దేశీయ పర్యాటకుల సందర్శనలో ఏపీకి ఐదో ర్యాంకు
న్యూఢిల్లీ: దేశీయ పర్యాటకుల సందర్శనలో ఆంధ్రప్రదేశ్ 5వ ర్యాంకులో నిలవగా, తెలంగాణకు 6వ ర్యాంకు దక్కింది. 2014లో ఆంధ్రప్రదేశ్‌ను దేశీయ పర్యాటకులు 93.3 మిలియన్లు మంది సందర్శించగా, 72.4 మిలియన్ల మంది తెలంగాణను సందర్శించారు. తమిళనాడు (327 మిలియన్లు ) ప్రధమ స్థానంలో నిలవగా, ఉత్తరప్రదేశ్ (182.8 మిలియన్లు) ద్వితీయ స్థానంలో నిలిచింది.
కర్ణాటక, మహారాష్ట్రలు 3, 4 స్థానాల్లో నిలవగా విభజనతో ఏపీ, తెలంగాణ ఐదు ఆరు స్థానాల్లో నిలిచాయి. విదేశీ పర్యాటకుల సందర్శనలో టాప్ టెన్ రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణకు చోటు దక్కలేదు. విదేశీ పర్యాటకులు 4.66 మిలియన్లు మంది తమిళనాడును సందర్శించగా, మహారాష్ట్రను 4.39 మిలియన్ల మంది సందర్శించినట్టు కేంద్రా పర్యాటక మంత్రిత్వశాఖ వెల్లడించింది.