mirchi crops
-
మిర్చి బంగారానికి మించి రేటు..ఎందుకంటే..?
-
వరి, మిర్చి సాగుతో నష్టపోయిన రైతన్న..!
-
గుంటూరు మిర్చి సాగులో రైతుల కష్టాలు
-
భద్రాద్రి జిల్లాలో ఒక్కసారిగా మిర్చి నారుకు పెరిగిన డిమాండ్
-
పామాయిల్ తోట లో అంతర పంటగా మిర్చి..
-
మిరప సాగుకు అనువైన సమయం ఇదే..
పెద్దవూర: గత వానాకాలం సీజన్లో మిరప పంటకు అధిక ధరలు పలకడంతో ఈ యేడాది అధిక విస్తీర్ణంలో సాగు చేయటానికి సిద్ధం అవుతున్నారు. మిరప పంటలో సాగు విధానం, యాజమాన్య పద్ధతుల గురించి ఉద్యానవన శాఖ అధికారి మురళి వివరించారు. పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తూ, మిరప చేను చుట్టూ రక్షణ పంటలుగా హైబ్రిడ్ జొన్న లేదా మొక్కజొన్న రెండు లేదా మూడు సాళ్లలో వేయాలి. కీటక ఆకర్షణ(ఎర) పంటలుగా బంతి, ఆముదాన్ని పొలంలో అక్కడక్కడా వేయాలని సూచిస్తున్నారు. మిరప సాగుకు ఉదజని సూచిక(పీహెచ్) 6 నుంచి 6.5 ఉన్న నేలలు అత్యంత అనుకూలమని చెబుతున్నారు. వాతావరణం, విత్తే సమయం మిరప పంట అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు. మిరపకు 10 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత అనుకూలం. ఎండు మిరప కోసం వేసే పంటను వానాకాలం సీజన్లో వేసుకోవడం మంచిది. పచ్చి మిరప కోసం సంవత్సరం పొడవునా సాగు చేసుకోవచ్చు. సాధారణంగా మిరప పంటను ఖరీఫ్ సీజన్లో జూలై, ఆగస్టు నెలల్లోనూ, యాసంగిలో అయితే అక్టోబర్, నవంబర్ నెలలో సాగుకు అనుకూలం. నేల తయారీ : పొలాన్ని వేసవిలో లోతుగా దున్ని, ఆఖరి దుక్కిలో ఎకరానికి 10టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల వేపపిండి, 150 కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్ వేయాలి. అలాగే 90కిలోల పశువుల ఎరువు, 10కిలోల వేపపిండి, 2కిలోల ట్రైకోడెర్మావిరిడి శిలీంద్రపు పొడిని కలిపి 10–15 రోజులు నీడలో ఉంచి శిలీంద్రం వృద్ధి చెందిన తర్వాత ఆఖరి దుక్కిలో వేసినట్లైతే తొలి దశలో మొక్కలను ఆశించే తెగుళ్ల నుంచి కాపాడవచ్చు. పంట సాగు భూమిలో పోషకాల శాతాన్ని పెంచుకోవడానికి ముందుగా పచ్చిరొట్ట లేదా మినుము పంటను వేసుకుని భూమిలో కలియ దున్నాలి. దీనివలన భూమికి సహజ పోషకాలు లభిస్తాయి. 10–15 రోజుల తరువాత ట్రాక్టర్ కల్టివేటర్‌తో నేల మెత్తగా దుక్కి అయ్యేవరకు 1–3 సార్లు దున్నుకోవాలి. విత్తనశుద్ధి విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా చీడపీడల నుంచి దీర్ఘకాలం పాటు పంటను రక్షించవచ్చు. మిరప విత్తనాలను మూడు రకాలుగా విత్తనశుద్ధి చేసుకోవచ్చు. వైరస్ తెగుళ్ల నివారణకు గాను కిలో మిరప విత్తనానికి గాను 150 గ్రాముల ట్రైసోడియం ఆర్థోఫాస్పేటును ఒక లీటరు నీటిలో కరిగించి దీనిలో 15నుంచి 20 నిమిషాల పాటు విత్తనాన్ని నానబెట్టాలి. తర్వాత నీటిని తీసివేసి మంచి నీటితో శుభ్రంగా కడిగి విత్తనాలను నీడలో ఆరబెట్టుకోవాలి. రసం పీల్చు పురుగుల నివారణకు గాను కిలో విత్తనానికి 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్‌ను పట్టించాలి. దీనివలన విత్తిన 20–25 రోజుల వరకు రసం పీల్చు పురుగుల ఉధృతి నివారణ జరుగుతుంది. బ్యాక్టీరియా, బూజు తెగుళ్ల నివారణకు గాను కిలో విత్తనానికి 3గ్రాముల మాంకోజెబ్ లేదా కాప్టాన్ మందును పట్టించి విత్తుకోవాలి. చివరిగా అదే విత్తనాన్ని ట్రైకోడెర్మా విరిడి అనే శిలీంద్రం పొడిని 5–10 గ్రాముల విత్తనానికి పట్టించి నారుమడిలో విత్తుకోవాలి. విత్తన మోతాదు మిరపను రెండు రకాల పద్ధతుల ద్వారా సాగు చేయవచ్చు. మిరప విత్తనాలను నేరుగా ప్రధాన పొలంలో విత్తడానికి అయితే ఎకరాకు 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. అలా కాకుండా నారు పెంచుటకు విత్తన మోతా దు సూటి రకాలకు 650 గ్రాములు, హైబ్రిడ్ రకాలైతే 75 నుంచి 100 గ్రాముల విత్తనం సరిపోతుంది. ప్రోట్రేలలో.. ఈ పద్ధతిలో ప్రతి విత్తనం సమానంగా, ఆరోగ్యంగా మొక్కలు పెరిగి పంట ఒకేసారి కాపుకు వస్తుంది. దీనితో పాటు నారు దృఢంగా పెరగడంతో పాటు నారుకుళ్లు, వైరస్ తెగుళ్లను ఆశించే అవకాశం తక్కువగా ఉంటుంది. ఒక ఎకరా ప్రధాన పొలంలో నాటుటకు కావాల్సిన వారు 98 సెల్స్ కలిగిన 120 ట్రేలు సరిపోతాయి. ఒక్కో ప్రోట్రేసు నింపుటకు సుమారు 1.2 కిలోల కోకోపీట్ మిశ్రమం అవసరం. ఒక్కొక్క సెల్లో ఒక్క విత్తనం నాటుకుని తిరిగి కోకోపీట్‌తో కప్పుకోవాలి. 6 రోజుల తర్వాత మొక్క మొలకెత్తడం ప్రారంభమయ్యాక వీటిని ఎత్తైన బెడ్లలోకి మార్చుకోవాలి. మొక్కలను నాటుకునే విధానం మొక్కలను నీటి వసతి నేలల్లో నాటుకునేప్పుడు 24్ఙశ్రీ24 అంగుళాలు(ఇంచులు) లేదా 26్ఙశ్రీ26 లేదా 28్ఙశ్రీ28 అంగుళాల దూరంలో నేల స్వభావాన్ని బట్టి నాటుకోవాలి. మొక్కలు పెట్టడానికి తీసిన రంధ్రాల్లో కొద్దిగా నీరు పోసి వేర్లు మడత పడకుండా జాగ్రత్తగా నాటుకోవాలి. డ్రిప్ పద్ధతిలో నాటుకునేటప్పడు మొక్కల మధ్య దూరం 30–45 అంగుళాలు అనువైనది. కలుపు యాజమాన్యం కలుపు నివారణకు మొక్కలు నాటిన 20–25 రోజుల తరువాత కలుపు గొర్రు లేదా గుంటుకలను ప్రతి 15–20 రోజులకు ఒక్కసారి దున్నాలి. ఎలా మొక్క నేల మొత్తాన్ని కప్పివేసేవరకు 4–5 సార్లు దున్నాలి. మొక్కలను నాటుకునే 1–2 రోజుల ముందు లీటర్ నీటిలో 1.5మిల్లీలీటర్ల పెండిమిథాలిన్ కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. పంటలో కలుపు మొక్కలు ఉన్నట్లయితే మొక్కలు నాటిన 25 రోజుల తర్వాత ఎకరానికి 400–500 మిల్లీలీటర్ల కై ్వజాలోఫాస్ ఇథైల్‌ను మొక్కలపై పడకుండా జాగ్రత్తగా పిచికారీ చేసుకోవాలి. నారు పెంచే విధానం మిరప నారును రెండు పద్ధతుల్లో పెంచవచ్చు. మిరప నారుమడికి సారవంతమైన ఒండ్రునేలలు, నీటి వసతి, ఒక మోస్తరు నీడ కలిగిన ప్రదేశాలు చాలా అ నుకూలం. ఒక మీటరు వెడల్పు, 40 మీటర్ల పొడవు, 15 సెం.మీ. ఎత్తుగల మడిలో ఒక ఎకరంలో నాటడానికి అవసరమైన నారు పెంచుకోవచ్చు. నారు పెంచటానికి నేలకు కొంచెం ఎత్తులో మట్టిని బెడ్డుగా చేసుకోవాలి. నాలుగు మూలలు సమాన ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. నారుమళ్లలో విత్తనాలను 5 నుంచి 8 సెం.మీ. మధ్యదూరం, 1.5 సెం,మీ లోతులో వరుసల్లో విత్తనాలను పలుచగా విత్తుకోవాలి. విత్తిన 9వ రోజు, 13వ రోజున లీటర్ నీటిలో 3 గ్రా. కాఫర్ ఆక్సీక్లోరైడ్‌ను కలిపిన ద్రావణంలో నారుమళ్లను తడపాలి. -
తాలు’కూ టైమొచ్చింది..
-
ఘాటెక్కిన మిర్చి
దేవరపల్లి: మిర్చి అ‘ధర’హో అనిపిస్తోంది. గతంలో ఎన్నడూలేని ధర పలుకుతోంది. అయితే దిగుబడులు దారుణంగా తగ్గడంతో రైతులు నిట్టూరుస్తు్తన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎండుమిర్చిని సాగుచేస్తున్నా దేవరపల్లి మండలంలోని పల్లంట్ల, కురుకూరు పంట ప్రత్యేకం. ఇక్కడ మిరపకాయలు దేశవాళీ కావడం వల్ల నాణ్యత, రుచి ఉంటుందని ప్రజల నమ్మకం. ఇక్కడ కాయలతో పచ్చళ్లు పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని చెబుతున్నారు. దీంతో గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడకు వచ్చిన పల్లంట్ల మిరపకాయలు కొనుగోలు చేస్తుంటారు. 639 హెక్టార్లలో.. జిల్లాలో 639 హెక్టార్లలో ఎండుమిర్చి సాగు ఉంది. దీనిలో దేవరపల్లి, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, గోపాలపురం మండలాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. దేవరపల్లి మండలంలో పల్లంట్ల, కురుకూరు, లక్ష్మీపురం, దేవరపల్లి గ్రామాల్లో పండిస్తుండగా పల్లంట్ల, కురుకూరు గ్రామాల్లోనే సుమారు 150 ఎకరాల్లో పంట ఉంది. గతంలో దేవరపల్లి మండలంలో 300 ఎకరాల్లో మిరప సాగు ఉండేది అయితే చీడపీడలు, దిగుబడులు తగ్గడం వంటి కారణాలతో నాలుగేళ్లుగా రైతులు సాగు తగ్గించారు. సగానికి తగ్గిన దిగుబడి ఈ ఏడాది ఎండుమిర్చి దిగుబడులు దారుణంగా పడిపోయాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎకరాకు సుమారు 6 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా 2 నుంచి 3 క్వింటాళ్లు మాత్రమే వస్తోందని అంటున్నారు. ఎకరాకు సుమారు రూ.లక్ష పెట్టుబడి పెడితే ప్రస్తుతం ధరలు ఆశాజనకంగా ఉండటంతో రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు ఆదాయం వస్తుందని అంటున్నారు. దిగుబడులు మరింత తగ్గిన రైతులకు నష్టాలు తప్పని పరిస్థితి. ప్రస్తుతం ధర వీసె (1400 గ్రాములు) రూ.650 నుంచి రూ.700, గుల్లకాయలు రూ.450 నుంచి రూ.500 పలుకుతోంది. తెల్లదోమతో నష్టం ఈ ఏడాది మిరప తోటలకు తెల్లదోమ వ్యాపించింది. కాయ తయారు కాకుండానే పిందె దశలోనే పండిపోయి రాలిపోయిందని రైతులు అంటున్నారు. దీంతో కాపులు లేక తోటలు ఖాళీగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర పెరిగే అవకాశాలు నేను మూడు ఎకరాల్లో మిరప పంట వేసి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించాను. ఎకరాకు 3 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. మూడు ఎకరాల్లో దాదాపు 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం వీసె ధర రూ.700 ఉంది. వారం రోజుల్లో రూ.1,000 దాటవచ్చు. ఈ ఏడాది మిరప తోటలు నల్లదోమ, ఆకుముడత తెగుళ్లతో ఎక్కువగా దెబ్బతిన్నాయి. – నలమాటి బాలకృష్ణ, రైతు, పల్లంట్ల -
Mirchi Seeds: ఊళ్లోనే 'మిరప' విత్తనం
సాక్షి, అమరావతి: మిర్చి రైతులకు విత్తన కష్టాలు తీరనున్నాయి. ఖరీఫ్‌లో అపరాల తర్వాత అత్యధికంగా సాగయ్యే మిరప విత్తనాల కోసం రైతులు ఇబ్బందులు పడేవారు. మోసపోయేవారు. ఇన్నాళ్లు విత్తన కంపెనీలు, వ్యాపారసంస్థలపై సరైన నియంత్రణ లేకపోవడంతో కృత్రిమ కొరత సృష్టిస్తూ రెట్టింపు ధరలకు విక్రయించి సొమ్ము చేసుకునేవి. మరోవైపు మార్కెట్లోకి వచ్చే నాసిరకం విత్తనాల బారినపడి రైతులు ఏటా తీవ్రంగా నష్టపోయేవారు. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాయితీ విత్తనం మాదిరిగానే నాన్ సబ్సిడీ కేటగిరీకి చెందిన మిరప విత్తనాన్ని కూడా వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. రాష్ట్రంలో 1,79,891 హెక్టార్లలో మిరప సాగవుతోంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 80,264, ప్రకాశంలో 35,031, కర్నూలులో 24,538, కృష్ణాలో 15,860, అనంతపురంలో 5.536, విజయనగరం జిల్లాలో 4,989 హెక్టార్లలో రైతులు సాగుచేస్తున్నారు. రానున్న ఖరీఫ్‌లో 1.97 లక్షల హెక్టార్లలో మిరపసాగు లక్ష్యంగా నిర్ణయించారు. నాన్ సబ్సిడీ కేటగిరీలో పంపిణీ రాయితీ విత్తనాల మాదిరిగానే నాన్ సబ్సిడీ కేటగిరీకి చెందిన మిరప విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీ చేసేందుకు ప్రభుత్వాదేశాల మేరకు 20 సీడ్ కంపెనీలతో ఏపీ ఆగ్రోస్ ఒప్పందం చేసుకుంది. ఈనెలాఖరు నుంచి జూన్, జూలై నెలల్లో విడతల వారీగా అవసరమైన విత్తనాలు పంపిణీ చేసేందుకు ఆయా కంపెనీలు ముందుకొచ్చాయి. ఇప్పటివరకు కృష్ణాజిల్లాకు 511, గుంటూరుకు 1,823, ప్రకాశం జిల్లాకు 578 కిలోల ఆర్మోర్ రకం హైబ్రిడ్ విత్తనాలను సరఫరా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1,339 కిలోల ఆర్మోర్ సీడ్ సరఫరాకు అంగీకరించిన నున్‌హెమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటడ్ కంపెనీ ఇప్పటికే 697 కిలోలు జిల్లాలకు పంపింది. పారదర్శకంగా పంపిణీ సాధారణంగా తొలకరి మొదలైన జూన్‌లో విత్తన విక్రయాలు మొదలవుతాయి. ఈసారి కరోనా బూచి చూపి రెట్టింపు ధరలకు విక్రయాలు జరుపుతున్నారు. కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించకుండా కట్టడి చేయడంతోపాటు ఆర్బీకేల ద్వారా విత్తన సరఫరా పారదర్శకంగా చేపట్టే లక్ష్యంతో విత్తన పంపిణీ, అమ్మకందార్లతో అధికారులు సమావేశాలు నిర్వహించనున్నారు. సాగుకు ఇంకా సమయం ఉన్నందున దళారీల ఉచ్చులోపడి అధిక ధరలకు కొనకుండా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులు నిర్ణయించారు. ఒకే కంపెనీ విత్తనాలు కొనాలని చూడకుండా అదే సెగ్మెంట్లో ఉన్న ఇతర కంపెనీలకు చెందిన మంచి విత్తనాలను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. అందుబాటులో ఉన్న విత్తనాలు, ధరల వివరాలను ఆర్బీకేల్లో ప్రదర్శించనున్నారు. సాగయ్యే మిర్చి రకాలు సాధారణంగా మిర్చి సాగువిస్తీర్ణంలో 40 శాతం ప్రీమియం (ఓపెన్ పాలినేటెడ్ (ఓపీ) వెరైటీస్), 60 శాతం హైబ్రిడ్ రకాలు సాగవుతుంటాయి. ప్రీమియం రకాలు: ఎల్‌సీఎ–334, 341, 273, 2222, రెడ్‌హాట్, రోమి, గిని, సూపర్–10,20, రూబే, వజ్ర, అమరావతి, జై కిసాన్. హైబ్రిడ్ రకాలు: ఆర్మోర్, తేజశ్విని, యశస్విని, యూఎస్–341, బంగారం, వండర్‌హాట్, యూఎస్–4884, రెడ్‌హాట్, ఇందమ్–5, హెచ్‌పీహెచ్–5531, హెచ్‌పీహెచ్–2043, వీఎన్ఆర్–577. హెక్టార్‌కు హైబ్రిడ్ విత్తనం 300 గ్రాములు, ప్రీమియం విత్తనం 650 గ్రాములు అవసరం. బ్లాక్ మార్కెట్‌కు చెక్‌పెట్టేందుకే.. ప్రాచుర్యం గల మిర్చి విత్తనాలను ఆర్బీకేల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బ్లాక్ మార్కెట్, అధిక ధరల నియంత్రణ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించాం. నిర్ణీత ధరల కన్నా అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని స్పష్టం చేశాం. వారినుంచి స్వాధీనం చేసుకున్న విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీకి చర్యలు తీసుకుంటున్నాం. – కురసాల కన్నబాబు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి -
మిర్చి.. కలిసొచ్చి
సాక్షి, అమరావతి బ్యూరో: మిర్చి రైతులకు కాసుల పంట పండుతోంది. సకాలంలో వర్షాలు కురవడం, కాలువలకు నీరు పుష్కలంగా విడుదల చేయడంతో మిర్చి పంటకు ఈ ఏడాది భారీగా దిగుబడి వచ్చింది. ఈ ఏడాది విదేశాలకు పెద్ద ఎత్తున మిర్చి ఆర్డర్లు ఉండటంతో, దిగుబడులు భారీగా వచ్చినా ధరలు తగ్గకుండా, నిలకడగా ఉంటున్నాయి. క్వింటా మిర్చి ధర రూ.14 వేల నుంచి రూ.18 వేల వరకు పలుకుతోంది. ప్రధానంగా ఈ ఏడాది (2020–21) 55 లక్షల టన్నులు (1.37 లక్షల టిక్కీలు)కు పైగా మిర్చి విదేశాలకు ఎగుమతి అవుతుందని అధికారుల అంచనా. మిర్చి ఎగుమతులకు సంబంధించి దాదాపు రూ.8,250 కోట్ల టర్నోవర్ ఉంటుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో దాదాపు 3.87 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిరప పంట సాగు అయ్యింది. ఇందులో ఎక్కువ భాగం గుంటూరు జిల్లాలో 1.92 లక్షల ఎకరాల్లో, తరువాత ప్రకాశం, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, కృష్ణా జిల్లాల్లో సాగు అవుతోంది. రాయలసీమ జిల్లాలతో పాటు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి మిర్చి గుంటూరు యార్డుకు తరలిస్తారు. ప్రధానంగా మిర్చి ఎగుమతి అయ్యే దేశాలు... మిర్చిని ఎక్కువగా చైనా దేశానికి ఎగుమతి చేస్తారు. దీనితో పాటు చిలీ, వియత్నాం, థాయ్‌లాండ్, శ్రీలంక, యూఎస్ఏ, ఇండోనేషియా, బంగ్లాదేశ్, మలేషియా, యూఏఈ, యూకే, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, సౌత్ ఆఫ్రికా, మెక్సికో దేశాలకు మిర్చి ఎగుమతి అవుతుంది. దీంతో పాటు దేశంలో తమిళనాడు, కేరళ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు గుంటూరు మార్కెట్ యార్డు నుంచి మిర్చి వెళుతుంది. ధరలు బాగున్నాయి నేను నాలుగు ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశాను. ఈ ఏడాది కాలువలకు నీరు పుష్కలంగా విడుదల చేయడంతో ఎకరాకు మిర్చి దిగుబడి 30 క్వింటాళ్లకు పైనే వచ్చింది. దీనికితోడు మిర్చి ధరలు క్వింటా రూ.14 వేలకు పైనే ఉన్నాయి. దీంతో పెట్టుబడులు, కోత కూలీల ఖర్చులు పోయినా మాకు ఎకరాకు రూ.1.5 లక్షలు మిగిలింది. – కృష్ణారెడ్డి, మిర్చి రైతు,వినుకొండ, గుంటూరు జిల్లా విదేశాల నుంచి ఆర్డర్లు బాగా ఉన్నాయి ఈ ఏడాది విదేశాల నుంచి మిర్చి ఆర్డర్లు బాగా వస్తున్నాయి. చైనా, బంగ్లాదేశ్, మలేషియా, సింగపూర్, శ్రీలంక వంటి దేశాల్లో మార్కెట్‌కు డిమాండ్ బాగా ఉంది. దీంతో ఈ ఏడాది మిర్చి దిగుబడులు అధికంగా వచ్చినా మంచి ధర పలుకుతోంది. మార్కెట్లో ధరలు సైతం నిలకడగా ఉన్నాయి. రైతులు సంతోషంగా ఉన్నారు. – కొత్తూరు సుధాకర్, మిర్చి ఎగుమతి వ్యాపారి ధరలు నిలకడగా ఉన్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మిర్చి ధరలు నిలకడగా ఉన్నాయి. సాధారణ రకం మిర్చి ధర సైతం గతేడాది క్వింటాల్ రూ.9 వేల నుంచి రూ.10 వేలు పలికింది. ఈ ఏడాది దిగుబడులు అధికంగా వచ్చినా క్వింటాల్ ధర రూ.11 వేల నుంచి రూ.13 వేలు పలుకుతోంది. హైబ్రిడ్ రకాల ధర క్వింటాల్ దాదాపు రూ.15 వేల నుంచి రూ.18 వేలు పలుకుతోంది. యార్డులో రైతులకు మిర్చి క్రయ విక్రయాలు ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం. – వెంకటేశ్వరరెడ్డి, ఉన్నత శ్రేణి సెక్రటరీ, గుంటూరు మిర్చి యార్డు -
అన్నీ అ'మిర్చి'..!
సాక్షి, అమరావతి: మిర్చి కోతలకు కూలీల కొరత.. గ్రేడింగ్ సమస్య లేకుండా ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిచ్చాయి. కోసిన పంటను నిల్వ చేసుకునే వెసులుబాటు కల్పించడం కూడా కలిసి వచ్చింది. కరోనా వల్ల తలెత్తిన విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో తాము గట్టెక్కుతామనే ధైర్యం ఏర్పడింది. ముందెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్ మిర్చికు రూ.7 వేల కనీస మద్దతు కల్పించడంతో అప్పుల బారినుంచి గట్టెక్కుతామని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడంతో లాక్డౌన్ ముగిసిన వెంటనే మిర్చి అమ్మకాలు, ఎగుమతులు సాగించే వెసులుబాటు కలిగిందని రైతులు, వ్యాపారులు తెలిపారు. ‘మాది కర్నూలు జిల్లా అవుకు మండలం సింగనపల్లి. తొమ్మిదెకరాల్లో మిర్చి పంట వేశా. మా జిల్లాలో కోతలు దాదాపు పూర్తయ్యాయి. తొలి రెండు కోతల్లో వచ్చిన కాయల్ని అమ్మేశా. మిగతా కోత కాయల్ని అమ్ముదామంటే గుంటూరు యార్డు లాక్డౌన్లో ఉంది. అందుకని అక్కడే ఓ కోల్ట్ స్టోరేజీలో పెట్టా. లాక్డౌన్ ముగిశాక మంచి ధర వస్తుందని ఆశిస్తున్నా’ – మురళీమోహన్‌రెడ్డి, మిర్చి రైతు ‘మాది ప్రకాశం జిల్లా ఇంకొల్లు. ఐదెకరాల్లో మిర్చి వేశా. తొలి పంట అమ్మేశాను. మిగతా పంటను అమ్ముదామనుకునే లోగా లాక్డౌన్ వచ్చింది. యార్డు మూతపడింది. అందుకే మిగిలిన సరుకు కోల్డ్ స్టోరేజీలో ఉంచా. దేశ చరిత్రలో తొలిసారి మిర్చికి రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7 వేలు ప్రకటించింది. దీనివల్ల బయ్యర్లు మంచి రేటే ఇస్తారనుకుంటున్నాను. పాత అప్పు తీర్చేశాను. కౌలు మాత్రం చెల్లించాలి. కొత్త కాయ అమ్మి కౌలు కూడా తీర్చేస్తా’ – పి.హన్మంతు, మిర్చి రైతు 86 శాతం కోతలు పూర్తి ► రాష్ట్రంలో రబీ, ఖరీఫ్ సీజన్లలో కలిపి 1,41,081 హెక్టార్లలో మిర్చి సాగైంది. ఇందులో గుంటూరు జిల్లాది ప్రథమ స్థానం. ► హెక్టార్‌కు సగటున 6.25 టన్నుల దిగుబడి అనుకుంటే సుమారు 8.82 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ► లాక్డౌన్ ఆంక్షల్ని సడలించడంతో మిర్చి కోతలకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కూలీల కొరత తీరింది. కళ్లాల్లో గ్రేడింగ్ కూడా పూర్తయింది. ► ఇప్పటికి దాదాపు 85.90 శాతం విస్తీర్ణంలో కోతలు పూర్తయ్యాయి. మిగిలిన విస్తీర్ణంలో కూడా వారంలో కోతలు పూర్తవుతాయి. ► రాష్ట్రంలో 220కి పైగా కోల్డ్ స్టోరేజీలు ఉండగా.. ఒక్క గుంటూరు జిల్లాలోనే 130 ఉన్నాయి. వీటిలో మిర్చిని నిల్వ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే గిడ్డంగుల్లో 6 లక్షల టన్నులకు పైగా సరుకు నిల్వ ఉంది. ► మిర్చి యార్డు నిర్వాహకులు రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో యార్డుకు దూరంగా కొనుగోళ్లను ప్రారంభించే యోచనలో ఉన్నారు. ఎగుమతుల కోసం కొనుగోళ్లు షురూ ► లాక్‌డౌన్‌కు ముందే రాష్ట్రంలో 1.50 లక్షల టన్నులకు పైగా మిర్చి కొనుగోళ్లు జరిగాయి. లాక్డౌన్ ప్రకటించిన తర్వాత సుమారు 12 వేల టన్నుల సరుకును రైతుల నుంచి కొనుగోలు చేశారు. ► గ్రేడ్‌ను బట్టి క్వింటాల్‌కు రూ.11 వేల నుంచి రూ.13వేల మధ్య పలికింది. తేజ రకం కాయలైతే క్వింటాల్ రూ.14 వేల వరకు ధర లభిస్తోంది. ► విదేశాలకు ఎగుమతి చేసే కంపెనీల తరఫున ఏజెంట్లు ఈనెల మొదటి వారం నుంచే రంగంలోకి దిగి చేలల్లోనే మిర్చి కొనుగోలు చేస్తున్నారు. ► లాక్డౌన్ ముగిశాక సరుకును తీసుకువెళ్లేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. గత నెల 20కి ముందు కొన్న సరుకును ఇటీవల కృష్ణపట్నం పోర్టు నుంచి విదేశాలకు పంపారు. ► ఇదే అదునుగా ఇతర రాష్ట్రాల వ్యాపారులు కూడా ఫోన్లలో స్థానిక ఏజెంట్లను సంప్రదించి గిడ్డంగుల్లో ఉన్న నాణ్యమైన మిర్చికి అడ్వాన్సులు ఇస్తున్నారు. మిర్చి సాగులో ఏపీ టాప్ ► మిర్చిని అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రాల్లో ఏపీదే అగ్రస్థానం. సుమారు 26% ఉత్పత్తి రాష్ట్రం నుంచి వస్తుండగా.. మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ► రాష్ట్రంలో హెక్టార్‌కు సగటు దిగుబడి 6.25 టన్నులు. దేశం నుంచి 2018–19లో 4,68,500 టన్నుల మిర్చిని ఎగుమతి చేస్తే.. ఇందులో 1,43,000 టన్నులు రాష్ట్రం నుంచే వెళ్లాయి. అకాల వర్షాల నుంచి గట్టెక్కితే చాలు ► రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించినందున మిర్చి రైతులెవరూ కంగారు పడాల్సిన పని లేదు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో ఏపీ మిర్చికి మంచి గిరాకీ వస్తుంది. ధర కూడా బాగా ఉంటుంది. తుది దశ కోతలు తప్ప చేలల్లో పెద్దగా పంట లేదు. కూలీల సమస్య కూడా లేదు. అకాల వర్షాల బెడద తప్ప మరే సమస్యా ఉండదు. మొత్తం ఉత్పత్తిలో 20 శాతం ఎగుమతులు ఉంటాయి. వాటి విలువ రూ.5 వేల కోట్ల నుంచి రూ.6 వేల కోట్ల వరకు ఉంటుంది. – వెంకటేశ్వరరెడ్డి, మార్కెట్ యార్డు కార్యదర్శి -
వైరస్‌ను జయించిన మిరప వంగడాలు
మిరప.. ఉద్యాన పంటల్లో ప్రధానమైనది. దేశవ్యాప్తంగా 8 లక్షల హెక్టార్లలో సాగవుతుంటే, ఇందులో 20–22 శాతం ఆంధ్రప్రదేశ్‌లో పండిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం విస్తీర్ణంలో 40 శాతంతో గుంటూరు జిల్లా అగ్రభాగాన నిలుస్తోంది. మిరపకు వెరస్ల బెడద అధికమన్న సంగతి తెలిసిందే. జెమిని వైరస్ / బొబ్బర తెగులు అనే పేర్లతో వ్యవహరిస్తున్న వైరస్ కొన్నేళ్లుగా మిర్చి రైతులను బెంబేలెత్తిస్తోంది. వైరస్ ఆశించిన చేలో పంటపై రైతు ఆశలు వదిలేసుకోవాల్సిందే. లేదా నిత్యం పంటచేలోనే ఉంటూ రకరకాల మందుల పిచికారీతో నిరంతరం యుద్ధమే చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ వైరస్‌ను తట్టుకొనే 3 మిర్చి వంగడాలను గుంటూరులోని లాం ఉద్యాన పరిశోధన కేంద్రం రూపొందించటం విశేషం. ఈ కేంద్రం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.హరిప్రసాదరావు, సీనియర్ శాస్తవేత్త డాక్టర్ సి.వెంకటరమణ సారధ్యంలో జెమిని వైరస్/ బొబ్బర తెగులును తట్టుకోగలిగిన మిరప రకాలు ఎల్సీఏ–657, ఎల్సీఏ–680, ఎల్సీఏ–684లను రూపొందించారు. చిరుసంచుల రూపంలో రైతులకు అందజేసి 2019–20 సీజనులో సాగు చేయించారు. చేబ్రోలు మండలం శలపాడులోని దొడ్డపనేని సాంబశివరావు చేలో పండించిన ఈ మూడు రకాలపై ఇటీవల క్షేత్రప్రదర్శన నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సరల్ చిరంజీవ్ చౌరది, విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకుడు డాక్టర్ ఆర్వీఎస్కే రెడ్డి అతిథులుగా హాజరయ్యారు.మిరప సాగులో హైబ్రిడ్ విత్తనాలు స్వైరవిహారం చేస్తున్న ఈ కాలంలో విడుదలైన నూతన సూటి రకం వంగడాలు రైతులకు మేలుచేస్తాయని శాస్త్రవేత్తలు, రైతులు అంటున్నారు. విత్తనాలను ప్రతి ఏటా కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా.. రైతు పండించిన పంట నుంచి సేకరించిన విత్తనాలను తిరిగి వాడుకోవచ్చు. – బి.ఎల్.నారాయణ,సాక్షి, తెనాలి, గుంటూరు జిల్లా ఎల్సీఏ–657 మొక్కలు ఎత్తుగా, దృఢమైన కాండంతో 3–4 బాగా నిటారుగా ఉండే కొమ్మలతో పెరుగుతాయి. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుతో మందంగా అనిపిస్తాయి. కాయలు ముదురు ఆకుపచ్చ రంగుతో మంచి నిగారింపుతో ఉంటాయి. ఎండుకాయలు మంచి ప్రకాశవంతమైన ఎరుపు రంగుతో, ఎక్కువ కారంగా ఉంటాయి. జెమిని వైరస్/ బొబ్బర/ మిరప ఆకుముడుత వైరస్‌ను తట్టుకుంటుంది. నీటి ఎద్దడిని కూడా తట్టుకోగలదు. ఎల్సీఏ–680 ఈ రకం మిర్చి మొక్కలు ఎక్కువ కొమ్మలతో గుబురుగా పెరుగుతాయి. ఆకులు ఎక్కువగా ఉండి, కాయలన్నీ ఆకులతో కప్పబడినట్టుగా ఉంటాయి. కాయలు లావుగా ఉండి ఆకుపచ్చ రంగు కలిగి ఉంటాయి. పచ్చి మిరప సాగుకు అనువైన రకం. ఎండుకాయ మంచి రంగుతో నిగారింపుతో, మధ్యస్థ కారంగా ఉంటుంది. జెమిని వైరస్/ బొబ్బర/ మిరప ఆకుముడత వైరస్‌ను తట్టుకుంటుంది. ఎల్సీఏ–684 ఈ రకం మిరప మొక్కలు ఎక్కువ కొమ్మలతో ఒక మోస్తరు గుబురుగా కనిపిస్తాయి. కాయలు ఆకుపచ్చ రంగులో సన్నగా 9–10 సెం.మీ పొడవుగా ఉంటాయి. పచ్చికాయలు పక్వతకు వచ్చినపుడు మెరూన్ రంగులో ఉన్నా తర్వాత ఆకర్షణీయమైన ఎరుపు రంగుకు మారతాయి. ఎండుకాయలో ముడతలు స్వల్పంగా ఉండి, ఎక్కువ కారంగా ఉంటాయి. జెమిని వైరస్/ బొబ్బర/ ఆకుముడత వైరస్‌ను తట్టుకునే రకం. ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి జెమిని వైరస్ / బొబ్బర తెగులును నూరు శాతం తట్టుకొని, ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడిని సాధించే మిరప రకాలు రూపొందించడానికి నాలుగైదేళ్లుగా మేం చేసిన కృషి ఫలితంచింది. ఈ వంగడాలు మా పరిశోధన స్థానంలో 20–25 క్వింటాళ్ల దిగుబడిని నమోదు చేశాయి. రాబోయే సీజన్లో వీటిని సాగు చేయాలని భావించే రైతులు లాం ఫారంలో తమను సంప్రదిస్తే.. చిరుసంచుల రూపంలో రైతుకు 25 గ్రాముల విత్తనాలను ఇస్తాం.– డా. సి.వెంకట రమణ, సీనియర్ శాస్తవేత్త,ఉద్యాన పరిశోధన కేంద్రం,లాం ఫారం, గుంటూరు -
‘అకాల’ నష్టం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: అన్నదాతపై ప్రకృతి మరోసారి కన్నెర్ర చేసింది. అకాల వర్షంతో రైతులను ఆందోళనకు గురిచేసింది. జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం కురిసిన వర్షానికి మిర్చిపంట దెబ్బతిన్నది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురవగా, మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. ఆకాశం మేఘావృతం కావడంతో రైతులు ఉరుకులు, పరుగులు పెడుతూ కల్లాల్లో ఉన్న మిర్చిపై టార్పాలిన్ పట్టాలు కప్పుకున్నారు. మరికొన్ని చోట్ల పంట వర్షార్పణమయింది. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో భారీ వర్షం కురిసింది. రెండు మండలాల్లో సుమారు 15 వేల ఎకరాల్లోని మిర్చిపంట దెబ్బతిన్నది. కోసి కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి తడిసి ముద్దయింది. రబీలో సాగుచేసిన వరిపంటకు సైతం తీవ్ర నష్టం వాటిల్లింది. వరి ప్రస్తుతం సుంకు, పొట్టదశలో ఉండగా, భారీగా కురిసిన వర్షం వల్ల సుంకు రాలి దిగుబడి తగ్గే ప్రమాదం ఉండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షంతో రెండు మండలాల్లో రైతాంగానికి సుమారు రూ.2 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. పినపాక నియోజకవర్గంలోని పినపాక, మణుగూరు, కరకగూడెం మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. పినపాక మండలంలో సుమారు 200 క్వింటాళ్ల మిర్చి తడిసింది. పాల్వంచ మండలంలో కురిసిన చిరుజల్లులకు ఆరుబయట ఎండపోసిన మిర్చి కొంతవరకు తడిసింది. జూలూరుపాడు మండలంలో అరగంటపాటు మోస్తరు వర్షం కురవడంతో కల్లాల్లో ఉన్న మిర్చి తడిసింది. మండలంలో సుమారు3 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేయగా, ప్రస్తుతం కోత దశలో ఉంది. చెట్ల మీదనే మిర్చి తడిసిపోయింది. మబ్బులు కమ్మి వర్షసూచన కన్పించడంతో కొత్తగూడెం మార్కెట్ యార్డులోని కందుల విక్రయ కేంద్రంలో ఉన్న బస్తాలను షెడ్ల కిందకు తరలించారు. కొన్నింటిపై టార్పాలిన్ పట్టాలు కప్పారు. హోలి పండుగ, వర్షసూచన ఉండటంతో కందుల కొనుగోలు కేంద్రాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మార్క్‌ఫెడ్ అధికారి సుధాకర్‌రావు తెలిపారు. అకాల వర్షంతో తడిసిన మిర్చిని ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ శాఖాధికారులు ఆలస్యం చేయకుండా వర్షం కురిసిన ప్రాంతాల్లో పర్యటించి నష్టపరిహారాన్ని అంచనావేసి ప్రభుత్వానికి నివేదించాలని, ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. -
ఘాటెత్తుతున్న యార్డులు
సాక్షి, వరంగల్: మిర్చి సీజన్ ఊపందుకోవడంతో వరంగల్ వ్యవసాయ మార్కెట్లో విక్రయించేందుకు రైతులు భారీ మొత్తంలో తీసుకొస్తున్నారు. దీంతో యార్డులన్నీ ఘూటుతో పోటెత్తుతున్నాయి. గత వారం రోజులుగా 30వేల నుంచి 80వేల బస్తాల మిర్చిని రైతులు మార్కెట్లో విక్రయించారు. వేలాది బస్తాలు రావడంతో ఉన్న ఉద్యోగులతో కాంటాలు పెట్టించడం వల్ల రాత్రి వరకు సాగుతోంది. ఒక్కోసారి మరుసటి రోజున కాంటాలు పెడుతున్నారు. దీనికి తోడుగా ఎండలు ముదురుతుండటం వల్ల ఘాటు ఎక్కువ వస్తుండటంతో రైతులు యార్డుల్లో ఉండేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్‌కు వచ్చిన బస్తాల నుంచి షాంపిల్స్ తీయడం వల్ల కింద పడిన మిర్చి ధ్వసం కావడంతో ఈ ఘాటు మరింత ఎక్కువగా వస్తోంది. మిర్చి ఘాటు ప్రధాన రహదారి వరకు వస్తున్నదంటే ఎంత తీవ్రత ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఎక్కువగా ‘తేజ’ రకమే... మార్కెట్లో తేజ రకానికే డిమాండ్ ఉండటంతో రైతులు ఈ రకాన్ని ఎక్కువగా సాగు చేశారు. వరంగల్ మార్కెట్‌కు బుధవారం సుమారు 60వేలకు పైగా మిర్చి బస్తాలు వచ్చాయి. ఇందులో తేజ రకం సగానికి పైగా వచ్చిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం మేలిరకం సరుకు రావడం వల్ల ధరలు గత మూడు రోజులుగా నిలకడగా ఉంటున్నాయని అంటున్నారు. ప్రస్తుతం తేజ రకం మిర్చి క్వింటాల్‌కు రూ.6వేల నుంచి రూ.8వేలకు పైగా ధరతో కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా వండర్ హాట్, యుఎస్–341, సింగిల్పట్టి, డీడీ, సన్నాలు, 1048 లాంటి రకాలు మార్కెట్‌కు వస్తున్నాయి. మిర్చి రెండవ కోతలు ప్రారంభం జోరుగా సాగుతుండటంతో భారీగా సరుకు మార్కెట్‌కు వస్తోంది. మిర్చి నాణ్యతగా ఉన్నప్పటికీ భారీగా సరుకు వస్తున్నందున ధరలు కొన్నింటికే ఎక్కువగా ఇస్తూ మిగిలిన వాటికి అంతగా పెట్టడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంటాలు జాప్యం.. మిర్చి యార్డుల్లో మార్కెట్లోని అన్ని యార్డులకు చెందిన ఉద్యోగులు పనిచేస్తున్నా... కాంటాలు జాప్యం అవుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. కాంటాలు వేసే సమయానికి కమీషన్‌దారులు, కొనుగోలుదారులు లేకపోవడమే ఈ జాప్యానికి కారణమని తెలుస్తోంది. మిర్చి రాక ఎక్కువ కావడం, ఎండల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో యార్డుల్లో వస్తున్న మిర్చి ఘాటుకు రైతులు తల్లడిల్లిపోతున్నారు. యార్డుల్లోని రైతుల కోసం ఏర్పాటు చేసిన తాగునీటి నల్లాల్లో నీళ్లు వస్తున్నప్పటికీ ఆయా పరిసర స్రాంతాలు శుభ్రంగా ఉంచడంలో మార్కెట్ పారిశుధ్య సిబ్బంది విఫలమవుతున్నారు. యార్డులను శుభ్రం చేస్తున్నాం మిర్చి భారీగా వస్తున్నందున యార్డులో ఖాళీగా ఉన్న స్థలాన్ని శుభ్రం చేస్తున్నాం. మిర్చి ఘాటు రాకుండా నీళ్లు చల్లించాలంటే బస్తాలు అడ్డంకిగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రతి రోజు సాధ్యమైన మేరకు శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – రాంమోహ్మన్రెడ్డి, గ్రేడ్–2 కార్యదర్శి -
‘నామ్’మాత్రమే!
ఖమ్మంవ్యవసాయం: మిర్చి పంట విక్రయాల్లో రైతులు దోపిడీకి గురికాకుండా.. ధర, తూకం, కమీషన్లలో దళారులు దగా చేయకుండా.. దళారీ వ్యవస్థకు చెక్ పెడుతూ.. ఆన్లైన్ విధానంలో పోటీ ధర కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ–నామ్) విధానం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో అమలుకు నోచుకోవడం లేదు. ముఖ్యంగా మిర్చి పంట కొనుగోళ్లలో ఈ–నామ్ అమలుపై ప్రభుత్వం, వ్యాపారుల మధ్య పొసగడం లేదు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మూడేళ్ల క్రితమే ఈ–నామ్‌ను ప్రవేశపెట్టారు. తొలుత పత్తి, ఆ తర్వాత అపరాల కొనుగోళ్లకు దీనిని అమలు చేశారు. అయితే పూర్తిస్థాయిలో ఈ విధానం అమలు జరగడం లేదు. ఇందులో తొలి రెండు దశలైన పంటను గేట్ ఎంట్రీ చేసుకోవడం, పంట కొనుగోలు చేసిన వ్యాపారులు ఆన్లైన్లో బిడ్డింగ్ చేయడం మాత్రమే అమలవుతున్నాయి. ఇక మిగిలిన అంశాలు అమలు కావట్లేదు. ముఖ్యంగా ఖమ్మం మార్కెట్‌కు ప్రధానంగా విక్రయానికి వచ్చే పంట మిర్చి. ఈ పంట కొనుగోళ్లలో పూర్వపు పద్ధతులను మాత్రమే పాటిస్తున్నారు. మూడేళ్లుగా ఎంత ప్రయత్నించినా.. మిర్చి కొనుగోళ్లలో ఈ–నామ్ అడుగు ముందుకు పడట్లేదు. రైతులు ధర దోపిడీకి గురవుతుండడంతో ఈ–నామ్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయినా వ్యాపారులు పలు కారణాలు చూపడం.. జిల్లాస్థాయి అధికారులు వ్యాపారులతో సమావేశాలు నిర్వహించినా ప్రయోజనం కనిపించడం లేదు. దీంతో పంట కొనుగోళ్లలో అక్రమాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిర్చి కొనుగోళ్లలో అమలుకాని ‘నామ్’ మిర్చి పంటకు జాతీయంగా, అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ మేరకు వ్యాపారులు ధర నిర్ణయించి.. కొనుగోలు చేస్తుంటారు. కొనుగోళ్లు కేవలం వ్యాపారుల చేతుల్లో మాత్రమే ఉండడంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం అమలు చేసేందుకు అవాంతరాలు చోటు చేసుకుంటున్నాయి. మూడేళ్లుగా మార్కెటింగ్ శాఖ అధికారులు మిర్చి కొనుగోళ్లలో ఈ–నామ్ అమలుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా.. కార్యరూపం దాల్చడం లేదు. అయితే జిల్లాలో ఈ ఏడాది మిర్చి సాగు ఎక్కువగా ఉండడం.. ధర విషయంలో గత సంఘటనలు మార్కెట్లో పునరావృతం కాకుండా ఉండేందుకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా, అక్రమాలకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని, ఈ–నామ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ–నామ్‌కు ముందుకు రాని వ్యాపారులు జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం అమలులో వ్యాపారులు ముందుకు రావట్లేదు. మిర్చి పంట కొనుగోళ్లలో అనేక ఇబ్బందులు ఉంటాయని, ఈ పంటకు ఈ–నామ్ అమలు సరైంది కాదని వ్యాపారులు తమ వాదన వినిపిస్తున్నారు. ఈ విధానం అమలు చేస్తే ప్రతి బస్తాను కోసి.. పరిశీలించాల్సి ఉంటుందని, అందుకోసం మార్కెట్లో బస్తా వెంట బస్తాను పేర్చాల్సి ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. అంతేకాక నిత్యం మార్కెట్‌కు 15వేలకు మించి బస్తాలు రాకుండా నియంత్రించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ–నామ్ విధానాలు అమలు చేసేందుకు సిబ్బందిని కూడా పెంచాల్సి ఉంటుందని, సరుకు ఎక్కువగా వచ్చినప్పుడు ఆన్లైన్ విధానం(సర్వర్) మొరాయిస్తే సమస్యలు తలెత్తుతాయంటున్నారు. మిర్చి కొనుగోళ్లకు ఈ–నామ్ సాధ్యం కాదని తెగేసి చెబుతున్నారు. ప్రయత్నాలు ఫలించేనా? ఓ వైపు ప్రభుత్వ ఆదేశాలు.. మరో వైపు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో అధికార యంత్రాంగానికి ఈ–నామ్ అమలు సవాల్‌గా మారింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు పర్సన్ ఇన్చార్జ్ అయిన జాయింట్ కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానం వ్యాపారులతో సమావేశం నిర్వహించి.. మిర్చి కొనుగోళ్లలో ఈ–నామ్ విధానాన్ని తప్పక పాటించాలని సూచించారు. అయితే వ్యాపారులు మాత్రం పలు కారణాలు, ఇబ్బందుల గురించి వివరించారు. జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి, ఖమ్మం మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి రత్నం సంతోష్‌కుమార్ పలుమార్లు వ్యాపారులతో సమావేశం నిర్వహించి.. ఈ–నామ్ అమలుపై వివరించారు. ఈ క్రమంలో పలు రకాల చర్యలు కూడా చేపట్టారు. రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యాపారులు ఈ–నామ్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. అమలు విషయంలో ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నా.. ఫలితం ఉంటుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే. అయితే ఇప్పటికే నిత్యం మార్కెట్‌కు 20వేల బస్తాల మిర్చి విక్రయానికి వస్తోంది. అమలులో అక్రమాలకు చెక్ ఈ–నామ్ పూర్తిస్థాయిలో అమలు చేస్తే అక్రమాలను నివారించే అవకాశం ఉంది. దళారీ వ్యవస్థ నిర్మూలనతోపాటు అక్రమాలకు అవకాశం ఉండదు. పోటీ ధర లభిస్తుంది. కాంటాల్లో మోసం ఉండదు. కమీషన్ విధానంలో అక్రమాలు ఉండవు. ఆన్లైన్ విధానంలోనే అన్ని కార్యకలాపాలు కొనసాగుతాయి. మార్కెట్ పారదర్శకంగా నిర్వహించబడుతుంది. దేశం నలుమూలల నుంచి వ్యాపారులు పంటను కొనుగోలు చేసుకోవచ్చు. దీంతో రైతులకు న్యాయమైన ధర లభిస్తుంది. సరుకు పరిమితం చేస్తే ఓకే.. నిత్యం 15వేల బస్తాల మిర్చిని విక్రయానికి తెప్పిస్తే ఈ–నామ్ విధానం అమలు చేసేందుకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ప్రతి బస్తాను పరిశీలించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సరుకు పెద్ద మొత్తంలో విక్రయానికి వస్తే ఈ–నామ్ పద్ధతిలో కొనుగోలు చేయడం సాధ్యం కాదు. – కొప్పు నరేష్కుమార్, ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు -
‘చిల్లీ’.. తల్లడిల్లి
ఖమ్మంవ్యవసాయం: మిర్చి సాగు రైతులను కన్నీరు పెట్టిస్తోంది. జిల్లావ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ వాతావరణంలో వచ్చిన మార్పులు, తెగుళ్లతో దిగుబడి తగ్గిపోయింది. దీంతో పంట సాగు చేసిన రైతులపై కోలుకోలేని దెబ్బపడింది. జిల్లాలో ఈ ఏడాది 23,410 హెక్టార్లలో మిర్చి పంట సాగు చేశారు. జిల్లాలోని ఖమ్మం, కూసుమంచి, మధిర, వైరా వ్యవసాయ డివిజన్లలో పంటను విస్తారంగా సాగు చేశారు. సత్తుపల్లి వ్యవసాయ డివిజన్లో మాత్రం సాగు తక్కువగా ఉంది. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల వైరస్ తెగుళ్లు ఆశించి పంటకు నష్టం వాటిల్లింది. ఎకరాకు సగటున 7 క్వింటాళ్ల దిగుబడులు వచ్చాయి. దీంతో సాగుకయ్యే కనీస పెట్టుబడులు పూడకపోగా.. ఎకరాకు రూ.50వేల నుంచి రూ.60వేల మేరకు రైతులు నష్టపోయారు. ఇక కౌలు రైతులు మరో రూ.20వేల మేర నష్టాలను చవిచూస్తున్నారు. పండిన పంటకు కూడా ఆశించిన ధర లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. కుటుంబమంతా ఆరుగాలం శ్రమించినా ఎకరాకు మరో రూ.15వేల మేర నష్టం జరిగింది. పెరిగిన సాగు విస్తీర్ణం ఈ ఏడాది జిల్లాలో మిర్చి సాగు గణనీయంగా పెరిగింది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 19,828 హెక్టార్లు కాగా.. అంతకుమించి 23,410 హెక్టార్లలో పంట సాగు చేశారు. గత ఏడాది 19,605 హెక్టార్లలో మాత్రమే పంట సాగు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 5వేల హెక్టార్లలో అదనంగా పంట సాగు చేశారు. ఇతర పంటల కంటే మిర్చి పంట ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చనే ఆలోచనతో రైతులు మిర్చి సాగుకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ముంచిన తెగుళ్లు అనుకూలించని వర్షాలు, తుపాన్లు, వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల మిర్చి పంటకు తీరని నష్టం జరిగింది. వర్షాల కారణంగా గాలిలో తేమశాతం పెరగడంతో పంట తెగుళ్ల బారినపడింది. ఆగస్టు, డిసెంబర్, జనవరి నెలల్లో కురిసిన వర్షాలు, తుపాన్లు పంటకు ప్రతికూలంగా మారాయి. ప్రధానంగా తోటలకు జెమినీ వైరస్ సోకింది. దీనిని కొంత మేరకు నియంత్రించుకోవడం తప్ప పూర్తి పరిష్కారం లేదు. దీనికి తోడు ఎండు తెగులు ఆశించింది. తెగుళ్ల నివారణకు రైతులు మందులను మార్చిమార్చి పిచికారీ చేశారు. గుంటూరు నుంచి మందులు తెచ్చి వినియోగించినా ఫలితం కనిపించలేదు. తెగుళ్ల కారణంగా పైరు ఆశించిన రీతిలో లేదు. దిగుబడులపై గణనీయంగా ప్రభావం పడింది. ఎకరాకు 7 క్వింటాళ్లు మించని దుస్థితి ఈ ఏడాది ప్రతికూల పరిస్థితుల వల్ల జిల్లాలో సగటున ఎకరాకు 7 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. నల్లరేగడి నేలల్లో మిర్చి గుంటకు క్వింటా చొప్పున 40 గుంటల (ఎకరా) భూమిలో 40 క్వింటాళ్ల పంట పండుతోంది. అయితే ఇక్కడి భూములు వివిధ రకాలుగా ఉండడంతో మిర్చి ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల మేరకు దిగుబడులు వస్తాయి. అయితే ఈ ఏడాది కనీస దిగుబడులు కూడా రాలేదు. ఎకరాకు రూ.50వేల నుంచి రూ.60వేల మేర పెట్టుబడి నష్టం మిర్చి సాగుకు ఎకరాకు నారు పోసింది మొదలు పంటను మార్కెట్‌కు చేర్చి.. విక్రయించే వరకు రూ.1.10లక్షల నుంచి రూ.1.20లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. ఈ ఏడాది ఎకరాకు సగటున 7 క్వింటాళ్ల మేర దిగుబడులు వస్తున్నాయి. ప్రస్తుత ధర క్వింటాల్‌కు సగటున రూ.7,500 వరకు పలుకుతోంది. అంటే ఎకరాకు పంట అమ్మితే రూ.52,500 వస్తున్నాయి. ఎకరాకు దాదాపు రూ.50వేల నుంచి రూ.60వేల మేరకు రైతు పెట్టుబడి నష్టపోతున్నాడు. ఇక కౌలు రైతు పరిస్థితి మరీ దయనీయం. ఈ రైతులు కౌలు మరో రూ.20వేల మేరకు నష్టపోతున్నారు. ఈ ఏడాది మిర్చి సాగు చేసిన రైతులు కనీసం పెట్టుబడులు కూడా పూడక తల పట్టుకున్నారు. మిర్చి ముంచింది.. ఈ ఏడాది మిర్చి పంట ముంచింది. పెట్టుబడుల్లో సగం కూడా పూడే పరిస్థితి లేదు. తుపాను కారణంగా తెగుళ్లు బాగా పెరిగాయి. వర్షాల వల్ల శ్రమ కూడా పెరిగింది. జెమినీ వైరస్‌తో కొందరు రైతులు తోటలను వదిలేశారు. ఇంత దారుణం ఎప్పుడూ చూడలేదు. పండిన పంటకు తగిన ధర కూడా లేదు. దీనివల్ల కూడా నష్టపోతున్నాం. – సిరసవాడ వెంకటేశ్వర్లు, వెదళ్లచెరువు, తిరుమలాయపాలెం మండలం పంటకు ప్రతికూల పరిస్థితి.. ప్రస్తుతం మిర్చి పంటకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. వాతావరణంలో వచ్చిన మార్పులు బాగా దెబ్బతీశాయి. పంట చేతికందే సమయంలో పెథాయ్ తుపాను రావడం కూడా పంటకు నష్టం కలిగించింది. జనవరిలో కురిసిన వర్షం కూడా పంటపై ప్రభావం చూపింది. మొత్తంగా ఈ ఏడాది మిర్చి దిగుబడులు ఆశాజనకంగా లేవు. – జి.అనసూయ, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమాధికారి -
తెల్లబారిన ఎర్ర బంగారం..!
నర్సంపేట రూరల్: ఈ సారి మిర్చి రైతుల కంట్లో కారం కొట్టినట్లయింది తుఫాన్ల ప్రభావం మిరప పంటపై తీవ్ర ప్రభావం చూపి ది. లక్షలు పెట్టుబడి చేసి సాగు చేస్తే పెట్టుబడులు అట్లుంచితే కనీసం కూలీల డబ్బులు రాని పరిస్థితి ఉంది. చివరకు అప్పులే మిగిలాయి. జిల్లాలో వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట నియోజకవర్గాలు ఉండగా ఎక్కువశాతం నర్సంపేట, పరకాల నియోజకవర్గాల్లో మిర్చి పంట లను అధిక సంఖ్య లో సాగు చేస్తున్నారు. ఇటీవల అకాల వర్షాలకు నర్సంపేట నియోజకర్గంలో అధిక నష్టం జరిగిం ది. నర్సంపేట డివిజన్లోని దుగ్గొండి, నర్సంపే ట, నల్లబెల్లి, చెన్నారావుపేట, నెక్కొండ, మండలాల్లో ఎక్కువగా మిర్చి రైతులు నష్టపోయారు. మిర్చి పంట సాగు ఒక ఎకరానికి రూ. 1.50 లక్షల ఖర్చు వస్తోంది. దిగుబడి సుమారుగా 20 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా సుమారు 15 క్వింటాళ్ల నుంచి 18 క్వింటాళ్ల వరకు వచ్చింది. నాణ్యమైన మిర్చి ఉంటే రూ. 8వేల నుంచి రూ.12వేల వరకు ధర పలుకుతోంది. కాని అకాల వర్షాల దెబ్బకు పంట పూర్తిగా దెబ్బతినండంతో ఎక్కువ శాతం తాలు కాయే అయింది. దీనిని మార్కెట్‌కు తీసుకెళ్తే కనీసం ధర రూ. 2వేల నుంచి రూ. 4వేలు పలికే పరిస్థితే కనపడడంలేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పంట దిగుబడి సైతం గణనీయంగా పడిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక రైతులు తలలు పట్టుకుంటున్నారు. మరీ తేజ కాయల పరిస్థితి అయితే అధ్వానంగా ఉంది. పంటను ఏరిస్తే సుమారు రూ. 50వేల వరకు కూలీలకే చెల్లించాల్సి వస్తోందని, తీరా మార్కెట్‌కు వెళ్తే కూలీ డబ్బులు కూడా రాని పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా పంటనష్టంపై హార్టికల్చర్ అధికారులతో సర్వే నిర్వహించి నష్ట పరిహారం అందించాలని పలువురు రైతులు కోరుతున్నారు. పెట్టుబడి అధికం.. దిగుబడి తక్కువ.. మిర్చి పంట సాగుచేసేందుకు ఎకరానికి సుమారు పది ప్యాకెట్లు వరకు విత్తనాలు అవసరం. ఒక్కొక్క ప్యాకెట్ సుమారు రూ.3వేలు వరకు ధర ఉంది. కొన్ని సందర్భాల్లో ఆ గింజలు మొలకెత్తకపోతే అదనంగా మరో రెండు ప్యాకెట్ల వరకు నారు పోయాల్సి వస్తోంది. దుక్కులు, దున్నినందుకు సుమారు రూ. 10 నుంచి రూ. 15వేల ఖర్చు వస్తోంది. పంట నాటినప్పటి నుంచి కాయలు వేరడం వరకు కూలీల ఖర్చు సుమారు రూ. 50వేల నుంచి రూ. 60వేల వరకు వస్తోంది. ఎరువు, పురుగు ముందుల, ఇతర ఖర్చులతో కలిపి సుమారు రూ. 1.50 వరకు ఖర్చు వస్తోంది. దిగుబడి తగ్గడంతో కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితులు ఈ ఏడాది నెలకొన్నాయి. నాణ్యమైన మిర్చి దొడ్డు రకం సుమారు రూ. 10వేల నుంచి రూ. 15 వేల వరకు పలుకుతోంది. సన్నరకం (తేజ)కు రూ. 8వేల నుంచి రూ. 12వేల వరకు పలుకుతోంది. కనీసం ఈ ఏడాది వర్షాలకు దెబ్బతిన్న కాయ పూర్తిగా తాలు కావడంతో సుమారు రూ. 3వేలు కూడా ధర పలికే అవకాశం లేకుండాపోయింది. కూలీల డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతన్నలు లబోదిబోమంటున్నారు. తెగుళ్లు ఎక్కువగా సోకాయి. మిర్చి పంట ఏపుగా పెరిగే దశలో తుపాన్ల వల్ల వర్షాలు కురిశాయి. వాతావరణ పరిస్థితుల్లో మార్పులతో ఎక్కువ శాతం తెగుళ్లు సోకాయి. జిల్లా వ్యాప్తంగా కొంత శాతం పంట దెబ్బతింది. వర్షం కురిసిన సమయంలో ఎక్కువ పూత దశలో ఉండడంతో పెద్ద నష్టం జరగలేదు. కాకపోతే వర్షాభావ పరిస్థితితో తెగుళ్లు అధికంగా సోకాయి. కాయలమీద ఉన్న చేను మాత్రం దెబ్బతింది. తెగుళ్ల నివారణ కాప్టన్, తైరాన్ పిచికారీ చేస్తే పంట బాగుంటుంది. అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితులను అణుగుణంగా నీటిని పంటకు అవసరమున్న మోతాదులోనే అందించాలి. లేని ఝెడల వైరస్లు ఎక్కువ సోకే అవకాశాలు ఉంటాయి. చలి కాలంలో సూక్షపోషకాలు తక్కువగా అందుతాయి. సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. – శ్రీనివాసరావు, జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి -
చేతికందని చేను
సాక్షి, ఖమ్మంరూరల్: సీజన్ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులు.. ప్రస్తుతం తెగుళ్ల బెడద.. వెరశి పత్తి, మిర్చి రైతులకు తీవ్ర నష్టాన్ని కలగజేస్తున్నాయి. ఎన్నో ఆశలతో వేలాది రూపాయలు ఖర్చు పెట్టి పండిస్తున్న పంటలకు చీడపీడలు సోకి కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. చేలన్నీ ఎర్రబారి.. మొక్కలు ఎండిపోయి.. ఎదుగుదల ఆగిపోయి.. కనీసం పెట్టుబడి కూడా చేతికొచ్చేలా కనిపించడంలేదు. ఎన్ని పురుగు మందులు పిచికారీ చేసినా ఫలితం లేకపోవడంతో.. రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. జిల్లాలో లక్ష ఎకరాల్లో మిర్చి, 1.40లక్షల హెక్టార్లలో పత్తి పంటలను ఈ ఏడాది రైతులు సాగు చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో సరైన వర్షాలు లేకపోవడంతో నాటిన పత్తి గింజలు మొలకెత్తలేదు. దీంతో రైతులు రెండు నుంచి మూడుసార్లు విత్తనాలు కొనుగోలు చేసి నాటిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కొద్దోగొప్పో ఆదాయం రాకపోదా అనే ఉద్దేశంతో వర్షాభావ పరిస్థితులను సైతం లెక్క చేయకుండా పత్తిని అత్యధికంగా సాగు చేశారు. పూత దశలో మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పత్తిని పేనుబంక, పచ్చదోమ తెగుళ్లు ఆశించాయి. సరైన మందులను పిచికారీ చేయకుంటే ఈ పురుగులు పంట చివరి దశ వరకు ఉండి తీవ్ర నష్టాన్ని కలగజేస్తాయి. ఈ క్రమంలో వాటి నివారణకు ఏం పిచికారీ చేయాలో తెలియక రైతులు అయోమయానికి గురయ్యారు. ఈ సమయంలోనే ఆ తెగుళ్లు చేయాల్సిన నష్టాన్ని చేశాయి. దీనికి తోడు పైరు పిందె, కాయ దశల్లో తెల్లదోమ, పిండి పురుగు, నల్లి, కాయ తొలిచే పురుగులైన నల్ల మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, గులాబీ రంగు పురుగులు ఆశించి పంటకు ఎక్కువ నష్టం కలగజేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా మొదటి కాపులో దిగుబడి గణనీయంగా పడిపోయింది. కొన్నిచోట్ల ఇప్పటికే రెండో కాపు వచ్చినా.. తెగుళ్ల ఉధృతి పెరిగి ఈసారి దిగుబడి కూడా ఆశించినంత రాలేదు. ఇదిలా ఉంటే.. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచిలో ప్రస్తుతం భక్త రామదాసు నీళ్లు చేలల్లో పారుతున్నాయి. దీంతో రైతులు పత్తికి తడులు కట్టారు. అయితే పత్తి చేలు కొద్దిగా పచ్చబడ్డాయి. కానీ.. ఈ ప్రాంతంలో రెండో కాపునకు పేనుబంక, పచ్చదోమ ఉధృతి విపరీతంగా పెరిగింది. దీంతో రెండో కాపులో ఎకరానికి క్వింటా దిగుబడి కూడా వచ్చేలా లేదు. ఆ పంట అమ్మితే వచ్చే డబ్బులు కూలీలకు కూడా సరిపోవని రైతులు వాపోతున్నారు. ఇదే పరిస్థితి జిల్లా మొత్తం ఉంది. మిర్చి రైతు దిగాలు.. జిల్లాలో మిరప తోటల పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. తెగుళ్ల బారినపడి మొక్కలు ఎండిపోతున్నాయి. ప్రస్తుతం తోటలు పూత, కాపు దశలో ఉండగా.. వేరుకుళ్లు, ముడుత, గుబ్బరోగం, ఎండు తెగులు లాంటివి సోకడంతో మొక్కలు చనిపోతున్నాయి. దీంతో పంటను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి క్రిమిసంహారక మందులను పిచికారీ చేస్తున్నారు. ఈ ఏడాది మిరప సాగు చేసిన తమకు కష్టాలు, నష్టాలే మిగులుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. తెగుళ్లు ఆశించి పంటలు ఎండిపోవడంతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలి.. పదెకరాల్లో పత్తి పంట సాగు చేశా. మొదట వర్షాలు లేక మూడుసార్లు పత్తి విత్తనాలు వేశాం. మొక్కల ఎదుగుదల సమయంలో వర్షాలు లేక పంట మొత్తం ఎండిపోయింది. తిరిగి నీళ్లు పెడితే కొంతమేర పచ్చబడింది. తర్వాత పంటను చీడపీడలు ఆశించాయి. ఇప్పటికే ఎకరాకు రూ.35వేల చొప్పున పెట్టుబడి పెట్టా. ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వమే పత్తి క్వింటాకు రూ.8వేలు మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలి. – యాట శ్రీను, రైతు, కామంచికల్, రూరల్ మండలం ఎదుగుదల ఆగిపోయింది.. నాటిన కొద్దిరోజుల వరకు మిర్చి పంట బాగానే ఉంది. నెలరోజుల క్రితం గుబ్బరోగం వచ్చింది. దీంతో పంట ఎదుగుదల ఆగిపోయింది. వచ్చిన కొద్ది కాయలు కూడా గిడసబారి సైజు తక్కువగా ఉన్నాయి. ఎన్ని మందులు పిచికారీ చేసినా రోగం తగ్గడం లేదు. ఇప్పటికే ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. – బాణోత్ నరేష్, రైతు, రావిచెట్టుతండా, రూరల్ మండలం పసుపు రంగు అట్టలతో నివారణ మిర్చిలో గుబ్బరోగం అనేది తెల్లదోమ ఆశించడం వల్ల వస్తుంది. ఇది వచ్చిన తర్వాత పురుగు మందులు వాడినా ప్రయోజనం ఉండదు. గుబ్బరోగం నివారణకు ఎకరాకు 20 నుంచి 30 వరకు పసుపు రంగు అట్టలు పెట్టుకోవాలి. అట్టలకు జిగురు పూసి పంట చేనులో పెట్టడం వల్ల దోమలు ఆ అట్టలకు అతికి చనిపోతాయి. దీంతో గుబ్బరోగం కొంతవరకు తగ్గుతుంది. – ఝాన్సీలక్ష్మీకుమారి,జేడీఏ -
మిర్చి రైతుకు ధరాఘాతం
మంథని : మిర్చి రైతును కష్టాలు వెంటాడుతున్నాయి. గతేడాది పెట్టుబడులు మీదపడడంతో ఈసారి సాగు సగానికి తగ్గించినా మార్కెట్ మాయాజాలంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. పంటకు సోకిన రోగాలను అధిగమించి అమ్ముకునేందుకు సిద్ధమవుతుండగా ప్రతికూల పరిస్థితులు ఆందోళన కల్గిస్తున్నాయి. అమాంతం పడిపోయిన ధర గత సీజన్లో క్వింటాల్‌కు రూ.ఐదువేల నుంచి రూ.1500కు ధర పడిపోవడంతో చాలా మంది రైతులు రవాణాఛార్జీలు మీదపడుతాయని కల్లాల్లోనే వదిలేశారు. కొందరు పంటను కాల్చి నిరసన తెలిపారు. తర్వాత కొద్దిరోజులకు వ్యాపారులు దరను మళ్లీ రూ.8వేలకు పెంచారు. అయినా.. గతేడాది అనుభవాలను దృష్టిలో పెటుకుని సగం మంది రైతులు సాగుకు దూరమయ్యారు. కాగా.. 15 రోజులక్రితం క్వింటాల్‌కు రూ.11,500 పలికిన ధర ఏకంగా రూ.1500 పడిపోవడంతో రైతులు ఆందోళనలో పడ్డారు. భయపెడుతున్న మబ్బులు వారం రోజులుగా మబ్బులు ఆవరిసున్నాయి. దీంతో పంట దెబ్బతింటుందని రైతులు భయపడుతున్నారు. పంట చేతికచ్చే సమయంలో పకృతి కన్నెరచేస్తే తమకు ఆత్మహత్యలు తప్ప మరేమీ మిగలదని ఆవేదన చెందుతున్నారు. పంట చివరి దశకు రావడంతో అనేక మంది రైతులు ఏరివేత ప్రారంభించారు. కల్లాల్లో పంటను ఆరబెట్టారు. ఈ క్రమంలో వర్షం పడినా.. మబ్బులు చాలా రోజులు ఉన్నా.. కాయ దెబ్బతింటుందని, దీంతో మార్కెట్ ధర పూర్తిగా రాకుండా పోయుందని వారు వాపోతున్నారు. విదేశాలకు ఎగుమతి ఉమ్మడి జిల్లాలో పండించిన మిరప దేశ, విదేశాలకు ఎగుమతి అవుతుంది. ఏటా రూ.3 నుంచి రూ. 5 కోట్ల విలువైన వ్యాపారం ఈ ప్రాంతంలో జరుగుతుంది. వరంగల్ మిర్చి మార్కెట్లో ఈ ప్రాంతంలో పండించిన మిరపకు అత్యధిక ప్రాధాన్యం లభిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ పండించే మిరపను రంగులు, కాస్మోటిక్స్ తయారీలో వినియోగిస్తారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి సగానికి మిర్చి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని మల్లారం, తాడిచెర్ల, పెద్దతూండ్ల, చిన్నతూండ్ల, గాధంపల్లి, వల్లెంకుంట, కిషన్‌రావుపల్లి గ్రామాల పరిధిలో 3 వేల ఎకరాల్లో.. మంథని మండలం చిన్న ఓదాల, బిట్టుపల్లి, శ్రీరాములపల్లి, నాగేపల్లి, తంగెళ్లపల్లి గ్రామాలతో పాటు పెద్దపల్లి జిల్లాలో సుమారు మూడు వేల ఎకరాల్లో పంట సాగుచేశారు. ఆదుకోకుంటే ఆత్మహత్యలే గత సంవత్సరం తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులు ఆశించారు. వరంగల్ మార్కెట్‌తో వ్యాపారుల మాయాజాలం, రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితులపై కేంద్రం ధరను నిర్ణయించినా అమలుకాలేదు. ఈసారి సాగు తగ్గడంతో ధర బాగానే ఉంటుందని రైతులు ఆశించారు. కాని వ్యాపారులు పంట చేతికచ్చే సమయంలో మళ్లీ గత సంవత్సరం మాదిరగానే ధరను దించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ముందు తేరుకుని మిర్చి రైతులను ఆదుకోకుంటే ఈ సారి ఆత్మహత్యలే శరణ్యమని అభిప్రాయపడుతున్నారు. -
వడగండ్ల వాన
మెట్పల్లి రూరల్/మల్లాపూర్/ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్ : వడగండ్ల వాన కడగండ్లు మిగిల్చింది. గురువారం రాత్రి, శుక్రవారం కురిసిన అకాల వడగండ్లతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరబెట్టిన పసుపు తడిసిపోగా, నువ్వులు, మొక్కజొన్న, మిర్చి పంటలు పూర్తిగా నేలవాలిపోయాయి. మామిడి పూత, పిందె రాలిపోయింది. మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కథలాపూర్ తదితర మండలాల్లో శుక్రవారం కురిసిన వడగండ్ల వానతో పంటలు భారీగా నష్టపోయాయి. వడగండ్ల ధాటికి మొక్కలు విరిగిపోయాయి. మెటపల్లి మండలంలో నువ్వులు, మొక్కజొన్న, సజ్జ, వరి, తదితర పంటలు వంగిపోయాయి. మల్లాపూర్ మండలకేంద్రంలో, ధర్మారం, చిట్టాపూర్, ముత్యంపేట, గుండంపల్లి, రేగుంటలో మిర్చి, నువ్వులు, మొక్కజొన్నతోపాటు ఉడకబెట్టిన పసుపు తడిసింది. ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి శివారులో కోరుట్ల నుంచి పోచంపాడుకు వెళ్లే 133/33 కేవీ విద్యుత్ టవర్ కూలిపోయింది. పలుచోట్ల వంద 11 కేవీ విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలవాలాయి. వర్షకొండ, ఎర్దండి, కోమటికొండాపూర్, కోజన్‌కొత్తూర్, కేశాపూర్‌లో అంధకారం నెలకొంది. వడగండ్లు పడడంతో కోజన్‌కొత్తూర్‌కు చెందిన గుజ్జి రాజమల్లు, పిండి లక్ష్మి, పిండి కవిత, లక్కడి చిన్నారెడ్డి, భీంరాజ్, రాజు, రావులు, ఆవుల నడ్పిగంగు, రాజుబాయి, బురుగు లక్ష్మీరాజం, వేములకుర్తికి చెందిన ఆరె లక్ష్మీరాజం, వర్షకొండకు చెందిన చెక్కిల్ల నర్సాగౌడ్తోపాటు బర్దిపూర్‌లో గొర్రెల కాపరులు గాయపడ్డారు. గొర్రెలకు గాయాలయ్యాయి. ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఆరబోసుకున్న పసుపు తడిసింది. ఎర్దండిలో రోడ్లపై పడిన చెట్లను సర్పంచ్ దాసరి రాజవ్వరాజన్న జేసీబీతో తొలగించారు. వర్షకొండలో బూస శంకర్, గూనోల్ల పద్మ ఇంటి రేకులు ఈదురు గాలులకు కొట్టుకుపోయాయి. దెబ్బతిన్న పంటలను ఏడీఏ రాజేశ్వర్ పరిశీలించారు. మండలంలో 1535 హెక్టార్లలో పంటనష్టం జరిగిందన్నారు. కథలాపూర్ : అకాలవర్షం రైతులను కన్నీటిపాలు చేసింది. వడగండ్ల వానతో పంటలు దెబ్బతిన్నాయి. పెగ్గెర్ల శివారులో మిరప, ఉల్లి పంటలకు నష్టం వాటిల్లింది. ఇళ్లలోకి వర్షంతో కూడిన వడగండ్లు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పలు గ్రామాల్లో ఆరుబయట పోసిన పసుపు, పొద్దుతిరుగుడు పంటలు తడిసిపోయాయి.సారంగాపూర్ : వడగండ్ల వానకు రేచపల్లిలో 50 ఎకరాల్లో మొక్కజొన్న కర్రలు విరిగి నేలవాలింది. మంగళారపు గంగన్న, మామిడి రాజేశం, గాజునాయక్, పోతుగంటి తిరుపతి తదితర రైతుల పంటలు దెబ్బతిన్నాయి. బబ్బెర, మామిడికి నష్టం వాటిల్లింది. మామిడి పూత పిందెలు వడగండ్ల ధాటికి రాలిపోయాయి.