mpp candidate
-
విశాఖ జిల్లా ఆనందపురం ఎంపీపీగా డెంటల్ డాక్టర్
-
నకీలీ సర్టిఫికెట్తో ఎంపీపీ పదవి..
సాక్షి, దేవరకద్ర(మహబూబ్‌నగర్): తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో దేవరకద్ర ఎంపీపీ రమాదేవి ఎంపీపీ పదవి పొందారని ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆరోపించారు. మంగళవారం దేవరకద్రలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఓసీ కులానికి చెందిన రాములమ్మ, పదవి కోసం తహసీల్దార్ కార్యాలయం నుంచి బీసీ సర్టిఫికెట్ పొందారని, బీసీ మహిళలకు రిజర్వు అయిన దేవరకద్ర ఎంపీపీ పదవిని చేజిక్కించుకున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన శ్రీకాంత్‌యాదవ్ తన భార్య అయిన రాములమ్మ అలియాస్ రమాదేవిని ఎంపీపీ పదవి కోసం అప్పటి తహసీల్దార్ చెన్నకిష్టన్న సహకారంతో బీసీ సర్టిఫికెట్ పొందారని ఆరోపించారు. ఈ తప్పు బయటపడకుండా తహసీల్దార్ కార్యాలయంలో ఫైల్‌ను అపహరించారని అన్నారు. బీసీ మహిళకు కేటాయించిన స్థానంలో ఓసీ మహిళను ఎన్నుకోవడంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. సమావేశంలో టీపీసీసీ సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్‌కుమార్‌గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రశాంత్‌రెడ్డి, అరవింద్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రాందాసు, కిషన్‌రావు, రాఘవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. చదవండి: నెల క్రితం మిస్సింగ్.. 10 అడుగుల లోతులో అస్థిపంజరాలు -
నిన్న నిశ్చితార్థం.. నేడు నామినేషన్..!
సాక్షి, కురిచేడు: కురిచేడు ఎంపీపీ అభ్యర్థిగా వైఎస్సార్ సీపీ తరఫున ఓ యువతి బరిలోకి దిగుతోంది. అందులో ఆశ్చర్యమేముందంటారా..?...ఉంది!! మంగళవారం రాత్రి అప్పటికప్పుడు ఆ యువతికి ఓ యువకుడితో నిశ్చితార్థమైంది. కాబోయే భర్త కుటుంబం తరఫున ఆమె పోటీకి సిద్ధమైంది. తాను ఎంపీపీ పదవి రేసులో ఉంటానని ఆ యువతి ఊహించి ఉండదు. అనుకోని విధంగా వరించిన ఈ అవకాశంతో ఆ యువతి ఆనందానికి అవధుల్లేవు. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కురిచేడు ఎంపీపీ పదవి ఓసీ మహిళకు రిజర్వ్ అయింది. వైఎస్సార్ సీపీ తరఫున అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను దేకనకొండ గ్రామానికి చెందిన బెల్లం చంద్రశేఖర్‌కు అప్పగించారు. చంద్రశేఖర్‌కు ముగ్గురు కుమారులు కావడంతో తన భార్యను పోటీకి నిలిపే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయన తన పెద్దకుమారుడు సురేష్‌కు వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. గంగదొనకొండ గ్రామానికి చెందిన పార్శ్వపు వెంకటనర్సయ్య కుమార్తె శిరీషతో మంగళవారం రాత్రి అప్పటికప్పుడు నిశ్చితార్థం చేశారు. ఈ నెల 11వ తేదీతో ఎంపీటీసీ పదవులకు నామినేషన్ గడువు ముగియనుండటంతో తన కోడలిని బరిలోకి దించాలనే ఉద్దేశంతో ఈ వివాహం నిశ్చయించారు. తమ గ్రామానికి చెందిన ఎంపీటీసీ స్థానం ఇతర వర్గాలకు రిజర్వు కావడంతో కల్లూరు గ్రామ ఎంపీటీసీ అభ్యర్థిగా కాబోయే కోడలు పార్శ్వపు శిరీషతో బుధవారం నామినేషన్ వేయించేందుకు బెల్లం చంద్రశేఖర్ సిద్ధమయ్యారు. -
రైతులు సంతోషంగా ఉన్నారా?
బోయినపల్లి: ‘‘ఏం సంగతి, అంత మంచిదేనా..! వరద కాలువకు నీళ్లు వస్తున్నాయా?..రైతులు సంతోషంగా ఉన్నారా.. మిడ్‌మానేరు నింపుదామా?’’అని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్, మాజీ జెడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డిలను సీఎం కేసీఆర్ ఫోన్లో ఆరా తీశారు. శుక్రవారం సీఎం వారిద్దరికీ ఫోన్ చేసి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ‘సర్.. మీరు నీళ్లు ఇవ్వడంతో రైతులు సంతోషంగా ఉన్నారు’అని వేణు, లచ్చిరెడ్డి సమాధానం చెప్పారు. వరద కాలువకు నీరుఎంత వస్తుందని సీఎం ప్రశ్నించగా.. 1,600 క్యూసెక్కులు వస్తున్నాయని వారు చెప్పగా.. లేదు ఏడు వేల క్యూసెక్కుల నీరు వస్తుందని సీఎం పేర్కొన్నారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు నింపుకుందామా? అని అడుగగా.. నింపుకుం దాం సార్.. కానీ, ముంపు గ్రామాల్లో గెజిట్ మిస్సింగ్, వృత్తుల్లో తప్పులు ఉన్నాయి.. అని సీఎంకు వివరించారు. ‘అవి చేద్దాం.. మీరు ఈ రోజే కలెక్టర్‌ను కలవండి’అని కేసీఆర్ ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలకు రూ.5.04 లక్షల ప్యాకేజీ ఇవ్వాలని కోరగా..‘ఆడిట్ ప్రాబ్లం ఉంటుంది. ఒక్క ప్రాజెక్టుకు ఇస్తే అన్నిటికీ ఇవ్వాలి చూద్దాం’ అని సీఎం సమాధానమిచ్చారు. నీటి ప్రవాహాల చిత్రాలు పంపండి వరద కాలువ పరిసరాల్లోకి వెళ్లి ఫోన్లో మాట్లాడాలని సీఎం ఆదేశించడంతో వారు అక్కడికెళ్లి మాట్లాడారు. సీఎం కోరిక మేరకు నీటి ప్రవాహాల చిత్రాలు పంపారు. -
గుంపుతో ‘క్యాంపు’!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి జిల్లాలో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల పదవుల ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రాదేశిక ఎన్నికల ఫలితాల ప్రకటనకు ముందే ప్రధాన పార్టీలన్నింటా క్యాంపు రాజకీయాల బెడద మొదలైంది. ఫలితాలు వెలువడ్డాక.. గెలిచిన సభ్యులను ఎలా కాపాడుకోవాలి? ప్రత్యర్థులను ఎలా చిత్తు చేయాలి? చేతులెత్తే పద్ధతిన జరిగే జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్ష పదవులనెలా కైవశం చేసుకోవాలి.. మెజారిటీ బలాన్ని నిరూపించుకునేందుకు ఎవరికి వల వేయాలి? ఏమేం ఎర వేయాలి? అందరి నోటా ఇదే చర్చ జరుగుతోంది. నేటి సాయంత్రానికల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా 71 జెడ్పీటీసీ, 780 ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. అనంతరం మండలాల్లో.. గ్రామాల్లో కొలువుదీరే విజేతలెవరో తేలిపోనుంది. అలాగే ఈనెల 7న ఎంపీపీ, 8న జెడ్పీ చైర్మన్ల ఎంపికకు ముహూర్తమూ ఖరారైంది. దీంతో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జెడ్పీ చైర్మన్ గిరీలతో పాటు ఎంపీపీ పీఠాలు ఎవరు కైవసం చేసుకుంటారో అనే చర్చ ఇప్పట్నుంచే మొదలైంది. క్యాంపునకు తరలించే యోచన ప్రాదేశిక ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు చేజారకుండా వారిని క్యాంపులకు తరలించే యోచనలో పార్టీలున్నాయి. సాధారణంగా అన్ని చోట్ల ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీ అక్కడి ఎంపీపీ.. జెడ్పీ చైర్మన్, చైర్పర్సన్ పీఠాన్ని కైవశం చేసుకునే అవకాశముంది. కానీ అనిశ్చిత బలబలాలతో హంగ్ లాంటి పరిస్థితి ఉత్పన్నమైతే.. చైర్మన్ ఎన్నిక ఉత్కంఠభరితమే. ఒకటీ రెండు ఓట్లు తారుమారైతే.. ఎవరైనా లోపాయకారీగా ప్రత్యర్థి పార్టీలకు మొగ్గు చూపితే.. ఎన్నిక జరిగే సమయానికి ఎవరైనా గైర్హాజరైనా.. ఫలితం తారుమారయ్యే పరిస్థితి నెలకొంటుంది. గెలిచే మేజిక్ ఫిగర్‌కు ఒక ఓటు అటు ఇటయినా.. ఫలితం చేజారిపోవటం ఖాయం. అందుకే ప్రధాన పార్టీలతోపాటు చైర్మన్ గిరీ రేసులో ఉన్న అభ్యర్థులకు రాబోయే ఎన్నిక సవాలుగా మారుతుంది. పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికలు కావటంతో విప్ జారీ చేసే అవకాశం లేకపోలేదు. అందుకే తమకున్న బలగాన్ని చైర్మన్ ఎన్నిక జరిగే వరకు భద్రంగా కాపాడుకునేందుకు ప్రధాన పార్టీలు, అభ్యర్థులు ఇప్పట్నుంచే ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. తమ సభ్యులతో పాటు అవసరమైన ఓట్ల మేరకు మిగతా వారితో బేరసారాలాడి ఎన్నిక నాటి వరకు ఎక్కడికైనా తరలించే క్యాంపు రాజకీయాలపై దృషి సారించాయి. ఫలితాలు వెలువడిన వెంటనే బేరసారాలు చేసుకుని రహస్యంగా శిబిరాలకు తరలించేందుకు నాయకులు మొగ్గు చూపుతున్నారు. మండలాల్లో ఈ క్యాంపు రాజకీయాలు మరింత జోరుగా సాగే అవకాశముంది. అన్నిచోట్ల ఎంపీటీసీలుగా గెలిచే సభ్యులకు ఎంతో కొంత ముట్టజెప్పి ఎంపీపీ పదవులను తమ వశం చేసుకునేందుకు అన్ని పార్టీల నాయకులు కాచుక్కూచున్నారు. అందుకే ఫలితాలు వెలువడిన వెంటనే ఎంపీటీసీ సభ్యులను విహారయాత్రల పేరుతో క్యాంపులకు తీసుకెళ్లే ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. పార్టీ ఆఫీసుల్లో సమావేశాల పేరిట గెలిచిన ఎంపీటీసీ సభ్యులందరినీ ఇతర ప్రాంతాలకు తరలించాలని ఒక ప్రధాన పార్టీ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. మరోవైపు సొంత పార్టీ సభ్యులు క్యాంపుల దారి పట్టకుండా ఉండేందుకు విప్ జారీ చేసే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. పదవిని అందుకోవాలని ఎంపీపీ రేసులో ఉన్న అభ్యర్థులు తమ శక్తియుక్తులతోపాటు డబ్బులు కుమ్మరించేందుకు సిద్ధపడగా.. ప్రధాన పార్టీల ముఖ్య నేతలు సైతం ఎక్కువ ఎంపీపీ స్థానాలు తమ ఖాతాలో వేసుకోవాలని ఎత్తుగడలు వేస్తుండటంతో క్యాంపులు ఎన్ని రూట్లు మారుతాయోననే చర్చ జరుగుతోంది. రంగంలో ఇన్‌చార్జ్‌లు ప్రాదేశిక ఎన్నికల ఫలితాల తర్వాత గెలుపొందిన అభ్యర్థులు చేజారకుండా ఉండేందుకు అన్ని పార్టీలు శక్తియుక్తులన్నీ ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలోనే మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను ఇన్‌చార్జీగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు నియమించారు. అలాగే జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని, నాగర్‌కర్నూల్ జిల్లాకు స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డిని నియమించారు. ఇటు కాంగ్రెస్ సైతం మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డిని, నాగర్‌కర్నూల్ జిల్లాకు మల్లు రవిని, వనపర్తి జిల్లాకు మాజీ మంత్రి చిన్నారెడ్డిని, జోగుళాంబ గద్వాలకు మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను నియమించింది. ఇక బీజేపీ నుంచి గెలుపొందిన అభ్యర్థులు క్యాంపులకు తరలివెళ్లకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఆ పార్టీ నాయకులు డి.కె.అరుణ, మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి అప్రమత్తంగా ఉంటూ క్షేత్రస్థాయి పరిణామాలపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. -
ముందస్తుగానే ‘పరిషత్’ అభ్యర్థుల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ప్రాదేశిక ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ ముందస్తు వ్యూహంతో వెళుతోంది. మండల పరిషత్, జిల్లా పరిషత్ చైర్మన్లు, చైర్పర్సన్ అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తోంది. దీనిలో భాగంగా ఆరుగురు జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థులను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఖరారు చేశారు. ఆదిలాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నల్లగొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల అభ్యర్థులను బుధవారం అధి కారికంగా ప్రకటించారు. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల అభ్యర్థుల పేర్లలోనూ ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ రెండింటితో పాటు మిగిలిన జిల్లాల చైర్మన్ అభ్యర్థులను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. పరిషత్ చైర్మన్ అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం లాభిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. చైర్మన్ అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఆయా మండలాలు, జిల్లాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ధీమా లభిస్తుందని, పార్టీ శ్రేణులకు కూడా స్పష్టత వస్తుందని, తద్వారా ఎన్నికలను దీటుగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పార్టీ కేడర్‌లో విశ్వాసం కల్పించిన దిశలోనే ఎన్నికలను ఎదుర్కోవాలని నిర్ణయించామని, తమకు అభ్య ర్థులు లేరనే అధికార పార్టీ ప్రచారాన్ని తిప్పికొట్టే వ్యూహంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. కాగా, మండల పరిషత్ అధ్యక్ష స్థానాలకు కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తోంది. ఈ మేరకు ఎంపీపీ అభ్యర్థులను ఎంపిక చేసే అధికారాలను డీసీసీలకు కట్టబెట్టింది. టీపీసీసీ ఖరారు చేసిన జెడ్పీ చైర్మన్ అభ్యర్థులు.. - ఆదిలాబాద్: చారులత రాథోడ్ - మహబూబాబాద్: ఇస్లావత్ పార్వతి - మహబూబ్‌నగర్: జె.దుష్యంత్‌రెడ్డి - మంచిర్యాల: మద్ది రమాదేవి - నల్లగొండ: కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి - నాగర్‌కర్నూలు: అనూరాధ వంశీకృష్ణ ఏకాభిప్రాయం వచ్చిన అభ్యర్థులు.. - సూర్యాపేట: పటేల్ లావణ్య - యాదాద్రి భువనగిరి: కుడుదుల నగేశ్ -
‘పరిషత్’ ఆసక్తికరం..
సాక్షి, ఆసిఫాబాద్: ఈసారి మండల పరిషత్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మండల స్థాయిలో కీలక పదవిగా భావించే మండల పరిషత్ అధ్యక్షుడి (ఎంపీపీ) ఎన్నిక జిల్లాలో విచిత్రంగా ఉండనుంది. కేవలం ఇద్దరంటే ఇద్దరి మద్దతుతోనే ఎంపీపీ పీఠం అధిష్టించే అవకాశం జిల్లాలోని కొన్ని మండలాల్లో నెలకొంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్త మండలాలు ఏర్పడడంతో ముఖ చిత్రం పూర్తిగా మారింది. మరోవైపు అతి తక్కువ ఎంపీటీసీ స్థానాలు ఉండడంతో ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబా ద్ పరిషత్ పరిధిలో కుమురం భీం జిల్లాలో పా తవి 12 మండలాలు ఉండేవి. కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా మరో మూడు కొత్త మండలాలు ఏర్పడ్డాయి. ఆ సంఖ్య మొత్తం 15కు చేరుకుంది. పది లోపు గ్రామాలతోనే చిన్న మండలాలు ఏర్పడ్డాయి. అలాగే ఎంపీటీసీ స్థానాలు పాత మండలాల్లో తగ్గాయి. జిల్లాలోని సిర్పూర్(యూ) మండలం నుంచి లింగాపూర్, కౌటాల నుంచి చింతలమానెపల్లి, బెజ్జూరు నుంచి పెంచికల్‌పేట మండలాలుగా విడిపోయాయి. కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఎంపీటీసీ స్థానాల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో ఈసారి పరిషత్ ఎన్నికల్లో ఆసక్తికర పోటీ నెలకొంది. ఇద్దరి మద్దతు చాలు.. జిల్లాలో కొత్తగా ఏర్పడిన మూడు మండలాల పరిధిలో ఒక్కో మండలంలో మొత్తం నాలుగు ఎంపీటీసీ స్థానాలే ఉన్నాయి. దీంతో ఎంపీపీ అభ్యర్థి మినహా మరో ఇద్దరు ఎంపీటీసీల మద్దతుతో ఎంపీపీ పీఠం కైవసం చేసుకోవచ్చు. ఈ పరిíస్థితితో కొత్త మండలాలైన పెంచికల్‌పేట, సిర్పూర్(యూ), లింగాపూర్ మండలాల్లో ఎంపీటీసీ స్థానాలకు భారీగా పోటీ నెలకొంది. ప్రస్తుతం తొలి దశ పరిషత్ ఎన్నికలు జరిగే పెంచికల్‌పేట మండలంలో ఎంపీటీసీ స్థానాలకు భారీ పోటీ ఉంది. గెలిచిన అభ్యర్థులు ఎవరికి వారే ఎంపీపీ పీఠం ఎక్కేందుకు ఆసిక్తి కనబర్చుతున్నారు. అలా గే బెజ్జూరు, చింతలమానెపల్లి, దహేగాం, సిర్పూర్(టి) మండలాల్లో ఎనిమిది చొప్పున ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో కనీసం నాలుగురు ఎంపీటీసీల మద్దతుతో ఎంపీపీ అయ్యే అవకాశముంది. తిర్యాణిలోనూ ఏడు ఎంపీటీసీ స్థానా లకు నలుగురి మద్దతు చాలు. ఇక అధిక ఎంపీటీసీ స్థానాలు ఉన్న జైనూర్, కెరమెరి మండలాల్లో ఒక్కో మండలంలో తొమ్మిది చొప్పున ఉండగా ఇక్కడ కనీసం ఐదుగురి మద్దతు అవసరం. జిల్లాలో అత్యధిక ఎంపీటీసీ స్థానాలు ఉన్న కాగజ్‌నగర్ మండలంలో 15 స్థానాలకు కనీసం 8 మంది మద్దతు కూడగట్టాల్సి వస్తోంది. ఆసిఫాబాద్, రె బ్బెన మండలాల్లో పది స్థానాలు ఉండగా కనీసం ఆరుగురి మద్దతు అవసరం. దీంతో ఎంపీపీ ఆశావహులు తమకు నచ్చిన వారిని పోటీలో ఉండేట్లు ముందు నుంచే అన్ని ఏర్పాట్లు చేసకుంటున్నారు. ప్రతి సభ్యుడు కీలకం.. చిన్న మండలాల్లో ఎన్నికల్లో గెలిచిన ప్రతి ఎంపీటీసీ సభ్యుడు మండల అధ్యక్షుడి ఎన్నికలో కీలకం కానున్నారు. ఒకే పార్టీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు ఎంపీపీ స్థానానికి కావాల్సిన మెజార్టీ సా ధిస్తే ఏ సమస్య ఉండదు. కాని వేర్వేరు పార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందింతే ఎంపీపీ ఎన్నికల్లో కీలకం కానున్నారు. దీంతో అన్ని పార్టీల నుంచి గెలిచిన అభ్యర్థులు ఎవరు ఎటు మద్దతు ఇస్తారో ఆ పార్టీ వైపే ఎంపీపీ ఎన్నిక ఆధారపడనుంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో తాయిలాల కు ఆస్కారం ఏర్పడనుంది. దాంతో పాటు గతంలో మాదిరి ఎంపీపీ మాకు వైస్ ఎంపీపీ మీకు అనే ఇచ్చుపుచ్చుకునే ధోరణిలో పదవుల పంపకాలు జరిగే ఆస్కారం ఏర్పడనుంది. -
అభివృద్ధిపై ఆశలు
సాక్షి, బుగ్గారం: ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రంగా ఉన్న బుగ్గారం ప్రాంతం నుంచి రాష్ట్ర రాజకీయాల్లో మంచి గుర్తింపు పొందిన ఎంతోమంది ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. అయినా బుగ్గారం గ్రామం, దాని చుట్టుపక్కల గ్రామాలు చెప్పుకోదగ్గ అభివృద్ధి సాధించలేదు. తరువాత 2009 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ కేంద్రాన్ని ధర్మపురికి మార్చారు. దీంతో ఇక అభివృద్ధి ఉండదని గ్రామస్తులు అనుకున్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం మొదటిసారి కొలువుదీరిన టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. ఈ పునర్విభజనలో భాగంగా ధర్మపురి మండలంలో అంతర్భాగంగా ఉన్న బుగ్గారంను ధర్మపురి మండలంలోని 8 గ్రామాలు, గొల్లపల్లి మండలంలోని మూడు గ్రామాలతో కలిపి మొత్తం 11 గ్రామాలతో నూతన మండలకేంద్రంగా ఏర్పాటు చేశారు. దీంతో బుగ్గారంలో తహసీల్దార్ కార్యాలయం, వ్యవసాయ కార్యాలయం, పోలీస్‌స్టేషన్ తదితర కార్యాలయాలు నెలకొల్పారు. స్థానిక ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే మండల ప్రజాపరిషత్ సంబంధమైన పనులు మాత్రం ధర్మపురిలోని ఎంపీపీ కార్యాలయం నుంచే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల దరిమిలా పాత ప్రాదేశిక స్థానాల్లో మార్పులు జరిగి నియోజకవర్గంలోని 6 మండలాల్లో 75 ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో నూతనంగా ఏర్పడ్డ బుగ్గారం మండలంలో ఈసారి మండల ప్రజాపరిషత్ ఏర్పాటు చేయనున్నారు. దాంతోపాటు మండలం నుంచి నూతనంగా జెడ్పీ స్థానం కూడా ఖరారు చేశారు. 11 గ్రామాలు.. 6 ఎంపీటీసీ స్థానాలు బుగ్గారం మండలంలో మొత్తం 11గ్రామాలకు గానూ 6ఎంపీటీసీ స్థానాలు ఖరారు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 21,716 కాగా.. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ప్రకారం మొత్తం మండల ఓటర్లు 16,493. ఇంతకుముందు ధర్మపురి మండల పరిధిలో ఉన్నప్పుడు బుగ్గారంలోని 8 గ్రామాలకు గానూ 5 ఎంపీటీసీ స్థానాలుండేవి. ప్రస్తుతం గొల్లపల్లి నుంచి కలిసిన మూడు గ్రామాలైన శెకెల్ల, యశ్వంతరావుపేట, గంగాపూర్ గ్రామాలతో మరో ఎంపీటీసీ స్థానాన్ని ఏర్పాటు చేయడంతో మండలంలో మొత్తం ఆరు ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటయ్యాయి. దీంతోపాటు మండలం నుంచి ఈసారి జెడ్పీటీసీ స్థానం కూడా ఏర్పడడంతో స్థానిక సంస్థల పాలన ప్రజలకు మరింత చేరువై సమర్థవంతంగా కొనసాగే అవకాశం ఉంటుందని నాయకులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ధర్మపురి కేంద్రంగా కొనసాగిన పంచాయతీల పాలనా వ్యవహారాలు త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల అనంతరం మండలకేంద్రం నుంచే గ్రామాల పాలనా వ్యవహారాల పర్యవేక్షణ జరుగుతుంది. దీంతో మండలంలో అభివృద్ధి పనుల్లో వేగం పెరిగి గ్రామాల ముఖచిత్రం మారే అవకాశాలున్నాయి. జెడ్పీ నిధులు కూడా నేరుగా మండలానికే రానుండడంతో అభివృద్ధిలో వేగం పెరిగే అవకాశాలుంటాయని నాయకులంటున్నారు. యువత ఆసక్తి త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ బలాబలాలను గురించి లెక్కలు వేసుకుంటూ స్థానిక ప్రజల వద్ద అభిప్రాయాలు సేకరిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓడిపోయిన అభ్యర్థులు, రిజర్వేషన్ అనుకూలించనివారిలో కొంతమందికి ప్రస్తుతం ఖరారు చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు కలిసి వస్తుండడంతో మళ్లీ ఎన్నికల సమరంలో దిగడానికి సిద్ధమౌతున్నారు. పార్టీల గుర్తులపై ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధిక మంది ఔత్సాహికులు తమతమ పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మరికొంతమంది యువకులు, నాయకులు తమకు పార్టీ టికెట్ రాకున్నా స్వతంత్రంగానైనా పోటీ చేయాలనే యోచనలో ఉన్నారు. తమకున్న కుల బలం, ఇతర అంశాలపై లెక్కలు వేసుకుంటున్నారు. కేవలం 6 ఎంపీటీసీ స్థానాలతో ఏర్పడ్డ చిన్న మండలం కావడంతో మరికొంతమంది ఎంపీపీ స్థానంపై కన్నేశారు. ఇదిలా ఉండగా.. మండలంలోని ఎంపీపీ, జెడ్పీ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో పలు పార్టీల పెద్దలు మండలంలోని గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు. ప్రజాదరణతోపాటు అంగబలం, ఆర్థిక బలం కలిగిన నాయకుల కోసం పార్టీలు అన్వేషణ సాగిస్తున్నాయి. -
బట్టబయలైన అన్నదమ్ముల విభేదాలు
ఇంట గెలవరు గానీ... రచ్చ గెలుస్తామంటూ ప్రగల్భాలు. సొంత అన్నతోనే సయోధ్య ఉండదు గానీ... జిల్లాలోనే చక్రం తిప్పాలని యత్నిస్తున్నారు. ఇదీ గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు తీరు. ఇప్పుడు ఆయనకు సొంత అన్నే రెబల్‌గా మారుతున్నారు. అక్కడి టిక్కెట్కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తమ్ముడు చేసేవన్నీ అక్రమాలేనని బాహాటంగా చెబుతున్నారు. ఇదే విషయం పార్టీ అధినేత నుంచి జిల్లా నాయకుల వరకూ అందరికీ పనిగట్టుకుని మరీ వివరిస్తున్నారు. నిష్పాక్షికంగా అక్కడ అభివృద్ధి జరగాలంటే తనకే టిక్కెటివ్వాలంటూ కోరుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడుకి సొంత ఇంట్లోనే కుంపటి తయారైంది. తాను ఎమ్మెల్యే టిక్కెట్టు రేసులో ఉన్నట్టు ఎమ్మెల్యేకు స్వయానా అన్న, మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు ప్రకటించారు.. కొంతకాలంగా అన్నదమ్ముల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది.. భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ పాలకవర్గం నియామకాన్న తమ్ముడు నియమిస్తే అతనికి వ్యతిరేకంగా అన్న కోర్టులో కేసు వేయించి ఇటీవల విజయం సాధించారు. ఆ ఉత్సాహంతోనే బహిరంగంగా తమ్ముడిని ఢీకొట్టడానికి సిద్ధమయ్యారు. టీడీపీలో చోటుచేసుకున్న ఈ పరిణామం జిల్లాలో హాట్ టాపిగ్గా మారింది. ఆది నుంచీ కుమ్ములాటలు 1982 నుంచి రాజకీయాల్లో ఉన్న కొండలరావు రెండుసార్లు ఎంపీపీగా, జిల్లా పార్టీ వైస్ ప్రెసిడెంట్‌గా, జిల్లా పార్టీ జాయింట్ సెక్రెటరీగా పనిచేశారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గజపతినగరం ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించారు. కానీ పార్టీ అతని సోదరుడైన కె.ఎ.నాయుడికి టిక్కెట్టు ఇచ్చింది. దీంతో కొండలరావు నామినేటెడ్ పోస్ట్‌కోసం తీవ్రంగా ప్రయత్నించారు. తమ్ముడు అడ్డుతగలడంతో వారి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. కనీసం భీమసింగి సుగర్‌ఫ్యాక్టరీ చైర్మన్ పదవి అయినా ఇవ్వాలని పార్టీపై ఒత్తిడి తెచ్చారు. దానిక్కూడా నాయుడు అడ్డుకట్ట వేశారు. వేరే పాలకవర్గాన్ని నియమించారు. తనను కాదని వేరొకరికి పదవి ఇవ్వడాన్ని తట్టుకోలేని కొండలరావు తాను తెరవెనుక ఉండి పాలకవర్గం నియామకంపై స్థానికుల చేత కోర్టులో కేసు వేయించారు. ఫలితంగా పాలకవర్గాన్ని నియమిస్తూ విడుదలైన జీఓను న్యాయస్థానం ఇటీవలే రద్దు చేసింది. తెరవెనుక ప్రయత్నాలు కొండపల్లి కొండలరావు తన తండ్రి దివంగత ఎంపీ కొండపల్లి పైడితల్లినాయుడు రెండు పర్యాయాలు ఎంపీగా చేసినప్పుడు, జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉన్నప్పుడు అన్నీ తానై చూసేవారు. తండ్రి మరణానంతరం కొండబాబు రెండు సార్లు ఎంపీపీగా చేశారు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అనంతరం జరిగిన పరిణామాల్లో మరలా సొంత గూటికి చేరారు. ఆర్థిక పరంగానూ బలాన్ని సమకూర్చుకుంటున్నారు. కొండలరావుకు విజయనగరం ట్యాంక్ బండ్ రోడ్డులో హోటల్ కొండపల్లి గ్రాండ్తో పాటు ఇరవైకి పైగా లారీలు ఉన్నాయి. గంట్యాడ మండలంలో రైస్ మిల్లులను నిర్వహిస్తున్నారు. ఇక్కడ మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సులను నడవనివ్వకుండా వారి ప్రైవేటు బస్సులనే నడిపిస్తున్నారు. పలు ప్రైవేటు విద్యా సంస్థల్లో వాటాలు ఉన్నాయి. వీటన్నిటినీ చూపించి తాను అభ్యర్థిగా సరిపోతానంటూ అధిష్టానానికి చెబుతున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి ఎ.ఎ.నాయుడు తన అన్నను పక్కన పెట్టారు. అప్పటి నుంచి కొండలరావు మండలాల్లో తనకుంటూ వర్గాలను తయారు చేసుకొని ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి పనులను సమయం వచ్చినపుడల్లా అధిష్టానానికి చేరవేస్తున్నారు. తన తమ్ముడు అవినీతిపరుడు కాబట్టి నియోజకవర్గంలో అతనికి జనం ఓట్లేసే అవకాశం లేదని చెబుతూ తాను టిక్కెట్టు పొందాలని చూస్తున్నారు. ఇంట గెలవలేని కె.ఎ.నాయుడు ఒక దశలో మంత్రి పదవికోసం ఎలా పాకులాడారన్న చర్చ ఇప్పుడు నియోజకవర్గంలో సాగుతోంది. ఎమ్మెల్యేగా పోటీచేస్తా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేస్తానని టీడీపీ సీనియర్‌నేత గజపతినరగం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు సోదరుడు కొండపల్లి కొండలరావు (కొండబాబు) శనివారం అతని కుమారుడు కొండపల్లి శ్రీనువాస్, వసాది మాజీ ఎంపీటీసీ కె.జగన్నాథం, టీడీపీ సీనియర్ నేత గుల్లిపల్లి ఆదినారాయణలతో కలిసి జామిలో విలేకరుల సమావేశం పెట్టి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థులను టీడీపీ అధిష్టానం మార్చే అవకాశం ఉందని అదే జరిగితే గజపతినగరం నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీచేస్తానన్నారు. తన అభిమతాన్ని ఇప్పటికే పార్టీ అధిష్టానానికి, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు, జిల్లా ఇన్చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. -
తిట్లపురాణం
‘యూస్ లెస్ ఫెల్లో.. జాయిన్ అయితే ఎంపీపీకి చెప్పాలన్న జ్ఞానం ఉండదారా.. దొంగ లం.. కొడుకా ఏం రాజకీయం చేద్దామని వచ్చినావురా గంగాధరకు.. ఎంపీపీ పర్మిషన్ తీసుకోవారా.. పని చేయకున్నా కూర్చుండబెట్టి జీతం ఇచ్చినరా ఇడియట్.. పిచ్చిపిచ్చి నకరాలు చేస్తే తన్ని ఎల్లగొడుతా’ .....ఇదంతా గంగాధర ఎంపీపీ, టీఆర్ఎస్ పార్టీకి చెందిన దూలం బాలాగౌడ్.. అధికారి ఎంపీడీవో బండుపై అందుకున్న తిట్లపురాణం. తనకు చెప్పకుండా ఎలా వస్తావని ఇలా కడిగి పారేశారు. చెప్పరాని మాటలు, వినటానికి వీలు లేని బూతులు తిట్టడంతో షాక్‌కు గురైన ఎంపీడీవో బండు ‘సభ్యత సంస్కారంతో మాట్లాడు’ అంటూ మౌనం వహించినా వినలేదు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి.. ఓ మండల స్థాయి అధికారిని ‘బండు’ కడిగాడు. చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలో సోమవారం సాయంత్రం ఓ ఆడియో వైరల్ అయ్యింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీపీ, ఎంపీడీవోపై కురిపించిన తిట్ల పురాణానికి సంబంధించిన ఈ ఆడియో సారాంశం కాస్తా వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. అధికారిని రాజకీయ నాయకులు ఇలా కూడా తిడతారా అని జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. కాగా.. అధికార పార్టీకి చెందిన మరో ప్రజాప్రతినిధి నోరు పారేసుకోవడం అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాక్షిప్రతినిధి, కరీంనగర్/గంగాధర: గతంలోకి వెళ్తే గంగాధర మండల పరిషత్ కార్యాలయంలో కొద్ది రోజులు ఈవోపీఆర్డీగా పనిచేసిన బండు ఇక్కడే ఇన్చార్జి ఎంపీడీవోగా సైతం విధులు నిర్వహించారు. ఇతనికి ఇదే మండలానికి చెందిన ఎంపీపీ దూలం బాలాగౌడ్‌కు విభేదాలు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం ప్రమోషన్‌పై ఎంపీడీవోగా వేములవాడ మండలానికి వెళ్లారు. గంగాధర మండల పరిషత్ అభివృద్ధి అధికారి పోస్టు ఖాళీగా ఉండటంతోపాటు, విధుల్లో చేరడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో వేములవాడ ఎంపీడీవో బండుకే అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన మూడు రోజుల క్రితం విధుల్లో చేరారు. కాగా.. తనకు సమాచారం ఇవ్వకుండా విధుల్లో చేరుతావా అంటూ ఎంపీపీ దూలం బాలాగౌడ్ పత్రికల్లో రాయలేని విధంగా దూషించడం చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ ఇబ్బందులకు గురిచేశాడు గతంలో ఇక్కడ ఈవోపీఆర్డీవోగా, ఇన్చార్జి ఎంపీడీవోగా పని చేసినప్పుడు సైతం ఎంపీపీ దూలం బాలాగౌడ్ ఇబ్బందులకు గురిచేసాడు. తనకు లాభం అయ్యే పని చేయాలని ఒత్తిడి తెచ్చాడు. అటువంటి సంస్కృతి నాకు లేదు. దీంతో సాలరీలు ఆపాడు. ఎల్పీసీ ఆపాడు. ప్రమోషన్‌పై వేములవాడకు ఎంపీడీవోగా వెళ్లాను. నాలుగు రోజుల క్రితం ఇన్చార్జి ఎంపీడీవోగా గంగాధరకు వచ్చా. మంగళవారం మూడు గంటల ప్రాంతంలో ఎంపీపీ ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు. అసభ్యకరమైన భాషలో చెప్పరాని విధంగా, రాయలేని విధంగా తిట్టాడు. ఈ విషయాన్ని సీఈవోకు వివరించా. మండలంలో ఏ ఎంపీడీవో పనిచేయడానికి ముందుకు రావడంలేదు. తిట్ల విషయాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. – బండు, ఎంపీడీవో, గంగాధర సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించా నేను ఎంపీడీవో విషయంలో మాట్లాడిన దానిలో తప్పేం లేదు. సమాచారం ఇవ్వాలనే విజ్ఞత లేదా అని ప్రశ్నించాను. గతంలో పనిచేసినప్పుడు ఇక్కడ ఇబ్బందులకు గురిచేశారు. మళ్లీ ఇన్చార్జిగా వచ్చారు. విధి నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులకు గురిచేయలేదు. నాలుగు రోజుల క్రితం విధుల్లో చేరిన ఎంపీడీవో కనీసం ఎంపీపీకి సమాచారం ఇవ్వాలనే విషయం తెలియదా. జాయినింగ్ లెటర్‌పై ఎంపీపీతో అడ్మిట్ అని రాయించుకున్న తరువాతే బాధ్యతలు తీసుకోవాలనే నిబంధన ఉంది. విధుల్లో చేరి నాలుగు రోజులైంది. ఫోన్ ద్వారానైనా సమాచారం ఇవ్వలేదు. – దూలం బాలాగౌడ్, ఎంపీపీ, గంగాధర -
గెలుపు కోసం సరికొత్త నాటకం
నిడమర్రు, న్యూస్‌లైన్ : ఎంపీటీసీ ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ నాయకులు కొత్త నాటకానికి తెరదీశారు. ఎంపీపీ అభ్యర్థి మన గ్రామానికే, మన సామాజిక వర్గానికే అంటూ ఊదరగొడుతూ అన్ని గ్రామాల్లో, ఆయా వర్గాలలో ఆ పార్టీ నాయకులు ప్రచారం చేస్తుండడంతో టీడీపీ శ్రేణుల్లో, అభిమానులను గ ందరగోళంలోకి నెట్టివేస్తోంది. అంతేకాక ఎంపీపీ పదవి ఎవరికి దక్కుతుందోనని ఇప్పటికే ఆ పదవిని ఆశిస్తున్న పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఎంపీపీ అభ్యర్థిని ప్రకటిస్తే పార్టీ అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమై ఎన్నికల్లో పార్టీకి నష్టం కలిగే ప్రమాదం ఉందనే అనుమానంతో అభ్యర్థిని ప్రకటించడానికి జంకుతున్నారని మండలంలో ప్రచారం జరుగుతోంది. నిడమర్రు ఎంపీపీ స్థానం ఓసీ జనరల్‌కు కేటాయించారు. ఈ మండలం నుంచి ఎంపీపీ అభ్యర్థిగా వైసీపీ మాత్రం నామినేషన్ రోజే పత్తేపురం ఎంపీటీసీ అభ్యర్థి దివంగత మాజీ మంత్రి, గాంధేయవాది చింతలపాటి మూర్తిరాజు వారసుడు చింతలపాటి పృధ్వీరాజును తమ ఎంపీపీ అభ్యర్ధిగా ప్రకటించి ప్రచారంలో ముందుంది. దీంతో పత్తేపురం గ్రామానికే ఎంపీపీ పదవి కట్టబెడతామంటూ గత రెండు రోజులుగా టీడీపీ కొత్త ప్రచారం మొదలెట్టినట్లు తెలిసింది. అదే ఎంపీటీసీ స్థానంకోసం పోటీపడుతున్న టీడీపీ అభ్యర్ధి పొత్తూరి వెంకటపతిరాజుకే ఎంపీపీ పదవి ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటుండగా, మరో మేజర్ గ్రామం అయిన అడవికొలను-1లో టీడీపీ తరుపున నామినేషన్ వేసిన నిమ్మల మాణిక్యాలరావుకే ఎంపీపీ పదవి ఇస్తున్నట్లు ఆగ్రామంలోని టీడీపీ కార్యకర్తలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నట్లు చెబుతున్నారు. తీరా విషయం తెలుసుకున్న పత్తేపురం, అడవికొలను గ్రామాల ఓటర్లు, టీడీపీ కార్యర్తలు గందరగోళానికి గురవుతున్నారు. మండలంలోని 14 టీసీలకు ఇప్పటికే 3 టీసీలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన 11 టీసీలకు టీడీపీ, వైసీపీల మధ్య ద్విముఖ పోటీ నెలకొంది.