No 1 ranking
-
పాక్ కెప్టెన్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లిన స్టార్ ఓపెనర్
ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ దుమ్మురేపాడు. ఆసియాకప్‌లో స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న రిజ్వాన్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ తన స్థిరత్వాన్ని నిలబెట్టుకున్నాడు. ఆసియా కప్‌లో మూడు మ్యాచ్‌లాడిన రిజ్వాన్ ఒక అర్థసెంచరీ సాయంతో 197 పరుగులతో లీడింగ్ రన్‌స్కోరర్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఐసీసీ ప్రకటించిన తాజా టి20 ర్యాంకింగ్స్‌లో రిజ్వాన్ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. 815 పాయింట్లతో తొలి స్థానంలో రిజ్వాన్ ఉండగా.. నిన్నటివరకు టాప్ ప్లేస్‌లో ఉన్న పాక్ కెప్టెన్ బాబర్ ఆజం 794 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. ఇక సౌతాఫ్రికా స్టార్ మార్క్రమ్ 792 పాయింట్లతో మూడు.. టీమిండియా నుంచి సూర్యకుమార్ యాదవ్ 775 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక ఐదో స్థానంలో ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ మలాన్ ఉన్నాడు. ఇక ఆసియాకప్‌లో భాగంగా సూపర్-4లో మంగళవారం శ్రీలంకతో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడు స్థానాలు మెరుగుపరుచుకొని 612 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచాడు. ఇదే మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన లంక ఓపెనర్ పాతుమ్ నిసాంక ఒక స్థానం ఎగబాకి 675 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచాడు. ఇక టీమిండియా తరపున ఆసియాకప్‌లో టాప్ స్కోరర్‌గా ఉన్న కోహ్లి మాత్రం రెండు స్థానాలు దిగజారి 29వ స్థానంలో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో జోష్ హాజిల్‌వుడ్ 792 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. తబ్రెయిజ్ షంసీ రెండు, ఆదిల్ రషీద్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇక ఆల్‌రౌండర్ల విభాగంలో అఫ్గానిస్తాన్ కెప్టెన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ 256 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. 248 పాయింట్లతో షకీబ్ అల్ హసన్ రెండు.. 221 పాయింట్లతో మొయిన్ అలీ మూడో స్థానంలో ఉన్నాడు. On 🔝 of the @MRFWorldwide ICC Men’s T20I Batting Rankings 👑 Congratulations, @iMRizwanPak 👏 👉 https://t.co/mvY3tc8Zdi — ICC (@ICC) September 7, 2022 చదవండి: ఆసియా కప్‌లో వరుస పరాజయాల నేపథ్యంలో భారత అభిమానుల ఆక్రోశం Asia Cup 2022: అంతా అయిపోయింది .. వెళ్లి లాగేజీ సర్దుకోండి! టాటా బై బై! -
భారత్ కంటే ఆస్ట్రేలియా మెరుగు
దుబాయ్ : ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ రేసులో ఇప్పటి వరకు భారత్ అగ్రస్థానంలో సాగింది. ఆడిన 9 మ్యాచ్‌లలో 7 గెలిచి 2 ఓడిన టీమిండియా... 360 పాయింట్లతో ముందంజలో నిలిచింది. అయితే కరోనా కారణంగా పలు సిరీస్‌లు రద్దు కావడంతో టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం పాయింట్ల విధానాన్ని మార్చాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధికారికంగా నిర్ణయించింది. ఆడిన మ్యాచ్‌ల సంఖ్య, అందుబాటులో ఉన్న మొత్తం పాయింట్ల సంఖ్యను చూస్తూ ఐసీసీ విజయ శాతాన్ని లెక్కించనుంది. దాంతో మొత్తం 480 పాయింట్ల (4 సిరీస్‌లు) ద్వారా 360 పాయింట్లు సాధించిన భారత్ విజయ శాతం 75 % గా ఉంది. అదే ఆస్ట్రేలియా అందుబాటులో ఉన్న 360 పాయింట్ల (3 సిరీస్‌లు) 296 పాయింట్లు సాధించడంతో జట్టు విజయ శాతం 82.2%గా నిలిచింది. దాంతో తాజా ర్యాంకింగ్స్‌లో ఆసీస్ నంబర్‌వన్ కాగా, టీమిండియా రెండో స్థానానికి పడిపోయింది. 60.8 శాతంతో ఇంగ్లండ్ మూడో స్థానంలో కొనసాగుతోంది. మరో వైపు నవంబర్ 2022లో జరగాల్సిన మహిళల టి20 ప్రపంచ కప్‌ను ఫిబ్రవరి 2023కి ఐసీసీ వాయిదా వేసింది. 2022లో ఇప్పటికే మహిళల వన్డే వరల్డ్ కప్, కామన్వెల్త్ క్రీడలు ఉండటంతో పాటు 2023లో ఒక్క ఐసీసీ ఈవెంట్ కూడా లేకపోవడమే దీనికి కారణం. దక్షిణాఫ్రికా క్రికెటర్‌కు కరోనా కేప్‌టౌన్: స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే, టి20 సిరీస్‌లకు సన్నద్ధమవుతున్న సమయంలో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టును కరోనా తాకింది. జట్టులో సభ్యుడొకరు కోవిడ్–19 పాజిటివ్‌గా తేలాడు. దాంతో అతడిని బయో బబుల్‌నుంచి బయటకు పంపించివేశారు. అతనితో సన్నిహితంగా మెలిగిన మరో ఇద్దరు క్రికెటర్లకు వైరస్ లక్షణాలు లేనప్పటికీ ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌కు తరలించినట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు. ఆ ముగ్గురి స్థానాలను ఇతర క్రికెటర్లతో భర్తీ చేయబోమని చెప్పింది. మరో వైపు తాజా సిరీస్‌లో మోకాలిపై కూర్చొని నల్లజాతివారికి సంఘీభావం తెలిపే కార్యక్రమానికి తాము దూరంగా ఉంటున్నామని దక్షిణాఫ్రికా కోచ్ మార్క్ బౌచర్ వెల్లడించాడు. తమ దేశంలో ఈ మొత్తం ఉద్యమంలో కీలకంగా ఉన్న జట్టు సభ్యుడు లుంగీ ఇన్‌గిడితో తాను మాట్లాడానని... కొన్నాళ్ల క్రితం జరిగిన 3టీసీ మ్యాచ్‌లో ఇలా చేశాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదని వివరించినట్లు బౌచర్ తెలిపాడు. -
చరిత్ర సృష్టించిన కిదాంబి శ్రీకాంత్
తెలుగు తేజం.. బ్యాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు. బ్యాడ్మింటన్‌లో భారత్ తరపున ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను(పురుషుల విభాగంలో) కైవసం చేసుకోబోతున్నాడు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఈ గురువారం విడుదల చేయబోయే జాబితాలో 25 ఏళ్ల శ్రీకాంత్‌కు మొదటి ర్యాంక్ దక్కబోతోంది. మొత్తం 76, 895 పాయింట్లతో శ్రీకాంత్ మొదటి స్థానం కైవసం చేసుకోనున్నాడు. ప్రస్తుతం వరల్డ్ నంబర్ వన్ స్థానంలో ఉన్న విక్టర్ అక్సెల్సన్ ప్రస్తుతం 77,130 పాయింట్లతో ఉన్నాడు. అయితే గాయం కారణంగా కొంత కాలంగా ఆటకు దూరంగా ఉన్న విక్టర్.. తాజా ర్యాకింగ్స్లో 1,660 పాయింట్లు కోల్పోబోతున్నాడు. దీంతో శ్రీకాంత్ నంబర్ వన్ ర్యాంక్ ఖరారైపోయింది. నిజానికి గతేడాదే శ్రీకాంత్ ఈ రికార్డును దక్కించుకోవాల్సింది. కానీ, గాయం కారణంతో ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. కాగా, భారత్ తరపున బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్(2015లో) నంబర్ వన్ ర్యాంక్(మహిళ విభాగంలో)ను దక్కించుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం జరుగుతున్న కామన్ వెల్త్ క్రీడల్లో మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ విభాగంలో భారత్‌కు స్వర్ణం దక్కగా.. ఆ టీమ్‌లో కిదాంబి, సైనా కూడా ఉన్నారు. -
కోరుకున్న లక్ష్యం దిశగా విరాట్ కోహ్లి!
డిసెంబర్ 2009లో టీమిండియా తొలిసారి టెస్ట్ క్రికెట్లో నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకుంది. కొద్దికాలమే ఆ ర్యాంకు భారత్ నిలబెట్టుకుంది. ఇప్పుడు కొత్త కెప్టెన్ విరాట్ కోహ్లి సారథ్యంలో మన కుర్రాళ్లు బాగా ఆడుతుండటంతో టెస్టు క్రికెట్లో మళ్లీ ఆ కిరీటం టీమిండియాను ఊరిస్తోంది. నంబర్ ర్యాంకును దృష్టిలో పెట్టుకొని వెస్టిండీస్ జట్టుతో నాలుగో టెస్టుకు జట్టు సిద్ధమవుతోంది. ఈ నెల 18న ట్రినిడాడ్‌లో ప్రారంభం కానున్న నాలుగో టెస్టులోనూ విజయం సాధించాలని కృతనిశ్చయంతో ఉంది. ఇదే విషయాన్ని టీమిండియా బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ స్పష్టం చేశారు. 'టీమిండియా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే ఆడుతోంది. నంబర్ ర్యాంకును సాధించడంపైనే మేం దృష్టి పెట్టాం. అదెంతో దూరంలో లేదు' అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ నుంచి పగ్గాలు టెస్టు కెప్టెన్ పగ్గాలు తీసుకున్నప్పుడు.. టీమిండియాను నంబర్ వన్‌గా నిలబెట్టాలని కోహ్లి భావించాడని, ఆ లక్ష్యం దిశగానే జట్టును విజయాలపథంలో నడిస్తున్నాడని రోహిత్ కొనియాడాడు. ప్రస్తుతం 112 పాయింట్లతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ రెండోస్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా కన్నా ఆరుపాయింట్లు వెనుకబడి ఉంది. అయితే, శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0తో వెనుకబడటంతో ఆ జట్టు నంబర్ వన్ స్థానం నుంచి పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. నాలుగో టెస్టులో భారత్ విజయం సాధిస్తే కచ్చితంగా నంబర్ ర్యాంకును సొంతం చేసుకుంటుందని పరిశీలకులు చెప్తున్నారు.