రోదనలతో మిన్నంటిన మార్చురీ
అంతటా అలుముకున్న విషాదం
కంట తడి పెట్టిన మహిళలు
పోచమ్మమైదాన్ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని మార్చురీ గురువారం రోదనలతో మిన్నం టింది. గురువారం ఉదయం 11గంటలకు మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక, మనుమలు అభినవ్, అయాన్, శ్రీయాన్ మృతుదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తామని వైద్యులు ప్రకటిం చడంతో ఉదయం 10గంటల సమయానికే మహిళా, కుల సంఘాల బాధ్యులతో పాటు నగర ప్రజలు, మహిళలు పెద్దసంఖ్యలో మా ర్చురీ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా దుఃఖసాగరంలో మునిగిపోయిన సారిక తల్లి లలిత, ఆమె సోదరి, బంధువులను చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు.
అయ్యా.. నాబిడ్డ, నా మనుమలు పాయే, అందరూ నా బిడ్డల లాంటి వారే... అందరి ఆడోళ్లకు న్యా యం చేయండి.. అంటూ లలిత రోదిస్తున్న తీరి పలువురు మహిళలు ఆమెను ఓదార్చేందు కు యత్నించారు. అలాగే, సారిక, ఆమె కుమారుల మృతదేహాలు బొగ్గు ముద్దల్లా మార్చురీలో ఉం డడాన్ని చూసి... కన్నుమూసిన సమయంలో ఎంత వేదన అనుభవించారోనంటూ కన్నీరు మున్నీరయ్యారు. అలాగే, మరికొందరు రాజ య్యతో పాటు ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజయ్య కుటుంబానికి ఉరిశిక్ష విధించాలంటూ డిమాండ్ చేశారు.