తెలుగు మీడియంతో పాటుగా ఆంగ్ల మాద్యమంలోను తరగతులు బోధిస్తారు. ఎవరికి ఏ మీడియంలో ఆసక్తి ఉంటే ఆ మీడియంలో చేరే వెసులుబాటు ఉంది. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా సక్సెస్ పాఠశాలలు ఏర్పాటు చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో సుమారు 25 వేల మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాయనున్నారు. ఇంటర్లో ఇబ్బందులు.. సక్సెస్ పాఠశాలల్లో పదో తరగతి ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్న విద్యార్థులు ఇంటర్లో చేరే సమయంలో ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సక్సెస్ పాఠశాలల్లో చదువుతున్న ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల్లో 85 శాతం వరకు ఉత్తీర్ణత ఉంటుంది. కొన్ని పాఠశాలల్లో నూటికి నూరు శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ఆంగ్ల మీడియంలో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ఇంటర్‌కు వచ్చే సరికి ప్రైవేటు కళాశాలలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు వేలాది రూపాయలు చెల్లించి ప్రైవేటు కళాశాలల్లో ఆంగ్ల మీడియంలో చేర్పించడానికి ఆర్థికంగా వెనుకంజ వేయాల్సి వస్తోంది. ప్రైవేటు కళాశాలల్లో చదివించే స్తోమత లేని వారు ప్రభుత్వ కళాశాలల్లోని తెలుగు మీడియం కళాశాలల్లో చేరిపోతున్నారు. నియోజకవర్గానికి ఒక కళాశాల.. కనీసం నియోజకవర్గంలో ఒక ఇంగ్లిష్ మీడియం కళాశాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ తల్లిదండ్రుల నుంచి వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ కళాశాల రాజమండ్రి, ధవళేశ్వరం, గోకవరం, కోరుకొండ, తుని తదితర పది కళాశాలల్లో మాత్రమే ఇంగ్లిష్ మీడియం ఉంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన అధిక కళాశాలల్లో ఇంగ్లిష్ మీడియం లేదు. ఇంగ్లిష్ మీడియంపై ఆసక్తి ఉన్న విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వ కళాశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టాలని, నియోజకవర్గానికి ఒక ఇంగ్లిష్ మీడియం కళాశాల ఏర్పాటు చేయాలనే డిమాండ్ విన్పిస్తోంది. అనుమతినిస్తాం.. ప్రభుత్వ కళాశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశానికి అనుమతిస్తున్నాం. డిమాండ్‌ను బట్టి ఇంగ్లిష్ మీడియం కోరితే ఆలస్యం లేకుండా అనుమతినిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. - ఎ.వెంకటేష్, ఆర్ఐఓ, ఇంటర్ బోర్డు, రాజమండ్రి -
‘తెలుగు’లెస్సేనా!
► మున్సిపల్ పాఠశాలల్లో పూర్తిగా తెలుగు మీడియం రద్దు ► ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు సర్కార్ ► ఆందోళనలకు సిద్ధమవుతున్న సంఘాలు ► తెలుగుకు దూరం కానున్న 37,378 విద్యార్థులు దేశభాషలందు తెలుగు లెస్స అంటూ శ్రీకృష్ణదేవరాయులు తెలుగు భాషను కీర్తిస్తే.. టీడీపీ సర్కార్ మాత్రం మున్సిపల్ పాఠశాలల్లో తెలుగు ‘లెస్’ చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ పాఠశాలల్లో తెలుగు మీడియం రద్దు చేస్తూ మున్సిపల్ శాఖ హడావుడిగా ఉత్తర్వులు జారీ చేసింది. ఓ పక్క తెలుగు భాషను కాపాడుకునేందుకు భాషాభిమానులు ప్రయత్నిస్తుంటే.. మరోపక్క ప్రభుత్వం పూర్తిగా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంపై విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. తెలుగు భాషను కాపాడుకునే చర్యల్లో భాగంగా ఇప్పటికే యూటీఎఫ్ శాఖ బుధవారం అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించింది. - రాయవరం మాతృభాషపై అంత అక్కసు ఎందుకో.. తెలుగు జాతిని ఉద్ధరిస్తామని.. తెలుగు తేజాన్ని దశదిశలా వ్యాప్తి చేస్తామంటూ చెప్పుకొనే తెలుగుదేశం పార్టీ పాలనలో తెలుగు మీడియాన్ని పూర్తిగా రద్దు చేయాలన్న నిర్ణయంపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరో నాలుగు నెలల్లో విద్యా సంవత్సరం పూర్తి కానున్న తరుణంలో అత్యవసరంగా ఇంగ్లిష్ మీడియం పాఠశాలలుగా మార్పు చేయాల్సిన అవసరం ఏ మొచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మాతృభాషపై.. ప్రభుత్వానికి అంత అక్కసు ఎందుకని.. కార్పొరేట్ విద్యా సంస్థలకు మేలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుందా? అంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే యూటీఎఫ్ ఆందోళనబాట పట్టింది. ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టడంలో తప్పులేదు కానీ.. సమాంతరంగా తెలుగు మీడియం కూడా ఉండాలనే డిమాండ్ వినిపిస్తోంది. నేడు ఉపాధ్యాయ సంఘాలతో భేటీ.. మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ శాఖ సెక్రటరీ ఉపాధ్యాయ సంఘాలతో శుక్రవారం విజయవాడలో సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ సంఘాలు తమ వాణిని వినిపించబోతున్నాయి. ఉత్తర్వులు విడుదల చేసే ముందే ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదించి సాధ్యాసాధ్యాలపై చర్చించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని ఉపాధ్యాయ సంఘ నేతలు పేర్కొంటున్నారు. తక్షణం జీవోను రద్దు చేయాలి.. విద్యా సంవత్సరం ప్రారంభమై ఏడు నెలలు గడుస్తున్న తరుణంలో ఒక్కసారిగా ఇంగ్లిష్ మీడియాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం సరికాదు. ప్రభుత్వం తక్షణం జీవో 14 రద్దు చేయాలి. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడడం తగదు. తెలుగు మీడియం కూడా కొనసాగించాలి. – కవి శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ డ్రాప్ అవుట్స్ పెరుగుతాయి.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మున్సిపల్ స్కూళ్లలో డ్రాప్ అవుట్స్ పెరుగుతాయి. పాఠ్య పుస్తకాలు లేకుండా, ఇంగ్లిష్ మీడియం బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ లేకుండా హడావుడిగా ఉత్తర్వులు జారీ చేయడం తుగ్లక్ చర్యలను తలపిస్తోంది. ఆంగ్ల మాధ్యమంతో పాటు సమాంతరంగా తెలుగు మీడియం ఉండాల్సిందే. –టి.కామేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్ విద్యార్థులకు నష్టమే.. మున్సిపల్ శాఖ తీసుకున్న నిర్ణయం వల్ల విద్యార్థులకు ప్రయోజనం చేకూరకపోగా, నష్టం కలుగుతుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రెండు మాధ్యమాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. హడావుడి నిర్ణయాలు విద్యావ్యవస్థలో గందరగోళ పరిస్థితిని సృష్టిస్తాయి. – చింతాడ ప్రదీప్‌కుమార్, ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయూ దశలవారీగా అమలు చేస్తే.. మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలు చేయాలనుకోవడం మంచిదే. అయితే దశలవారీగా అమలు చేస్తే బాగుండేది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తే మరింత బాగుండేది. – తోట సత్య, విద్యార్థి తల్లి, మండపేట వారి పరిస్థితి ఏమిటి.. ఇంగ్లిష్ మీడియం చదవని వారి పరిస్థితి ఏమిటి? ఒక్కసారిగా అన్ని తరగతుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడితే ఎలా చదువుతారు. ప్రభుత్వం పునరాలోచించాలి. – ఐనవిల్లి దుర్గ, విద్యార్థి తల్లి, మండపేట -
ప్రాజెక్టులకు వరద నష్టం రూ.112 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల వరదల కారణంగా జరిగిన నష్టంపై నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మేజర్, మీడియం, మైనర్ ప్రాజెక్టులకు సంబంధించి మొత్తంగా రూ.112 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తేల్చింది. వరద నష్టంపై అంచనాలకోసం ఈ నెల 13, 14 తేదీల్లో కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో నీటిపారుదల శాఖ వరద నష్టం అంచనాలను సిద్ధం చేసింది. మేజర్ ప్రాజెక్టులకు 32 చోట్ల నష్టం జరిగిందని నీటిపారుదల శాఖ తన నివేదికలో పేర్కొంది. వీటి పునరుద్ధరణకు రూ.54.73 కోట్లు అవసరం ఉంటుందని లెక్కకట్టింది. ఇందులో రూ.50 కోట్లు కేవలం మిడ్‌మానేరు ప్రాజెక్టులో తెగిన కట్టకే అవసరమని పేర్కొంది. మీడియం ప్రాజెక్టుల కింద మొత్తంగా 5 చోట్ల నష్టం ఉందని, వాటికి మరో రూ.26 లక్షలు అవసరమని తెలిపింది. ఇక మైనర్ ఇరిగేషన్ కింద మొత్తంగా 671 చెరువుల పరిధిలో నష్టం జరిగిందని, వీటి పునరుద్ధరణకు రూ.57.58 కోట్లు అవసరమని తెలిపింది. మొత్తంగా రూ.112.88 కోట్లు అవసరం ఉంటాయని లెక్కకట్టింది. ఈ మేరకు బుధవారం నష్టం అంచనాలను ప్రభుత్వానికి అందజేసింది. -
సామరస్యమే సాధనం
త్రికాలమ్ - కె.రామచంద్రమూర్తి మహావక్తలుగా ప్రసిద్ధులైన రాజకీయనేతలు ఎందరో ఉన్నారు. కానీ జాతి నిర్మాతలుగా, ప్రాతఃస్మరణీయులుగా మిగిలినవారు కొందరే. మాటలు కడుపు నింపవు. చేతలు తోడుకాకపోతే మాటల విలువ శూన్యం. ప్రధాని నరేంద్ర మోదీ నిరుడు మొదటిసారి ఎర్రకోట నుంచి ఇచ్చిన స్వాతంత్య్ర దినోత్సవ సం దేశం దేశప్రజల గుండెల్లో ఆశ, విశ్వాసం నింపింది. 69వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా శనివారంనాటి మోదీ ప్రసంగం ప్రజల గుండెల్లో గుబులు నింపిం ది. 85 నిమిషాలు సాగిన ఎర్రకోట ఉపన్యాసం మోదీ పట్ల ఆరాధనాభావం ఉన్నవారికి సైతం ఆశాభంగం కలిగించింది. నిరుటి ఆత్మవిశ్వాసం, పదును, దూకుడు ఈ సంవత్సరం కనిపించలేదు. సంజాయిషీ చెబుతున్నట్టూ, దిద్దు బాటు చర్యల గురించి ఆలోచిస్తున్నట్టూ, అనుకున్నంత సాధించలేకపోయానని అంగీకరిస్తున్నట్టూ ప్రధాని ధ్వనించారు. పదవీ బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఎన్నో ఆశయాలూ, వ్యూహా లూ, లక్ష్యాలూ ఉంటాయి. పదవిలోకి వచ్చిన తర్వాత వాస్తవాలు క్రమంగా తెలిసివస్తాయి. పరిమితులు అర్థం అవుతాయి. పాలకుడు రాజనీతిజ్ఞుడు అయి తే తన పార్టీ లేదా ప్రభుత్వం ఏమేమి చేయడానికి ఏ విధంగా ప్రయత్నించిం దో, ఎంతవరకూ సఫలమైందో, ఎక్కడ విఫలమైందో ప్రజలకు పూసగుచ్చినట్టు ప్రోగ్రెస్ రిపోర్టు (ప్రగతి నివేదిక) సమర్పిస్తాడు. ఆ పని చేయకుండా మోదీ తన రెండో ఎర్రకోట ప్రసంగంలో ఒక శాఖ పేరు మార్పు ప్రకటించారు. మరో నినా దం (స్టార్ అప్ అండ్ స్టాండ్ అప్ ఇండియా) జనం మీదికి వదిలారు. తక్కింది చర్వితచర్వణమే. విధానాలను నినాదాల రూపంలో ప్రచారం చేసే పద్ధతి చైనా పాలకులు చాలాకాలంగా పాటిస్తున్నారు. మన దేశంలోనూ నినాదాలతో కార్య క్రమాలను పిలుచుకునే ఆచారం ఉంది. నినాదాలు సృష్టించడంలో ప్రతిభ కలి గిన మోదీ నిరుడు స్వాతంత్య్ర సందేశంలో ముఖ్యంగా అయిదు రంగాలపై దృష్టి సారించారు. 1) ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేయడం. 2) జన్‌ధన్ యోజన ద్వారా ప్రజలకు నేరుగా సబ్సిడీలు ధనరూ పంలో బ్యాంకు ఖాతాలలో జమచేయడం. 3) దేశంలోనే ఉత్పత్తిని పెంచేందుకు మేక్ ఇన్ ఇండియా విధానం. 4) దేశంలోని అన్ని ప్రాంతాలనూ అనుసంధానం చేసే డిజిటల్ ఇండియా నినాదం. 5) స్వచ్ఛభారత్ అభియాన్. ఈ అయిదు కార్యక్రమాలలో జరిగిన ప్రగతిని ప్రధాని వివరించి ఉంటే సముచితంగా ఉండేది. వాస్తవానికి జరిగింది తక్కువ. పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ కార్యక్రమాలలో చాలావరకూ గత ప్రభుత్వాల కార్యక్రమాల కొనసాగింపే. పేరుమార్చడం ప్రగతి కారకం అనుకుంటే విద్యామంత్రిత్వశాఖ పేరును రాజీవ్ గాంధీ మానవ వనరుల మంత్రిత్వ శాఖగా మార్చిన తర్వాత విద్యారంగంలో అద్భుతాలు జరిగి ఉండవలసింది. అటువంటివి ఏవీ జరగకపోగా విద్యారం గంలో ప్రమాణాలు అడుగంటుతున్నాయి. ఇదివరకు ఐఐటీలకు ప్రపంచ వ్యాప్తంగా గౌరవం ఉండేది. ఇప్పుడు ఐఐటీలలో ప్రమాణాలు పడిపోతున్నా యంటూ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వంటివారు ఆవేదన వెలిబుచ్చుతు న్నారు. వ్యవసాయ మంత్రిత్వశాఖ పేరును రైతు సంక్షేమ శాఖగా మార్చినంత మాత్రాన దేశంలో రైతు ఆత్మహత్యలు ఆగిపోవు. వ్యవసాయం గిట్టుబాటు వ్యాసంగం అయిపోదు. ఆత్మరక్షణ ధోరణి వ్యవసాయరంగం గురించీ, గ్రామీణప్రాంతాల అభివృద్ధి గురించీ ప్రధాని చాలాసేపు మాట్లాడారు. భూసేకరణ బిల్లు కారణంగా తాను రైతు వ్యతిరేకిననీ, గ్రామీణ ప్రాంతాల పట్ల తనకు శ్రద్ధాసక్తులు లేవనీ చెడ్డపేరు వచ్చినట్టు గ్రహిం చిన మోదీ మచ్చ చెరుపుకోవడానికి ప్రయత్నించినట్టు కనిపించారు. కానీ రైతుల ఆత్మహత్యలకు కారణాలు ఏమిటో, ఆత్మహత్యలు నివారించడానికి కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చేయాలో మోదీకి తెలిసినట్టు లేదు. అటువంటి అత్యంత ప్రధానమైన అంశంపైన పార్లమెంటులో చర్చ జరపాలన్న ఆలోచనా లేదు. నీతి ఆయోగ్‌లో చేరిన ప్రముఖ మేధావులకూ ఈ అంశంపైన దృష్టి సారిం చే సమయం చిక్కినట్టు లేదు. ఇప్పటికీ సగానికి పైగా జనాభా ఆధారపడిన వ్యవసాయరంగంలో రైతు మనుగడపైన అధ్యయనం చేసి ఏదో ఒక విధానానికి రూపకల్పన చేయవలసిన అవసరాన్ని ప్రధాని గుర్తించకపోవడం ఆశ్చర్యం. ఆ పని చేయకుండా తాను వ్యవసాయదారులకు ప్రాధాన్యం ఇస్తున్నాననీ, గ్రామీ ణ వికాసానికి అగ్రతాంబూలం ఇస్తాననీ చెప్పినంత మాత్రాన ప్రయోజనం ఉం డదు. పేదవారి కోసం బ్యాంకుల ద్వారాలు మొట్టమొదటిసారి తామే తెరిపిం చామంటూ మోదీ చెప్పుకోవడం స్వోత్కర్ష. ఇందిరాగాంధీ హాయాంలో జనా ర్దన్ పూజారి ఈ పని మీదే ఉన్నారని మోదీకి ఎవరు చెప్పాలి? వంద వాగ్దానాలు చేసిన నాయకులు ఎవ్వరూ చరిత్రపుటల్లో నిలబడలేదు. పంచశీల, గరీబీ హటావో వంటి కొన్ని మాత్రమే చరిత్రలో నిలుస్తాయి. మోదీ ‘మన్ కీ బాత్’ అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ‘ఫైర్‌సైడ్ చాట్’ను పోలినదే. చరిత్రలో ఎఫ్డీఆర్ చిరస్థాయిగా నిలిచిపోవడానికి కారణం ఒకే ఒక నినాదం-న్యూడీల్. అప్పుటి సామాజిక భద్రతా కార్యక్రమం చరిత్రాత్మ కమైనది. మోదీ అభిమానులు అటువంటి అద్భుతం ఆయన నుంచి ఆశించారు. దౌత్యం నెరపే దూత ఎవరు? మోదీకి ఆయన వ్యక్తిత్వమే బలం. అదే ఆయన బలహీనత. మోదీకి ఉన్నంత అతిశయం లేకపోవడం వల్లనే వాజపేయి, పీవీ నరసింహారావు వంటి ప్రధాను లు సంక్లిష్టమైన సంకీర్ణ ప్రభుత్వాలను పూర్తి పదవీకాలం నిర్వహించగలిగారు. పీవీ ప్రతిపక్ష నేత వాజపేయి ఐక్యరాజ్య సమితికి ప్రభుత్వ ప్రతినిధివర్గం నాయ కుడిగా పంపించారు. వాజపేయి అవసరమైతే ప్రతిపక్షంతో సంప్రతింపులు జరపగలిగేవారు. యూపీఏలో ప్రణబ్ ముఖర్జీ ప్రతిపక్ష బీజేపీతో సమాలోచ నలు జరిపేవారు. మోదీ స్వయంగా సోనియాగాంధీతో మాట్లాడి నిరసన మాని సరసంగా వ్యవహరించమని ఒప్పించే వాతావరణం లేదు. అది అహంకారమో, మానసిక బలహీనతో తెలియదు. ఆర్థిక సంస్కరణలకు అత్యవసరమని యూపీఏ సైతం భావించిన గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ)కి పార్లమెం టు ఆమోదం కోసం సహకరించాలంటూ రాజ్యసభలో సంఖ్యాధిక్యం ఉన్న కాం గ్రెస్ పార్టీని అడిగే వెసులుబాటు లేకపోవడం మోదీ ఎదుర్కొంటున్న అతి పెద్ద పరిమితి. మోదీ తరఫున దౌత్యం చేసే సహచరులు ఎవ్వరూ లేరు. వెంకయ్య నాయుడు లేదా అరుణ్‌జైట్లీ లేదా అమిత్ షా ఈ పాత్ర పోషించలేరు. ఎన్నికల ప్రచారంలో ప్రదర్శించిన సంఘర్షణాత్మక వైఖరినే ప్రధాని హోదాలోనూ మోదీ కొనసాగించడం వల్ల ఎన్డీఏ సర్కార్కే కాదు దేశానికీ హానికరమే. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నినాదాల, నిరసన వరదలో కొట్టుకొని పోవడం వల్ల అప్రతిష్ట ఎవరికి? కాంగ్రెస్‌కా, ఎన్డీఏకా? నష్టం ఎవరికి? సోనియాగాంధీకా, మోదీకా? ప్రధానిగా పగ్గాలు చేతబట్టిన వెంటనే పార్లమెంటులో ప్రవేశిస్తూ నేలను ముద్దాడిన మోదీ సభలో వేడిగా వాడిగా చర్చ జరుగుతుంటే, ప్రధాని సమాధానం చెప్పాలంటూ ప్రతిపక్ష నాయకులు అడుగుతూ ఉంటే పార్లమెంటు భవనంలోనే ఉండి సభకు దూరంగా ఉండటాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సర్వోన్నత చట్టసభపైన గౌరవం ఉన్నట్టా? ఇటువంటి సందర్భాలలో ఇతర ప్రధానులందరూ సభలో కూర్చొనేవారు. రెండో స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో మోదీ రాజీలేని రాజకీయవాది గానే ప్రజలకు అర్థమైనారు కానీ దేశ ప్రగతిరథానికి సారథ్యం వహిస్తున్న రాజనీ తిజ్ఞుడిగా అర్థం కాలేదు. సంకుచిత రాజకీయాలకు అతీతంగా, వ్యక్తిగత రాగద్వే షాలకు లోనుకాకుండా, దేశ రాజకీయాలకు కొత్త ఒరవడి దిద్దే వైతాళికుడిగా మోదీ చరిత్రలో స్థానం సంపాదించుకోవాలంటే 2014 సార్వత్రిక ఎన్నికలలో సాధించిన అపూర్వమైన ఘనవిజయం ఒక్కటే సరిపోదు. అన్ని రాజకీయ పక్షా లనూ, అన్ని వాదాలనూ, అన్ని మతాలనూ, అన్ని ప్రాంతాలనూ కలుపుకొని ప్రగతిబాటలో పురోగమించగలనని నిరూపించుకోవాలి. ఇచ్చిపుచ్చుకోవడం నేర్చుకోవాలి. పదిహేనవ పార్లమెంటులో బీజేపీ నాయకులు అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్‌లు సభాకార్యక్రమాలకు అంతరాయం కలిగించడం ముమ్మాటికీ తప్పేనని ఒప్పుకొని పార్టీ తరఫున దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి ఉంటే, ఇకపైన సభలో నిర్మాణాత్మకమైన చర్చ జరగాలంటూ విజ్ఞప్తి చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీని అదుపు చేసే అవకాశం ఉండేది. బీజేపీ చేసిన తప్పు చేయకుండా వచ్చే శీతా కాలం సమావేశాలలోనైనా ప్రభుత్వంతో సహకరించాలంటూ కాంగ్రెస్ పార్టీకి సవినయంగా విజ్ఞప్తి చేసి ఉంటే ప్రధానిగా మోదీ వ్యక్తిత్వం మరింత ఔన్నత్యాన్ని సంతరించుకునేది. బీజేపీని సార్వత్రిక ఎన్నికలలో తానే ఒంటి చేత్తో గెలిపించాననీ, ఎన్డీఏ ప్రభుత్వాన్ని తానొక్కడే నడిపించగలననీ, దేశాన్నీ తాను ఒంటరిగా అభివృద్ధి చేయగలననీ మోదీ భావిస్తున్నారని ఆరోపించడం లేదు. కానీ ఆ విధంగా ప్రజలకు అర్థం అవుతున్నారనే విషయాన్ని మోదీ గ్రహించాలి. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ (కాంగ్రెస్‌పార్టీ లేని భారతదేశం)ను సాధి స్తానంటూ ఎన్నికల ప్రచారంలో శక్తిమంతంగా ప్రచారం చేసిన మోదీ ‘కాంగ్రెస్ ముక్త్ రాజ్యసభ’ కోసం కనీసం 2018 వరకూ వేచి ఉండాలి. అప్పటికీ రాజ్య సభలో కాంగ్రెస్ పూర్తిగా లేకుండాపోదు కానీ ఎన్డీఏకి పూర్తి మెజారిటీ వస్తుం ది. కానీ అప్పటికి మోదీ ఐదేళ్ళ పదవీకాలం చరమాంకానికి చేరుకుంటుంది. నువ్వంటే నువ్వు క్షేత్రవాస్తవికతను విస్మరించి ఊహాలోకంలో విహరించడం ప్రధాని స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులకు తగదు. సుష్మాస్వరాజ్, వసుంధరారాజే, శివరాజ్ సింగ్ చౌహాన్‌ల ప్రస్తావన లేకుండా, వారిపైన ఉన్న ఆరోపణల గురించి మాట్లా డకుండా ఉన్నంత మాత్రాన వివాదాలు సమసిపోవు. తన ప్రభుత్వంపైన అవి నీతి ఆరోపణ రాలేదంటూ గట్టిగా చెప్పినంత మాత్రాన ప్రజలు విశ్వసించరు. రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ అండర్సన్నూ, కత్రోకీని దేశం విడిచి వెళ్ళేందుకు అనుమతించారని ఎదురుదాడి చేసినంత మాత్రాన సుస్మాస్వరాజ్‌పైన వచ్చిన ఆరోపణ వీగిపోదు. బీజేపీ నాయకులపైన ఆరోపణలు వచ్చినప్పుడల్లా కాం గ్రెస్ నాయకుల సంగతి ఏమిటంటూ హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రినీ, గోవా కాంగ్రెస్ నాయకుడినీ తెరమీదికి తెస్తే సరిపోతుందా? వారిపైన వచ్చిన ఆరోపణలకూ వీరిపై వచ్చిన ఆరోపణలకూ చెల్లు అని ప్రజలు అనుకోవాలా? కాంగ్రెస్ భ్రష్టు పట్టిందనే కదా ప్రజలు బీజేపీకి పట్టం కట్టింది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటే దొందూ దొందేననీ, నైతికత విషయంలో కాంగ్రెస్కీ, బీజేపీకీ భేదం లేదనీ ప్రజలు తీర్మానించుకోరా? ఎన్నికలలో వచ్చిన మెజారిటీలు ప్రభుత్వాల సుస్థిరతకు పూచీ ఇవ్వలేవు. 1984లో రాజీవ్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మెజారిటీ అసా ధారణమైనది. కానీ అయిదేళ్ళ తర్వాత జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపో యింది. రాజధర్మాన్నే కాదు సామరస్యతనూ, పట్టువిడుపులనూ, కార్యద క్షతనూ వాజపేయి నుంచి నరేంద్రమోదీ నేర్చుకోవాలి. మాటలతో ప్రజలను మంత్రముగ్ధులను చేయవచ్చును. కానీ ప్రజల అనుభవంలోకి వచ్చేది పాల కుల చేతలే. భారత్ వంటి సువిశాలమైన, వైవిధ్య భరితమైన, భిన్న ధోరణు లకు ఆలవాలమైన దేశాన్ని సజావుగా, సమర్థంగా పరిపాలించాలంటే మోదీకి ఛాతి కంటే విశాలమైన హృదయం ఉండాలి. ఈ వాస్తవాన్ని నరేంద్రమోదీ ఎంత త్వరగా గ్రహించి వైఖరి మార్చుకుంటే దేశానికి అంత మంచిది.