New Pension Scheme
-
మెరుగైన పెన్షన్ కావాలంటే?
సర్కారు ఉద్యోగం.. ఎంతో మంది నిరుద్యోగుల ఆకాంక్ష. ఆకర్షణీయమైన వేతనం, ఇతర ప్రయోజనాలతోపాటు, రిటైర్మెంట్ తర్వాత మెరుగైన పింఛను వస్తుందన్న భరోసా ఎక్కువ మందిని ఆకర్షించే అంశాలు. కానీ, 2004 నుంచి అమల్లోకి వచి్చన నూతన ఫింఛను విధానంతో రిటైర్మెంట్ తర్వాత వచ్చే ప్రయోజనాలు మారిపోయాయి. దీంతో పాత పింఛను విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనికి పరిష్కారంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)ను కేంద్ర సర్కారు తాజాగా తెరపైకి తీసుకొచ్చింది. పదవీ విరమణ చివరి ఏడాది వేతనంలో కనీసం 50 శాతాన్ని పింఛనుగా అందించే హామీ ఉంటుంది. మరి ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారి సంగతి ఏంటి? రిటైర్మెంట్ తర్వాత మెరుగైన పింఛను పొందాలంటే అసాధ్యమేమీ కాదు. ఇందుకు చేయాల్సిందల్లా.. ప్రణాళిక మేరకు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడమే. ఈపీఎఫ్‌తోపాటు, ఎన్‌పీఎస్‌లోనూ నిర్ణీత శాతం మేర పెట్టుబడి పెట్టడం ద్వారా విశ్రాంత జీవితాన్ని మెరుగ్గా గడిపేందుకు మార్గం ఉంది. ఇందుకు ఏం చేయాలో నిపుణుల విశ్లేషణ చూద్దాం. కేటాయింపులు కీలకం.. ప్రభుత్వరంగ ఉద్యోగుల మాదిరే ప్రైవేటు రంగ ఉద్యోగులూ తమ రిటైర్మెంట్ పెట్టబడులను కొంత మేర ఎన్పీఎస్కు కేటాయించుకోవడం ఇక్కడ కీలకం. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వేతనం నుంచి 10 శాతం, వారి తరఫున ప్రభుత్వం నుంచి 14 శాతం చొప్పున ఎన్‌పీఎస్‌లోకి పెట్టుబడిగా వెళుతుంది. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని పరిమితులు ఉన్నాయి. మొత్తం ఎన్పీఎస్ పెట్టుబడుల్లో ఈక్విటీలకు 15 శాతం మించి కేటాయించుకోలేరు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌లో రాబడుల వృద్ధి పరిమితంగానే ఉంటుంది. అంటే 10 శాతంలోపు అని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ప్రైవేటు రంగంలోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రైవేటు రంగ ఉద్యోగులకు ఈపీఎఫ్ అమలవుతుంది. ఉద్యోగి, యాజమాన్యం చెరో 12 శాతం చొప్పున మూల వేతనం, డీఏపై ఈపీఎఫ్ ఖాతాకు జమ చేస్తుంటాయి. దీనిపై రాబడి 8 శాతం స్థాయిలోనే ఉంది. దీనివల్ల దీర్ఘకాలంలో చెప్పుకోతగ్గ భవిష్యనిధి ఏర్పడుతుందేమో కానీ, రిటైర్మెంట్ అవసరాలను తీర్చే స్థాయిలో కాదు. కనుక ప్రైవేటు రంగ ఉద్యోగులు ఈపీఎఫ్ కాకుండా ఎన్‌పీఎస్‌లోనూ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈపీఎఫ్–ఎన్పీఎస్ కలయిక కేంద్ర ఉద్యోగులకు ప్రతిపాదించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)లో అతిపెద్ద ఆకర్షణ.. చివరి వేతనంలో కనీసం 50 శాతాన్ని పింఛనుగా పొందడం. కానీ దీర్ఘకాలం పాటు సేవలు అందించిన తర్వాత చివరి వేతనంలో 50% భారీ మొత్తం కాబోదు. ప్రైవేటు రంగంలో పనిచేసే వారు సైతం తమ చివరి వేతనంలో 50 శాతాన్ని ఉద్యోగ విరమణ తర్వాత పొందొచ్చు. ప్రణాళిక మేరకు క్రమశిక్షణతో వ్యవహరిస్తే ఇంతకంటే ఎక్కువే సొంతం చేసుకోవచ్చు. ఈపీఎఫ్, ఎన్‌పీఎస్‌లో సమకూరిన నిధితోపాటు, ఈపీఎఫ్‌లో భాగమైన ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) కూడిన పెట్టుబడుల ప్రణాళిక ఒకటి. ఉదాహరణకు ఈపీఎఫ్ కింద ఉద్యోగి మూల వేతనం నుంచి 12%, అంతే చొప్పున యాజమాన్యం జమ చేస్తాయి. దీనికితోడు పాత పన్ను విధానంలో కొనసాగే వారు ఎన్పీఎస్ ఖాతా తెరిచి తమ వేతనంలో 10 % మేర యాజమాన్యం ద్వారా జమ చేసుకోవాలి. దీనికి సెక్షన్ 80సీసీడీ(2) కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ కొత్త పన్ను విధానంలోకి మళ్లిన వారు తమ వేతనంలో 14 శాతాన్ని ఎన్పీఎస్కు జమ చేయించుకోవడం ద్వారా ఆ మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉద్యోగ జీవితంలో క్రమం తప్పకుండా ఈ పెట్టుబడులు కొనసాగించడం ద్వారా చివరి వేతనంలో 50 శాతాన్ని పొందొచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు కాని ఇతరులు అందరూ.. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీలకు గరిష్టంగా 75% కేటాయింపులు చేసుకోవచ్చు. దీని ద్వారా రిటైర్మెంట్ నాటికి భారీ నిధి సమకూరుతుంది. నెలవారీ ఆదాయం.. ప్రైవేటు ఉద్యోగంలో ఆరంభ మూల వేతనం రూ.14,000తో ప్రారంభమై.. ఏటా 10% చొప్పున పెరుగుతూ వెళితే.. పైన చెప్పుకున్న విధంగా ఈపీఎఫ్, ఎన్‌పీఎస్‌లకు 30 ఏళ్ల పాటు చందాలు జమ చేసుకుంటూ వెళ్లినట్టయితే, రిటైర్మెంట్ తర్వాత నెలవారీ రూ.2.9 లక్షలు పొందొచ్చు. చివరి ఏడాదిలో వేతనం రూ.2.44 లక్షల కంటే ఇది ఎక్కువ. రిటైర్మెంట్ నాటికి ఎన్‌పీఎస్‌లో సమకూరిన నిధిలో 40 శాతంతో యాన్యుటీ ప్లాన్ (పింఛను) తీసుకోవాలి. మిగిలిన 60% ఫండ్‌ను వెనక్కి తీసుకోవచ్చు. అలాగే, ఈపీఎఫ్‌లో సమకూరిన నిధిని కూడా వెనక్కి తీసుకోవచ్చు. ఈ మొత్తాన్ని ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ/సిప్‌కు విరుద్ధమైనది) ఎంపిక చేసుకోవాలి. తద్వారా ప్రతి నెలా కోరుకున్నంత వెనక్కి తీసుకోవచ్చు. అలాగే, పనిచేసిన కాలం ఆధారంగా ఈపీఎఫ్‌లో భాగమైన ఎన్పీఎస్ నుంచి నెలవారీ నిరీ్ణత మొత్తం పింఛనుగా అందుతుంది. ఎన్‌పీఎస్‌లో 60% నిధి, ఈపీఎఫ్‌లో భవిష్యనిధి వాటా కింద సమకూరిన మొత్తాన్ని.. రిస్క్, రాబడుల ఆకాంక్షలకు అనుగుణంగా డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్ లేదా హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. కన్జర్వేటివ్ లేదా బ్యాలన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్ అయితే రిస్్క–రాబడుల సమతుల్యంతో ఉంటాయి. వ్యాల్యూ రీసెర్చ్ డేటా ప్రకారం గడిచిన పదేళ్లలో కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగం సగటు వార్షిక రాబడి 8.41 శాతంగా ఉంది. బ్యాలన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగంలో రాబడి 9.83% మేర ఉంది. ఈ ఫండ్స్‌లో వార్షిక రాబడి రేటు కంటే తక్కువ మొత్తాన్ని ఏటా ఉపసంహరించుకోవాలి. దీనివల్ల కాలక్రమంలో పెట్టుబడి కూడా కొంత మేర వృద్ధి చెందుతుంది. పెట్టుబడి విలువలో ప్రతి నెలా 0.5% చొప్పున ఎస్‌డబ్ల్యూపీ ద్వారా వెనక్కి తీసుకోవాలి. ఏటా ఈ మొత్తాన్ని 5% (ద్రవ్యో ల్బణం స్థాయిలో) పెంచుకుని ఉపసంహరించుకున్నా సరే.. రిటైర్మెంట్ నిధి ఏటా 10% చొప్పున వృద్ధి చెందితే 25 ఏళ్లలో రూ.2.05 కోట్ల నుంచి రూ.2.9 కోట్లకు చేరుతుంది. రిటైర్మెంట్ ఫండ్ విలువ మరింత పెరగాలంటే, నెలవారీ ఉపసంహరణ రేటు వీలైనంత తక్కువగా ఉండేలా చూడాలి. ఎంత మేర..?ఆరంభ మూల వేతనం రూ.14,000. ఏటా 10% పెరిగేట్టు. ఈపీఎఫ్‌లో నిబంధనల మేరకు ఇన్వెస్ట్ చేస్తూనే, ఎన్‌పీఎస్‌లోనూ పాత పన్ను విధానంలో 10% మొత్తాన్ని యాజమాన్యం ద్వారా డిపాజిట్ చేయించుకుంటే ఎంత వస్తుందో చూద్దాం. ఈపీఎఫ్ నిధిపై 8% రాబడి రేటు. ఎన్పీఎస్ జమలపై 12% రాబడి రేటు అంచనా. ఎన్పీఎస్ 40% ఫండ్‌తో యాన్యుటీ ప్లాన్ తీసుకుంటే, దీనిపై 6% రాబడి ప్రకారం ప్రతి నెలా వచ్చే ఆదాయం అంచనాలు ఇవి. ప్రత్యామ్నాయంప్రైవేటు రంగ ఉద్యోగులకు ఈపీఎఫ్ ఎలానూ ఉంటుంది. దీనికితోడు ఎన్పీఎస్ జోడించుకోవడం రాబడుల రీత్యా మంచి నిర్ణయం అవుతుంది. రిటైర్మెంట్ నాటికి ఎన్పీఎస్ నిధిలో 60 శాతాన్ని ఎలాంటి పన్ను లేకుండా ఉపసంహరించుకోవచ్చు. ఈపీఎఫ్ నిధిపైనా ఎలాంటి పన్ను లేదు. పన్ను కోణంలో ఈ రెండింటి కంటే మెరుగైనవి లేవు. ఎన్‌పీఎస్‌లో 75 శాతం ఈక్విటీలకు కేటాయించుకోవచ్చు. కానీ, ఎన్పీఎస్ ఫండ్ మేనేజర్లు టాప్–200 కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేయగలరు. ఒకవేళ ఇంతకంటే అదనపు రాబడులు ఆశించే వారు ఎన్పీఎస్ బదులు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ సమయంలో మొత్తం వెనక్కి తీసుకోకుండా, క్రమానుగతంగా ఉపసంహరణ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల పన్ను భారం చాలా వరకు తగ్గుతుంది. అయితే పదవీ విరమణ తర్వాత నూరు శాతం ఈక్విటీల్లోనే పెట్టుబడులు ఉంచేయడం సరైనది కాదు. కనుక 50% మేర అయినా డెట్ ఫండ్స్‌కు మళ్లించుకోవాలి. కనుక ఈ మొత్తంపై పన్ను భారం పడుతుంది. అయినా సరే యాక్టివ్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా పన్ను భారానికి దీటైన రాబడులు సొంతం చేసుకోవడం సాధ్యమే. ఈ సంక్లిష్టతలు వద్దనుకునే వారికి సులభమైన మార్గం ఎన్పీఎస్. ఇందులో వ్యయాలు చాలా తక్కువ. పైగా పన్ను భారం లేకుండా ఈక్విటీ నుంచి డెట్‌కు, డెట్ నుంచి ఈక్విటీకి పెట్టుబడుల కేటాయింపులు మార్చుకోవచ్చు. అలాగే, భవిష్యత్తులో ఎన్‌పీఎస్‌లోనూ ఎస్‌డబ్ల్యూపీ ప్లాన్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఇదే జరిగితే ఎన్పీఎస్ ద్వారా 50% పెట్టుబడులను ఈక్విటీల్లో, మిగిలినది డెట్‌లో కొనసాగిస్తూ, క్రమానుగతంగా కావాల్సినంత మేర వెనక్కి తీసుకోవచ్చు. గమనిక: కొత్త పన్ను విధానంలో ఉన్న వారు ఎన్పీఎస్కు 14 శాతం మేర వేతనంలో ప్రతి నెలా కేటాయించుకుంటే.. చివర్లో 40 శాతం యాన్యుటీ ప్లాన్‌పై ప్రతి నెలా టేబుల్లో పేర్కొన్న ఆదాయం కంటే 40 శాతం అధికంగా, ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ప్రతి నెలా 10 శాతం మేర అదనంగా పొందొచ్చు. – సాక్షి, బిజినెస్‌డెస్క్ -
ఓపీఎస్‌కి దీటుగా పెన్షన్ స్కీమ్
సాక్షి, అమరావతి: పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)తో సమానంగా నూతన పెన్షన్ విధానం రూపుదిద్దుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారని తెలిపారు. మంగళవారం వెలగపూడిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ అనేది ఉండదన్నారు. ఓపీఎస్‌తో సమానమైన పెన్షన్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయతి్నస్తోందన్నారు. ఉద్యోగులు 50 శాతం బెనిఫిట్ పొందే విధంగా ఈ విధానం ఉంటుందన్నారు. కేబినెట్లో తీసుకునే నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు సంతృప్తి చెందుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉద్యోగుల సమస్యలపై ఈ ప్రభుత్వ హయాంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌తో పలు సమావేశాలు జరిగాయని గుర్తు చేశారు. అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకుని ఆదేశాలు ఇచ్చారన్నారు. 32 శాఖలకు సంబంధించి సుమారు 454 అంశాలను ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తేగా 330 అంశాలు ఇప్పటికే పరిష్కారమయ్యాయన్నారు. తక్కువ వ్యవధిలో ఇన్ని సమస్యలు పరిష్కరించడం గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. ఇప్పటికే జీపీఎఫ్ బకాయిలు, సరెండర్ లీవులు, ఏపీజీఎల్ఐ పెండింగ్ బిల్లులను చెల్లించారని తెలిపారు. ఉద్యోగుల హెల్త్ కార్డుల విషయంలో సమస్యలను పరిష్కరించేందుకు ఆరోగ్యశ్రీ ïసీఈఓ ఖాతాలో హెల్త్ కార్డ్ డబ్బులను ఈ నెల నుంచే జమ చేస్తారని చెప్పారు. గతంలో ఓ సీఎం మాట తప్పారు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబధ్దీకరిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి అధికారంలోకి వచి్చన తర్వాత తాము అలా ఎప్పుడు చెప్పామంటూ గతంలో ఒక ముఖ్యమంత్రి ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఇప్పుడు సీఎం జగన్ హామీ ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబదీ్ధకరిస్తున్నారని తెలిపారు. సుమారు 10 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులర్ అయ్యే అవకాశం ఉందన్నారు. యూనివర్సిటీలు, సహకార సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచనున్నారని తెలిపారు. స్పెషల్ పే చెల్లించేందుకు త్వరలో ఉత్తర్వులు వెలువడతాయన్నారు. డీఏ, పీఆర్సీ బకాయిలను పదవీ విరమణ తర్వాత ఇవ్వాలని తొలుత భావించినా ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు నాలుగేళ్లలో 16 విడతలుగా సుమారు రూ.7,382 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.76 వేల కోట్ల ఆదాయాన్ని నష్టపోయిందన్నారు. పద్ధతి ప్రకారం చెల్లింపులు తాము చేసిన ఉద్యమం వల్లే ప్రభుత్వం ఉద్యోగులకు మేలు చేస్తున్నట్లు కొన్ని ఉద్యోగ సంఘాలు గొప్పలు చెప్పుకొనే ప్రయత్నం చేయడం సరికాదని చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో ముఖ్యమైన పెద్ద అంశాలపై మాత్రమే ఉద్యమాలు నిర్వహించగా ఇప్పుడు కొన్ని సంఘాలు ఎందుకు ఉద్యమం చేస్తున్నాయో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఉద్యమం చేయడం వల్లే ప్రభుత్వం ఇవన్నీ ఇవ్వడం లేదని, ఒక పద్ధతి ప్రకారం చెల్లింపులు జరుగుతున్నాయని చెప్పారు. గతంలో పీఆర్సీ కమిషన్ నియమించాలని ఉద్యమాలు జరగగా ఇప్పుడు ప్రభుత్వం ముందుగానే నియమిస్తోందని గుర్తు చేశారు. చదవండి: ఆకాశమే హద్దుగా.. ఎగుమతుల్లో ఏపీ దూకుడు -
‘ఈ పథకం మాకొద్దు’- ట్విటర్‌ను హోరెత్తించిన ఉద్యోగులు
మరణమా.. రణమా అన్నంత ఉత్కంఠతో ఉద్యోగులు తమకు పాత పింఛను పథకం పునరుద్దరణ మాత్రమే శరణ్యమనీ.. మరో మారు తేల్చి చెప్పారనీ భాగస్వామ్య పింఛను పథకం ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్ అన్నారు. అసాధారణ పోరాట పటిమతో మదిలో మాటను విశ్వ విదితం చేశారని, ఆ సంగతి సీపీఎస్ శ్రేణుల గుండె చప్పుడుతో దద్దరిల్లిన ట్విటర్ సాక్షిగా సుస్పష్టం అయిందని చెప్పారు. బుధవారం నాడు దేశ వ్యాప్తంగా ఉన్న న్యూపెన్షన్ స్కీమ్ ఉద్యోగ వర్గాల సామాజిక మాధ్యమ ఉద్యమం అద్భుతంగా విజయం సాధించిందని అన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. నెల రోజుల ముందు నుంచే యావత్ భారతం మానసికంగా సిద్ధమై ఈ రోజు అవకాశం కోసం వేచి చూసిన నిరీక్షణ ఫలితమే ‘రిస్టోర్ ఓల్డ్ పెన్షన్’ ఆవిష్కృతమైందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయి నాయకులు కూడా మున్ముందు జూమ్ సమావేశాలు నిర్వహించి ఎన్పీఎస్ కు చరమ గీతం పాడేలా ఉద్యోగ సంఘాలను సమాయత్తం చేశాయన్నారు. సీపీఎస్టీఈఏటీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాముక కమలాకర్ సూచన మేరకు సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగులు ట్విటర్ ఖాతాల ద్వారా పాత పింఛను సాధన తమ లక్ష్యం అని గళం వినిపించారన్నారు. వారణాసి రామకృష్ణ ఆధ్వర్యంలో జలసౌధ లో ఇంజనీర్లు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారని చెప్పారు. కొత్త పింఛను పథకం రద్దే ఏకైక లక్ష్యం అని, వెసులు బాట్లు , సౌకర్యాల తో తమను ఏ మర్చలేరని లక్షలాది గొంతుకలు ముక్త కంఠంతో ఎలుగెత్తి చాటాయన్నారు. దేశ వ్యాప్తంగా 70 లక్షలపై చిలుకు ఉద్యోగులు కొత్త పింఛను పథకం లో ఉండగా.. బుధవారం నాడు పది లక్షల ఉద్యోగుల హృదయ స్పందన ట్విటర్ సాక్షిగా మాకు కావాల్సింది పాత పింఛను పథకం మాత్రమే అన్న విషయం అటు పాలకులకు ఇటు జన బాహుళ్యానికి తేట తెల్లమైందని వివరించారు. కరోనా మూలంగా కేవలం సామాజిక మాధ్యమం అస్త్రంగానే పోరు జరిగిందని, కోవిడ్ తగ్గాక ఉద్యమం ఉవ్వెత్తున ఎగసే అవకాశం లేకపోలేదని రఘునందన్ అభిప్రాయపడ్డారు. -
సెబీ ఉద్యోగులకు శుభవార్త
ముంబై : మార్కెట్ రెగ్యులేటరీ సెక్యురిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ) శాశ్వత ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగుల కోసం కొత్త పెన్షన్ పథకాన్ని సెబీ ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది. ఉద్యోగుల రక్షణను పెంచే లక్ష్యంతో శాశ్వత ఉద్యోగుల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలని సెబీ యోచిస్తోంది. వచ్చే వారంలో జరగబోయే బోర్డు మీటింగ్ లో సెబీ ఈ నిర్ణయాన్ని ప్రకటించనుంది. ప్రస్తుతం ఈ మార్కెట్ రెగ్యులేటరీ ఉద్యోగులకు ఎటువంటి పెన్షన్ పథకం అమలులో లేదు. అయితే ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్)ను సెబీ ఆఫర్ చేస్తోంది. సెబీ తీసుకొస్తున్న ఈ ప్రతిపాదనతో, ప్రస్తుతమున్న ఉద్యోగులు ఇప్పటికే అమల్లో ఉన్న ప్రావిడెంట్ ఫండ్ ను కాని, న్యూ పెన్షన్ స్కీమ్ ను కాని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ప్రావిడెంట్ ఫండ్ లో కొనసాగుతున్న ఉద్యోగులు కొత్త పెన్షన్ పథకాన్ని ఎంపికచేసుకున్నా.. వారు పీఎఫ్ మెంబర్ గా కొనసాగడానికి అవకాశం ఉంటుంది లేదా ఉద్యోగులు కోరుకుంటే పీఎఫ్ ఖాతాలోని మొత్తాన్ని కొత్త పెన్షన్ పథకానికి మళ్లిస్తారు. శాశ్వత సర్వీసుపై వచ్చే కొత్త ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్ కిందకు వస్తారని తెలిపింది. పీఎఫ్, సెబీ రెండూ కలిసి కొంత మొత్తాన్ని కొత్త పెన్షన్ స్కీమ్ కు కంట్రిబ్యూట్ చేయనున్నాయి. -
పన్ను లాభం.. మరింత పడదాం
పన్ను మినహాయింపుల్లో సెక్షన్ 80సీ చాలా కీలకమైంది. అనేక పొదుపు పథకాలు, వ్యయాలన్నీ ఈ సెక్షన్ పరిధిలోనే ఉండటంతో అనేక మంది అవకాశం ఉండి కూడా దీన్ని పూర్తిగా వినియోగించుకోలేక పోతున్నారు. పీఎఫ్, పీపీఎఫ్, బీమా, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్, ట్యూషన్ ఫీజులు, ఇంటి రుణానికి చెల్లించే అసలు వంటి అనేక అంశాలన్నీ సెక్షన్ 80సీ కిందకే వస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటి వినియోగించుకుంటే మరికొన్నింటిపై లభించే ప్రయోజనాలను వదులుకోవాల్సి వస్తోంది. ఇంజనీరింగ్, మెడికల్ చదువుల ట్యూషన్ ఫీజులే లక్షల్లో చేరుకున్న తరుణంలో 80సీ కింద వచ్చే ఇతర ప్రయోజనాలను వాడుకోలేకపోతున్నారు. ఇటువంటి తరుణంలో సెక్షన్ 80సీ పరిమితిని లక్ష నుంచి రూ.1.5 లక్షలకు ప్రభుత్వం పెంచింది. దీంతో ఈ ఏడాది నుంచి మరింత పొదుపు చేయడం ద్వారా పన్ను భారం తగ్గించుకోవచ్చు. ఈ అదనపు ప్రయోజనాలను పొందడానికి ఇక కేవలం ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో పెరిగిన సెక్షన్ 80సీ ప్రయోజనాలను గరిష్టంగా ఏ విధంగా వినియోగించుకోవచ్చో ఒకసారి పరిశీలిద్దాం.. గృహ రుణం... కొత్తగా ఇంటి రుణం తీసుకునే వారికి, ఇప్పటికే తీసుకున్న వారికి సెక్షన్ 80సీ పరిమితి పెంపు అనేది పెద్ద ఊరటనే చెప్పొచ్చు. చెల్లించే ఈఎంఐలో వడ్డీకి కాకుండా అసలుకు చెల్లించే మొత్తాన్ని 80సీ కింద చూపి పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. కిందటి ఏడాది వరకు ఈ మొత్తం లక్షగా ఉంటే ఈ ఏడాది నుంచి అదనంగా మరో రూ.50,000 చూపించుకోవచ్చు. నిర్మాణ వ్యయంతో ఇంటి ధరలు బాగా పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం గృహరుణదారులకు కలిసొచ్చే అంశం. అంతే కాదు చెల్లించే వడ్డీపై సెక్షన్ 24 కింద లభించే పన్ను మినహాయింపు పరిమితిని రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచడం జరిగింది. మొత్తం మీద చూస్తే ఈ ఆర్థిక సంవత్సరం నుంచి గృహ రుణం తీసుకున్న వారు అదనంగా లక్ష రూపాయలు ఆదాయం నుంచి తగ్గించి చూపించుకోవడం ద్వారా ఆ మేరకు పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్న సమయంలో సెక్షన్ 80సీ పరిమితి పెంచడం ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్‌కి డిమాండ్ కలిసొచ్చింది. ఈ ఏడాది నుంచి ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీం (ఈఎల్ఎస్ఎస్-ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్)ల్లో ఇన్వెస్ట్ చేసిన లక్షన్నర వరకు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. దీంతో ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేసేవారి సంఖ్య బాగా పెరుగుతున్నట్లు గణాంకాలు తెలియచేస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో ఉండే సహజసిద్ధమైన రిస్క్‌కు సిద్ధపడి, బ్యాంకు డిపాజిట్ల కంటే అధిక రాబడిని కావాలనుకునే వారు వీటికేసి చూడొచ్చు. వీటిల్లోని ప్రధాన ఆకర్షణ ఏమిటంటే పన్ను ఆదాచేసే పథకాలన్నింటిలోకి తక్కువ లాకిన్ పీరియడ్‌ను కలిగివుండటమే కాకుం డా, వచ్చే రాబడిపై ఎటువంటి పన్ను భారం ఉండకపోవడం. ఇన్వెస్ట్ చేసిన మూడు సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా వైదొలగవచ్చు. ఇప్పటికే మార్కెట్ గరిష్టస్థాయిలో ఉన్నందున ఈ ఏడాదికి ఇన్వెస్ట్ చేయాలనుకున్న మొత్తాన్ని ఒకేసారిగా కాకుండా వచ్చే 6 నెలల్లో కొంత మొత్తంలో ఇన్వెస్ట్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవడం ద్వారా రిస్క్‌ను కొంత మేర తగ్గించుకోవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఎటువంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ చాలా అనువైనది. ఇది 15 ఏళ్ల దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ సాధనం. ప్రస్తుతం ఈ పథకంపై 8.7 శాతం వడ్డీ లభిస్తోంది. కిందటి ఏడాది వరకు ఈ పథకంలో గరిష్టంగా లక్ష రూపాయల వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేయగలిగేవారు. ఇప్పుడు సెక్షన్ 80సీ పరిమితి పెంచడంతో ఆ మేరకు పీపీఎఫ్ పరిమితిని పెంచుతూ ఈ మధ్యనే కేంద్రం గెజిట్‌ను కూడా విడుదల చేసింది. ఫిక్స్డ్ డిపాజిట్లు ఐదేళ్ల కాలపరిమితి దాటిన ఫిక్స్డ్ డిపాజిట్లపై పన్ను రాయితీలు లభిస్తాయి. వీటిల్లో కూడా గరిష్టంగా లక్షన్నర వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎటువంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారికి ఇవి అనువైనవి. ద్రవ్యోల్బణం దిగొస్తుండటంతో ఇప్పటికే పలు బ్యాంకులు దీర్ఘకాలిక డిపాజిట్లపై వడ్డీరేట్లను సుమారుగా ఒక శాతం తగ్గించేశాయి. రానున్న కాలంలో ఈ వడ్డీరేట్లు మరింత తగ్గే అవకాశం ఉండటంతో పన్ను మినహాయింపు కావాలనుకునే వారు సాధ్యమైనంత తొందరగా అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్న బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడం ఉత్తమం. ఎన్పీఎస్ కొత్త పెన్షన్ పథకం (ఎన్పీఎస్)లో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై కూడా సెక్షన్ 80సీ మినహాయింపులు లభిస్తాయి. ఇతర పెన్షన్ పథకాలతో పోలిస్తే వీటిలో నిర్వహణా వ్యయం కూడా తక్కువే. పెన్షన్ కోసం ఇన్వెస్ట్ చేసేవారు వీటికేసి చూడొచ్చు. ఇవి కాకుండా సీనియర్ సిటిజన్ స్కీం, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా సెక్షన్ 80సీ కింద చూపించుకొని పన్ను మినహాయింపులు పొందవచ్చు. -
ఆధార్ కార్డు ఉంటేనే పెన్షన్ ఇస్తాం: మృణాళిని
హైదరాబాద్: కొత్త పెన్షన్ విధానాన్ని అక్టోబర్ 2 నుంచి అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మృణాళిని మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. నూతనంగా అమలు చేసే విధానం వల్ల 43 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని మంత్రి మృణాళిని తెలిపారు. కొత్త పెన్షన్ విధానాన్ని ఆధార్‌ను లింక్ చేస్తున్నామని ఆమె అన్నారు. ఆధార్ కార్డు ఉంటేనే పెన్షన్ ఇస్తామని.. ఆగస్టు 30 లోగా పెన్షన్‌దారులకు ఆధార్ కార్డుల పంపిణీ పూర్తి చేస్తామన్నారు. పెన్షన్ల కోసం 3788 కోట్ల రూపాయల బడ్జెట్ ఉందని, 9 లక్షల పెన్షన్లను కేంద్రం మంజూరు చేస్తుందని మంత్రి మృణాళిని ఓ ప్రశ్నకు జవాబిచ్చారు. అలాగే డ్వాక్రా రుణమాఫీకి 7640 కోట్లు రూపాయలు ఖర్చు అవుతుందని, రిజిస్టర్ అయన ప్రతి డ్వాక్రా గ్రూప్‌కు లక్ష రూపాయల మాఫీ వర్తిస్తుందన్నారు. డిఫాల్టర్ల గ్రూప్‌లకు కూడా రుణమాఫీ వర్తింపు చేస్తామని మరో ప్రశ్నకు మంత్రి మృణాళిని సమాధానమిచ్చారు. -
నిధి రాత మార్చుకోవచ్చిలా..!
అంతకంతకూ పెన్షన్ భారం పెరిగిపోతూ ఉండటంతో కొంతైనా తగ్గించుకోవటానికి కేంద్రం కొన్ని ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈపీఎఫ్ పెన్షన్ ఫండ్ కేటాయింపులపై పరిమితులు విధించింది. ఇక నుంచి ఈపీఎఫ్-95 స్కీంలో చేరే సభ్యులకు గరిష్ట బేసిక్ జీతాన్ని రూ.6,500కు పరిమితం చేసింది. అంటే మీ బేసిక్ జీతం ఎంత ఉన్నా దానితో సంబంధం లేకుండా కేవలం రూ.6,500 బేసిక్ జీతం ప్రకారం ఈపీఎఫ్ పెన్షన్ ఫండ్‌కి కేటాయించాలి. దీని ప్రకారం ఉద్యోగం చేసే సంస్థ 12 శాతం అంటే రూ.780 ఈపీఎఫ్‌కి జమ చేయాల్సి ఉంటుంది. ఇందులో 8.33 శాతం అంటే రూ.541లు పెన్షన్ ఫండ్‌కి మిగిలిన మొత్తం ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలోకి వెళుతుంది. ఉద్యోగి జీతం నుంచి కట్ అయ్యే రూ.780లు పూర్తిగా ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలోకి వెళుతుంది. ఇంతకంటే అధిక మొత్తం కేటాయించాలంటే ఈపీఎఫ్ సంస్థ నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే రిటైర్ అయిన తర్వాత నెలకు కనీసం రూ.1,000 పెన్షక్ కూడా లభించే అవకాశం ఉండదు. దీంతో పెన్షన్ అవసరాల కోసం ఇంతకాలం అధిక మొత్తాలను కేటాయిస్తున్న వారు ఇతర పథకాల కేసి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వివిధ రకాల పెన్షన్ పథకాలు అందుబాటులో ఉన్నా... వాటిలో ప్రధానమైనది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన న్యూ పెన్షన్ స్కీమే (ఎన్పీఎస్). వీటితో పాటు బీమా, మ్యూచువల్ ఫండ్లు అందించే పెన్షన్ పథకాలు ఎటూ ఉన్నాయి. వాటిని ఒక్కసారి చూస్తే... ఎన్పీఎస్ ఉద్యోగస్తులకే కాకుండా అందరికీ పెన్షన్ సౌలభ్యాన్ని అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో 2009లో కేంద్రం న్యూ పెన్షన్ స్కీంను (ఎన్పీఎస్) అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త పెన్షన్ పథకంలో చేరాలనుకునే వారు సంవత్సరానికి కనీసం రూ.6,000 లేదా నెలకు రూ.500 చొప్పున జమచేయాల్సి ఉంటుంది. పీఎఫ్ఆర్డీఏ పర్యవేక్షణలో నడిచే ఈ కొత్త పెన్షన్ పథకాన్ని ప్రస్తుతం ఎస్బీఐ, యూటీఐ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా, రిలయన్స్, ఐడీఎఫ్సీ సంస్థలు నిర్వహిస్తున్నాయి. 18 నుంచి 55 సంవత్సరాల లోపు వయసున్న వారు చేరొచ్చు. ఇన్వెస్టర్ల రిస్క్ సామర్థ్యం ఆధారంగా వివిధ రకాల ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. గరిష్టంగా ఈక్విటీల్లో 50 శాతం వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి పీఎఫ్ఆర్డీఏ అనుమతిస్తోంది. ఈ పథకాన్ని దాదాపు అన్ని ప్రభుత్వ బ్యాంకులు, బ్రోకింగ్ సంస్థలు అందిస్తున్నాయి. వీటిలో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై ఏడాదికి గరిష్టంగా లక్ష రూపాయల వరకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం పన్ను మినహాయింపు లభిస్తుంది. ప్రస్తుతం ఎన్పీఎస్ను ఆరు ఫండ్ హౌస్‌లు నిర్వహిస్తుండగా, గడిచిన నాలుగేళ్లలో వీటి సగటు రాబడి 7.6 శాతం నుంచి 8.6 శాతంగా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ వివిధ మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా రిటైర్మెంట్ పథకాలను అందిస్తున్నాయి. కొంచెం రిస్క్ చేయగలిగేవారికి ఈ రిటైర్మెంట్ ఫండ్స్ అనువుగా ఉంటాయి. ఇవి ఈక్విటీ, డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కనక మిగిలిన వాటిపై కాస్త అధిక రాబడిని ఆశించవచ్చు. కానీ ఇవి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వీటి రాబడిపై ఎలాంటి హామీ ఉండదు. అందుకని ఆ మేరకు రిస్క్ కూడా ఉంటుంది. కానీ దీర్ఘకాలంలో అన్నిటికంటే ఈక్విటీలే అధిక రాబడినిస్తాయన్నది నిపుణుల సూచన. యూటీఐ, టాటా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి మ్యూచువల్ ఫండ్ సంస్థలు రిటైర్మెంట్ ఫండ్స్‌ను అందిస్తున్నాయి. బీమా పథకాలు... దాదాపు బీమా కంపెనీలన్నీ రిటైర్మెంట్ పాలసీల్ని అందిస్తున్నాయి. చెల్లించే ప్రీమియంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులుంటాయి. వీట్లో పరిమిత కాలానికి ఇన్వెస్ట్ చేస్తే తర్వాత మనం ఎంచుకున్న సంవత్సరం నుంచి పెన్షన్ వస్తుంది. ఈ పథకాల్లో ఇన్వెస్ట్మెంట్ సమయం ముగిశాక పాలసీ విలువలో కావాలంటే ఒకేసారి 20-30 శాతం వెనక్కి తీసుకోవచ్చు కూడా. మిగిలిన మొత్తాన్ని తప్పనిసరిగా యాన్యుటీ ప్లాన్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఇలా ఒకేసారి వెనక్కి తీసుకున్న మొత్తంపై ఆదాయపు పన్ను కూడా ఉండదు. తక్షణం పెన్షన్ కోసం.. కాస్త వయసు పైబడ్డవారు, రిటైర్మెంట్కు దగ్గరయిన వారు, తక్షణం పెన్షన్ కావాలనుకునే వారికి అలా అందించే పథకాలూ ఉన్నాయి. ఒకేసారి పెద్ద మొత్తం ఇన్వెస్ట్ చేయడం ద్వారా ప్రతినెలా పెన్షన్ పొందొచ్చు. ఉదాహరణకు ఎల్ఐసీ జీవన్ అక్షయ్-6 పథకాన్నే తీసుకుంటే 30 ఏళ్ళకే పెన్షన్ తీసుకోవచ్చు. ఇందులో కనిష్టంగా లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి. 30 ఏళ్ల వ్యక్తి జీవన్ అక్షయ్‌లో రూ.20 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అతనికి జీవితాంతం ప్రతి నెలా దాదాపు రూ.12,000 పెన్షన్‌గా లభిస్తుంది. వీటినే ఇమీడియట్ యాన్యుటీ ప్లాన్స్ అంటారు. ఎల్ఐసీతో పాటు ఎస్బీఐ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, బజాజ్ అలియంజ్, టాటా ఏఐజీ వంటి దాదాపు అన్ని జీవిత బీమా కంపెనీలు ఇమీడియట్ యాన్యుటీ ప్లాన్స్‌ను అందిస్తున్నాయి. - ‘సాక్షి’ పర్సనల్ ఫైనాన్స్ విభాగం