memorable
-
Virat Kohli Completes 15 Years In International Cricket: విరాట్ కోహ్లి @ 15 ఏళ్లు.. కింగ్ అరుదైన ఫొటోలు చూశారా?
-
కనకదుర్గ ఫ్లైఓవర్‌పై జర్నీ అద్భుతం..
-
కనకదుర్గ ఫ్లైఓవర్‌పై జర్నీ అద్భుతం..
సాక్షి, విజయవాడ: అత్యాధునిక సాంకేతిక పరిజ్ణానం... ఆరు వరుసలతో విశాలంగా రోడ్ నిర్మాణం. కృష్ణా నదిపై 46 పిల్లర్లపై వారధి.. విజయవాడ నగర వాసుల ట్రాఫిక్ కష్టాలకి చెక్ పెడుతూ కనకదుర్గ వారధి అందుబాటులోకి వచ్చింది. ఎన్నో ప్రత్యేకతలతో కూడిన ఈ వారధిపై ప్రయాణమంటే ఇక చెప్పేదేముంది. 500 కోట్ల రూపాయల వ్యయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించిన కనకదుర్గ వారధితో విజయవాడ వాసుల చిరకాల కోరిక నెరవేరింది. ఇప్పటి వరకు ట్రాఫిక్‌తో అష్టకష్టాలు పడిన నగరవాసులకి ఈ వారధి నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుంది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదగా వర్చువల్ పద్దతిలో ప్రారంభమైన ఈ వారధిని చూసేందుకు నగర వాసులు పోటీ పడుతున్నారు. హైదరాబాద్‌కి వెళ్లే మార్గం కావడంతో వాహనాలు ఆపి మరీ వారధి అందాలను ప్రజలు ఆస్వాదిస్తున్నారు. ఒకవైపు కృష్ణమ్మ పరవళ్లు, మరోవైపు దసరా ఉత్సవాలతో దేదీప్యమానంగా మెరిసిపోతోంది. కనకదుర్గ వారధి విజయవాడకు మణిహారంగా ప్రజలు, పర్యాటకులతో కళకళలాడుతోంది. (బెజవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం) సాయం సంధ్యవేళ కనకదుర్గమ్మ వారధిపై వాహనాలు రయ్ రయ్ మని దూసుకుపోతుంటే చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు. విజయవాడ నుంచి హైదరబాద్ వెళ్తుంటే ఆర్టీసీ కాంప్లెక్స్ దాటి రాజీవ్ గాంధి పార్క్ వద్ద ప్రారంభమయ్యే ఫ్లై ఓవర్ భవానీపురం వరకు 2.6 కిలోమీటర్ల వరకు సాగుతుంది. ఇంతటి అందమైన ఫ్లై ఓవర్ వద్ద సెల్ఫీలు తీసుకునేందుకు స్ధానికులు కుటుంబాలతో సహా తరలి వస్తున్నారు. కృష్ణమ్మ అందాలని సెల్పీలలో బందిస్తూ ఆనందపరవశులు అవుతున్నారు. దక్షిణ భారతదేశంలోనే నదిపై నిర్మించిన అతి పెద్ద ఫ్లై ఓవర్ ట్రాఫిక్ కష్టాలు తీరుస్తూ.. కృష్ణా తీరం అందాలను ఆస్వాదించే విధంగా రూపుదిద్దుకుంది. ఈ వారధిపై ప్రయాణమంటే ఓ ప్రత్యేక అనుభూతే అనడంలో ఎలాంటి సందేహం లేదు. -
ఊరూరా రాజన్న స్మరణే..
జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ ఏడవ వర్ధంతి నివాళులర్పించిన కార్యకర్తలు, అభిమానులు అన్నదానం, పాలు, పండ్ల పంపిణీ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు సాక్షిప్రతినిధి, ఖమ్మం : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ఏడవ వర్ధంతిని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వైఎస్ విగ్రహాలకు, చిత్రపటాలకు వైఎస్సార్ సీపీ నాయకులు పూలమాలలు వేసి.. నివాళులర్పించారు. ఆయన హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ఎంతో మంది నిరుపేదలు లబ్ధి పొందారని గుర్తు చేశారు. వర్ధంతి సందర్భంగా రాజన్న అభిమానులు ఆస్పత్రుల్లో పాలు, పండ్లు పంపిణీ చేశారు. నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఖమ్మంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ధంసలాపురం, అగ్రహారం, కొత్తూరు, ముస్తఫానగర్, పార్శిబంధం, నిజాంపేట, లకారం చెరువు వద్ద, గొల్లగూడెం రోడ్డు, టేకులపల్లి, శ్రీలక్ష్మినగర్, వికలాంగుల కాలనీ, రాపర్తినగర్, గాంధీచౌక్, చర్చికాంపౌండ్ తదితర ప్రాంతాల్లోని వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాల వద్ద పూలు వేసి నివాళులర్పించారు. ముస్తఫానగర్‌లో తుమ్మా అప్పిరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మందడపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాష్ట్రంలో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులు జిల్లెపల్లి సైదులు, మందడపు వెంకటరామిరెడ్డి, ఆలస్యం సుధాకర్ మాట్లాడుతూ రైతు పక్షపాతిగా, పేద కుటుంబాల్లో పెద్దన్నగా, వృద్ధుల మనుసుల్లో పెద్ద కొడుకుగా నిలబడి.. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పథకం ద్వారా వైఎస్ లబ్ధి చేకూర్చారన్నారు. కొత్తూరులో అన్నదానం చేశారు. దమ్మపేట మండలంలో వైఎస్సార్ సీపీ నాయకులు సోయం వీరభద్రం, ముల్కలపల్లి మండలం జనగ్నాథపురం సర్పంచ్ సోయం కృష్ణ ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాల్లో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. దమ్మపేటలో పులిహోర పంపిణీ చేశారు. కొత్తగూడెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉండేటి ఏసుపాదం ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపల్లి, 7 హిల్స్ సెంటర్, కూలీలైన్, బాబుక్యాంప్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పాల్వంచలో వైఎస్సార్ సీపీ నాయకులు బస్టాండ్ సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వాస్పత్రిలో పాలు, పండ్లు పంపిణీ చేశారు. పినపాక నియోజకవర్గంలోని మణుగూరు, అశ్వాపురం, పినపాక, బూర్గంపాడు మండలాల్లో వైఎస్‌కు నివాళులర్పించారు. మణుగూరు అంబేడ్కర్ సెంటర్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అశ్వాపురం, పినపాక, ఏడూళ్ల బయ్యారం మండలాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లు వెంకట్‌రెడ్డి, నేతలు అహ్మద్ హుస్సేన్, ఉడుముల తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. రూరల్ మండలం గోళ్లపాడులో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లెపల్లి సైదులు తదితరులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లో వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు నాయకులు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు పులిహోర, స్వీట్లు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వనమారెడ్డి నాగిరెడ్డి పాల్గొన్నారు. భద్రాచలంలోని మార్కెట్ సెంటర్లో గల వైఎస్సార్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పిచారు. పట్టణంలోని బ్రెష్ వికలాంగుల పాఠశాలలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లు వెంకట్‌రెడ్డి, సీనియర్ నాయకుడు కడియం రామాచారి పాల్గొన్నారు. వైరా నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వైఎస్ వర్ధంతి నిర్వహించారు. కారేపల్లి సినిమా హాల్ సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఏన్కూరులో వైఎస్సార్ వర్ధంతి నిర్వహించారు. ప్రధాన సెంటర్లో వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పులిహోర పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కుర్సం సత్యనారాయణ పాల్గొన్నారు. ఇల్లెందులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జేకే బస్టాండ్ వద్ద వైఎస్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. బయ్యారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పులి సైదులు, జిల్లా నాయకులు ఎండీ.అఫ్సర్, మాజీ కౌన్సిలర్ సంజయ్‌కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మధిరలోని వైఎస్సార్ చౌరస్తాలో వైఎస్సార్ విగ్రహానికి వైఎస్సార్ సీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజలకు పులిహోర పంపిణీ చేశారు. బోనకల్ మండలం రావినూతల గ్రామంలో వైఎస్సార్ విగ్రహానికి మల్లు నందిని పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సంయుక్త కార్యదర్శి తూమాటి నర్సిరెడ్డి, జిల్లా నాయకుడు అబ్బూరి రామకృష్ణ చౌదరి పాల్గొన్నారు. -
కోనేరు సేవలు చిరస్మరణీయం
టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు సంతాపసభలో నారా లోకేష్ కొత్తగూడెం: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కోనేరు నాగేశ్వరరావు సేవలు చిరస్మరణీయమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. బుధవారం స్థానిక కొత్తగూడెం క్లబ్లో జరిగిన కోనేరు నాగేశ్వరరావు సంతాపసభకు హాజరై.. కోనేరు చిత్రపటానికి నివాళి అర్పించి ప్రసంగించారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటివరకు కోనేరు టీడీపీలో అంకితభావంతో సేవలందించారని కొనియాడారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో పదవుల కోసం అనేకమంది పార్టీలు మారుతున్నప్పటికీ ఆయన చనిపోయేంతవరకు ఒకే పార్టీలో ఉండి సేవలందించడం అభినందనీయమన్నారు. కోనేరు క్రమశిక్షణ, అంకితభావాన్ని ప్రతి కార్యకర్త అలవర్చుకోవాలని సూచించారు. పార్టీకి వెన్నంటి ఉండే కార్యకర్తలకు తామంతా అండగా ఉంటామని తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహం పక్కనే కోనేరు విగ్రహాన్ని ఏర్పాటుచేసి విగ్రహావిష్కరణకు ఏపీ సీఎం చంద్రబాబును తీసుకువస్తామని తెలిపారు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..: కోనేరు అనుచరులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, పార్టీని నమ్ముకున్న వారిని కాపాడుకునే బాధ్యత తమపై ఉందన్నారు. తెలంగాణ టీడీపీ ఆధ్వర్యంలో కోనేరు విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ..: పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్రమంతా పర్యటిస్తానని గతంలో కోనేరు చెప్పారని గుర్తు చేశారు. ఈ సంతాపసభలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సినీ నటుడు నందమూరి తారకరత్న, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ధనసరి సీతక్క, చేకూరి కాశయ్య, మద్దినేని బేబీ స్వర్ణకుమారి, మాళోతు రాందాస్ నాయక్, కోనేరు కుటుంబ సభ్యులు కోనేరు పూర్ణచందర్రావు, కోనేరు సత్యనారాయణ (చిన్ని) తదితరులు పాల్గొన్నారు. ప్రజా నాయకులకు మరణం లేదు: మంత్రి తుమ్మల నిరంతరం ప్రజా సేవకు అంకితమయ్యే నాయకులకు మరణం ఉండదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శ్రీనగర్ కాలనీలోని కోనేరు నాగేశ్వరరావు స్వగృహంలో జరిగిన సంస్మరణ కార్యక్రమానికి హాజరై..కోనేరు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..నిజాయితీ, నిబద్దతకు మారుపేరుగా నిలిచిన వ్యక్తి కొనేరని కొనియాడారు. ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని స్మరించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, మాజీ మంత్రి జలగం ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
ధన్సింగ్ సేవలు మరువలేనివి
ఖమ్మం: టీఎస్ ఎన్పీడీసీఎల్ ఎస్ఈగా పనిచేసిన ధన్సింగ్ సేవలు మరువలేనివని ఖమ్మం, సత్తుపల్లి ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మంగళవారం ఖమ్మంలోని ఎంబీ ఫంక్షన్ హాల్లో ఎస్ఈ ధన్సింగ్ పెద్దకర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా ధన్సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధన్సింగ్ విద్యుత్‌శాఖకు చేసిన సేవలను కొనియాడారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యుత్‌శాఖ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
నర్సిరెడ్డి సేవలు మరువలేనివి : గుత్తా
చిలుకూరు: ఉపాధ్యాయ వృత్తికి నర్సిరెడ్డి చేసిన సేవలు మరవలేనివని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని బేతవోలు గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బజ్జూరి నర్సిరెడ్డి అంత్య క్రియల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన మరణం తీరని లోటు అన్నారు. సంతాపం వ్యక్తం చేసిన వారిలో మిర్యాలగూడెం ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, వేనేపల్లి చందర్రావు, తిప్పని విజయసింహారెడ్డి, డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్రబాబు, వైస్ ఎంపీపీ వట్టికూటి నాగయ్య చంద్రకళ, సర్పంచ్ తాళ్లూరి పద్మా శ్రీనివాస్, మాజీ ఎంపీపీ బజ్జూరి వెంకట్‌రెడ్డి , వివిధ పార్టీల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు, గ్రామస్తులున్నారు. -
'కాసుబ్రహ్మానందరెడ్డి సేవలు చిరస్మరణీయం'
-
పోలీసు అమర వీరుల సేవలు చిరస్మరణీయం
అనంతపురం మెడికల్: అంతర్గత భద్రత పర్యవేక్షణలో అసాంఘిక శక్తులు ఆటకట్టించే క్రమంలో అసువులు బాసిన పోలీసులు సేవలు చిరస్మరణీయమని, వారి స్ఫూర్తితో ప్రజాసేకు పునరంకితం అవుదామని ఎస్పీ రాజశేఖర్‌బాబు అన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ వారాత్సవాల సంద్భరంగా స్థానిక సర్వజన ప్రభుత్వాస్పత్రిలో సోమవారం ఆత్మకూరు సీఐ విజయకుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఎస్పీతోపాటు రిజిస్ట్రార్ హేమచంద్రారెడ్డి, ఆస్పత్రి ఆర్ఎంఓ కన్నెగంటి భాస్కర్, రక్తనిధి ఇన్చార్జి డాక్టర్ శివకుమార్, డీఎస్పీ నాగరాజు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఎస్పీ మాట్లాడుతూ యూనిఫారం ధరించి ఫోర్స్‌లు తాము నమ్మిన సిద్ధాంతాల కోసం త్యాగాలు చేస్తాయన్నారు. సమాజ పరిరక్షణలో భాగంగా అసాంఘిక శక్తులతో జరిగే పోరాటంలో పోలీసులూ అసువులు భాస్తున్నారన్నారు. 2006 తరువాత రాష్ట్రంలో మావోయిజం దాదాపు తుడిచిపెట్టుకు పోయిందన్నారు. పోలీసులు అంకిత భావంతో పనిచేయడం వల్లనే ఇది సాధ్యమయ్యిందన్నారు. ఈ రోజు ఏపీలో స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొందంటే దాని వెనుక ఎందరో పోలీసులు ప్రాణత్యాగం ఉందన్నారు. రిజిస్ట్రార్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ సమాజ శ్రేయసు కోసం రక్షణగా నిలుస్తున్న పోలీసులకు సమాజం బాసటగా నిలవాలని అన్నారు. పోలీసులు సమాజసేవలో తమ ప్రాణాలను సైతం అర్పిస్తున్నారన్నారు. కన్నెగంటి బాస్కర్, శివకుమార్, నాగరాజులు మాట్లాడారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ఎస్పీ, రిజిస్ట్రార్ ప్రారంభించారు. రక్తదానం చేసిన వారికి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఎస్ఎస్బీఎన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు రక్తదానం చేశారు. -
అమర వీరుల త్యాగాలు చిరస్మరణీయం
ఎస్పీ ఆకె రవికృష్ణ పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా బుధవారం ఎస్పీ రవికృష్ణ రక్తదానం చేశారు. పోలీసులు వినియోగించే వివిధ రకాల ఆయుధాలు, వాటి పేర్లు, వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కర్నూలు : పోలీసు అమర వీరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో ఓపెన్ హౌస్, మోటార్ ట్రాన్స్‌పోర్టు కార్యాలయం పక్కన రక్తదాన శిబిరం ఏర్పాటు చేసింది. కార్యక్రమానికి ఎస్పీ రవికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఓపెన్ హౌస్‌లో పోలీసులు వినియోగించే వివిధ రకాల ఆయుధాలు, వాటి పేర్లు, వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాంబు డిస్పోజల్ టీం, ఫింగర్ ప్రింట్స్, కమ్యూనికేషన్ తదితర అంశాలకు సంబంధించిన విషయాలను విద్యార్థులకు వివరించారు. శిబిరంలో ముందుగా ఎస్పీనే రక్తదానం చేసి సిబ్బందిలో స్పూర్తి నింపారు. మొత్తం 49 మంది సిబ్బంది ఈ సందర్భంగా రక్తదానం చేశారు. అదనపు ఎస్పీ బాబురావు, ఏఆర్ అదనపు ఎస్పీ రాధాకృష్ణ, ఏఆర్ డీఎస్పీ అశోక్‌బాబు, ఆర్ఎస్ఐలు, స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్లు శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఓఎస్డీ మనోహర్‌రావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఏజి.క్రిష్ణమూర్తి, కర్నూలు డీఎస్పీ డివి.రమణమూర్తి, హోంగార్డు డీఎస్పీ కృష్ణమోహన్, కర్నూలు పట్టణ సీఐలు, పోలీస్ సిబ్బందితో పాటు రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ జి.శ్రీనివాసులు మెడికల్ ఆఫీసర్ ముంతాజ్‌బేగం, కో-ఆర్డినేటర్ పద్మావతి, రెడ్‌క్రాస్ సొసైటీ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని సేవలందించారు. ఏపీఎస్పీ రెండవ పటాలంలో... పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని ఏపీఎస్పీ రెండవ పటాలంలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కమాండెంట్ విజయ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. 81 మంది సిబ్బంది స్వచ్ఛందంగా శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రాణాలు నిలబెట్టే ఇలాంటి సేవల్లో అందరూ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఎలాంటి సమస్య తలెత్తినా మేమున్నామంటూ ముందుకు వచ్చి విధులను సమర్ధవంతంగా నిర్వహించే బెటాలియన్ సిబ్బంది ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం హర్షణీయమన్నారు. పటాలం ఓఎస్డీ ఈవీ.రామారావు ఈ సందర్భంగా పండ్లను పంచి పెట్టారు. బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ ఎస్ఎం.బాషా, యూనిట్ వైద్యాధికారి బాల సారయ్య, వెంకటయ్య, యుగంధర్ పాల్గొన్నారు.