Nandagopal
-
నందగోపాల్ భౌతికకాయానికి చిరంజీవి నివాళులు
-
మెయిన్ డ్రాకు నందగోపాల్ జోడీ
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగు క్రీడాకారులు నందగోపాల్, కృష్ణప్రసాద్ తమ భాగస్వాములతో కలిసి పురుషుల డబుల్స్‌లో మెయిన్ డ్రా ఈవెంట్‌కు అర్హత సాధించారు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో కె.నందగోపాల్–ఫ్రాన్సిల్ ఆల్విన్ (భారత్) జంట 21–13, 21–13తో దీపేశ్ ధమి–రత్నజిత్ తమంగ్ (నేపాల్) ద్వయంపై గెలుపొందగా, కృష్ణప్రసాద్–ధ్రువ్ కపిల జోడీ 21–11, 21–15తో భారత్‌కే చెందిన సిద్ధార్థ్–ప్రేమ్ సింగ్ చౌహాన్ జంటపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో సిరిల్ వర్మ క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగాడు. కార్తీకేయ్ గుల్షన్ కుమార్ 21–17, 15–21, 21–7తో సిరిల్‌ను ఓడించాడు. బుధవారం నుంచి మెయిన్ డ్రా మ్యాచ్‌లు జరుగుతాయి. -
కండలతో ఖండాంతర ఖ్యాతి
తెలుగు తేజం మాతృదేశానికి పేరుప్రఖ్యాతులు తేవాలంటే... పెద్దపెద్ద పదవులు, పెద్ద చదువులే కాదు... కండలతోనూ సాధ్యమే... అది కూడా ఉత్ప్రేరకాలు వాడకుండా... ఆరోగ్యకరమైన విధానంతో అంతర్జాతీయ ఖ్యాతి సాధించవచ్చు... అని నిరూపించాడు ఆంధ్రప్రదేశ్ నెల్లూరుజిల్లాకు చెందిన పెనుబల్లి రాజ్‌సేన్. రాజ్సేన్కు చిన్నతనం నుంచి క్రీడలంటే అమిత ఆసక్తి. న్యూజిలాండ్ దేశానికి ఎంబిఎ చదవడానికి వెళ్లిన రాజ్‌సేన్... అక్కడి అధ్యాపకుల ప్రోత్సాహంతో దేహదారుఢ్య పోటీల్లో పాల్గొని అంతర్జాతీయ పోటీల్లో నెంబర్ వన్‌గా నిలిచారు. న్యూజిలాండ్‌లో అధ్యాపకులే ‘న్యూజిలాండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్సు’ లో 2005-06లో శిక్షణ కోసం చేర్పించారు. ‘‘నా శక్తి సామర్థ్యాలు చూసి, అక్కడి మాస్టర్లు ‘బాడీ బిల్డర్స్ పోటీలో పాల్గొంటావా’ అని అడిగారు. నాకు బాడీ బిల్డింగ్ గురించి అవగాహన ఉంది. అయితే బాడీ బిల్డర్‌గా గెలవడం కోసం చాలామంది ఉత్ప్రేరకాలు వాడతారు. దాంతో దీర్ఘకాలంలో చాలా ప్రమాదం వస్తుంది. నాకు స్టెరాయిడ్స్ వాడటం ఇష్టం లేదనీ, ఎటువంటి ఉత్ప్రేరకాలు వాడకుండా అయితేనే పాల్గొంటానని చెప్పాను. అందుకు వారు అంగీకరించారు. నేచురల్ బాడీ బిల్డింగ్ రంగానికి నన్ను పరిచయం చేశారు. 2006 నుండి పోటీల్లో పాల్గొనడం ప్రారంభించాను’’ అంటూ తన గురించి చెబుతారు రాజ్‌సేన్. 2008లో ప్రపంచ విజేత తొలి ప్రయత్నంలో న్యూజిలాండ్ స్థాయిలో తృతీయస్థానం అందుకున్నారు. 2006-2010 మధ్య విదేశాల్లో జరిగిన పోటీలో పాల్గొని 11 అవార్డులు గెలుచుకున్నారు. 2008లో సౌత్ పసిఫిక్ నేషనల్ బాడీ బిల్డింగ్‌లో ద్వితీయ బహుమతి దక్కింది. ‘‘అదే ఏడాది యూఎస్ఏ నేషనల్ ఒలంపియాడ్ బాడీ బిల్డర్స్ కాంపిటీషన్లో పాల్గొనాల్సిందిగా యుఎస్ నుండి ఆహ్వానం అందింది. న్యూజిలాండ్ ప్రభుత్వ ఆర్థిక సాయంతో పాల్గొని మూడో బహుమతి గెలుచుకున్నాను. 2008లోనే లాస్ ఏంజిలిస్ (యూఎస్)లో జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్ పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ అందుకున్నాను. ఈ పోటీల్లో పాల్గొన్న ఏకైక భారతీయుడిని. ప్రపంచంలో ప్రథమ బహుమతి పొందడం ఆనందమే, కానీ భారత్ నుండి పాల్గొంటే ఇంకా సంతోషంగా ఉండేది’’ అంటారు రాజ్‌సేన్. - కొట్రా నందగోపాల్, చెన్నై -
అక్కడ... చుట్టలు.. మద్యమే నైవేద్యం
భగవంతునికి సమర్పించే కానుక ఎంత గొప్పది అన్నది కాదు ముఖ్యం, ఎంత భక్తితో సమర్పిస్తున్నా మన్నదే ముఖ్యం. అలా భక్తితో అర్పించే వాటి వరుసలో మద్యం, చుట్టలను కూడా చేర్చారు చెన్నైలోని ‘బాడీగార్డ్ మునీశ్వరు’ని భక్తులు. ఈ మునీశ్వరుని విగ్రహానికి మద్యంతో అభిషేకం చేసి, చుట్టలు నైవేద్యం పెట్టడం ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోపాటూ వాహన సౌకర్యాలతో తమ కుటుంబాలు వర్ధిల్లగలవని విశ్వాసం. చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ నుండి అన్నాశాలైకు వెళ్లే మార్గంలో బ్రిడ్జి దిగగానే కిలోమీటరు దూరంలో ఉంది ఈ ‘బాడీగార్డ్ మునీశ్వరాలయం’. చెన్నై సిటీ బస్సు సర్వీసు ‘పల్లవన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్’ బస్సు బాడీల నిర్మాణం డిపో ఇక్కడే ఉంది. ఈ డిపో పక్కనే ఆలయాన్ని నిర్మించడంతో ‘బాడీగార్డ్ మునీశ్వర్’ అనే పేరు వచ్చిందంటారు స్థానికులు. ఇక్కడ కొలువై ఉన్న ఈ బాడీగార్డ్ మునీశ్వర్ యాభై ఏళ్ళుగా భక్తుల పూజలందుకుంటున్నాడు ప్రమాదం తప్పాలన్నా... పిల్లలు పుట్టాలన్నా... తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించుకుంటారు, మరో దేవుని ప్రసన్నం చేసుకునేందుకు కొబ్బరికాయలు కొడతారు. మునీశ్వర్ వద్ద మాత్రం ‘మా కోర్కెలు నెరవేర్చు స్వామీ! నీకు ఫుల్‌బాటిల్, కట్ట చుట్టలు సమర్పించుకుంటాను’ అని మొక్కుతారు. రోడ్డు మీద ప్ల్లాట్ఫామ్పై ఉన్న మునీశ్వరాలయానికి విశేషదినాల్లో బడాబాబుల నుండి సాధారణ ప్రజానీకం వరకు క్యూ కడతారు. సైకిల్ అయినా బెంజ్ కారైనా సరే మద్యం, చుట్టల సమర్పణతో ఇక్కడ పూజ చేయించుకుంటే మంచి జరుగుతుందని అపారమైన నమ్మకం. 1919లో ఆర్కాడు జిల్లా నుండి కొందరు కార్మికులు మునీశ్వరుని విగ్రహాన్ని చెన్నైకి తీసుకువచ్చి ప్రస్తుతం గుడి సమీపంలో ప్రతిష్ఠించారు. అయితే బ్రిటిష్ సైనికాధికారి గుడి నిర్మాణంపై నిషేధాజ్ఞలు విధించారు. అదే రోజు ఆ అధికారి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ అధికారి వెంటనే నిషేధాజ్ఞలు ఉపసంహరించుకోగా భక్తులు గుడి నిర్మించుకున్నారు. దాంతో మునీశ్వర్ గుడిలో వాహన పూజలు చేయించుకుంటే ప్రమాదాలకు గురికాబోమనే విశ్వాసం వ్యాప్తి చెందింది. అయితే పూజకు మద్యం, చుట్టల కట్ట సమర్పించే ఆచారం ఎలా మొదలైందో తెలియదు. ఈ విషయాన్ని గుడినిర్వాహకులు, పూజారి కూడా చెప్పలేకపోతున్నారు. భక్తులు మద్యం, చుట్టలను మునీశ్వరునికి నైవేద్యం పెట్టించి గుడి ప్రాంగణంలోని హోమగుండంలో వేస్తారు. - కొట్రా నందగోపాల్ -
సినిమాగా సినిమా పుస్తకావిష్కరణ
సీనియర్ జర్నలిస్ట్ నాదెండ్ల నందగోపాల్ రచించిన ‘సినిమాగా సినిమా’ పుస్తకావిష్కరణ యువకళావాహిని ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. డా. సి.నారాయణరెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించి విచ్చేసిన అతిథులకు అందించారు. ‘సినిమాగా సినిమా’ అనే పేరే విచిత్రంగా ఉందని, నందగోపాల్ ప్రయత్నాన్ని అభినందిస్తున్నానని సినారె అన్నారు. నందగోపాల్‌తో చెన్నయ్నాటి పరిచయాన్ని డి.రామానాయుడు గుర్తు చేసుకున్నారు. తన సినీజీవితంలో నందగోపాల్ మరిచిపోలేని వ్యక్తి అని ఈ సందర్భంగా ఆయనన్నారు. ‘‘ఈ బుక్ రాసింది నేనే అయినా... రాయడానికి కారకులు మాత్రం పరుచూరి హనుమంతరావుగారు. ఈ పుస్తకం పూర్తి చేయడానికి అయిదేళ్లు పట్టింది. అది కూడా ఆయన ప్రోద్భలంతో. హనుమంతరావు నాతో ఓ మాట అన్నారు. ‘నీకు తెలిసింది మట్టిలో కలిసిపోనీకు. నా చేతిలో పెట్టు’ అని. అందుకే... ఈ పుస్తకం రాశాను.. ఈ పుస్తకం ఆయన వెలిగించిన దీపం. అందుకే... ఆయనకే అంకితం ఇస్తున్నా’’ అని నందగోపాల్ చెప్పారు. పరుచూరి హనుమంతరావు, సారిపల్లి కొండలరావు, రమేష్‌ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ్, నన్నపనేని రాజకుమారి, కేఎస్ రామారావు, కేఎల్ నారాయణ, ఏఎస్ జయదేవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఎగ్జిబిషన్ ఏర్పాటుకు చర్యలు
వేలూరు, న్యూస్‌లైన్: వేలూరు కోటై మైదానంలో ప్రభుత్వ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నందగోపాల్ అధికారులను ఆదేశించారు. ఆయన సోమవారం వేలూరు కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించా రు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఎగ్జిబిషన్లో కార్పొరేషన్, అటవీ, సమాచార, పర్యాటక శాఖలతో పాటు ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అదే విధంగా ఎగ్జిబిషన్‌కు వచ్చే వారికి బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. ఈ ఎగ్జిబిషన్‌ను ఇది వరకే తిరువణ్ణామలై జిల్లాలో నిర్వహించి విజయవంతం చేశారని గుర్తుచేశారు. వేలూరు జిల్లాలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరం ఎగ్జిబిషన్ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బలరామన్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు అధికారి శ్రీనివాసన్, జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
బస్టాప్ ఏర్పాటు చేయండి
వేలూరు, న్యూస్‌లైన్:వేలూరు కొత్త బస్టాండ్ సమీపంలోని ముత్తు మండపం వద్ద బస్టాప్ ఏర్పాటు చేయాలని ఇండియన్ రెడ్‌క్రాస్ సభ్యులు కలెక్టర్ నందగోపాల్‌కు సోమవారం వినతిపత్రం సమర్పించారు. వేలూరు కలెక్టరేట్లో సోమవారం గ్రీవెన్స్‌డే నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు సమస్యలను అధికారులకు విన్నవించారు. సమస్యల పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం పుదు వాయువు పథకం కింద జిల్లాలోని నాలుగు యూనియన్లలోని మహిళలకు రూ.29.5 లక్షలు అందజేశారు. ఆంబూరు ప్రాంతంలో విద్యుత్ షాక్‌తో శివ ఇటీవల మృతి చెందారు. బాధిత కుటుం బానికి రూ.3 లక్షలు, పది మంది వికలాంగులకు రూ.5.85 లక్షలు విలువ చేసే మూడు చక్రాల వాహనాలు, ఇద్దరు వికలాంగులకు కృత్రిమ కాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బలరామన్, వికలాం గుల సంక్షేమశాఖ జిల్లా అధికారి చార్లెస్ ప్రభాకరన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.