Nandamuri Suhasini
-
Nandamuri Suhasini Son Marriage Photos: నందమూరి సుహాసిని కుమారుడి వివాహం (ఫొటోలు)
-
అందుకే ఓడిపోయే సీటు సుహాసినికి ఇచ్చారు
కేపీహెచ్‌బీకాలనీ: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు నందమూరి కుటుంబంపై ప్రేమ లేదని, వారి కుటుంబాన్ని పూర్తిగా రాజకీయాలకు దూరం చేసేందుకు కుట్ర పన్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అందుకే ఓడిపోయే కూకట్పల్లి సీటును నందమూరి సుహాసినికి కేటాయించారని అన్నారు. గురువారం కూకట్పల్లి నియోజకవర్గంలో చేపట్టిన రోడ్‌షోలో భాగంగా కేపీహెచ్‌బీకాలనీ బస్టాప్ సెంటర్లో ఆయన మాట్లాడారు. లోకేష్‌బాబును నేరుగా మంత్రిని చేసిన చంద్రబాబు... ఏమాత్రం రాజకీయాలు తెలియని సుహాసినిని మాత్రం ఎన్నికల్లోకి లాగి బలిపశువును చేశారన్నారు. సుహాసిని సోదరులను ఈ ఎన్నికల ద్వారా పూర్తిగా రాజకీయాలకు దూరం చేసే కుట్రలు పన్నారని ఆరోపించారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు తావులేకుండా కేవలం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేశామని... ఇక ఏవైపు ఉంటారో ఓటర్లే తేల్చుకోవాలన్నారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో 150 సీట్లలో ఒక్క కేపీహెచ్‌బీ మాత్రమే టీడీపీకి దక్కిందని, కేపీహెచ్‌బీ కాలనీ ప్రజలు మరోసారి మోసపోవద్దని... టీఆర్ఎస్కు మద్దతుగా నిలిచి మాధవరం కృష్ణారావును గెలిపించాలని కోరారు. కృష్ణారావు పలుమార్లు ముఖ్యమంత్రిని కలిసి 26 కులాలకు న్యాయం చేయాలని కోరారని.. బీసీ కమిషన్ ద్వారా నివేదికను తెప్పించుకొని తప్పకుండా న్యాయం చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగదన్నారు. కూకట్పల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామని, కృష్ణారావును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బండి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు తప్పు చేశారు... సీఎం కేసీఆర్ తనను ఎందుకు తిడుతున్నారని ప్రశ్నిస్తున్న చంద్రబాబునాయుడు ముమ్మాటికీ తప్పు చేశారని కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించి డబ్బు సంచులతో కెమెరాలకు చిక్కింది నిజం కాదా? మన వాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ ఫోన్లో మాట్లాడింది నిజం కాదా? అంటూ కేటీఆర్ నిలదీశారు. కలికాలంలో వింతలు జరుగుతాయని వీరబ్రహ్మేంద్రస్వామి తెలిపారని... అందులో భాగంగానే పాము, ముంగీసలైన కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటయ్యాయని విమర్శించారు. చంద్రబాబు తీరుతో స్వర్గంలోని ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. -
బాబు ఉచ్చులో మరో బలిపశువు!
నిన్నటివరకు ఆమె సాధారణ గృహిణి మాత్రమే. కాకపోతే దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె. పేరు చుండ్రు సుహాసిని. బహుశా నందమూరి కుటుంబానికి తప్ప ఆమె గురించి ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ చంద్రబాబు కౌటిల్య వ్యూహంలో భాగంగా ఉన్నట్లుండి ఆమె టీడీపీ నామినీగా, నందమూరి వంశస్థురాలిగా కూకట్పల్లి అసెంబ్లీ స్థానంలో పోటీ చేయడానికి సిద్ధమైపోయారు. తన మురికి రాజకీయాల కోసం నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు ఎలా వాడుకుని తర్వాత కరివేపాకులా విసిరిపారేస్తారో ప్రపంచానికే తెలుసు. నందమూరి కుటుంబ సెంటిమెంటును అడ్డం పెట్టుకుని చంద్రబాబు తన భార్య భువనేశ్వరి చెప్పిందనే సాకుతో సుహాసినిని రాజకీయ ముగ్గులోకి దింపినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావుకు వ్యతిరేకంగా భారతదేశంలోనే అత్యంత సంచలనాత్మకంగా ఆయన సొంత అల్లుడు చంద్రబాబు జరిపిన రాజకీయ కుట్రలో నందమూరి హరికృష్ణ, దగ్గుపాటి తదితర కుటుంబ సభ్యులు ఎలా పావుల్లాగా ఉపయోగపడ్డారో అందరికీ తెలుసు. తన కుటుంబాన్ని భవిష్యత్తులో కూడా అధికార రాజకీయాల్లో సుస్థిరపరిచేందుకు చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారనడానికి చాలా ఉదాహరణలున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబు అధికారంతోనే బతుకీడుస్తారు. అధికారంతోనే నిద్రపోతారు. అధికారంతోనే చస్తారు కూడా. ఆ అధికారంకోసం ఎంతకైనా దిగజారతారు. దీనికి తాజా ఉదాహరణ ఏమిటంటే దశాబ్దాల బద్ధశత్రువు కాంగ్రెస్ పార్టీ ముందు సాగిలపడి టీడీపీ ఆత్మగౌరవ నినాదాన్ని, దాని మూలసూత్రాలను తాకట్టుపెట్టేయడమే. బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాక చంద్రబాబు ప్రతిష్ట పాతాళానికి అడుగంటిపోయింది. పోలవరం, అమరావతి ప్రాజెక్టుల్లో భారీ అవినీతి నుంచి జనం దృష్టిని మరల్చడానికి యూపీఏ–ఎన్డీఏ రాజకీయాలను చర్చలోకి తీసుకొచ్చాడు బాబు. ప్రత్యేక హోదాపై వైఎస్ జగన్ స్పష్టవైఖరి, పాదయాత్ర భారీ విజయంతో పాటు తన నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్క భారీ ప్రాజెక్టు కూడా పూర్తి కాకపోవడంతో చంద్రబాబు వెన్నులో వణుకుపుట్టి, అంతవరకు బండబూతులతో సత్కరించిన అదే కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి పరుగెత్తాడు. కాంగ్రెస్‌తో హనీమూన్ ఎపిసోడ్ చప్పబడిపోవడంతో నందమూరి కుటుంబ సెంటిమెంట్‌ని ట్రంప్ కార్డుగా బయటకు తెచ్చాడు. పైగా తెలంగాణలో ఎంత చిన్న పాత్రలో అయినా సరే తన ఉనికిని ప్రదర్శించుకోవాలనుకున్న యావతోనే ఇప్పుడు సుహాసినిని ఎన్నికల ముగ్గులోకి దింపాడు. గొర్రె కసాయివాడినే నమ్ముతుందన్న చందంగా నారావారి ఫ్యామిలీ పన్నిన ఉచ్చులో సుహాసిని ఇరుక్కుపోయారు. ఆమె తెలుసుకోవలసిన చరిత్ర ఒకటుంది. ఆమె తాత ఎన్టీఆర్‌నే సీఎం పదవినుంచి దింపివేసిన ఘనత బాబుది. తర్వాత దగ్గుపాటి కుటుంబాన్ని తోసిపారేశాడు. టీడీపీలో తన స్థానం పదిలమయ్యేంతవరకు, ఆమె తండ్రి హరికృష్ణను వాడేసుకున్నాడు. తర్వాత హరికృష్ణను బాబు ఎంత ఘోరావమానాలకు గురిచేశాడో లోకానికే తెలుసు. మరణించేవరకు ఆ అవ మాన భారంతోనే హరికృష్ణ గడిపారు. ఇక జూని యర్ ఎన్టీఆర్‌ని కూడా స్టెఫ్నీ టైర్లా ఎన్నిరకాలుగా వాడుకుని బాబు వదిలేశాడో తెలిసిన విషయమే. సుహాసిని తల్లీ... దయచేసి బాబు ఉచ్చులో మరోసారి చిక్కుకోవద్దు. నందమూరి కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచే మరో కుట్రకు మీరు పనిముట్టుగా మారవద్దు. ఎన్టీఆర్ అభిమానులకు, కుటుంబ శ్రేయోభిలాషులకు, మీ కన్నతండ్రి ఆకాంక్షలకు వ్యతి రేకంగా మీరు ఇప్పటికీ బాబుతో కలిసి నడవాలనుకుంటే మీ తాతయ్య ఎన్టీఆర్, మీ కన్నతండ్రి హరి కృష్ణ ఆత్మలు శాంతించవని గ్రహించండి. తెలంగాణలో సెటిలర్ల సెంటిమెంట్ గేమ్ ఆడేం దుకు చంద్రబాబు ఎందుకు హరికృష్ణ కుటుంబాన్ని ఎంచుకున్నట్లు? తన భార్యను, కుమారుడిని లేదా కోడలిని బాబు ఎందుకు ఎంచుకోలేదు? ఎందుకంటే తెలంగాణలో టీడీపీ ఎన్నటికీ అధికారంలోకి రాదని బాబుకు బాగా తెలుసు. అందుకే తెలంగాణలో తన కుమారుడి, తన కుటుంబ సభ్యుల భవిష్యత్తును బాబు పణంగా పెట్టే చాన్సే లేదు. నందమూరి కుటుంబంపై నిజంగా బాబుకు ప్రేమ ఉంటే 2014 లోనే హరికృష్ణను బరిలో నిలిపి మంత్రిపదవిని ఇచ్చేవారు. కానీ ఎన్టీఆర్ కుటుంబీకులు ఇప్పటికీ ఈ మేకవన్నె పులిని ఎలా నమ్ముతున్నారనే ఆశ్చర్యం. సుహాసిని ఇంటిపేరును చర్చలోకి దింపటం భావ్యం కాదు కానీ ఆమె మెట్టింటి పేరును మరుగుపర్చి పుట్టింటి పేరును మళ్లీ వెలుగులోకి తీసుకువచ్చి తెలంగాణలో ఉనికికోసం బాబు చేస్తున్న కుట్రలకు తాజాగా ఆమె బలికాబోతున్నారన్నది వాస్తవం. – బీజీఆర్ -
సుహాసిని భర్త స్థానంలో తండ్రి పేరు
సాక్షి, సిటీబ్యూరో: మహాకూటమి తరఫున కూకట్పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందమూరి వెంకట సుహాసిని ఓటరు కార్డులో ఆమె భర్త స్థానంలో తండ్రి హరికృష్ణ పేరు నమోదైంది. ఆమె ఇటీవలే నాంపల్లి నియోజకవర్గం నుంచి ఓటరు జాబితాలో పేరు నమోదు చేయించుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే తలంపుతోనే ‘నందమూరి’ పేరు ప్రచారం కోసం కాబోలు... ఆమె చుండ్రు ఇంటి కోడలైనప్పటికీ, నందమూరి వెంకట సుహాసినిగా పేరు నమోదు చేయించుకున్నారు. ఆమె భర్త చుండ్రు వెంకట శ్రీకాంత్. సాధారణంగా పెళ్లయ్యాక ఓటరుగా నమోదు చేయించుకునేటప్పుడు తండ్రి/భర్త స్థానం కాలమ్‌లో భర్త పేరు నమోదు చేయించుకుంటారు. అయితే సుహాసిని మాత్రం తండ్రి పేరు నమోదు చేయించుకున్నారు. కానీ పొరపాటో మరి తొందరపాటో తెలియదు గానీ.. తండ్రి పేరు కాస్తా భర్తగా నమోదైంది. ఆమె అఫిడవిట్లో హరికృష్ణను తండ్రిగానే పేర్కొన్నారు. అయితే అఫిడవిట్‌తో పాటు ఓటరుగా నమోదైనట్లు తెలియజేసేందుకు సమర్పించిన ఓటరు జాబితా సర్టిఫైడ్ కాపీలోనూ తండ్రి పేరు అని ఉన్న చోట భర్త పేరుగా హరికృష్ణ పేరుతోనే జారీ చేశారు. ‘ఫాదర్’ అని ఉండగా, కొట్టివేసి వైఫ్ ఆఫ్ అని దిద్ది ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ జారీ చేశారు. ఓటరు జాబితాలో ఉన్న మేరకే అలా చేశారని తెలుస్తోంది. నాంపల్లి నియోజకవర్గంలోని ఎన్నికల జాబితా పార్ట్‌నెంబర్ 48, సీరియల్ నెంబర్ 710 ఓటరుగా ఆమె పేరు నమోదైంది. ఇదే విషయాన్ని రిటర్నింగ్ అధికారి మమత దృష్టికి తీసుకెళ్లగా... ఇలాంటి స్వల్ప పొరపాట్లు జరుగుతుంటాయని, అలాంటి వాటితో నామినేషన్‌ను తిరస్కరించలేమని స్పష్టం చేశారు. -
బాబు పొలిటికల్ గేమ్‌లో పావులైన ఎన్టీఅర్ ఫ్యామిలీ
-
అభ్యర్థిలకు ఎన్టీఅర్ ట్రస్ట్ భవన్లో బీ ఫామ్స్
-
బాలకృష్ణ సంభ్రమాశ్చర్యం.. వైరల్!
సాక్షి, హైదరాబాద్ : సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సోషల్‌మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. మరోసారి తన తెలుగు ప్రావీణ్యంతో వార్తల్లో నిలిచారు. ఎవరైనా చనిపోతే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారు.. కానీ బాలయ్య మాత్రం అన్న మరణంతో సంభ్రమాశ్చర్యానికి లోనయ్యాడట.. ఇది ఆయన నోట నుంచి వచ్చిన మాటే. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో అనూహ్యంగా ఫ్యామిలీ సెంటిమెంట్‌ను తెరపైకి తీసుకొచ్చిన టీడీపీ బాస్ చంద్రబాబు.. కూకట్పల్లి స్థానాన్ని దివంగత నేత హరికృష్ణ కూతురు సహాసినికి కేటాయించారు. ఇంకేముంది బావ చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన బాలయ్య.. తన అన్న కూతురు గెలుపునకు నడుం బిగించారు. ఇందులో భాగంగా శనివారం ఆమె నామినేషన్ వేసేముందు తాత, తండ్రి సమాధుల వద్ద నివాళులర్పించి అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. ఈ సందర్భంగా బాలయ్య నోట జాలువారిన మాట.. ‘ఆయన(హరికృష్ణ) అకాల మరణం అందరిని కూడా సంబర ఆశ్చర్యాల్లో ముంచెత్తింది’. ఇంకేముంది ఈ మాటలతో బాలయ్య అడ్డంగా బుక్కయ్యారు. నెటిజన్లు సెటైర్లతో ఓ ఆట ఆడుకుంటున్నారు. ‘ఎయ్ మళ్లి ఏసేశాడు.. మరణిస్తే సంభ్రమాశ్చర్యం ఏంటి నాయనా’ అని ఒకరు.. కనీసం ఆ పదం కూడా సరిగ్గా పలకకుండా సంబర ఆశ్చర్యం అని పలకడం ఏంటని ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు. తెలుగు భాషను ఖూనీ చేయడంతో అల్లుడు లోకేశ్‌ను మించిపోయిండుపో అని ఇంకొకరు సెటైర్ వేస్తున్నారు. ఇక ఈ సందర్భంగానే మహాకూటమి తరపున బరిలోకి దిగుతున్న సుహాసినికి మీడియా ముందే కూటమి గురించి అడిగితే ఇలా చెప్పాలని సూచించడంపై కూడా జోకులు పేలుతున్నాయి. గతంలో కూడా బాలకృష్ణ ఇదే తరహాలో మాట్లాడి విమర్శలపాలైన విషయం తెలిసిందే. Jai Balayya 😂 😂 pic.twitter.com/bXDwWFN348 — #Advaitam (@advaitology) November 18, 2018 Telugu lo champestadu balayya ante edo anukuna.. Marii ee range lo anukola — 🌠 (@Suresh_ntr1) November 18, 2018 -
బాలకృష్ణ సంభ్రమాశ్చర్యం.. వైరల్!
-
ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ..
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ఆపద్ధర్మ సీఎం హోదాలో తొలిసారి తెలంగాణలో 1985లో నల్లగొండ నుంచి అసెంబ్లీకి పోటీచేసి గెలిచారు. అప్పుడు హిందూపురం, గుడివాడ నుంచి కూడా ఆయన ఎన్నికయ్యారు. వెంటనే నల్లగొండ, గుడివాడ సీట్లకు ఎన్టీఆర్ రాజీనామా చేసి హిందూపురం శాసనసభ్యునిగా కొనసాగారు. ఐదేళ్లకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (1989 డిసెంబర్) ఆయన హిందూపురంతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి కూడా పోటీచేశారు. ఈ తెలంగాణ సీటులో కాంగ్రెస్ అభ్యర్థి జక్కుల చిత్తరంజన్‌దాస్ చేతిలో ఎన్టీఆర్ ఓటమి పాలయ్యారు. మళ్లీ ఆయన తెలంగాణ నుంచి అసెంబ్లీకి పోటీ చేయలేదు. 1989 తర్వాత 29 ఏళ్లకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలు (మనవరాలు) సుహాసిని పోటీ చేస్తుండటం విశేషం. హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి నుంచి టీడీపీ టికెట్‌పై ఆమె పోటీచేయడం ద్వారా తాత తర్వాత తెలంగాణ నుంచి అసెంబ్లీకి ఎన్నికల రంగంలోకి దిగిన నందమూరి కుటుంబసభ్యురాలిగా గుర్తింపు పొందారు. తొలి తరమంతా.. మహామహులే! నగర రాజకీయాల్లోని తొలితరం నాయకులంతా ఉన్నత విద్యావంతులే. ఆయా రంగాల్లో నిష్ణాతులుగా పేరొందిన వారే నాడు రాజకీయాల్లోకి వచ్చి నిస్వార్థ ప్రజాసేవకు పూనుకున్నారు. హైదరాబాద్ స్టేట్‌కు 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి ప్రముఖ వైద్యులు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గోల్డ్‌మెడల్ సాధించిన జీఎస్ మెల్కొటే విజయం సాధించగా, చాదర్‌ఘాట్ నుంచి ప్రముఖ న్యాయ కోవిదుడు గోపాలరావు ఎక్బోటే ఎన్నికయ్యారు. అనంతరం.. ఎగ్బోటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. బేగంబజారు నుంచి ప్రముఖ న్యాయవాది కాశీనాథ్‌రావు వైద్య విజయం సాధించగా, సోమాజిగూడ నుంచి నిజాం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కీలక బాధ్యతలు చూసిన మెహిదీ నవాజ్ జంగ్ విజయం సాధించారు. ఫత్తర్‌గట్టి నుంచి సంఘసేవకురాలు మాసుమా బేగం తొలి ఎన్నికలోనే భారీ మెజారిటీతో గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టారు. ఉమ్మడి ఏపీలో కూడా వీరిలో కొందరు వివిధ మంత్రివర్గాల్లోనూ పనిచేశారు. కమలానికి కలిసొచ్చిన స్థానం పూర్వపు హిమాయత్‌నగర్ స్థానానికి 1983లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఆలె నరేంద్ర గెలిచారు. మళ్లీ 1985 సాధారణ ఎన్నికల్లో టీడీపీ మిత్రపక్షాల మద్దతుతో ఆయన గెలుపొందారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వి.హనుమంతరావు చేతిలో ఓడిపోయారు. 1992 ఉప ఎన్నికలో ఇక్కడి నుంచే మళ్లీ నరేంద్ర ఎన్నికయ్యారు. తర్వాత 1994, 99 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై సి.కృష్ణాయాదవ్ గెలిచారు. 2004లో టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థిగా జి.కిషన్‌రెడ్డి గెలిచారు. 2008 పునర్విభజనతో ఇది అంబర్‌పేటగా మారింది. వరుసగా 2009, 2014లో కిషన్‌రెడ్డి (బీజేపీ) గెలుపొందారు. మళ్లీ అంబర్‌పేట నుంచి కిషన్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్ (టీఆర్ఎస్) పోటీచేస్తున్నారు. -
మా అక్కను గెలిపించండి : ఎన్టీఆర్
సాక్షి, హైదరాబాద్ : కూకట్పల్లి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న తమ సోదరి సుహాసినిని భారీ మెజారిటీతో గెలిపించాలని నందమూరి హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ప్రజా సేవకు సిద్దపడుతున్న తమ సోదరి సుహాసిని భారీ విజయం సాధించాలని ట్విటర్ వేదికగా ఆకాంక్షించారు. తాత, తండ్రికి నివాళులు.. తొలి సారి ఎన్నికల బరిలోకి దిగుతున్న సుహాసిని తాత, దివంగత సీఎం ఎన్టీఆర్, తండ్రి నందమూరి హరికృష్ణలకు నివాళులర్పించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. తండ్రి సమాధి వద్దే నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. బాబాయ్ నందమూరి బాలకృష్ల, ఇతర కుటుంబసభ్యులతో కలిసి తొలుత ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లిన ఆమె.. అనంతరం మహాప్రస్థానంలోని తన తండ్రి సమాధి దగ్గరకు వెళ్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుహాసిని మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ, చంద్రబాబు స్పూర్తితో రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పారు. తనకు తెలుగు మహిళలు మద్దతు ఇవ్వాలని కోరారు. శనివారం ఉదయం 11.21నిమిషాలకు నామినేషన్ వేశారు. బాలకృష్ణ మాట్లాడుతూ.. నందమూరి ఆడపడుచు సుహాసిని గెలుపు కోసం యువత, అభిమానులు, కార్యకర్తలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. సుహాసినిని భారీ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను ఆయన కోరారు. తమ ఆశయాలను సుహాసిని ముందుకు తీసుకెళ్తారని, తెలంగాణలో ప్రజాకూటమిదే విజయమని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణలో మహాకూటమి తరపున ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. బహిరంగ సభల్లో, రోడ్‌షోలలో పాల్గొంటానన్నారు. ఈ నెల 26 నుంచి ప్రచారం ప్రారంభిస్తానన్నారు. Wishing my sister Suhasini garu all the very best, as she takes her first step into public service pic.twitter.com/Hl2TJ4rMsd — Jr NTR (@tarak9999) November 17, 2018 -
రేపు సమాధానం చెబుతా: నందమూరి సుహాసిని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్టు నందమూరి సుహాసిని చెప్పారు. కూకట్పల్లి నుంచి మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కూకట్పల్లి నుంచి పోటీ చేస్తుండటం గర్వంగా ఉందని చెప్పారు. తన తాత ఎన్టీఆర్, నాన్న హరికృష్ణ స్ఫూర్తితో రాజకీయాల్లో వచ్చానని.. ప్రజల కోసం రాత్రింబవళ్లు కష్టపడతానన్నారు. ప్రజలకు సేవ చేస్తానన్న నమ్మకంతోనే తనకు సీటు ఇచ్చారని తెలిపారు. రాజకీయాల్లోకి రావాలన్న కోరిక చిన్నప్పటి నుంచే ఉందని వెల్లడించారు. ఈ సందర్భంగా విలేకరులు పలు ప్రశ్నలు సంధించగా రేపు నామినేషన్ వేసిన తర్వాత అన్నింటికి సమాధానం చెబుతానని అన్నారు. రాజకీయాల్లోకి రావాలన్నది మీ నిర్ణయమేనా? ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ ప్రచారానికి వస్తారా? అని అడగ్గా రేపు అన్ని చెబుతానన్నారు. మీ రాజకీయ ప్రవేశానికి ఎన్టీఆర్ కుటుంబంలో అందరి ఆమోదం ఉందా అని ప్రశ్నించగా.. ‘అందరి ఆమోదం ఉండబట్టే నేను మీ ముందుకు వచ్చాన’ని సమాధానమిచ్చారు. అందరి ఆశీర్వాదం తనకు కావాలని కోరారు. సుహాసినితో పాటు ఆమె బాబాయ్ నందమూరి రామకృష్ణ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. కాగా, ఆమెకు సీటు కేటాయించడం పట్ల స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన గళం విన్పిస్తున్నారు. (‘నందమూరి సుహాసినిని చిత్తు చిత్తుగా ఓడిస్తాం’) -
‘నందమూరి సుహాసినిని చిత్తు చిత్తుగా ఓడిస్తాం’
సాక్షి, హైదరాబాద్: మహాకూటమి తరపున కూకట్పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని ఖరారు చేయడంపై ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి పొత్తులో భాగంగా కూకట్పల్లి స్థానాన్ని టీడీపీకి కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ సీటును తొలుత టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు పెద్దిరెడ్డికి కేటాయిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ.. అనూహ్యంగా సుహాసినిని తమ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది. నందమూరి కుటుంబానికి టికెట్ కేటాయించడం వల్ల సానుభూతిని పొందవచ్చనే కారణంతోనే ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. (కూకట్పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని) ఈ టికెట్‌ను స్థానికులకు కాకుండా నందమూరి ఫ్యామిలీకి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్ నాయకులు కేపీహెచ్‌బీ రోడ్ నంబర్ 1లోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. కూకట్పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలకు టికెట్ కేటాయించడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తమ తరపున సమర్ధుడైన నాయకుడు రెబల్‌గా బరిలో నిలుస్తారని ప్రకటించారు. సుహాసినిని చిత్తు చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కుల రాజకీయాల్లో ఆంధ్రలో చేసుకోవాలని.. తెలంగాణలో కాదంటూ హితవు పలికారు. -
కూకట్పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మరో స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేసింది. కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని అభ్యర్థిగా ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి ఈ స్థానాన్ని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు పెద్దిరెడ్డి ఆశించారు. తనకే టికెట్ వస్తుందనే ఆలోచనతో ఆయన ఎన్నికల ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టారు. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు.. నందమూరి కుటుంబం పేరుతో పెద్దిరెడ్డికి మొండిచేయి చూపించారు. ఇదే స్థానాన్ని ఆశిస్తున్న మరో నేత మందాడి శ్రీనివాసరావును కూడా బుజ్జగించి సుహాసినికి టికెట్ కేటాయించారు. కాగా, సుహాసిని 17వ తేదీన నామినేషన్ దాఖలు చేస్తారని సమాచారం. సుహాసిని అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో టీడీపీ ఇప్పటివరకు 12 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టయింది.