ఖరీఫ్‌కు ప్రభుత్వమే సిద్ధం చేయూలి
► 50శాతం రుణమాఫీ జమ చేయూలి
► ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
సారంగాపూర్ : ఖరీఫ్‌కు రైతులను సిద్ధం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పెంబట్ల గ్రామంలో ఎస్సీ కమ్మూనిటీ భవనానికి, సారంగాపూర్‌లో రక్షిత మంచినీటి బావి (ఓపెన్ వెల్) ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. కరువు మండలాలను ప్రకటించడంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నార న్నారు. జిల్లాలో ఇంకా 40 మండలాల్లో తీవ్ర కరువు ఉందని, కరువు మండలాలపై పునఃసమీక్షించాలని హైకోర్టు సూచించినా ఎలాంటి పురోగతి లేదన్నారు. మళ్లీ కోర్టును ఆశ్రరుుస్తానని జీవన్‌రెడ్డి వెల్లడించారు.
రెండేళ్లుగా కరువు కారణంగా రైతుల చేతుల్లో చిల్లి గవ్వ లేదని, ఖరీఫ్‌కు ప్రభుత్వమే రుణ సాయం చేయూలన్నారు. 50 శాతం రుణమాఫీ రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కరువు మండలాల ప్రకటనతో రుణాల రీషెడ్యూల్, ఇన్పుట్ సబ్సిడీ పశుగ్రాసం రైతులకు సమకూరుతాయని, రైతులకు మేలు కలుగుతుందన్నారు.
రోల్లవాగుకు మొసల్ల మడుగు నీరు తప్పనిసరి
రోల్లవాగు ప్రాజెక్టును ఆధునీకరించడంతోపాటు మండలంలోని రంగసాగర్ మొసల్ల మడుగును లిఫ్ట్ చేయడం తప్పనిసరి అని ఎమ్మెల్యే అన్నారు. మూడేళ్లుగా ఎస్సారెస్పీ నిండడం లేదని, రోల్లవాగుకు నీరు రాక పంటలు సాగుకావడం లేదన్నారు. ఆధునీకరణతోపాటు, మొసల్ల మడుగు నుంచి లిఫ్ట్‌లు ఏర్పాటు చేయడానికి అధికారులు చేపట్టిన సర్వే పనులు పూర్తి కావచ్చాయని, లిఫ్ట్‌ల ఏర్పాటుకు రూ. 80 కోట్లు ఖర్చువుతుందని అధికారులు చెబుతున్నారని, దీనికోసం వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు.
నాన్‌సీఆర్‌ఎఫ్ కింద జగిత్యాల నియోజకవర్గంలో 25 బావులు తవ్వడం జరిగిందని, బావుల చుట్టూ సిమెంట్ గాజులు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరారు. ఆయన వెంట ఎంపీపీ కొల్ముల శారద, జెడ్పీటీసీ భూక్య సరళ, ఎంపీడీవో మల్హోత్రా, వైస్‌ఎంపీపీ కోండ్ర రాంచంద్రారెడ్డి, ఏఈ పీఆర్ రాజమల్లయ్య, సర్పంచ్‌లు గుర్నాథం లక్ష్మీ, ఆసాల జయ, ఎంపీటీసీ కొలపాక లక్ష్మీరాజం, మండల కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు గుడిసె జితేందర్, మాజీ జడ్పీటీసీ కొల్ముల రమణ తదితరులు పాల్గొన్నారు.