Mohammed Ahmed
-
బాబు చేతిలో మండలి మాజీ చైర్మన్‌కు ఘోర అవమానం
సాక్షి, మదనపల్లె: ముస్లింలపై చంద్రబాబుది కపట ప్రేమేనని మరోసారి రుజువైంది. చంద్రబాబు సోమవారం అన్నమయ్య జిల్లా పీలేరు సబ్ జైలు వద్ద మైనారిటీ రాష్ట్ర నాయకుడు, శాసన మండలి మాజీ చైర్మన్, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, పార్టీ క్రమశిక్షణ సంఘం జాతీయ అధ్యక్షుడు కూడా అయిన మహ్మద్ అహ్మద్ షరీఫ్‌ను ఘోరంగా అవమానించారు. సబ్ జైలులో ఉన్న ముస్లిం నేతల పరామర్శకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మైనారిటీ నాయకులందరూ పెద్ద సంఖ్యలో పీలేరుకు రావాలని టెలీ కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు కోరడంతో అహ్మద్ షరీఫ్ కూడా సోమవారం గుంటూరు నుంచి అక్కడకు వెళ్లారు. చంద్రబాబు రాకముందే పీలేరు సబ్ జైలు వద్దకు వచ్చారు. ఇంతలో పోలీసు అధికారులు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని మాత్రమే లోనికి అనుమతిస్తామని చెప్పారు. అందులో షరీఫ్ పేరు లేకపోవడంతో ఆయన అనుచరులు అసహనం వ్యక్తంచేశారు. అక్కడ ఉన్న టీడీపీ నాయకులు కనీసం పట్టించుకోలేదు. గంట తర్వాత చంద్రబాబు వచ్చారు. కార్యకర్తలను పలకరిస్తూ జైలు వద్దకు వెళ్లారు. షరీఫ్‌ను చూసి దగ్గరకు వచ్చి వేలు చూపించి వస్తావా అన్నట్లు సైగ చేశారు. వస్తానని చెప్పి ముందుకు వస్తుంటే.. పట్టించుకోకుండా తన అనుచరగణంతో గబగబా లోపలకు వెళ్లిపోయారు. అక్కడ ఉన్న కార్యకర్తలు ఆయన్ని నెట్టివేయడంతో మనస్తాపానికి గురయ్యారు. సబ్ జైలు నుంచి దూరంగా వెళ్లిపోయారు. చదవండి: (మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు.. 20 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత..) ఆయన అనుచరులు టీడీపీ నాయకులను నిలదీసేందుకు సిద్ధమయ్యారు. ఇది గమనించిన టీడీపీ నాయకులు ఆయన్ని అక్కడికి తీసుకొచ్చారు. అరగంట తర్వాత చంద్రబాబు బయటకు వచ్చాక షరీఫ్‌ను ఆయన పక్కన నిల్చోబెట్టారు. బాబు ప్రసంగం తర్వాత మైనారిటీల నాయకుడిగా ఆయనకు మాట్లాడే అవకాశం ఇస్తారని అందరూ భావించారు. ఇక్కడా భంగపాటే ఎదురైంది. ప్రసంగం అవగానే చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు పట్టనట్లే వెళ్లిపోయారు. దీంతో షరీఫ్ అనుచరులు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. గుంటూరు నుంచి రమ్మని టెలీకాన్ఫరెన్స్‌లో ఆహ్వానించి, తీరా వచ్చాక అవమానించడం దేనికంటూ వాపోయారు. టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్, ఇతర మైనారిటీ నాయకులకు కూడా ఇదే భంగపాటు ఎదురైంది. చదవండి: (AP: రైతులకు 25 ఏళ్లు ఉచిత విద్యుత్) -
అన్యాయంగా చంపారు
వికార్ తండ్రి అహ్మద్.. శిక్షించేందుకు పోలీసులెవరంటూ ఆగ్రహం హైదరాబాద్: తన కుమారుడు వికారుద్దీన్‌ను పోలీసులు అన్యాయంగా ఎన్కౌంటర్ చేశారని అతని తండ్రి మహ్మద్ అహ్మద్ ఆరోపించారు. చేతులకు బేడీలున్నవాళ్లు ఎలా తప్పించుకోగలరు? నేరం చేస్తే కోర్టులు శిక్షించాలిగానీ పోలీసులు ఎన్కౌంటర్ చేయడమేంటి? ప్రభుత్వం, పోలీసులు నీచంగా నా కొడుకునుబలి తీసుకున్నారు’’ అంటూ ఆగ్రహించారు. వికార్పై కేసులను కొట్టేసే దశలో ఎన్కౌంటర్ చేయడం దుర్మార్గమని మంగళవారం తన నివాసంలో విలేకరులతో అన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై తమకు నమ్మకం పోయిందని, ఎన్‌కౌంటర్‌పై సీబీఐతో దర్యాప్తు చేయించాలని అహ్మద్ డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్ చేసిన వారిపై కేసులు పెట్టనిదే మృతదేహాన్ని తీసుకెళ్లబోమని హెచ్చరించారు. ‘‘నా కొడుకును పది రోజుల క్రితం వరంగల్ జైల్లో చూశాను. విచారణ 90 శాతం పూర్తయిందని, ఒకట్రెండు నెలల్లో బయటికొస్తానని చెప్పాడు. సిమీతో తనకు ఏ సంబంధమూ లేదు. నా ఐదుగురు సంతానంలో వికార్ నాలుగోవాడు. బి.కాం. మధ్యలో ఆపేశాడు. 2009లో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. 2011లో అరెస్టు చేసి జైల్లో పెట్టారు’’ అని చెప్పారు. ఇది పక్కా పోలీసు హత్య అని, కేసులను కొట్టేసే దశలో ఎన్కౌంటర్ చేయడంపై న్యాయ విచారణకు సిద్ధమవుతామని న్యాయవాదులు ఎం.ఎ.అజీమ్, ఎస్.కె.సైఫుల్లా అన్నారు. -
ప్రధాని నివాసం వద్ద గౌషర్ బాధితుల నిరసన
న్యూఢిల్లీ: ఉచిత వైద్యసదుపాయం కల్పించాలనే డిమాండ్‌తో వందలాది మంది గౌషర్ వ్యాధి బాధితులు ప్రధాని నరేంద్ర మోడీ నివాసం ఎదుట శనివారం మౌనప్రదర్శన నిర్వహించారు. తొలిసారిగా శనివారం అంతర్జాతీయ గౌషర్ డే జరుపుకుంటున్న నేపథ్యంలో లిసోసోమల్ స్టోరేజ్ డిజార్డర్ సపోర్ట్ సొసైటీ (ఎల్ఎస్డీఎస్ఎస్) నిర్వహించిన ఈ ప్రదర్శనలో వ్యాధి బాధితులతోపాటు వారి కుటుంబ సభ్యులూ పాల్గొన్నారు. ఆందోళనకారులు తమకు న్యాయం చేయాలని కోరుతూ ప్రధాని నివాసం ఎదుట బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. హైకోర్టు ఆదేశాల ఫలితంగా ఎయిమ్స్‌లో ఉచితంగా చికిత్స పొందిన ఏడేళ్ల మహ్మద్ అహ్మద్, ఇతని తల్లిదండ్రులు సిరాజుద్దీన్, అన్వారీ బేగంను ఈ సందర్భంగా ఎల్ఎస్డీఎస్ఎస్ పరిచయం చేసింది. జన్యపరంగా సంక్రమించే గౌషర్ వ్యాధి సోకిన వారి శరీరాల్లోని కణాలు, అవయవాల్లో అధికంగా కొవ్వు పేరుకుపోతుంది. కళ్లు, చేతులు సన్నబడతాయి. పొట్టమాత్రం ఉబ్బి కనిపిస్తుంది. విపరీతంగా బరువు తగ్గడం వల్ల ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారు. ఇదిలా ఉంటే సిరాజుద్దీన్ కుమార్తె, ముగ్గురు కుమారులు ఇది వరకే ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కోర్టు పుణ్యమాని మహ్మద్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ వ్యాధి కారణంగా మొదట మహ్మద్ ఆరోగ్యం దారుణంగా క్షీణించడంతో ఇతనికి ఈఆర్టీ (ఎంజైమ్ రీప్లేస్మెంట్ థెరపీ) అవసరమని వైద్యులు సూచించారు. దీనికి రూ.ఆరు లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పడంతో రిక్షా కార్మికుడు సిరాజుద్దీన్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో ఆయన ఒక న్యాయవాది సాయంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో ఉచితంగా వైద్యసదుపాయం అందింది. ఇలాంటి అరుదైన వ్యాధులు సోకిన వారందరికీ ప్రభుత్వమే ఉచితంగా సాయం చేయాలని సిరాజుద్దీన్ కేసును వాదించిన న్యాయవాది అశోక్ అగర్వాల్ అన్నారు. మనదేశంలో ఏటా ఐదువేల మంది గౌషర్ వంటి అరుదైన వ్యాధులతో జన్మిస్తున్నారని అంచనా. ‘ఇలాంటి రోగాల బాధితులు డబ్బు లేకపోవడం వల్ల చికిత్సకు దూరం కాకూడదు. వీరికి ప్రభుత్వం తగినసాయం చేయాలి’ అని సర్ గంగారామ్ ఆస్పత్రి సెంటర్ ఫర్ జెనెటిక్స్ డెరైక్టర్ డాక్టర్ ఐసీ వర్మ అన్నారు.