NG Ranga University
-
ఇక నుంచి 60% విద్యాబోధన ప్రయోగశాలల్లోనే
సాక్షి, అమరావతి: వ్యవసాయ విద్యలో ఒకే విధమైన విద్యా ప్రమాణాలతో పాఠ్యాంశాలు, విద్యాబోధన అమల్లోకి వచ్చింది. ఇకపై 60 శాతం విద్యాబోధన ప్రయోగశాలల్లోనే జరగనుంది. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) 6వ డీన్స్ కమిటీ సిఫార్సులను ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే అమలు చేస్తూ దేశంలోనే తొలి విశ్వవిద్యాలయంగా ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం నిలిచింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఒకే రకమైన విద్యాబోధన తీసుకురావాలన్న లక్ష్యంతో ఐసీఏఆర్ 2021లో ఏర్పాటు చేసిన 6వ డీన్స్ కమిటీ ఇటీవలే తన నివేదికను సమర్పించింది. కమిటీ సిఫార్సులను జాతీయ, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ వ్యవసాయ వర్సిటీల్లో అమల్లోకి తీసుకురావాలని ఐసీఏఆర్ సంకల్పించింది. దీంతో ఈ నూతన విద్యా విధానంలో పాఠ్యాంశాలతో పాటు బోధనా పద్ధతులు మారిపోనున్నాయి.కోర్సు మధ్యలో ఆపేస్తే..నూతన విద్యావిధానం ప్రకారం కళాశాలల్లో చేరిన విద్యార్థులలో బెరకును పోగొట్టి, వివిధ కోర్సులపై అవగాహన కల్పించడం, విద్యార్థుల మధ్య తారతమ్యాలు తొలగించేందుకు తొలుత రెండు వారాల ‘దీక్షారంభ్’ నిర్వహిస్తారు. వ్యవసాయ కోర్సులలో తొలి రెండేళ్లూ నిర్దేశించిన ప్రాథమిక కోర్సుల బోధనతో పాటు నైపుణ్యాభివృద్ధి కోర్సులలో శిక్షణకు ప్రాధాన్యతిస్తారు. తరగతి గది బోధనతో పాటు తొలి ఏడాది ఎన్ఎస్ఎస్/ఎన్సీసీ/ఫిజికల్ ఎడ్యుకేషన్/యోగా వంటి వాటిని అభ్యసించేలా ప్రోత్సహిస్తారు. 3వ ఏడాది పూర్తిగా వ్యవసాయ శాస్త్రానికి చెందిన కోర్సులు బోధిస్తారు. నాలుగో ఏడాదిలో ఎంపిక చేసిన కోర్సులలో విద్యాబోధన సాగిస్తారు. 8వ సెమిస్టర్లో ఇండస్ట్రియల్ అటాచ్మెంట్, అనుభవంతో కూడిన బోధన, హ్యాండ్–ఆన్ ట్రైనింగ్, ప్రాజెక్ట్ వర్క్, ఇంటర్న్‌షిప్‌కు ప్రాధాన్యత ఇస్తారు. 4వ ఏడాది వ్యవసాయం, అనుబంధ శాస్త్రాలతో పాటు 10 ఆన్లైన్ కోర్సులను నేర్చుకునే వెసులుబాటు కల్పిస్తారు. పైగా నాలుగేళ్ల కోర్సులో ప్రయోగాత్మక అంశాలను నేర్చుకోవడానికి 60 శాతం సమయాన్ని కేటాయిస్తారు. విద్యార్థి కోర్సుని పూర్తి చేయలేకపోతే.. తొలి రెండేళ్లకు గానూ డిప్లొమా సర్టిఫికెట్ జారీ చేస్తారు. మిగిలిన కోర్సును విద్యార్థి తనకు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు.. దేశంలో ఏ వ్యవసాయ కళాశాలలో అయినా పూర్తిచేసే వెసులుబాటు కల్పించారు. అమలులో తొలి వర్సిటీగా ఎన్జీ రంగా6వ డీన్స్ కమిటీ సిఫార్సుల అమలు కోసం యూనివర్సిటీ ఫ్యాకల్టీ బోర్డ్ ఆఫ్ అగ్రికల్చర్, 113వ అకడమిక్ కౌన్సిల్ సమావేశాల్లో ఆమోద ముద్ర వేయడం ద్వారా సిఫార్సులు అమలు చేస్తున్న తొలి విశ్వవిద్యాలయంగా ఎన్జీ రంగా వర్సిటీ నిలిచింది. బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ ప్రోగ్రామ్ అందించే 7 వ్యవసాయ ప్రభుత్వ కాలేజీలు, 6 అనుబంధ కళాశాలలు, 2 ఫుడ్ సైన్స్ కళాశాలలు, 2 అగ్రి ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు కమ్యూనిటీ సైన్స్ కళాశాలలో కూడా వీటిని అమల్లోకి తెచ్చింది. డిజిటల్ టెక్నాలజీకి తగినట్టుగా విద్యార్థులను సన్నద్ధం చేసే లక్ష్యంతో బయో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్ తదితర కోర్సులతో పాటుగా వ్యక్తిత్వ వికాసం కోర్సులను చేర్చారు. విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకతను మెరుగుపరిచే విధంగా ప్రోగ్రెసివ్ మూల్యాంకనం ద్వారా ప్రతిభను గుర్తిస్తారు. ఆన్లైన్, ఓపెన్ డిస్టాన్స్ లెర్నింగ్ (ఓడీఎల్), బ్లెండెడ్ లెర్నింగ్ వంటి వినూత్న బోధనా విధానాలను ఆచరణలోకి తీసుకొచ్చారు.తొలి విశ్వవిద్యాలయం మనదేజాతీయ విద్యావిధానం–2020లో భాగంగా ఐసీఏఆర్ ఏర్పాటు చేసిన 6వ డీన్స్ కమిటీ సిఫార్సులు సంపూర్ణంగా అమలు చేసిన తొలి వర్సిటీగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిలిచినందుకు గర్వంగా ఉంది.ఏటా పెద్ద సంఖ్యలో నూతన వంగడాలను మార్కెట్లోకి విడుదల చేస్తూ పరిశోధనల్లో అగ్రస్థానంలో ఉన్న వర్సిటీని నూతన విద్యావిధానం అమల్లో కూడా అదే స్థానంలో నిలుపుతాం. – డాక్టర్ శారద జయలక్ష్మి, వీసీ, ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ -
ఎన్జీ రంగా వర్సిటీలో రాజకీయ బదిలీలు
సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే కక్షసాధింపు చర్యలకు తెగబడుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.. చివరికి చదువుల నిలయాలైన విశ్వవిద్యాలయాల పైనా పడింది. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దే అధ్యాపకులు, జాతి గర్వించేలా పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలను కూడా రాజకీయాలకు బలి చేస్తోంది. విశ్వవిద్యాలయాలపై పెత్తనం చెలాయించేందుకు, కక్ష సాధింపు చర్యలకు అధికార కూటమి నేతలు బదిలీలకు తెరతీశారు. మరీ ముఖ్యంగా గడిచిన ఐదేళ్లుగా పరిశోధనలు, విస్తరణ కార్యక్రమాలతో జాతీయ స్థాయిలో అత్యుత్తమ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందిన ఆచార్య ఎన్జీ రంగా విశ్వ విద్యాలయం (ఆంగ్రూ)లో కక్ష సాధింపు బదిలీలకు శ్రీకారం చుట్టారు. సాధారణంగా ఏటా 3 నుంచి 5 సంవత్సరాలు ఒక చోట పని చేసిన వారిని బదిలీ చేస్తుంటారు. ఇప్పుడు ఆంగ్రూలో సంబంధిత శాఖామంత్రి లోకేశ్ ఆదేశాల మేరకు అధికార టీడీపీ కీలక నేతల సిఫార్సులతో అడ్డగోలుగా బదిలీ చేస్తుండటం వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా ఒక సామాజిక వర్గం సిబ్బందే లక్ష్యంగా బదిలీలు జరుగుతున్నాయని, ఆ స్థానాల్లో కూటమి నేతలకు నచ్చిన వారికి పోస్టింగులు ఇస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.ఆంగ్రూ చరిత్రలోనే తొలిసారియూనివర్సిటీలో హెచ్‌వోడీలనే కాదు.. బోధన, బోధనేతర సిబ్బందిని కూడా నిబంధనలకు పాతరేసి మరీ ఇష్టానుసారం బదిలీ చేస్తుండటంపై సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. చివరికి పరిశోధన స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలను కూడా వదిలి పెట్టలేదు. ఆఘమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేసి రెండు వారాల్లోనే 102 మందిని బదిలీ చేశారు. ఇంత మందిని ఒకేసారి బదిలీ చేయడం ఆంగ్రూ చరిత్రలో ఇదే తొలిసారి అని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు 38 మంది ప్రొఫెసర్లు, 27 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 16 మంది అసోసియేట్ డీన్స్, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, ఐదుగురు యూనివర్శిటీ ఆఫీసర్లు, ముగ్గురేసి చొప్పున అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లతో పాటు అసిస్టెంట్ రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్లను కూడా బదిలీ చేశారు. మరికొంత మందిని బదిలీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.నిబంధనలకు పాతరేసి..సర్వీస్ రూల్స్‌ను సైతం బేఖాతరు చేస్తూ కేవలం రాజకీయ ఒత్తిళ్లతోనే బదిలీలు చేస్తున్నారని అధ్యాపకులు వాపోతున్నారు. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఉన్నఫళంగా దూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా శాస్త్రవేత్తలు, అధికారుల కుటుంబ, ఆరోగ్య పరిస్థితులను సైతం పట్టించుకోకుండా బదిలీ చేస్తున్నారని వాపోతున్నారు. తిరుపతి ఎస్వీ అగ్రి కల్చరల్ కళాశాల, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో పనిచేస్తున్న 15 మంది అధ్యాపకులు, శాస్త్రవే త్తలను 300 నుంచి 500 కిలోమీటర్ల దూరం ఉన్న పరిశోధన కేంద్రాలు, కళాశాలలకు బదిలీ చేశారని, పైగా వెంటనే విధుల నుంచి రిలీవ్ చేసి బదిలీ చేసిన స్థానాలలో చేరాలని ఆదేశించారని తెలిపారు. గతంలో బదిలీ చేయాలని బతిమిలాడినా పట్టించుకోని వర్శిటీ ఉన్నతాధికారులు ఇప్పుడు ఎడాపెడా బదిలీలు చేస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. అధికార పార్టీ నేతలు వారికి అనుకూలమైన వారికి పోస్టింగ్‌లు ఇప్పించుకునేందుకు మౌఖికంగా ఆదేశించిన వెంటనే బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ బదిలీలు చేస్తున్నారని, ఆ స్థానాల్లో నేతలకు అనుకూలమైన వారికి పోస్టింగ్‌లు ఇప్పించుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. శాస్త్రవేత్తలను ఇష్టానుసారం బదిలీ చేయడం వలన ఆ ప్రభావం పరిశోధనలపై పడుతుందని చెబుతున్నారు. పవిత్రమైన విద్యాలయాల్లో మితివీురిన రాజకీయజోక్యం సరికాదని విద్యా నిపుణులు హితవు పలుకుతున్నారు. -
వ్యవసాయంలో స్థిరత్వాన్ని సాధించాలి
బాపట్ల: వ్యవసాయంలో స్థిరత్వాన్ని సాధించడం కోసం వినూత్న విధానాలను రూపొందించేందుకు విద్యార్థులు కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ సూచించారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలోని డా.బి.వి.నాథ్ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ 56వ స్నాతకోత్సవ సభలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ మంటే కేవలం ఆహారోత్పత్తి మాత్రమే కాదని, జీవితాన్ని పోషించడమనే వాస్తవాన్ని విద్యార్థులంతా గ్రహించాలని గవర్నర్ సూచించారు. నేర్చుకోవడమనేది నిరంతర ప్రక్రియ అని, దాన్ని ఎప్పటికీ ఆపొద్దని, వ్యవసాయ రంగ భవిష్యత్ విద్యార్థుల భుజస్కంధాలపైనే ఆధారపడి ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో వస్తున్న అనూహ్య మార్పులను అర్ధం చేసుకుంటూ, సృజనాత్మకతతో మేధస్సును పెంచుకోవాలని సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం కీలకపాత్ర పోషిస్తోందని, ఇది మనం గర్వించదగ్గ విషయమన్నారు. పెరుగుతున్న జనాభా, వాతావరణ ప్రతికూల పరిస్థితులు వ్యవసాయ రంగాన్ని ప్రశ్నిస్తున్నా... విద్యార్థులు తమ భవిష్యత్‌కు బాటలు వేసుకుంటూ, డ్రోన్, రిమోట్ సెన్సింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్వంటి నూతన సాంకేతికతలను క్షుణ్ణంగా నేర్చుకుని రైతు సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు తమ చదువును పుట్టిన గ్రామాల సౌభాగ్యానికి వినియోగిస్తే వికసిత భారత్ సాధ్యపడుతుందన్నారు. అనంతరం విశ్వవిద్యాలయ నివేదికను వర్సిటీ ఉప కులపతి డాక్టర్ ఆర్.శారద జయలక్ష్మీ దేవి సమర్పించగా, ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డా.హిమాన్షు పాఠక్ కళాశాల, విశ్వవిద్యాలయ ఉన్నతిని కొనియాడారు. అవార్డుల ప్రదానోత్సవ సభను యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా.జి.రామచంద్ర రావు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ, కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వి. శ్రీనివాసరావు, యూనివర్సిటీ అధికారులు, వివిధ కళాశాలల అసోసియేట్ డీన్లు, ప్రొఫెసర్లు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. -
కొత్త వరి వంగడాలు ఆయన చలవే..
సాక్షి, అమరావతి : ‘2004లో వైఎస్ సీఏంగా బాధ్యతలు చేపట్టే సమయానికి నేను మార్టేరు పరిశోధనా కేంద్రంలో ప్రిన్సిపల్ ౖసైంటిస్ట్గా పనిచేస్తున్నా. సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే ఆయన మా కేంద్రానికి వచ్చారు. పరిశోధనలు బాగా పెరగాలి. వాటి ఫలాలు రైతులకు మరింత వేగంగా చేరాలంటే ఏం చేస్తే బాగుంటుందో చెప్పండన్నారు. రూ.100 కోట్లు ఇవ్వండి అని నేను అడగ్గానే పక్కనే ఉన్న మంత్రి రఘువీరారెడ్డి మన దగ్గర డబ్బుల్లేవన్నారు. భలే చెబుతావయ్య అంటూ అక్కడికక్కడే రూ.50 కోట్లు శాంక్షన్ చేశారు. వాటితో పరిశోధనా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాం. ఫలితంగా కొత్త రకాలను సృష్టించగలిగాం. ఉత్పత్తిని పెంచగలిగాం. ఈరోజు వందల సంఖ్యలో కొత్త రకాల విత్తనాలు మార్కెట్లోకి వస్తున్నాయంటే ఇదంతా ఆయన చలవే’ అని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పూర్వపు వీసీ, ఐసీఏఆర్ గవర్నింగ్ బాడీ మాజీ సభ్యుడు ప్రొ. పోలి రాఘవరెడ్డి అన్నారు. మహానేత హయాంలో డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్‌గా, వీసీగా సేవలందించిన డాక్టర్ రాఘవరెడ్డి ఆ మహానేతతో తనకున్న సాన్నిహిత్యం, ఆయన హయాంలో విద్యా రంగానికి జరిగిన మేలుపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ఏటా అదనంగా వంద కోట్లు..: వర్సిటీలకు ఆనాడు రూ.400 కోట్ల బడ్జెట్ ఉండేది. ఇది ఏమాత్రం సరిపోవడం లేదని చెప్పడంతో కేంద్రంౖపై ఒత్తిడి తెచ్చి వర్సిటీకి ఏటా రూ.100 కోట్లు అదనంగా మంజూరు చేయించారు. ‘విత్తన గ్రామాల’కు నాంది పలకడమే కాదు రివాల్వింగ్ ఫండ్ పేరిట రూ.20 కోట్లు ఇచ్చారు. ఉత్పత్తి చేసిన విత్తనాలను అమ్మగా వచ్చిన ఆదాయంతో విస్తరణ కార్యక్రమాలు చేపట్టండి అని వైఎస్ సూచించారు. ఆ నిధులు ఇప్పుడు రూ.100 కోట్లకు పైగా ఉన్నాయి. సాగులో రైతులకు తోడుగా నిలవాలన్న ఆలోచనతో దేశంలోనే తొలిసారి ల్యాబ్ టూ ల్యాండ్ అంటూ శాస్త్రవేత్తల బృందాలను పల్లెలకు పంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పొలం బడులకు నాంది పలికారు. వ్యవసాయ వర్సిటీలో సీట్ల పెంపు..: వ్యవసాయ విద్యను మెరుగుపర్చాలంటే ఏం చేయాలని ఓ రోజు వైఎస్ అడిగారు. ఆయన వచ్చేటప్పటికి వర్సిటీ పరిధిలో 400–500 సీట్లు మాత్రమే ఉండేవి. వాటిని 1,000 సీట్లకు పెంచాలని సూచించగానే క్షణం ఆలోచించకుండా పెంచేద్దామన్నారు. స్థానిక ప్రజలకిచ్చిన హామీ మేరకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్యాన వర్సిటీ పెడదామని ఆయన అనగా.. అవసరంలేదని నేను చెప్పా. ‘లేదు రాఘవ.. నేను మాటిచ్చాను. పెట్టాల్సిందే’ అంటూ 250 ఎకరాల్లో అత్యాధునిక వసతులతో వర్సిటీని ఏర్పాటుచేశారు. తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీ ఆయన హయాంలో ఏర్పాటైనవే. వైఎస్ హయాంలో రాజమండ్రి, జగిత్యాలలో కొత్త కళాశాలలు వచ్చాయి. బాపట్లలో మాత్రమే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కళాశాల ఉండేది. వైఎస్ హయాంలో కొత్తగా అనంతపురం జిల్లా మడకసిరి, రంగారెడ్డిలలో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుచేశారు. పులివెందులలో కొత్తగా కాలేజ్ ఆఫ్ ఫుడ్‌సైన్స్ అండ్ టెక్నాలజీని తీసుకొచ్చారు. ఇక వర్సిటీ పరిధిలో సుమారు 5వేల మంది రైతు కూలీలు రోజువారీ వేతనాలతో పనిచేసేవారు. వీరికి క్లాస్–4 ఎంప్లాయిస్‌కు సమానంగా జీతభత్యాలు ఇవ్వడమే కాదు.. వారికి పింఛన్ సౌకర్యం కూడా కల్పించారు. రైతు మోములో చిరునవ్వులు చూడాలి. అవే మనకు గొప్ప అవార్డులు.. అన్న ఆయన మాటలు నాకు ఇప్పటికీ గుర్తు. -
చెరుకు రైతులకు చేదు నుంచి విముక్తి! టన్ను నరివేతకు రూ.400
సాక్షి, అమరావతి: చెరకు రైతులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న కూలీల కొరతను అధిగమించేందుకు అత్యాధునిక యంత్రం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న యంత్రాల్లోని సాంకేతిక లోపాలను అధిగమించేలా దీన్ని రూపొందించారు. ఈ యంత్రం కూలీల కొరతవల్ల రైతులు పడుతున్న వెతలకు చెక్ పెట్టడమే కాదు.. కోత వ్యయాన్ని సగానికిపైగా తగ్గిస్తుంది. దేశంలో ప్రధానమైన వాణిజ్యపంటల్లో చెరకు ఒకటి. దేశవ్యాప్తంగా 48.51 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. మన రాష్ట్రంలో 55 వేల హెక్టార్లలో చెరకు సాగుచేస్తున్నారు. ఏటా పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులతో పాటు కూలీల కొరత, కొత్తగా పుట్టుకొస్తున్న చీడపీడలు (పసుపు ఆకు, వైరస్ తెగుళ్లు) రైతులను వేధిస్తున్నాయి. సాగుకాలంలో కనీసం 40 రోజులు కూలీల అవసరం తప్పనిసరి. కూలీలు లేనిదే కోత కొయ్యలేని పరిస్థితి నెలకొంది. పెట్టుబడిలో 35 శాతం కూలీలకే.. గిరాకీని బట్టి టన్ను చెరకు నరకడానికి రూ.800 నుంచి రూ.1,200 వరకు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఎకరాకు రూ.24 వేలకు పైగా కూలీల కోసమే ఖర్చు చేయాల్సి వస్తోంది. మొత్తం సాగువ్యయంలో 35 శాతంగా నమోదవుతున్న కూలీల ఖర్చు రైతులకు భారంగా మారుతోంది. అయినప్పటికీ సమయానికి కూలీలు దొరక్క రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో రకాల చెరకు కోత యంత్రాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ వాటిలోని సాంకేతిక లోపాలు చక్కెర రికవరీకి అవరోధంగా ఉంటున్నాయి. దీంతో కోత సమయంలో ఎక్కువమంది రైతులు కూలీలపైనే ఆధార పడుతున్నారు. మేలైన కోత యంత్రాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలించింది. కోల్హాపూర్‌లో వాడుకలో ఉన్న జైపూర్ వారి సూపర్ కేన్ హార్వెస్టర్‌ను అధ్యయనం చేశారు. కాస్త మార్పులు చేసి మన ప్రాంతానికి, మన రైతులకు అనుకూలంగా తీర్చిదిద్దారు. ఎలా పనిచేస్తుందంటే.. ఈ సూపర్ కేన్ హార్వెస్టర్ చెరకును నేలమట్టానికి నరికి చక్కెర కర్మాగారానికి తరలించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పైగా చక్కెర రికవరీకి ఏమాత్రం ఢోకా ఉండదు. ఈ హార్వెస్టర్ కింద, పై భాగాల్లో రెండు కట్టర్ బ్లేడులతో పాటు ఒక డిట్రాషింగ్ యూనిట్ ఉంటాయి. కట్టర్ బ్లేడులను చెరకు పొడవును బట్టి హైడ్రాలిక్ పవర్ సహాయంతో కావాల్సిన ఎత్తుకు సర్దుబాటు చేసుకోవచ్చు. కింద భాగంలో ఉండే కట్టరు బ్లేడు చెరకును నేలమట్టానికి నరికితే పైభాగంలో ఉండే కట్టరు బ్లేడ్ చెరకు మొవ్వను కోస్తుంది. తర్వాత చెరకు గడలు బెల్ట్ సాయంతో డిట్రాషింగ్ యూనిట్లోకి వెళతాయి. ఈ యూనిట్లో చెరకు గడలకు ఉన్న ఎండుటాకులను తెంచి పూర్తిగా శుభ్రం చేస్తుంది. ఆ తర్వాత యంత్రం వెనుక భాగంలో ఉండే ట్రాలీలోకి పంపుతుంది. ఈ ట్రాలీ నుంచి సూపర్ గ్రబ్బర్ అనే యంత్రం ట్రాక్టర్లోకి లోడ్ చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియను పూర్తిగా యంత్రమే చేస్తుంది. టన్నుకు రూ.400 చెల్లిస్తే చాలు.. ఈ యంత్రం ధర మార్కెట్లో రూ.33 లక్షలుగా ఉంది. 75 హెచ్‌పీ ట్రాక్టర్ రూ.13 లక్షలు, సూపర్ గ్రబ్బర్ రూ.4 లక్షలు కలిపి మొత్తం రూ.50 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ యంత్రం గంటకు 3–4 టన్నుల చొప్పున రోజుకు 25 టన్నుల చెరకును సునాయాసంగా నరికేస్తుంది. ఎక్కడికైనా ఈజీగా తరలించవచ్చు. ఈ యంత్రం సాయంతో చెరకు నరికేందుకు టన్నుకు రూ.400 చొప్పున వసూలు చేస్తున్నారు. సరాసరి చెరకు దిగుబడి ఎకరాకు 30 టన్నులుగా తీసుకుంటే కూలీలతో నరికితే టన్నుకు రూ.800 చొప్పున రూ.24 వేలు ఖర్చవుతుంది. అదే ఈ యంత్రంతో నరికితే టన్నుకు రూ.400 చొప్పున 30 టన్నులకు రూ.12 వేలకు మించి ఖర్చవదు. అంటే కూలీలతో నరికించే దానికంటే ఖర్చును 50 శాతం వరకు తగ్గిస్తుంది. కూలీల వెతలుండవు సూపర్ కేన్ హార్వెస్టర్ మన ప్రాంతానికి, మన రైతులకు చాలా అనుకూలమైనది. చాలా ఈజీగా వినియోగించవచ్చు. ఏళ్ల తరబడి రైతులెదుర్కొంటున్న కూలీల వెతలకు పూర్తిగా చెక్ పెట్టొచ్చు. కోత ఖర్చు సగానికిపైగా తగ్గిపోతుంది. ఈ యంత్రంతో కోత కోస్తే చక్కెర రికవరీ శాతం పెరుగుతుందే తప్ప తగ్గే చాన్స్ ఉండదు. – డాక్టర్ పి.వి.కె.జగన్నాథరావు, వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్త, అనకాపల్లి -
ఎన్జీ రంగా వర్సిటీ సేవలు దేశానికి అవసరం
తిరుపతి ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్‌లో సాగయ్యే వివిధ పంటలకు నూతన వంగడాలు రూపొందించడం, కొత్త సాంకేతికతను అందించడం, దేశ ఆహార భద్రతను సాధించడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సేవలు దేశానికి ఎంతో అవసరమని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారు. తిరుపతిలోని వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో బుధవారం వీసీ డాక్టర్ ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి అధ్యక్షతన అధ్యాపకులు, విద్యార్థులతో చర్చాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని 74 వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీ 11వ స్థానంలో నిలవడంలో అధికారులు, శాస్త్రవేత్తలు, అధ్యాపకుల పాత్ర కీలకమని చెప్పారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, శాస్త్రవేత్తల కృషి ఫలితంగా దేశం ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించడమేగాక ఆహారధాన్యాలు, వివిధ పంట ఉత్పత్తులను ఎగుమతి చేయగలుగుతోందన్నారు. వరిసాగు విస్తీర్ణంలో సగం సాగు ఈ వర్సిటీ రూపొందించిన విత్తనాలే.. వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన వరి విత్తనాలు బి.పి.టి–5204 (సాంబమసూరి), స్వర్ణ, విజేత, వేరుసెనగ విత్తనాలు కె–6, ధరణి వంటి రకాలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయని చెప్పారు. దేశంలో వరిసాగులో దాదాపు సగం విస్తీర్ణంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన విత్తన రకాలే సాగవుతున్నట్లు తెలిపారు. దేశంలో మొదటిసారిగా వ్యవసాయ విద్యలో గ్రామీణ అనుభవ పథకాన్ని ప్రవేశపెట్టడం, వ్యవసాయరంగంలో డ్రోన్ల వినియోగం వంటి ఆవిష్కరణలు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను అమలు చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో 14.5 శాతం వృద్ధి సాధించినట్లు చెప్పారు. ఇటీవల కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రకటించిన గౌరవ డాక్టరేట్‌ను మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అంబటి రాంబాబు, వర్సిటీ వీసీ డాక్టర్ ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీలు పి.వి.మిథున్‌రెడ్డి, డాక్టర్ ఎం.గురుమూర్తి, ఎన్.రెడ్డప్ప, శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ వీసీ డాక్టర్ వి.పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి సేద్యంలో ‘ఆచార్య’
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా అమల్లో ఉన్న ప్రకృతి వ్యవసాయం(ఏపీసీఎన్ఎఫ్)లో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న రైతు సాధికార సంస్థ(ఆర్.వై.ఎస్.ఎస్.) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ ఏడాది నుంచి ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించనుంది. ఈ ఖరీఫ్ నుంచి రాష్ట్రంలోని ఆరు వ్యవసాయ పర్యావరణ జోన్లలోని వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో ఆర్.వై.ఎస్.ఎస్. సూచించిన రీతిలో ప్రకృతి వ్యవసాయం చేపట్టనున్నారు. ‘అనంత’లో పర్యటన ఎంపిక చేసిన ప్రకృతి వ్యవసాయదారుల క్షేత్రాల్లో సాగు తీరుతెన్నులను నిరంతరం పరిశీలిస్తూ ఖర్చు, ఆదాయం, ఇతరత్రా ప్రయోజనాలపై ఆర్.వై.ఎస్.ఎస్.తో కలిసి కచ్చితమైన గణాంకాలను నమోదు చేసేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం సన్నద్ధమవుతోంది. ఈ సన్నాహాల్లో భాగంగా వర్సిటీ పరిశోధనా సంచాలకులు డా. ప్రశాంతి, 6 జోన్లలోని వ్యవసాయ పరిశోధనా స్థానాలకు చెందిన పది మంది శాస్త్రవేత్తలు, పలువురు రైతులు శుక్ర, శనివారాల్లో అనంతపురం జిల్లాలో పర్యటించి వర్షాధార భూముల్లో అనుసరిస్తున్న వినూత్న ప్రకృతి సేద్య పద్ధతులను పరిశీలించారు. సాధారణంగా 20 ఎం.ఎం. వర్షం కురిసిన తర్వాతే విత్తనం విత్తుకోవటం పరిపాటి. అయితే పంట వ్యర్థాలను ఆచ్ఛాదనగా వేసి వర్షాలకు ముందే విత్తనం వేయటం (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్–పీఎండీఎస్), 365 రోజులూ పొలంలో బహుళ పంటలు సాగు చేయటం అనే వినూత్న పద్ధతులను అనంతపురం జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం గత మూడేళ్లుగా పలువురు రైతులతో అనుసరింపజేస్తోంది. అనంతపురం డీపీఎం లక్ష్మణ్‌నాయక్ ఈ పద్ధతులను వర్సిటీ బృందానికి వివరించారు. ఇప్పటికే ఈ పద్ధతులను అనుసరిస్తున్న రైతుల వర్షాధార వ్యవసాయ క్షేత్రాలకు తీసుకువెళ్లి చూపించారు. మండుటెండల్లోనూ రక్షక తడుల సహాయంతో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఏడాది పొడవునా బహుళ పంటలు పండిస్తుండటాన్ని వర్సిటీ బృందం పరిశీలించింది. విత్తనాలు వేసిన తర్వాత శనగ పొట్టును ఆచ్ఛాదనగా పోస్తున్న దృశ్యం ఎకరానికి రూ.50 వేల ఆదాయం రైతు దంపతులు స్వయంగా పనులు చేస్తారు కాబట్టి వారి కష్టం, రక్షక తడులకు పోనూ ఎకరానికి రూ. 50 వేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందని ఎన్జీరంగా వర్సిటీ పరిశోధనా సంచాలకులు డా. ప్రశాంతి ‘సాక్షి’కి తెలిపారు. వ్యవసాయ పంటలకన్నా ఉద్యాన పంటలే రైతులకు ఈ పద్ధతుల్లో లాభదాయకంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ ఏడాది నుంచి పీఎండీఎస్, 365 రోజులు పంటలు పండించే పద్ధతులను ఆర్.వై.ఎస్.ఎస్. సూచించిన పద్ధతుల్లో వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో కూడా సాగు చేసి ఫలితాలను క్రోడీకరిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఎంపిక చేసిన ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలలో సాగు తీరును, ఖర్చు, పంట దిగుబడులను కూడా పరిశీలించి గణాంకాలను రూపొందిస్తామని తెలిపారు. పీఎండీఎస్ పద్ధతిలో నవధాన్యాల సాగును ప్రకృతి వ్యవసాయ విభాగం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీకేల ద్వారా రైతులకు సూచిస్తోంది. పీఎండీఎస్ అంటే? ప్రధాన పంట సాగుకు ముందు భూమిని సారవంతం చేయటానికి 25 రకాల విత్తనాలను సాగు చేస్తారు. ఈ విత్తనాలకు బంకమట్టి, ఘనజీవామృతం, బూడిద, ద్రవ జీవామృతంతో లేపనం చేసి గుళికల మాదిరిగా తయారు చేస్తారు. ఈ విత్తన గుళికలను ఎండాకాలంలో పొడి దుక్కిలోనే వర్షానికి ముందే విత్తుతారు. ఈ గుళికలు కొద్దిపాటి వర్షానికే మొలుస్తాయి. పూత దశ (45–50 రోజులకు)లో ఈ పంటను కోసి పొలంలోనే ఆచ్ఛాదనగా వేస్తారు లేదా పశువుల మేతగా ఉపయోగిస్తారు. భూమిని సారవంతం చేయటానికి పండించే ఈ పంటను నవధాన్య పంట అని కూడా అంటారు. ఈ పంటను కోయటానికి ముందే ఖరీఫ్‌లో ప్రధాన పంటగా సాగు చేయదలచిన పంట విత్తనాలను పై విధంగా గుళికలుగా చేసి విత్తుకొని ఆ తర్వాత ఈ పంటను కోస్తారు. -
రెండు రకాల అగ్రి డ్రోన్లు.. ఉపయోగాలివే!
సాక్షి, అమరావతి: వ్యవసాయపనుల్లో సాంకేతిక పరికరాల వినియోగం ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోంది. మనుషులపై దుష్ప్రభావం చూపే రసాయన ఎరువులు, పురుగు మందుల పిచికారీ వంటి పనులకు డ్రోన్లను ఉపయోగించడం మన దేశంలో కూడా మొదలైంది. ఇప్పుడు ఇలాంటి డ్రోన్లను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేస్తోంది. ఆ వివరాలను వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. డ్రోన్ల వినియోగంపై జాతీయ స్థాయి మార్గదర్శకాలను యూనివర్సిటీ పాటిస్తుందన్నారు. టెక్నాలజీ వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీలో యూనివర్సిటీకి కూడా సభ్యత్వం ఉందన్నారు. తాము అభివృద్ధి చేసిన డ్రోన్లకు అనుమతుల ప్రక్రియ పూర్తయిందన్నారు. 2024 నాటికి దేశ వ్యాప్తంగా బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. ఆయన ఇంకా ఏమి చెప్పారంటే.. మానవ శ్రమ తగ్గించడానికే.. పంటల ఉత్పత్తి పెంచడానికి రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం తప్పనిసరి. అయితే ఈ పని రైతులకు ఖర్చుతో, శ్రమతో కూడుకున్నది. అంతేగాక వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయంలో రైతులకు సాయం చేయడానికి కృత్రిమ మేధస్సుతో కూడిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అలా తెరపైకి వచ్చిందే డ్రోన్ వినియోగం. 3 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా.. ఈ ఏడాదిలో రాష్ట్రంలోని గుంటూరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో డ్రోన్లను వినియోగించాలని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. యూనివర్సిటీకి చెందిన సుమారు 10 వేల ఎకరాల్లో డ్రోన్లతో పురుగుమందులు, ఎరువులను చల్లిస్తారు. పంటల స్థితిగతులను గుర్తించి అవసరమైన చర్యలు సూచిస్తారు. ఇందుకోసం 6 డ్రోన్లను సేకరించనున్నారు. వరి, పత్తి, మొక్కజొన్న, మినుము, పెసర, శనగ, వేరుశనగ, చెరకు పంటల్లో ఆ డ్రోన్లను వినియోగిస్తారు. డ్రోన్లతో ఉపయోగాల్లో కొన్ని.. మనుషులతో కన్నా 60 శాతం వేగంగా పూర్తవుతుంది. అవసరమైన ప్రాంతాన్ని గుర్తించి పురుగు మందులను పిచికారీ చేయవచ్చు. నష్టం కలగకమునుపే చీడపీడలను గుర్తించి తదనుగుణంగా చర్యలు తీసుకోవచ్చు. ప్రకృతి వైపరీత్యాలతో జరిగిన నష్టాన్ని డ్రోన్ చిత్రాలతో త్వరితగతిన అంచనా వేయవచ్చు. ఎన్నిసార్లయినా ఉపయోగించవచ్చు. పంటల స్థితిని ఛాయా చిత్రాలతో గుర్తించవచ్చు సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. పంటల ప్రణాళిక, భూ నిర్వహణకు కూడా తోడ్పడుతుంది. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చు. రెండు రకాల డ్రోన్లు.. ప్రస్తుతం అగ్రి వర్సిటీ ఆధ్వర్యంలో రెండు రకాల డ్రోన్లు అభివృద్ధి చేశారు. పురుగు మందుల పిచికారీకి పుష్పక్–1, ఎరువులు, విత్తనాలు చల్లడానికి పుష్పక్–2. క్వాడ్‌కాప్టర్ (డ్రోన్) మొత్తం 8 కిలోల బరువు మోయగలదు. ఆటోమేటిక్ స్ప్రేయింగ్ మెకానిజంతో అగ్రికల్చర్ డ్రోన్లను రూపొందించారు. క్వాడ్‌కాప్టర్ సిస్టమ్‌కు స్ప్రేయర్ మాడ్యూల్‌ను అనుసంధానం చేయాలి. పీఐసీ మైక్రో కంట్రోలర్ సాంకేతికతతో సులువుగా పురుగుమందులు, ఫలదీకరణ ప్రభావాలను గుర్తించవచ్చు. పంట విస్తీర్ణం, సరిహద్దులను రిమోట్ సెన్సింగ్ చిత్రాల ద్వారా గుర్తించవచ్చు. చదవండి: Vijayawada: వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్ -
ఉద్యాన పాలిటెక్నిక్‌లో ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
తాడేపల్లిగూడెం: ఉద్యాన పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశాలకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి గల అభ్యర్థుల నుంచి ఈ నెల 18 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. ఈ డిప్లమో పూర్తి చేసిన విద్యార్థులు విలేజ్ హార్టీకల్చర్ అసిస్టెంట్లుగా చేరడానికి అవకాశాలు రావడంతో పాటు సొంతంగా ఉద్యాన నర్సరీలు ఏర్పాటు చేసుకోడానికి మార్గాలున్నాయి. ఉద్యాన డిప్లమో రెండేళ్ల కోర్సు పూర్తయిన తర్వాత హార్టీసెట్‌లో ర్యాంక్ వస్తే, బీఎస్సీ హార్టీకల్చర్ కోర్సులను అభ్యసించే అవకాశం ఉంటుంది. దరఖాస్తుకు అర్హతలు పదో తరగతి తత్సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులైన రాష్ట్రంలోని విద్యార్థులు మాత్రమే ఈ కోర్సు చేయడానికి అర్హులు. పదో తరగతి కంపార్టుమెంట్లో ఉత్తీర్ణులైనవారు, ఇంటర్మీడియట్ ఫెయిలైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ ఉత్తీర్ణులైన వారు, దాని కంటే పై చదువులు చదివిన వారు అర్హులు కారు. పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో కనీసం 5 గ్రేడ్ పాయింట్ యావరేజ్ (హిందీతో కలిపి) సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ చాలెంజ్డ్ అభ్యర్థులు కనీసం 4 గ్రేడ్ పాయింట్ పొంది ఉండాలి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యాన పాలిటెక్నిక్‌లతో కలిపి మొత్తం 480 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యాన పాలిటెక్నిక్‌లలో 200 సీట్లు, ప్రైవేట్ ఉద్యాన పాలిటెక్నిక్‌లలో 280 సీట్లు ఉన్నాయని తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ టి.జానకిరామ్ తెలిపారు. ప్రవేశాలు, కోర్సు వివరాల విషయంలో సందేహాలుంటే డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఏఎస్ పద్మావతమ్మను 73826 33640 నంబర్లో సంప్రదించవచ్చు. -
ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీ వీసీ అరెస్ట్
సాక్షి, గుంటూరు: గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ (వీసీ) వల్లభనేని దామోదర్ నాయుడిని ఆదివారం తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్టీ కులానికి చెందిన తనను ఉద్యోగం నుంచి తొలగించి, కులం పేరుతో దూషించి, బెదిరింపులకు గురిచేశారని ఉయ్యాల మురళీకృష్ణ గత నెల 24న తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ నిరోధక చట్టంలోని సెక్షన్ 3(1,2)తోపాటు ఐపీసీ 506 కింద వీసీని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వివరాల్లోకెళ్తే.. చిలకలూరిపేట మండలం పురుషోత్తమపట్నంకు చెందిన ఉయ్యాల మురళీకృష్ణ 2016లో ఎన్జీ రంగా వర్సిటీలో ఔట్సోర్సింగ్ విధానంలో అటెండర్‌గా చేరాడు. అతడిని ఈ ఏడాది ఏప్రిల్ 12న ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటి నుంచి తనను ఉద్యోగంలో పెట్టుకోవాలని కోరుతూ వచ్చిన మురళీకృష్ణ గత నెల 23న సచివాలయంలో వీసీ, రిజిస్ట్రార్ ఉన్నారని తెలిసి అక్కడకు వెళ్లి తనను ఉద్యోగంలో చేర్చుకోవాల్సిందిగా మరోసారి ప్రాధేయపడ్డాడు. దీంతో ఆగ్రహించిన వీసీ మరోసారి తన దగ్గరకు వస్తే అంతు చూస్తానని బెదిరించడంతోపాటు కులం పేరుతో దూషించాడని మురళీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేవలం వైఎస్సార్సీపీ సానుభూతిపరులనే కారణంతోనే మురళీకృష్ణతోపాటు అతడి భార్య విజయదుర్గను, తదితరులను కూడా ఉద్యోగం నుంచి తొలగించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. గత ఐదేళ్లూ టీడీపీపై ప్రేమతో ఓ సామాజికవర్గానికి చెందినవారినే వీసీ దామోదర్ నాయుడు ప్రోత్సహించారనే విమర్శలున్నాయి. ఇతర సామాజికవర్గాలవారు తన చాంబర్ దరిదాపుల్లోకి కూడా రావడానికి వీల్లేదని బాహాటంగానే ప్రకటించారని ఉద్యోగులు చెబుతున్నారు. వీసీ చర్యలతో అకారణంగా నష్టపోయిన ఉద్యోగులు గవర్నర్, సీఎంకు ఫిర్యాదులు చేశారు. ప్రజాప్రతినిధులు, వర్సిటీ అధికారులకు కూడా 400 ఫిర్యాదులు అందాయి. వీసీపై అందిన ఫిర్యాదులను విచారించడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం గతంలో మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్నను నియమించింది. కాగా, రెండేళ్ల కిందట ఎస్టీ ఉద్యోగిని కులం పేరుతో దూషించిన ఘటనలోనూ వీసీపై కేసు నమోదవ్వగా టీడీపీ ప్రభుత్వం దీన్ని నీరుగార్చింది. -
‘వెంకయ్య, చంద్రబాబు నా బంధువులు’
సాక్షి, విజయవాడ: ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయ వైస్ చాన్సిలర్ వివాదం గవర్నర్ వద్దకు చేరింది. యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, రైతులు మంగళవారం రాజ్‌భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. అర్హత లేకుండా అధికారం చెలాయిస్తున్న వైస్ చాన్సిలర్ దామోదర్ నాయుడిని రీకాల్ చేయాలని గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం బాధిత శాస్త్రవేత్తలు మీడియాతో మాట్లాడుతూ.. వీసీ దామోదర్ నాయుడి అంశంలో గవర్నర్ తమ ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. అర్హతలు లేకున్నా తెలుగుదేశం ప్రభుత్వం దామోదర్ నాయుడిని ఆ పదవిలో కూర్చొబెట్టిందని వారు ఆరోపించారు. కులపత్రం తప్ప వీసీగా బాధ్యతలు నిర్వహించేందుకు అవసరమైన ఏ సర్టిఫికేట్ దామోదర్ నాయుడి దగ్గర లేదన్నారు. కుల అహంకారంతో దామోదర్ నాయుడు ఇతర ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధిత శాస్త్రవేత్తలు వాపోయారు. వెంకయ్య నాయుడు, చంద్రబాబు మా బంధువలంటూ దామోదర్, ఉద్యోగులను బెదిరించి ఇబ్బంది పెడతున్నాడని వారు మండి పడ్డారు. అనుభవం లేని వ్యక్తికి పగ్గాలు ఇవ్వడం వల్ల విశ్వవిద్యాలయం ర్యాంకింగ్‌లో వెనకబడటమే కాక.. శాస్త్రవేత్తలు, రైతులు కూడా నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దామోదర్ నాయుడు యూనివర్సిటీ నిధులను యాక్సిక్ బ్యాంకుకు మళ్లించి కొడుకుకు ఉద్యోగం ఇప్పించాడని ఆరోపించారు. పది రోజుల్లో వీసీపై చర్యలు తీసుకోకపోతే.. ఎన్జీరంగా యూనివర్సిటీతో పాటు అనుబంధంగా ఉన్న అన్ని వ్యవసాయ శాలలకు తాళాలు వేసి ఆందోళనకు దిగుతామని బాధిత శాస్త్రవేత్తలు హెచ్చరించారు. -
పత్తి.. సూటి రకాలే మేటి!
ఖరీఫ్‌లో వర్షాధారంగా సాగయ్యే ప్రధాన వాణిజ్య పంట పత్తి. గత ఐదారేళ్లుగా పత్తి పంటలో దిగుబడి తగ్గిపోతున్నది. తెగుళ్లు, గులాబీ రంగు పురుగు దాడి కారణంగా ఏటికేడు దిగుబడి పడిపోతోంది. బీటీ రకాలు తెల్లబోతున్నాయి. ఇక బీటీ మాయలో పడిన రైతులు పాత రకాలను సాగు చేయడమే మరచిపోయారు. సరైన విత్తనం ఎంపిక చేసుకొని మెలకువలు పాటిస్తే నాన్ బీటీ హైబ్రిడ్ రకాలు తీసిపోవని చాటుతోంది ‘రైతు రక్షణ వేదిక’. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ రిటైర్డ్ ప్రొఫెసర్ వేణుగోపాల్, రైతు శాస్త్రవేత్త జొన్నలగడ్డ రామారావు, రైతు నేత డాక్టర్ కొల్లా రాజమోహనరావు, రైతు సంఘాల నేతలు, కొందరు అభ్యుదయ రైతులు కలిసి గుంటూరు కేంద్రంగా రైతు రక్షణ వేదికను ఏర్పాటు చేశారు. కొన్నేళ్లుగా సూటి రకాల ప్రదర్శనా క్షేత్రాలను నిర్వహిస్తూ పాత రకాల ఆవశ్యకతను తెలియ జేస్తున్నారు. బిటీ పత్తికి ప్రత్యామ్నాయంగా సూటి రకాలను ప్రోత్సహిస్తున్నారు. ‘రైతు రక్షణ వేదిక నిర్వహిస్తున్న ప్రదర్శన క్షేత్రాలను ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎన్. దామోదర నాయుడు ఇటీవల సందర్శించి సంతృప్తిని వ్యక్తం చేశారు. సూటి రకం విత్తనాలతో ఖర్చు తగ్గుతోందని, ఇతర పంటల రైతులతో పాటు పత్తి రైతులు కూడా తమ విత్తనాలను తామే తయారు చేసుకొనే విధంగా ప్రోత్సహిస్తామని ఆయన పేర్కొనడం ఆహ్వానించదగిన పరిణామం. పత్తిలో సమగ్ర సస్య పోషణ, రక్షణల ద్వారా కాయతొలిచే పురుగులతో పాటు అత్యంత బెడదగా మారిన పచ్చదోమ, తెల్లదోమల బెడద కూడా లేకుండా పోయింది. రైతులు పండించిన పత్తిలో నుంచే సేకరించిన విత్తనాలతోనే ప్రధాన వాణిజ్య పంట అయిన పత్తిని కూడా ఇతర పంటల మాదిరిగానే సాగు చేయటంలో గుంటూరుకు చెందిన రైతు రక్షణ వేదిక విజయం సాధించింది. అనేక ఏళ్ల నుంచి ఈ దిశగా కృషి చేస్తున్న వేదిక సభ్యులైన రైతులు, విశ్రాంత శాస్త్రవేత్తలు, రైతు సంఘాల కార్యకర్తలు ఈ ఖరీఫ్‌లో మరింత విస్తృతంగా నాన్ బీటీ సూటి రకం పత్తి సాగును చేపట్టడం విశేషం. సూటి రకం పత్తి విత్తనాలతో రైతుకు ఖర్చు తక్కువ, నాణ్యమైన దిగుబడి, వివిధ పురుగులను నిరోధించే అవకాశం ఉంది. 15 చోట్ల రైతుల ప్రదర్శనా క్షేత్రాలు 2018–19 సంవత్సరంలో గుంటూరు జిల్లాలో 15 ప్రదేశాల్లో సూటి రకం నాన్ బీటీ పత్తి పంటను సాగు చేస్తూ నమూనా (ప్రదర్శనా) క్షేత్రాలను ఏర్పాటు చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతం నుంచి వచ్చిన విత్తనాలనే వినియోగించి సఫలీకృతులయ్యారు. రైతులు ప్రయోగాత్మకంగా చేపట్టిన కార్యక్రమం పూర్తిస్థాయిలో విజయవంతమైంది. దీంతో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ డా. దామోదర నాయుడు, లాం ఫాం డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డా. ఎన్వీ నాయుడు, లాంఫాం శాస్త్రవేత్త డా. దుర్గాప్రసాద్ చిలకలూరిపేట మండలం మానుకొండవారిపాలెంలోని తియ్యగూర శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరెడ్డిల ప్రదర్శనా క్షేత్రాలను స్వయంగా పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. రైతులను అభినందించారు. సూటి రకం పత్తితో 30% తగ్గిన ఖర్చు రైతులు బీటీ విత్తనాలకు బదులుగా సూటి విత్తనాలు (నాన్ బీటీ) సాగు చేస్తే 30 శాతం ఖర్చు తగ్గుతుంది. ఆశించిన దిగుబడి లభిస్తుంది. రైతులు సూటీ పత్తిని సాగు చేయటంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని రైతు రక్షణ వేదిక నేతలు తెలిపారు. గుంటూరు జిల్లాలోని గుంటూరు రూరల్, వట్టిచెరుకూరు, కొర్నెపాడు, ప్రత్తిపాడు, పెదనందిపాడు, చిలకలూరిపేట, ఫిరంగిపురం, మంగళగిరి తదితర ప్రాంతాల్లోని 650 ఎకరాల్లో ఈ ఖరీఫ్‌లో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. రైతులు నంద్యాల నుంచి ఎన్‌డీఎల్‌హెచ్–1938, రైతు రక్షణ–02 నాన్‌బీటీ సూటి రకాల పత్తిని సాగు చేస్తున్నారు. లాంఫాం, కృషి విజ్ఞాన కేంద్రం, డాట్ సెంటర్లకు చెందిన శాస్త్రవేత్తలు అందుబాటులో ఉండి సూచనలు సలహాలు అందిస్తారన్నారు. సూటి రకాల సేంద్రియ సాగు ఇలా.. దుక్కిలో పశువుల ఎరువుతో కలిపిన వామ్(జీవన ఎరువు) ఎకరానికి ఐదు కేజీలు వేయాలి. చివరి దుక్కిలో ఎకరానికి వేప పిండి రెండు క్వింటాళ్ళు వేయాలి. నాన్ బీటీ సూటి రకం పత్తి విత్తనాలు విత్తుకోవాలి. నాన్‌బీటీ విత్తనాలు సాగులో ఉన్న పొలం చుట్టూ జొన్న, కొర్ర, ఆముదం మొక్కలు రెండు – మూడు సాళ్ళు(వరుసలు) రక్షక పంటగా వేయాలి. పత్తి మొక్క దశలో రెండు విడతలు వేపనూనె, మోనోక్రోటోఫాస్, మిథైల్ ఆల్కాహాల్ కలిపిన ద్రావణాన్ని కాండానికి కుంచెతో పూయాలి. వేప కషాయాన్ని మరగబెట్టగా వచ్చిన ద్రావణాన్ని పిచికారీ చేస్తే జల్లెడ పురుగు, తెల్లదోమ గూడ పురుగులను అదుపులోకి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. గులాబీ రంగు పురుగు నివారణకు ఒక ఎకరానికి 10 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలి. సూటి పత్తిలో కొర్ర, అలసంద, మినుము తదితర అంతర పంటలను సాగు చేసుకునే వెసులుబాటు ఉంది. నీటి వసతి అందుబాటులో ఉన్న రైతులు నెలకు ఒక విడత చొప్పున ఆరుతడులు అందిస్తే మరింత ప్రయోజనం ఉంటుంది. ఈ విధంగా చేస్తే పత్తి దిగుబడులు హైబ్రిడ్ పత్తికి దీటుగానే వస్తాయని రైతు రక్షణ వేదిక రైతులు అనుభవపూర్వకంగా చెబుతున్నారు. ఈ సూటి రకాల పత్తి పింజ పొడవు, నాణ్యత బాగానే ఉంటుంది. అధిక శాతం రైతులు ఈ పత్తిని సాగు చేస్తే మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని వారు అంటున్నారు. దిగుబడుల్లో రాజీ పడకుండానే కంపెనీల విత్తనాలను పక్కన పెట్టి సొంత సూటి రకం పత్తి విత్తనం వాడుకునే సత్సాంప్రదాయానికి బాటలు వేస్తున్న రైతు రక్షణ వేదిక సభ్యులైన రైతులు అభినందనీయులు. వర్షం తక్కువైనా ఏపుగా పెరిగింది! నంద్యాల నుంచి తీసుకు వచ్చిన సాధారణ విత్తనాలతో 2.50 ఎకరాల్లో పత్తిని సాగు చేశాం. పత్తి పొలం చుట్టూ ఇతర పురుగులు రాకుండా జొన్న విత్తనాలు నాటాం. గులాబీ రంగు పురుగు, పచ్చదోమ, తెల్లదోమ తదితర క్రిమి కీటకాలు రాలేదు. వర్షం తక్కువగా పడినా పంట ఏపుగా పెరిగింది. ఆశించిన స్థాయిలో పూత ఉంది. బీటీ తరహాలోనే దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాం. శాస్త్రవేత్తలు పరిశీలించి పలు సూచనలు, సలహాలు అందించారు. --తియ్యగూర వెంకటేశ్వరరెడ్డి (97044 97442), రైతు, మానుకొండవారిపాలెం, చిలకలూరిపేట రూరల్ రసాయనాల్లేని సాగులో బీటీకి మించిన దిగుబడి రైతులు పండించిన పత్తి పంట ద్వారా వచ్చిన విత్తనాలనే వినియోగించి ప్రయోగాత్మకంగా పరిశీలించాం. పంట ఆశాజనకంగా ఉంది. రసాయనిక ఎరువులు, పురుగు మందులను వినియోగించలేదు. అయినా, పంట ఎదుగుదల ఆశాజనకంగానే ఉంది. బీటీకి మించిన దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా క్షేత్రోత్సవాలను నిర్వహించి ప్రచారం కల్పిస్తాం. ఈ పద్ధతిలో సాగు చేసే రైతులకు చేయూతనందిస్తాం. – డాక్టర్ కొల్లా రాజమోహనరావు (90006 57799), సమన్వయకర్త, రైతు రక్షణ వేదిక, గుంటూరు సూటి రకాలు గులాబీ పురుగునూ తట్టుకున్నాయి! పక్కపక్కన పొలాల్లో సాగు చేసిన సూటి రకం, బీటీ రకం పత్తి పంటల్లో స్పష్టమైన తేడాను గమనించవచ్చు. రైతు రక్షణ వేదిక ఆధ్వర్యంలో కంపెనీ బీటీ హైబ్రిడ్ పత్తి విత్తనాలకు ప్రత్యామ్నాయంగా సూటి రకం నాన్ బీటీ విత్తనాలను రైతులకు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. నంద్యాల–1938 రకం, రైతు రక్షణ–02 అనే నాన్ బీటీ సూటి రకాల విత్తనాలు రసం పీల్చే పురుగులతో పాటు గులాబీ రంగు పురుగుల బెడదను తట్టుకున్నాయి. దీంతో పాటు రైతు రక్షణ వేదిక ద్వారా తయారైన హైబ్రిడ్‌ను కూడా సరఫరా చేస్తున్నాం. రైతు రక్షణ వేదిక ద్వారా తయారుచేసే హైబ్రిడ్ ప్రత్యామ్నాయ రకం వెరైటీని ప్రోత్సహిస్తే రైతుకు స్వావలంబన కలుగుతుంది. రసాయనిక వ్యవసాయం వల్ల వ్యవసాయ ఖర్చులు ఎక్కువై నష్టం జరుగతోంది. జీవన ఎరువులు, పశువుల ఎరువును వాడుకుంటే రసాయన ఎరువులను ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. – ప్రొఫెసర్ వేణుగోపాల రావు (94900 98905), విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త, రైతు రక్షణ వేదిక మానుకొండవారిపాలెంలో పూత దశకు చేరుకున్న సూటిరకం పత్తి పొలం – ఓ.వెంకట్రామిరెడ్డి, అమరావతి బ్యూరో, గుంటూరు ఫొటోలు : లీలానంద్, చిలకలూరిపేట రూరల్ -
సేంద్రియ సాగుకు సాంకేతికత
- వ్యవసాయ శాఖ కమిషనర్ ధనుంజయరెడ్డి - ఎన్జీ రంగా వర్సిటీ పరిశోధన, విస్తరణ మండలి సమావేశం నంద్యాలరూరల్: సాంకేతిక పరిజ్ఞానంతో సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు, పాలక మండలి సభ్యులు కృషి చేయాలని ఆచార్య ఎంజీ రంగా వర్సిటీ డైరెక్టర్, వ్యవసాయశాఖ రాష్ట్ర కమిషనర్ ధనుంజయరెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ వైఎస్సార్ సెంటనరీ హాల్లో ఆదివారం ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ 46వ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరయ్యారు. వ్యవసాయ, వాటి అనుబంధ పంటలు, పశుసంవర్ధక, మత్స్య, అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే 13 ఏరువాక, 12 కృషి విజ్ఞాన, 5 ప్రాంతీయ పరిశోధన విభాగాలున్నాయని చెప్పిన ఆయన సాంకేతిక పరిజ్ఞాన పరిశీలన క్షేత్రాలు ఇంకా విస్తరించి నూతన వంగడాలను ఉత్పత్తి చేయాలన్నారు. కార్పొరేట్ సంస్థలకు «ధీటుగా పరిశోధన స్థానాల్లో నూతన వంగడాలను ఉత్పత్తి చేసి అంతర్జాతీయ స్థాయికి తీసుకొని రావాలన్నారు. అందుకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పరిశోధన, విస్తరణ సంచాలకులు డాక్టర్ ఎన్వీ నాయుడు, డాక్టర్ రాజారెడ్డి యూనివర్సిటీ పరి«ధిలో 2015-16లో చేపట్టిన అంశాలను సలహా మండలి సమావేశంలో వివరించారు. 2016-17లో పరిశోధనలు, విస్తరణలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన కార్యక్రమాలను ఈ సమావేశాల్లో నిర్ణయిస్తామన్నారు. సమావేశంలో పాలక మండలి సభ్యులు మేకల లక్ష్మినారాయణ, డాక్టర్ దామోదర్‌నాయుడు, మురళీధర్‌రెడ్డి, మీసాల గీత, భూదేవి, నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ డాక్టర్ గోపాల్‌రెడ్డి, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, కృషి విజ్ఞాన కేంద్రాల పర్యవేక్షకులు పాల్గొన్నారు. -
రైతుల అభివృద్ధికి మరిన్ని పరిశోధనలు
– వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు రావాలి – రజతోత్సవంలో శాసనమండలి చైర్మన్ చక్రపాణి యాదవ్ ఎంసీ ఫారం(మహానంది): రైతుల అభివృద్ధికి మరిన్ని పరిశోధనలు అవసరమని శాసనమండలి చైర్మన్ చక్రపాణియాదవ్ అన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాల రజతోత్సవాల ముగింపు సందర్భంగా రూ. 6.50కోట్లతో నిర్మించనున్న పీజీ భవనం, బాలుర, బాలికల వసతి గృహాల నిర్మాణాలకు భూమి పూజలు చేశారు. వ్యవసాయ విశ్వ విద్యాలయం బోర్డు సభ్యుడు, బగనానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా చక్రపాణి యాదవ్ మాట్లాడారు. ఉత్సవాల్లో తీసుకున్న నిర్ణయాలను తనకు పంపితే ఫిబ్రవరి–మార్చి బడ్జెట్ సమావేశంలో తగిన నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. బీఎస్సీ వ్యవసాయం కోర్సును ఐసీఏఆర్ ఫ్రొఫెషనల్ కోర్సుగా గుర్తింపు ఇచ్చిన సందర్భంగా వ్యవసాయ కళాశాల వారు తయారు చేసి రూపొందించిన కేటలాగ్‌ను విడుదల చేశారు. అలాగే సావనీర్‌ను ఆవిష్కరించారు. సమస్యల పరిష్కారానికి కృషి.. రైతులు తలెత్తుకుని తిరిగేలా ప్రతి వ్యవసాయ విద్యార్థి సైనికుల్లా పనిచేయాలని బనగానపల్లె శాసనసభ్యులు బీసీ జనార్దన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మహానంది వ్యవసాయ కళాశాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఎన్జీరంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ తాతినేని రమేష్‌బాబు మాట్లాడుతూ.. వ్యవసాయ కళాశాలలో రూ. 6.50కోట్లతో అభివృద్ధిపనులు చేపడుతున్నామన్నారు. పనులన్నీ 18 నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మహానంది కళాశాల స్వర్ణోత్సవాలను జరుపుకోవాలని కోరారు. రాబోయే రోజుల్లో మహానంది కళాశాలలో అన్ని పీజీ కోర్సులను ప్రారంభిస్తామన్నారు. పైలాన్ ఏర్పాటుకు, ఇతర పనులకు పూర్వ విద్యార్థులు 1.60లక్షలు విరాళంగా ఇవ్వడం అభినందనీయమన్నారు. రైతులకు అండగా.. వ్యవసాయ విద్యార్థులు.. రైతు కుటుంబాలకు అండగా ఉండాలని వ్యవసాయశాఖ కమిషనర్ ధనుంజయరెడ్డి అన్నారు. మన దేశం ఇతర దేశాలపై ఆధారపడకుండా ఆహారోత్పత్తి చేస్తున్న ఘనత రైతులదే అన్నారు. వ్యవసాయంస్థూల ఉత్పత్తిలో మన రాష్ట్రం దేశంలో 28 శాతంతో ముందంజలో ఉందన్నారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం బోర్డు మెంబర్లు గణపతిరావు మాట్లాడుతూ.. అప్పుల్లో పుట్టి..అప్పుల్లో పెరిగి...వారసులకు అప్పునే వారసత్వంగా ఇస్తున్న ఏకైక వృత్తిదారులు రైతులే అని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం శాసనసభ్యురాలు, మీసాల గీత , జాతీయ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మేకల లక్ష్మినారాయణ , బోర్డు మెంబరు మురళీనా«థ్‌రెడ్డి , శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, మహానంది వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ బాలగురవయ్య, నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ గోపాల్‌రెడ్డి, ఎంపీపీ చింతం నాగమణి, పూర్వ విద్యార్థులు కేవి కిషోర్‌రెడ్డి, వి.అనిల్‌కుమార్ పాల్గొని ప్రసంగించారు. -
మేలైన వంగడాల కోసం కృషి
మార్టేరు (పెనుమంట్ర): అధిక దిగుబడినిచ్చే మేలైన రకాల వంగడాలు మరిన్ని సృష్టించడానికి శాస్త్రవేత్తల కృషి అవిరామంగా కొనసాగుతూనే ఉందని ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం వైస్ చానల్సర్ డాక్టర్ టి.విజయకుమార్ అన్నారు. ఇందుకు మార్టేరు వ్యవసాయ పరిశోధనా స్థానం చక్కని వేదికగా ఉపకరిస్తోందని చెప్పారు. మార్టేరు వరి పరిశోధనా స్థానంలో శనివారం జరిగిన ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం ఎంపీ, పాలకవర్గ సభ్యుడు కె.రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ రైతుకు లాభసాటి సాగు అనిపించేలా యాజమాన్య పద్ధతుల్లో నూతన ఒరబడిని తీసుకురావాలని శాస్త్రవేత్తలకు సూచించారు. విజయనగరం ఎమ్మెల్యే, పాలక మండలి సభ్యురాలు మీసాల గీత మాట్లాడుతూ వ్యవసాయంపై యువత ఆకర్షితులయ్యేలా కళాశాలల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వాలని సూచించారు. కొవ్వూరు ఎమ్మెల్యే, పాలకమండలి సభ్యుడు కేఎస్ జవహర్ మాట్లాడుతూ రైతుల అనుభవానికి శాస్త్రవేత్తల విజ్ఞానం తోడు కావాలన్నారు. స్థానికంగా విడుదల చేసిన శ్రీధతి, తరంగిణి, భీమ తదితర విత్తనాల గుణగణాలను మార్టేరు పరిశోధనా సంస్థ డైరెక్టర్ పీవీ సత్యనారాయణ వివరించారు. ఎన్‌ఏఏఆర్‌ఎం డైరెక్టర్ డి.రామారావు, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి వై.రామకృష్ణ, డాక్టర్ వి.దామోదర్‌నాయుడు, ప్రొఫెసర్లు జీవీ నాగేశ్వరరావు, ఐ.భవానీదేవి, ఎస్ఆర్ కోటేశ్వరరావు, మేకల లక్ష్మీనారాయణ మాట్లాడారు.అనంతరం పాలక మండలి కోసం కొత్తగా ఏర్పాటు చేసిన సమావేశ మందిరాన్ని వీసీ విజయ్‌కుమార్ ప్రారంభించారు. క్షేత్రస్థాయి పరిశీలన ఎంపీ రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యే జవహర్ సంస్థ ప్రాంగణంలోని వరినాట్ల ప్రదర్శనలను తిలకించారు. సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు చేపట్టిన వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులను ఎంపీ అభినందించారు. ముందుగా ఎంపీ రామ్మోహన్నాయుడుకు ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ స్వాగతం పలికారు. -
వ్యవసాయ విశ్వవిద్యాలయం స్టూడెంట్ ఎఫైర్స్ డీన్‌గా సాయి శివరావు
కంబాలచెరువు : (రాజమహేంద్రవరం) : గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ ఆఫ్ స్టూడెంట్స్ ఎఫైర్స్ ఆఫీసర్‌గా పి.సాయిశివరావు నియమితులయ్యారు. రాజమహేంద్రవరంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాలలో క్రాప్ ఫిజియాలజీ విభాగాధిపతిగా పని చేస్తున్న ఆయన డీన్‌గా పదోన్నతి పొందారు. ఈ వివరాలను కళాశాల అసోసియేట్ డీన్ పి.జయరామిరెడ్డి శనివారం విలేకర్లకు తెలిపారు. ఈ సందర్భంగా సాయి శివరావు మాట్లాడుతూ, విశ్వవిద్యాలయ పరి«ధిలోని విద్యార్థుల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రాజమహేంద్రవరంలో నూతన వ్యవసాయ కళాశాల నిర్మాణానికి తనవంతు సహకారం అందజేస్తానన్నారు. ఆయనను కళాశాల పాలక మండలి సభ్యులు జీవీ నాగేశ్వరరావు, వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ కందుకూరి సీతారామయ్య, అధ్యాపకులు అభినందించారు. -
రేపు ఎన్జీరంగా వర్సిటీ స్నాతకోత్సవం
రాజమండ్రి: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 47వ స్నాతకోత్సవం సోమవారం రాజమండ్రిలోని ఆనం కళాకేంద్రంలో నిర్వహించనున్నట్టు వైస్ చాన్సలర్ అల్లూరి పద్మరాజు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు సంబంధించిన చివరి స్నాతకోత్సవాన్ని నిర్వహించనున్నామని చెప్పారు. 575 మంది విద్యార్థులు స్నాతకోత్సవంలో పట్టాలు అందుకోనున్నారని, మిగిలిన 500 మందికి పోస్టు ద్వారా పంపిస్తామన్నారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి సిరాజ్ హుస్సేన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని పద్మరాజు తెలిపారు. ఆయనకు గౌరవ డాక్టరేట్‌తో పాటు వివిధ విభాగాలలో పలువురికి అవార్డులను అందించనున్నట్టు వీసీ చెప్పారు. -
రేపు ఎన్జీ రంగా వర్సిటీ స్నాతకోత్సవం
సాక్షి, హైదరాబాద్/బాపట్ల టౌన్ : రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం జరుపుకోనుంది. గుంటూరు జిల్లా బాపట్ల వ్యవసాయ కళాశాలలో బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ టీవీ సత్యనారాయణ వెల్లడించారు. బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కళాశాలలోని బీవీ నాథ్ ఆడిటోరియంలో జరిగే స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా జాతీ య వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ హ ర్షకుమార్ భన్వాలా, రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హాజరుకానున్నట్లు తెలిపారు. -
9న ఏపీ ఎన్జీరంగా వర్సిటీ స్నాతకోత్సవం
హైదరాబాద్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 46వ స్నాతకోత్సవం గుంటూరు జిల్లా బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో వచ్చే నెల 9న జరుగుతుంది. గవర్నర్ నరసింహన్ చాన్స్‌లర్ హోదాలో, నాబార్డ్ చైర్మన్ డాక్టర్ హర్షకుమార్ భన్వాలా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.రాష్ట్ర విభజన నేపథ్యంలో జరుగుతున్న తొలి స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి స్నాతకోత్సవంలో వ్యవసాయ రంగ ప్రముఖులు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావుకు గౌరవ డాక్టరేట్ ఇవ్వాలన్న వినతులను వర్సిటీ అధికారుల సమావేశం చర్చించింది. దీనిపై పాలక మండలి త్వరలో నిర్ణయం తీసుకోనుంది. -
కోర్సు చేసి.. రోడ్డున పడ్డారు
-
ఆంధ్ర ఉద్యోగులకు జీతం కట్
అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లోని వ్యవసాయ కళాశాలలు, పాలిటెక్నిక్, ప్రాంతీయ పరిశోధనా సంస్థల సిబ్బందికి జూలై నెల జీతాలు అందలేదు. ఎందుకు ఇవ్వలేదో.. ఎప్పుడు ఇస్తారో కూడా స్పష్టత లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రపదేశ్ తన దామాషా కింద యూనివర్సిటీకి 58 శాతం నిధులను విడుదల చేయని కారణంగానే సీమాంధ్ర ప్రాంతంలో పనిచేస్తున్న యూనివర్సిటీ బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలు రాలేదని అంటున్నారు. అయితే విభజన బిల్లులోని 10వ షెడ్యూల్లో పొందుపరిచిన రాష్ట్ర విద్యా సంస్థల కేంద్రాలు ఏ రాష్ట్ర పరిధిలో ఉంటే ఆ రాష్ట్రమే నాలుగు నెలల పాటు జీతభత్యాల ఖర్చులు భరించాలంటూ అప్పట్లో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు రామన్న గూడెం కేంద్రంగా ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్సిటీకి, తిరుపతి కేంద్రంగా ఉన్న పశువైద్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా తెలంగాణ ప్రాంతంలోని కళాశాలల్లో పని చేస్తున్న సిబ్బందికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తోంది. కానీ హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఆంధ్రప్రాంతంలోని కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం జీతాలు చెల్లించడంలేదు. విభజన బిల్లు 10వ షెడ్యూలులో ఈ యూనివర్సిటీ పేరు లేదు కాబట్టి జీవో 88 తమకు వర్తించదని వాదిస్తోంది. సీమాంధ్రలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాల చెల్లింపునకు ఆంధ్రప్రదేశ్ తన దామాషా కింద 58 శాతం నిధులను కేటాయించాలని మెలిక పెడుతోంది. చంద్రబాబు ప్రభుత్వ నిష్క్రియాపరత్వం వల్లే తమకు జీతాలు అందని పరిస్థితి వచ్చిందని సిబ్బంది విమర్శిస్తున్నారు. -
హైదరాబాద్‌లో పేర్లు మార్చాల్సినవి చాలా ఉన్నాయి: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఫ్రొఫెసర్ జయశంకర్ కంటే గొప్పోళ్లు ఎవరూ లేరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్జీరంగా యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ.. చట్టప్రకారం ఆంధ్ర విద్యార్థులకు 15% అడ్మిషన్లు కల్పిస్తామని అన్నారు. ఎన్జీరంగా యూనివర్సిటీ పేరును కేసీఆర్ ఫ్రొఫెసర్ జయశంకర్ వర్సిటీగా నామకరణం చేశారు. హైదరాబాద్‌లో పేర్లు మార్చాల్సినవి చాలా ఉన్నాయని కేసీఆర్ అన్నారు. -
త్వరలో 3 ప్రాంతీయ వ్యవసాయ వర్సిటీలు?
సాక్షి,హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో మూడు ‘వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రాంతీయ విశ్వవిద్యాలయాలు’ ఏర్పడనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రాజేంద్రనగర్ కేంద్రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, తాడేపల్లిగూడెం కేంద్రంగా ఉద్యాన విశ్వవిద్యాలయం, తిరుపతి కేంద్రంగా పశువైద్య విశ్వవిద్యాలయాలున్నాయి. అయితే తాజా మార్పుల మేరకు ఈ విశ్వవిద్యాలయాలను ప్రాంతీయ వ్యవసాయ అనుబంధ విశ్వవిద్యాలయాలుగా మార్పు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. మూడు ప్రాంతాల్లో మూడు ప్రాంతీయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటుచేసి, వాటి పరిధిలోకి వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య కోర్సులను తేవాలన్న ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం మరో నెలలో తుది రూపు ఇవ్వనున్నట్లు సమాచారం. గతంలో రాష్ట్రంలో ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒక్కటే ఉండేది. ఈ విశ్వవిద్యాలయ పరిథిలోనే వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య కళాశాలలు ఉండేవి. దివంగత నేత వైఎస్ హయాంలో ఉద్యాన, పశువైద్య విద్యల ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని వీటికి ప్రత్యేక విశ్వవిద్యాలయాలు నెలకొల్పారు. తాడేపల్లిగూడెం కేంద్రంగా ఉద్యాన విశ్వవిద్యాలయం, తిరుపతి కేంద్రంగా పశువైద్య విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయి. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్ర ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయాల అభివృద్ధి పట్ల పెద్దగా శ్రద్ధ చూపలేదు. నిన్న మొన్నటి దాకా ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పూర్తికాలం వైస్‌ఛాన్సలర్ లేరు. ఉద్యాన విశ్వవిద్యాలయానికి ఇప్పటికీ పూర్తికాలం వీసీని నియమించలేదు. వైఎస్ హయాంలో కొత్తగా ఏర్పాటు చేసిన కోరుట్ల, ప్రొద్దుటూరు పశువైద్య కళాశాలలకు మౌలిక సదుపాయాల కల్పన గురించీ ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈ కారణంగా ఈ కాలేజీల గుర్తింపే ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో అరకొర వసతులు, బొటాబొటి సౌకర్యాలతో ప్రత్యేక యూనివర్సిటీలను నిర్వహించడం కన్నా ఈ మూడింటినీ ప్రాంతీయ విశ్వవిద్యాలయాలుగా మార్చి.. వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య శాఖలను విలీనం చేస్తేనే బాగుంటుందన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. ఎన్జీరంగా యూనివర్సిటీ వీసీ నేతృత్వంలో మూడు విశ్వవిద్యాలయాల ప్రతినిథులతో నిపుణుల కమిటీని మూడు నెలల క్రితం ప్రభుత్వం నియమించింది. అయితే, వ్యవసాయ, ఉద్యాన శాఖల నిపుణులు సుముఖంగా ఉన్నా పశువైద్య విభాగం నిపుణులు మాత్రం ఈ ప్రతిపాదనకు సుముఖంగా లేరని తెలిసింది. ఉత్తరాఖండ్ వరద బాధితుల సహాయార్థం ‘చెక్కు’ను అందచేసేందుకు ఇటీవల ఎన్జీరంగా వీసీ పద్మరాజు ఆధ్వర్యంలో యూనివర్సిటీ అధికారులు ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ‘ప్రాంతీయ విశ్వవిద్యాలయాల’ ప్రతిపాదనపై వీసీని వాకబు చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా వీసీ పశువైద్య విభాగం వారు ఈ ప్రతిపాదనలకు అంత సుముఖంగా లేరని సీఎంకు తెలిపారు. ‘మీ కమిటీ రిపోర్టు ఇవ్వండి. మేం ప్రభుత్వం తరపున నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు వ్యవసాయ, అనుబంధ రంగాల యూనివర్సిటీల ఏర్పాటుకే ప్రభుత్వం నిర్ణయించుకుంద’ని సీఎం చెప్పినట్లు సమాచారం. రాష్ట్ర విభజనకు సంబంధించిన ప్రక్రియ మొదలు కాకముందే ప్రాంతీయ వర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని, నెలలోపే ఇందుకు సంబంధించిన తుది ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని యూనివర్సిటీ వర్గాల సమాచారం. -
తెలంగాణవారినే నియమించాలి: విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్ : రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. అన్ని గేట్లకు తాళం వేసి విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ వర్సిటీ వైస్ చాన్సలర్, రిజిస్ట్రార్, డీన్ పదవుల్లో తెలంగాణ వారిని నియమించాలని డిమాండ్‌చేస్తూ.. మంగళవారం రాజేంవూదనగర్‌లోని వర్సిటీ ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. పరిపాలన భవనాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. వీసీ నియామకంలో తమ డిమాండ్ సాధన కోసం విద్యార్థులు, ఉద్యోగులు గత కొంతకాలంగా ఉద్యమిస్తున్నా సీమాంధ్ర ప్రభుత్వం లెక్కచేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి తెలంగాణ వ్యక్తిని వీసీగా నియమించాలని ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ విద్యార్థులు, ఉద్యోగులు గత కొంతకాలంగా ఉద్యమిస్తున్నారు. తమ డిమాండ్ సాధన కోసం భారీ నిరసనలు చేపట్టారు. అయినా సర్కారు తీరు ఏమాత్రం మారకపోవడంపై విద్యార్థులు మండిపడుతున్నారు.