ఫైనల్లో హుస్సాముద్దీన్
సోఫియా (బల్గేరియా): స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్ మొహమ్మద్ హుస్సాముద్దీన్ ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల 56 కేజీల విభాగం సెమీఫైనల్లో బల్గేరియా బక్సార్ స్టీఫెన్ ఇవనోవ్‌పై హస్సాముద్దీన్ గెలుపొందాడు. ఫైనల్లో ఉక్రెయిన్‌కి చెందిన మైకోలా బుత్సెన్‌కోతో హుస్సాముద్దీన్ తలపడనున్నాడు. మరోవైపు భారత్‌కే చెందిన అమిత్ పన్‌గల్ (49 కేజీలు), మీనా కుమారి (54 కేజీలు) సెమీఫైనల్స్‌లో ఓడిపోయి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.