Nirmal Singh
-
కరోనాతో తండ్రి మృతి.. కుమార్తెకు పాజిటివ్
చండీగఢ్ : పంజాబ్‌కు చెందిన పద్మ శ్రీ అవార్డు గ్రహిత నిర్మల్ సింగ్ ఖల్సా కరోనా వైరస్ సోకి మృతి చెందిన విషయం తెలిసిందే. నిర్మల్ సింగ్ మరణం అనంతరం ఆయన కుమార్తె (35) కూడా కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు వైద్యులు ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే ఆమెను నిర్బంధ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఆమె తండ్రి కరోనా కారణంగా గురువారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. వైరస్ సోకడంతో అమృత్‌సర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. రెండు రోజుల వ్యవధిలోనే ఆయన కుమార్తెకు కూడా పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆమె కాంటాక్ట్ అయిన వారందరినీ క్వారెంటైన్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. (కరోనాతో పద్మశ్రీ అవార్డు గ్రహీత మృతి) -
కరోనాతో పద్మశ్రీ అవార్డు గ్రహీత మృతి
అమృత్సర్: మహ్మమారి కరోనా వైరస్ సోకి పద్మశ్రీ అవార్డు గ్రహీత నిర్మల్ సింగ్ ఖల్సా (62) కన్నుమూశారు. ఇటీవల లండన్ నుంచి తిరిగివచ్చిన ఈయనకు బుధవారం వైద్యులు పరీక్ష నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో పంజాబ్‌లోని గురునానక్ దేవ్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తుండగా.. గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కరోనా వైరస్ కారణంగానే నిర్మల్ సింగ్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. నిర్మల్ సింగ్ మృతిలో పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. కాగా ఆయనతో పాటు పాజిటివ్‌గా తేలిన మరో నలుగురు పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా నిర్మల్ సింగ్ ఖల్సా పంజాబ్‌లోని అమృత్సర్ దేవాలయంలో అత్యున్నత పదవిలో కొన్నేళ్ల పాటు కొనసాగారు. ఆయన సేవలకుగాను భారత ప్రభుత్వం 2009లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. కాగా మరోవైపు దేశంలో కరోనా వైరస్ రోజురోజూకూ విజృభిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1980కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 58మంది మృతి చెందారు. -
జమ్మూకశ్మీర్‌లో కమలం ప్రభుత్వం ఏర్పాటు ?
-
జమ్మూకశ్మీర్‌కు హిందూ ముఖ్యమంత్రి?
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లో కమలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందా?. క్షణక్షణానికి మారుతున్న పరిణామాలు ఈ విషయాన్నే ధ్రువీకరిస్తున్నాయి. ప్రస్తుతం గవర్నర్ పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. జమ్మూకశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినట్లు జాతీయ మీడియా ఓ కథనాన్ని వెలువరించింది. ప్రధానమంత్రి కార్యాలయంలోని ఉన్నతాధికారుల సమాచారం ప్రకారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నిర్మల్ సింగ్ ప్రధాని మోదీతో మంతనాలు చేశారు. నిర్మల్ సింగ్‌తో సమావేశానికి ముందు బీజేపీ జమ్మూకశ్మీర్ ఇన్చార్జి, పార్టీ సెక్రటరీ రామ్ మాధవ్‌తో మోదీ ఇవాళ ఉదయం సుదీర్ఘ చర్చలు జరిపారని కూడా తెలిసింది. దీంతో పీడీపీ నుంచి వచ్చే తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందనే ఊహాగానాలకు బలం చేకూరింది. కశ్మీర్లో బీజేపీ సీనియర్ నేత నిర్మల్ సింగే. ఆయన హిందూ కూడా. అందుకే ఆయన్ను ముఖ్యమంత్రి చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం అమర్నాథ్ యాత్ర తర్వాత బీజేపీ కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే వార్తలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ నాయకులు పెదవి విప్పడం లేదు. నాయకుల వరుస పర్యటనలు గవర్నర్ పాలన విధించిన తర్వాత కశ్మీర్‌కు బీజేపీ సీనియర్ నాయకులు కొందరు తరచుగా వెళ్లి వస్తున్నారు. పీడీపీతో విడిపోయిన పది రోజుల తర్వాత రామ్ మాధవ్ పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు సజ్జద్లోన్తో ఉన్న ఫొటోను ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఢిల్లీకి వచ్చిన ఆయన మోదీని కలసి మంతనాలు జరిపారు. ఈ నెలలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్, ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్‌లు సైతం శ్రీనగర్‌కు వెళ్లివచ్చారు. పీడీపీ రెబల్స్ మద్దతు.. పీడీపీలోని రెబల్ ఎమ్మెల్యేలు నాయకత్వ మార్పును డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అబీద్ అన్సారీ మెహబూబా నాయకత్వాన్ని బాహాటంగానే ప్రశ్నించారు. నాయకత్వంలో మార్పు లేకపోతే పీడీపీ రెండుగా చీలిపోతుందని సంచలన వ్యాఖ్యలను సైతం చేశారు. దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు తనతో ఉన్నట్లు ఆయన చెబుతున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా బీజేపీకి మద్దతిస్తారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఎందుకు కాకూడదు? అని ఆయన సమాధానం ఇచ్చారు. కాగా, కశ్మీర్లో ప్రభుత్వ పదవి కాలం మరో రెండేళ్లు ఉన్న సంగతి తెలిసిందే. బీజేపీ ముందున్న సవాలు.. జమ్మూకశ్మీర్‌లో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 87. సుప్తచేతనావస్థలో ఉన్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి తిరిగి ప్రాణ ప్రతిష్ట చేయాలంటే 44 మంది సభ్యుల మెజార్టీ అవసరం. ప్రస్తుతం బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు మరో 19 మంది ఎమ్మెల్యేలు కావాలి. పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీ మద్దతు బీజేపీకే దక్కనున్నందున మరో 17 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టాలి. పీడీపీ తిరుగుబాటు వర్గం నుంచే మెజారిటీకి అవసరమైన ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడం ఒక్కటే ప్రస్తుతం బీజేపీ ముందున్న మార్గం. ఈ నేపథ్యంలో హార్స్ ట్రేడింగ్ జరిగే అవకాశం ఉందని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా ఆరోపిస్తున్నారు. -
'ప్రపంచపటంలో పాకిస్తాన్ ఉండదు'
జమ్మూ: కశ్మీర్లో అశాంతికి కారణమవుతున్న పాకిస్తాన్.. ఇదే ధోరణిని కొనసాగిస్తే ప్రపంచపటం నుంచి కనుమరుగయ్యే అవకాశం ఉందని జమ్మూకశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ అన్నారు. సాంబా జిల్లాలోని రాజిందర్ పూరా గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ‘సర్జికల్ దాడుల తర్వాత బుద్ధి తెచ్చుకోకుండా భారత ఆర్మీ ఔట్‌పోస్టులపై దాడి చేస్తోంది. మిలిటెంట్ల చొరబాట్లకు సహకరిస్తూ.. కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతోంది. ఇలాగే కొనసాగితే పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయిన నాటి పరిస్థితులు పునరావృతమవుతాయి’ అని విమర్శించారు. పాకిస్తాన్ విఫల దేశమని, జమ్మూకశ్మీర్ ను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఉడీ సైనిక స్థావరంపై ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ ను ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయంగా ఏకాకిని చేశారని, దీంతో పాకిస్థాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయిందన్నారు. -
ఆ ఎన్కౌంటర్ యాక్సిడెంటలా?
శ్రీనగర్: వాటెండ్ టెర్రరిస్టు, హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వని ఎన్కౌంటర్ జమ్మూకశ్మీర్‌లోని పీడీపీ-బీజేపీ ప్రభుత్వాన్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. బుర్హాన్ వని ఎన్‌కౌంటర్‌పై తాజాగా డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత నిర్మల్ సింగ్ కూడా స్పందించారు. ఈ ఎన్కౌంటర్ యాక్సిడెంట్ (యాదృచ్ఛికం) మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన గురించి ముందే సమాచారం అంది ఉంటే తాము ముందుజాగ్రత్త చర్యలు తీసుకొని ఉండేవాళ్లమని ఆయన పేర్కొన్నారు. సీఎం మెహబూబా ముఫ్తి గతంలో ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అనంతనాగ్ జిల్లాలోని బాందూరా గ్రామంలో భద్రతా దళాలు ఆపరేషన్ చేపట్టిన ఇంట్లో బుర్హాన్ వని ఉన్నాడని తమకు ముందుగానే తెలిసి ఉంటే, అతనికి భద్రతా దళాలు ఒక అవకాశం (లొంగిపోయేందుకు?) ఇచ్చి ఉండేవని ఆమె పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలతో గతంలో బీజేపీ విభేదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్ వ్యాఖ్యలు వివాదం రేపాయి. దీంతో స్పందించిన ఆయన యూటర్న్ తీసుకున్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు. బుర్హాన్ వని ఎన్కౌంటర్ తర్వాత కశ్మీర్ లోయలో అల్లర్లు చెలరేగి.. 40మందికిపైగా చనిపోయిన సంగతి తెలిసిందే. -
'దోషులను శిక్షిస్తాం.. శాంతించండి'
జమ్మూ: ఓ యువతిపట్ల ఆర్మీ జవాన్ అసభ్యంగా ప్రవర్తించాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని ప్రారంభమైన నిరసనలు తీవ్రరూపందాల్చడంతో పదిరోజుల పాటు కశ్మీర్ లోయ అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో ప్రజలు శాంతియుతంగా ఉండాలని, అల్లర్లకు పాల్పడవద్దని జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం జమ్ములో మాట్లాడిన ఆమె.. హంద్వారా, కుప్వారా జిల్లాల్లో పోలీసుల కాల్పుల్లో పౌరులు మరణించిన సంఘటనలపై విచారణ చేపడతామని, దోషులను శిక్షిస్తామని అన్నారు. కశ్మీర్ లోయలో అల్లర్ల వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఉందని, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో అలజడులు జరిగినప్పుడు సైతం లోయలో ప్రశాంతత నెలకొని ఉండేదని, విదేశీ శక్తుల ప్రమేయంతోనే తాజా అల్లర్లు సంభవించినట్లు భావిస్తున్నానని డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్ అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఆందోళనలు చెలరేగకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. -
కశ్మీర్ పీఠంపై మెహబూబా
♦ రాష్ట్ర తొలి మహిళా సీఎంగా ప్రమాణం ♦ డిప్యూటీ సీఎంగా బీజేపీ నేత నిర్మల్ జమ్మూ: దివంగత ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ మరణానంతరం జమ్మూకశ్మీర్‌లో ఏర్పడిన మూడు నెలల రాజకీయ సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. ఆయన కుమార్తె, పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ(56) రాష్ట్ర తొలి మహిళా సీఎంగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సైదా అన్వరా(1980లో అస్సాం సీఎం) తర్వాత దేశంలో ముస్లిం మహిళా సీఎంగా 56 ఏళ్ల మెహబూబా చరిత్రకెక్కారు. ఆమె జమ్మూకశ్మీర్‌కు 13వ సీఎం. బీజేపీ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ఆ పార్టీకి చెందిన నిర్మల్ సింగ్ డిప్యూటీ సీఎంగా తిరిగి అదే పదవిని దక్కించుకున్నారు. వీరితో పాటు మొత్తం 21 మంది మంత్రులతో గవర్నర్ ఎన్ ఎన్ వోహ్రా ప్రమాణస్వీకారం చేయించారు. మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారిలో ఒకప్పటి వేర్పాటు వాది సజ్జద్ గిలానీ లోన్ కూడా ఉన్నారు. 2002లో హత్యకు గురైన పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు అబ్దుల్ గిలానీ లోన్ చిన్న కుమారుడైన సజ్జద్ బీజేపీ కోటాలో కేబినెట్ మంత్రిగా రెండోసారి అవకాశం దక్కించుకున్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ వేడుకలో మెహబూబా ప్రమాణం ఉర్దూలో సాగింది. దీంతో సయీద్ మరణానంతరం విధించిన 86 రోజుల రాష్ట్రపతి పాలనకు తెరపడింది. డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టిన నిర్మల్ సింగ్ తండ్రి ఒకనాటి జమ్మూ కశ్మీర్ మహారాజా హరిసింగ్‌కు సెక్యూరిటీగా పనిచేశారు. నిర్మల్ 1988లో చరిత్రలో డాక్టరేట్ పట్టా పొందారు. ప్రమాణం తర్వాత మెహబూబా ప్రభుత్వ కార్యదర్శులతో, మంత్రులతో భేటీ అయ్యారు. పారదర్శక, బాధ్యతాయుత పాలన అందిస్తామన్నారు. పీడీపీ 9... బీజేపీ 8: గత ప్రభుత్వంతో పోలిస్తే ఈసారి కేబినెట్లో బీజేపీ మంత్రుల సంఖ్య రెండు పెరిగి ఎనిమిదికి చేరింది. పీడీపీ గతంలో ఉన్న 11 బెర్తులను తగ్గించుకుని 9తో సరిపెట్టుకుంది. శాసన సభలో మొత్తం 27 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న పీడీపీ తమ పార్టీకి చెందిన సయ్యద్ అల్తాఫ్ బుఖారీ, జేవేద్ ముస్తఫాను కేబినెట్ నుంచి తప్పించింది. వీరితో పాటు మరో మంత్రి మొహమద్ అష్రాఫ్ మీర్ ను పదవి నుంచి తొలగించింది. అయితే బుఖారీని తొలగించినట్టు పీడీపీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. కొంత మంది పీడీపీ ఎమ్మెల్యేలతో కలసి బుఖారీ తిరుగుబాటుకు సిద్ధపడుతున్నట్టు సమాచారం. అటు ప్రమాణ స్వీకారోత్సవంలో సొంత పార్టీవారే పీడీపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, జితేంద్ర సింగ్, అకాలీదళ్ నుంచి హర్సిమ్రత్ కౌర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో రాష్ట్రపతిపాలనకు నిరసనగా కాంగ్రెస్ ఈ కార్యక్రమాన్ని బహిష్కరించింది. మోదీ అభినందనలు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ప్రజల కలలను నెరవేరుస్తూ, వారి ఆకాంక్షలకు అనుగుణంగా మెహబూబా ప్రభుత్వం పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్‌ను అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు. పీడీపీ, బీజేపీల భాగస్వామ్యంతో ఏర్పాటైన ప్రభుత్వం రాష్ట్రాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్తుందని ఆశిస్తున్నట్లు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా చెప్పారు. అభివృద్ధి దిశగా సాగాలి: కేంద్రం నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌ను అభివృద్ధి పథంలో నడిపించాలని కేంద్రం పేర్కొంది. అభివృద్ధిలో జాతీయ స్థాయిలో పోటీపడాలని, అందుకు సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చింది. తండ్రి చూపిన బాటలో... ⇒ న్యాయవాద పట్టభద్రురాలైన కశ్మీర్ సీఎం మెహబూబా 1996లో తన తండ్రి సయీద్‌తో కలసి కాంగ్రెస్‌లో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ సమయంలో అక్కడ ఉగ్రవాదం పతాక స్థాయిలో ఉంది. ⇒ సొంత నియోజకవర్గమైన బిజ్బేహరా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గారు. 2004లో పీడీపీ అభ్యర్థిగా దక్షిణ కశ్మీర్ నుంచి పోటీచేసి తొలిసారి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధిం చారు. 1999లో ఒమర్ అబ్దుల్లా చేతిలో పరాజయం పొందారు. ⇒ కశ్మీర్లో శాంతి నెలకొల్పడానికి ఏదో ఒకటి చేయాలన్న సయీద్ తపనకు తగ్గట్టుగా 1999లో పీడీపీ ఆవిర్భవించింది. ఆ సమయంలో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీల నుంచి అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తెచ్చుకున్నారు. ⇒ పార్టీ అభివృద్ధిలో మెహబూబాదే కీలక పాత్ర. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ, ముఖ్యంగా యువతతో మమేకమవుతూ తండ్రిని మించిన తనయగా కీర్తి పొందారు. ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాల్లోని మహిళల ఇంటికెళ్లి ఓదార్చి, పిల్లలను అక్కున చేర్చుకున్నారు. ఫలితంగా 2002 ఎన్నికల్లో 16 స్థానాలను పీడీపీ దక్కించుకుంది. ⇒అమర్నాథ్ భూవివాదం నేపథ్యంలో ఆజాద్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో భాగస్వామ్యపక్షంగా ఉన్న పీడీపీ మద్దతు విరమించుకుంది. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పార్టీ 21 స్థానాలు నెగ్గినా ప్రతిపక్షంగా ఉండేందుకు నిర్ణయించుకున్నారు. ⇒ ప్రతిపక్ష పార్టీ నాయకురాలిగా ఆమె ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన నిలుస్తూ సమర్థవంతమైన పాత్ర పోషించారు. దాని ఫలితంగానే 2014 లోక్‌సభ ఎన్నికల్లో 3 ఎంపీ స్థానాలు సాధించింది. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా 28 స్థానాలు గెలుచుకుని అధికార పీఠాన్ని దక్కించుకుంది. బీజేపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ⇒ ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న మెహబూబాకు ఇద్దరు కుమార్తెలు. -
'అనుమానాలు అవసరం లేదు'
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుపై అనుమానాలు అవసరం లేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. పీడీపీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పీడీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటున్నామని, ఇందుకు పీడీపీ ముందడుగు వేయాల్సిన అవసరముందన్నారు. 8 నెలల క్రితం రెండు పార్టీల మధ్య కుదిరిన సయోధ్య కొనసాగాలని ఆకాంక్షించారు. కాగా, బీజేపీకి పీడీపీ ఎలాంటి షరతులు పెట్టలేదని కశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ తెలిపారు. పీడీపీ, బీజేపీ పొత్తు విచ్ఛిన్నానికి కొందరు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. -
కశ్మీర్ ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్
-
కశ్మీర్ ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్
♦ మెహబూబాను కలసిన సోనియా ♦ తర్వాత గడ్కారీ పరామర్శ శ్రీనగర్: గవర్నర్ పాలన అమల్లో ఉన్న జమ్మూకశ్మీర్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. రాజకీయ సమీకరణాలపై చర్చా మొదలైంది. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఆదివారం పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీని కలుసుకున్నారు. మెహబూబా తండ్రి, మాజీ సీఎం ముఫ్తీ మహమ్మద్ సయీద్ మృతిపై సంతాపం తెలిపారు. తర్వాత కేంద్ర మంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కారీ కూడా మెహబూబాను కలుసుకుని పరామర్శించారు. దీంతో ఈ భేటీలు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సయీద్, మెహబూబాలు 1999 వరకు కాంగ్రెస్‌లో ఉన్నారు. 2002-08 మధ్య రాష్ట్రంలో కాంగ్రెస్-పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం నడిచింది. అయితే పీడీపీతో తమ పొత్తు కొనసాగుతుందని, ప్రభుత్వ ఏర్పాటులో పీడీపీ నిర్ణయంపై తాము చర్చిచాల్సి ఉందని గవర్నర్‌కు లేఖ రాశామని మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత నిర్మల్ సింగ్ అన్నారు. సయీద్ గత గురువారం చనిపోవడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు అవసరమైన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి వచ్చిన సోనియా విమానాశ్రయం నుంచి నేరుగా మెహబూబా ఇంటికెళ్లి 20 నిమిషాలు అక్కడున్నారు. రాజ్యసభలో విపక్షనేత గులాంనబీ ఆజాద్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జీఏ మీర్ తదితరులు ఆమె వెంట ఉన్నారు. సయీద్ మంచి పాలకుడని, సహనం, భిన్నత్వాన్ని గౌరవించే భారతీయ విలువలకు నిదర్శనమని సోనియా నివాళి అర్పించారు. కాగా, సోనియా పరామర్శకు రాజకీయ ప్రాధాన్యం లేదని ఆజాద్ మీడియాకు తెలిపారు. మరోవైపు.. మెహబూబాను పరామర్శించిన అనంతరం గడ్కారీ మీడియాతో మాట్లాడుతూ.. ‘కేంద్రం తరఫున సంతాపం తెలపడానికే వచ్చాను. రాజకీయాలు మాట్లాడను’ అని అన్నారు. గత ప్రభుత్వంలో పీడీపీ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఇంతవరకు మెహబూబా తదుపరి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడానికి అధికారికంగా మద్దతు తెలపకపోవడం గమనార్హం. సీఎం పదవి విషయంలో రెండు పార్టీలమధ్య మంతనాలు, బేరసారాలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. పీడీపీ ఇప్పటికే తమ పార్టీకి చెందిన మొత్తం 28 మంది ఎమ్మెల్యేలు మెహబూబాకే మద్దతునిస్తున్నారని గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాకు లేఖ సమర్పించింది. తన తండ్రి సంతాప దినాలు ముగిసేవరకు(ఆదివారం) తాను పదవిచేపట్టబోనని మెహబూబా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. -
పీవోకే పాక్‌కే చెందుతుంది
ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్య డిప్యూటీ సీఎం నిర్మల్‌సింగ్ ఖండన జమ్మూ: పాకిస్తాన్ ఆక్రమించుకున్న కశ్మీర్ (పీవోకే) భూభాగం ఆ దేశానికే చెందుతుందని, అది పాక్‌లోనే ఉంటుందని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. భారత్‌లోని కశ్మీర్‌పై మనకే అధికారం ఉంటుందని, అది భారత్‌లో అంతర్భాగంగానే కొనసాగుతుందని పేర్కొన్నారు. గతంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి ఇదే విషయాన్ని అప్పటి పాక్ అధ్యక్షుడు ముషార్రఫ్ వద్ద ప్రతిపాదించారని, అయితే దీనికి పాక్ అంగీకరించలేదని అబ్దుల్లా శుక్రవారం మీడియాకు తెలిపారు. ఈ విషయాన్ని వాజ్‌పేయి తనకు చెప్పారని ఆయన అన్నారు. ఎంతోకాలంగా మనం పీవోకే భారత్‌లో భాగమని చెబుతూ వస్తున్నామని, అయితే దానిని వెనక్కు తీసుకోవడానికి ఇప్పటివరకు ఏమైనా చేశామా? అని ప్రశ్నించారు. అలాంటిదేమీ జరగలేదని, ఆ భాగం పాక్‌లోనే ఉంటుందన్నారు. ఆమిర్ ఖాన్‌కు అబ్దుల్లా సంఘీభావం ప్రకటించారు. ఆమిర్ వ్యాఖ్యలను కావాలనే రాద్ధాంతం చేస్తున్నారన్నారు. అబ్దుల్లా వ్యాఖ్యలపై జమ్మూ కశ్మీర్ ఉపముఖ్యమంత్రి, బీజేపీ నేత నిర్మల్‌సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. ఫరూక్ వ్యాఖ్యలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. పాకిస్తాన్ అక్రమంగా కశ్మీర్ భూభాగాన్ని ఆక్రమించుకుందని 1994లో పార్లమెంటు ఏకగ్రీవంగా తీర్మానించిందని, పీవోకేను ఎప్పటికైనా స్వాధీనం చేసుకోవాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.