Miracle baby
-
పోయిన ప్రాణం ఎలా తిరిగి వచ్చింది? వింటే షాకే!
1995, ఏప్రిల్ 6.. ఉదయం ఆరు దాటింది. అమెరికా, ఇండియానా రాష్ట్రం జెఫర్సన్ విల్లోని క్లార్క్ మెమోరియల్ హాస్పిటల్‌కి.. ఒక్కొక్కరుగా పేషెంట్స్ వస్తూ ఉన్నారు. ‘టామీ బుర్ష్ డిప్యాటిక్’ అనే నిండు గర్భిణి కూడా తన కుటుంబంతో కలసి కాన్పు కోసం వచ్చింది. ఆ ఆసుపత్రి డాక్టర్స్ డ్యూ డేట్ ఏప్రిల్ 6 అని చెప్పడంతో.. అన్నీ సిద్ధం చేసుకుని వచ్చింది టామీ కుటుంబం. నెల తప్పినప్పటి నుంచీ తనకు వైద్యం చేస్తున్న డాక్టర్ డయానా ఒకోన్ పర్యవేక్షణలోనే ఉంది టామీ. అయితే ఆమె భర్త జేమ్స్ టాడ్ కారల్ మాత్రం చాలా కంగారుపడుతూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఎందుకంటే.. టామీకి అది మూడో కాన్పు. అప్పటికీ రెండేళ్ల క్రితం.. రెండో కాన్పులో బిడ్డ.. పుట్టిన కాసేపటికే చనిపోయాడు. దాంతో.. ‘పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటుందో? ఏమవుతుందో’ అనే భయం అతడ్ని వెంటాడసాగింది. ఆ భయం అతడినే కాదు.. టామీతో సహా వెంట వచ్చిన బంధువులందరినీ పట్టుకుంది.జాయిన్ అయిన రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకూ ప్రసవ వేదన అనుభవించింది టామీ. అప్పటివరకూ తల్లీబిడ్డల హాట్ బీట్స్‌ని గమనిస్తూనే ఉన్నారు డాక్టర్లు. కాన్పు సమయంలో కూడా.. ‘ఏం భయం లేదు లోపల బేబీ ఆరోగ్యంగా ఉంది’ అనే చెప్పారు. సాయంత్రం నాలుగు నలభై రెండు నిమిషాలకు టామీకి బాబు పుట్టాడు. పుట్టబోయే బిడ్డకు ‘లోగాన్ కారల్’ అని పేరుపెట్టాలని ముందే నిర్ణయించుకున్నారు ఆ దంపతులు. కానీ పుట్టిన బిడ్డ లోగాన్‌లో ఎలాంటి చలనం లేదు. దాంతో డాక్టర్ ఓకాన్.. బాబు(లోగాన్ )కు సీపీఆర్ చేయడం మొదలుపెట్టారు. అయినా ఫలితం లేకపోయేసరికి బాబును అత్యవసర గదికి తరలించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బిడ్డ గుండె కొట్టుకోలేదు. మెదడులో ఎలాంటి కదలిక లేదు. దాంతో సాయంత్రం 5:15 గంటలకు లోగాన్ కారల్ మరణించినట్లు ప్రకటించారు. పుట్టిన అరగంటలోనే బిడ్డ చనిపోవడం.. ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది. టాడ్, టామీలు ఆ వార్త వినగానే కుప్పకూలిపోయారు. ఆసుపత్రి సిబ్బంది.. బాబు లోగాన్ ను చివరి చూపు కోసం ఆ కుటుంబీకులకు అందించారు. అనంతరం బాబుతో కలిపి ఫొటోలు తీస్తుండగా.. టామీ సోదరికి ఆ బాబు వెచ్చని ఊపిరి తగిలినట్లు అనిపించింది. ఉలిక్కిపడిన ఆమె.. వెంటనే వైద్యులతో చెప్పింది. కానీ వైద్యులు ఆమె మాటను కొట్టి పారేశారు. మరణించాడని చెప్పిన నలభై నిమిషాల తర్వాత బాబు వేడెక్కడం గమనించిన టామీ సవతి తల్లి.. ఆ విషయాన్ని మరోసారి ఓ నర్సు దృష్టికి తీసుకెళ్లింది.ఆ నర్సు.. లోగాన్ (బాబు)ను పరిశీలించి.. నాడి చూసింది. బాబు హార్ట్ బీట్నూ గమనించింది. ఆ చిన్న గుండె లయ ఆమెకు స్పష్టంగా వినిపించింది. వెంటనే డాక్టర్ ఓకాన్ను పిలిచి విషయం చెప్పింది. ఆమె బాబుని చెక్ చేసి.. షాక్ అయ్యింది. బాబు ప్రాణాలతో ఉండటంతో ఆ శుభవార్తను అందరికీ చెప్పింది. అయితే బాబు చనిపోయాడని అప్పటికే ఆరుగురు డాక్టర్స్, ఎనిమిది మంది నర్సులు నమ్మి.. నిర్ధారించిన తర్వాత.. కొన్ని గంటల్లో బాబు తిరిగి బతకడం మిరాకిల్‌గా.. అంతుపట్టని మిస్టరీగా మారిపోయింది.ఆ రోజు మొదలు లోగాన్ ‘మిరాకిల్ బేబీ’గా వార్తల్లోకి ఎక్కాడు. ‘అన్సాల్వ్డ్ మిస్టరీస్’, ‘ఇట్స్ ఎ మిరాకిల్’ వంటి ఎన్నో స్పెషల్ ప్రోగ్రామ్స్‌లో.. లోగాన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. అయితే బాబు పుట్టుక నుంచీ మానసిక సమస్యలతో బాధపడుతూ.. వీల్ చైర్‌కే పరిమితం అయ్యాడు. అయినా తన కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్నే గడిపిన లోగాన్.. తన 24వ ఏట.. 2020లో తీవ్ర అనోరోగ్యానికి గురై మరణించాడు. అయితే ఆ రోజు చనిపోయాడనుకున్న లోగాన్ తిరిగి ఎలా బతికాడు? అంతమంది డాక్టర్స్ నిర్ధారించిన తర్వాత కూడా బాబులో పోయిన ప్రాణం ఎలా తిరిగి వచ్చింది? అనేది నేటికీ మిస్టరీనే. – సంహిత నిమ్మన -
ఆ పాప మహాద్భుతం.. బరువు ఐపాడంతే..!
యూఏఈ: ప్రపంచంలో ఏదో ఒక మూలన ఏదో ఒక వింత జరుగుతూనే ఉంటుంది. మనకు అందుబాటులో ఉన్నవి తప్ప తెలియకుండా జరిగేవి కోకొల్లలు. అయితే, మనుషుల మధ్య కూడా కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. వాటిల్లో కొన్ని చాలా అరుదు. అలాంటి అరుదైన సంఘటనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుదాబిలో చోటు చేసుకుంది. ఓ మహిళకు ఐపాడ్ కంటే తక్కువ బరువున్న కూతురు జన్మించింది. గర్భం సంబంధమైన సమస్యలు రావడంతో వైద్యులు ఆపరేషన్ నిర్వహించి అటు తల్లికి, బిడ్డకు ప్రాణం పోశారు. ఈ పాప జన్మించినప్పుడు బరువు 631 గ్రాములు మాత్రమే ఉండగా ప్రస్తుతం ప్రత్యేక సంరక్షణలో ఆ నవజాత శిశువును పెంచడంతో ఆ పాప ఇప్పుడు రెండు కిలోల వరకు పెరిగింది. అబుదాబిలోని ది మీడియర్ 24x7 అనే ఆస్పత్రికి బలహీన స్థితిలో ఉన్న ఓ గర్భవతి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు గర్భంలోని శిశువు పెరుగుదల మందగించినట్లు గుర్తించారు. దాంతోపాటు పిండం చుట్టూ ఉండాల్సిన స్రవాలు తల్లి గర్భంలో విడుదల కానట్లు తెలుసుకున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఆపరేషన్ చేయకుంటే తల్లి ప్రాణానికి ప్రమాదం తలెత్తే అవకాశం ఉంది. అప్పటికీ సరిగ్గా 26.5వారాలు మాత్రమే.. అంటే ఆరు నెలలు మాత్రమే. అయినప్పటికీ గోవిందా షెనాయ్ నేతృత్వంలో ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు సురక్షితంగా ఆమెకు పురుడు పోశారు. కేవలం 631 గ్రాములు మాత్రమే ఉన్న పసిగుడ్డును చూసి ఆస్పత్రి సిబ్బంది సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ప్రస్తుతం తల్లి కూతురు సురక్షితంగా ఉండటంతో ఆ బేబిని మిరాకిల్ బేబీగా చెప్తున్నారు. -
మిరాకిల్ బేబీకి మెమరబుల్ గిఫ్ట్
హైదరాబాద్: విమానంలో పుట్టిన 'మిరాకిల్ బేబీ'కి పిలిప్పీన్స్ కు చెందిన సెబూ పసిఫిక్ ఎయిర్ మెమరబుల్ కానుక ఇచ్చింది. తమ సంస్థ విమానాల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయాన్ని కల్పించింది. దుబాయ్ నుంచి మనీలా వెళుతున్న విమానంలో బుధవారం ఓ మహిళ పాపాయికి జన్మనిచ్చింది. విమాన సిబ్బంది, ఇద్దరు నర్సుల సహాయంతో ఆమెకు సులభ ప్రసవం జరిగింది. తర్వాత విమానాన్ని హైదరాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా దింపి తల్లీబిడ్డలిద్దరినీ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సెబూ పసిఫిక్ ఎయిర్ సంస్థకు చెందిన విమానంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి. తమ విమానంతో పుట్టిన చిన్నారి ఉచితంగా 10 లక్షల ఎయిర్ మైల్లు ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నామని సెబూ పసిఫిక్ ఎయిర్ సీఈవో లాన్స్ గొకొంగ్వీయ్ వెల్లడించారు. ఈ ఆఫర్ ను ఉపయోగించుకోవడానికి గడుపు పెట్టలేదని, పాపాయి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేయొచ్చని చెప్పారు. 'తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారు. మా సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి మహిళకు సహాయం అందించారు. సులభ ప్రసవానికి సాయం చేసిన ఇద్దరు నర్సులకు ధన్యవాదాలు తెల్పుకుంటున్నామ'ని లాన్స్ గొకొంగ్వీయ్ పేర్కొన్నారు. 1990లో ఘనా-యూకే బ్రిటీష్ ఎయిర్వేస్ విమానంలో పాపాయికి జన్మనిచ్చిన డెబ్బీ ఓవెన్ అనే మహిళ తన కూతురికి ఆకాశం అనే అర్థం వచ్చేలా షోనా కిరిస్టీ వైవెస్ (స్కై) పేరు పెట్టింది. ఈ పేరులోని మొదటి అక్షరాలన్నీ కలిపితే స్కై అవుతుంది. విమానం గాల్లో ఉండగా మిరాకిల్ #CEBNews: Cheers to #BabyHaven, born inflight! To celebrate, we give her 1M @GetGoPH points! https://t.co/F7exzSO3qj pic.twitter.com/qkP1jxiEAT — Cebu Pacific Air (@CebuPacificAir) 17 August 2016 -
ఈ 'మిరాకిల్'.. వెరీవెరీ రేర్!
అమ్మమ్మ, అమ్మ, మనవరాలు.. ఈ అనుబంధమే ఎంతో మధురమైనది. ఈ అనుబంధానికి ఓ 'అద్భుతం' తోడయితే అది 'మిరాకిల్' జననం అవుతుంది. ఇంతకువిషయమేమిటంటే 'మిరాకిల్' అనే పండంటి పాప జనవరి 18న జన్మించింది. ఆ రోజు ఎంత స్పెషల్ అంటే అదే రోజున 'మిరాకిల్' తల్లి ఎయిమీ హెర్నాండో, అమ్మమ్మ కూడా జన్మించారు. అంటే ఆ కుటుంబంలో మూడు తరాలకు చెందిన ఆడపిల్లలు ఒకేరోజున ఈ భూమి మీద అడుగుపెట్టారన్నమాట. జనవరి 18న హెర్నాండో 33వ పుట్టినరోజు. అదే రోజున ఆమె తల్లి 56వ పడిలో అడుగుపెట్టింది. అలాంటి తరుణంలో గర్భవతిగా ఉన్న హెర్నాండోకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. హెర్నాండోలో ఒకటే ఎక్సైట్మెంట్. 'నేను లేబర్ రూమ్‌లోకి వెళ్లగానే.. డాక్టర్‌కు ఒకటే విషయం చెప్పాను అర్ధరాత్రి లోపు ప్రసవం జరుగాలని..' అని హెర్నాండో ఇప్పుడు గర్వంగా చెప్తోంది. జనవరి 18న సాయంత్రం భూమి మీద అడుగుపెట్టిన ఆ పండంటిపాపకు 'మిరాకిల్ జాయ్' అని పెట్టారు. 'మా పుట్టినరోజులకు ఇంతకన్నా గొప్ప బహుమతి ఏముంటుంది' అంటూ ఆమె సంతోషం వ్యక్తం చేస్తోంది. 'లేబర్‌రూమ్‌లో పురిటినొప్పుల పడుతున్నడు.. ఓ మై గాడ్.. ఈ అద్భుతం నిజంగానే జరుగుతున్నదా అని ఎక్సైట్ అయ్యాను' అని తెలిపింది. అదృష్టం జన్మదినం విషయంలోనే కాదు వారి బరువు విషయంలోనూ కలిసి వచ్చినట్టు కనిపిస్తోంది. 'మా అమ్మ పుట్టినప్పుడు తను ఆరు పౌండ్ల 10 ఔన్సులు బరువు ఉందట. నేను పుట్టినప్పుడు నా బరువు ఆరు పౌండ్ల 9 ఔన్సులు. ఇప్పుడు మిరాకిల్ ఆరు పౌండ్ల 8 ఔన్సులు ఉంది. ఇది కూడా ఎంతో కూల్ విషయం కదా' అంటోంది ఆమె. సాధారణంగా మూడు తరాల వారు ఒకే తేదీన జన్మించడం అత్యంత అరుదని, అది 1,33,225 మందిలో ఒకరికి జరిగే అవకాశం ఉంటుందని గణాంక శాస్త్రవేత్త కీత్ డెవ్లిన్ వివరించారు. దాదాపు ఏడేళ్ల ఇబ్బందుల తర్వాత గర్భవతి అయిన హెర్నాండో తన నాలుగో సంతానమైన పాపకు 'మిరాకిల్' అని పెట్టడం అనివిధాల సమంజసం అని భావిస్తున్నట్టు చెప్తోంది.